పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు. ఉపరాష్ట్రపతి గైర్హాజరైన కార్యక్రమానికి డిప్యూటి ఛైర్మన్ వెళ్లడంపై విచారం వ్యక్తం చేశారు.
'జర్నలిజం కోటాలో డిప్యూటీ ఛైర్మన్ పదవికి హరివంశ నారాయణ్ సింగ్ పేరును జేడీయూనే ప్రతిపాదించింది. అలాంటప్పుడు ప్రతిపక్షాలకు అండగా ఉండకుండా.. కేంద్రానికి కొమ్ముకాస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికిది చీకటి రోజు' అని నీరజ్ కుమార్ దుయ్యబట్టారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేడీయూతో సహా 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. అయితే హరివంశ నారాయణ్ సింగ్ జేడీయూకు చెందిన నేత. జర్నలిస్టుల కోటాలో భాగంగా రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ కు జేడీయూనే అప్పట్లో ప్రతిపాదించింది. దీంతో తమ సొంత పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి.. డిప్యూటి ఛైర్మన్ హోదాలో హరివంశ నారాయణ్ సింగ్ హాజరవడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తప్పుబట్టారు.
హరివంశ నారాయణ్ సింగ్ 2018లో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ పదవి చేపట్టారు. డిప్యూటి ఛైర్మన్‌గా కాంగ్రెస్‍కు చెందని మూడో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్నారు.
ఇదీ చదవండి:కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment