సాక్షి, గుంటూరు : ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి అన్యాయం చేస్తే.. సరిచేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీకి వైఎస్సార్‌సీపీ ఓటెయ్యలేదని పేర్కొన్నారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లోపల, వెలుపలా బీజేపీని నిలదీసిన ఎకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనని పేర్కొన్నారు.
నాలుగేళ్లుగా హోదా కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంటే టీడీపీ మాత్రం యూటర్న్ తీసుకొని ప్యాకేజీకి ఒప్పుకుందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం మొదటగా పెట్టింది వైఎస్సార్‌సీపీయేనని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు వారే బుద్ది చెబుతారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ ఎంపీలు రాజీనామ చేస్తే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హోదాపై యుటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment