భక్తి పాటలు రాయడంలో ఘనుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అంతేనా సందర్భం ఏదైనా సరే దానిమీద అప్పటికప్పుడు పేరడీ పాట రాసి వినిపించగలడు. అంతటి గొప్ప టాలెంట్ ఆయన సొంతం. కానీ ఇంతవరకు తననెవరూ పురస్కారంతో సత్కరించలేదంటున్నాడు జొన్నవిత్తుల. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'వేటూరి, సిరివెన్నెల సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాకో సినిమా ఇచ్చి మొత్తం పాటలు నన్నే రాయమన్నారు. అదే ఆయన నాకు చేసిన మహా ఉపకారం. దేవుడి పాటలు ఎక్కువ రాసే నేను విక్రమార్కుడిలో జింతాత్త జిత్త జిత్త పాట రాశాను. తిట్ల మీద కూడా పాట రాశాను. నేను ఎన్నో పాటలు రాశాను. ప్రతి ఛానల్‌లో, ప్రతి గుడిలో అందరి బంధువయ, జగదానందకార, మహా కనకదుర్గ.. విజయ కనకదుర్గ, జయజయ శుభకర వినాయక, అయ్యప్ప దేవాయ నమహ.. వంటి ఎన్నో సాంగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. అది నాకు చాలా సంతోషం, కానీ నాకింతవరకు ఏ అవార్డూ రాలేదు' అని చెప్పుకొచ్చాడు జొన్నవిత్తుల.
చదవండి: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన డైరెక్టర్
నేను మారిపోయాను, చాలా సంతోషంగా ఉన్నా: నాగచైతన్య
Comments
Please login to add a commentAdd a comment