
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెంకట శ్రీనివాస్
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు.
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్‌గోపాల్‌వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి.
Comments
Please login to add a commentAdd a comment