శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్,
జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది.
ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్‌కి కావల్సిన ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment