
వైఎస్ జగన్‌తో భూమన కరుణాకర్ రెడ్డి
60 లక్షలకు పైగా నిరుద్యోగులుంటే 10 లక్షల మందికి మాత్రమే భృతి అని ముందే కోతలు పెట్టి..
సాక్షి, విజయనగరం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేస్తం పేరుతో మరోసారి యువతను దగా చేశారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..42 లక్షల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేస్తే 2 లక్షల 10 వేల మందికి మాత్రమే ఇవ్వడం పచ్చి మోసం అన్నారు.
60 లక్షలకు పైగా నిరుద్యోగులుంటే 10 లక్షల మందికి మాత్రమే భృతి అని ముందే కోతలు పెట్టి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ఉద్యోగాల భర్తీని గాలికి వదిలేశారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి వల్ల దగా పడ్డ యువత అంతా వైఎస్ జగన్ వెంట నడిచి ఈ ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నారని వ్యాఖ్యానించారు.