rashi
-
‘ధన రాశి’ ఇదే.. అత్యధిక సంపన్నులు వీళ్లే..
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.మిథునం ఇలా అగ్రస్థానంమొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.) -
Rashi Agarwal: కళను 'రాశి' పోస్తోంది..!
ఒక ఠావు పేపర్ తయారు కావాలంటే పది లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. రాసుకోవడానికి ఒక రీము పేపర్ సిద్ధం అవ్వాలంటే పాతికేళ్లు పెరిగిన చెట్టు కొమ్మలను సమూలంగా నరకాలి. చెట్టును నరక్కుండా, నీటిని వృథా చేయకుండా ఒక డైరీ తయారయితే? అంతకంటే ఇంకేం కావాలి? ఇంతే కాదు, టెక్స్టైల్ ఇండస్ట్రీ వృథాను హరాయించుకోవడానికి భూమాత పడే యాతన కూడా తగ్గిపోతుంది. ఇలాంటి వినూత్న ప్రయత్నానికి తెర తీసింది సూరత్‌లో ఓ ఆర్కిటెక్ట్. స్టేషనరీ వస్తువులు, ఇంటీరియర్ డెకరేషన్‌ని కలగలుపుతూ చేసిన ప్రయోగమే రుహానీ రంగ్. ఆ ప్రయోగం వెనుక దాగిన నేపథ్యాన్ని వివరించింది రాశి అగర్వాల్. ఆమె మదిలో వెలిగిన ఈ ఆలోచన తొమ్మిది వేల కిలోల పత్తికి పుస్తక రూపాన్నిచ్చింది.మనదేశంలో కళ ఉంది!‘‘నేను ఆర్కిటెక్చర్ ఫైనలియర్లో ఉన్నప్పుడు మన సంప్రదాయ నిర్మాణాలు, కళలు, చేతివృత్తుల అధ్యయనం కోసం విస్తృతంగా పర్యటించాను. ఢిల్లీ నుంచి జైపూర్, అహ్మదాబాద్, కచ్, పాండిచ్చేరి నుంచి పూనా వరకు పరిశీలిస్తే మనదేశంలో రకరకాల కళలు, కళా నైపుణ్యాలున్న పని వాళ్లున్నారని తెలిసింది. వాళ్ల చేతుల్లో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదికలు తగినంతగా లేవు.అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేసి, నా వృత్తిలో ఇంటీరియర్ డిజైనింగ్‌కు దోహదం చేసే విధంగా ఒక ప్రయోగం చేశాను. అది విజయవంతమైంది. రకరకాల కళలను ఒక వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘రుహానీ రంగ్’ పేరుతో ఆర్ట్ స్టార్టప్ మొదలు పెట్టాను. ప్లానర్ బుక్ కవర్ పేజీ మీద మధుబని ఆర్ట్ ఉంటే ఇంట్లో అందమైన షో పీస్ ఉన్నట్లే. ప్లానర్ బుక్‌ని కార్నర్ స్టాండ్‌లో అందంగా అమరిస్తే డ్రాయింగ్ రూమ్ కళాత్మకంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో హస్త కళలను పునరుద్ధరించగలుగుతున్నాను. రుహానీ రంగ్ను ఐదు వేల రూపాయలతో మొదలు పెట్టాను. నాతో కలిసి 50 మంది కళాకారులు, 40 మంది ఇతర ఉద్యోగులు పని చేస్తున్నారు. వస్త్రాలను తయారు చేసే భారీ పరిశ్రమలకు పెద్ద సంఖ్యలో పత్తి బేళ్లు వస్తుంటాయి. ప్రతి బేలు లోనూ మెషీన్లో అమరికకు తగినట్లు ఉపయోగించగా మిగిలిన పత్తి వృథా అవుతూ ఉంటుంది.అది భూమిలో కలిసి పోవాల్సిందే తప్ప మరో పనికి ఉపయోగించేవారు కాదు. ఎందుకూ పనికి రాదని వదిలేస్తున్న ఆ పత్తే నా కుటీర పరిశ్రమకు ముడిసరుకు. నాకు కోవిడ్ సమయం కూడా మంచే చేసింది. ఆ టైమ్‌లో పెద్ద చిన్న పరిశ్రమలన్నీ మూత పడ్డాయి. హస్తకళాకారులు పని లేక ఆర్థికంగా మానసికంగా దెబ్బతిని ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక్కొక్కరిని కలిసి నా ఆలోచన చెప్తుంటే వాళ్లు ఉత్సాహంగా నాకు మరికొన్ని ఐడియాలు చెప్తూ తమ అనుభవాన్ని జోడించారు.అలా 2020లో మొదలు పెట్టిన నా కుటీర పరిశ్రమ ఇంత వరకు హ్యాండ్ మేడ్ పేపర్‌తో ప్లానర్స్, క్యాలెండర్లు, నోట్‌బుక్స్, జర్నల్స్, స్కెచ్ బుక్స్ వంటి 15 వేల ఉత్పత్తులకు రూపమిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే నలభై వేల ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. ఆర్ట్ పీస్ కేవలం కళాభిరుచి, కళారాధన కోసమే కాదు. అది మన దైనందిన జీవితంలో భాగంగా మారాలి. అప్పుడే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని వివరించింది రాశి అగర్వాల్.ఇవి చదవండి: పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు! -
లంగా ఓణీలో అదిరిపోయిన రాశి సింగ్ (ఫోటోలు)
-
కథ నచ్చితే అందుకు రెడీ అంటున్న బ్యూటీ
‘‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ చిత్రంలో లక్ష్మి అనే రిపోర్టర్ పాత్ర చేశాను. చాలా సహజంగా ఉండే బలమైన పాత్ర నాది. ఈ మూవీలో సస్పెన్స్, రొమాన్స్, పాటలు.. ఇలా అన్నీ ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఆద్యంతం ఉంటుంది. క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరు. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ వంటి మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరోయిన్ రాశీ సింగ్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ సింగ్ మాట్లాడుతూ– ‘‘మాది రాయ్‌పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. ఏడాది పాటు ఎయిర్ హోస్టెస్‌గా చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. హీరోయిన్ కావాలని చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. మేం మొదట్లో ముంబైలో ఉండేవాళ్లం.. ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేశాం. తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ చాలా నచ్చాయి. ఇక ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ విషయానికొస్తే.. ఆడిషన్లో నన్ను ఎంపిక చేశారు పురుషోత్తం రాజ్. కథ నచ్చితే గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమే. ‘ఆర్య 2’ మూవీ చూసి అల్లు అర్జున్‌గారికి ఫ్యాన్ అయిపోయాను. సుహాస్‌కి జోడీగా నేను నటించిన ‘ప్రసన్న వదనం’ సినిమా త్వరలో విడుదల కానుంది’’ అన్నారు. -
ఎమోషనల్ రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్‌కి కావల్సిన ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్‌గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్
మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్ స్టోర్స్ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్ క్లాస్ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేడు నంబర్ వన్ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’ దేశవ్యాప్తంగా 75 రిటైల్ స్టోర్స్‌తో 30 పెట్ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్ పరిచయం. ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’కు ఫౌండర్. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్. ‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని, కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి. మొదటి స్టోర్ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్.ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్ డాగ్‌లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి. కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి. సుదీర్ఘ విరామం తర్వాత... ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్ చేయడంతో రాశి తన స్టోర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్ ఓన్లీ స్టోర్’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్ ఫర్ టెయిల్స్’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్‌కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు. -
ఆకట్టుకుంటున్న ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఫస్ట్ గ్లింప్స్
సినిమాని తెరకెక్కించడం ఒకెత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేస్తే.. అంత త్వరగా సినిమా ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే టైటిల్ నుంచి క్యారెక్టర్ల పేర్ల వరకు కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు నేటి దర్శకులు. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి తొలి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా టైటిల్ పెడుతున్నారు. అలాంటి డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ లో ఓపెన్ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు. దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్ నారాయణ ఎంట్రీ. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్ తీసుకుంటాడు. పోలీస్ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్ నారాయణ. ఈ గ్లింప్స్ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్ కథలా కూడా అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
శ్రీలతా రెడ్డి, మంత్ర, సుజాత.. ఎవరబ్బా?!
(వెబ్ స్పెషల్): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి.. శ్రీదేవి బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు. జయసుధ మూవీస్‌లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం) జయప్రద అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ) రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. భూమిక ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను) అనుష్క ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ సినిమాల కోసం నయనతారగా మారింది. రాశి రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఇక వీరే కాక హీరో రజనీకాంత్, చిరంజీవి, సూర్య, పవన్ కళ్యాణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. -
మర్రిచెట్టు కింద పాట
సురేశ్, ఆనంద్, రాశి, శ్రద్ధాదాస్, అమిత్, తేజ ప్రధాన పాత్రల్లో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లేవాడు). వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లిరికల్ వీడియోను ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ మణికొండలోని మర్రిచెట్టు కింద విడుదల చేశారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలోని ‘ఓడ్కా మీద ఒట్టు...’ అంటూ సాగే మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్‌లో 20లక్షల వ్యూస్ సాధించింది. రెండో పాటను రామ్‌గోపాల్‌వర్మకి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తాం’’ అని వెంకట శ్రీనివాస్ బొగ్గరం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
సస్పెన్స్ థ్రిల్లర్
శివ కంఠమనేని హీరోగా నటించనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో నందితా శ్వేతా కథానాయికగా నటిస్తున్నారు. రాశీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించనున్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర రావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మిస్తున్నారు. శివ, నందితా శ్వేత, రాశీలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వాసవి గ్రూప్ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నటుడు, నిర్మాత అశోక్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రమిది. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. నాలుగు పాటలను రికార్డ్ కూడా చేశాం’’ అన్నారు. ‘‘చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఈ సినిమా కథ నచ్చి చేస్తున్నాను’’ అన్నారు రాశి. ‘‘ఈ సినిమాలో రాశికి అమ్మగా, నందితా శ్వేతకు అమ్మమ్మలా నటిస్తున్నాను’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఇందులో నా పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తాను’’ అన్నారు నందితా శ్వేత. ‘‘చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. ఆ తర్వాత కన్నడ పరిశ్రమకు వెళ్లి అక్కడ ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఓ మంచి పాయింట్‌తో తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు సంజీవ్. ‘‘అశ్లీలత, అసభ్యతలకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చేసేలా సినిమా తీస్తున్నాం’’ అన్నారు ఆర్. వెంకటేశ్వరరావు. ‘‘కథ నచ్చి నిర్మించాలని మేమంతా నిర్ణయించుకున్నాం’’ అన్నారు రాంబాబు. సంగీత దర్శకుడు సుధాకర్ మరియో, మాటల రచయిత అంజన్ మాట్లాడారు. -
రాశీ-నందితా శ్వేత కొత్త సినిమా ప్రారంభం
-
‘మంచి సినిమా అందివ్వాలని మా తాపత్రయం’
శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్, శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్’ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... అశోక్ కుమార్ క్లాప్ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ కంఠమనేని మాట్లాడుతూ ‘ఇంతకు ముందు మేం లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇది మా రెండో ప్రొడక్షన్. కుటుంబ కథా చిత్రమిది. అలాగే, సస్పెన్స్ థ్రిల్లర్! ఇందులో నేను, రాశిగారు లీడ్ రోల్స్ చేస్తున్నాం. హీరోయిన్గా నందితా శ్వేతగారు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరో లీడ్ రోల్ చేస్తున్నారు. మా దర్శకుడు సంజీవ్ మేగోటి ఇంతకు ముందు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. రెండు షెడ్యూళ్లల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పది పదిహేను రోజులు విరామం తీసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఆల్రెడీ నాలుగు పాటలు రికార్డ్ చేశాం. పాటలు విన్న వారందరూ బావున్నాయని ప్రశంసించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులు అందివ్వాలని మా తాపత్రయం’’ అని అన్నారు. రాశి మాట్లాడుతూ ‘చాలా గ్యాప్ తర్వాత మంచి సినిమాతో నేను మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ముఖ్యంగా నాకు కథ బాగా నచ్చింది. వెరీ బోల్డ్, ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా రోజులకు నాకు నచ్చిన పాత్ర వచ్చింది. ఈ మధ్యలో చాలా పాత్రలు వచ్చాయి. కానీ, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇందులో నందితా శ్వేత నా కుమార్తెగా చేస్తోంది. తనతో నేను తొలిసారి నటిస్తున్నా. అలాగే, చాలా రోజుల తర్వాత అన్నపూర్ణమ్మగారితో సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. నందితా శ్వేత మాట్లాడుతూ ‘నేను తమిళ్, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు ‘మీరు తెలుగు సినిమాలు చేస్తారా? ఓన్లీ గ్లామర్ రోల్స్ ఉంటాయి?’ అని అక్కడివారు అడిగేవారు. నేను వెయిట్ చేసి చేసి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటివరకూ గ్లామర్ కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించాను. ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్ రోల్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తా. మంచి మంచి యాక్టర్స్‌తో చేస్తున్నా. నేను నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది. నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్’ అన్నారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘నేను చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. తర్వాత కర్ణాటక వెళ్లాను. కన్నడలో ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. స్ర్కీన్‌ప్లే రైటర్‌గా కన్నడ, తెలుగు ఛానల్స్‌లో బిజీగా ఉన్నాను. మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో కొత్తదనంతో కూడిన కథ రెడీ చేశా. కథ ప్రకారం 40, 45 సంవత్సరాల వయసు ఉన్న హీరో కావాలి. సరైన కథకు సరైన నటీనటులు లభిస్తే ఎంత బావుంటుందో ప్రేక్షకులందరికీ తెలుసు. శివ కంఠమనేని, రాశి, నందిత, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్... ఇలా మంచి మంచి నటీనటులు కుదిరారు. కథకు ఏం కావాలో చెప్పమని అడిగిన నిర్మాతలకు థ్యాంక్స్’ అన్నారు. -
రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్
‘అక్కడొకడుంటాడు’తో శివ కంఠమనేని నటుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నెల 24న ఆయన మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. శివ కంఠమనేని ప్రధాన పాత్రలో లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 24న రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభం కానుంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి, కె. అశోక్‌కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ శనివారం పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రాన్ని ప్రారంభిస్తాం. అదే రోజున రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. రెండు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయింది. వీటిలో మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్‌రో... అయ్యిందేమో డాక్టరో’ పాటను ‘గీత గోవిందం’లో ‘కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయింది’ రాసిన సాగర్ రాశారు. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు’ అని తెలిపారు. -
రాశి, రంభల ఆ యాడ్స్ వద్దు
సాక్షి, విజయవాడ : రాశి, రంభ లాంటి సినితారలతో ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరమ్ కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. కలర్స్ సంస్థ ప్రకటనలు చూసి మోసపోయిన ఓ వినియోగదారుడి ఫిర్యాదుపై విచారణ జరిపిన జస్టీస్ మాధవరావు.. కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన రూ.74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని సూచించించారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ. 2 లక్షలను జరిమానాగా చెల్లించాలని, వెంటనే రాశి, రంభల ప్రకటనలను ఆపేయాలని తీర్పునిచ్చారు. ప్రజాదరణ కలిగిన రాశి, రంభ లాంటి సెలబ్రిటీలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇక మీదట ఇటువంటి ప్రకటనల పట్ల సినితారలు జాగ్రత్త వహించని పక్షంలో కొత్త చట్టం ద్వారా సెలబ్రిటీలకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. షాపింగ్ మాల్‌కు రూ. 5లక్షల జరిమానా.. అక్రమంగా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్న పీవీఆర్ మాల్‌కు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మొత్తాన్ని వినయోగదారుల సంక్షేమనిధికి జమచేయాలని, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఫిర్యాదుదారుడికి అందజేయాలని పేర్కొన్నారు. హైకోర్ట్ ఉత్తర్వుల ప్రకారం మాల్స్, మల్టిప్లెక్స్ లలో ఉచిత పార్కింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. -
ఎవరు రక్ష?
సీతను రావణుడు ఎత్తుకెళితే రాముడు విడిపించాడు. ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను ఏ రాముడు వచ్చి తీరుస్తాడు? రక్షణ లేని స్త్రీలకు ఎవరు ర క్ష? ఇక్కడ రక్షించేదెవరు? శిక్షించేదెవరు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘లంక’. రాశి లీడ్ రోల్ చేస్తోన్న ఈ చిత్రాన్ని నామన శంకరరావు, సుందరి సమర్పణలో రోలింగ్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై దినేష్ నామన, విష్ణుకుమార్ నామన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళను కూడా మన పూర్వీకులు మైండ్ టూ మైండ్ కమ్యూనికేట్ చేసేవారు. ఈ విద్యను టెలీపతి అనేవారు. కనుమరుగైన ఈ విద్యను ప్రస్తుత సమాజానికి ‘లంక’ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం. రాశిని దృష్టిలో పెట్టుకుని కథ రాశాను’’ అని చిత్రదర్శకుడు శ్రీముని. ‘‘ఇది సైంటిఫిక్ థ్రిల్లర్. టెలీపతి అనే విద్య ద్వారా లంక లాంటి ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఓ స్త్రీ సమర్థవంతంగా ఎదుర్కొంది అనేది కథ’’ అని కూడా దర్శకుడు తెలిపారు. ‘క్షణం’ చిత్రానికి సంగీత సారథ్యం వహించిన శ్రీచరణ్ స్వరాలను సమకూరుస్తున్నారు. ఐనా సాహా, సాయి రోనిక్, సిజ్జు, సుప్రీత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
మృత్యువు నుంచి తండ్రిని రక్షించుకొంది
కోల్‌కతా: కన్న తండ్రి కళ్ల ఎదుటే కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 10 ఏళ్ల చిన్నారి ఉంది. సరిగ్గా ఓ రోజు మెట్రో స్టేషన్లో తాను చూసి అడ్వర్టైస్ మెంట్ గుర్తుకు వచ్చింది. వెంటనే అంత గాభరాలోనూ ఏడుస్తూ ఫోన్ తీసుకొని 100కు డయల్ చేసింది. తన తండ్రి ప్రాణాలకు కాపాడుకోగలిగింది. వివరాలు..కోల్‌కతాలోని దక్షిణ సింథీలో నివాసముంటున్న 37 ఏళ్ల వ్యాపారి రాజీవ్ కన్నా తన భార్య షికాతో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరికి 10 ఏళ్ల కుమార్తె రషి ఉంది. సరిగ్గా రషి స్కూల్‌కు బయలు దేరే సమయంలోనే ఇంట్లో గొడవ ప్రారంభమైంది. ఓ వైపు తండ్రి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానిక ప్రయత్నిస్తుంటే, తల్లి ఏడుస్తూ కుప్పకూలింది. మా నాన్నను ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడు, దయచేసి కాపాడండి అంటూ...అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 100కు ఫోన్‌చేసింది. 'మేం ముందుగా ఒక ప్రాంక్ కాల్ అనుకున్నాము. కానీ అమ్మాయి బిగ్గరగా ఏడుస్తూ మాట్లాడింది. తన తండ్రి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాడని' ఆ బాలికి తెలిపినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆ బాలిక చెప్పిన ఆడ్రస్‌కు వెంటనే బయలుదేరి వెళ్లి కాలినగాయాలతో కిచెన్‌లో పడి ఉన్న అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. కుటుంబకలహాల వల్లే కన్నా ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 'మా కళ్లెదుటే రాజీవ్ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో మేము షాక్‌కు గురయ్యాము. నా కూతురు ఎంతో సమయ స్పూర్తితో పోలీసులకు సమాచారం ఇచ్చింది' అని రషి తల్లి షికా తెలింది.