Jonnavithula Ramalingeswara rao
-
ఎన్నో పాటలు రాశా, కానీ ఒక్క అవార్డు రాలేదు: జొన్నవిత్తుల
భక్తి పాటలు రాయడంలో ఘనుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అంతేనా సందర్భం ఏదైనా సరే దానిమీద అప్పటికప్పుడు పేరడీ పాట రాసి వినిపించగలడు. అంతటి గొప్ప టాలెంట్ ఆయన సొంతం. కానీ ఇంతవరకు తననెవరూ పురస్కారంతో సత్కరించలేదంటున్నాడు జొన్నవిత్తుల. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'వేటూరి, సిరివెన్నెల సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాకో సినిమా ఇచ్చి మొత్తం పాటలు నన్నే రాయమన్నారు. అదే ఆయన నాకు చేసిన మహా ఉపకారం. దేవుడి పాటలు ఎక్కువ రాసే నేను విక్రమార్కుడిలో జింతాత్త జిత్త జిత్త పాట రాశాను. తిట్ల మీద కూడా పాట రాశాను. నేను ఎన్నో పాటలు రాశాను. ప్రతి ఛానల్లో, ప్రతి గుడిలో అందరి బంధువయ, జగదానందకార, మహా కనకదుర్గ.. విజయ కనకదుర్గ, జయజయ శుభకర వినాయక, అయ్యప్ప దేవాయ నమహ.. వంటి ఎన్నో సాంగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. అది నాకు చాలా సంతోషం, కానీ నాకింతవరకు ఏ అవార్డూ రాలేదు' అని చెప్పుకొచ్చాడు జొన్నవిత్తుల. చదవండి: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన డైరెక్టర్ నేను మారిపోయాను, చాలా సంతోషంగా ఉన్నా: నాగచైతన్య -
డాలస్‌లో యజ్ఞేశ్వర శతక పద్యగాన మహోత్సవం
డాలస్ (టెక్సాస్): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లు సంయుక్తంగా యజ్ఞేశ్వర శతకము పద్యగాన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాయి. డాలస్ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో నగరంలో నెలకొనిఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి. డాలాస్-ఫోర్ట్ వర్త్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం పలికి, తానా మరియు టాంటెక్స్ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని, అందరూ తానా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సభాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. జొన్నవిత్తుల మంచి ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో రాశారని, సాధారణంగా సినీగీత రచయితలు సినీ రంగానికే పరిమితం అవుతారని కాని కవి జొన్నవిత్తుల అనేక సామాజిక స్పృహకలిగిన పేరడీలు, దండకాలు, దాదాపు 30 శతకాలను రాశారన్నారు. తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సకల దేవతా మూర్తులు కొలువైనటువంటి పవిత్ర కార్య సిద్ది హనుమాన్ దేవాలయంలో తనకు దైవదర్శనం ఒక దివ్యమైన అనుభూతినిచ్చింది అని, ప్రకాశరావు గారు హిందూ మతం, ధర్మం కోసం చేస్తున్న కృషి, తపన చాలా గొప్పవని అభినందించారు. జొన్నవిత్తులని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక అందించారు. అదే విధంగా 21వ శతాబ్దపు శతక సార్వభౌమ అనే బిరుదుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ పుదూర్ జగదీశ్వరన్, శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సతీష్ బండారు, భానుమతి ఇవటూరి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, వెంకట్ ములుకుట్ల, లోకేష్ నాయుడు కొణిదల, ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, ప్రకాశరావు వెలగపూడి, లెనిన్ వీర, విజయ్ కొల్లపనేని, కృష్ణమోహన్ రెడ్డి, వెంకట్, డా. రతీరెడ్డి, సాగర్ అండవోలు, చంద్రహాస్ మద్దుకూరి, పాలేటి లక్ష్మి, కళ్యాణి తాడిమేటి తో సహా ఎంతో మంది భాషాభీమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, సభ విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. చదవండి: డాలస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు..
ప్రముఖ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. ఆయనతో తమ అనుబంధాన్ని రచయితలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పంచుకున్నారు. బుల్లబ్బాయ్ నా తోడబుట్టని తమ్ముడు 34 ఏళ్ల పరిచయంలో ఏనాడూ మేం రైటర్స్లా మాట్లాడుకోలేదు. నన్ను ఒక్కరోజు కూడా పేరు పెట్టి పిలవలేదు. నన్ను ‘అన్నయ్యా’ అంటే నేను ‘బుల్లబ్బాయ్’ అనేవాణ్ణి. నిన్న (సోమవారం)నే మాట్లాడుకున్నాం. ‘ఈ ఏడాది ఇంకా కలుసుకోలేదు, కలుద్దాం అన్నయ్యా’ అన్నాడు. సరే అన్నాను. ఇలా కలుసుకున్నాను తమ్ముణ్ణి. మనిషి లేడని ఊహకు కూడా అందటం లేదు. ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడో తెలిస్తే బావుండు.. ఆ పేరుతో పిలుస్తాను. మనిషి చక్కగా నిద్రపోతున్నాడు. వెన్నెలకంటి అంటే వస్తాడా, బుల్లబ్బాయ్ అంటే వస్తాడా... ఎలా పిలిచినా రాకుండా అందనంత దూరం వెళ్లిపోయాడు. ‘ఈ రోజు వెళ్లిపోతున్నాను’ అన్నట్లుగా చూస్తున్నాడు. ఎవరైనా కొంతకాలానికి వెళ్లవలసిన వాళ్లమే అని తెలుసు కానీ, ఎందుకో అంతా శూన్యంలా ఉంది. కన్నతల్లి కడుపునుండి నేలతల్లి వొళ్లోకొచ్చి ఆట, పాటలాడి ఎన్నో బంధాలను పేర్చుకుని చేసే ప్రయాణమే కదా జీవితం. మళ్లీ నేలతల్లిని ముద్దాడాడు తమ్ముడు. ఈ ఇద్దరమ్మల ప్రయాణంలో తన శరీరానికి పెట్టుకున్న పేరు ‘వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్’. ఇక లేడు అనే వార్త కలా? నిజమా? అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏ సభకెళ్లినా, సన్మానాలకెళ్లినా, ఆంధ్రా క్లబ్లో పురస్కారాలకెళ్లినా అందరూ మమ్మల్ని అన్నతమ్ములొచ్చారు అనేవాళ్లు. ‘అన్నయ్యా.. మనిద్దరం నెల్లూరు వెళుతున్నాం. అక్కడ సభ ఉంది. మనిద్దరి పేరు ఇచ్చేశాను’ అనేవాడు. తిరిగొచ్చేటప్పుడు మా కబుర్లు ప్రపంచమంతా తిరిగేవి. మా రెండు గొంతుల్లో ఒక గొంతు మూగబోయింది, మరో గొంతు పక్కన నిలబడి మౌనంగా రోదిస్తోంది. ఆయన పేరు, కీర్తి ప్రతిష్టలు.. అన్నింటినీ ఇక్కడే వదిలి ఈ రోజు నింగిలో కలిసిపోయాడు. పదివేల కోట్లున్నా ఏం చేసుకుంటాం? అనుభవించటానికి పక్కన సరైన మనిషి కావాలి కానీ.. ఆయన కోప్పడటం నేను చూడలేదు, ఏ సభలోనైనా అందరినీ గలగలా నవ్విస్తాడు. ప్రతిరోజూ నవ్వించే ఆ మనిషి ఈ రోజు ఏడిపిస్తున్నాడు (ఏడుస్తూ). మనసులో ఏదో తెలియని వెలితి. ‘ఐ మిస్ యు ఫర్ ఎవర్.. బుల్లబ్బాయ్’. – రచయిత భువనచంద్ర నలుగురం ఒక్కసారే వచ్చాం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు 1985లో, నేను 1986 సెప్టెంబర్‌లో, 1987 జనవరి 1న భువనచంద్ర వచ్చాం. వెన్నెలకంటి కూడా అప్పుడే పరిశ్రమలోకొచ్చారు. దాదాపు నలుగురం ఒకేసారి ఏడాది వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు వచ్చాం. వెన్నెలకంటి నాకు అత్యంత ఆత్మీయుడు. మాతో పాటు మా కుటుంబాలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. వెన్నెలకంటి చనిపోయిన విషయం తెలియగానే ఆయన శ్రీమతితో మాట్లాడాను. మాట్లాడుతూనే గుండెపోటుతో పోయారట, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేదని చెప్పారామె. డబ్బింగ్ చిత్రాల్లో వండర్స్ క్రియేట్ చేసింది వెన్నెలకంటిగారే. పద్యకవిగా, పాటల కవిగా ప్రసిద్ధి చెందారు. ఆయనతో నాకు ఎన్నో మరపురాని సంఘటనలు ఉన్నాయి. ‘మైనే ప్యార్ కియా’ డబ్బింగ్ చిత్రానికి ఈయన రాసిన మాటలకు ముగ్ధుడైన ఆ హిందీ చిత్ర నిర్మాత తారాచంద్ బర్జాత్యా ఈయనకు పాదాభివందనం చేయటం నాకింకా గుర్తుంది. ఏదేమైనా ఈ రోజు అత్యంత ఆత్మీయుడిని కోల్పోవటం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు -
మర్రిచెట్టు కింద పాట
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్‌గోపాల్‌వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
‘జొన్నవిత్తుల’పై కేసు నమోదు
నాంపల్లి: సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంటరానితనాన్ని పునరుద్ధరణ చేసే విధంగా బ్రహ్మణ సమాజాన్ని పురమాయించేలా తెలుగులో పద్యం రాశారంటూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతని రచనలు ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. జొన్నవిత్తుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.(ఆర్జీవీ... ఓ రామబాణం) -
ఆర్జీవీ... ఓ రామబాణం
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆర్జీవీ’. ‘కార్తికేయ’ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీకార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మించనున్నారు. నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్జీవీ’ చిత్రం టైటిల్ లోగో విడుదల చేసి, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా. అందుకే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్ లోగో విడుదల చేశాం’’ అన్నారు. ‘‘కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు వెంకట శ్రీనివాస్ బొగ్గరం. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు
తన రూటే సెపరేటు, మోనార్క్-ఎవ్వరి మాటా వినడు.. ఇలాంటి డైలాగ్స్ అన్నింటికీ సరిగ్గా సరిపోయే వ్యక్తి రాంగోపాల్ వర్మ. తను తీసే చిత్రాలు హిట్టా, ఫట్టా అని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుపోతుంటాడు. ఇలాంటి సంచలన దర్శకుడికి, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు ఈ మధ్య పడటం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు మాటల కత్తులు విసురుకుంటున్నారు. "అమ్మరాజ్యంలో కడప బిడ్డలు" చిత్ర రిలీజ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సినిమాను జొన్నవిత్తుల విమర్శించగా ఆర్జీవీ వెనకేసుకొచ్చాడు. (హాలీవుడ్ స్టార్ మాట కాదంటున్న కూతురు) అలా వీళ్లిద్దరికీ అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ తగాదా తారా స్థాయికి చేరుకోగా ఆర్జీవీపై బయోపిక్ తీస్తానని జొన్నవిత్తుల ప్రకటించాడు. చెప్పిన మాట ప్రకారం బుధవారం టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇందులో "రోజూ గిల్లే వాడు(ఆర్జీవీ)" అనే పేరు కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ సరిగ్గానే సరిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినికార్ప్ సమర్పణలో కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడు. (ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!) -
పిచ్చెక్కించే వినోదం
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా మారారు. ఆయన తెరకెక్కించనున్న ‘ఆర్జీవీ’ అనే చిత్రం హైరదాబాద్‌లో ప్రారంభమైంది. ‘కార్తికేయ’ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ– ‘‘ఒక విద్యావేత్తగా పాఠాలు చెప్పి మంచిని బోధించే వృత్తిలో ఉన్న నాకు, జొన్నవిత్తుల గారు చెప్పిన కథ నచ్చడంతో సామాజిక బాధ్యతగా ఈ సినిమా నిర్మిస్తున్నా. ఇదొక మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో కొందరు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించారు. దీని వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో పిచ్చెక్కించే వినోదం ఉంటుంది. ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మార్చి మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!
డల్లాస్ (టెక్సస్) : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'ఆహా! ఈహీ! ఒహో!' అనే తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని జూలై 21న డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు దాదాపు 200 మందికి పైగా సాహితీ ప్రియులు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సభను ఉత్సాహంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి తానాబోర్డు కార్యదర్శి మురళి వెన్నం సాదర స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన తానా సభ్యులను సభకు పరిచయం చేస్తూ, భావసారుప్యం ఉన్నజాతీయ, స్థానిక సంస్థలతో కలసి తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగాటాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగాఉందని, తానాకి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరకి అభినందనలు తెలియజేశారు. 'సాహితీ వేముల', 'సింధూర వేములలు','మా తెలుగు తల్లికి మల్లె పూదండ', 'ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట' అనే గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా మరియు టాంటెక్స్ సంస్థల పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారినిసభకు పరిచేయం చేస్తూ.. శ్రీ శ్రీ, దాశరథి, వేటూరి, పురాణం సుభ్రమణ్యం శర్మ, డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి లబ్ధ ప్రతిష్టులతో ఎంతో ఆత్మీయంగా మెలిగిన శ్రీ జొన్నవిత్తులగారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తానాకార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు జొన్నవిత్తుల గారిని పుష్పగుచ్చంతో వేదికపైకి ఆహ్వానం పలికినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి. నాలుగు భాగాలుగా చతుర్ముక పారాయణం మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. శ్రీ జొన్నవిత్తుల గారితో వినూత్నంగా మొదటిసారి చమత్కార చతుర్ముఖ పారాయణం అనేనాలుగు ప్రక్రియలున్న సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చతుర్ముఖ పారాయణంలో సినీ సాహిత్యం, తెలుగు భాషా వైభవం,పురాణాల ప్రాశస్త్యం, పేరడీ పాటలు అనే నాలుగు విభాగాలుగా విభజించి ఒక కొత్త తరహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూర గారితో తనకున్న ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలుగు భాషా ప్రియత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రసాద్‌గారి ప్రేమను కొనియాగారు. ఇది తన 17వ అమెరికా పర్యటన అని తానా, టాంటెక్స్ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జొన్నవిత్తుల గారితో ప్రసాద్ తోటకూర ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో కవి జొన్నవిత్తుల తాను రాసిన పాటలు అనేక సినిమాలలో వినూత్న ప్రయోగాలుగా ఉండి అత్యంత ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. ఒక డిస్కో పాటని పూర్తిగా సంస్కృతంలో రాయడం, కేవలం 'సరిగమపదని' అనే సప్త అక్షరాలతో పాట రాయడం, 'చినుకు చినుకు అందెలతో', 'జగదానంద కారకా', 'ఓ వాలు జడా, పూలజడా' వంటి పాటల నేపధ్యం గురించి అడిగినప్పుడు, అదంతా దర్శక, నిర్మాతలు తనికిచ్చిన అవకాశం అని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల గారు డా. మంగళంపల్లి బాలమురళి, బాపు, రమణ, వేటూరి గార్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాంటి గొప్ప పండితులతో, మేధావులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతం అని తెలిపారు. తర్వాత కనక దుర్గమ్మవారి రూపంలోని అక్షరమాలను, అక్షరమాలలో ఉన్న సకల సంగీత వాయిద్య పరికరాలను దర్శిస్తూ తెలుగు భాషా వైభవాన్ని జొన్నవిత్తుల పాడి వినిపించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కోనసీమ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామలింగేశ్వర శతకాల్లో నుoచి ఎన్నో పద్యాలను పాడి సభికులను ఆనందపరవశంలో ముంచెత్తారు. అదే విధంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో రాజకీయ పార్టీల గందరగోళం, యధేచ్చగా పార్టీలు మారడం, ఎన్నికల వాగ్ధానాలు, మద్యపానం, అవినీతి, స్కీములు, స్కాములు లాంటి అంశాలను కథా వస్తువుల ఆధారంగా శ్రీ జొన్నవిత్తుల పేరడీలు సృష్టించడంతో సభలో మొత్తం కేరింతలు, ఈలలతో నిండిపోయింది. ఈ సందర్భంగా శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపికను బహుకరించి "అభినవ చమత్కార కవిసార్వభౌమ" అనే బిరుదుతో సత్కరించారు. సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారు శ్రీ జొన్నవిత్తులగారిని, వారి కవితా చాతుర్యాన్ని కొనియాడారు. డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారిని సభ నిర్వాహకులు గౌరవపూర్వకంగా శాలువాతో సత్కరించారు.కార్యక్రమం చివర్లో తానా పూర్వాధ్యక్షులైన డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తానా జాతీయస్థాయిలో తెలుగు వారందరికి మాతృ సంస్థ అని, గతంలో తానా, టాంటెక్స్ కలసి ఇక ముందు కూడా కలిసి పని చేస్తూ, పరస్పర సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. గాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించిన జొన్నవిత్తుల ఈ సాహితీ సమావేశం తర్వాత డా. ప్రసాద్ తోటకూరతో కలసి జొన్నవిత్తుల అమెరికాలోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి అని, ఈ స్మారక నిర్మాణం వెనుక డా. తోటకూర ప్రసాద్ గారి కృషి, పట్టుదల, అకుంటిత దీక్షను కొనియాడదగినదని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు. -
‘వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం’
సాక్షి, తిరుపతి: యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి వ్యతిరేకంగా బయటికి వచ్చి ఓ బలమైన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదిగారని ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సమూలమైన మార్పులు వస్తాయని, రాష్ట్రం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ.. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వస్తే రౌడీయిజం పెరుగుతుందని చెప్పడం తప్పన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుగు భాషా అభివృద్ధి చెందాలంటే భూమన తప్పకుండా గెలవాలన్నారు. బలమైన నాయకుడికి మద్దతు తెలపడానికే తిరుపతి వచ్చినట్టు తెలిపారు. భాష విషయంలో రాష్ట్రం బలహీనపడిపోయిందని, తెలుగుదేశం కాస్తా.. తెలుగులేశంగా మారిందని చెప్పారు. టీడీపీ పాలనలో ఇసుక, మట్టి మాఫీయా సృతిమించిపోయాయని, వైఎస్సార్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తనలాంటి రచయితలకు, భక్తులకు మంచి నాయకుడి కావాలని, అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగాప్రతి రాష్ట్రంలో వారి సొంత భాషను అభివృద్ధి చేసుకుంటుంటే ఏపీలో మాత్రం అశ్రద్ధ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయ పుష్కరిణిలో చేపల పెంపకం జరడం దారుణమన్నారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘ఐడియల్’
జిన్నూరు (పోడూరు) : స్థానిక ఐడియల్ స్కూల్ విద్యార్థులు 14 మంది ‘తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించారు. సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ‘నైమిశ వేంకటేశ శతకం’లోని 108 పద్యాలను 1,850 మంది ఏకకాలంలో ఏక కంఠంతో గానం చేసిన శతకధారణ కార్యక్రమం ద్వారా తమ విద్యార్థులు ఈ ఘనత సాధించినట్టు కరస్పాండెంట్ ఏవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. గుంటూరు సం పత్‌నగర్‌లోని శారదా పరమేశ్వరి ఆలయం లో ఈ నెల 19న ఈ కార్యక్రమం జరిగిందన్నారు. 1,850 మందిలో తమ విద్యార్థులు కలిగొట్ల మేఘన, యాండ్ర తేజస్వి, పెన్మెత్స రేణుక, బొర్రా మౌనిక, గోపరాజు కృష్ణలహరి, మల్లుల భావన, ఎస్.వెన్నెల, రావూరి నవ్యశ్రీ, సిరిమల్ల లక్ష్మీప్రియ, నుదురుపాటి సుబ్రహ్మణ్యం, సిరిమల్ల మణికంఠ కార్తీక్, ఎస్.శ్రీకార్తికేయ, మామడిశెట్టి బేబీ శ్రీ మంజు, కె.సాయిశ్రీ పవన్ ఉన్నారని చెప్పారు. వీరిని, శిక్షణనిచ్చిన టీచర్ మణిని అభినందించారు. -
వేయిగొంతుల ‘నైమిశ’ గానం!
నన్నయ ఆది కవే కావొచ్చు. తిక్కన ఉభయ కవిమిత్రుడే కావచ్చు. వారిరువురికీ లేని భాగ్యం తాను శిష్యుడవడం వలన తన గురువు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రివారికి దక్కింది అన్నారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారా యణ! శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం రాసిన దూర్జటికి, పాండురంగ మహాత్మ్యం రాసిన తెనాలి రామకృష్ణకు, సుమతీ శతకకారుడు బద్దెన, వేమనకు దక్కని గౌరవం ఒక శతక కర్తగా తనకు దక్కుతోందని తెలుగు భాషాభి మానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. తాను ఇటీవల రచించిన ‘నైమిశ వేంకటేశ శతకా’ న్ని వేయి మంది ఆబాల గోపాలం, జనవరి 10వ తేదీన విజయనగరంలో కంఠోపాఠంగా గానం చేస్తోన్న సందర్భంగా రామలింగేశ్వర రావుతో ఇంటర్వ్యూ సారాంశం. పురాణాల పుట్టింట పుట్టుక! యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు జెరూ సలెం పుణ్యస్థలం. ఎందరో కవులు ఆ పుణ్య భూమి గురించి కవిత్వం రాశారు. అలాగే సంప్రదాయ భారతీయులకు నైమిశారణ్యం పుణ్యస్థలి. ఉత్తరభారతంలో లక్నో సమీపం లో 84 క్రోసుల విస్తీర్ణంలో వ్యాపించిన ఆ అర ణ్యం ‘జీవులెనుబది నాల్గులక్షల’కు ముక్తి ధామం! నైమిశారణ్యంలోనే వ్యాసుడు వేదా లను సంకలనం చేశాడు. 18 పురాణాలను రచించాడు. వృతాసురుని సంహారం కోసం తన వెన్నెముకనే ఆయుధంగా అర్పించిన దధీచి వంటి 88 వేల రుషులు తపస్సు చేశా రు. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర ఆలయం నుంచి బ్రహ్మోత్సవాలలో పాల్గొనవల సిన దిగా సరిగ్గా రెండేళ్ల క్రితం పిలుపు వచ్చింది. నైమిశ వేంకటేశ్వరుని గర్భగుడిలో ఆశు వుగా ఒక పాట వచ్చింది. ‘పురాణాల పుట్టిం టికి రండి, పురాణ పురుషుని చూడండి...’ అని! నైమిశ చరిత్ర మనసును ఆవాహన చేసు కుంది. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం మొదటి పద్యం ఉబికింది. ఇరవై రోజుల్లో శత కం పూర్తయ్యింది. అపూర్వ ఆదరణ! నైమిశ వేంకటేశ్వర శతకం అపూర్వ ఆదరణకు నోచుకుంది. మేము కంఠతా పట్టాం, మేం కం ఠతా పట్టాం అని వివిధ ప్రాంతాల నుంచి స్పందన వచ్చింది. నిరుడు డిసెంబర్ 21న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరి గిన వేడుకలో 750 మంది శతకంలోని 108 పద్యాలనూ గానం చేశారు. పాలకొల్లు నుంచి అభిజిత్ అనే అంధయువకుడు, తమిళనాడు లోని మదురై నుంచి ఒక తమిళ మహిళ, సాధారణ గృహిణులు, చిన్ని చిన్ని వ్యాపారా లు నిర్వహించుకునేవారు, నిరక్షరాస్యులు, సాఫ్ట్వేర్ యువత నైమిశ వేంకటేశ శతకాన్ని కంఠతా పట్టి పఠించారు. ఈ ఆదరణకు మూడు ప్రధాన కారణాలు. ‘దేని పోగొట్టుకొంటిమో దానిపొంది/ అందరికి దానినందరు అందజేసి/ సఖ్యతన్ శాంతిసౌఖ్యాల సాగున టుల/ వేయుమా, బాట వేంకటేశ నైమిశ’ అనే రీతిలోని పద్యాలు నైమిశారణ్య ఐతిహా సిక ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. ‘తామసమునుండి చేరితి నైమిశమును/ రాజసమునుండి పలికితి రామకథను/ సత్త్వదశనుండి వ్రాసితి శతకకృతిని/ వివిధ తత్త్వేశ నైమిశ వేంకటేశ’ వంటి పద్యాలు శ్రీ వేంకటేశుని కృపాకటాక్షాన్ని తెలియజేస్తాయి. ‘తెలుగుపై కాక ధనముపై దృష్టియున్న /యిట్టి, అమృత వాక్స్రసిద్ధి తట్టి రాదు/కొంత అర్ధమయితివి ఓ అనంత/ అదియు వింతలో వింత, నైమిశ వేంక టేశ’ తరహా పద్యాలు తెలుగు భాషపై ప్రేమాభిమానాలు కలవారందరినీ అల రించాయి! ‘శతక పద్యాలను నియమం గా చదివితే నైమిశారణ్యంలోని చక్ర తీర్థంలో స్నానం చేసిన ఫలసిద్ధి కలుగు తుంది’ అనే ఫలశ్రుతి సైతం ఆదరణకు ప్రేరణనిచ్చింది! గిన్నిస్‌లో ‘శతకగానం’! లిపి కలిగిన భాషలు మూడువేలున్నాయి. అచ్చయిన 11 నెలల్లో 108 పద్యాలను వేయి మంది కంఠస్తం చేయడం అనే సంఘటన ఏ భాషలో సంభవించినా అది సాహితీ సరస్వ తికి సత్కారమే. తెలుగులో ఈ అపూర్వ ఘట న జరగడం, భాషకూ కవికీ దక్కిన అదృష్టం! ఒక కవి జీవితకాలంలో జరిగే ఈ అపూర్వ సందర్భం సాధ్యం కావడానికి సాహిత్యంలో ఆధునిక సాంకేతికత తెచ్చిన సౌలభ్యం కూడా కారణమే! ‘నైమిశ వేంకటేశ శతకం’ వేయి గొంతుల నుంచి ధ్వనించడం, గిన్నిస్ బుక్‌లో నమోదు కావడం సహజమే కదా! పున్నా కృష్ణమూర్తి