టైటిల్: భూతద్ధం భాస్కర్ నారాయణ
నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు
నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
దర్శకత్వం : పురుషోత్తం రాజ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్
విడుదల తేది: మార్చి 1, 2024
డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. అయితే తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా? భూతద్ధం భాస్కర్ నారాయణ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా?
కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలలను తీసుకొని..ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలు పిలుస్తారు పోలీసులు. హంతకుడిని పట్టుకోవడం వారికి సవాల్‌గా మారుతుంది. ఈ కమ్రంలోనే రంగంలోకి దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టి భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? మహిళల తలలు నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి? దిష్టిబొమ్మల వెనుక ఉన్న కథేంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేదే తెలియాలంటే భూతద్ధం భాస్కర్ నారాయణ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
డిటెక్టివ్ థ్రిల్లర్స్‌కి టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్‌తో ఈ జానర్‌లో సినిమాను తెరకెక్కిస్తే.. ప్రేక్షకులు కచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే భూతద్ధం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత.
దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశాడు. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ గేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరో చైల్డ్ ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాఫ్ అంతా ఫన్ ఎలిమెంట్స్, లవ్ ఎమోషన్స్‌తో సాగుతుంది. సీరియల్ కిల్లర్ తెరపై వచ్చినప్పటి నుంచి సినిమా అంతా సీరియస్ మూడ్‌లోకి వెళ్తుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను మరింత ఆకట్టకుంటాయి. దిష్టిబొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు.దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఫస్టాప్‌లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉండడం.. ద్వితియార్థంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించడం కాస్త మైనస్. ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. సస్పెన్స్‌ని మాత్రం క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంతో దర్శకుడు సఫలం అయ్యాడు.థ్రిల్లర్స్ సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులు భూతద్ధం భాస్కర్ నారాయణ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు. ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా ఉంది. శివ నటనగా కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. రిపోర్టర్ లక్ష్మీ గా రాశీ సింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా పరంగా సినిమా పర్వాలేదు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. కెమరాపనితనం రిచ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment