Rajya Sabha Deputy Chairman
-
'కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు'.. సొంత పార్టీ నేతపై జేడీయూ అసహనం!
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి గైర్హాజరైన కార్యక్రమానికి డిప్యూటి ఛైర్మన్ వెళ్లడంపై విచారం వ్యక్తం చేశారు. 'జర్నలిజం కోటాలో డిప్యూటీ ఛైర్మన్ పదవికి హరివంశ నారాయణ్ సింగ్ పేరును జేడీయూనే ప్రతిపాదించింది. అలాంటప్పుడు ప్రతిపక్షాలకు అండగా ఉండకుండా.. కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికిది చీకటి రోజు' అని నీరజ్ కుమార్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేడీయూతో సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. అయితే హరివంశ నారాయణ్ సింగ్ జేడీయూకు చెందిన నేత. జర్నలిస్టుల కోటాలో భాగంగా రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ కు జేడీయూనే అప్పట్లో ప్రతిపాదించింది. దీంతో తమ సొంత పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి.. డిప్యూటి ఛైర్మన్ హోదాలో హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. హరివంశ నారాయణ్ సింగ్ 2018లో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ పదవి చేపట్టారు. డిప్యూటి ఛైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెందని మూడో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్నారు. ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్ -
సీఎం వైఎస్ జగన్‌కు నితీష్ కుమార్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి ఫోన్ చేసినట్లు తెలిసింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కి మద్దతు పలకాల్సిందిగా నితీష్ సీఎం జగన్‌ను ఫోన్లైన్లో కోరారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీకి ఆరుగురు ఎంపీల బలం ఉంది. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో హరివంశ్ మరోసారి పోటీలో నిలిచారు.(చదవండి : ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు) -
ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనికి స్పందించిన నవీన్ తమ పార్టీ నేతలతో చర్చించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షం జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిపింది. (సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు) మొత్తం 245 సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 114 సభ్యల మద్దతుంది. మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకుని తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షాల మద్దతు కోరనుంది. మరోవైపు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై ఇతర పార్టీల నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపామని వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ల ప్రక్రియకు రేపు (శుక్రవారం) ఆఖరి రోజు కావడంతో నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ ఇదివరకే నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ తొలిరోజు సమావేశాలైన సెప్టెంబర్ 14న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఇదివరకే విప్‌ను సైతం జారీచేసింది. (అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్) -
మాజీ ప్రధానుల కోసం మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ మాజీ ప్రధానులందరి సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ఓ భారీ మ్యూజియంను ఏర్పాటు చేయనుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేలా కొత్త రాజకీయ సంస్కృతిని తాము తీసుకొస్తామని ఆయన అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌పై రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ హరివంశ్ రాసిన ఓ పుస్తకాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. అక్కడ మాట్లాడుతూ ‘ఓ కుటుంబానికి చెందిన మాజీ ప్రధాన మంత్రుల జ్ఞాపకాలు తప్ప మిగిలిన ప్రధానుల వివరాలు ఏ మాత్రం లేకుండా చెరిపేసేందుకు ఓ వర్గం రాజకీయ నాయకులు ప్రయత్నించారు. చంద్రశేఖర్ నాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపడితే, దానికి వ్యాపారవేత్తలు డబ్బులిచ్చారని ఆ వర్గం రాజకీయ నాయకులు ఆరోపణలు చేసి ఆయన ప్రతిష్ట దిగజార్చాలని చూశారని మోదీ గుర్తుచేశారు. ఇలాగే బీఆర్.అంబేడ్కర్, సర్దార్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ తదితర అనేక మంది గొప్ప నేతల ప్రతిష్టను మసకబార్చేందుకు కూడా స్వాతంత్య్రానంతరం కుటిల ప్రయత్నాలు జరిగాయని మోదీ అన్నారు. ఈనాటి యువతరంలో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల గురించి ఎంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్లంతా మొదట ప్రజల మెదళ్ల నుంచి అదృశ్యమయ్యారు. ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉండొచ్చు కానీ ఓ వర్గం రాజకీయ నేతలే అలా చేశారు. కానీ మీ అందరి ఆశీస్సులతో మాజీ ప్రధానులందరికీ కలిపి ఓ పెద్ద మ్యూజియంను నిర్మించాలని నేను నిర్ణయించాను. ఆనాటి నుంచి ఇటీవలి ఐకే గుజ్రాల్, దేవె గౌడ, మన్మోహన్ సింగ్‌ల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దేశాభివృద్ధికి కృషి చేశారు. వారి సేవలను మనం గుర్తించాలి. గౌరవించాలి’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ను కాదని జవహర్లాల్ నెహ్రూను తొలి ప్రధానిగా నియమించిన విషయాన్ని మోదీ హాస్యంతో చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతనేత గులాం నబీ ఆజాద్ హాజరయ్యారు. -
ఇప్పుడు.. కాంగ్రెస్‌కు తాకట్టు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, పార్లమెంటు తలుపులు మూసి మరీ నిట్టనిలువునా చీల్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని విభజిం చిందని, రాష్ట్రానికి ద్రోహం చేసిందని ఆ పార్టీని నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిట్టిపోశారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేసిందని కూడా అన్ని పార్టీలతో పాటు తెలుగుదేశం తిడుతూనే ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పునాదులపైన. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది. అంతేకాదు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలన్నిటినీ ఐక్యం చేసిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి తెలుగుదేశం పార్టీని వెన్నుపోటుతో కైవసం చేసుకున్న చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఆ పార్టీని కాంగ్రెస్‌కు పాదాక్రాంతం చేయడం చూసి ప్రజలే కాదు తెలుగుదేశం నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అవకాశవాదానికి పరాకాష్ట వంటి చంద్రబాబు తీరు చూసి నిర్ఘాంతపోతున్నారు. ఆ పార్టీల ద్రోహాలు అన్నీ ఇన్నీ కావు.. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా’ను విభజన చట్టంలో పెట్టినట్లయితే సుప్రీంకోర్టుకైనా వెళ్లి దానిని సాధించుకునే అవకాశం ఉండేది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకపోవడం వల్ల మరింత నష్టపోయారు.. దారుణంగా మోసపోయారు. పోనీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలనైనా కూడా తప్పనిసరిగా అమలు చేయాలి అని విభజన చట్టంలో కాంగ్రెస్ పెట్టిందా అంటే అదీ లేదు. 13వ షెడ్యూలులో పెట్టిన హామీలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సినవేననే అర్ధంలో చట్టంలో రాయకుండా కాంగ్రెస్‌పార్టీ మరో ద్రోహం చేసింది. 13వ షెడ్యూలులో పెట్టిన .. రైల్వే జోన్ నుంచి కడప స్టీల్ ఫ్యాక్టరీ వరకు, క్రూడాయిల్ రిఫైనరీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ వరకు ఇలా ఏది తీసుకున్నా అన్నీ చట్టంలో.. ‘మే.. మే.. మే’అని పెట్టింది. అంటే చేయవచ్చు అనే అర్ధంలో రాశారన్నమాట. మే అని కాకుండా షల్ అని పెట్టి ఉంటే తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ రోజు చట్టంలో షల్ అని పెట్టకుండా కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. కచ్చితంతా చేయాలి అనే అర్ధంలో షల్ అని పెట్టి ఉంటే ఇవాళ బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టడంలో బీజేపీ వారు కూడా భాగస్వాములే. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఆ రెండు పార్టీలు అలా తుంగలో తొక్కాయి. ఇన్ని రకాలుగా కాంగ్రెస్‌పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసింది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందంటూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇపుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే వైఖరి తీసుకోవడం, ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ సూత్రబద్ధవైఖరి.. రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ ద్రోహం చేశాయి.. రెండు పార్టీలూ రాష్ట్ర ప్రజలను వంచించాయి.. కాబట్టి ఆ రెండు పార్టీలకూ మద్దతివ్వరాదన్న వైఖరి తీసుకుంది. అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెట్టకుండా మోసం చేయగా.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన బీజేపీ.. అవకాశం ఉండీ.. అధికారంలో ఉండీ.. మోసం చేసింది. అందుకనే ఈ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారని ఆపార్టీ నేతలు ప్రకటించారు. ఎన్డీయే ఓ బీజేపీయేతర అభ్యర్థిని బరిలో దింపగా కాంగ్రెస్ పార్టీ స్వయంగా తన అభ్యర్థినే రంగంలో నిలిపింది. అలాంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఎలాంటి సంకోచమూ లేకుండా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతిచ్చి తన నిజస్వరూపాన్ని చాటుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసుల నుంచి రక్షణ కోసమే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ ఏదో ఒక జాతీయ పార్టీ అండ కావాలి. ఎందుకంటే తన కేసుల నుంచి రక్షణ కావాలి. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు ఎపుడు ఎలాంటి ముప్పు తెచ్చినా ఓ జాతీయ పార్టీ ఆదుకోవాలని ఆయన ఆశిస్తారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో సంబంధాలు తెగిపోయిన వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. ఒకవైపు బీజేపీతో లోపాయికారి సంబంధాల కోసం లాబీయింగ్ నడుపుతూనే కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతిచ్చే స్థితికి చేరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుమ్మరించిన కేసులో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఇక రాష్ట్రంలో లక్షల కోట్లకు చేరుకున్న అవినీతి గురించి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సంస్థలు నివేదికలిస్తున్నాయి.. వీటి నుంచి చంద్రబాబుకు రక్షణ అవసరం. అందుకే రాష్ట్రానికి జరిగిన ద్రోహాన్ని, రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి మరో జాతీయ పార్టీకి చేరువయ్యారని వినిపిస్తోంది. అంత ద్రోహం చేసినా కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతివ్వడానికి, ఓటు వేయడానికి చంద్రబాబు ఎలాంటి సంకోచం లేకుండా వ్యవహరించడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఎన్డీయే అభ్యర్థిదే విజయం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా అధికార పక్షం అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ గురువారం సునాయాసంగా విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ గత నెల పదవీ విరమణ పొందారు. హరివంశ్‌ను మోదీ పొగుడుతూ ‘ఇప్పుడంతా హరి/దేవుడి చేతుల్లో ఉంది. ప్రతిపక్ష, విపక్షమనే తేడాలేకుండా ఆయన సభ్యులందరిపై కరుణతో ఉంటారనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. రాజ్యసభ నాయకుడు జైట్లీ, విపక్ష నేత ఆజాద్‌లు హరివంశ్‌పై ప్రశంసలు కురిపించారు. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న జైట్లీ తొలిసారిగా గురువారమే సభకు వచ్చారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేడీయూ సభ్యుడు రామ్ ప్రసాద్ సింగ్ ప్రతిపాదించగా, కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) సభ్యుడు రాందాస్ అథవాలే బలపరిచారు. ఎన్నిక అనంతరం హరివంశ్ సభాధ్యక్షుడి స్థానంలో కాసేపు కూర్చోగా సభ్యులంతా చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హరివంశ్ మాట్లాడుతూ సభా గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాననీ, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎంపీలు తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. అనంతరం సభ భోజన విరామం కోసం వాయిదా పడింది. రెండుసార్లు ఓటింగ్ తొలిసారి ఓటింగ్‌లో కొన్ని తప్పులు దొర్లాయని కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఓటింగ్ సమయంలో హరివంశ్‌కు 122 ఓట్లు, హరిప్రసాద్‌కు 98 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 222గా తేలింది. అయితే రెండోసారి ఓటింగ్ జరిగాకా మాత్రం హరివంశ్‌కు 125 ఓట్లు, హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల తేడాతో హరివంశ్ గెలుపొందారు. సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 244 కాగా, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన మొత్తం 97 మంది సభ్యులూ హాజరై ఓటు వేశారు. బీజేడీ, టీఆర్ఎస్, అన్నా డీఎంకే పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేయడంతో హరివంశ్ చాలా సులభంగా గెలుపొందారు. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీల్లో ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చొప్పున 9 మంది, అలాగే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, పీడీపీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడొకరు.. మొత్తం 16 మంది గైర్హాజరై బీజేపీ సునాయాస విజయానికి కారకులయ్యారు. వీరంతా సభకు వచ్చి విపక్ష అభ్యర్థికి ఓటు వేసి ఉంటే కనీసం ఎన్డీయే కూటమి గట్టి పోటీని ఎదుర్కొని ఉండేది. ఈ 16 మంది గైర్హాజరుతో ఓటింగ్ సమయంలో సభలో 228 మంది సభ్యులు మిగిలారు. దీంతో అభ్యర్థి గెలవడానికి 115 ఓట్లు అవసరమయ్యాయి. ఇద్దరు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆటగాళ్లకంటే అంపైర్లకే సమస్యలెక్కువ: మోదీ హరివంశ్ ఎన్నిక అనంతరం మోదీ సరదాగా మాట్లాడుతూ ‘ప్రస్తుతం సభలో పరిస్థితి చూస్తుంటే ఆటగాళ్ల (సభ్యులు) కంటే అంపైర్ల (చైర్మన్, డిప్యూటీ చైర్మన్)కే ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా ఉన్నాయి’ అని అన్నారు. ‘హరివంశ్ నాలుగు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు కూడా ముందుకొచ్చింది. కానీ ఆ కొలువును ఆయన తిరస్కరించారు. ఎన్నిక ఫలితం అందరికీ ముందుగానే తెలిసినదైనప్పటికీ పద్ధతుల ప్రకారం ఓటింగ్ జరపాల్సి వచ్చింది. ఫరవాలేదు. కొత్త సభ్యులకు సభలో ఓటు ఎలా వేయాలో తెలిసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నిక సజావుగా సాగినందుకు విపక్ష అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు, వెంకయ్యకు, సభ్యులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఎంపీ.. అప్పుడే డిప్యూటీ చైర్మన్ ఎంపీగా తొలిసారిగా 2014లో రాజ్యసభకు ఎన్నికైన హరివంశ్ ఆ పదవిలో ఉండగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరించనుండటం గమనార్హం. 62 ఏళ్ల హరివంశ్ తొలినాళ్లలో ప్రభుత్వోద్యోగాన్ని కాదని పాత్రికేయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. బిహార్‌లోని బల్లియా జిల్లాకు చెందిన హరివంశ్.. ప్రముఖ దివంగత నేత జయప్రకాశ్ నారాయణ్ సొంత ప్రాంతానికి చెందిన వారే. గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగానూ కొన్నాళ్లు పనిచేసిన హరివంశ్.. ఆయన పదవి నుంచి దిగిపోయిన అనంతరం మళ్లీ పాత్రికేయ వృత్తిలోకి వెళ్లారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, జర్నలిజంలో డిప్లొమా చదివారు. హిందీ పత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. హిందీలో పలు పుస్తకాలు రాశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. బీజేపీకి కొత్త మిత్రులు! కాంగ్రెస్‌కు భంగపాటు న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో కాంగ్రెస్ మరోసారి భంగపడగా, బీజేపీకి కొత్త మిత్రులు దొరికారు. వాస్తవానికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీలో నిలపాలని అనుకోలేదు. విపక్ష పార్టీల నుంచి ఎవరిని నిలబెట్టినా తాము మద్దతిస్తామంది. కానీ విపక్ష కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఓడిపోతామని తెలిసినా తమ ఎంపీని నిలబెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ది. పైపెచ్చు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పీడీపీ, ఆప్‌లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాహుల్ కోరితే తాము మద్దతిస్తామని ఆప్ స్పష్టం చేసినప్పటికీ, రాహుల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బీజేపీ కొత్తగా టీఆర్ఎస్, బీజేడీల మద్దతు పొందింది. మద్దతు కోసం స్వయంగా మోదీ బీజేడీ అధినేత బిజూ పట్నాయక్‌కు ఫోన్ చేసి∙ఒప్పించారు. బీజేపీతో భేదాభిప్రాయాలున్నట్లుగా కనిపించిన శివసేన, అకాలీదళ్‌లు కూడా ఇప్పుడు ఆ పార్టీతో సత్సంబంధాలనే కలిగి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు మరో 10 నెలలు మాత్రమే ఉండగా ఇటీవల ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుండగా, కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లైనా గెలుచుకుంటుందో లేదోనని పలువురు సీనియర్ నేతలు ఆందోళనగా ఉన్నారు. -
‘వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు’
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలతో కేసీఆర్‌కు మోదీకి మధ్య ఉన్న చీకటి సంబంధం బయటపడిందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక చేతిలో మజ్లీస్, మరో చేతిలో బీజేపీ ని పట్టుకుని తిరుగుతున్నాడని మిమర్శించారు. ఎన్నికల్లో ఎన్డీయే, యూపీయే మధ్య పోటీ జరిగితే కేసీఆర్ ఎన్డీయేకు మద్దతుకు ఇచ్చారని, దీంతో మోదీకి ఆయనకి మధ్య ఉన్నచీకటి అనుబంధం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు దిశగా వెళ్తోందని ఆరోపించారు. మోదీకి, కేసీఆర్‌కి చీకట్లో ఉన్న వ్యక్తి ఎవరో కూడా నిన్నటి తమిళనాడు పర్యటనలో తేలిపోయిందన్నారు. కేసీఆర్ గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సొంత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లాడని, మోదీ కి కేసీఆర్ కు మధ్య అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి ఛత్తీస్గఢ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. మార్వా విద్యుత్ కంపనీకి అదానీ బొగ్గు సరఫరా చేస్తున్నారని, అందుకే అధిక ధరలకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేశారని విమర్శించారు. అదానీ కంపనీకి ఆర్ధిక ఇబ్బందులు తొలగడం కోసం కేసీఆర్ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. తన స్వార్ధానికి తెలంగాణ ను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెంచుకోవడం కోసం విద్యుత్ సంస్థల మీద ఆర్ధిక భారం పెంచుతున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌లను ముందు నిలబెట్టి అడ్డుకో ఉస్మానియాలో బడుగు, దళిత విద్యార్థులను ముందు పెట్టి రాహుల్ పర్యటన ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేటీఆర్, హరీశ్‌లకు ముందు నిలబెట్టి రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుల్ని కింద పడేసి తొక్కి ఓయూ పర్యటన చేస్తారని పేర్కొన్నారు. 1200 మంది మంది బిడ్డలను చంపి సమాధుల్లో పెట్టి కేసీఆర్ పిల్లలను మాత్రం మంత్రులు, పార్లమెంట్ సీట్లల్లో కూర్చొపెట్టారని ఆరోపించారు. -
‘అందుకే ఏ పార్టీకి ఓటెయ్యలేదు’
సాక్షి, గుంటూరు : ఏపీని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి అన్యాయం చేస్తే.. సరిచేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఏ పార్టీకి వైఎస్సార్సీపీ ఓటెయ్యలేదని పేర్కొన్నారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు హోదా ఇస్తామని మోసం చేసిందని ఆరోపించారు.రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లోపల, వెలుపలా బీజేపీని నిలదీసిన ఎకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే టీడీపీ మాత్రం యూటర్న్ తీసుకొని ప్యాకేజీకి ఒప్పుకుందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం మొదటగా పెట్టింది వైఎస్సార్సీపీయేనని గుర్తుచేశారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు వారే బుద్ది చెబుతారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ ఎంపీలు రాజీనామ చేస్తే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హోదాపై యుటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. -
‘రాజ్యసభ డిప్యూటీ’ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. రాజ్యసభలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అనుకూలంగా 125, ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. ఫలితంగా హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244 కాగా, 230 సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికార, విపక్షాల మధ్య ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో హరివంశ్ నారాయణ్ సింగ్నే విజయం వరించింది. విపక్షాల తరపున బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు తీవ్ర పోటీ ఎదురైందనే చెప్పాలి. పలుమార్లు లెక్కించిన ఓట్లలో హరిప్రసాద్ 20 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అనుకూలంగా టీఆర్ఎస్ ఓటేయగా, కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్‌కు టీడీపీ ఓటేసింది. వైఎస్సార్సీపీ దూరం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు కానీ, విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్‌కు గానీ వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేసిన కారణంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. -
మోసం చేసినందుకే కాంగ్రెస్, బీజేపీలకు దూరం
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు కానీ, విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన కె. హరిప్రసాద్‌కు గానీ తాము మద్దతివ్వడం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేశాయని.. అందులో సందేహమే లేదన్నారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు అందుకే ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నట్లు వివరించారు. (రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ) రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి బీజేపీ ద్రోహం చేసిందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచకుండా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేవలం మాటగా చెప్పారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఏపీకి తీరని ద్రోహం చేసిందన్నారు. మరోవైపు పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. ఏపీకి ద్రోహం చేసిన రెండు పార్టీలతో కుమ్మక్కై టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లాంటి కీలక రాజ్యాంగ పదవులు ఏవైనా ఏకగ్రీవం కావాలనేది తమ అభిప్రాయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా, ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోంది
-
హోరాహోరీగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
-
రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. గెలుపు మాదంటే మాదే! కాంగ్రెస్‌కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. హరిప్రసాద్ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్లుఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది. కూటముల బలాబలాలు బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్‌కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్‌లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్ సభ్యుడు, మరో ఇండిపెండెంట్ ఎంపీ హరిప్రసాద్‌కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్‌గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది. -
ఎన్డీఏకు మద్దతివ్వం : విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. -
బీజేపీ అన్యాయం చేసింది..అందుకే మద్దతివ్వం
-
9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికల నగారా మోగింది. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈ నెల 8 సాయంత్రంలోగా నామినేషన్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఇప్పటివరకూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్ పదవీకాలం జూన్ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు, ప్రభాత్ ఖబర్ హిందీ పత్రిక ఎడిటర్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల తేదీల్ని వెంకయ్య ప్రకటించిన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ప్రాంగణంలోని కాంగ్రెస్ నేత ఆజాద్ చాంబర్లో భేటీఅయ్యాయి. తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవాలన్న అంశంపై చర్చించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, ఎన్సీపీ నేత వందన చవాన్, నామినేటెడ్ సభ్యుడు కేసీ తుల్సీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందువరుసలో ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సభలో బలాబలాలెంత: ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
తృణమూల్‌కే డిప్యూటీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో విపక్షాలు ఐక్యతకు పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగా డిప్యూటీ చైర్మన్‌గా తృణమూల్ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీకి కాంగ్రెస్ తెలియజేసినట్లు సమాచారం. మమత ఎవరిని బరిలో నిలిపినా తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 13 మంది సభ్యులున్న తృణమూల్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ బీజేపీ వ్యతిరేక అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తోందని సమాచారం. ఎగువసభలో పార్టీ ఉపనేత, రెండోసారి ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్‌ని పోటీలో ఉంచే అవకాశం కనబడుతోంది. కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటోంది? 245 మంది సభ్యులున్న ఎగువ సభలో కాంగ్రెస్‌కు 51మంది ఎంపీలున్నారు. సహజంగానే విపక్ష పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థే బరిలో ఉండాలి. కానీ ఎన్డీఏయేతర పక్షాల అభ్యర్థి గెలవాలంటే యూపీఏయేతర పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం తక్కువే. బిజూ జనతాదళ్ (9), టీఆర్ఎస్ (6) వంటి పార్టీల మద్దతు తప్పనిసరి. ఈ పార్టీలూ టీఎంసీ అభ్యర్థి బరిలో ఉంటే మద్దతిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీకి కాస్త అనుకూలంగా ఉంటున్న ఏఐఏడీఎంకే (13) చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కాంగ్రెస్ నేతలంటున్నారు. 123 ఎంపీల మద్దతుంటేనే విజయం దక్కే ఈ ఎన్నికలో బీజేపీ, విపక్షాల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది ఎంపీలుండగా.. 5–10 ఎంపీలున్న పార్టీలు కనీసం 8 వరకున్నాయి. మిగిలిన పార్టీలకు ఇద్దరు, ముగ్గురు సభ్యుల బలముంది. బీజేపీలో తర్జన భర్జన ఈ ఎన్నికలపై 69 మంది సభ్యులున్న బీజేపీ మాత్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అధికార పార్టీ చెబుతోంది. జూన్ 15న ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య జరిగిన భేటీలో టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావును బరిలో దించడంపై చర్చించినట్లు వార్తలొచ్చాయి -
ప్రతిపక్షాల అభ్యర్థి తృణమూల్ నాయకుడు
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ప్రతిపక్షాలు, అధికార పక్షాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ పీజే కురియన్ 2012లో డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైయ్యారు. కురియన్ పదవీ కాలం జులై 2తో ముగియనున్న విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మిత్రపక్షాల నుంచి అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖెండు శేఖర్ రాయ్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 51 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీకి లేకపోవడంతో ప్రతిపక్షాలను ఏకం చేసి వారికి విజయం దక్కకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్, బీజు జనతా దళ్(బీజేడీ) పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కేశవరావు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇరవై ఆరేళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. చివరిసారిగా 1992లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నజ్మా హెప్తుల్లా(ప్రస్తుతం బీజేపీ), టీడీపీ అభ్యర్ధి రేణుకా చౌదరిపై పోటీ చేసి విజయం సాధించారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న వర్ష కాల సమావేశంలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. -
‘రాజ్యసభను వృద్ధాశ్రమంగా మార్చవద్దు’
తిరువనంతపురం : రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పీజే కురియన్ రాజకీయాల నుంచి సెలవు తీసుకోవాని కేరళ యువ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల(జూన్)లో కేరళకు చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో కురియన్ రీ నామినేషన్ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘రాజ్యసభ సభ్యునిగా మూడుసార్లు ఎన్నికైన పీజే కురియన్ ఈసారి తెలివైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను. పార్లమెంటరీ రాజకీయాల నుంచి వారు వైదొలుగుతారని భావిస్తున్నాను’ అంటూ కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరాం తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బలరాం అభిప్రాయంతో ఏకీభవించిన మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కురియన్ రీ నామినేషన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఎగువ సభ(రాజ్యసభ)ను ఒక వృద్ధాశ్రమంగా మార్చాలని పార్టీ అనుకోవడం లేదు. కురియన్ వంటి సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకుని ఉంటాయని రాహుల్ చెప్పారంటూ’ యువ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన పీజే కురియన్.. ‘అధిష్టానం కోరుకున్నట్లయితే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానం’టూ వ్యాఖ్యానించారు. అయితే డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాజ్యసభలో తగినంత బలం లేదు. చెంగనూర్ ఓటమికి కారణం ఎవరు..? మే 31న వెలువడిన చెంగనూర్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ చీఫ్‌ను మార్చాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కేరళ కాంగ్రెస్ చీఫ్ ఎంఎం హసన్‌తో పాటు సీనియర్ నేతలు వీడీ సతీషన్, మాజీ ఎంపీ కె. సుధాకరన్, మాజీ మంత్రి ముల్లపల్లి రామచంద్రన్ కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవి రేసులో ముందున్నారు. -
లోక్‌సభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకరణ 89 ప్రకారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని ఏర్పరచారు. ఈయన పదవీకాలం ఆరేళ్లు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావాలంటే రాజ్యసభలో సభ్యుడై ఉండాలి. రాజ్యసభ సభ్యులే మెజార్టీ ప్రాతిపదికపై ప్రత్యక్షంగా డిప్యూటీ ౖచైర్మన్‌ను ఎన్నుకుంటారు. అలాగే రాజ్యసభ సభ్యులే ఒక తీర్మానం ద్వారా ఈయనను తొలగించవచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్‌కు అందిస్తారు. రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు, అలాగే ఉప రాష్ట్రపతి.. రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. పార్లమెంటు సచివాలయం: ప్రకరణ 98 ప్రకారం, పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభలకు ప్రత్యేక సచివాలయ సిబ్బంది ఉంటారు. లోక్‌సభ కార్యదర్శిని లోక్‌సభ సెక్రటరీ జనరల్ అని, రాజ్యసభ కార్యదర్శిని రాజ్యసభ సెక్రటరీ జనరల్ అని అంటారు. సభా నాయకుడు సాధారణంగా ప్రధానమంత్రి లోక్‌సభ సభానాయకుడిగా వ్యవహరిస్తారు. అయితే, ప్రధానమంత్రికి లోక్‌సభలో సభ్యత్వం లేనప్పుడు, లోక్‌సభలో సభ్యత్వం కలిగిన మంత్రిని సభా నాయకుడిగా నియమిస్తారు. అలాగే రాజ్యసభలో కూడా ఆ సభలో సభ్యత్వం ఉన్న మంత్రి ఒకరు సభా నాయకుడిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు – ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. అయితే లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి. మౌలాంకర్ రూపొందించిన నియమావళి ప్రకారం లోక్‌సభలో కనీసం 1/10వ వంతు సభ్యులు కలిగిన, అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడి హోదా పొందుతారు. రాజ్యసభలోనూ ఇదే విధానం వర్తిస్తుంది. ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది. గమనిక: 1977లో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం ప్రకారం లోక్‌సభ లేదా రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు అనే హోదాకు మొదటిసారిగా చట్టబద్ధత కల్పించారు.ప్రత్యేక సమాచారం: ఈ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నేత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన వై.బి. చవాన్ (6వ లోక్‌సభ). రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠీ.మొదటి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేరు. అలాగే రెండో, మూడో, ఐదో, ఏడో లోక్‌సభలు కూడా ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ముగిశాయి. కారణం నిర్ణీత సంఖ్యలో సభ్యులు లేకపోవడమే. శాసన నిర్మాణ ప్రక్రియ– బిల్లులు– రకాలు బిల్లు అంటే చట్టం చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన లేదా ముసాయిదా. చట్టం మొదటి దశే బిల్లు. శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభల్లో అనేక దశలు ఎదుర్కోవాలి. ప్రవేశపెట్టే వారి ఆధారంగా బిల్లులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి.. 1. ప్రభుత్వ బిల్లు 2. ప్రైవేటు మెంబర్ బిల్లు ఒక బిల్లును మంత్రి ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వ బిల్లు అంటారు. ప్రతిపక్ష సభ్యులతో సహా మంత్రి కాని ఏ సభ్యుడైనా బిల్లును ప్రతిపాదిస్తే దాన్ని ప్రైవేటు మెంబర్ బిల్లు అంటారు. ప్రత్యేక సమాచారం: పదహారో లోక్‌సభ వరకు (2015) పార్లమెంటులో 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు ఆమోదం పొందాయి. 1956లో ఆరు ప్రైవేటు బిల్లులను ఆమోదించారు. 15వ లోక్‌సభలో 264 ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. కానీ ఏ ఒక్కటీ ఆమోదం పొందలేదు. బిల్లులోని అంశాలు, ప్రక్రియల ఆధారంగా బిల్లును కింది రకాలుగా వర్గీకరిస్తారు రాజ్యాంగంలో ప్రకరణ 107 నుంచి 122 వరకు శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన ప్రక్రియను పొందుపర్చారు. బిల్లులను కింది విధంగా వర్గీకరించవచ్చు. 1.సాధారణ బిల్లు (ప్రకరణ 107) 2.ఆర్థిక బిల్లు (ప్రకరణ 117) 3.ద్రవ్య బిల్లు (ప్రకరణ 110) 4.రాజ్యాంగ సవరణ బిల్లు (ప్రకరణ 368) సాధారణ బిల్లులు – ప్రక్రియ సాధారణ బిల్లుకు ప్రత్యేక నిర్వచనం లేదు. ప్రకరణ 107 ప్రకారం – ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు కానిది సాధారణ బిల్లు. సాధారణ బిల్లును ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లును ప్రవేశపెట్టదలచుకున్న సభ్యుడు ఒక నెల ముందుగా నోటీసుతో తన సంకల్పాన్ని లిఖితపూర్వకంగా ఆయా సభాధ్యక్షులకు తెలపాలి. సభ్యుడి విజ్ఞాపన అందగానే సభాపతి ఒక తేదీ నిర్ణయిస్తారు. ఏ సభ్యుడైనా బిల్లు ప్రవేశాన్ని వ్యతిరేకిస్తే అతడి అభిప్రాయాలను వినిపించేందుకు అనుమతిస్తారు. సాధారణ బిల్లులో కింది దశలుంటాయి. 1. ప్రవేశ దశ (మొదటి పఠనం) 2. రెండో పఠనం (పరిశీలన దశ) 3. మూడో పఠనంలేదా ఆమోద పరిశీలన దశ 4. రెండో సభలోకి బిల్లు పంపడం 5. రాష్ట్రపతి ఆమోదం ప్రవేశ దశ (మొదటి పఠనం) ఒక బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సభ్యుడు, ఆ బిల్లు పేరును, ఆవశ్యకతను ప్రాధాన్యతను వివరిస్తాడు. ఈ దశలో ఎలాంటి చర్చ జరగదు.రెండో పఠనం: బిల్లు మొదటి దశ పూర్తయ్యాక ముద్రించిన బిల్లుల ప్రతులను సభ్యులకు అందిస్తారు. ఈ దశలో బిల్లుపై విస్తృత చర్చ జరుగుతుంది. ఈ దశలో కింది ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. బిల్లును చర్చించి, వెంటనే ఆమోదించాలని అడగవచ్చు. బిల్లును సెలక్ట్ కమిటీకి లేదా రెండో సభ అంగీకారంతో సంయుక్త సెలక్ట్ కమిటీకి నివేదించవచ్చు.బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అడగవచ్చు. అంటే బిల్లుకు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని కోరడం.కమిటీ దశ–వివరణ: అత్యంత ప్రాముఖ్యమైన లేదా వివాదాస్పద, రాజ్యాంగ పరమైన వ్యాఖ్య అవసరమున్న బిల్లులను సెలక్ట్ కమిటీ అభిప్రాయానికి పంపుతారు. సెలక్ట్ కమిటీ సభ్యులను ఆయా సభాధ్యక్షులు నియమిస్తారు. సాధారణంగా వీరి సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఉభయ సభల సభ్యులతో కలిపి ఏర్పాటు చేస్తే జాయింట్ సెలక్ట్ కమిటీ అంటారు. ఈ కమిటీ సూచించిన సవరణ, ప్రతిపాదనలను సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.మూడో పఠనం లేదా ఆమోద పరిశీలన దశ: ఇది కేవలం ఆమోద దశ మాత్రమే. ఇందులో బిల్లుపై పరిమిత చర్చకు సభ్యులకు అనుమతి లభిస్తుంది. బిల్లును అంగీకరించడం/నిరాకరించడానికి మాత్రమే చర్చ పరిమితం అవుతుంది. హాజరైన వారిలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆ బిల్లును సభ ఆమోదించినట్లు సభాపతి ప్రకటిస్తారు. దీంతో ప్రవేశపెట్టిన సభలో బిల్లు ప్రక్రియ పూర్తవుతుంది.రెండో సభలోకి బిల్లు వెళ్లడం: బిల్లు శాసనంగా మారాలంటే ఉభయ సభలు ఆమోదం తెలపాలి. ప్రవేశపెట్టిన సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రెండో సభ ఆమోదానికి పంపుతారు. ఇందులోనూ మూడు దశలుంటాయి. బిల్లును రెండో సభ పూర్తిగా తిరస్కరించవచ్చు. బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన సభ పునఃపరిశీలనకు పంపవచ్చు. ఒకవేళ రెండో సభ చేసిన సవరణను మొదటి సభ అంగీకరిస్తే ఆ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందినట్లు అవుతుంది. రెండో సభ సవరణను మొదటి సభ వ్యతిరేకిస్తే ఆ బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది.