
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నీచ రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని ప్రభుత్వం పై అభాండాలు వేస్తున్నారని, ప్రజలందరూ టీడీపీకి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. (కోవిడ్-19 చంద్రబాబు హయాంలో వచ్చుంటే...)
కరోనా మహమ్మారి కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు. సీఎం కృషి వల్లే కరోనా పరీక్షలు సామర్ధవంతంగా జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును దేశమంతా అభినందిస్తోందన్న ఆయన చంద్రబాబుకు ఈరర్ఫ్య, అసూయ చాలా ఎక్కువన్నారు. అందుకే జగన్‌కు మంచి పేరు రావడం ఇష్టం లేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. (‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’)