మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది: శివ కందుకూరి | Shiva Kandukuri Speech At Bhoothaddam Bhaskar Narayana Success Meet | Sakshi
Sakshi News home page

మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది: శివ కందుకూరి

Published Sat, Mar 2 2024 6:59 PM | Last Updated on Sat, Mar 2 2024 7:18 PM

Shiva Kandukuri Talk About Bhoothaddam Bhaskar Narayana At Success Meet - Sakshi

శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ.  స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ  నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ..  సినిమా చూసిన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ కి థాంక్స్. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్ కి అభినందనలు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన తనకి చాలా థాంక్స్.  తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని మరోసారి రుజువైయింది. సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది తెలుగు ఆడియన్స్ వలనే సాధ్యపడింది’ అన్నారు.

హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ..  ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి ఆనందంగా ఉంది. హౌస్ ఫుల్ థియేటర్స్ చూస్తుంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అన్నారు.

‘సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్ లో చూడాలి’ అని దర్శకుడు పురుషోత్తం అన్నారు.  ఈ సక్సెస్‌ మీట్‌లో రాజ్ కందుకూరి,ర్మాతలు స్నేహాల్, శశిధర్ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement