
సాక్షి, శ్రీకాకుళం : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపుల గురించి నీతులు మాట్లాడం హాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేను చంద్రబాబు నిస్సిగ్గుగా కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల గురించి గగ్గోలు పెట్టుడుతున్నారని మండిపడ్డారు.
ఆదివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుక శఖోపశాఖలుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. అవినీతి అధికారులపై దాడులు చేసే స్వతంత్ర ప్రతిపత్తి గల సీబీఐ వ్యవస్థను నీరుగార్చరని అన్నారు. ఏసీబీ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని దాడులు చేయించడం ఆయన దుర్బుద్ది అర్థమవుతోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment