సాక్షి, అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జూలై 2న వంచపై గర్జన దీక్షను నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ వైఎస్సార్‌సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీక్ష అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు.
ఈ దీక్షలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసిన నేతలతో పాటు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సమన్వయకర్తలు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారని ఆయన అన్నారు. దీక్షలో పాల్గొనే నేతలంతా ఆ రోజున తప్పనిసరిగా నల్లదుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీల అమలు కాకపోవడానికి కారణం సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీనే కారణమని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment