
నాంపల్లి: సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంటరానితనాన్ని పునరుద్ధరణ చేసే విధంగా బ్రహ్మణ సమాజాన్ని పురమాయించేలా తెలుగులో పద్యం రాశారంటూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతని రచనలు ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. జొన్నవిత్తుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.(ఆర్జీవీ... ఓ రామబాణం)