Bhumana Karunakar Reddy
-
చంద్రబాబు బినామీల ముఠా టీటీడీలో ఏం చేస్తోంది?
సాక్షి,తిరుపతి : పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి (ttd) ఆలయానికి అప్రతిష్టను తెచ్చి పెట్టిన సీఎం చంద్రబాబు (chandrababu naidu) తన బినామీలు లక్ష్మణ్ కుమార్, చందు తోటలు ఎవరో నిగ్గు తేల్చాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి (bhumana karunakar reddy) డిమాండ్ చేశారు.శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రపై భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ పాలనలో టీటీడీ ప్రతిష్ఠ భ్రష్టు పట్టిపోయింది. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. వీళ్ళ అసమర్ధత కారణంగా తొక్కిసలాట జరిగింది. వీరి అలసత్వం కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు.ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ అనుచరులు లక్ష్మణ్ కుమార్, చందులు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అనేది ఉద్యోగస్తులే చెప్తున్నారు. ఎవరి లక్ష్మణ్ కుమార్, చందు తోట నిగ్గు తేల్చాలి. ఆర్టీఫిషల్ ఇంటిలిజెన్స్ పేరుతో సాఫ్ట్- వేర్ పేరుతో అనధికార వ్యక్తులు టీటీడీలో తిష్ట వేశారు. వెంకయ్య చౌదరినే ప్రధానంగా నిందితుడు. ఎలాంటి సంబంధం లేని జేఈవో గౌతమిపై వేటు చేశారు. దీనిపై నిజా నిజాలేంటే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడే నిగ్గు తేల్చాలి.అడిషనల్ ఈవోను బదిలీ చేయాలి. టీటీడీలో బినామీల ముఠా కొండపై ఏమి చేస్తోంది. వేంకటేశ్వర స్వామిని స్వార్ధానికి వాడుకుంటున్నారు. డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్.. ఏ సంబంధం లేకపోయినా ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే భక్తులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు క్షమాపణ చెబుతున్నాను’అని అనడం అభ్యతరకరం. హత్యలు, అత్యాచారాలు చేసి క్షమించాను అంటే కోర్టులు, జడ్జీలు వదిలి వేయరు కదా.ఆరు మంది చనిపోతే తొక్కిసలాటలో చనిపోయినట్లు తక్కువ సెక్షన్లు పెట్టారు. మీరు క్షమాపణలు చెప్పడంలో కుట్ర ఉంది, దోషులను శిక్షించాలి. అధికారులపై చర్యలు, అరెస్టు చేయాలి అని ఉండి ఉంటే బావుండేది. దోషులు పై చట్ట పరంగా జరిగిన సంఘటనకు చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షించే వారు’ అని అన్నారు. 👉చదవండి : వెంకటేశ్వర చూస్తున్నావా..? -
కొత్తాదేవుడండి.. పవన స్వామి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. 14 ఏళ్లుగా తన కుమార్తెలను శ్రీవారి దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్‌కళ్యాణ్. భక్తిపరులు, సనాతన ధర్మ ఆచార్యుల పిల్లలకు 9, 11 నెలలకే తలనీలాలు తీస్తారు. అలా చేయని పవనస్వామి సనాతన ధర్మ పరిరక్షకుడయ్యారు.కొత్తగా అవతరించిన పరమ హంస పరివ్రాజకాచార్య, మంత్రశాస్త్ర పయోనిధి, నరరూప నారాయణుడు, నిత్య సత్య ప్రవచనాల దీక్షాపరుడు, అస్కలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పవన స్వాముల వారు మన తిరుపతికి వేంచేసి అనుగ్రహ భాషణం చేశారు. నిన్నకాక మొన్న తిరుపతిలో అడుగుపెట్టి, కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్తూ.. దారిపొడవునా వందల సంవత్సరాలుగా శాపగ్రస్తులైన కొన్ని మెట్లకు శాపవిముక్తి చేయడం కోసం కొన్ని చోట్లపడి దొర్లుతూ, కొన్నిచోట్ల పూర్తిగా పడిపోయారు. అలా తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి తిరుమలకు చేరుకున్నారు. సాక్షి, తిరుపతి: తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది అంటూ ఎద్దేవా చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా పవనానంద స్వామి కలరింగ్ ఇచ్చారని ఘాటు విమర్శలు చేశారు. కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ తాజాగా వారాహి డిక్లరేషన్ సభలో చేసిన వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ‘‘తిరుపతి సభలో పవన్ స్పీచ్ చూసి కెవ్వు కేక పాట గుర్తొచ్చింది. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వచ్చారు. పవనానంద(పవన్) స్వాముల వారు వేంచేసినట్టుగా ఉంది. రాజకీయాలు మాట్లాడను అంటూ.. నా మీద, వైఎస్ జగన్ మీద ఇష్టానుసారం రాజకీయ ప్రేలాపనలు చేశారు. కోర్టులను కూడా హెచ్చరిస్తున్నట్టుగా పవన్ మాట్లాడారు. సనాతన ధర్మం తన వల్లే కాపాడబడుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. కల్లు తాగిన కోతిలా ప్రసంగం కొనసాగింది... హైందవ సంస్కృతికి పవన్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. అయోధ్యకు పంపిన లడ్డూలు నిజంగా కల్తీ అయితే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయ్ పవన్. పవన్ హైందవ జాతిని కించపరుస్తున్నారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియని వ్యక్తి పవన్. పీఠాధిపతులంతా తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ పీఠాలకు ఏ విలువ లేదన్నట్టుగా పవన్ మాట్లాడారు. ఆయన మాటలు విని వారంతా భయపడిపోతారు. గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతా అన్నారు. పవన్ పీఠంలో గొడ్డు మాంసం తీసుకోవచ్చు. పవన్ భాష మతి చలింపచేసేలా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ సనాతన ధర్మాన్ని పరిరక్షించలేదని మాట్లాడారు. పవన స్వాములు అల్వార్లా అవతరించినట్టు మాట్లాడుతున్నారు... పవన్ గతంలో ఏనాడూ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపైనా పవన్ నొటికొచ్చినట్టు మాట్లాడారు. పవన్ కల్యాణ్ మనసంతా విషంతో నిండి ఉంది. జనం నీ మాటలు వింటారని ఏదైనా మాట్లాడతావా పవన్. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై హెచ్చరికలు జారీ చేస్తారా?. చెప్పిన అబద్ధాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ?. 14 ఏళ్లుగా తన కుమార్తెలను దైవ దర్శనానికి తీసుకురాని వ్యక్తి పవన్. సనాతన ధర్మ ఆచారకులు పిల్లలకు 9 నెలలకే తల నీలాలు తీయిస్తారు. అలా చేయని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఆయన డిక్లరేషన్‌పై సంతకం చేస్తూ తిరుమలలో కనిపించారు. పవన్ సనాతన ధర్మం ప్రకారం బాప్టిజం తీసుకున్నా పర్వాలేదు.తిరుమల ప్రసాదంలో పశువుల కొవ్వు వాడారు అన్నారు. పవన్ క్షుద్ర రాజకీయ నాయకుడు. మతం ముసుగులో నాటకం ఆడాలనుకుంటున్నాడు. హైందవ సంస్కృతికి చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. నేను మళ్లీ పవన్‌కి ఛాలెంజ్ చేస్తున్నాను. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం. శ్రీవాణి ట్రస్టుపై చేసిన ఆరోపణలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. శ్రీవాణి ట్రస్టులో ఒక్క రూపాయి దుర్వినియోగం అయినా ఏ శిక్షకైనా సిద్ధం. ఏదేదో మాట్లాడి వెళ్లిపోవడం కాదు.. దేవుడిపై ప్రమాణం చేసి చెప్పు. మతం కోసం, సనాతన ధర్మం, ఆచారాలు అవగాహన లేకుండా మాట్లాడారు నేను ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటే పొరపాటు. రాజకీయ సభ పెట్టి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతానని ప్రేలాపనలు మాట్లాడావు. అధికారం కోసం సనాతన ముసుగు పవన్ వేసుకున్నాడు. ఆ ముసుగులో మతాల మీద దాడిచేసే పవన్ నైజం తేటతెల్లమైంది’ అంటూ భూమన తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: పవన్‌కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా? -
లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణం చేసిన భూమన
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు.‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకిత మైనది అని కలుషిత రాజకీయ మనష్కులు. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’...అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు.ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు. -
దుర్మార్గం.. మహాపచారం
సాక్షి, అమరావతి: ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహా ప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇంత దారుణంగా మాట్లాడరని, రాజకీయాల కోసం దేవదేవుడినీ వదలక పోవడం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంత కాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా, వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నడం.. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా, ఆ మాటంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించడం.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవ్వడం.. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు నిప్పులు చెరిగారు. పరాకాష్టకు బాబు బురద రాజకీయాలు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్క పోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. – భూమన కరణాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రబాబు పెద్ద పాపమే చేశాడుదివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? – వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ -
జనసేనలో చేరితే కోటి రూపాయలు.. భూమన సంచలన కామెంట్స్
-
సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి జిల్లా: సమృద్ధిగా వర్షాలు కురవడానికి వరుణ యాగం నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణయాగం వల్ల వర్షాలు కురిసాయన్నారు. శ్రీనివాస మంగాపురంలో శత కుండాత్మక మహాశాంతి వరుణయాగంలో భాగంగా వేడుకగా శుక్రవారం ఉదయం.. ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌తో పాటు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ వరుణ యాగానికి ఇవాళ సాయంత్రం అంకురార్పణ జరగనుందని తెలిపారు. గత నెలలో తిరుమలలో జరిగిన వరుణ యాగం వల్ల వర్షాలు కురిసాయని, రానున్న రెండేళ్లలో వర్షపాతం తక్కువ నమోదవుతుందని వాతావరణ శాఖ సూచన మేరకే వరుణ యాగం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
‘పట్టా’భిషేకం
ఆస్తులున్నా అనుభవించలేని దుస్థితి.. అమ్ముకోలేని పరిస్థితి.. వెరసి జీవితం దుర్భరం.. దశాబ్దాలుగా నరకం అనుభవిస్తున్న నిషేధిత భూముల యజమానులు.. ఈ దైనందిన స్థితి నుంచి ఎమ్మెల్యే భూమన విశేష కృషితో ఆ భూ యజమానులకు విముక్తి లభించింది. వారికి నేడు ఆ ఆర్డర్ కాపీలను అందజేయనున్నారు. దీనిపై ప్రత్యేక కథనం. తిరుపతి తుడా: నగరంలోని పలు ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై 22ఏ నిషేధిత నిబంధన శాపంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించే నాథుడే లేకపోగా 2018లో నాటి ప్రభుత్వం మరికొన్ని ప్రాంతాలను నివేధిత జాబితాలో చేర్చింది. దీంతో ఆస్తులున్నా అనుభవించలేని దయనీయ స్థితిలో నగర ప్రజలు దశాబ్దాలుగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి చొరవతో నిషేధిత జాబితాలోని 5,341 కుటుంబాలకు చెందిన భూములకు విముక్తి కల్పించారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రమబద్ధీకరణ ఆర్డర్ కాపీలను శివజ్యోతి నగర్ వాసులకు పంపిణీ చేశారు. దీంతో శివజ్యోతి నగర్, అయ్యప్పకాలనీ, ఎర్రకమిట్ట ప్రాంతాల్లోని 750 మందికి ఉపశమనం కలిగింది. ప్రస్తుతం మరోసారి 22ఏలోని నిషేధిత భూములకు మోక్షం లభించింది. తద్వారా సుమారు 10 వేల మందికి పైగా లబ్ధి పొందనున్నారు. ఈ జాబితా నుంచి విముక్తి పొందిన నగర ప్రజలకు బుధవారం పట్టాభిషేకం చేయనున్నారు. 50 ఏళ్లుగా నరకం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో భూములను 50 ఏళ్ల కిత్రమే 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీంతో ఆ భూములు క్రయవిక్రయాలకు నోచుకోలేదు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వారు 22ఏ నిబంధన విషయాన్ని పలుసార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి నిషేధిత జాబితా నుంచి ఆ భూములకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నగరవాసుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆ పాపంలో బాబూ భాగస్వామే తిరుపతిలోని 2,300 ఎకరాలకు సంబంధించిన భూములపై నాటి చంద్రబాబు ప్రభుత్వం 2018లో 22ఏ నిబంధన అస్త్రాన్ని ప్రయోగించింది. తప్పుల తడక కారణంగా ప్రభుత్వ, చుక్కల, దేవదాయ, మఠం భూములతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని భూములను ఆ జాబితాలో చేర్చింది. దీంతో గందరగోళం నెలకొనింది. ఆ పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎవరు ఎప్పుడు ఇచ్చిన జీఓ కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయో ఆధారాలసహా వివరించడంతో ప్రతిపక్ష పార్టీలు చేసేదిలేక ఆ పాపం తమ నాయకుడిదేనని తలవంచక తప్పలేదు. 104 ఎకరాలకు విముక్తి 104 ఎకరాలకు సంబంధించిన భూములు 22ఏ నిషేదిత జాబితా నుంచి విముక్తి పొందాయి. విముక్తి పొందిన ప్రాంతాల్లో తంబవాణిగుంట, కొర్లగుంట, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీ, నవోదయకాలనీ, ఎరుకుల కాలనీ, మారుతీనగర్, పూలవానిగుంట, ఆటోనగర్, అంబేడ్కర్‌కాలనీ, గొల్లవానిగుంట, బొమ్మగుంట, సూరయ్యకట్ట, ఎల్బీనగర్, సత్యనారాయణపురం, శ్రీకృష్ణనగర్, గాయత్రీనగర్, సుందరయ్యనగర్, సింగాలగుంట, రెడ్డిగుంట, తాతయ్యగుంట తదితర ప్రాంతాలు ఉన్నాయి. ప్రజలకు ఎంత చేయాలో అంతాచేస్తాం ప్రజా సమస్యలు, వినతులు, ఇబ్బందులు ఏవైనా నా వద్దకు వస్తే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ముందుంటాను. 22ఏ గుదిబండపై వచ్చిన అన్ని వినతులను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని భూములకు నిషేధం నుంచి విముక్తి కల్పించాం. రాబోవు రోజుల్లో మరిన్ని భూములకు ఆ నిబంధన నుంచి ఉపశమనం కల్పిస్తాం. ప్రజలకు ఎంత చేయాలో అంతా చేస్తాం. 10 వేల మందికి లబ్ధి చేకూర్చే ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం నగరంలో ఎన్నో ఏళ్లుగా భూసమస్యకు ఏ ఒక్కరూ పరిష్కారం చూపకపోగా 2018లో దాదాపు 2,300 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల పాపం మూటకట్టుకున్నారు. ఆస్తులున్నా వాటిని అనుభవించలేని దుస్థితికి కారకులయ్యారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎంతో చర్చించి పరిష్కార మార్గాన్ని సాధించారు. వేలాది కుటుంబాలలో వెలుగులు నింపారు. రాబోవు రోజుల్లో తిరుపతి నగరం మరింత మంచిని చూడబోతోంది. –భూమన అభినయ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, తిరుపతి నేడు ఆర్డర్ కాపీల పంపిణీ 22ఏ జాబితాలోని 104 ఎకరాల భూములపై నిషేధం తొలగింపునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను బుధవారం సాయంత్రం 4 గంటలకు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నారు. భూమన కృషి అమోఘం నగరంలోని 22ఏ నిషేధిత భూములకు విముక్తి కల్పించేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరి కృషిని నగరవాసులు కొనియాడుతున్నారు. -
చంద్రబాబు, పవన్ కు షాక్ ఇచ్చిన నేతలు
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించనున్న ఎమ్మెల్యే భూమన
-
తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. -
‘సీమ’ గుండె చప్పుడిది
వికేంద్రీకరణకు మద్దతు దిశగా యావత్ రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తోంది. మొన్న విశాఖ దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తే, ఇప్పుడు తిరుపతి జనసంద్రంగా మారి కదంతొక్కింది. రాయలసీమ గుండె చప్పుడు ప్రతిధ్వనించింది. పదులు.. వందలు కాదు.. వేలాది మంది ఆధ్యాత్మిక నగరిలో మూడు రాజధానులకు మద్దతుగా పెద్ద పెట్టున నినదించారు. మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ఒక్కరేంటి, అన్ని వర్గాల వారు రోడ్డుపైకి వచ్చి తమ ఆకాంక్షను బలంగా చాటారు. ‘సీఎం జగనన్న వికేంద్రీకరణ బాటలో నడుద్దాం.. న్యాయ రాజధాని సాధిద్దాం.. మన ఆత్మగౌరవం కాపాడుకుందాం.. స్వార్థ రాజకీయాలకు చరమగీతం పాడుదాం..’ అంటూ ప్రతినబూనారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఇటు రాయలసీమకు, అటు ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలి. అది ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు. రాయలసీమను రతనాల సీమగా మార్చే సత్తా సీఎం వైఎస్ జగన్‌కు మాత్రమే ఉంది. మనం కొంత కాలంగా పోగొట్టుకున్న దానిలో కొంతైనా తిరిగి ఇవ్వాలని కోరడం కోసమే ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన. ఇది రాయలసీమ గుండె చప్పుడు’ అని వికేంద్రీకరణను కాంక్షిస్తూ వేలాది మంది ప్రజలు నినదించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా.. రాయలసీమ హక్కులు, కర్నూలులో న్యాయ రాజధాని సాధనే లక్ష్యంగా సాగిన ఈ మహా ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది. తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన గాంధీ రోడ్డు మీదుగా నాలుగు కాళ్ల మండపం, తిలక్ రోడ్డు, తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకు సాగింది. తిరుపతి నగరంలోని ప్రతి గడప నుంచి ప్రజలు తరలి వచ్చారు. స్థానికులు, మేధావులు, న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ కళాశాలల విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల రాకతో నగరం జనసంద్రంగా మారింది. ప్ల కార్డులు చేతబట్టి.. ‘కర్నూలును న్యాయ రాజధాని చేయాలి’ అని కొందరు, జై జగన్ అంటూ మరి కొందరు.. పదండి ముందుకు మూడు రాజధానుల కోసం’ అంటూ ఇంకొందరు నినదిస్తూ ముందుకు సాగారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. దారి పొడవునా ప్రజలు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గాందీరోడ్డులో సాగుతున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన తిరుపతి వేదికగా సీమ రాజధానికి విత్తనం తిరుపతి వేదికగా రాయలసీమ రాజధానికి విత్తనం నాటాం. మిగిలిన జిల్లాల వారూ నీరు పోస్తారు. తద్వారా రాజధాని మొక్క మహావృక్షమై కల సాకరమవుతుంది. సీఎం వైఎస్ జగన్ పాలన పట్ల, నిర్ణయం పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందనేందుకు ఈ మహా ప్రదర్శనే నిదర్శనం. తిరుపతి చరిత్రలో మునుపెన్నడూ రానంతగా జనం ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శనలో పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడం సీఎం జగన్‌కే సాధ్యం అని సీమ ప్రజలు నమ్ముతున్నారు. 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాష్ట్రానికి, రాయలసీమకు చేసింది శూన్యం. సీమ గడ్డమీద పుట్టిన చంద్రబాబు సీమకే ద్రోహం చేశారు. ఈ రోజు సీమ ప్రజలు నీరు తాగుతున్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల దిశగా ముందుకు వెళ్తున్నారు. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం లక్ష్యం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాయలసీమ మనోభావాలను గౌరవిస్తూ న్యాయ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దాన్ని వ్యతిరేకిస్తూ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే ప్రాంతంలో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించాలనుకోవటం దుర్మార్గం. లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో ఖర్చు చేసి, తన అనుయాయుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కొమ్ముకాసే విధంగా రాయలసీమలోని పుట్టి పెరిగిన చంద్రబాబు వ్యవహరించటం శోచనీయం. దుష్టచతుష్టయం సహకారంతో రాష్ట్ర ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటుతున్న చంద్రబాబుకు, ఆయన కోటరీకి ఈ ఆత్మగౌరవ మహా ప్రదర్శన చెంపపెట్టు. మన పిల్లల ఉద్యోగ, ఉపాధి కోసం సీఎం జగన్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఐటీ కాన్సెప్ట్ సిటీని నిర్మించనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి దిశగా 7 సెజ్‌లు నిర్మిస్తున్నారు. – మద్దెల గురుమూర్తి, తిరుపతి ఎంపీ సీమ ఆకాంక్షకు ఈ ప్రదర్శనే సాక్ష్యం రాయలసీమకు న్యాయ రాజధాని కావాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. అందుకు ఈ ఒక్క నగరంలో ఈ మహా ప్రదర్శనే సాక్ష్యం. అమరావతి యజమానుల వద్ద బానిసలుగా ఉన్న తిరుపతిలోని కొందరు రాయలసీమ ఆకాంక్షను గుర్తించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలియజెప్పాలి. ఇక్కడికి వచ్చిన ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే. తిరుపతిలో శుక్రవారం సమావేశమైంది అఖిలపక్షం కాదు.. ఆ పేరుతో 2024లో పోటీ చేయనున్న మిత్రపక్షాలు. ఈ ప్రాంత వాసులై ఉండీ, ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా పావులు కదపడం సిగ్గుచేటు. ముసుగు తీసి బయటకు వచ్చి, మా అజెండా ఇదీ అని చెప్పుకునే ధైర్యం లేని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – మాకిరెడ్డి పురుషోత్తంరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 85 ఏళ్ల క్రితం రాయలసీమకు కృష్ణా, గోదావరి జలాల్లో అధిక వాటా ఇస్తామని చెప్పి, ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. రాయలసీమ ప్రజల గొంతు ఎండిపోకుండా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. – శైలుకుమార్, మానవ వికాస వేదిక కన్వీనర్ -
వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన పూజలు
-
2016 నుంచి 2019 వరకు పెద్ద కుట్ర జరిగింది: భూమన
సాక్షి, అమరావతి: టీడీపీకి అడ్డదారిలో రాజకీయ లబ్ధి కలిగించేందుకు 2016–2019లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి పాల్పడ్డారని డేటా చోరీ అంశంపై విచారణకు శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆనాటి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ల డైరెక్షన్లోనే డేటా చోరీ జరిగినట్లు ఉపసంఘం విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే నివేదికను శాసనసభకు సమర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శాసనసభ సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో శాసనసభా ఉపసంఘం వరుసగా రెండో రోజు బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలన్నీ అత్యంత గోప్యమైనవని అధికారులు సభా సంఘానికి తెలిపారు. అటువంటి వివరాలు ‘సేవా మిత్ర’ అనే యాప్ నిర్వహించిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి చేరడం అంటే ప్రభుత్వ పెద్దల ద్వారానే జరుగుతుందని అప్పటి ఐటీ, ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు వివరించినట్టు సమాచారం. చదవండి: (అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్ ప్రభాకర్) సమావేశం అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ప్రజల భద్రత, వ్యక్తిగత గోప్యత హక్కులకు భంగకరంగా వ్యవహరించిందన్నారు. ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన వివరాలను టీడీపీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన సేవా మిత్ర యాప్‌తో అనుసంధానించారన్నారు. తద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర పన్నినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఓటర్ల తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నిందని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ఈ వ్యవహారాన్ని గుర్తించి టీడీపీ కుట్రను అడ్డుకుందన్నారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం టీడీపీకి చెందిన యాప్ నిర్వాహకులకు చేరడం వెనుక చంద్రబాబు, లోకేశ్‌ల హస్తం ఉందన్నారు. ఆ స్థాయి పెద్దల పాత్రతోనే అంతటి గోప్యమైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తమకు వివరించారని భూమన తెలిపారు. గురువారం మరోసారి అధికారులతో సమావేశమైన అనంతరం తమ నివేదికను శాసనసభకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహనరావు, మద్దాల గిరి తదితరులు పాల్గొన్నారు. -
డేటా చోరీ బాధ్యులను విచారణకు పిలిపిస్తాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి బాధ్యులైనవారిని విచారణకు పిలిపిస్తామని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటుచేసిన శాసనసభ ఉపసంఘం హోం, ఐటీ శాఖలతోపాటు ఇతర అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత డేటా, ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడంపై వివరాలు సేకరించింది. గత సమావేశంలో ఉపసంఘం అడిగిన వివరాలను హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు సమర్పించినట్టు తెలుస్తోంది. అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. దీంతో ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లే ఉంచి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా యత్నించారని చెప్పారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ప్రజల వ్యక్తిగత డేటా దొంగిలించి అడ్డదారుల్లో రాజకీయ లబ్ధిపొందేందుకు కుట్రపన్నారని చెప్పారు. ఈ అంశంపై శాసనసభ ఉపసంఘం సమగ్రంగా విచారిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కోటారు అబ్బయ్యచౌదరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పెగాసస్ బండారం బయట పెడతాం: భూమన కరుణాకర్‌రెడ్డి
-
AP: భూమన నేతృత్వంలో పెగాసస్‌పై హౌస్ కమిటీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీచేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్రావు, మద్దాళి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ (చంద్రబాబు) ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభాసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసింది. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతాం. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తాం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు కూడా ఒక అంశం. చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని ఎత్తి చూపుతాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేశామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చదవండి: (గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ) -
విష ప్రచారాలు మానుకోండి: భూమన కరుణాకర్ రెడ్డి
-
కెడాయ్కి సంపూర్ణ సహకారం
తిరుపతి మంగళం: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)కి తన వంతు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్లో ఆదివారం క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2022 బ్రోచర్‌ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన సంస్థగా క్రెడాయ్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో జరిగే క్రెడాయ్ కార్యక్రమాలకు దేశ ప్రధాని, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, ప్రాంతీయ స్థాయిల్లో జరిగే కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో ఎదురవుతున్న నష్టాలను నివారించడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ ప్రతినిధులు రాంప్రసాద్, రాజేష్‌గుప్తా, రాజేష్‌బాబు, ప్రభాకర్, రాజశేఖర్‌రావు, వివిధ బ్యాంకుల అధికారులు, బిల్డర్లు పాల్గొన్నారు. -
తిరుపతి : YSRCP ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన
-
భూమనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు
తిరుపతి తుడా (చిత్తూరు జిల్లా): తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన 21 మృతదేహాలను బంధువులు ఆస్పత్రిలో విడిచిపెట్టి వెళ్లగా, రుయా మార్చురీలో ఉన్న అనాథ మృతదేహాలకు బుధవారం ఎమ్మెల్యే ముందుకొచ్చి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గత ఏడాది ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తిరుపతిలో తొలిసారి కరోనా మృతదేహాలకు ఎమ్మెల్యే భూమన దగ్గరుండి చివరితంతును నిర్వహించారు. మరోసారి ఇప్పుడు 21 మృతదేహాలకు సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను మహాప్రస్థానం వాహనంలోకి నేరుగా ఆయనే ఎక్కించారు. కరోనాబారిన పడిన మృతదేహాలకు ఏడాది నుంచి కోవిడ్–19 తిరుపతి ముస్లిం జేఏసీ నాయకులు తమ సొంత ఖర్చులతో అంతిమసంస్కారాలను నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన చివరితంతు నిర్వహించారు. భూమనకు పీఎంవో అభినందనలు ఎమ్మెల్యేకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అభినందనలు వచ్చాయి. ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా బుధవారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో అభినందనలు తెలిపారు. తిరుపతిలో కరోనా బారినపడి మృతిచెందిన పార్ధివదేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం అందరికీ ఆదర్శమని ఆయనను కొనియాడారు. చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై! -
సీఎం జగన్ రాక తో బాబు వెన్నులో వణుకు పుడుతోంది : భూమన
-
ఎమ్మెల్యే భూమనకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రెండవసారి కరోనా సోకి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందతున్న భూమనకు శనివారం ఉదయం ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమనకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. రెండవసారి కరోనా సోకిన నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చిన సంగతి తెలిసిందే. (ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా) -
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్ కుమార్
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్పీ భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. అనంతరం సాక్షితో మాట్లాడుతూ.. 'నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాము. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. (గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత) ఆయన నెల్లూరు వాసి కావడం నెల్లూరు వ్యక్తిగా గర్వపడుతున్నాం. అన్ని భాషలలో అన్నివేల పాటలు పాడిన వ్యక్తి ఎవరూ లేరు, ఇక ఉండబోరు. బాలు కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పించాము' అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలు కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. (బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..) కాగా.. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎస్పీబీ భౌతిక కాయాన్ని ఫామ్‌హౌస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గాన గంధర్వుడు బాలును చివరిసారిగా చూసేందుకు అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలు తరలి వస్తున్నారు. శనివారం ఫామ్‌హౌస్‌లోనే ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఎస్పీ బాలు కోలుకోవాలని భూమన పూజలు
సాక్షి, తిరుపతి : సంగీత దిగ్గజం ఎస్సీ బాల సుబ్రమణ్యం కరోనా వైరస్ బారినుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి గురువారం పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల సుబ్రమణ్యం దేశంలోనే గొప్ప గాయకుడని ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గాయకుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎస్పీ బాల సుబ్రమణ్యానికి టీటీడీతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ( ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి ) కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కోలుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.