‘చంద్రబాబు, మోదీలు ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు’ | Bhumana Karunakar Reddy Comments On Chandrababu And Modi | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, మోదీలు ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు’

Published Thu, Aug 9 2018 9:57 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Bhumana Karunakar Reddy Comments On Chandrababu And Modi - Sakshi

వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి

చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని, ఏపీకి హోదా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు...

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చం‍ద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 600 హామీలిచ్చిన చం‍ద్రబాబు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.

చంద్రబాబు రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీకి హోదా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

ధర్మపోరాటాల పేరుతో ప్రజలను వంచిస్తున్నారు
 టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాటల పేరుతో ప్రజలను వంచిస్తోందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పటివరకు పోరాటం చేయలేదని తెలిపారు. బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు.  

చదవండి: గర్జనకు సిద్ధం

వంచనపై వైఎస్సార్‌ సీపీ ‘యువ’గర్జన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement