సాక్షి, విజయనగరం: జిల్లాలో డయేరియా తీవ్రత తగ్గడం లేదు. ఇవాళ మరో ఇద్దరు డయేరియా బారినపడ్డారు. ఆసుపత్రిలోనే ఇంకా 145 మంది బాధితులు ఉన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. గుర్లలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలతో గుర్ల వైద్య శిబిరంలో 3 బెడ్లను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం ఖాళీ చేసి రోగులు లేరంటూ అధికారులు చూపిస్తున్నారు.
డయేరియా బాధితులను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడూతూ, డయేరియాతో జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వాన్నం గా ఉంది. తాగునీరు సరఫరా బాగులేకే డయేరియా వ్యాప్తి అయింది’’ అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
Comments
Please login to add a commentAdd a comment