సాక్షి, తిరుపతి: యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా బయటికి వచ్చి ఓ బలమైన నాయకుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదిగారని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు వస్తాయని, రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ.. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం తప్పన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుగు భాషా అభివృద్ధి చెందాలంటే భూమన తప్పకుండా గెలవాలన్నారు.
బలమైన నాయకుడికి మద్దతు తెలపడానికే తిరుపతి వచ్చినట్టు తెలిపారు. భాష విషయంలో రాష్ట్రం బలహీనపడిపోయిందని, తెలుగుదేశం కాస్తా.. తెలుగులేశంగా మారిందని చెప్పారు. టీడీపీ పాలనలో ఇసుక, మట్టి మాఫీయా సృతిమించిపోయాయని, వైఎస్సార్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తనలాంటి రచయితలకు, భక్తులకు మంచి నాయకుడి కావాలని, అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగాప్రతి రాష్ట్రంలో వారి సొంత భాషను అభివృద్ధి చేసుకుంటుంటే ఏపీలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ పుష్కరిణిలో చేపల పెంపకం జరడం దారుణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment