
సీబీఐ విచారణకు సిద్ధమా?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన
చంద్రబాబు దమ్ము, ధైర్యం ఉంటే సిద్ధపడాలి: భూమన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టు ఆధ్వర్యంలో సీబీఐ విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్షల కోట్లు దోచుకునేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని తీసుకొచ్చారని, అది స్విస్ చాలెంజ్ కాదని సూట్ కేసుల చాలెంజ్ అని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలోని స్విస్ చాలెంజ్‌లో పారదర్శకత లేదని గుర్తించిన హైకోర్టు దానిపై స్టే ఇచ్చిందన్నారు. రాజధాని నిర్మాణానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే ఆ నిర్మాణం పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని భూమన చెప్పారు. రాజధాని పేరిట రైతుల భూములు లాక్కుని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.
దోచుకోవడానికే స్విస్ చాలెంజ్..
రాజధాని నిర్మాణం పేరుచెప్పి ప్రభుత్వంలోని పెద్దలు కోట్లాది రూపాయలు మింగేయడానికే స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రవేశపెట్టారని భూమన ఆరోపించారు. తుని ఘటనలో ఏ మాత్రం పాత్రలేని, ఏ తప్పూ చేయని తనను విచారణకు పిలవటం హాస్యాస్పదంగా ఉందని భూమన అన్నారు.