చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా? | ramgopal varma comment on charmi enquiry | Sakshi
Sakshi News home page

చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?

Published Thu, Jul 27 2017 8:56 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా? - Sakshi

చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?

  • ఆమెను అలా పోల్చడం సరికాదు
  • వర్మకు జొన్నవిత్తుల కౌంటర్‌

  • హైదరాబాద్‌: డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో వరుస కామెంట్లు పెట్టారు. సిట్‌ విచారణ ముగిసిన అనంతరం ధైర్యంగా బయటకు వచ్చిన చార్మిని చూస్తే.. ఆమెను సిట్‌ విచారించినట్టుగా కాకుండా ఆమెనే సిట్‌ను ప్రశ్నించినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు తర్వాత చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ధైర్యంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సిట్‌ విచారణ సందర్భంగా చార్మి గోర్ల నమూనాలను తీసుకోవడం కాదు.. ఆమె మేకప్‌ చేసుకున్నట్టు కనిపిస్తున్నదని వర్మ పేర్కొన్నారు.

    అయితే, దర్శకుడు వర్మ వ్యాఖ్యలపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'చార్మి వీరనారి కాదు.. సిట్‌ అధికారులు ఆంగ్లేయులు కాదు. చార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం సరికాదు' అని జొన్నవిత్తుల అన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement