jonnavittula
-
ఎన్నో పాటలు రాశా, కానీ ఒక్క అవార్డు రాలేదు: జొన్నవిత్తుల
భక్తి పాటలు రాయడంలో ఘనుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అంతేనా సందర్భం ఏదైనా సరే దానిమీద అప్పటికప్పుడు పేరడీ పాట రాసి వినిపించగలడు. అంతటి గొప్ప టాలెంట్ ఆయన సొంతం. కానీ ఇంతవరకు తననెవరూ పురస్కారంతో సత్కరించలేదంటున్నాడు జొన్నవిత్తుల. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'వేటూరి, సిరివెన్నెల సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాకో సినిమా ఇచ్చి మొత్తం పాటలు నన్నే రాయమన్నారు. అదే ఆయన నాకు చేసిన మహా ఉపకారం. దేవుడి పాటలు ఎక్కువ రాసే నేను విక్రమార్కుడిలో జింతాత్త జిత్త జిత్త పాట రాశాను. తిట్ల మీద కూడా పాట రాశాను. నేను ఎన్నో పాటలు రాశాను. ప్రతి ఛానల్లో, ప్రతి గుడిలో అందరి బంధువయ, జగదానందకార, మహా కనకదుర్గ.. విజయ కనకదుర్గ, జయజయ శుభకర వినాయక, అయ్యప్ప దేవాయ నమహ.. వంటి ఎన్నో సాంగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. అది నాకు చాలా సంతోషం, కానీ నాకింతవరకు ఏ అవార్డూ రాలేదు' అని చెప్పుకొచ్చాడు జొన్నవిత్తుల. చదవండి: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన డైరెక్టర్ నేను మారిపోయాను, చాలా సంతోషంగా ఉన్నా: నాగచైతన్య -
వైజాగ్‌లో జొన్నవిత్తుల ‘ఉత్తరాంధ్ర శతకం’ ఆవిష్కరణ!
తెలుగు తల్లికి జరిగిన పదపుష్ప పాదార్చనలతో విశాఖ పులకించింది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన 'ఉత్తరాంధ్ర శతక' ఆవిష్కరణ కార్యక్రమం వైజాగ్‌లో ఘనంగా జరిగింది. తానా పూర్వాధ్యక్షులు, తానా విశ్వ సాహితీవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. పది శతకాలు ప్రచురణచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సభలు చేయాలని అమెరికాలోని తెలుగు భాషాభిమానులు పూనుకున్నారు. 24వ తేదీ ఉదయం జొన్నవిత్తుల స్వయంగా రాసిన 108 పద్యాల రాతప్రతిని సముద్రునికి సమర్పించారు. అనంతరం సాగరతీరంలో చిన్నారులు అక్షర మాలను రాసి, పూలతో పూజించి, తెలుగు పద్యాలను పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యశాస్త్రి, కలశపూడి శ్రీనివాసరావు, సూరపనేని విజయకుమార్, పైడా కృష్ణప్రసాద్, పరవస్తు ఫణిశయన సూరి, తదితరులు పాల్గొన్నారు. -
చావు తర్వాత చావు గురించి...
‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళివంటిదే బ్రదర్’ అన్న చరణం వినగానే ఆ పాట రాసింది శ్రీశ్రీ అనిపిస్తుంది. కానీ, అది ఆచార్య ఆత్రేయది. పేరు చూడకుండా చదివితే మరణానంతర జీవితం నవల రావిశాస్త్రి రాసిందనిపిస్తుంది. కానీ, అది నందిగం కృష్ణారావుది. అంతే కాదు, ఈ పేరు చదవగానే ఇదో అలౌకిక జీవన వర్ణ చిత్రణ అనిపిస్తుంది. కానీ, ఇది పూర్తి స్థాయి లౌకిక వర్ణ వర్గ కుల సహితమైన నేటి సమాజపు వాస్తవ జీవన చిత్రణం. ఇందులో ఒక మరణం తరువాత ఏర్పడే శూన్యాన్ని సొమ్ముచేసుకునే ఆచరణలూ, వాటి చుట్టూ పోగేసిన నమ్మకాలూ, భయాలూ, మోసాలూ, ద్రోహాలూ కొనసాగడం చరిత్ర మాత్రమే కాదు, వర్తమానం కూడా. దీన్ని భవిష్యత్తులోకి సాగదీయడానికి ఎన్నో వ్యవస్థలు జీవితంలోని అభద్రతాభావాన్నీ, భవిష్యత్తు పట్ల దురాశనీ, సుఖభోగాల పట్ల లాలసనీ కలబోసి న్యాయంతో ధర్మాన్నీ నైతికతనీ ఏకమొత్తంగా పాతి పెట్టడానికి మన గ్లోబల్ విలేజ్ పడుతున్న పాట్లూ, సృష్టిస్తూన్న విధ్వంసాలూ అన్నీ ఇన్నీ కావు. మరణానంతర జీవితం నవల్లో మనిషి చావుని పెట్టుబడి లేని రాబడిగా మార్చుకునే వైనం కళ్ళకి కట్టినట్లుగా వివరించడం జరిగింది. ఇందులో కర్మకాండలు జరిపించే వివిధ కులాలవారు, వారి వృత్తివిద్యా ప్రదర్శనతో మొదలుపెట్టి.. ధనమదాంధులు, నాయకులు, డాక్టర్లు, లాయర్లు, చివరికి చావు కులాల్లో కొత్తగా చేరిన రకరకాల ఇన్సూ్యరెన్సు కులాలు, అందరికీ అయినవాళ్ళు, అన్నింటికీ అయినవాళ్ళు, ఎవ్వరికీ కాకపోయినా అన్నీ తామే అయి నిల్లుకునేవాళ్ళు, చివరికి జొన్నపొత్తులు కాల్చుకోవడానికి కాష్ఠంలో బొగ్గులేరుకునే నిర్భాగ్యులదాకా ఎంతమంది ఎన్ని విధాలుగానో ఎన్నెన్ని రకాల దోపిడీలకి పాల్పడతారో, ఇంకెన్ని రకాల దోపిడీలకి గురౌతారో మన కళ్ళకి కడుతుంది. స్వార్థం, క్రౌర్యం, కుట్ర, కుత్సితం, కుహకం మొదలైనవన్నీ కలిసి మన మనసుని ఎన్నిరకాలుగా బూడిద చేస్తాయో తెలిసిన తరవాత మన చావు మనం చావడానిక్కూడా చచ్చేంత భయం వేస్తుంది. అయితే అదే సమయంలో ఆ భస్మంలోంచీ ఫీనిక్స్‌లా రెక్కలు విప్పుకునే ఆత్మ విశ్వాసం తలెత్తుకుని నిలబడి చెడునించి సైతం మంచిని పిండగల నేర్పరితనం కూడా ఆవిష్కృతం అవుతుంది. మంచి నుండి చెడుకి సాగే పతనంతో బాటుగా చెడు నించీ మంచికి సాగే దారిని కూడా చూపించడం వల్ల చదువరిని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి -
చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?
-
చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?
ఆమెను అలా పోల్చడం సరికాదు వర్మకు జొన్నవిత్తుల కౌంటర్ హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో వరుస కామెంట్లు పెట్టారు. సిట్ విచారణ ముగిసిన అనంతరం ధైర్యంగా బయటకు వచ్చిన చార్మిని చూస్తే.. ఆమెను సిట్ విచారించినట్టుగా కాకుండా ఆమెనే సిట్‌ను ప్రశ్నించినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు తర్వాత చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ధైర్యంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సిట్ విచారణ సందర్భంగా చార్మి గోర్ల నమూనాలను తీసుకోవడం కాదు.. ఆమె మేకప్ చేసుకున్నట్టు కనిపిస్తున్నదని వర్మ పేర్కొన్నారు. అయితే, దర్శకుడు వర్మ వ్యాఖ్యలపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'చార్మి వీరనారి కాదు.. సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. చార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం సరికాదు' అని జొన్నవిత్తుల అన్నారు. -
కృష్ణాష్టమి ప్రత్యేకం : కృష్ణతత్వం చెప్తుందిదీ!