దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...
తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.
అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.
మిథునం ఇలా అగ్రస్థానం
మొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్‌ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.
(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.)
Comments
Please login to add a commentAdd a comment