‘‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ చిత్రంలో లక్ష్మి అనే రిపోర్టర్ పాత్ర చేశాను. చాలా సహజంగా ఉండే బలమైన పాత్ర నాది. ఈ మూవీలో సస్పెన్స్, రొమాన్స్, పాటలు.. ఇలా అన్నీ ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ఆద్యంతం ఉంటుంది. క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరు. ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ వంటి మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’’ అని హీరోయిన్ రాశీ సింగ్ అన్నారు. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది.
ఈ సందర్భంగా రాశీ సింగ్ మాట్లాడుతూ– ‘‘మాది రాయ్‌పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. ఏడాది పాటు ఎయిర్ హోస్టెస్‌గా చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. హీరోయిన్ కావాలని చాలా కష్టపడి సినిమాల్లోకి వచ్చాను. మేం మొదట్లో ముంబైలో ఉండేవాళ్లం.. ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేశాం. తెలుగు పరిశ్రమ, హైదరాబాద్ చాలా నచ్చాయి. ఇక ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ విషయానికొస్తే.. ఆడిషన్‌లో నన్ను ఎంపిక చేశారు పురుషోత్తం రాజ్. కథ నచ్చితే గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధమే. ‘ఆర్య 2’ మూవీ చూసి అల్లు అర్జున్‌గారికి ఫ్యాన్ అయిపోయాను. సుహాస్‌కి జోడీగా నేను నటించిన ‘ప్రసన్న వదనం’ సినిమా త్వరలో విడుదల కానుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment