vanchana pai garjana
-
నయవంచకులపై గర్జన
సాక్షి, న్యూఢిల్లీ :నిస్సిగ్గుగా నయవంచన పర్వం సాగించారు. నాలుగేళ్లపాటు నమ్మక ద్రోహం చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హోదా అంశానికి పాతరేశారు. హోదా మాటెత్తితే శివాలెత్తారు. ఇప్పుడు పోలవరం అంటూ.. స్టీల్‌ప్లాంట్ అంటూ జిమ్మిక్కులు ప్రారంభించారు. ఎన్నికల శంకుస్థాపనలతో మళ్లీ మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును వైఎస్సార్ సీపీ ఎండగట్టింది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో దేశ రాజధానిలో గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట నిరసన తెలిపింది. ఎముకలు కొరికే చలిలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు రోజంతా ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ముమ్మాటికి ఇవ్వాల్సిందేనని ముక్తకంఠంతో కోరారు. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే జోగులు రాజాం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని, విభజన చట్టంలో హామీలును అమలుచేయాలని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేస్తున్న మోసానికి నిరసనగా ఈ కార్యక్రమం జరిగిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని ఒక్క వైఎస్సార్ సీపీయేనని ఆయన చెప్పారు. జగన్‌తోనే హోదా సాధ్యామన్నారు. -
న్యూఢిల్లీలో : ‘వంచనపై గర్జన దీక్ష’
-
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: వైవీ
ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు. హోదా కోసం ఎన్డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి..ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని అన్నారు. హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. -
చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి
-
చంద్రబాబు నయవంచకుడు: మేకపాటి
-
విజయం మాదే: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న ‘వంచనపై గర్జన’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు కొత్త డ్రామా: వైవీ సుబ్బారెడ్డి ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించి ధర్మాపోరాట దీక్షలతో మరోసారి వంచించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, ప్రత్యేక హోదా కోసం నాలుగన్నరేళ్లుగా చిత్తశుద్ధితో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. దమ్మున్న నాయకుడు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. హోదా కవచంతో వస్తున్నారు: జంగా ప్రత్యేక హోదా భిక్ష కాదు, తెలుగు ప్రజల హక్కు అని వైఎస్సార్ సీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. హోదా కవచం కప్పుకుని ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పోరాటాలతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది వైఎస్సార్సీపీయేనని చెప్పారు. శ్వేతపత్రాలతో చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మొదటగా అవిశ్వాసం పెట్టింది కూడా వైఎస్సార్సీపీయేనని తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో కేంద్రం దిగివచ్చేదని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని తూర్పారబట్టారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాదని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, 25 ఎంపీ స్థానాలు గెలిస్తే మనం అనుకున్నది సాధించవచ్చునని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. -
ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల
-
‘ఆయన్ను బ్రోకర్లా బాబు వాడుకుంటున్నారు’
ఢిల్లీ: నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తెలుగు దేశం ఎంపీ సీఎం రమేష్‌ను ఒక బ్రోకర్లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా అన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల కేసు: కన్నబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. -
‘పోరాడితే కేసులా.. మరి హోదా సాధించని బాబు సంగతి’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీతో లాలూచీ పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థికమంత్రి జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడితే పీడీ యాక్ట్‌తో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి హోదా సాధించని చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను తన పార్టీలోకి తీసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోద ప్రకటించాలని మోదీని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ సీఎం కావడాన్ని ఎవరూ ఆపలేరు: పృథ్వీ వైఎస్సార్సీపీ నేత, నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన, అనైతిక కలయిక అని అభివర్ణించారు. ప్రజలు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గమ్యం లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసుల్లా వచ్చి ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓటుకు నోటు కేసు వల్లే రాజధాని వదులుకున్నారు
-
తెలుగువాడిగా పుట్టినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
-
‘చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు’
సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి వైఎస్సార్ సీపీ చేపట్టిన దీక్షకు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీక్షలో ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై నేతలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాడుతున్నది వైఎస్సార్ సీపీ మాత్రమేనని నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. హోదా తేలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ ఓ బోగస్ అని తెలిపారు. విభజన నష్టాలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కులాలు, మతాలను అవమానించింది చంద్రబబాబేనని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. మైనార్టీల, అర్చకుల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తారని విమర్శించారు. సంక్షేమ రాజ్యం రావాలంటే కేవలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. -
బీజేపీ,టీడీపీ ఏపీకి అన్యాయం చేశాయి
-
వయస్సు పై బడ్డా ఇంకా బుద్ధి రాలేదు
-
హామీల పై కేంద్రం దొంగనాటకాలు
-
‘ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. హోదా కోసం జననేత వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కేవలం పోలవరానికి ఒక్క గేటు పెట్టి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వయస్సు పై బడ్డా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. దివాకర్‌రెడ్డి వైఎస్ జగన్‌ను విమర్శించి మన్నలను పొందాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘40 ఏళ్ల అనుభవం... అబద్ధాలు చెప్పడానికేనా’ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పక్కబెట్టిన చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణాల గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న జేసీ దివాకర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బ్యాకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు
-
రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణం
-
ఏపీ ప్రజలను వంచించారు
-
వంచనపై గర్జన
-
‘కేవలం పునాది వేస్తారు.. నమ్మించేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి బాబు ప్రజలను నమ్మిస్తారని అన్నారు. రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే అని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, భారతీయ జనతాపార్టీలు ఆంధ్రప్రదేశ్‌ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు తెలియజెప్పడానికే ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టామని అన్నారు. విభజన హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఉన్నప్పుడు కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా బాబు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోనుందనే కాంగ్రెస్‌తో జతకట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు వినిపించేందుకే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పార్లమెంటుకు వినిపించాలనే వంచనపై గర్జన దీక్ష చేపట్టామని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది తమ పార్టీయేనని అన్నారు. హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఐదు మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ఏపీకీ అన్యాయం చేసిన వారిలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాన్ ముద్దాయిలని అన్నారు. -
యూ టర్న్ తీసుకుంది చంద్రబాబే
-
హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు
-
వంచనపై గర్జన: ‘ప్రజలను నడిరోడ్డుపై పడేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ ఈ దీక్ష చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన హామీలపై నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ.. హోదా సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ఏపీలోని వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది. అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీల చేత వారి లోక్‌సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు సమర్పించి.. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు. దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ దీక్షలో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురువారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుంది వైఎస్సార్ సీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకుని ఏపీ తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుందని తెలిపారు. హోదా కోసమే వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా జననేత వైఎస్ జగన్‌తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను నడిరోడ్డుపై పడేశారు మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన బీజేపీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రజలను నడిరోడ్డున పడివేసి ఎవరి దారి వారు చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాపై చంద్రబాబు ఎప్పుడో చేతులెత్తేసి.. ప్రస్తుతం కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లతో ప్రజలకు ఏ మాత్రం లాభం లేదని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మొట్టమొదటి పార్టీ వైఎస్సార్ సీపీనే అని గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన చంద్రబాబు నేడు అదే పార్టీతో కలిశారని ఎద్దేవా చేశారు. హోదా కోసం వైఎస్సార్ సీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారని.. అందరం కలిసి రాజీనామాలు చేద్దామంటే పారిపోయిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. టీడీపీ నేతలు దమ్ముంటే తమతో కలిసి రావాలని.. మోదీ ఇంటి వద్ద ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్ హయంలోనే పోలవరం పనులు ప్రారంభం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనే పోలవరం పనులు ప్రారంభించారని.. ఆయన చలువ వల్లే అసలు పోలవరానికి రూపం వచ్చిందని గుర్తుచేశారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు పోలవరం కడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం ఏ పార్టీతోనైనా కలుస్తారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాన చేస్తున్నారని తెలిపారు. అల్మట్టి డ్యామ్ ఎత్తు పెరగడానికి కూడా చంద్రబాబే కారణమని అన్నారు. కమీషన్ల కోసమే పోలవరం చేపట్టారు.. వంచనపై గర్జన దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకులు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని చేపట్టాడని విమర్శించారు. రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఏపీ అన్ని రకాల నష్టపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. రాజన్న రాజ్యం కావాలంటే అది వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ వల్లే సాధ్యమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై యూ టర్న్ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. రైతుల వలసల గురించి చంద్రబాబు చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో యూ టర్న్ తీసుకుంది చంద్రబాబేనని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు హోదా కోసం ఉభయ సభల్లో పోరాడారని అన్నారు. హోదా కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అనేక రూపాల్లో పోరాటాలు చేశారని తెలిపారు.