
సాక్షి, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటం కోసం, విభజన హామీల అమలుకు గత నాలుగున్నరేళ్లుగా తమ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వంచనపై గర్జన సభ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ హామీలు సాధించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చంద్రబాబు ఏనాడూ పోరాడింది లేదని చెప్పారు. హోదా కోసం కేంద్రాన్ని ఏ రోజు అడిగిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ, టీడీపీ పార్టీలు రెండూ ఏపీ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.
చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒక్కటే : వైఎస్సార్ సీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒక్కటేనని వైఎస్సార్ సీపీ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పోరాటాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఖర్చులతో చంద్రబాబు ధర్మపోరాటమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని, యుటర్న్ తీసుకున్నంత మాత్రాన ప్రజలు ఆయన్నునమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 25 సార్లు పోరాడారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment