Shiva Kandukuri Bhootadham Bhaskar Narayana First glimpses Out Check Inside - Sakshi
Sakshi News home page

Shiva Kandukuri: ఆకట్టుకుంటున్న ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ ఫస్ట్‌ గ్లింప్స్‌

Published Tue, Aug 2 2022 5:56 PM | Last Updated on Tue, Aug 2 2022 7:27 PM

Shiva Kandukuri Bhootadham Bhaskar Narayana First glimpses Out - Sakshi

సినిమాని తెరకెక్కించడం ఒకెత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఎంత డిఫరెంట్‌గా ప్రమోషన్స్‌ చేస్తే.. అంత త్వరగా సినిమా ప్రజల్లోకి వెళ్తుంది. అందుకే టైటిల్‌ నుంచి క్యారెక్టర్ల పేర్ల వరకు కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు నేటి దర్శకులు. ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు రప్పించడానికి తొలి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా టైటిల్‌ పెడుతున్నారు.

అలాంటి డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ని మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

 ఫస్ట్‌ గ్లింప్స్‌ లో ఓపెన్‌ చేస్తే శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదమునితో పాటు ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడమని ఆ విష్ణుమూర్తిని వేడుకొంటాడు. దానికి సాక్షాత్తు ఆ నారాయణుడు చింతించకు ఇంద్రదేవా..! కలియుగంబున భువిపైన జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదనని అభయం ఇస్తున్నానని చెప్పడంతో హీరో శివ కందుకూరి, అదే మన భూతద్ధం భాస్కర్‌ నారాయణ ఎంట్రీ. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్‌ తీసుకుంటాడు.

పోలీస్‌ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్‌ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు భూతద్ధం భాస్కర్‌ నారాయణ.  ఈ గ్లింప్స్‌ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్‌ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్‌ కథలా కూడా అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement