తన రూటే సెపరేటు, మోనార్క్-ఎవ్వరి మాటా వినడు.. ఇలాంటి డైలాగ్స్ అన్నింటికీ సరిగ్గా సరిపోయే వ్యక్తి రాంగోపాల్ వర్మ. తను తీసే చిత్రాలు హిట్టా, ఫట్టా అని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసుకుపోతుంటాడు. ఇలాంటి సంచలన దర్శకుడికి, ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు ఈ మధ్య పడటం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు మాటల కత్తులు విసురుకుంటున్నారు. "అమ్మరాజ్యంలో కడప బిడ్డలు" చిత్ర రిలీజ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ సినిమాను జొన్నవిత్తుల విమర్శించగా ఆర్జీవీ వెనకేసుకొచ్చాడు. (హాలీవుడ్ స్టార్ మాట కాదంటున్న కూతురు)
అలా వీళ్లిద్దరికీ అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఈ తగాదా తారా స్థాయికి చేరుకోగా ఆర్జీవీపై బయోపిక్ తీస్తానని జొన్నవిత్తుల ప్రకటించాడు. చెప్పిన మాట ప్రకారం బుధవారం టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇందులో "రోజూ గిల్లే వాడు(ఆర్‌జీవీ)" అనే పేరు కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ సరిగ్గానే సరిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినికార్ప్ సమర్పణలో కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడు. (ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!)
Comments
Please login to add a commentAdd a comment