
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న వంచనను ప్రజలముందు ఉంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన కార్యక్రమం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బాలాజీ సెంటర్లో ప్రారంభమైంది. వైఎస్సార్ సీపీ నేతలు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి నివాళులు అర్పించి, సర్వమత ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బొత్సా సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రామకృష్ణారెడ్డి, కన్నబాబు పలువురు ఎమ్మెల్యేలు , వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు, భారీ సంఖ్యలో మహిళలు, అభిమానులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment