swiss challenge
-
స్విస్ చాలెంజ్‌తో భారీ అవినీతి: బుగ్గన
సాక్షి, అమరావతి : స్విస్ చాలెంజ్ పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. మౌలిక సదుపాయలు, న్యాయ పారదర్శకత సమీక్ష బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన గత ప్రభుత్వం చేసిన అవినీతిని తెలియజేస్తూ... బిల్లు ఆవష్యకతను వివరించారు. ఇది జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు అని స్పష్టం చేశారు. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. రూ.100 కోట్లకు పైబడిన పనులన్నీటిపై జ్యూడిషియల్ కమిషన్ పరిశీలన ఉంటుందని తెలిపారు. స్విస్ చాలెంజ్ పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేశారని తెలిపారు. గత ఐదేళ్లలో జరిగింది ఐకానిక్ అభివృద్ధి కాదని, ఐకానిక్ అవినీతన్నారు. జగన్ సర్కార్ చారిత్రాత్మక అడుగు.. అవినీతిపై పోరాటంలో వైఎస్ జగన్ సర్కార్ చారిత్రాత్మక అడుగువేసింది. అక్రమాలను పూర్తి స్థాయిలో నిరోధించాడానికి జ్యూడిషియల్ కమిషన్ బిల్లును తీసుకొచ్చింది. టెండర్ విలువ రూ.100 కోట్లు దాటే పనులన్నీ ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. అన్ని మౌలిక సదుపాయల ప్రాజెక్టుల టెండర్లు ఈ కమిషన్ పరిధిలోకి వస్తాయి. టెండర్లు పిలవడానికి ముందే పీపీపీలు జడ్జి పరిశీలనకు వెళ్లనున్నాయి. జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ కూడా కమిషన్ పరిధిలోకి రానున్నాయి. కమిషన్ జడ్జికి నిపుణుల సలహా, సూచనలు తీసుకునే అధికారం ఉంది. జడ్జి సిఫారసులు తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. ఈ బిల్లు ద్వారా ఏ టెండర్ అయినా తొలుత పారదర్శకంగా ప్రజల ముందుకు వస్తుంది. వారం తర్వాత టెండర్ వివరాలు జడ్జి ముందుకు వెళ్తాయి. కమిషన్ ఏర్పాటైన తర్వాత ఏ టెండర్ అయినా 15 రోజుల్లో ఖారారయ్యేలా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు వచ్చేలా ఈ బిల్లును రూపొందించారు. -
రాజధానిపై సీఆర్డీఏ నివేదికల తయారీ
సాక్షి, అమరావతి: రాజధాని వ్యవహారాల ప్రస్తుత పరిస్థితిని తెలిపేలా నివేదికలు తయారు చేయడంలో సీఆర్డీఏ నిమగ్నమైంది. ఈ నెల ఆరో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏపై సమీక్ష నిర్వహిస్తుండడంతో ఆ రోజుకి పూర్తి వివరాలతో నివేదికలను సిద్ధం చేసే పనిలోపడ్డారు. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీకి ముందు మంజూరై మొదలుకాని పనులు, మంజూరైనా ఇప్పటివరకూ 25 శాతం కూడా పూర్తికాని పనుల వివరాలను ఆయా విభాగాల అధికారులు సేకరిస్తున్నారు. ఇందుకోసం సీఆర్డీఏ కమిషనర్ సీహెచ్ శ్రీధర్ శనివారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో హెచ్‌ఓడీలందరితో సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఎడాపెడా పలు పెద్ద ప్రాజెక్టులను వివిధ నిర్మాణ సంస్థలకు కేటాయించిన నేపథ్యంలో వాటన్నింటి వివరాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. తీవ్ర వివాదాస్పదమైన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు గురించి ప్రత్యేక నోట్ రూపొందిస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈ ప్రాజెక్టును వివాదాస్పద రీతిలో సింగపూర్ కన్సార్టియంకు అప్పగించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా సింగపూర్ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా పనులు మాత్రం ఇప్పటికీ మొదలుకాలేదు. రాజధాని భూసమీకరణ, భూములకు సంబంధించిన వ్యవహారాలు, రైతుల లేఅవుట్ల వివరాలతో మరో నివేదికను తయారు చేస్తున్నారు. సోమవారానికి ఈ నివేదికను సిద్ధం చేసేందుకు సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
స్విస్ చాలెంజ్‌ను సీఎస్‌గా ఉండగానే విభేదించా
సాక్షి, హైదరాబాద్: ఏపీ సర్కారు ఆమోదించిన స్విస్ చాలెంజ్ విధానాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగానే వ్యతిరేకించానని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండగా స్విస్ చాలెంజ్ విధానంతో విభేదించిన విషయాల గురించి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరితే ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐవైఆర్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు పార్టీ ఇన్ పర్సన్‌గా(న్యాయవాదితో నిమిత్తం లేకుండా) తానే వాదనలు వినిపించారు. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. -
స్విస్ చాలెంజ్ సవరణ అఫిడవిట్‌కు అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పిల్ దాఖలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. స్విస్ చాలెంజ్ నిర్ణయాల్లో ఐవైఆర్ కృష్ణారావు భాగస్వామిగా ఉన్నారని, ఆయన దీన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేయడం సరికాదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ‘స్విస్ చాలెంజ్‌పై నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు సీఎస్‌గా ఉన్నారా? లేదా? సీఎస్‌గా ఉండి నిర్ణయాల్లో భాగస్వాములైతే ఈ వ్యాజ్యం ఎలా వేస్తారు? ఈ విషయాల్ని అఫిడవిట్లో ప్రస్తావించలేదేం?’ అని కృష్ణారావును ప్రశ్నించింది. మొత్తం విషయాలతో సవరణ అఫిడవిట్ దాఖలు చేస్తానని కృష్ణారావు పేర్కొనటంతో.. న్యాయస్థానం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
‘స్విస్ చాలెంజ్’ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానానికి ఆమోదముద్ర వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ స్విస్ చాలెంజ్ విధానం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబలింగ్ చట్టం(ఏపీఐడీఈ) నిబంధనలకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని, అందువల్ల దాన్ని కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు.దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న విచారణ జరిపే అవకాశం ఉంది. -
‘2017 బాబు వైఫల్యనామ సంవత్సరం..’
సాక్షి, విజయవాడ: ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మండిపడ్డారు. రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కొడుకు చిన్నబాబుకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. 2017లో బాబు పాలన వైఫల్యనామ సంవత్సరంగా ముగిసిందని రఘువీరా ఎద్దేవా చేశారు. అంతేకాక బాబు జాబితాలో అన్నీ అపజయాలే అని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బాబు సర్కారు రైతులను మోసం చేసిందన్నారు. ఇంటికి ఒక్క ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువతకు ఇచ్చిన హామీని సైతం అటకెక్కిందన్నారు. ఈ మూడున్నర సంవత్సారాల బాబు పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకో దగ్గ ఐటీ కంపెనీ ఏపీవైపు చూడలేదని ఆయన అన్నారు. తొలుత గూగుల్ వంటి కంపెనీలు వస్తాయని చేసిన ప్రచారం బోగస్‌గా తెలిపోయిందని రఘువీరా పేర్కొన్నారు. ‘స్వీస్ చాలెంజ్’ విషయంలోనూ చంద్రబాబు సర్కారుకు చుక్కెదురు అయిందని గుర్తు చేశారు. అంతేకాక ప్రత్యేక ప్యాకేజీ, నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు వేసిన పిల్లిమొగ్గలు సొంత పార్టీ నాయకులనే విస్మయానికి గురి చేశాయన్నారు. కాంగ్రెస్ హయంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన మన్నవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు కాపాడుకోలేకపోవడం మరో అతిపెద్ద ఫెయిల్యూర్ అని రఘువీరా అన్నారు. -
అమరావతిలో మరో స్విస్ ఛాలెంజ్
-
మరో స్విస్ చాలెంజ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ విధానాన్ని న్యాయస్థానం తప్పుపట్టినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మరో స్విస్ చాలెంజ్ విధానానికి సిద్ధపడుతోంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటు చేయనున్న వాణిజ్య పోర్టు కోసం స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ వాణిజ్య పోర్టు ఏర్పాటు కోసం స్విస్ చాలెంజ్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జీఎంఆర్ సంస్థ సమర్పించిన పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే స్విస్ చాలెంజ్ విధానంలో జీఎంఆర్ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మౌలిక సదుపాయాలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఒకవేళ స్విస్ చాలెంజ్‌లో జీఎంఆర్ ఎంపిక కాకపోయినప్పటికీ సదరు సంస్థకే భూమి లీజు వసూలు అధికారం కట్టబెట్టాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. పోర్టును మారుస్తూ... వాస్తవానికి మొదట్లో ఇక్కడ కేవలం క్యాప్టివ్ పోర్టు.. అంటే సొంత అవసరాలకు (సెజ్‌లోని కంపెనీల అవసరాల కోసం) మాత్రమే పోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకినాడ సెజ్‌లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామం వద్ద ఈ పోర్టు ఏర్పాటు కానుంది. ఇక్కడ వాణిజ్య పోర్టును నిర్మించుకుంటామనే ప్రతిపాదనను జీఎంఆర్ సంస్థ తెరమీదకు తెచ్చింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదే అదనుగా స్విస్ చాలెంజ్ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేసేందుకు వీలుగా జీఎంఆర్ ముందుగానే ప్రతిపాదనలను కూడా సమర్పించింది. జీఎంఆర్ ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం స్వీకరించి... స్విస్ చాలెంజ్ విధానానికి తెరలేపింది. ఈ పోర్టు ఏర్పాటు కోసం ఎంపికైన కంపెనీతో 30 సంవత్సరాలపాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి రెండు విడతలుగా. ఒక్కో విడతలో పదేళ్లపాటు ఒప్పందాన్ని పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అంటే మొత్తం 50 ఏళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉంటుందన్నమాట. బిడ్డింగ్‌లో నెగ్గకపోయినా! జీఎంఆర్ సంస్థ సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా స్విస్ చాలెంజ్ విధానంలో కంపెనీలను బిడ్డింగ్‌ను పిలవనున్నారు. ఒకవేళ ఈ ప్రక్రియలో జీఎంఆర్ ఎంపిక కాకపోయినప్పటికీ పోర్టుకు ఇచ్చే భూములకు లీజు వసూలు చేసుకునే అధికారాన్ని మాత్రం ఆ సంస్థకే కట్టబెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాకినాడ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మొత్తం వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రాజధాని భూములతో ముడుపుల బేరం
-
స్విస్ చాలెంజ్ విధాన నియంత్రణ బిల్లు..
రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లు సాక్షి, న్యూఢిల్లీ: స్విస్ చాలెంజ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులలో అయాచిత ప్రతిపాదనలు ఆమోదించడాన్ని నియంత్రించేందుకుగాను రాజ్యసభలో శుక్రవారం ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లును ప్రతిపాదించారు. మౌలిక వనరుల ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర ఇటీవల బాగా పెరిగిపోయిందని, కాంట్రాక్టులు ఇవ్వడంలో పారదర్శకతను ఇది సవాలు చేస్తోందని బిల్లు ప్రతిపాదనకు గల కారణాలు, ఉద్దేశాలు శీర్షికన వివరించారు. -
రాజధాని భూములతో ముడుపుల బేరం
కారుచౌకగా కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్న వైనం - ఎకరా ధర రూ.4 కోట్లని స్విస్ చాలెంజ్‌లో స్పష్టీకరణ - ఎస్ఆర్ఎంకు రూ.50 లక్షలకే అప్పగించిన ప్రభుత్వం - ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం - ఎస్ఆర్ఎం వర్సిటీకి 200 ఎకరాలు - ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి రూ.500 కోట్లు - ఎస్ఆర్ఎం చాన్సలర్ పచ్చముత్తుపై లెక్కలేనన్ని అవినీతి, నేరారోపణలు సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ రైతుల నుంచి బలవంతంగా సేకరించిన వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ప్రభుత్వ పెద్దలకు బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారిపోయాయి. కమీషన్లు దక్కితే చాలు కోరుకున్న వారికి కోరుకున్నన్ని భూములను కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారు. గ్లోబల్ టెండర్లన్న మాటే ఎత్తడం లేదు. రూ.వందల కోట్లు జేబుల్లో నింపుకుంటున్నారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే రాజధానిలో ఇప్పటిదాకా ఐదు ప్రైవేట్ విద్యాసంస్థలకు మొత్తం 850 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టడం గమ నార్హం. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లింది. రాజధానిలో ఎకరం భూమి ఖరీదు రూ.4 కోట్లు అని ‘స్విస్ చాలెంజ్’లో ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, తాజాగా ఎస్ఆర్ఎం వర్సిటీకి ఎలాంటి టెండర్లు లేకుండానే 200 ఎకరాలను ఎకరా రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టింది. భూమి వాస్తవ ధరలో 12.5 శాతానికే అప్పగించడం వెనక రూ.వందల కోట్ల ‘ముడుపులు’ చేతులు మారాయని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎకరాకు రూ.3.5 కోట్లు నష్టం ప్రభుత్వం చెప్పినట్లు రాజధానిలో ఎకరం ధర రూ.4 కోట్లు. ఈ లెక్కన 200 ఎకరాల విలువ రూ.800 కోట్లు. ఎకరా రూ.4 కోట్ల విలువైన భూమిని రూ.50 లక్షలకే ఇచ్చేస్తే ప్రభుత్వం కోల్పోయిన రాబడి ఎకరాకు రూ.3.5 కోట్లు. 200 ఎకరాలంటే ఖజానాకు రూ.700 కోట్ల నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. ఎస్ఆర్ ఎం యూనివర్సిటీకి చేకూరిన అయాచిత లబ్ధి రూ.700 కోట్లు కాగా, అందులో కనీసం సగం.. అంటే రూ.350 కోట్లు ముడుపుల రూపంలో ప్రభుత్వ పెద్దలకు దక్కినట్లు ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ పెద్దలతో మరిన్ని లావాదేవీలు కొనసాగే అవకాశం ఉండడంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం రూ.500 కోట్ల వరకు చెల్లించి ఉండొచ్చని రాజధానిలో చర్చ జరుగుతోంది. పచ్చముత్తు వల్ల నాలెడ్జ్ హబ్బా? చీటింగ్, భూకబ్జా కేసులు, పలు అవినీతి, నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాన్సలర్ పచ్చముత్తును సాక్షాత్తూ సీఎం పొగడ్తల్లో ముంచెత్తడం గమ నార్హం. ఈ నెల 15న అమరావతిలో యూనివర్సిటీ ప్రారంభోత్సవం నిర్వహించిన సంగ తి తెలిసిందే. ఈ సందర్భంగా పచ్చముత్తును బాబు ఆకాశానికేత్తేశారు. ఐపీసీ సెక్షన్లు 406 (నేరపూరిత ఆలోచనతో చేసిన విశ్వాస ఘాతు కం), 420 (మోసం), 34 (కొంతమంది వ్యక్తులు కూడబలుక్కొని అమాయకులను మోసగించడం) కింద పచ్చముత్తు నిందితు డిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో అరెస్టు కూడా అయ్యారు. అలాంటి పచ్చముత్తు వల్ల అమరావతి నాలెడ్జ్ హబ్‌గా మారుతుందా? అని రాజధానివాసులు ప్రశ్నిస్తున్నారు. సినీ నిర్మాత అదృశ్యం పచ్చముత్తుకు ‘వెందర్ మూసీస్’ అధినేత మదన్ స్నేహితుడు. మెడికల్ సీట్ల కోసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీని సంప్రదించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు.. మదన్‌ను కలవమని వర్సిటీ వర్గాలు సూచించాయి. మదన్‌కు సొమ్ము ముట్టజెప్పిన తర్వాత మెడికల్ సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పాయి. వసూలైన సొమ్ము ముట్టజెప్పే విషయంలో పచ్చముత్తు, మదన్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మదన్ అదృశ్యమయ్యాడు. వారణాశి వెళ్లి గంగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి వెళ్లిపోయాడని చెబుతున్నారు. విద్యా ర్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును యూనివర్సిటీకి అప్పగించానని ఆ లేఖలో మదన్ పేర్కొన్నాడు. మదన్ ఆదృశ్యంపై అత డి భార్య, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పచ్చముత్తుపైనే అనుమానం వ్యక్తం చేశారు. రూ.80 కోట్ల స్థలానికి ఎసరు చెన్నై కోయంబేడు బస్టాండ్ సమీపంలో రూ.80 కోట్ల విలువైన తన స్థలాన్ని పచ్చముత్తు మనుషులు కబ్జా చేశారని, స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని తనను బెదిరిస్తున్నారని 62 ఏళ్ల డైశీరాణి గతేడాది పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా తమిళనాడులోని కాంచీపురం జిల్లా కట్టన్ కలత్తూర్‌లో తంగల్ లేక్ వద్ద ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కబ్జా చేసిన రూ.70 కోట్ల విలువైన 7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని రెవెన్యూ శాఖ గతేడాది ఆగస్టులో నోటీసులు జారీ చేసింది. మెడికల్ అభ్య ర్థులను మోసం చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పచ్చముత్తును పోలీసులు అరెస్టు చేయడం, పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ చేస్తున్న నేపథ్యంలో... రెవెన్యూ నోటీసులు రావడం తో ఎస్ఆర్ఎం వర్సిటీ వెనక్కి తగ్గింది. తమ ఆక్రమణలో ఉన్న 7 ఎకరాలను ఖాళీచేసి ప్రభుత్వానికి అప్పగించింది. గ్లోబల్ టెండర్ల ఊసేది? ప్రైవేట్ సంస్థలకు భూములను కట్టబెట్టాలంటే నిబంధనల ప్రకారం.. గ్లోబల్ టెండర్లు పిలవాలి. ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకొచ్చిన సంస్థకే భూములు విక్రయించాలి. రాబడి పెంచుకునేందుకు ఏ ప్రభుత్వమైనా ఇదే పని చేస్తుంది. కమీషన్ల జబ్బు పట్టిన తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి నిబంధనలను గుర్తుచేస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అందుకే అమరావతిలో భూముల కేటాయింపులో గ్లోబల్ టెండర్లు పిలవడం లేదు. అమరావతిలో ఇప్పటిదాకా ఊరూపేరూ లేని సంస్థలకు సైతం భూ సంతర్పణ చేశారు. కమీషన్ల కింద రూ.వందల కోట్లు దండుకున్నారు. మెడికల్ సీట్లు ఇస్తామని భారీగా వసూళ్లు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ సీట్లు ఇస్తామని పచ్చముత్తు, ఆయన మను షులు పలువురు విద్యార్థుల నుంచి భారీ గా వసూళ్లు చేశారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని సీట్లు ఇవ్వలేదంటూ 100 మందికి పైగా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.75 కోట్లు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదులందాయి. -
ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో రెండు ప్రయివేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని, స్విస్ ఛాలెంజ్‌ను నియంత్రించాలంటూ ఆయన ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టారు. పరువు హత్యల నిరోధం, భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేలా చట్టం తేవాలంటూ విజయసాయిరెడ్డి ప్రయివేటు బిల్లు ప్రతిపాదించారు. ‘పరువు పేరుతో నేరాల నిరోధం–భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛలో జోక్యం నిరోధం బిల్లు–2017’ను విజయసాయిరెడ్డి ప్రయివేటు మెంబర్ బిల్లుగా ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల ఉద్దేశాలు, కారణాలను వివరిస్తూ.. యువత వివాహం చేసుకునేందుకు భాగస్వామిని ఎంచుకున్నప్పుడు కుటుంబం, కులం, మతం చూపుతూ పరువు పేరుతో వాటిని నిరాకరించడమే కాకుండా నేరాలకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఈ నేరాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. పరువు పేరుతో యువతీ యువకుల వివాహ భాగస్వామి ఎంపిక స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ తరహా నేరాలు ఆర్టికల్ 16(1)(బి)ని ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత బిల్లు ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి జీవించే హక్కును కల్పించడంతోపాటు వేధింపులు, హింస, స్వేచ్ఛాయుత ఎంపికలో జోక్యాన్ని నిరోధిస్తుందని పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్ విధాన నియంత్రణ బిల్లు.. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులలో అయాచిత ప్రతిపాదనలు ఆమోదించడాన్ని నియంత్రించేందుకు గాను రాజ్యసభలో విజయసాయిరెడ్డి బిల్లును ప్రతిపాదించారు. మౌలిక వసరుల ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రయివేటు రంగం పాత్ర ఇటీవల బాగా పెరిగిపోయిందని, కాంట్రాక్టులు ఇవ్వడంలో పారదర్శకతను ఇది సవాలు చేస్తోందని బిల్లు ప్రతిపాదనకు గల కారణాలు, ఉద్దేశాలు శీర్షికన వివరించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టు ప్రతిపాదిత సంస్థకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఒనగూరకుండా రాష్ట్రాలు తగిన అధ్యయనం ద్వారా పరామితులు విధించాలన్నది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా వివరించారు. మౌలిక వసతుల ప్రాజెక్టులను కాంట్రాక్టుగా ఇచ్చినప్పుడు వాటిలో పారదర్శకతో ఉండేలా ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. -
‘సింగపూర్’కే అనుకూలం
-
‘సింగపూర్’కే అనుకూలం
కుండబద్దలు కొట్టిన సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఏదీ సవ్యంగా సాగడం లేదని, ఇందులో పెద్ద కుంభకోణం దాగి ఉందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు చేస్తున్న విమర్శలు సహేతుకమైనవేనని సాక్షాత్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) రుజువు చేసింది. స్విస్ చాలెంజ్ విధానమంతా సింగపూర్ సంస్థలకు బాసటగా, పూర్తిగా వాటికి లాభం చేకూర్చే పద్ధతిలో ఉందని సీఆర్డీఏ స్పష్టం చేసింది. రాజధాని స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ కంపెనీలు ఇస్తామన్న రెవెన్యూ వాటాపై సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సింగపూర్ కంపెనీలు స్విస్ చాలెంజ్‌లో చేసిన ప్రతి పాదనలను ప్రభుత్వం అంగీకరించడంతో సీఆర్డీఏకు, ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని, ఎంపిక విధానంలో జరిగిన లోపాలను సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టంగా ఎత్తి చూపారు. రెవెన్యూ వాటాల నిర్ధారణలో అన్యాయం రాజధాని స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధికి స్విస్ చాలెంజ్ టెండర్లో సింగిల్ బిడ్ దాఖ లైనందున రెవెన్యూ వాటాల నిర్ధారణలో న్యాయం జరగలేదని, కౌంటర్ ప్రతిపాద నలు వచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు. సీఆర్డీఏ పరిధిలో ఇటీవల ప్రభుత్వం ప్రైవేట్ విద్య, వైద్య సంస్థలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున భూమిని కేటాయించిన విషయాన్ని అజయ్‌జైన్ గుర్తు చేశారు. కాగా రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాలను ఇవ్వగా.. ఆ కంపెనీలు ఎకరానికి కేవలం రూ.26.3 లక్షల చొప్పున 15 సంవత్సరాల్లో రూ.466 కోట్ల రెవెన్యూ షేర్ మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. -
వేల కోట్ల ‘వాటా’ల కోసమే సింగపూర్ బాట
-
సింగపూర్‌తో ‘చంద్ర’ బంధం
న్యాయస్థానాలు ఆక్షేపించినా స్విస్ ఛాలెంజ్ వదలరు - వేల కోట్ల ‘వాటా’ల కోసమే సింగపూర్ బాట - రాజధాని ‘స్టార్టప్’లో బాబు అండ్ కో భారీ స్కెచ్ - 1691 ఎకరాల భూమి, రూ. 5,721 కోట్ల పెట్టుబడికి దక్కేది రూ. 372 కోట్లు - రూ. 306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్ కన్సార్టియంకు రూ. 52,439 కోట్లు లాభం - అయినా సింగపూర్‌కే అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం - బాబు బినామీలతోనే మేనేజ్మెంట్ కంపెనీ - దానిని అడ్డుపెట్టుకుని భారీ దోపిడీకి పథకం ‘‘స్విస్ చాలెంజ్ విధానం పారదర్శకంగా లేదు. ఈ విధానంలో ఏయే ప్రాజెక్టులు చేపట్టనున్నారో అందరికీ తెలిసేలా పారదర్శకంగా ప్రభుత్వం అన్నీ ప్రకటించాలి. ప్రాజెక్టు వివరాలు ప్రభుత్వం ఎవరికీ ఇవ్వకూడదు. ఈ విధానంలో పాల్గొనే సంస్థలతో ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపకూడదు.’’ – 11.05.2009న lఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ‘‘స్విస్ చాలెంజ్ విషయంలో ఎందుకీ లోగుట్టు? విదేశీ కంపెనీల కోసం నిర్ణయాలు తీసుకోవద్దు. రాజధాని ప్రజల ఆస్తి. మీ ఇష్టారా జ్యంగా వ్యవహరి స్తామంటే చెల్లదు. ఆదాయవ్యవ హారా లన్నీ బహిర్గతం చేయాల్సిందే. టెండర్ నోటిఫికేషన్లో పారదర్శకత ఎక్కడా లేదు. మీరు చెప్పేది కాగితాలపై ఒకటి ఉంటుంది. ఆచరణలో మరొకటి జరుగుతుంది.’’ – రాష్ట్ర ప్రభుత్వ తీరుపై 23.08.2016న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు ‘‘సీఆర్డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఆదేశాలను పాటించడం తప్ప, తాము ఏమీ చేయలేమని ఆ సంస్థ ఉద్యోగులంటున్నారు. కారణం లేకుండా మమ్మల్ని తొలగించారు. తర్వాత లండన్‌కు చెందిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ను ఎంపిక చేశారు. కానీ ఎలా ఎంపిక చేసిందీ బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. దీన్ని బట్టి ఇక్కడ ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఎంపికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.’’ – ఆర్కిటెక్చురల్ డైజెస్ట్ ఏప్రిల్ సంచికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాకి అసోసియేట్స్ ఫౌండర్ చైర్మన్ ఫుమిహికో కథనం సాక్షి, అమరావతి: పత్రికలు, మేధావులు, రాజకీయనాయకులు, ప్రతిపక్షాలు పలుమార్లు ఇది తప్పు అని ఖండించినా.. న్యాయస్థానాలు పూర్తిగా ఎండగట్టినా.. కాస్త ఆలస్యమైతే చేశారు గానీ.. మళ్లీ అదే స్విస్ చాలెంజ్.. అవే సింగపూర్ కంపెనీలు.. అవే లోపాయికారీ ఒప్పందాలు.. అవే పద్ధతుల్లో.. ఎలాంటి జంకూగొంకూ లేకుండా రాజధాని స్టార్టప్ ప్రాజెక్టును కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. వేల కోట్లు దుర్వినియోగం కాబోతున్నాయని.. అందులో భారీ వాటా దక్కించుకోబోతున్నారని చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. అందుకే ఈ స్థాయిలో చంద్రబాబు ముందుకు పోతున్నారని, న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నా బరితెగించినట్లు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులంటున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1691 ఎకరాల భూమి ఇవ్వడంతోపాటు రూ.5,721.9 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెడుతోంది. ఆ ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు అప్పగించింది. ఈ ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియం రూ.306.4 కోట్లను పెట్టుబడి పెడుతోంది. రూ.5,721.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తామని సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదిస్తే.. అంతకన్నా ఎక్కువ వాటా కోసం ప్రయత్నించాల్సింది పోయి 42 శాతమే చాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. అంటే రూ.306.4 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంకు దక్కే వాటా 58 శాతం. దీనిని బట్టి అర్ధం కావడం లేదూ ‘వాటా’ల కోసమే ‘వాటాల’లో తేడా వచ్చిందని? రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ 8.7శాతమట.. న్యాయస్థానాలు అనేకసార్లు మొట్టికాయలు వేశాక అంతిమంగా రాష్ట్రప్రభుత్వానికి వచ్చే లాభం గురించి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో బయటపెట్టారు. మొత్తం 1691 ఎకరాల స్టార్టప్ ఏరియాను 15 ఏళ్లలో మూడు దశల్లో అభివృద్ధి చేస్తారని, తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తారని కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. ఇందులో సింగపూర్ కన్సార్టియం చేసేదేమీ లేదు. భూమి ఇచ్చి మౌలికసదుపాయాలకు రాష్ట్రప్రభుత్వమే రూ.5,500 కోట్లు ఖర్చుపెడితే ఆ భూమిలో రహదారులు, పార్కులు విడగొట్టి మిగిలిన 1070 ఎకరాల మేర భూమిని ప్లాట్లు చేసి అమ్ముకోవడమే మేనేజ్మెంట్కంపెనీ ముసుగులో సింగపూర్ కన్సార్టియం చేసేది. అలా అమ్మగా వచ్చే లాభాలలో మొదట దశలో 5శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం రెవెన్యూ వాటాను రాష్ట్రప్రభుత్వానికి ఇస్తారు. మూడు దశల్లో కలిపితే ఇది 8.7 శాతం ఉంటుందని అంచనా. రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్నంతా ఏడీపీలోని సింగపూర్ కన్సార్టియం, సీసీడీఎంసీఎల్ 58ః42 నిష్పత్తిలో పంచుకుంటాయి. రూ.5721.9 కోట్ల పెట్టుబడికి వచ్చేది రూ.372.36 కోట్లే! స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీఎల్) కలసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ)ని ఏర్పాటుచేశాయి. ► రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ముసుగులో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్న సర్కార్ 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను సర్కార్ కల్పించనుంది. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని సింగపూర్ సంస్థలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇందులో తమ వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లనీ.. మిగతా రూ.2618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణం రూపంలోనూ ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదనకు సర్కార్ అంగీకరించింది. ► ఈ ప్రాజెక్టులో రూ.5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ట్రప్రభుత్వానిది 42 శాతం వాటా కాగా.. కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంది 58 శాతం కావడం గమనార్హం. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తాము నియమించే మేనేజ్మెంట్ కంపెనీకే ఏడీపీ అప్పగించాలన్న సింగపూర్ సంస్థల ప్రతిపాదనకూ సర్కార్ అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు.. ప్లాట్లను విక్రయిస్తుంది. ► స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రహదారులు, పార్కులకు పోగా మిగిలిన 1,070 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. అంటే.. ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్లో తొలి దశలో 5, రెండో దశలో 7.5, మూడో దశలో 12 అంటే సగటున 8.7 శాతం వాటా ఇస్తే ప్రభుత్వానికి దక్కేది రూ.372.36 కోట్లే. ఏడీపీకి దక్కేది రూ.3907.64 కోట్లు. ► ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లును కలిపితే రూ.4,907.64 కోట్లు వస్తుంది. అయితే మేనేజ్ మెంట్ కంపెనీ ఖర్చులతో పాటు రాజధాని స్టార్టప్ ఏరి యా ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో దోపిడీ పథకం రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును తాము నియమించే మేనేజ్మెంట్ కంపెనీకే ఏడీపీ అప్పగించాలన్న సింగపూర్ సంస్థల ప్రతిపాదనకూ సర్కార్ అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ సంస్థల ప్రతిపాదనల్లో వెల్లడించకపోవడం గమనార్హం. ఆ మేనేజ్మెంట్ కంపెనీ ముఖ్యనేత బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు.. ప్లాట్లను విక్రయిస్తుంది. ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్మెంట్ కంపెనీకి చెల్లించాలి. ఒకవేళ అధిక ధరకు అమ్ముకున్నా అడిగే నాధుడులేడు. ఆ లాభాలను సింగపూర్ సంస్థలే పంచుకుంటాయి. రాష్ట్రానికి దక్కేదేమీ ఉండదు. మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.4 కోట్లకు ఎకరం చొప్పున భూమిని కొట్టేసేందుకు చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. విజయవాడలో ప్రధాన కేంద్రాల్లో గజం భూమి రూ.లక్ష పలుకుతోంది. ఈ లెక్కన రాజధానిలో ప్రాంతంలోనూ అదే ధర పలుకుతుందనుకుంటే.. ఎకరం భూమి రూ.40 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన 1,070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను ముఖ్యనేత, సింగపూర్ సంస్థలు సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థలకు అప్పగించడానికి సర్కార్ అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.పది వేల కోట్లు ఆ సంస్థలకు ఆదాయం వస్తుంది. ఇందులో ఒక్క పైసా కూడా వాటా ఇవ్వమని ఆ సంస్థలు పెట్టిన షరతుకూ సర్కార్ అంగీకరించింది. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి ఆదిలోనే రూ.9,693.60 కోట్ల లాభం దక్కించుకోనున్నాయి. మొత్తమ్మీద స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనిష్ఠంగా రూ.52,439.6 కోట్లను ముఖ్యనేత, సింగపూర్ సంస్థలు కాజేయనున్నాయి. -
ఎక్కడైనా డెవలపర్లదే పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వం మరో దోపిడీకి తెర లేపిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు లాలూచీ పడ్డారని.. మన భూమి, నిదులు ఇచ్చి మరీ వాళ్లకు దోచి పెడుతున్నారని ఆయన అన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం చేసుకుంటున్న వైనంపై ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ దోపిడీని అడ్డుకునేవారందరినీ అభివృద్ధి నిరోధకులని అంటున్నారని ఆయన విమర్శించారు. సాధారణంగా భూములు ఎవరిచ్చినా డెవలపర్లే పెట్టుబడి పెడతారని, మనం వ్యక్తిగత స్థాయిలో మనకున్న భూమిని అపార్టుమెంట్లుగా కట్టడానికి డెవలప్మెంట్కు ఇచ్చినా నిధులు వాళ్లే సమకూర్చి పనులన్నీ చేసిన తర్వాత మన వాటా మనకు ఇస్తారని ఆయన చెప్పారు. కానీ సింగపూర్ కంపెనీల విషయంలో మాత్రం ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, మకీ కంపెనీ చైర్మన్ కూడా అదే విషయం చెప్పారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకత లేదని, అంతా గోప్యమని, రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆయన సుదీర్ఘంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అంతర్జాతీయ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదని, చంద్రబాబు తన తాబేదారులకు అప్పనంగా దోచిపెడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగపూర్ కంపెనీలపై విచారణ జరిపించాలని, ప్రభుత్వం లాలూచీ పడిందన్న విషయాన్ని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవినీతి విషయంలో ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎక్కడైనా డెవలపర్లదే పెట్టుబడి : బొత్స
-
ఔను.. తుస్ చాలెంజే!
-
ఔను..తుస్ చాలెంజే !
-
ఔను.. తుస్ చాలెంజే!
► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సింగపూర్ కన్సార్టియంకు అప్పగింత ► రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర ► రూ. 5,721 కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం ► రూ. 306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58% ► త్వరలో ఏడీసీ, కన్సార్టియం ఒప్పందం సాక్షి, అమరావతి: అంతా ముందు నుంచి అనుకున్నట్లే పక్కా ప్రణాళికతో జరిగిపోయింది. రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టింది. స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపిస్తూ.. ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా, తాము కోరుకున్న కన్సార్టియంకే ఈ ప్రాజెక్టు దక్కేలా ప్రభుత్వ పెద్దలు సాగించిన మంత్రాంగం ఫలించింది. ఈ మేరకు మంత్రివర్గం దీనికి ఆమోదముద్ర వేసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెంబ్‌కార్ప్‌లతో కూడిన సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో తన పెట్టుబడితోసహా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు ఖర్చు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం వాటా 42 శాతం కాగా, కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీల కన్సార్టియం వాటా 58 శాతం కావడం గమనార్హం. రాజధానిలో ప్రాజెక్టు పేరిట సింగపూర్ కంపెనీలతో కలిసి రూ.లక్ష కోట్లకుపైగా దోచుకోవడానికి ‘ముఖ్య’నేత స్కెచ్ వేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో 58 శాతం వాటాను సింగపూర్ కంపెనీలకు ఇచ్చి, కేవలం 42 శాతం వాటా మాత్రమే తాను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అగీకరించింది. స్విస్ చాలెంజ్ విధానంలో గ్లోబల్ టెండర్ పిలిచినా ఇతరులెవరూ పోటీ బిడ్లు దాఖలు చేయకపోవడంతో సింగపూర్ కన్సార్టియంకే ఈ ప్రాజెక్టును అప్పగిస్తూ కేబినెట్ తీర్మానించింది. కేబినెట్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలను చంద్రబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కింద రాజధాని కోర్ ఏరియాలో 1,691 ఎకరాలను సింగపూర్ కన్సార్టియంకు అప్పగిస్తారు. కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కలిసి 15 సంవత్సరాల్లో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 656, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాలను కన్సార్టియంకు అప్పగిస్తారు. మొదట 50 ఎకరాలను నామమాత్రపు ధరకే ఇస్తారు. లాభాల్లో 42:58 శాతం వాటాలు పంచుకోవడంతోపాటు భూమికి సంబంధించిన గ్రాస్ టర్నోవర్‌లో మొదటి విడత 5 శాతం, రెండో విడత 7.5 శాతం, మూడో విడత 12 శాతం (సరాసరి 8.7 శాతం) ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ), సింగపూర్ కన్సార్టియం కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్(ఏడీపీ)గా ఏర్పడి ఈ ప్రాజెక్టును చేపడతాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను వేలం ద్వారా ప్రపంచంలోని కంపెనీలకు ఏడీపీ కేటాయిస్తుంది. మరోవైపు మౌలిక సదుపాయాలకు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ) రూ.2,118 కోట్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. స్టార్టప్ ఏరియాలో మొదటి దశలో 8–9 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం చేపడతారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఏడీసీ, సింగపూర్ కన్సార్టియం ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. -
మీ టర్నోవర్ ఎంతో చెప్పండి
⇒ ఎన్వియన్ ఇంజనీర్స్కు స్పష్టం చేసిన హైకోర్టు ⇒ అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామన్న ఎన్వియన్ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ దాఖలు చేసిన చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ సంస్థ వార్షిక టర్నోవర్ వివరాలను ఉమ్మడి హైకోర్టు కోరింది. గత ఐదేళ్ల టర్నోవర్ వివరాలను తమ ముందుంచాలంది. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనే సత్తా ఉందో లేదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ విషయాల్లో తమకు సంతృప్తి కలిగిం చాలని, ఆ తరువాతే మిగిలిన విషయాల్లోకి వెళతామంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అది స్విస్ చాలెంజ్ విధానం కాదు రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం స్విస్ చాలెంజ్ విధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ జారీ చేసిన జీవో 170కి సవరణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఎన్వియన్ ఇంజనీర్స్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుం డగా, న్యాయ మూర్తి జోక్యం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో పాలు పంచుకునే విషయంలో మీరెంత (ఎన్వియన్) సీరియస్‌గా ఉన్నారు? పాల్గొనేంత సమర్థత మీకుందా? అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రెడ్డి సమాధానమిస్తూ... తాము ప్రభుత్వం రూపొందించిన అర్హత నిబంధనలనే సవాలు చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రతిపాదకుడిగా (ఓపీపీ) సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు ఏదైనా కంపెనీ పోటీగా బిడ్ సమర్పించి హయ్యస్ట్ బిడ్డర్‌గా నిలిస్తే, ఓపీపీ తన ప్రతిపాదనలను సవరించే అవకాశం ఉంటుందని, అదే అవకాశం హయ్యస్ట్ బిడ్డర్‌కు ఉందని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చేందుకేనని, ఇలాంటి నిబంధనలు స్విస్ చాలెంజ్‌లో ఇంకా ఉన్నాయన్నారు. అందుకే తాము ఓపెన్ టెండర్ విధానం అమలుకు కోరుతున్నామని వివరించారు. స్విస్ చాలెంజ్‌లో ఓపీపీ ఎటువంటి చర్చలు, అభ్యర్థనలు లేకుండా సుమోటో ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుం దన్నారు. ఇక్కడ సింగపూర్ కన్సార్టియం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సింగపూర్ కన్సార్టియంతో పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపిందన్నారు. ఇందుకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్‌నోటే సాక్ష్యమని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కోర్టు కోరిన వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. -
‘స్విస్’పై మళ్లీ చాలెంజ్
-
‘స్విస్’పై మళ్లీ చాలెంజ్
స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో మరో పిటిషన్ ⇒ ఏపీఐడీఈ చట్టానికి సవరణల ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం ⇒ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు, ప్రజాప్రయోజనాలకూ విరుద్ధమే ⇒ సింగపూర్ కన్సార్టియం కోసమే చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు ⇒ దేశీయ బిడ్డర్లను పోటీ నుంచి తప్పించేందుకు ఎత్తులు ⇒ నిబంధనలు, ఆర్థిక అర్హతలు అన్యాయంగా ఉన్నాయి ⇒ ‘స్టార్టప్ ఏరియా అభివృద్ధి’ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కాదు ⇒ అది పూర్తిగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే.. ప్రస్తుత బిడ్డింగ్ రద్దు చేయాలి ⇒ ఓపెన్ బిడ్డింగ్ విధానం ద్వారా టెండర్ల ప్రక్రియను చేపట్టాలి ⇒ మొత్తం వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. స్విస్ చాలెంజ్ వి ధానం కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఇచ్చిన జీవో 170కి సవరణ చేస్తూ ఈ ఏడాది జనవరి 2న ప్రభుత్వం జీవో 1ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో 1ను సవాలు చేస్తూ చెన్నైకి చెందిన ‘ఎన్వియన్ ఇం జనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధి కె.శ్రీధర్ రావు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశా రు. ఇందులో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జనవరి 2న జారీ చేసిన జీవో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్ట నిబంధనలకు విరుద్ధమని ఎన్వియన్ సంస్థ తన పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్, టెండర్ ప్రక్రియను రద్దు చేసి, తాజాగా ఓపెన్ బిడ్డింగ్ విధానం ద్వారా టెండర్ల ప్రక్రియను చేపట్టేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఏపీఐడీఈ చట్ట నిబంధనలు తూచ్ ‘‘రాజధానిలో 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి నిమిత్తం సింగపూర్‌కు చెందిన అసెండాస్–సింగ్‌బ్రిడ్జ్– సెంబ్‌కార్ప్ కంపెనీల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడి(ఓపీపీ)గా స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిష నర్ గతేడాది ఆగస్టు 18న టెండర్ నోటిఫికేష న్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో గడువు తేదీని పెంచడంతోపాటు బిడ్ల ప్రక్రియను రెండుగా విభజిస్తూ ఆగస్టు 28న ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ మొత్తం వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం పలు అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించారు. రెండు నోటిఫికేషన్ల అమలుపై స్టే విధిస్తూ గతేడాది సెప్టెంబర్ 12న మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ వేర్వేరుగా రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. ఏపీ ఐడీఈ చట్టానికి సవరణలు చేస్తున్నట్లు విచార ణ సమయంలో అడ్వొకేట్ జనరల్ నివేదించా రు. దీంతో ధర్మాసనం ఈ అప్పీళ్లను పరిష్కరి స్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టానికి పలు సవరణ లు తీసుకొచ్చింది. చట్టంలో రాజీ ప్రక్రియకు ఆస్కారం లేకుండా చేశారు. పోటీతత్వాన్ని నిరోధించి, కొందరికి మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించేందుకు వీలుగా అర్హులైన బిడ్డర్లు అన్న పదాన్ని చేర్చారు. సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగా చట్టాన్ని సవరించారు. కన్సార్టియంకు లబ్ధి చేకూర్చేందుకు చట్టంలో సవరణలు చేసిన ప్రభుత్వం, పోటీ ప్రతిపాదనలను ఆహ్వానించడాన్ని నామమాత్రం చేసేసింది. గత నెల 3న తాజా టెండర్లు ఆహ్వానిస్తూ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసులో బిడ్డింగ్ ప్రక్రియను రెండంచెల ప్రక్రియగా మార్చింది. మొదట వచ్చిన దరఖాస్తుల్లో బిడ్డర్లకు అర్హతలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. అర్హతలు ఉంటేనే రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇది ఏకపక్ష నిర్ణయమే కాకుండా, వివక్షతో కూడుకున్నది కూడా. ఈ నిర్ణయంలో పారదర్శకత లోపించింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఏపీఐడీఈ చట్ట నిబంధనలు వర్తించకుండా చేశారు. కాబట్టి ఇది మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కానేకాదు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమే అవుతుంది’’ అని ఎన్వియన్ సంస్థ తన వ్యాజ్యంలో స్పష్టం చేసింది. ఇది స్విస్ చాలెంజ్ నిర్వచనం పరిధిలోకి రాదు ‘‘సింగపూర్ కంపెనీల కన్సార్టియం కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం మొత్తం ప్రక్రియను మార్చేసింది. ప్రభుత్వం తన ఇష్టాయిష్టాలకు అనుగు ణంగా వ్యవహరిస్తోంది. అసలు ఇది స్విస్ చాలెంజ్ నిర్వచనం పరిధిలోకే రాదు. ఓపీపీ సుమోటో(తనంతట తాను)గా ప్రతిపాదనలు సమర్పించినప్పుడే అది స్విస్ చాలెంజ్ అవుతుంది. కానీ, ప్రభుత్వం ఇక్కడే ముందే నిర్ణయం తీసుకుని, సింగపూర్ కంపెనీలతో సంప్రదింపులు జరిపి ఆ తరువాత ప్రతిపాదనలు స్వీకరించింది. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు, ప్రజాప్రయోజనాలకు కూడా విరుద్ధం. నిబంధనలు, ఆర్థిక అర్హతలు, ప్రాసెసింగ్ ఫీజులు, బిడ్ సెక్యూరిటీ తదితరాలన్నీ కూడా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నిర్ణయించింది. పోటీని వీలైనంత కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకే ఇలా చేసింది. దేశీయ డెవలపర్లను పోటీ నుంచి తప్పించే దిశగా అర్హతలను నిర్ణయించింది. సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలు, ఆదాయ వాటాను చూడకుండానే గుడ్డిగా ఆమోదించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు ప్లాట్ల అమ్మకాలకు ఉద్దేశించింది. కాబట్టి దీన్ని ఏపీఐడీఈ చట్టం కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు అనలేం. థర్డ్ పార్టీలకు అమ్మేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించినందున ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే అవుతుంది. అర్థిక అర్హతలను కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించింది. బిడ్డర్ నికర విలువ రూ.2,000 కోట్లు ఉండాలంది. ప్రాజెక్టును 20 ఏళ్లలో మూడు దశల్లో పూర్తి చేయాలంది. దేశీయ డెవలపర్లను పోటీ నుంచి తప్పించేందుకే ఇలాంటి నిబంధనలను నిర్దేశించారు. సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక బిడ్ ప్రాసెస్ ఫీజును రూ.25 లక్షలుగా, బిడ్ సెక్యూరిటీని రూ.6.35 కోట్లుగా నిర్ణయించింది. ఈ బిడ్ సెక్యూరిటీని సింగపూర్ కంపెనీల కన్సార్టియం నుంచి తీసుకున్నారో లేదో ఎక్కడా చెప్పలేదు’’ అని ఎన్వియన్ కంపెనీ తన పిటిషన్లో పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరింది. -
రాజధాని నిర్మాణం పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర
♦ చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమన కరుణాకర్‌రెడ్డి ♦ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలనే ఉద్దేశంతో తాజా నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల తో మాట్లాడుతూ ‘స్విస్ చాలెంజ్’ విధానం అమలుపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చంద్రబాబు మాత్రం రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకే అప్పగించాలనే ఏకైక ఉద్దేశంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారని విమర్శించారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి పనుల్లో ఇతర కంపెనీలేవీ పాల్గొనడానికి వీల్లేని విధంగా సింగపూర్ కన్సార్టియంకే దక్కే విధంగా విధానాలు రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు లెక్కచేయడం లేదన్నారు. గత ఏడాది జూలై 17వ తేదీన స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించి జారీ చేసిన నోటిఫికేషన్‌పై హైకోర్టు సెప్టెంబర్ 12వ తేదీన తీర్పు నిచ్చిందన్నారు. ఆదాయాన్ని ప్రథమ దశలోనే వెల్లడించాలని హైకోర్టు చెబితే ఆ విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారన్నారు. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసి పూర్తి అధికారాలను తనకే సీఎం దఖలు పర్చుకున్నారని దుయ్య బట్టారు. సవరణల తరువాత ఈ నెల 3వ తేదీన తాజా నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. స్విస్ చాలెంజ్ పరమ చెత్త విధానమని కేల్కర్ కమిటీ 2011లోనే తేల్చిందని, అయినా చంద్రబాబు బరితెగించి తన దోపిడీ కోసమే దీనిని అమలు చేయాలని చూస్తున్నారని భూమన మండిపడ్డారు. ఆ కంపెనీకోసం నిబంధనల మార్పా? స్విస్ చాలెంజ్‌ను హైకోర్టు తప్పు పట్టినా కూడా మళ్లీ సింగపూర్ సంస్థలకే అప్పగించాలనే ఉద్దేశ్యంతో వేరే ఏ ఇతర కంపెనీలు పోటీకి రాకుండా నిబంధనలు మార్చేసి అర్హతలు లేకుండా చేశారని భూమన చెప్పారు. 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ కంపెనీలు రూ 306 కోట్లు పెట్టుబడిగా పెడితే అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ పెట్టుబడికి గాను రాష్ట్ర ప్రభుత్వ వాటా 42 , సింగపూర్ కన్సారŠ?ట్సయం వాటా 58 శాతం ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కమిటీకి సంబంధించిన డైరెక్టర్లలో అత్యధిక శాతం సింగపూర్ వారే ఉంటారని, సీఆర్డీఏ అధికారుల పాత్ర ఏమీ ఉండదని చెప్పారు. -
రాజధాని పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర
-
బాబుగారు.. సింగపూర్ ప్రేమ గాథ
-
ఇదో అమరప్రేమ గాథ
♦ హైకోర్టు అక్షింతలతో టెండర్ నోటిఫికేషన్ రద్దయినా మళ్లీ అవే నిబంధనలు ♦ సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా ఏపీఐఈడీఏ–2001 చట్ట సవరణ ♦ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో పాత ప్రతిపాదనలకే మళ్లీ ఆమోదం ♦ మాస్టర్ డెవలపర్ ఎంపికకు స్విస్ చాలెంజ్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్ ♦ అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీకి అప్పగించడమే లక్ష్యం సాక్షి, అమరావతి ప్రభుత్వం తప్పు చేసింది... హైకోర్టు మొట్టికాయలు వేసింది... తప్పును దిద్దుకోవాల్సిన ప్రభుత్వం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు సూచనలను సైతం తోసిరాజంటున్నారు. ఎవరెన్ని చెప్పినా సింగపూర్ కంపెనీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియం (అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెమ్బ్‌కార్ప్)కు అప్పగించడానికి ఈనెల 3న జారీ చేసిన స్విస్ చాలెంజ్ టెండర్ నోటిఫికేషనే అందుకు తార్కాణం. రాజధాని ఏర్పాటు ప్రకటన వెలువడక ముందే ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు అండ్ కో.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహాలో కాజేసేందుకు వ్యూహం పన్నింది. ఆదాయ వివరాలు రహస్యంగా ఉంచుతూ సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి.. జూలై 17న స్విస్ ఛాలెంజ్ విధానంలో తొలుత టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ విధానంలో లొసుగులపై సెప్టెంబరు 12న ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. దాంతో టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. తప్పులను దిద్దుకోవాల్సింది పోయి మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తోంది. సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేందుకు తొలుత ఏపీఐఈడీఏ(ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబ్లింగ్ యాక్ట్)–2001ను వక్రీకరించిన ప్రభుత్వం.. తాజాగా ఆ చట్టాన్నే సవరించింది. హైకోర్టు ఎత్తిచూపిన తప్పులను దిద్దుకోకుండా సింగపూర్ సంస్థలు తొలుత అందించిన ప్రతిపాదనల ఆధారంగానే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం ఈనెల 3న స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండా స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడాన్ని గతేడాది సెప్టెంబరు 12న హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. టెండర్ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఇంతలోనే తేరుకున్న ప్రభుత్వం.. టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు విన్నవించింది. స్విస్ ఛాలెంజ్ టెండర్ ప్రక్రియను నిలుపుదల చేస్తూ సెప్టెంబరు 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలు.. సర్కార్ బుట్టదాఖలు చేసిన తీరు. ఇదీ.. హైకోర్టు అభ్యంతరం–1: ఒకరు చేసిన సవాలుపై మరొకరు స్పందించేందుకు వీలు కల్పించడంవల్లే దీన్ని ‘ఛాలెంజ్’ అన్నారు. సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయకపోతే.. ఆ ప్రతిపాదనలను ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఎలా ‘ఛాలెంజ్’ చేయగలుగుతారు? ప్రతిపాదనలు బహిర్గతం కానపుడు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరైనా ఎందుకు ఉత్సాహం చూపుతారు? ఉల్లంఘన: ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో వెల్లడించలేమన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండో దశ(వాణిజ్య బిడ్)కు అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఆదాయ వివరాలను వెల్లడిస్తామంటూ సింగపూర్ కన్సార్టియం మళ్లీ పాత పాటే పాడింది. హైకోర్టు అభ్యంతరం–2: సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికిగానీ.. సీఆర్డీఏ అధికారులకుగానీ తెలియనప్పుడు.. ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా వచ్చారు? వాణిజ్య బిడ్ నిబంధనలు తెలియకుంటే రూ.3137.30 కోట్ల భారీ ప్రాజెక్టుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం. ఉల్లంఘన: సింగపూర్ కన్సార్టియం సీఆర్డీఏకు అందించిన ప్రతిపాదనల్లో కనీసం అధికారులకుగానీ.. ప్రభుత్వానికిగానీ ఆదాయ వివరాలను వెల్లడించలేదు. కానీ.. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. హైకోర్టు అభ్యంతరం–3: ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ వంటి సంస్థలు అందుకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తాయి? ఉల్లంఘన: ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్ఫ్రా అథారిటీ, మంత్రి వర్గ ఉప సంఘం, సీఆర్డీఏతో సంబంధం లేకుండా గతేడాది జూలై 7న సింగపూర్ కన్సార్టియం, ఆ దేశ మంత్రి ఈశ్వరన్‌లతో చర్చించి.. ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేశారు. అవే ప్రతిపాదనల ఆధారంగా మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు అభ్యంతరం–4: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్ ఎంపిక వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ ఒక్క అధికారి కూడా సహేతుకంగా, నిష్పక్షపాతంగా, చట్ట నిబంధనలకు లోబడి వ్యహరించలేదు. ఉల్లంఘన: ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆమోదం తప్పనిసరి. కానీ.. ఇటీవల ఏపీఐఈడీఏ–2001ను సవరించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని తప్పించి సీఆర్డీఏ, ప్రభుత్వం ఆమోదం పొందేలా సవరణ చేశారు. తద్వారా హైకోర్టు అభ్యంతరాలను దొడ్డిదారిన అధిగమించారు. హైకోర్టు అభ్యంతరం–5: ఛాలెంజ్ నోటిఫికేషన్లో నిర్దేశించిన అనర్హతల విషయానికి వస్తే ‘భారతదేశం వెలుపల’ అనే నిబంధన పక్షపాతంతో కూడుకున్నది. ఉల్లంఘన: ఏపీఐఈడీఏ–2001 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయ, ఆర్థిక, బ్యాంకు రంగాల్లో నిపుణులైన ఇద్దరు సభ్యులుగా ఏర్పాటు చేసే వివావాద పరిష్కార మండలి అర్హతలు, అనర్హతలు వంటి వివాదాలను పరిష్కరించాలి. కానీ.. ఏపీఐఈడీఏ చట్టంలోని 32 నుంచి 53 సెక్షన్ల వరకూ ఈ ప్రాజెక్టుకు వర్తించవని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆ స్థానంలో లండన్ కేంద్రంగా అంతర్జాతీయ వివావాద పరిష్కార మండలిని ఏర్పాటు చేసి.. అక్కడే వివాదాలు పరిష్కరించుకోవాలని సింగపూర్ కన్సార్టియం మెలిక పెట్టింది. ఈ మండలిలో సింగపూర్ కన్సార్టియం నుంచి ఒకరు, సీసీడీఎంసీఎల్ నుంచి ఒకరు, రెండు సంస్థలు అంగీకారం మేరకు భారతదేశం, సింగపూర్ దేశాలకు చెందని వ్యక్తి మరొకరు సభ్యులుగా ఉంటారు. ఇతర దేశాలకు చెందిన వ్యక్తే మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఛైర్మన్ కచ్చితంగా సింగపూర్ కన్సార్టియం చెప్పినట్టాల్లా తలాడించడం ఖాయం. దీనివల్ల రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియలో ఎవరు దరఖాస్తులు చేసినా.. వారిపై అనర్హత వేటు వేయడం ఖాయమనే భావన బలంగా వ్యక్తమవుతోంది. హైకోర్టు ఇదే అంశాన్ని తేల్చిచెప్పినా.. సర్కార్‌కు కనువిప్పు కలగకపోవడం గమనార్హం. ఆ మర్మం ఏ ‘బాబు’కెరుక? సింగపూర్ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కట్టబెట్టేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం చంద్రబాబునాయుడు ఉత్సాహం చూపుతుండటంలో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. బినామీలతో కలిసి దొరికినంత దోచుకోవడానికి సీఎం చంద్రబాబు మళ్లీ బరి తెగించారు. ఈనెల 3న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. శుక్రవారం సింగపూర్ సంస్థలు బహిర్గతం చేసిన ప్రతిపాదనలే అందుకు తార్కాణం. ఆ ప్రతిపాదనలు ఇవీ.. ► రాజధానిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును 6.84 చదరపు కిలోమీటర్ల(1691 ఎకరాలు)లో చేపడతామని సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించింది. ► స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఏడీపీలో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతం. ► రూ.3137.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్టియం రూ.306.4 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. సీసీడీఎంసీఎల్ రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మిగతా నిధులను స్టార్టప్ ఏరియాలో ప్లాట్లను అభివృద్ధి చేసి.. విక్రయించడం ద్వారా, భూములకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా సమకూర్చుకుంటారు. ఈ ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లతో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. ► ఏడీపీ బోర్డులో ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు. ఇందులో సింగపూర్ కన్సార్టియం నుంచి నలుగురు.. సీసీడీఎంసీఎల్ నుంచి ఇద్దరు ఉంటారు. బోర్డు ఛైర్మన్‌గా సింగపూర్ కన్సార్టియం డైరెక్టరే వ్యవహరిస్తారు. ఏటా కనీసం మూడు సార్లు బోర్డు సమావేశమవుతుంది. సింగపూర్ కన్సార్టియం డైరెక్టర్లు కనీసం ఇద్దరు ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ► స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమల్లోకి వచ్చాక ఏవైనా వివాదాలు ఉత్పన్నమైతే.. లండన్‌లోని అంతర్జాతీయ వివాదా పరిష్కార మండలి(ఎల్ఐసీఏ)లో మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. ఈ మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. సింగపూర్ కన్సార్టియం నుంచి ఒకరు, సీసీడీఎంసీఎల్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు. రెండు సంస్థలు అంగీకారం మేరకు భారతదేశం, సింగపూర్‌లకు చెందని వ్యక్తిని మూడో సభ్యునిగా నియమిస్తారు. ఆ సభ్యుడే మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ► వీటిని పరిశీలిస్తే సింగపూర్ సంస్థలు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నది స్పష్టమవుతోంది. సింగపూర్ కన్సార్టియం అడుగులకు ప్రభుత్వం మడుగులొత్తినా రాజధాని స్టార్టప్ ఏరియా ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయమని.. వాణిజ్య బిడ్‌కు అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే వెల్లడిస్తామని ఆ కన్సార్టియం మెలిక పెట్టడం గమనార్హం. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంకు వంత పాడటంలో మర్మమేమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రార్థనా మందిరాలు, శ్మశానాల తొలగింపు... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపడుతోన్న 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనామందిరాలు, శ్మశానాలు, చెట్లు వంటివన్నీ తొలగించాలంటూ సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అంటే.. ఆ ప్రాంతంలోని ప్రార్థనామందిరాలు, శ్మశనాలను తొలగించడం ఖాయం. చెట్లను నరికివేయడం అంతే ఖాయం. ప్రజల మనోభావాలతో చెలగాటమాడేందుకు సింగపూర్ కన్సార్టియం సిద్ధమైనా ప్రభుత్వం వంతపాడటం గమనార్హం. రూ.306కోట్ల పెట్టుబడితో రూ.52,493.6 కోట్లు దోపిడీకి ఎత్తులు... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్టియం పెట్టే పెట్టుబడి రూ.306.4 కోట్లు మాత్రమే. అదే రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే.. ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58%.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. ► ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 50%, తమ వాటా 50% ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. కన్సార్టియంగా ఏర్పడిన సింగపూర్ సంస్థల్లో తన బినామీలు ఉండటంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. జూలై 7, 2016న సింగపూర్ సంస్థలతో చర్చించిన సీఎం.. ఏడీపీలో ఆ సంస్థల వాటాను 58 శాతానికి పెంచాలని, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గించాలని స్వయంగా సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు. కానీ.. ప్రభుత్వ వాటాను సీఎం చంద్రబాబు తగ్గించమనడాన్ని బట్టి చూస్తే బినామీలతో కలిసి అడ్డగోలుగా దోచుకోవడానికి ఏ స్థాయిలో బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియం నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగిస్తుంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతిపాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్మెంట్ కంపెనీ సీఎం చంద్రబాబు బినామీలది కావడంవల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్లను విక్రయిస్తుంది. ► ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్మెంట్ కంపెనీకి చెల్లించాలి. ఒకవేళ మేనేజ్మెంట్ కంపెనీ ఎకరం భూమిని రూ.నాలుగు కోట్లకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అంటే నష్టమొస్తే ప్రభుత్వం భరించాలి, లాభమొస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇలా మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.4 కోట్లకు ఎకరం చొప్పున భూమిని కొట్టేసేందుకు చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. ► విజయవాడలో బందరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో గజం భూమి కనిష్టంగా రూ.లక్ష పలుకుతోంది. రాజధానిలో అత్యంత ప్రధానమైన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ భూమి విలువ ఇదే రీతిలో పలుకుతుంది. అంటే ఎకరం భూమి రూ.40 కోట్లు పలుకుతుంది. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులు పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు పోను మిగిలిన 1070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.పది వేల కోట్లు సింగపూర్ కన్సార్టియంకు దక్కనున్నాయి. మొత్తమ్మీద రూ.52,800 కోట్లను సింగపూర్ కన్సార్టియం సొమ్ముచేసుకోనుంది. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి రూ.52,800 కోట్లు దక్కించుకోనున్నాయన్న మాట. వీటిని పరిగణనలోకి తీసుకుంటే సింగపూర్ కన్సార్టియం ముసుగులో చంద్రబాబు అండ్ కో రూ.52,493.6 కోట్లను కొల్లగొట్టనున్నాయన్నది స్పష్టమవుతోంది. ఇంత ఆదాయం వచ్చే ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం వెల్లడించకపోవడం గమనార్హం. 1691 ఎకరాల్లో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే రూ.52,493.6 కోట్లు కొల్లగొడితే.. 53 వేల ఎకరాల్లో చేపట్టే రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటారో అర్థం చేసుకోవచ్చు. -
మళ్లీ ‘స్విస్ చాలెంజ్’ టెండర్
-
మళ్లీ ‘స్విస్ చాలెంజ్’ టెండర్
♦ గతంలో సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా నిబంధనలు ♦ కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏపీఐడీఈ చట్టాన్నే మార్చిన ప్రభుత్వం ♦ అందుకనుగుణంగా కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన సీఆర్డీఏ ♦ రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ♦ ఫిబ్రవరి 21 వరకూ టెండర్ల దాఖలు గడువు సాక్షి, అమరావతి: వివాదాస్పదమైన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) స్విస్ చాలెంజ్ విధానంలో మళ్లీ టెండర్లు పిలిచింది. గతంలో పిలిచిన టెండర్‌పై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగడంతోపాటు కోర్టులోనూ సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఎత్తులు వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. చివరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏకంగా ఏపీఐడీఈ చట్టాన్నే మార్చేసింది. దానికనుగుణంగా తాజాగా మళ్లీ టెండర్లు పిలిచింది. రెండురోజుల క్రితమే దీనిపై ఒక జీఓను సైతం విడుదల చేసింది. నిబంధనలన్నీ సింగపూర్ కంపెనీలకే అనుకూలం 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్‌కు చెందిన అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెమ్‌కార్ప్ లిమిటెడ్ కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. దీన్ని ఆమోదించిన ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానంలో అంతకంటే మెరుగైన ప్రతిపాదనల కోసం మూడు నెలల క్రితం అంతర్జాతీయ టెండర్లు పిలిచింది. అయితే, ఈ టెండర్ నిబంధనలన్నీ సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. లోపాయికారీగా సింగపూర్ కన్సార్టియంకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం తూతూమంత్రంగా ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి సిద్ధమైంది. అధికారాలన్నీ సాంకేతిక కమిటీకే.. ప్రభుత్వానికి నష్టం కలిగేలా, దేశీయ కంపెనీలకు ఏమాత్రం అవకాశం లేనివిధంగా ఉన్న టెండర్ నిబంధనలను ఆదిత్య ఇన్ఫ్రా కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలో కీలకమైన ఆదాయ వాటాను ఎందుకు వెల్లడించలేదనే దానికి సమాధానం చెప్పలేకపోయింది. చేసిన తప్పులన్నీ బయటపడిన తర్వాత చేసేది లేక ఏపీఐడీఈ చట్టాన్ని మార్చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలు, అందులోని లోపాలపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా చివరికి సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదముద్ర వేయించారు. కానీ తీరా కోర్టులో తలబొప్పి కట్టడంతో అక్కడ బయటపడిన లోపాలు, సీఎస్ నేతృత్వంలోని కమిటీ అధికారాలన్నీ కత్తిరించేలా చట్టంలో మార్పులు చేశారు. దీనిప్రకారం అధికారాలన్నీ సీఆర్డీఏ నేతృత్వంలోని సాంకేతిక కమిటీకి కట్టబెడుతూ తాజాగా జీఓ విడుదల చేశారు. అందుకనుగుణంగా సీఆర్డీఏ సోమవారం అర్ధరాత్రి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. రెండు దశల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. తొలి దశలో వచ్చిన దరఖాస్తులన్నీ నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించి అర్హతలు సాధిస్తే రెండో దశకు ఎంపిక చేస్తామంది. రెండో దశకు అర్హత సాధించిన కంపెనీలకు సింగపూర్ కన్సార్టియం తన ప్రతిపాదనలో పేర్కొన్న ఆదాయ వాటాను వెల్లడిస్తామని తెలిపింది. ఆసక్తి గల సంస్థలు ఫిబ్రవరి 21లోపు ఏపీ ఈ–ప్రొక్యూర్మెంట్ సెట్లో దరఖాస్తులను అప్లోడ్ చేయాలంది. ఈ నెల 6న ఇదే వెబ్సైట్లో పూర్తి టెండర్ డాక్యుమెంట్, ప్రాజెక్టు వివరాలు ఉంటాయంది. -
మాస్టర్ డెవలపర్ ఎంపిక సీఆర్డీఏకే
స్విస్ చాలెంజ్ నిబంధనలు మార్చిన ఏపీ ప్రభుత్వం.. జీవో విడుదల సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివద్ధికి మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసే బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏకే కట్టబెట్టింది. ఈ మేరకు సోమవారం జీవో నెంబరు ఒకటి విడుదల చేసింది. సింగపూర్ కంపెనీలతో లాలూచీపడి వారి కన్సార్టియంకు ప్రాజెక్టును అప్పగించేందుకు ప్రయత్నించి భంగపడి చివరికి ఏపీఐఈడీ చట్టాన్నే మార్చేసిన ఏపీ ప్రభుత్వం.. అందుకనుగుణంగా తాజాగా టెండరు నిబంధనల్లో మార్పులు చేసింది. సీఆర్డీఏ ఏర్పాటు చేసే టెక్నికల్ కమిటీకే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసే అవకాశాన్ని కల్పించింది. ఎక్కువ ఆదాయాన్ని తీసుకురావడమే టెండర్ లక్ష్యమని నిబంధనల్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం మొత్తం ప్రాజెక్టు విలువను ప్రకటించి అంతకంటె తక్కువకు టెండరు వేసేందుకు ఎవరు ముందుకొస్తే వారికి కేటాయించాల్సివుంటుంది. కానీ గతంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్ డెవలపర్ ఎంత కోట్ చేశారనే విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. సవరించిన నిబంధనల ప్రకారం మొదట ప్రతిపాదన చేసిన కంపెనీ కోట్ చేసిన విలువను వెల్లడించవచ్చు. దీన్ని సీఆర్డీఏ టెక్నికల్ కమిటీ ఆమోదిస్తే సరిపోతుంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏపీఐఈడీ చట్టం కింద చర్చించి ప్రాజెక్టును కంపెనీలకు కేటాయించేవారు. తాజా ఉత్వర్వుల ప్రకారం ఏపీఐఈడీ కాకుండా సీఆర్డీఏనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడింది. గతంలో విడుదల చేసిన స్విస్ ఛాలెంజ్ టెండరు నిబంధనలన్నీ సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా రూపొందించడంతో ఆదిత్య ఇన్ఫ్రా తదితర కంపెనీలు హైకోర్టు కెళ్లడం, కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీంతో ఏపీఐఈడీ చట్టాన్నే ప్రభుత్వం మార్చేసింది. టెండరు వెనక్కు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలతో సవరణలు చేస్తున్నట్లు తాజా జీవోలో పేర్కొంది. టెండరుదారుడు ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇవ్వాల్సివుంటుందనే అంశాన్ని జోడించింది. మార్చిన నిబంధనల ప్రకారం మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం సీఆర్డీఏ త్వరలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండరు పిలవనుంది. -
స్విస్ చాలెంజ్ విధానానికి సవరణలు
అమరావతి: రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ చాలెంజ్ విధానానికి సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికింది. హైకోర్టు తీర్పు మేరకు గతంలోని ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా సవరణలు చేసింది. ఈ సవరణ ఉత్తర్వులతో మాస్టర్ డెవలపర్ ఎంపికకు సీఆర్డీఏ మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. కాగా సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా భూములు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు ఇటీవల హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తప్పు పట్టిన అంశాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలిగించే చట్టంలో సవరణ ద్వారా తొలగించి.. ఆ తరువాత ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేసింది. -
సింగపూర్ కంపెనీలపై ప్రేమతో..
-
సింగపూర్ కంపెనీలపై ప్రేమతో..
- స్విస్ చాలెంజ్‌పై ఆ కంపెనీల పాత ప్రతిపాదనతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్ - ఏపీఐడీఈ చట్టంలో సవరణలతో కొత్త నోటిఫికేషన్ జారీ.. - రెవెన్యూలో ప్రభుత్వ వాటా ఎంతో చెప్పాల్సిన పనిలేదు - ఆసక్తి గల బిడ్డర్ అంటే.. అర్హత గల బిడ్డరే - ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కోరలు పీకేసిన సర్కారు - పలు సెక్షన్లలో అథారిటీ పేరు తొలగింపు - పారదర్శకతకు పాతర.. ఆడిట్ సెక్షన్ లేదు సాక్షి, అమరావతి : సింగపూర్ కంపెనీలే తనకు ముఖ్యమనేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకెళుతున్నారు. ఆరునూరైనా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ కంపెనీలతోనే చేయాలని నిర్ణయించారు. సింగపూర్ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. గతంలో స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు వేసిన బ్రేకులను ఆర్డినెన్స్ ద్వారా తొలగించేశారు. తాను అనుకున్నట్లు చేయడానికి ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి అధికారాలు లేకుండా కోరలు పీకేసింది. అంతేగాక సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదనే నిబంధన ఉండటం విశేషం. గతంలో హైకోర్టు బ్రేక్ సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా భూములు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు ఇటీవల హైకోర్టు బ్రేక్ వేసింది. స్విస్ చాలెంజ్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా జడ్జీలు చేసిన వ్యాఖ్యలను గమనించిన ముఖ్యమంత్రి.. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసుకుంటామన్నారు. కొత్త నోటిఫికేషన్ పిలవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. అయితే హైకోర్టు తప్పు పట్టిన అంశాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలిగించే చట్టంలో సవరణ ద్వారా తొలగించి.. ఆ తరువాత ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా సింగపూర్ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సింగపూర్ కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనలను ఎవరైనా చాలెంజ్ చేయవచ్చుననే నిబంధనతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే రాజధాని ప్రాంతంలో సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదని చట్టంలో సవరణలు చేశారు. కేవలం ప్రతిపాదకుని వ్యవహార ప్రణాళిక, సాంకేతిక సమాచారం, డిజైనులు మాత్రమే వెల్లడిస్తారని, ప్రతిపాదకుడు ఇవ్వచూపిన ఆదాయ వాటా వెల్లడించరని ఆర్డినెన్స్‌లో స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు చెప్పినట్టే చట్టసవరణ హైకోర్టు విచారణలో రెవెన్యూ వాటా వెల్లడే కీలకంగా మారిన విషయం తెలిసిందే. సింగపూర్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఎంత? అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారో చెప్పకుండా ఎలా చాలెంజ్ చేస్తారనేది హైకోర్టు విచారణలో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ వాటా ఎంత అనేది సింగపూర్ కంపెనీలు వెల్లడించవద్దు అన్నాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆ రెవెన్యూ వాటా చెప్పకుండా ఉండేందుకు ఏకంగా చట్టంలోనే సవరణలు చేశారు. అలాగే ఆసక్తి గల బిడ్డర్లు అంటే అర్హత గల బిడ్డర్లేనని చట్టంలో సవరణలు చేశారు. స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టులపై సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విశేష అధికారాలు ఉండేవి. అయితే ఆ అథారిటీకి అధికారాలు లేకుండా చేస్తూ ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల అభివృద్ధి చట్టంలో 20 సెక్షన్లను చంద్రబాబు సర్కారు తొలగించేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదానికి బదులు ప్రభుత్వం అనే పదాన్ని ఉంచాలని కొన్ని సెక్షన్లలో సవరణలు తీసుకువచ్చింది. స్విస్ చాలెంజ్‌లో చేపట్టే ప్రాజెక్టులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ నోటిఫై చేయాల్సిన పనిలేదని, ఇకపై స్విస్ చాలెంజ్‌లో ప్రాజెక్టులను ఆ అథారిటీకి పంపించాల్సిన అవసరం లేదని చట్టంలో మార్పులు చేశారు. పారదర్శకతకు పాతర ఏపీఐడీఈ చట్టం 2001 ప్రకారం స్విస్ చాలెంజ్ ప్రాజెక్టుల నిధుల వ్యవహారాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పర్యవేక్షించాలి. ఏటా వాటి ఆర్థిక లావాదేవీలను కాగ్ ఆడిట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఆ సెక్షన్‌ను పూర్తిగా తొలగించేశారు. అంటే పారదర్శకతకు, ఆడిట్‌కు అవకాశం లేకుండా సవరణలు తీసుకువచ్చారు. స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలను స్థానిక ఏజెన్సీ గానీ ప్రభుత్వశాఖ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపాలి. ఇప్పుడు సవరణల ద్వారా ఆయా ఏజెన్సీలు, శాఖలే ఆ ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదించవచ్చు. స్విస్ చాలెంజ్‌లో పాల్గొనే సంస్థలకు పెట్టుబడి నిమిత్తం ఏ బ్యాంకులు ఎంత నిధులు సమకూరుస్తున్నాయి.. ప్రభుత్వ రాయితీలు ఏమిటనే వివరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి సమర్పించాల్సి ఉండేది. దీన్ని తొలగించేశారు. సింగపూర్ కంపెనీలతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, వీలుగా నోటిఫికేషన్ జారీకే ప్రభుత్వం మార్పులు చేసిందనే విమర్శలున్నాయి. -
బాబు తక్షణమే రాజీనామా చేయాలి
పీఏసీ చైర్మన్ బుగ్గన డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ విధానంపై హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఏపీ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇంకా పదవిలో కొనసాగడం అనైతికమన్నారు. బుగ్గన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారని గుర్తుచేశారు. కోర్టు తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి, ఆ తరువాత పిటిషన్‌ను ఉపసంహరించుకుని, చట్టానికి సవరణలు చేసిందన్నారు. తాజా నోటిఫికేషన్ జారీ చేస్తామని మున్సిపల్ మం త్రి పి.నారాయణ చెప్పడం దారుణమన్నారు. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు వెలువడినపుడు వారు తమ పదవులకు రాజీనామా చేసిన సత్సాంప్రదాయం మన రాష్ట్రంలో ఉందన్నారు. గతంలో ప్రైవేట్ బస్సు రూట్ల జాతీయీకరణను హైకోర్టు తప్పుపడితే అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. అలాగే 9 మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చినప్పుడు హైకోర్టు తప్పుపడితే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. స్విస్ చాలెంజ్‌పై ఎదురుదెబ్బ తిన్న బాబు కూడా ఇదే సంప్రదాయం పాటించి గద్దె దిగాలని రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు చెప్పారు. డబ్బులివ్వడం తప్పు కాదట! ఓటుకు కోట్లు కేసులో ఓటును డబ్బు పెట్టి కొనుగోలు చేయడం తప్పు కాదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి, ఈ నేరాన్ని ఏ చట్టం కింద నమోదు చేయవచ్చో ఆ న్యాయవాదే సెలవిస్తే బాగుంటుందని బుగ్గన అన్నారు. -
కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ కేబినెట్ భేటీలో హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాలు తెలంగాణకు అప్పగింత, స్విస్ ఛాలెంజ్ విధానంలో కొత్త నోటిఫికేషన్, భూకేటాయింపులు, ఇళ్ల నిర్మాణాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి పెంపు, సిద్ధార్థ అకాడమీకి దుర్గగుడి భూముల కేటాయింపు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. -
రాజధాని పేరుతో నాలుగు శంకుస్థాపనలు
పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సాక్షి, హైదరాబాద్/అమరావతి: నూతన రాజధాని పేరుతో ఇప్పటికే నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారని చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ నెల 28న పరిపాలన భవనాల కోసం అంటూ అరుణ్ జైట్లీని చంద్రబాబు, బాబును వెంకయ్య అభినందించడానికే శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.ప్రజల సొమ్ముతో ఇంకా ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారో తెలియడం లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొంటే బాబు అసమర్థత, చేతగానితనం, బలహీనతల వల్లనే తన మకాం హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చాడని ఆరోపించారు. స్విస్ చాలెంజ్లోని అవకతవకలు కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డినెన్స్‌ను మార్చుకున్నారని విమర్శించారు. -
మరి ఇప్పుడేమంటావు చంద్రబాబు: అంబటి
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి నిర్మాణలను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, లక్షలకోట్లు సంపాదించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని అయితే దాన్నే న్యాయస్థానాలు అడ్డుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం అంబటి రాంబాబు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్విస్ చాలెంజ్ అప్పీల్ నుంచి ప్రభుత్వం ఒక్కసారిగా ఉపసంహరించుకుందన్నారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారిని చంద్రబాబు ఉన్మాదులతో పోల్చారని, మరి కోర్టులో ఇప్పుడు పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పటికీ స్విస్ చాలెంజ్‌పై వెనక్కి తగ్గేది లేదని మంత్రి నారాయణ అంటున్నారని, అవసరం అయితే చట్టాలను మార్చి అయినా సింగపూర్ కంపెనీలతో దోచుకోవడమే సర్కార్ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రజా రాజధానిని నిర్మించాలని ఆయన సూచించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గడువుపై ఏపీ సర్కార్ స్పందించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల స్పీకర్లు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రానేరావని, బాబు తన కుటుంబ సభ్యుల్నే మోసగించారని, పార్టీ మారినవాళ్లో లెక్కా అని అంబటి అన్నారు. -
మరి ఇప్పుడేమంటావు చంద్రబాబు
-
స్విస్ చాలెంజ్ తో లక్షకోట్లకు ఎసరు!
-
హైకోర్టు ఆక్షేపించిన తప్పులనేకం
సరిదిద్దుకోవడానికి సర్కారుకు అవకాశం కానీ తమ చర్యలను సమర్థించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగా, ఇబ్బందిగా ఉన్న అన్ని అంశాలకు సవరణలు చట్టం అడ్డుతొలగించుకుని ఆర్డినెన్స్ జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు సంబంధించి స్విస్ చాలెంజ్ పద్ధతి కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదన.. పరిశీలన మొదలు, టెండర్ నిబంధనల వరకు అనుసరించిన విధానంలో ప్రభుత్వం చేసిన అనేక తప్పులను హైకోర్టు ఎత్తిచూపింది. ఎక్కడెక్కడ చట్ట విరుద్ధంగా వ్యవహరించారో సింగిల్ జడ్జి చెప్పారు. తప్పులను సరిదిద్దుకోవాలంటూ ప్రభుత్వానికి అవకాశమిచ్చారు. అయితే తప్పులను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదు. స్విస్ చాలెంజ్ వ్యవహారంలో తమ చర్యలను సమర్ధించుకునేందుకు ఏకంగా చట్ట సవరణకే దిగింది. ఏపీఐడీఈ చట్టంలో ఏ ఏ అంశాలు తమకు అడ్డుగా, ఇబ్బంది ఉన్నా యో వాటిని చట్ట సవరణ ద్వారా తొలగించడమో, మార్చడమో చేసేసింది. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందన్నమాట. సింగిల్ జడ్జి తప్పుబట్టిన కీలక అంశాలివీ.. ** సింగపూర్ కన్సార్టియం తన ప్రతిపాదనల్లో పేర్కొన్న ఆదాయ వివరాలను ప్రాథమిక స్థాయిలో బహిర్గతం చేసి తీరాలి. అలా చేయకపోవడం చట్ట విరుద్ధమే. అసలు ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ ఎంత మాత్రం కాదు. సింగపూర్ కన్సార్టియం అడిగింది కాబట్టి అది యాజమాన్య సమాచారం అవుతుందనడం ఎంత మాత్రం సరికాదు. ** కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికి గానీ, సీఆర్డీఏ అధికారులకు గానీ తెలియకుంటే, అసలు ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా రాగలరు.? సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలేవీ తెలియకుండానే, రూ.3 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు కోసం స్విస్ చాలెంజ్ పద్దతిన మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం. ** ఏపీఐడీఈ చట్టంలోని సెక్షన్ 19–2 ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదికుడు తమ ప్రతిపాదనలను స్థానిక ఏజెన్సీ అయిన సీఆర్డీఏకు సమర్పించాలి. ఆ ప్రతిపాదనలను చూసి ప్రధాన ప్రతిపాదకుడికి ఆ ప్రాజెక్టు చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో తెలుసుకోవాలి. తరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాలి. ఆ తరువాత ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లాలి. అయితే ప్రస్తుత కేసులో మొత్తం వ్యవహారం ‘రివర్స్’లో జరిగింది. ** కన్సార్టియం మొదట తమ ప్రతిపాదనలను నేరుగా ప్రభుత్వానికే సమర్పించింది. తరువాత ప్రభుత్వం నుంచి హైపవర్ కమిటీకి వెళ్లాయి. (హైపవర్ కమిటీ ఏర్పాటును చట్టం చెప్పలేదు). ఆ తరువాత సీఆర్డీఏకు అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరి, మళ్లీ అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి. ** ఈ రివర్స్ విధానం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ స్వతంత్రత ప్రభావితమైంది. ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు, దానికి విరుద్ధంగా వెళ్లేందుకు సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ వంటి అధికార సంస్థలు ఇబ్బంది పడుతాయి. పాలనలో ఇది ప్రత్యక్ష అనుభవమే. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్ఫ్రా అథారిటీ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే వాస్తవానికి అలా జరగనే లేదు. ** చట్ట నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాణిజ్యపరమైన ప్రయోజనాలను అధికారులు ముందు చూడాలి. ఆ తరువాతే స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలి. కాని అధికారులు అందుకు విరుద్ధమైన విధానాన్ని అనుసరించారు. మొదట స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించి, ఆ తరువాత వాణిజ్యబిడ్లను పరిశీలిస్తామంటున్నారు. ఇది ‘గుర్రానికి ముందు బండి ఉంచడమే’. ఇది విధానపరమైన అవకతవక మాత్రమే కాదు.. ప్రజా ప్రయోజాలను ప్రమాదంలో నెట్టి వేయడమే అవుతుంది. ** ఈ మొత్తం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ అధికారి కూడా సహేతుకంగా, నిష్పాక్షికంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదు. తక్కువ వ్యయంతో కూడుకున్న ‘రాజీ’ నిబంధనలను పక్కనపెట్టి, వ్యయంతో కూడిన లండన్‌లోనే కూర్చొని చేసే మధ్యవర్తిత్వ క్లాజ్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ** నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతల విషయానికొస్తే, ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పక్షపాతంతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు విస్తృతిని దృష్టిలో పెట్టుకుని, సాంకేతికంగా, ఆర్థికంగా సింగపూర్ కన్సార్టియంతో సరితూగే లేదా వారి కన్నా ఎక్కువ అర్హతలున్న వారికే పనులు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ అర్హతలు నిరే్ధశించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదన ఎంత మాత్రం సహేతుకంగా లేదు. ** ఈ కేసులో తన హక్కులకు భంగం కలుగుతుందని పిటిషనర్లు భావించారు కాబట్టే కోర్టుకు వచ్చారు. తుది విచారణలో అర్హతల, నిబంధనల చట్టబద్దత తేలుతుంది. ఈ కేసులో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనలు ఎలా ఉన్నాయంటే ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు అంటే.. బిడ్డింగ్‌కు అర్హత ఉన్న వారు మాత్రమే.. అన్న అర్థంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు అంటే అర్హత లేని వారు అని కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తి అర్హత లేకపోయినా బిడ్ దాఖలు చేయవచ్చు. బిడ్ దాఖలు చేసిన తరువాత అర్హత ఉందా? లేదా? తేలుతుంది. కాబట్టి వారికి కోర్టును ఆశ్రయించే అర్హత, ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదనడం సరికాదు. ఏపీఐడీఈ చట్టానికి ప్రభుత్వం చేసిన కీలక సవరణలివీ ఏపీఐడీఈ చట్టంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఐడీఏ)కు అత్యంత ప్రాధాన్యత ఉంది. సింగిల్ జడ్జి తప్పుబట్టిన అనేక అంశాలు ఇన్ఫ్రా అథారిటీతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వం ఆ అ«థారిటీని నామమాత్రం చేయాలని నిర్ణయించి అందుకనుగుణంగా ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసింది. ఈ చట్టం ఏ విషయాల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విస్తృత అధికారాలు కల్పిస్తుందో, ఎక్కడెక్కడ ఈ అథారిటీని సంప్రదించాలని ఉందో, ఆ విషయాలన్నింటిలో ఇన్ఫ్రా అథారిటీ అన్న పేరును తొలగించి దాని స్థానంలో‘ప్రభుత్వం’ అన్న పదాన్ని చేర్చింది. ** ఏదైనా ప్రాజెక్టు విషయంలో సలహాలు, సూచనలు, సిఫారసులు చేసే అధికారం ఇక ఇన్ఫ్రా అథారిటీకి ఉండదు. అలాగే ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకైనా, డెవలపర్‌కైనా తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా ఇకపై ఇన్ఫ్రా అథారిటీకి ఉండదు. ** సమావేశాలు నిర్వహించే అధికారం కూడా అథారిటీకి ఉండదు. అథారిటీకి పలు అధికారాలు కల్పిస్తున్న ఏపీఐడీఈ చట్టంలోని 11, 12 సెక్షన్లను చట్ట సవరణ ద్వారా తొలగించింది. ** డెవలపర్ తన హక్కులను దుర్వినియోగం చేస్తే అందుకు దుర్వినియోగ చార్జీలు విధించి, ఆ డెవలపర్‌పై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇన్ఫ్రా అథారిటికీ ఉండదు. డెవలపర్‌కు జరిమానా విధించే అధికారం కూడా అథారిటీకి లేకుండా సవరణలు చేసింది. ** ఏపీఐడీఈ చట్టంలో రాజీ క్లాజులే వర్తించకుండా ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. రాజీ క్లాజుకు ఇరుపక్షాలు కూడా అంగీకరించకుంటే ఏపీఐడీఈ చట్టంలోని చాప్టర్ 5, 6 (రాజీ విధి విధానాలు) వర్తించవంటూ చట్టాన్ని సవరించింది. దీంతో అధిక వ్యయంతో కూడిన మధ్యవర్తిత్వానికే వెళ్లడం తప్పనిసరి కానుంది. ** ఏపీఐడీఈ చట్టంలో ఆసక్తి ఉన్న వారందరూ బిడ్ దాఖలకు అర్హులని ఉండేది. చట్ట సవరణ ద్వారా ఆసక్తి ఉన్న వారందరూ అన్న పదాన్ని తొలగించి దాని స్థానంలో అర్హత ఉన్న వారే బిడ్ దాఖలు చేయగలరంటూ మార్చేసింది. -
స్విస్ చాలెంజ్ తో లక్షకోట్లకు ఎసరు!
రాజధాని స్టార్టప్ ప్రాజెక్టు వెనుక మర్మమిదే.. బాబు బినామీలు, సింగపూర్ సంస్థల పక్కాప్లాన్ వాటాల మొదలు లాభాల వరకు అంతా మోసమే.. సాక్షి, హైదరాబాద్: సువిశాలమైన రహదారులు.. జల మార్గాలు.. కనుచూపు మేర విస్తరించిన పచ్చిక మైదానాలు.. అందమైన ఉద్యానవనాలు.. ఆహ్లాద వాతావారణాన్ని పంచే నదీ తీరం.. ప్లై ఓవర్లు.. ఆకాశహర్మా్యలు.. భూతల స్వర్గాన్ని తలపించే రీతిలో అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ 3డీ సినిమా చూపించిన సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం... రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే రియల్ ఎస్టేట్ దందా చేసి రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పథకం వేశారు. అందులో భాగంగా మొదలుపెట్టిన రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’ ఓ పెద్ద కుంభకోణం. దీని కోసమే ‘స్విస్ చాలెంజ్’ పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు ప్రతి అడుగునూ ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే వేసుకుంటూ వచ్చింది. స్థూలంగా ఇదీ కుంభకోణం... 1. సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీ(కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటుచేసే ఏడీపీ(అమరావతి డెవలపర్మెంట్ పార్టనర్)కు 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లుగా(కనీస ధర)గా నిర్ణయించింది. 1,691 ఎకరాల విలువ రూ.6,764 కోట్లు. 2. ఈ భూమికి రహదారులు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి కనీస సదుపాయాలు కల్పించేందుకు రూ.5,500 కోట్లు ఖర్చు చేయడానికి సర్కారు అంగీకరించింది. అంతే కాదు.. ఏడీపీలో సీసీడీఎంసీ వాటా రూపంలో రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వెరసి రూ.12,485.9 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందన్న మాట. ఇంత పెట్టుబడి పెట్టినా సీసీఎండీసీకి దక్కే వాటా ఎంతో తెలుసా..? కేవలం 42 శాతం మాత్రమే. 3. రూ.306.4 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియంకు దక్కే వాటా 58 శాతం. అంతేకాదు.. సింగపూర్ కన్సార్టియంకు తొలుత 50 ఎకరాలు, ఆ తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు సర్కార్ అంగీకరించింది. ఇప్పటికిప్పుడు ఎకరం కనిష్ఠంగా రూ.20 కోట్లకు విక్రయించినా.. ఆ సంస్థలు పెట్టే పెట్టుబడి పోను ఆదిలోనే రూ.4,693.6 కోట్ల లాభం సింగపూర్ కన్సార్టియం దక్కించుకోనుంది. 4. ఇదొక ఎత్తయితే.. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ఇచ్చే వాటాను గోప్యంగా ఉంచడం మరొక ఎత్తు. ఆ గోప్యత వెనుక దాగిన వాస్తవం ఏమిటంటే.. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా సీఎం చంద్రబాబు బినామీలు, సింగపూర్ కన్సార్టియం గుప్పిట్లోని మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో రూ.లక్ష కోట్లు కొట్టేయడానికి పక్కాగా ప్లాన్ వేశారు. తెరపైకి స్విస్‌చాలెంజ్ ఇలా.. రాజధాని ప్రకటనను తన కోటరీకి ముందే లీకులు ఇచ్చి ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. రాజధాని నిర్మాణం ముసుగులో తొలి దశలోనే మరో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టడానికి సర్కారు పెద్దలు ప్లాన్ వేశారు. అందులో భాగంగానే రాజధాని ‘స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు’కు అంకురార్పణ చేశారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్(ఏపీడీఈఏ)–2001 చట్టాన్ని సింగపూర్ సంస్థల కన్సార్టియంకు చుట్టంగా మార్చి.. స్విస్ విధానంలో అసెండాస్–సిమ్బ్రిడ్జ్–సెమ్్బకార్ప్(సింగపూర్ సంస్థల కన్సార్టియం)లతో కలిసి ప్రతిపాదనలు రూపొందించారు. వాటికన్నా మెరుగైన ప్రతిపాదనలు ఉంటే దాఖలు చేసుకోవచ్చునంటూ జూలై 18న స్విస్ విధానంలో నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుతో వచ్చే ఆదాయంతో సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తాయన్నది గోప్యంగా ఉంచాయి. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు 1,691 ఎకరాలు రాజధానికి భూసమీకరణ ముసుగులో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లాక్కుంది. ఇందులో 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ భూమిలో 371 ఎకరాల్లో రహదారులు, పార్కులు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కేటాయించారు. తొలి విడతగా 50 ఎకరాలు.. రెండో దశలో 200 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. 50 ఎకరాల్లో ఉత్రే్పరక అభివృద్ధి కింద సింగపూర్ సంస్థలు ఎనిమిది లక్షల చదరపు గజాల్లో భనవాలు నిర్మిస్తాయి. ఈ 250 ఎకరాల్లో నిర్మించే భవనాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి పైసా వా టా కూడా సింగపూర్ సంస్థల కన్సార్టియం ఇవ్వదు. ఇది పోను మిగతా 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. ప్లాట్లు విక్రయించగా వచ్చిన ఆదాయంలో ఈ ప్రాజెక్టుకు అభివృద్ధికి వెచ్చించే వ్యయంపోనూ.. మిగతా సొమ్ములో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు గోప్యంగా ఉంచాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతి పాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్మెం ట్ కంపెనీ సీఎం చంద్రబాబునాయుడు బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్లనూ విక్రయిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పని చేపట్టినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిటింగ్ చేస్తా యి. అక్రమాలపై ఎవరైనా పోలీసులను, కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఆడిటింగ్‌కు దక్కకుండా.. సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలకు చిక్కకుండా దోపిడీ చేసేందుకే ‘మేనేజ్మెంట్ కంపెనీ’ అనే బినామీ ప్రైవేటు సంస్థను సీఎం చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం తెరపైకి తెచ్చాయి. ఈ సంస్థ ఎకరం రూ.20 కోట్లకు విక్రయించి.. రూ.4 కోట్లకు పైన ఎంతోకొంత నామమాత్రపు ధరకు అమ్మినట్లు లెక్కలు చూపించినా ప్రశ్నించే అధికారం రాష్ట్ర ఆడిటింగ్ అధికారులకుగానీ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కుగానీ ఉండదు. ఒకవేళ ఏవైనా వివాదం ఉంటే.. ఇంగ్లాండ్‌లోని లండన్ కోర్టును ఆశ్రయించాల్సిందే! సీసీఎండీసీకి దక్కేది సున్నా.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో 1070 ఎకరాలను విక్రయించగా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. ఎకరం రూ.4 కోట్లు అంతకన్నా కాస్త ఎక్కువకు విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్లో పది శాతం వాటా ఇస్తే ఏడీపీకి దక్కేది రూ.3852 కోట్లు. ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లును కలిపితే రూ.4,852 కోట్లు వస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వ్యయం రూ.3137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సింగపూర్ సంస్థలు లండన్ కోర్టులో కేసు వేస్తాయి. ఆ కోర్టు ఏ మేరకు జరిమానా విధిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఆ సంస్థలకు పరిహారం చెల్లించాల్సిందే. రూ.లక్ష కోట్ల దోపిడీ ప్లాన్ ఇదీ.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు 20 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది. అంతకన్నా ముందు ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేస్తే సింగపూర్ సంస్థల కన్సార్టియం పెట్టిన పెట్టుబడికి 150 శాతం మేర అపరాధ రుసుం చెల్లించాలి. ఆ సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలను ప్రభుత్వమే చెల్లిం చాలి. ఒకవేళ సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రాజెక్టు నుంచి వైదొలగినా ఆ సంస్థలు పెట్టిన పెట్టుబడిని వంద శాతం ప్రభుత్వం చెల్లించాలి. బ్యాంకు రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 20 ఏళ్లపాటు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సింగపూర్ కన్సార్టియం చేతుల్లో ఉండేలా ప్లాన్ వేశారు. మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని తాము అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి ఎత్తువేశారు. ఎకరం భూమి కనీస ధర రూ.4 కోట్లకు ఎంతో కొంత నామమాత్రపు మొత్తాన్ని.. అంటే ఓ పాతిక లక్షలో యాభై లక్షలో కలిపి అమ్మినట్లు చూపిస్తారనుకుందాం. అది మాత్రమే వైట్ మనీ. ఎకరం రూ.20 కోట్లకు అమ్మినా అడిగేవారుండరు. ఎందుకంటే తమ చెప్పుచేతల్లో ఉండే మేనేజ్మెంట్ కంపెనీ యే ఈ అమ్మకాల లావాదేవీలను చూస్తుంది కాబట్టి మిగిలిన బ్లాక్‌మనీ అంతా దోచుకుంటారన్నమాట. గతంలో చంద్రబాబు హయాంలో ఎమ్మార్ విషయంలోనూ జరిగిందిదే. ఇదే తరహాలో మొత్తం భూమిని సింగపూర్ సంస్థల కన్సార్టియం, చంద్రబాబు బినామీలు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. రాజధానిలో అత్యంత ప్రధానమైన ప్రాంతంలో ఇప్పటికప్పుడు గజం కనిష్ఠంగా రూ.40 వేలు పలుకుతుంది. ఈ లెక్కన ఎకరం రూ.20 కోట్లు పలుకుతుంది. 20 ఏళ్లలోపు ఎకరం రూ.50 కోట్లకుపైగా పలుకుతుందని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1070 ఎకరాల భూమిని అమ్మి రూ.53,500 కోట్ల ను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థల కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్లు ఆ సంస్థలు సొమ్ముచేసుకున్నాయి. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి 20 ఏళ్లలోగా రూ.12,193.60 కోట్ల లాభం దక్కించుకోనున్నాయి. మొత్తమ్మీద స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే కనిష్ఠంగా రూ.65,693.60 కోట్లు.. గరిష్ఠంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయనున్నట్లు స్పష్టమవుతోంది. 1691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 33 వేల ఎకరాల రాజధాని నిర్మాణంలో ఏ స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు. సింగపూర్ సంస్థల చేతుల్లోనే అంతా.. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ(అమరావతి డెవలపమెంట్ పార్టనర్) చేపడుతుంది. ఏడీపీ ఛైర్మన్‌గా సింగపూర్ సంస్థల ప్రతినిధి వ్యవహరిస్తారు. ఏడీపీలో ఆరుగురు సభ్యుల్లో నలుగురు సభ్యులు సింగపూర్ కన్సార్టియం ప్రతినిధులే ఉంటారు. అంటే.. ఏడీపీపై పూర్తి పెత్తనం సింగపూర్ సంస్థల కన్సార్టియందే. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3137 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లు. మిగతా రూ.2618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణం రూపంలోనూ ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తారు. రహదారులు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేస్తుంది. ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, మేనేజ్మెంట్ ఫీజు, వేతనాల రూపంలోనే సింగపూర్ సంస్థల కన్సార్టియం కొట్టేయనుంది. ప్రభుత్వానికి గరిష్టంగా రూ.12,057 కోట్ల నష్టం ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియంది 58 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ వ్యయం ఎంతకైనా పెరగవచ్చు. ఆ మేరకు నిబంధనలు కూడా చేర్చారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా 1,070 ఎకరాలను.. ఎకరం రూ.4 కోట్లకు పైన నామమాత్రపు మొత్తానికి విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వం ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం బహిర్గతం చేయలేదు. ఒకవేళ ఎకరం రూ.నాలుగు కోట్లకే విక్రయించి, పది శాతం వాటా ఇస్తే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.428 కోట్లు.. 20 శాతం వాటా ఇస్తే రూ.956 కోట్లు.. ఒకవేళ 50 శాతం వాటా ఇవ్వడానికి సింగపూర్ కన్సార్టియం ముందుకొచ్చిన సర్కారు దక్కే ఆదాయం రూ.2,140 కోట్లు మాత్రమే. అంటే.. ప్రభుత్వం రూ.12,485.9 కోట్లు పెట్టుబడి పెట్టుబడి పెడితే కనిష్ఠంగా రూ.10,345.9 కోట్లు(ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తే).. గరిష్ఠంగా రూ.12,057.9 కోట్ల(సర్కార్‌కు పది శాతం వాటా ఇస్తే) నష్టం వస్తుందన్న మాట. -
ఇది తుస్ చాలెంజే..!
-
ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే!
-
ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే!
- కొత్త నోటిఫికేషన్ ప్రతిపాదన కూడా ఓ డ్రామా.. - ఆది నుంచీ ఆ దిశగానే ముఖ్యమంత్రి చర్యలు - ముందుగా కుదిరిన ఒప్పందాల మేరకే నిర్ణయాలు - అందుకు అనుగుణంగానే చట్ట సవరణలు, ఆర్డినెన్స్ సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విషయంలో రాష్ర్టప్రభుత్వం వెనక్కి తగ్గిందా? న్యాయస్థానం పలుమార్లు అక్షింతలు వేయడం, అనేక తప్పులు ఎత్తి చూపడం వల్ల రాష్ర్టప్రభుత్వం మనసు మార్చుకుందని భావించవచ్చా? గత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పినంత మాత్రాన స్విస్ చాలెంజ్ ప్రమాదం తొలగిపోయినట్లేనా? ఎంతమాత్రమూ లేదని అధికార వర్గాలంటున్నాయి. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు నివేదించడం కూడా ఓ డ్రామాయేనని, స్విస్చాలెంజ్ను కానీ, సింగపూర్ కంపెనీల కన్సార్టియంను కానీ వదులుకునే ఆలోచనే ప్రభుత్వానికి లేదని అధికారులు అంటున్నారు. కొత్త రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే ఒకవైపు న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే హడావిడిగా స్విస్ చా లెంజ్ అమలు కోసం ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. కొత్త నోటిఫికేషన్ ఓ డ్రామా.. స్విస్ చాలెంజ్ విషయంలో విచారణ సందర్భంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని ్టప్రభుత్వం చెప్పడం ఓ పెద్ద నాటకమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ అంటే కేవలం సింగపూర్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను కొనసాగింపునకే తప్ప మరొకటి కాదని, ఈ కారణంగా సింగపూర్ కంపెనీలతో దాపరికం, రహస్య అవగాహనలన్నీ అలాగే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. స్విస్ చాలెంజ్ మౌలిక సూత్రాలను, నిబంధనలను కూడా తుంగలో తొక్కి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో నేరుగా సీఎంతో పాటు మంత్రుల కమిటీ సంప్రదింపులు జరిపారు. వాటిలో నీకెంత నాకెంతనే రహస్య అవగాహన కుదిరిందని, అందుకే ఆ కంపెనీలను సీఎం వెనకేసుకు వస్తున్నారని అధికార వర్గాలు కోడై కూస్తున్నాయి. మౌలికసూత్రాలకు విరుద్ధం స్విస్ చాలెంజ్ మౌలిక సూత్రాల ప్రకారం.. చేపట్టే ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేని, ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వని... ప్రాజెక్టుకు సంబంధించి ఏ సంస్థ అయినా తమంతట తాము ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంది.వీటిరి సీఆర్డీఏ పరిశీలించిన తరువాత, గత చట్టం ప్రకారం సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి వెళ్లాలి. అందుకు పూర్తి విరుద్ధంగా సీఆర్డీఏ పరిశీలించిన తరువాత పలు సార్లు సింగపూర్ కంపెనీలతో సీఎం సంప్రదింపులు జరిపిన తరువాత మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులను సూచిస్తూ ఏకంగా సీఎం ఆమోదంతరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి పంపించారు. పూర్తి రివర్స్‌లో సాగిన దీన్ని చూసి సీఎస్ నేతృత్వంలోని అధారిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీఎం ఆమోదించాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి ఎలా పంపుతారంది. అయినా కేబినెట్లో సింగపూర్ ప్రతిపాదనలు ఆమోదించారు. ముందుగానే ఒప్పందాలు... సింగపూర్ కంపెనీలతో ముందుగానే ముఖ్యమంత్రి సంప్రదింపులు జరిపి అన్ని ‘అవగాహనలు’ కుదిరిన తరువాత ఇక స్విస్ చాలెంజ్ ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు స్విస్ చాలెంజ్ అనేదానికే అర్ధం ఉండదనేది అధికారుల అభిప్రాయం. సింగపూర్ ప్రభుత్వంతో జీ టు జీకి మాత్రమే కేంద్రం అనుమతించింది. కేంద్రానికి టోకరా వేస్తూ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో బాబు ఒప్పందాలు చేసుకున్నారు. పైగా కొలిక్కి రాని అనేక ఆర్థిక పరమైన అంశాలను చంద్రబాబు ఈ ఏడాది జూన్ 7వ తేదీన స్వయంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరించారని స్పష్టంగా మంత్రుల కమిటీ మినిట్స్‌లో పేర్కొన్నారు.. ‘‘అసలు కొలిక్కి రాని ఆర్థిక పరమైన అంశాలపై బాబు ఏమి మాట్లాడారు? సింగపూర్ కంపెనీల ప్రతినిధులు ఏమి చెప్పారు? ఇరువురు మధ్య ఏ ఒప్పందం జరిగింది?’’ వంటి విషయాలన్నీ చాలెంజ్ చేసే ఇతర సంస్థలకు కూడా తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఇది తుస్ చాలెంజే
- మళ్లీ మొదటికొచ్చిన ‘సింగపూర్ వ్యవహారం’ - ప్రస్తుత నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోం - మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తాం - హైకోర్టుకు నివేదించిన రాష్ర్టప్రభుత్వం - రిట్ పిటిషన్, అప్పీళ్లను మూసివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ వ్యవహారం అనూహ్య మలుపు తీసుకుంది. హైకోర్టు పదేపదే ఆక్షేపిస్తుండడం, అక్షింతలు వేస్తుండడంతో ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఆట మొదలుపెట్టింది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని రాష్ర్ట ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. పోటీ ప్రతిపాదనలకు సంబంధించి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలపడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబలింగ్ (ఏపీఐడీఈ) చట్టం 2001కు చట్ట సవరణలు చేసి ఆర్డినెన్స్ జారీ చేశామని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోటీ ప్రతిపాదనల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసిన రిట్ పిటిషన్లు నిరుపయోగమవుతాయని, రిట్ పిటిషన్లే నిరుపయోగమైనప్పుడు, వాటి ఆధారంగా ప్రభుత్వం, సీఆర్డీఏలు దాఖలు చేసి రిట్ అప్పీళ్లు కూడా నిరుపయోగమే అవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మేర రిట్ పిటిషన్లను, అప్పీళ్లను మూసివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఏపీఐడీఈ చట్ట సవరణల ఆర్డినెన్స్, తాజా నోటిఫికేషన్ జారీకి సంబంధించి ఏజీ చేసిన నివేదనలను హైకోర్టు రికార్డ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చే తాజా నోటిఫికేషన్‌పై మళ్లీ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, అప్పుడు వారు పాత రిట్ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలను తిరిగి లేవనెత్తవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటిఫికేషన్లపై రిట్ పిటిషన్లు... 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజ దాని ప్రాంత అభివృద్ధి నిమిత్తం సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడిగా స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిం ది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిషనర్ ఆగస్టు 18న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో గడువు తేదీని పెంచడంతో పాటు బిడ్ల ప్రక్రియను రెం డుగా విభజిస్తూ ఆగస్టు 28న సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిని విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. పలు అంశాల్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించారు. రెండు నోటిఫికేషన్ల అమలుపై స్టే విధిస్తూ గత నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవా లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు వేర్వేరుగా రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం, సీఆర్డీఏల తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్వాదనలు వినిపించారు. ఆదిత్య ఇన్ఫ్రా తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు. ఈలోపే ఆర్డినెన్స్... ఆ తరువాత దసరా సెలవులు రావడం, హైకోర్టులో బెంచ్‌లు మారడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ అప్పీళ్లు విచారణకు నోచుకోలేదు. ఈ మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టానికి సవరణలు తీసుకొస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సింగిల్ జడ్జి తన తీర్పులో ఏ అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారో, ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ఆ అంశాలపై అడ్డంకులు తొలగించుకుంది. ఏపీఐడీఈ చట్టంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలన్నింటికీ కత్తెర వేసింది. ఇన్ఫ్రా అథారిటీని పూర్తిగా నామమాత్రం చేసేసింది. ఆర్డినెన్స్ సిద్ధం కాగానే తమ అప్పీళ్లపై విచారణ చేపట్టాలని అడ్వొకేట్ జనరల్ ఈ నెల 21న ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఈ నెల 26న కేసును విచారిస్తామంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23నే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పిటిషన్లు.. అప్పీళ్లు మూసివేస్తూ ఉత్తర్వులు చెప్పిన విధంగానే ధర్మాసనం బుధవారం అప్పీళ్లపై విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. పోటీ ప్రతిపాదనలకు సంబంధించి జారీ చేసిన సవరణ నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని కోర్టుకు నివేదించారు. తాజాగా నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్ నిరుపయోగమవుతుందని తెలిపారు. దీనికి ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ, ఏజీ చేసిన నివేదనలను రికార్డ్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. అంతేకాక రిట్ పిటిషన్లలో సింగిల్ జడ్జి వద్ద తాము లేవనెత్తిన అంశాలను మళ్లీ లేవనెత్తే వెసులుబాటునివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్లు నిరుపయోగమవుతాయని తెలిపింది. అంతేకాక రిట్ పిటిషన్లలో సవాలు చేసిన నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ పిటిషన్లలో విచారించడానికి ఏమీ ఉండదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్లు నిరుపయోగమైనప్పుడు వాటి ఆధారంగా దాఖలు చేసిన అప్పీళ్లు కూడా నిరుపయోగమే అవుతాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ ఇస్తే పిటిషనర్లు రిట్ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలను తిరిగి లేవనెత్తవచ్చునంటూ వెసులుబాటు కల్పించింది. ఆర్డినెన్స్ నేపథ్యంలో రిట్ పిటిషన్లు, అప్పీళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ ఆ మేర ఉత్తర్వులు జారీ చేసింది. -
సెలవు రోజు ఆగమేఘాలపై ఆర్డినెన్స్
-
ఆగమేఘాలపై ఆర్డినెన్స్
- ఏపీఐడీఈ చట్టంలో రాష్ట్ర సర్కారు సవరణలు - సెలవు రోజు చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీ - సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలకు కత్తెర - అథారిటీకి అధికారాలు కల్పించే సెక్షన్లన్నీ తొలగింపు - స్విస్ చాలెంజ్ ప్రాజెక్టులను ఆమోదించే అధికారం ఇక అథారిటీకి లేదు - ఆసక్తి ఉన్నవారు కాదు... అర్హత ఉన్నవారే స్విస్ చాలెంజ్‌లో పాల్గొనాలి - సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తన తాబేదారు కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్(ఏపీఐడీఈ) చట్టాన్నే మార్చేశారు. స్వప్రయోజనాలను కాపాడుకోవడంలో క్షణమైనా ఆలస్యం జరగకూడదన్న ఉద్దేశంతో ఆదివారం ఆఘమేఘాలపై ఆర్డినెన్స్ జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న విలువైన భూములను స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి కట్టబెట్టడానికి సీఎం ఏకంగా స్విస్ చాలెంజ్ చట్టంలో మార్పులు చేశారు. ప్రస్తుత చట్టంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విస్తృత అధికారాలున్నాయి. దానికి అధికారాలను కల్పించే సెక్షన్ 2 (ఎఫ్ఎఫ్)ను సవరణతోతొలగించారు. ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం ఈ సవరణలను ఆమోదించగా, ఆదివారం ఏపీఐడీఈ చట్ట సవరణ-2016 ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. చట్ట సవరణల్లోని ముఖ్యాంశాలు ప్రస్తుతం చట్టంలోని నిబంధన మేరకు స్విస్ చాలెంజ్‌లో ఏ కంపెనీలైనా తమంతట తాముగా సమర్పించిన ప్రతిపాదనలను తొలుత స్థానిక సంస్థ అయిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పరిశీలించాలి. అక్కడి నుంచి సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి వెళ్లాలి. అనంతరమే రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపాలి. అయితే, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలు తొలుత సీఆర్డీఏకి వెళ్లిన అనంతరం మంత్రులతో కూడిన హైపవర్ కమిటీకి, ఆ తరువాత సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాయి. ఆయన ఆమోదించిన తరువాత సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరాయి. ఈ విషయాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర తీర్పులో తప్పుపట్టారు. చట్టాన్ని ఉల్లంఘించారని ఆక్షేపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా చేసిన చట్ట సవరణలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అనే పదం గల సెక్షన్‌ను తొలగించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలులో సలహాలు, సూచనలు, సిఫార్సులు చేసే అధికారాలను అథారిటీకి లేకుండా చట్టాన్ని సవరించారు. డెవలపర్ అవకతవకలకు పాల్పడితే చార్జీలు వసూలు చేసే అధికారం అథారిటీకి ఉండేది. దాన్నీ తొలగించేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి ప్రస్తుత చట్టంలో పలు సెక్షన్ల ద్వారా అధికారాలున్నాయి. ఆ సెక్షననూ ఆర్డినెన్స్ ద్వారా తొలగించేశారు. డెవలపర్ రెవెన్యూ వాటా కూడా చెప్పాల్సిన అవసరం లేదని సవరణ చేశారు.ఇన్‌ఫ్రాస్ట్రర్ అథారిటీ దగ్గర ఏమైనా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆ అథారిటీ నుంచి ఆమోదం పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆమోదించే అధికారాలను అథారిటీ నుంచి తప్పించారు. ఆసక్తి గల వారందరూ స్విస్ చాలెంజ్‌లో పాల్గొనవచ్చని చట్టంలో ఉండగా దాన్ని తొలగించి, అర్హత ఉన్నవారే పాల్గొనాలనే సవరణ చేశారు. మొత్తం మీద ప్రభుత్వ పెద్దలు తమ ఇష్టానుసారంగా స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టంలో సవరణలు చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక పెత్తనమంతా ప్రభుత్వానిదే స్విస్ చాలెంజ్ ముసుగులో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు 1,691 ఎకరాలను నామినేషన్‌పై ధారాదత్తం చేసేందుకు ఏపీఐడీఈ చట్టం కింద ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ చట్టంలోని నియమ నిబంధనలను, పలు సెక్షన్లను తుంగలో తొక్కి సింగపూర్ ప్రైవేట్ కంపెనీల లబ్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను హైకోర్టు గతంలోనే తప్పుపట్టింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుండగానే.. స్విస్ చాలెంజ్‌కు ప్రాతిపదికైన ఏపీఐడీఈ చట్టంలో ప్రభుత్వం సవరణలు తెస్తుండడాన్ని ‘సాక్షి’ ఇంతకు ముందే తెలియజేసింది. ఆదివారం జారీ చేసిన ఆర్డినెన్స్‌లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పలు శాఖల కార్యదర్శుల సభ్యులుగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలకు కత్తెర వేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అనే పేరును తొలగించేసి, దాని స్థానంలో ప్రభుత్వం అనే పదాన్ని ఆర్డినెన్స్‌లో చేర్చారు. -
‘స్విస్ చాలెంజ్’ కేసును 26న విచారిస్తాం
- తమ అప్పీళ్ల గురించి ప్రస్తావించిన ఏజీకి హైకోర్టు స్పష్టీకరణ - బెంచ్‌లు మారిన నేపథ్యంలో విచారణకు నోచుకోని అప్పీళ్లు సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ కేసుపై ఈ నెల 26న విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో బెంచ్‌లు మారిన నేపథ్యంలో స్విస్ కేసు విచారణకు నోచుకోని నేపథ్యంలో దీనిగురించి అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై తాము దాఖలు చేసిన అప్పీళ్లను విచారించాలని సీఆర్డీఏ, పురపాలకశాఖల తరఫున ఏజీ కోరారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ నెల 26న విచారణ చేపడతామంది. దీనికి పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన వేదుల వెంకటరమణ సైతం తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడి హోదాలో రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటికి పోటీ ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్, తరువాత ఇచ్చిన సవరణ నోటిఫికేషన్లను సవాలుచేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య, చెన్నైకు చెందిన ఎన్వియన్ కన్స్ట్రక్షన్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ నోటిఫికేషన్ అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాలుచేస్తూ సీఆర్డీఏ, పురపాలకశాఖలు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై పలు దఫాలుగా ధర్మాసనం విచారణ చేపట్టింది. -
ఇన్ఫ్రా చట్ట పరిధి కుదింపు
-
ఇన్ఫ్రా చట్ట పరిధి కుదింపు
- సింగపూర్ కన్సార్టియం కోసం చట్టంలో మార్పులు - రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం - ఇన్ఫ్రా అథారిటీ అధికారాల్లో పూర్తిగా కోత - చట్టం మార్పు వివరణపై మంత్రుల తడబాటు సాక్షి, అమరావతి: అనుకున్నట్లే అయింది. సింగపూర్ కన్సార్టియం కోసం ఏపీఐడీఈ (ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్) చట్టంలో మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇన్ఫ్రా అథారిటీ అధికారాలను పూర్తిగా తగ్గించి అంతా ప్రభుత్వం చెప్పు చేతల్లోనే జరిగేలా చట్టాన్ని మార్చాలని నిర్ణయించింది. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని స్టార్టప్ ఏరి యా అభివృద్ధి ప్రాజెక్టును సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఈ చట్టాన్ని ప్రభుత్వం సవరించనుందనే విషయాన్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టిన విష యం తెలిసిందే. ఈ చట్టంలో మార్పులకు చర్చ లేకుండానే మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ చట్టం సవరణపై చర్చకు రాగానే సీఎం చంద్రబాబు.. రాజ ధాని నిర్మాణం ఆవశ్యకతతో పాటు స్విస్ చాలెంజ్ విధానంపై కోర్టు కేసుల గురించి క్లుప్తంగా వివరించి.. ఆమోదిద్దామని చెప్పటంతో అందరూ ఒకే చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సీఎంబాబు అధ్యక్షతన విజ యవాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఎన్జీఆర్ఏయూ, టూరిజం, రెంట్ కంట్రోల్, ల్యాండ్ కన్వర్షన్, రిజిస్ట్రేషన్ల చట్టాలనూ సవరించేం దుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ వివరాలను మంత్రి పల్లె మీడియాకు వెల్లడించారు. ఏపీఐడీఈ చట్టం 2001ని సవరించేందుకు ముసాయిదా బిల్లు రూపొందిం చేందుకు ఆమోదం తెలిపారు. ఇన్ఫ్రా అథారిటీలో సభ్యులే ప్రభుత్వంలోనూ ఉండడంతో ప్రాజెక్టుల ఆమోదానికి ఆలస్యమవుతోందని, దాంతో అథారిటీ పరిధిని, అధికారాలను తగ్గిస్తున్నట్లు చెప్పారు. సింగపూర్ కన్సార్టియం కోసమే చట్టంలో మార్పులు చేస్తున్నారా అని విలేకరులు అడగ్గా ఆయన సమాధానం చెప్పలేదు. రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ అంతకుముందు మిగిలిన విషయాలను మీడియాకు వివరించి ఈ అంశంపై మాట్లాడకుండా జారుకున్నారు. ► ఏపీ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డు-2016 ఆర్డినెన్స్ ముసాయిదాకు ఆమోదం. ► ఏపీ అద్దె నియంత్రణ బిల్లు-2011 స్థానంలో ఏపీ అద్దె నియంత్రణ బిల్లు-2016 ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఇందుకు అవసరమైన ముసాయిదా బిల్లును రూపొందించాలని న్యాయ శాఖను కోరుతూ నిర్ణయం. ► వ్యవసాయేతర అవసరాల కోసం ఏపీ వ్యవసాయ భూముల చట్టం-2006లో సవరణకు అనుమతి. రెవెన్యూ శాఖకు సంబంధం లేకుండా ల్యాండ్ కన్వర్షన్ చేసుకునేందుకు వీలు కల్పించాలని నిర్ణయం. ► రాష్ట్రంలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా)లు ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం. అనంతపురం, కాకినాడ, కర్నూలు, నెల్లూరు కేంద్రాలుగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు అనుమతి. -
‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి!
-
‘సింగపూర్’ కోసం ఏపీ చట్టం బలి!
- నేడు కేబినెట్ ముందుకు ఏపీఐడీఈ సవరణలు - అన్నిటికీ ఆమోదం.. ఆ వెంటనే ఆర్డినెన్స్ - ఇన్ఫ్రా అథారిటీ అధికారాలకు కత్తెర - స్విస్చాలెంజ్కు ఇక ‘అడ్డూఅదుపూ’ లేనట్లే! సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానం అమలుకు అడ్డంకిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్టంలో పలు నిబంధనలను, సెక్ష న్లను రాష్ర్ట ప్రభుత్వం నేడు సవరించనుంది. ఈ మేరకు పలు సవరణలకు నేడు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నది. స్విస్ చాలెంజ్ విధానం పైనా, ఏపీఐడీఈ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్టప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేయడంతో ఏకంగా చట్టాన్నే మార్చేయాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలో ఏఏ సవరణలు చేయబోతున్నారనే విషయాన్ని ‘సాక్షి’ ఇప్పటికే వరుస కథనాలలో బైటపెట్టింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కోసం ఏపీఐడీఈ చట్టంలోని పలు నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్టప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే రాష్ర్టప్రభుత్వం చట్టానికి సవరణలు చేస్తుండడం విశేషం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పలు శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలకు కత్తెర వేస్తూ చట్టంలో సవరణలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చట్టసవరణ ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలన అనంతరం రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ నుంచి ముఖ్యమంత్రికి చేరాయి. చట్టసవరణ ప్రతిపాదనలకు సీఎం శుక్రవారమే ఆమోద ముద్ర వేశారు. మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశానికి చట్టసవరణ ముసాయిదా బిల్లును తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫైలు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. ముఖ్యమంత్రి ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించగానే ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఎవరూ ప్రశ్నించకుండా.. అడ్డంకులూ లేకుండా... ఏపీఐడీఈ చట్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఐడీఏ) సం స్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ చట్టం ద్వారా చేపట్టే ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతీ చిన్న పనీ కూడా ఈ సంస్థ ద్వారానే జరగాల్సి ఉంది. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సంతృప్తిగా లేకపోతే ప్రాజెక్టును పునః సమీక్షించేటువంటి కీలక అధికారం కూడా ఈ సంస్థకు ఉంది. ఈ ఇన్ఫ్రా అథారిటీని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగపూర్ కన్సార్టియం కోసం.. తమ స్వప్రయోజనాల కోసం నామమాత్రంగా మార్చేస్తున్నారు. ఏపీఐడీఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఈ సంస్థకు అధికారాలూ లేకుండా చేస్తున్నారు. ఏ విషయాల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చట్టం విస్తృత అధికారాలు కల్పిస్తుందో, ఎక్కడెక్కడ ఈ అథారిటీని సంప్రదించాలని ఉందో, ఆ విషయాలన్నింటిలో ఇన్ఫ్రా అథారిటీ అన్న పేరును తొలగించి దాని స్థానంలో‘ప్రభుత్వం’ అన్న పదాన్ని చేర్చుకుంటూ వెళ్లారు. అథారిటీ అధికారాలన్నీ కట్.. అసలు ఏది ప్రాధాన్యత గల ప్రాజెక్టు అన్న విషయాన్ని నిర్ణయించే అధికారం ఇన్ఫ్రా అథారిటీకి సెక్షన్ 2(ఎఫ్ఎఫ్) కింద ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా ఆ సెక్షనే తొలగించేశారు. పలు రంగాల నిపుణులతో అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసే అధికారం ఉండేది. ఇప్పుడు సవరణ ద్వారా ఆ సెక్షన్ కూడా తప్పించేశారు. ఇక ఏ ప్రాజెక్టు విషయంలోనూ సలహాలు, సూచనలు, సిఫారసులు చేసే అవకాశం కూడా ఇన్ఫ్రా అథారిటీకి ఉండదు. అలాగే ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకైనా, డెవలపర్‌కైనా తగిన ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కూడా అథారిటీకి దూరం చేస్తున్నారు. సమావేశాలు నిర్వహించే కనీస అధికారం కూడా ఉండదు. అథారిటీకి అధికారాలు కల్పిస్తున్న 11, 12 సెక్షన్లను తొలగించేస్తున్నారు. అలాగే డెవలపర్‌కు జరిమానా విధించే అధికారం కూడా అథారిటీకి లేకుండా చేస్తున్నారు. హైకోర్టు ఆక్షేపణలను ఖాతరు చేయని సర్కార్ వాస్తవానికి సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లను సవా లు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకోవడానికి బదు లు, స్వప్రయోజనాలకు అడ్డంకిగా వస్తున్న వాటిని చట్ట సవరణతో తొలగించేస్తోంది. రాజీ క్లాజులే వర్తించకుండా చట్ట సవరణ చేస్తోంది.ఆసక్తి ఉన్న వారికి బదులు అర్హత ఉన్న వారే బిడ్ దాఖలు చేయగలరని ప్రతి పాదిస్తోంది.సింగపూర్ ప్రతిపాదనల పరిశీల నలో ప్రభుత్వం ‘రివర్స్’లో వ్యవహరించిందని కూడా హైకోర్టు తేల్చింది. సీఆర్డీఏ, అక్కడి నుంచి ఇన్ఫ్రా అథారిటీ, అక్కడి నుం చి ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా కన్సార్టియం నుంచి ప్రభుత్వమే ముందు ప్రతిపాదనలను స్వీకరించిందని, ఇది సరికాదని ఆక్షేపించింది. దీంతో ప్రభుత్వం, సీఆర్డీఏ ఒకటేనని వాదనలు వినిపి స్తూ వస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఈ రెండింటికీ మధ్యలో ఉన్న ఇన్ఫ్రా అథారిటీ అధికారాలన్నింటినీ లాగేసుకుంటున్నారు. -
'లోకేశ్, చినరాజప్ప ఫొటోపై చర్చ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్విస్ చాలెంజ్ పై కోర్టు ప్రశ్నిస్తే చంద్రబాబు ఏకంగా చట్టాలను మారుస్తున్నారని ఆరోపించారు. చట్టాలను మార్చుకుని ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా అని ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏ చట్టమైనా లోబడి ఉండాలని తెలియదా అని అడిగారు. విదేశీ కంపెనీల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బు సంచులు పంచిన వారికి ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని శాఖలను అవినీతిలో ముంచేశారని దుయ్యబట్టారు. ఇంత అవినీతి చేసినా ధనదాహం తీరలేదా అని సూటిగా ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో ఒక ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. భారీ వర్షాలు వస్తే మంత్రులు కనీసం పర్యటించలేదని విమర్శించారు. సీఎం తనయుడు నారా లోకేశ్ ప్రభుత్వాన్ని శాసిస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ ముందు డిప్యూటీ సీఎం చినరాజప్ప వణికిపోతూ మాట్లాడుతున్నారని, ఇక ఆయన మాటలు పోలీసులు ఏం వింటారని అన్నారు. లోకేశ్, చినరాజప్ప ఫొటోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పాలన ఎటుపోతోందని బొత్స సత్యనారాయణ పశ్నించారు. -
'లోకేశ్, చినరాజప్ప ఫొటోపై చర్చ'
-
చట్టంతో చెలగాటం!
-
ఇదీ ప్రపంచస్థాయి కుంభకోణం..
స్విస్ చాలెంజ్ వెనుక అంతులేని దోపిడీ సాక్షి, ఏపీ డెస్క్: పేరుకే ప్రపంచస్థాయి రాజధాని అమరావతి. కానీ, అక్కడ జరుగుతున్నది ప్రపంచస్థాయి కుంభకోణమే. ప్రధాన రాజధాని కేంద్రంలో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ర్ట ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనే ఈ కుంభకోణంలో కీలకం. సింగపూర్ సంస్థలను ఎంపిక చేయడానికి కావలసినట్లుగా నిబంధనల్లో మార్పులు చేర్పులు చేయడం, ఓ మేనేజ్మెంట్ కంపెనీతో మొత్తం వ్యవహారాన్ని నడిపించేలా పథకం పన్నడం వంటి ఎన్నో కుట్రలు ఇందులో కనిపిస్తాయి. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ఎస్టేట్ వ్యాపారం ఇది. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటారు. కోర్ కేపిటల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. కోర్ కేపిటల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. అదీగాక సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అయితే పైసా ఖర్చు చేయని సింగపూర్ కంపెనీలకు 58 శాతం వాటా, రూ.5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ర్టప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటాగా నిర్ణయించారు. పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్లలో లాభాలు సింగపూర్ కంపెనీలు ఎకరానికి రూ.4 కోట్లకన్నా అదనంగా ఎంతకు అమ్మినా ప్రభుత్వ ప్రమేయం ఉండదు. రైతుల భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆ తర్వాత వచ్చే లాభాల నుంచి ఆ మొత్తాన్ని కట్టనున్నారు. 1,691 ఎకరాల్లో లేఔట్ వేసి, ప్లాట్లను ఏర్పాటు చేసి థర్డ్‌పార్టీకి విక్రయిస్తారు. వాటిని ఎంతకైనా, ఎవరికైనా విక్రయించవచ్చు. ఉదాహరణకు ఎకరం విస్తీర్ణంలో ప్లాట్లను మార్కెటింగ్ కంపెనీ రూ.10 కోట్లకు విక్రయించింది అనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి రూ.నాలుగు కోట్ల బేసిక్ ధరను చెల్లిస్తాయి. మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ మినహాయించుకుం టుంది. ఆ తర్వాత ఎవరి వాటాలు వారు తీసుకుంటారు. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేసి లాభం పొందబోతున్నాయన్నమాట. సీల్డ్ కవర్ మోసం సీడ్ కేపిటల్‌ను అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు ఇస్తున్న 1,691 ఎకరాల్లో ఎకరానికి రూ.4 కోట్లను బేసిక్ ధరగా రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడేది. ఇలా సీల్డ్ కవర్లో ఉంచడానికి సింగపూర్ క ంపెనీలను అనుమతించడంలోనే పెద్ద మోసం దాగి ఉంది. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే హైకోర్టులో కేసు నడుస్తోంది. మార్కెటింగ్ కోసం మేనేజ్మెంట్ కంపెనీ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)లో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం, కేపిటల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి ఉన్నా.. అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతుంది. స్విస్ చాలెంజ్ విధానంలో నిర్వహణ బాధ్యత అంతా చూడడం కోసం ఓ మేనేజ్మెంట్ కంపెనీని నియమించనున్నారు. మేనేజ్మెంట్, డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణతోపాటు లేఔట్లు, ప్లాట్లకు సంబంధించి ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏయే ఖర్చులుంటాయో, వాటికి ఎంతెంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనల్లో ప్రస్తావించారు. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58 శాతం, రాష్ర్ట ప్రభుత్వం 42 శాతం తీసుకుంటాయి. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఫీజుల కింద భారీ మొత్తాన్నే వసూలు చేయనున్నారు. సింగపూర్ సంస్థలతో ముందే లాలూచీ ‘స్విస్ చాలెంజ్’ విధానంపైనా, సర్కారు పాటిస్తున్న గోప్యతపైనా ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మొట్టికాయలు వేయడంతో అన్ని వివరాలను బయట పెడతామని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత సీఆర్డీఏ ఇచ్చిన వివరణ చూస్తే సింగపూర్ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే లాలూచీ పడినట్లు అర్థమవుతుంది. సీడ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ సూచించిన కంపెనీలను నియమించేందుకు రాష్ర్టప్రభుత్వం తొలిదశలోనే అంగీకరించిందని సీఆర్డీఏ ప్రకటన బయట పెట్టింది. ఆ ఒప్పందంలో భాగంగానే సింగపూర్ కంపెనీల కన్సార్టియంను ఎంపిక చేసేందుకు రాష్ర్టప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దాని ప్రకారమే సింగపూర్ కన్సార్టియం రాష్ర్టప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించింది. వాటినే ప్రభుత్వం సుమోటో ప్రతిపాదనలని చెబుతోంది. ప్రభుత్వంతో సంబంధాలు లేని కంపెనీలు ప్రతిపాదనలు ఇస్తే వాటిని స్వచ్ఛందంగా ఇచ్చినట్లు భావించవచ్చు. కానీ, రెండేళ్ల నుంచి రాజధానిపై రాష్ర్టప్రభుత్వంతో ఎడతెరపి లేకుండా చర్చలు జరుపుతున్న సింగపూర్ కంపెనీలిచ్చిన ప్రతిపాదనలను సుమోటో ప్రతిపాదనలని ఎలా చెప్పగలం? 2014 నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, సీఆర్డీఏ అధికారులు పలుమార్లు సింగపూర్ వెళ్లి ఆ కంపెనీలతో చర్చలు జరపడం, ఒప్పందాలు చేసుకోవడం తెలిసిన విషయాలే. అవే కంపెనీలు అనేకసార్లు రాష్ట్రానికి వచ్చి చర్చలు జరిపాయి. దీనిని బట్టి అర్థం కావడం లేదూ ముందుగానే లాలూచీ పడ్డారని? -
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తుపాన్
* ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ మండిపాటు * చంద్రబాబు హయాంలో గణనీయంగా పెరిగిన మద్యం వినియోగం * రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రజలను మోసగించారు * స్విస్ చాలెంజ్ పేరుతో భారీ అవినీతికి తెరతీశారు * కేంద్రం సహకారంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారు సాక్షి, అమరావతి: అప్పట్లో అతిపెద్ద తుపాన్ వల్ల దివిసీమ ఉప్పెన సంభవిస్తే.. మళ్లీ ఇప్పుడు మద్యం తుపాన్ రాష్ట్రాన్ని చుట్టుముట్టిందని ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మద్య రహిత దేశం కోసం ఉద్యమిస్తేనే స్వచ్ఛభారత్ రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడ్డారు. మత్తు లేని దేశం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినబూనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా గాంధీ జయంతి రోజున కన్యాకుమారి నుంచి మద్య విముక్త భారత్ కోసం మేధా పాట్కర్ ఆందోళన యాత్ర చేపట్టారు. ఆమె గురువారం విజయవాడలో ‘సంగమం’ (లౌకిక ప్రజాస్వామ్యవాదుల, సంస్థల సమైక్య వేదిక) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ ప్రసంగిస్తూ... చంద్రబాబు నాయుడు 1997లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తేశారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాం నుంచే ఏపీలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. తమిళనాడులో మద్యం ఆదాయం రూ.26 వేల కోట్లుంటే, ఏపీలో రూ.50 వేల కోట్లకు చేరిందని చెప్పారు. మద్యం ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మద్యం ఉత్పత్తిని అడ్డుకుని, ఎక్సైజ్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే మద్య నియంత్రణ అసాధ్యం కాదని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటన సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా కృష్ణా నదీ తీరంలో వెంకటపాలెం రీచ్‌లో జరుగుతున్న ఇసుక దోపిడీని స్వయంగా పరిశీలించారు. తాత్కాలిక సచివాలయానికే ఇప్పటిదాకా రూ.800 కోట్లు దుబారా చేస్తే శాశ్వత నిర్మాణాలు ఎప్పుడు చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని భూములను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని శంకుస్ధాపన ప్రాంతమైన ఉద్ధండరాయునిపాలెంలోనూ పర్యటించారు. చంద్రబాబు కచ్చితంగా నేరస్తుడే రాజధాని నిర్మాణం పేరుతో ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకొని, ప్రజలను దారుణంగా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితంగా నేరస్తుడేనని మేధా పాట్కర్ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇక్కడి భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు వ్యూహం పన్నారని ఆరోపించారు. ఆమె గురువారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పంట భూములను బలవంతంగా లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. స్విస్ చాలెంజ్ పేరిట భారీ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. సింగపూర్‌లోని రెండు కంపెనీలతో ముందుగానే మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు. మునిగిపోయే చోట సచివాలయమా? ‘‘శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధానిని నిర్మించి ఉంటే పంట భూములు పోయేవి కాదు. ప్రస్తుతం వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాలు కొండవీటి వాగు పొంగితే మునిగిపోతాయి. ఇలాంటి ప్రాంతం, మాగాణి భూముల్లో సచివాలయం ఏమిటి? ప్రజావసరాల కోసం భూములు తీసుకోవాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముందుకెళ్లాలే గానీ ఇలా దురాక్రమణ చేయడం దారుణం. ఇలాంటి పరిణామాలు ప్రజల హక్కులకు, ముఖ్యంగా దళితుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన చంద్రబాబు నేరస్తుడు కాక మరేమిటి? ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై చంద్రబాబుకు ఎలాంటి హక్కు లేదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు నడుస్తున్నందున ప్రజలకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని మేధాపాట్కర్ చెప్పారు. చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపక్కనే కృష్ణా నదిలో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇది చంద్రబాబుకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. అధునాతనమైన యంత్రాలు ఉపయోగించి నదుల్లో ఇసుకను దోపిడీ చేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. నదుల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది’’ అని మేధా పాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో సామాజిక కార్యకర్త ఉపేంద్రసింగ్ రావత్ మాట్లాడుతూ... చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో పంట భూముల్లో వ్యాపారాలు చేసి, ఆ డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. -
చట్టంతో చెలగాటం!
♦ ‘స్విస్ చాలెంజ్’ కోసం ఏపీఐడీఈకి తూట్లు ♦ సింగపూర్ కంపెనీల కోసం అనేక నిబంధనల తొలగింపు ♦ ఆసక్తి స్థానంలో ‘అర్హత’ కండిషన్ ♦ పారదర్శకత ఉండాలన్న నిబంధన హుష్‌కాకి ♦ ప్రభుత్వానిదే తుదినిర్ణయం అన్న కండిషన్కూ చెల్లుచీటి ♦ మన కోర్టుల్లో విచారణ జరిపే అవకాశం లేదు ♦ స్విస్ చాలెంజ్ టెండర్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ♦ కొత్త తప్పులు.. 31న హైకోర్టు విచారణ నాటికి కొత్త చట్టానికి రూపు? కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి, కర్నూలు: అంతర్జాతీయ రాజధానిని నిర్మించే పేరుతో అంతర్జాతీయ కుంభకోణానికి తెరతీసిన సీఎం చంద్రబాబు అందుకోసం అడ్డువచ్చిన చట్టాలనూ మార్చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ విధానంపైనా, సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టే తీరుపైనా హైకోర్టు అనేకమార్లు మొట్టికాయలు వేయడంతో ఆ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. స్విస్చాలెంజ్కు అడ్డువస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. వాస్తవానికి ఈ చట్టంలో అతి ముఖ్యమైన అనేక నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. పారదర్శకత పాటించాలన్న నిబంధనను తొలగించడం చూస్తే ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఏ అంశంలోనైనా పభుత్వానిదే తుదినిర్ణయం అన్న నిబంధనను తొలగించేయడాన్ని బట్టి సింగపూర్ సంస్థలకు ఏ రీతిలో సాగిలపడిపోతోందో తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న బిడ్డర్లు స్థానంలో అర్హత ఉన్న బిడ్డర్లు అని చేర్చడం గమనిస్తే తాము అనుకున్న సింగపూర్ కంపెనీలకే బిడ్ దక్కేలా చేయడం కోసం ఎలా దిగజారుతున్నారో ఊహించవచ్చు. ఏపీఐడీఈ చట్టానికి చేస్తున్న మార్పులు చేర్పులలో ఇలాంటి వెన్నో కనిపిస్తాయి... ‘అర్హత’ పదం చేర్చడం వెనుక... వాస్తవానికి 2001నాటి చట్టం సెక్షన్ 2 (ఎస్ఎస్)లో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత.... ‘ఆసక్తి’ ఉన్న కంపెనీలు ‘ఏవైనా’ తమ ప్రతిపాదనలు సమర్పించవచ్చునని స్పష్టం చేస్తోంది. కొత్తగా తలపెట్టిన ముసాయిదా చట్టంలోని సెక్షన్ 2(ఎస్ఎస్)లో ఆసక్తికి బదులుగా ‘అర్హత’ అనే పదాన్ని ప్రభుత్వం చేర్చింది. ఇక్కడ ‘అర్హత’ అంటే గతంలో ఇతర రాష్ట్రాలలో రాజధానులు నిర్మించిన సంస్థలు కాబోలనుకుంటే పొరబడినట్లే. అర్హత అంటే విదేశాల్లో కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం అని సీఆర్డీఏ జారీచేసిన బిడ్డింగ్ ప్రకటనలో పేర్కొంది. అంటే మన దేశంలో ఎంత ఘనమైన కాంట్రాక్టులు చేసిన సంస్థలైనా విదేశాలలో పనులు చేసిన అనుభవం లేకపోతే వాటికి పోటీలో పాల్గొనే అర్హత ఉండదన్నమాట. తాము ఎంపిక చేసిన సింగపూర్ సంస్థలనే ఆమోదించేందుకు అవసరమైన నిబంధనలను ఓ పథకం ప్రకారం చేర్చుతున్నారన్నమాట. తద్వారా హైకోర్టులో స్విస్ చాలెంజ్ అమలుపై పిటిషన్ వేసిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలను అర్హత లేదనే సాకుతో ప్రభుత్వం తప్పించనుందని తెలుస్తోంది. పాత ప్రాజెక్టులకూ కొత్త చట్టం వర్తింపు రాజధాని నిర్మాణానికి చేపట్టిన స్విస్‌చాలెంజ్ విధానంపై ఎదురవుతున్న విమర్శలను తప్పించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనేక తప్పులు చేస్తోంది. ఇందుకోసం చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం... ఈ చట్టాన్ని పాత ప్రాజెక్టులకూ వర్తింప చేయాలని నిర్ణయించింది. పాత చట్టంలో మార్పులు చేస్తూ తెస్తున్న ముసాయిదా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్‌లో (ఏపీఐడీఈ)-2016లోని సెక్షన్ 18లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. వాస్తవానికి ఏదైనా కొత్త చట్టం తెస్తే అప్పటికే ఉన్న వాటికి వర్తింపచేయడం చాలా అరుదు. అయితే, ఇందుకు భిన్నంగా... అదీ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న స్విస్ చాలెంజ్ విధానం విషయంలో పాత టెండర్లకు కొత్త చట్టం వర్తింపచేయడం ఇంకా అనుమానాలు రేకెత్తిస్తోంది. ముసాయిదా ఏపీఐడీఈ-2016లోని సెక్షన్ 18 ఏం చెబుతుందంటే...‘‘ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇన్ఫ్రా అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉంటే...ఆ ప్రాజెక్టులకు కూడా ఈ చట్టమే వర్తిస్తుంది’’.....అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్విస్ చాలెంజ్ ప్రాజెక్టుకు కూడా కొత్త చట్టమే వర్తిస్తుందన్నమాట. తద్వారా హైకోర్టులో కూడా ఆ ప్రకారం తాము చేసిన మొత్తం ప్రాసెస్ అంతా సరైనదేనని నమ్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. స్విస్ చాలెంజ్ నిర్వచనానికే తూట్లు... స్విస్‌చాలెంజ్ అంటే ఏపీఐడీఈ-2001 చట్టంలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ చట్టం సెక్షన్ 2(ఎస్ఎస్) ప్రకారం....సుమోటోగా ఏదైనా సంస్థ ఒక ప్రాజెక్టుకు సంబంధించి తన ప్రతిపాదనలను సమర్పిస్తుంది. వాటిని అందరికీ అందుబాటులో ఉంచి... అంతకంటే మెరుగైనవి ఆసక్తి ఉన్న కంపెనీలు సమర్పించాలి.వీటిని బేరీజు వేసుకున్న తర్వాత.... తర్వాత మెరుగైన ప్రతిపాదనలను తాము కూడా చేసేందుకు మొదటగా ప్రతిపాదనలు సమర్పించిన సంస్థ అంగీకరిస్తే ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించే విధానమే స్విస్ చాలెంజ్‌గా పేర్కొంది. ప్రభుత్వం మాత్రం స్విస్‌చాలెంజ్‌పై ఏపీఐడీఈ-2001 చట్టం నిర్వచనానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. మొదట బిడ్డర్ సమర్పించిన ప్రతిపాదనలను యాజమాన్య హక్కుల పేరిట ఆదాయ వివరాలను బహిర్గతపరచలేదు. తద్వారా అంతకంటే మెరుగైన ప్రతిపాదనలు రాకుండా చేసింది. అంతేకాకుండా అసలు స్విస్ చాలెంజ్ నిర్వచనానికే ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఇక నేరుగా రంగంలోకి ప్రభుత్వం... ఇప్పటివరకు రాజధాని నిర్మాణం విషయంలో సీఆర్డీఏను, ఇన్ఫ్రా అథారిటీని ప్రభుత్వం నామమాత్రంగా ముందు ఉంచింది. వాస్తవానికి సెక్షన్ 19(2) ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదక సంస్థ తన ప్రతిపాదనలను స్థానిక సంస్థకు (అంటే ఇక్కడ సీఆర్డీఏకు) సమర్పించాలి.సీఆర్డీఏ పరిశీలించి....తర్వాత ఇన్ఫ్రా అథారిటీకి పంపించాలి. ఆ తర్వాత కానీ ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు రావు. రాజధాని నిర్మాణ వ్యవహారంలో ప్రతిపాదనలు నేరుగా ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి ఇన్ఫ్రా అథారిటీకి.... అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి చేరాయి. దీనిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 19 (2)ను తొలగించి ఆ స్థానంలో సంబంధిత అథారిటీ అనుమతి అంటూ చేర్చారు. అయితే, ఇక్కడ అథారిటీ అంటే ప్రభుత్వమేనని కొత్త చట్టంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరడం సరైందేనని ప్రభుత్వం తేల్చిచెప్పనుందన్నమాట. తప్పులను ఒప్పు చేసుకునేందుకే... వాస్తవానికి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం అవలంభించిన స్విస్‌చాలెంజ్ మొత్తం ప్రక్రియను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇందుకోసం మొత్తం ప్రక్రియలో ఇప్పటివరకు ప్రభుత్వం అనుసరించిన తీరు ఏ విధంగా తప్పో పేర్కొంటూ అనేక అంశాలలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని ఉదహరిస్తూనే హైకోర్టు అనేక అంక్షితలు వేసింది. ఏపీఐడీఈ చట్టానికి భిన్నంగా మొత్తం స్విస్ చాలెంజ్ విధానం నడిచిందని మండిపడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసలు చట్టాన్నే మార్చేందుకు సిద్ధపడింది. న్యాయశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా చట్టాన్ని తెచ్చి మందబలంతో ఆమోదముద్రను వేయించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అక్టోబరు 31వ తేదీన మరోసారి హైకోర్టు దీనిపై విచారణ చేపట్టనున్నందున... ఈ లోగానే కొత్త చట్టాన్ని తీసుకరావాలనేది ఆలోచనగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. అన్నీ తొలగింపులే... ఏపీఐడీఈ 2001 చట్టంలో ఏయే క్లాజులను తొలగిస్తారో తెలిపే భాగాలు ప్రభుత్వం తలపెట్టిన కొత్త చట్టంలో పాత చట్టంలోని అనేక ముఖ్యమైన క్లాజులను తొలగించింది. తద్వారా అనేక అంశాల్లో తనకు అనుకూలమైన సింగపూర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. వాటిలో మచ్చుకు కొన్ని.... క్లాజ్ 9(1) తొలగింపు- ఈ క్లాజు ప్రకారం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు నిపుణులైన వ్యక్తులతో ప్రాజెక్టును మానిటరింగ్ చేసే అవకాశం ఇన్ఫ్రా అథారిటీకి ఉంది. దీని తొలగింపుతో నిర్మాణ పనులను పర్యవేక్షణను తొలగించినట్లు అయ్యింది. హా క్లాజ్ 11 తొలగింపు- ప్రస్తుత చట్టంలో ఈ క్లాజు కింద ఇన్ఫ్రా అథారిటీ అధికారాలను పేర్కొన్నారు. ఈ క్లాజును తొలగించడంతో దానికి ఎలాంటి అధికారాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. హా క్లాజ్ 15 తొలగింపు- పాత చట్టంలో క్లాజు 15 ప్రకారం డిమాండ్-సప్లై ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఇన్ఫ్రా అథారిటీ నిర్ణయిస్తుంది. ఈ క్లాజును తొలగించడంతో రాష్ట్ర ప్రజల కు అవసరమైన ప్రాజెక్టులు ఏవి అనేది ఇన్ఫ్రా అథారిటీ నిర్ణయించే వెసులుబాటు లేదు. తద్వారా రాజధాని నిర్మాణంలో కంపెనీకి ఏది లబ్ధి చేకూరుతుందో వాటిని మొదటగా నిర్మాణం చేపట్టే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఉదాహరణకు ప్రభుత్వశాఖల కార్యాలయాల కంటే ముందుగానే వాణిజ్య భవనాలను నిర్మించవచ్చునన్నమాట. హా క్లాజు 60 తొలగింపు - పాత చట్టంలోని క్లాజు 60 ప్రకారం వర్కింగ్ కేపిటల్‌పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ జరగాలి. ఆ నిబంధనను తొలగించారు. హా క్లాజు 62 తొలగింపు - అత్యంత కీలకమైన నిబంధన ఇది. ఇన్ఫ్రా అథారిటీ పారదర్శకత పాటించాలన్న నిబంధన ఇది. దీనికి మంగళం పలికారు. హా క్లాజు 65 - దీన్ని పూర్తిగా తొలగించారు. ఇందులోని సబ్ సెక్షన్ 2 ప్రకారం ఏ విషయంలోనైనా తుది నిర్ణయాధికారం ప్రభుత్వానిదే. దీన్ని తొలగించడమంటే ప్రభుత్వం ఏ మేరకు సింగపూర్ కంపెనీలకు సాగిలపడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. హా క్లాజు 78 తొలగింపు- ప్రస్తుత చట్టంలోని ఈ క్లాజు ప్రకారం.... ఇన్ఫ్రా అథారిటీ కానీ స్థానిక సంస్థ (అంటే ఇక్కడ సీఆర్డీఏ)కానీ కొన్ని రెగ్యులేషన్స్‌ను రూపొందించే అవకాశం ఉంది. దీనిని కొత్తగా తెస్తున్న చట్టంలో తొలగించడంతో సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీకి ఎటువంటి అధికారాలు లేకుండా పోనున్నాయి. -
చట్టం కాదు.. చుట్టం
-
సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు
-
సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు
స్విస్ చాలెంజ్ టెండర్ వివాదమే కారణం సాక్షి, న్యూఢిల్లీ: సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను రద్దు చేసుకున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు స్విస్ ఛాలెంజ్ టెండర్ విధానం అత్యంత వివాదాస్పదమైన నేపథ్యంలోనే అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారవర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్.. రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించాలని సింగపూర్ ప్రధాని లీ సెయిన్ లూంగ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 3న ఢిల్లీకి చేరుకున్నారు. ఈనెల 3, 4న ఢిల్లీలో పర్యటించిన ఆయన బుధవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చేరుకున్నారు. గురువారం కూడా ఆయన జైపూర్‌లోనే గడపనున్నారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 7న అంటే శుక్రవారం అమరావతికి చేరుకోవాలి. కానీ, ఢిల్లీ పర్యటన పూర్తయ్యాక అమరావతి పర్యటనను ఆయన రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సింగపూర్‌తో తనకున్న సత్సంబంధాల వల్ల ఆ దేశ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకొచ్చిందని అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతూ వస్తున్నారు. అయితే స్విస్ చాలెంజ్ విధానం అత్యంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో అమరావతిలో పర్యటిస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన సింగపూర్ ప్రధాని ఏపీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. సింగపూర్ ప్రధాని లీసెయిన్ లూంగ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంతో సీఎం చంద్రబాబునాయుడు తర్జనభర్జన పడుతున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు టెండర్ విధానంపై హైకోర్టు వ్యాఖ్యలతో ఇప్పటికే ఇరుకున పడిన ప్రభుత్వానికి సింగపూర్ ప్రధాని అమరావతి పర్యటన రద్దు చేసుకోవడంతో మరింత ఇరకాటంలో పడేసిందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
చట్టం కాదు.. చుట్టం
‘స్విస్ చాలెంజ్’ ఆమోదానికి ఏపీఐడీఈ చట్టంలో సర్కారు మార్పులు ఏపీఐడీఈ-2016 పేరిట కొత్త చట్టం - న్యాయపరమైన అభిప్రాయం కోసం న్యాయశాఖకు ముసాయిదా ప్రతి - విమర్శలు వచ్చిన అంశాలన్నీ చట్టంలో నుంచి తొలగింపు - అర్హత ఉన్న కంపెనీలే స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలు ఇవ్వాలంటూ మెలిక - పాత చట్టం ప్రకారం.. ఎవరైనా ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం - సెక్షన్ 19(2) స్థానంలో ‘సంబంధిత అథారిటీ అనుమతి’ చేర్పు - ఇక్కడ సంబంధిత అథారిటీ అంటే ప్రభుత్వమే - ఇక రాజధాని నిర్మాణంలో అధికారాలన్నీ సర్కారుకే... - సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ అధికారాలకు కత్తెర - తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, కర్నూలు: అమరావతి నిర్మాణం కోసం అమలు చేస్తున్న స్విస్ చాలెంజ్ విధానం వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్నే మార్చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాజధాని నిర్మాణం పేరిట లక్షల కోట్లు అడ్డగోలుగా దోచుకోవడానికే ప్రభుత్వ పెద్దలు స్విస్ చాలెంజ్‌ను తెరపైకి తెచ్చినట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్కారు తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఏకంగా చట్టాన్నే తన చుట్టంగా మార్చుకొని, ఇష్టారాజ్యంగా చెలరేగిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకొని, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్(ఏపీఐడీఈ)లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. కొత్తగా ఏపీఐడీఈ-2016 పేరుతో చట్టాన్ని తీసుకురానుంది. ఇప్పటికే దీని ముసాయిదా ప్రతిని న్యాయపరమైన అభిప్రాయం కోసం న్యాయ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం.. రాజధాని నిర్మాణ బాధ్యతలను అటు సీఆర్డీఏకు కానీ, ఇటు ఇన్ఫ్రా అథారిటీకి కానీ ఇవ్వకుండా ప్రభుత్వం తన అధీనంలోనే ఉంచుకోనుంది. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్లు వేసిన కంపెనీలను అర్హత లేదనే సాకుతో తప్పించనుంది. ఇందుకోసం బిడ్డింగ్‌లో కేవలం అర్హత ఉన్న కంపెనీలే ప్రతిపాదనలు సమర్పించాలని మెలిక పెట్టనుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మొత్తం ప్రక్రియను సమీక్షించుకుని ముందుకు వెళ్లడానికి బదులుగా... విమర్శలు వచ్చిన అంశాలను చట్టంలో నుంచి తొలగించడాన్ని గమనిస్తే మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆసక్తి కాదు... అర్హత ఉండాలి ప్రధానంగా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత కేవలం అర్హత ఉన్న కంపెనీలు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందంటూ కొత్తగా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. వాస్తవానికి 2001 నాటి పాత చట్టం సెక్షన్ 2 (ఎస్ఎస్)లో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత.... ఆసక్తి ఉన్న కంపెనీలు ఏవైనా తమ ప్రతిపాదనలను సమర్పించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే, ‘కేవలం అర్హత ఉన్న కంపెనీలే’ ప్రతిపాదనలు సమర్పించాలనే కొర్రీ వేస్తూ ప్రభుత్వం చట్టంలో కొత్త నిబంధన చేరుస్తోంది. హైకోర్టులో పిటిషన్ వేసిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలకు అర్హత లేదనే సాకుతో తప్పించేందుకే చట్టంలో ప్రభుత్వం ఈ మార్పులు తెస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాకుండా సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ సంస్థల అధికారాలకు కూడా కత్తెర పడనుంది. అన్ని అధికారాలను ప్రభుత్వ అధీనంలోనే ఉంచుకోనుంది. ఇక్కడ రాజధాని నిర్మాణ వ్యవహారాలను చూసే అథారిటీ కేవలం ప్రభుత్వమేనంటూ కొత్త నిర్వచనాన్ని కూడా చేరుస్తూ చట్టంలో మార్పులు చేయనున్నారు. సెక్షన్19(2)కు కత్తెర ఏపీఐడీఈలోని సెక్షన్ 19(2) ప్రకారం... మొదట ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలను స్థానిక సంస్థకు సమర్పించాలి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సదరు సంస్థకు ప్రాజెక్టును చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో లేదో తేల్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్ఫ్రా అథారిటీ పరిశీలించాలి. అయితే, అమరావతి నిర్మాణ వ్యవహారంలో సింగపూర్ ప్రైవేట్ సంస్థల కన్సార్టియం చేసిన ప్రతిపాదనలు నేరుగా ప్రభుత్వానికే వెళ్లాయి. ఆ తర్వాత చట్టంలో ఎక్కడా పేర్కొనని హైపవర్ కమిటీకి వెళ్లాయి. అక్కడి నుంచి ఇన్ఫ్రా అథారిటీకి వచ్చాయి. అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి చేరాయి. ఇదే విషయాన్ని విచారణ సందర్భంగా హైకోర్టు లేవనెత్తింది. స్విస్ చాలెంజ్ విధానంపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏకంగా సెక్షన్ 19(2)ను తొలగించి, ఆ స్థానంలో సంబంధిత అథారిటీ అనుమతి అంటూ చేర్చారు. ఇక్కడ అథారిటీ అంటే ప్రభుత్వమేనని ముక్తాయించడం గమనార్హం. అంటే మొత్తం మీద స్విస్ చాలెంజ్ విధానంలో ఇప్పటివరకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాన బిడ్డర్ నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం సరైందేనని చెప్పడానికి సెక్షన్ 19(2)ను తొలగించిందన్నమాట. హైకోర్టు ఏం చెప్పింది? స్విస్ చాలెంజ్ విధానంపై మొదటి నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ కంపెనీలతో ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకుని, రాజధాని నిర్మాణంలో మొత్తం ప్రక్రియను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్విస్ చాలెంజ్ విధానంలో మొత్తం ప్రక్రియ రివర్స్‌లో జరిగిందని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఆసక్తి ఉన్న కంపెనీలు పోటీ ప్రతిపాదనలను సమర్పించేందుకు గడువు 60 రోజులు ఇవ్వాల్సి ఉండగా దాన్ని 45 రోజులకే తగ్గించారని ఆక్షేపించింది. అంతేకాకుండా ఏపీఐడీఈ చట్టం సెక్షన్ 2(ఎస్ఎస్) ప్రకారం మొదట బిడ్డర్ సీల్డ్ కవర్లో దాఖలు చేసిన ఆదాయ వివరాలను చూడలేదనడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు అంటే కేవలం అర్హత ఉన్నవారు మాత్రమే కాదని తన తీర్పులో పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు అంటే అర్హత లేకపోయినప్పటికీ బిడ్‌ను దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టంలో మార్పులు తెస్తూ ఏకంగా ‘ఆసక్తి’ అనే పదానికి బదులుగా ‘అర్హత’ అనే పదాన్ని చేర్చింది. తద్వారా కేవలం తనకు అనుకూలమైన కంపెనీలే బిడ్‌ను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. స్విస్ చాలెంజ్ విధానంలో విమర్శలు వచ్చిన అంశాలనే చట్టంలో నుంచి తొలగిస్తూ కొత్త చట్టం తెస్తుండడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు: ఏపీ ఏజీ
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఇవాళ మరోసారి వాదనలు వినిపించారు. సింగపూర్ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా నిబంధనలు ఉన్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అంతర్జాతీయ కంపెనీలతో కలిసి ఇండియన్ కంపెనీలు జాయింట్ వెంచర్ ద్వారా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని ఏపీ ఏజీ తెలిపారు. సింగపూర్ కన్సార్షియం నెట్ వర్త్ రూ.60వేల కోట్లు ఉందని, రూ.2వేల కోట్లు ఉంటే చాలని నిబంధనల్లో పెట్టారన్నారు. ఒకవేళ మేలు చేయాలనుకుంటే ఆ నిబంధన అలా ఉండేది కాదని, గన్నవరం విమానాశ్రయంను ఎల్ అండ్ టీ కి అప్పగిస్తే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనులు చేయలేకపోయిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. -
స్విస్ చాలెంజ్ ఓ మాయాజాలం
ఆయా కంపెనీలు తమంత తాముగా బిడ్లు సమర్పించడమే స్విస్ చాలెంజ్. కానీ సింగపూర్ మంత్రి తనకిష్టమైన కంపెనీల పేర్లు చెప్పటం, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిం చడం.. ‘ఈశ్వర చంద్ర’ల మ్యాచ్ ఫిక్సింగ్ తప్ప దీంట్లో చాలెంజ్ ఎక్కడుంది? అమరావతి నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించ బోతున్న స్విస్ చాలెంజ్ విధా నంలో లోపాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో కేవలం 12 దేశాలు మాత్రమే ఇంతవరకూ ఈ విధానాన్ని పాక్షికంగా పాటి స్తున్నాయి. రాష్ట్రంలో చంద్ర బాబు ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న ఈ స్విస్ చాలెంజ్ విధానం ఒక మహా మ్యాచ్ ఫిక్సింగ్ అన్న అనుమానం కలుగుతోంది. అమరావతి మాస్టర్‌ప్లాన్ తయారీ దగ్గర నుంచి సీడ్ క్యాపిటల్ నిర్మా ణానికి సింగపూర్ కంపెనీల పేర్లను ప్రతిపాదించేంత వరకు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఎస్. ఈశ్వరన్ అనుసరించిన విధానాలు, వాటికి అనుగుణంగా చంద్ర బాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే ఈ అను మానాలకు బలం చేకూరుతోంది. సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వ రన్ ఆ దేశంలోని పలు కంపెనీలకు మేనేజింగ్ డైరక్టర్ గానూ, డెరైక్టర్‌గాను ఉంటున్నారు. ఆయన 2013, జనవరి 13వ తేదీ నుంచి డెరైక్టర్‌గా ఉన్న సెంబ్‌కార్ప్ ఇండ్రస్టీ వాటిలో ఒకటి. ఈశ్వరన్ తాను డైరక్టర్‌గా ఉన్న సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీ పాటు అసెండాస్ - సింగ్‌బ్రిడ్జ్ అనే మరో కంపె నీతో కలిపి అమరావతి నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేయించారు. అసెండాస్ - సింగ్‌బ్రిడ్జ్ కంపెనీ ప్రస్తుత చైర్మన్ వాంగ్‌కాన్ సెంగ్ గతంలో సింగపూర్ డిప్యూటీ ప్రధాన మంత్రిగా వ్యవహరించారు. ఆయన కంపెనీ లోనూ ఈశ్వరన్‌కు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్నాయి. తాను డెరైక్టర్‌గా ఉన్న కంపెనీకి, తనకు పెద్ద మొత్తంలో షేర్లు ఉన్న కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి సింగపూర్ మంత్రి ఎస్. ఈశ్వరన్ తొలినుంచీ ప్రయత్ని స్తున్నారన్నది తేటతెల్లమైపోయింది. కచ్చితంగా ఇది క్విడ్ ప్రోకో క్రిందికే వస్తుందని నిపుణుల అభిప్రాయం. ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణ మాస్టర్ ప్లాన్లు తయారు చేయడానికి, నగర నిర్మాణానికి సింగ పూర్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని మొదట చంద్రబాబు ప్రకటించారు. కానీ, అనంతరం చర్చలన్నీ ఎస్. ఈశ్వరన్ - చంద్రబాబు మధ్య ప్రైవేట్ చర్చలుగా మారటం జగమెరిగిన సత్యం. ఈ చర్చలు, ఒప్పందాల ఫలితంగా అమరావతి నిర్మాణానికి మూడు మాస్టర్ ప్లాన్లు తయారు చేసే బాధ్యతను ఈశ్వరన్ తన దేశానికి చెందిన ప్రభుత్వ శాఖకు కాకుండా ప్రైవేట్ కంపెనీ సుర్బానా జురాంగ్‌కు అప్పగించాలని సిఫార్సు చేశారు. దానికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ల కోసం ఆ కంపెనీకి కోట్లాది రూపాయలు చెల్లించింది. గతంలో విశాఖలో ఒక చిన్న టౌన్‌షిప్‌ను నిర్మించలేక మధ్యలోనే కాంట్రాక్ట్‌ను వదులుకున్న జురాంగ్ కంపెనీ అమరావతి నగర నిర్మాణానికి మాస్టర్ ప్లాన్లు తయారు చేయడమే కాకుండా నగర నిర్మాణంలో పాలుపంచుకోవ డానికి బిడ్ దాఖలు చేయబోయింది. అయితే అనూ హ్యంగా ఎస్. ఈశ్వరన్ గత ఏడాది జూలై 20 తేదీన తాను డెరైక్టర్‌గా ఉన్న, తనకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్న సెంబ్ కార్ప్ డెవలప్మెంట్, అసెండాస్ - సింగ్‌బ్రిడ్జ్ కంపెనీలను తెరపైకి తెచ్చి అవి బిడ్లు దాఖలు చేయబోతున్నట్లు సింగ పూర్ అధికార పత్రిక స్ట్ట్రెట్ టైమ్స్‌కు తెలిపారు. ఆయన సలహామేరకే ఈ స్విస్ చాలెంజ్ విధానంలో బిడ్లు వేయ వలసిందిగా చంద్రబాబు ఈ కంపెనీలనే ఆహ్వానిం చారు. ఇది స్విస్ చాలెంజ్ ప్రాథమిక సూత్రాలకే పూర్తి విరుద్ధం. స్విస్ చాలెంజ్ విధానం ప్రకారం ఆయా కంపెనీలు తమంత తాము బిడ్లు సమర్పించాలి. కాని సింగపూర్ మంత్రి తనకు ఇష్టమైన కంపెనీల పేర్లు చెప్పడం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం పలు అనుమానాలకు, అపోహలకు తావిస్తోంది. అమరావతి నగర నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన సెంబ్‌కార్ప్ కంపెనీపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కంపెనీ బ్రెజిల్లో 12 డ్రిల్లింగ్ రిగ్గుల నిర్మాణ కాంట్రాక్ట్ పొంద డానికి పెట్రోబ్రాస్ అధికారులకు 9.50 మిలియన్ అమెరి కన్ డాలర్ల లంచం ఇచ్చి బ్రెజిల్ న్యాయస్థానంలో దోషిగా నిలబడింది. ఎస్. ఈశ్వరన్ మంత్రి హోదాలో ఉంటూ తాను డైరక్టర్‌గా ఉన్న కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగపూర్ పేరుతో కళంకితమైన ఆ దేశ ప్రైవేట్ కంపెనీలను ఆహ్వాని స్తోంది. ఈ నిర్ణయాలు చూస్తుంటే చంద్రబాబు-ఈశ్వరన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు కలుగు తున్నాయి. పోటీయే లేని స్విచ్ చాలెంజ్‌లో లబ్ధి పొందడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సకల చట్టాలనూ తుంగలో తొక్కింది. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ (ఏపీఐడీఈఏ) 2001 చట్టం ప్రకారం రాష్టంలో ఏ సంస్థకైనా ప్రభుత్వం అప్పగించే భూము లకు గరిష్టంగా 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వాల్సి ఉండగా సింగపూర్ సంస్థల కోసం భూమిపై 99 ఏళ్లకు లీజు లేదా పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేయడం ప్రజా ద్రోహమే. స్విస్ చాలెంజ్‌లో వాస్తవానికి ఏ చాలెంజూ లేదని మహా మ్యాచ్ ఫిక్సింగ్ అని, ఇదంతా ‘ఈశ్వర చంద్ర’ మాయాజాలంలో భాగమని గత కొన్ని నెలలుగా పుంఖా నుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనా లను తీవ్రంగా దెబ్బ తీస్తున్న స్విస్ చాలెంజ్ విధానాన్ని చట్టపరంగానే కాకుండా, అన్ని రకాలుగా ఎదుర్కోవడం ఏపీ ప్రయోజనాల రీత్యా ఎంతైనా ఆవశ్యం. వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్అసోసియేషన్ మొబైల్ : 95052 92299 - వీవీఆర్ కృష్ణంరాజు -
స్విస్ చాలెంజ్ కేసు విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఏపీ అడ్వకేట్ జనరల్ సోమవారం న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. గత కొద్దిరోజులుగా హైకోర్టులో స్విస్ చాలెంజ్ విధానంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత నిర్మాణాన్ని చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసిన విషయం విదితమే. -
ఏపీ ప్రభుత్వంలో స్విస్ చాలెంజ్ కేసు వణుకు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ విచారణ ఏపీ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. స్విస్ చాలెంజ్ కేసులో హైకోర్టు సునిశితమైన విచారణపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. స్విస్ చాలెంజ్ కేసు విచారణ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతున్నట్టు తెలిసింది. ఈ కేసు విచారణ విషయంలో హుటాహుటినా ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి విమానంలో అత్యవసరంగా విజయవాడకు వెళ్లినట్టు సమాచారం. స్విస్ చాలెంజ్ కేసులో హైకోర్టు ఉన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ సంస్థలే ఎందుకని ప్రశ్నించింది. ఏ కంపెనీ అయినా ఆ పని చేస్తుంది కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీల సీల్డ్ కవర్‌పై హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. -
సింగపూర్ సంస్థలే ఎందుకు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు అప్పగించడాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ సంస్థలే ఎందుకని ప్రశ్నించింది. ఏ కంపెనీ అయినా ఆ పని చేస్తుంది కదా అని వ్యాఖ్యానించింది. మొదటి విడత బిడ్డింగ్ నిబంధనలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపించేలా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. విదేశీ పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా స్విస్ చాలెంజ్ నిబంధనలు తయారు చేశామని కోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీఆర్డీఏ, ప్రభుత్వం రెండూ ఒకటేనని వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా?
-
స్విస్ చాలెంజ్, బస్తీమే సవాల్
ఆ బ్యాంకులలో నల్లధనం ఎంత గుప్తమో, స్విస్ చాలెంజ్ విధానం కూడా అంతే గోప్యంగా ఉంటుంది. తాటస్థ్యం ముసుగులో దేశాల మధ్య పచార్లు కొడుతూ ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. నిర్మాణం పేరుతో ప్రజా ప్రయోజనాలను విధ్వంసం చేస్తుంది. కాంట్రాక్ట్ పెట్టుబడుల పేరిట తన లాభాలతో అందుకు తోడ్పడే పాలక వర్గాల ప్రయోజనాలకు నిండారా తోడ్పడుతుంది. స్విస్ చాలెంజ్ మౌలిక రహస్యాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా వివరించాలంటే, అదొక బ్రోకరేజీ పద్ధతి. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని (అమరావతి) నిర్మాణం పేరిట, రాజధాని అభి వృద్ధికి భాగస్వామ్యం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడి పడి ఉన్న ఈ కామాటంలో విదేశీ కంపెనీల కోసం కాకుండా, ప్రజా ప్రయోజ నాల రక్షణ కోసమే నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు హితవు పలికింది. ప్రతి విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని న్యాయస్థానం ప్రశ్నిం చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వివరాలను బయటపెట్టకపోవడంలోని లోగుట్టు ఏమిటని నిలదీసింది. స్విస్ చాలెంజ్ విధానం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది.’ (సింగపూర్ ప్రైవేటు కంపెనీల కన్సార్టియం సంస్థ ప్రతిపాదనల మీద హైకోర్టు స్టే ఉత్తర్వులు విధించిన సందర్భంగా పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం) చినికిచినికి గాలివానగా మారిన సింగపూర్ కంపెనీల సంయుక్త సంస్థ (కన్సార్టియం) ప్రతిపాదనలకు మూలం ఏమిటి? ఆ సంస్థ స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎక్కడ నుంచి అరువు తెచ్చుకున్నది? ఇవి ముందు తెలుసుకుంటేనే గానీ కొందరి పాలకులకు ‘బస్తీమే సవాల్’ అంటూ తొడగొడుతున్న ఈ స్విస్ చాలెంజ్ అవతరించిన విధానం తెలియదు. ఆశ్చర్యపడవద్దు గానీ, ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు రాని ఈ స్విస్ చాలెంజ్ రెండు ప్రపంచ యుద్ధాల క్రమంలో స్విట్జర్లాండ్ జాతీయ విధానంగా అవతరించింది. భారత బడా సంపన్నుల రూ. 24 లక్షల కోట్ల అక్రమ సంపాదనకు (బ్లాక్‌మనీ) ఆదర్శగూడుగా అలరారుతున్న స్విస్ బ్యాంకుల నిర్వహణ పంథాలోనే ఈ చాలెంజ్ కూడా రూపుదిద్దుకుందని ప్రసిద్ధ విశ్లేషకుడు వినాయక్ చటర్జీ వెల్లడించారు. ఇదొక బ్రోకరేజీ విధానం ఈ పదబంధం ఏ గుప్త సంస్థలో బాలసారె జరుపుకుందో, దీనిని ప్రపంచం మీదకు వదిలిపెట్టినవాడు ఎవరో ఇప్పుడు తెలియకపోవచ్చుగానీ స్విట్జ ర్లాండ్ విదేశాంగ విధానం, జోక్యం చేసుకునే తత్వానికి దూరంగా ఉన్నట్టు కనిపించే దాని తాటస్థ్యం బూటకమని మాత్రం అర్థమవుతుంది. ఆ బ్యాంకు లలో నల్లధనం ఎంత గుప్తమో, స్విస్ చాలెంజ్ విధానం కూడా అంతే గోప్యంగా ఉంటుంది. తాటస్థ్యం ముసుగులో దేశాల మధ్య పచార్లు కొడుతూ ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగిస్తూ ఉంటుంది. నిర్మాణం పేరుతో ప్రజా ప్రయోజనాలను విధ్వంసం చేస్తుంది. కాంట్రాక్ట్ పెట్టుబడుల పేరిట తన లాభాలతో అందుకు తోడ్పడే పాలక వర్గాల ప్రయోజనాలకు నిండారా తోడ్పడుతుంది. స్విస్ చాలెంజ్ మౌలిక రహస్యాన్ని ఎలాంటి శషభిషలు లేకుండా వివరించాలంటే, అదొక బ్రోకరేజీ పద్ధతి. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కొండలలో పోడు సేద్యం ద్వారా సరుకుల్ని ఉత్పత్తి చేసుకుంటే మార్కెట్ చేసి పెట్టే నాథుడు లేక బ్రోకర్లకు శేరుకు శేరున్నర దోచిపెట్టి సంతలకు చేర్చుకునే దోపిడీ పద్ధతికి మించిన దోపిడీ ఈ చాలెంజ్‌లో ఉంది. ఇందులోనే ప్రభుత్వ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఖరారు చేసే కాంట్రాక్ట్ పద్ధతి ఒకటి ఉంది. నర్మగర్భంగా తమకు అనుకూలమైన ఒక ప్రైవేటు కంపెనీ చేత పనుల కోసం కాంట్రాక్టుకు వేసే బిడ్డింగ్ (వేలం)లో తక్కువ కొటేషన్ వేయించి, అదే పనికి పోటీదారులను పెంచేటట్టు చేయడం, తద్వారా ముందే నిర్ణయించిన అనుకూల కాంట్రాక్టరు ఈ పోటీకి తట్టుకోలేక కాంట్రాక్టును వదులుకునేటట్టు నాటకమాడి, తనకు అనుకూలంగా ప్రభుత్వ కాంట్రాక్టు పొందడం. ‘నీవు ఎంత లాభం పట్టగలవో పట్టుకో, నా వాటా మాత్రం నాకు వదిలెయ్!’ - ఇదీ స్థూలంగా స్విస్ చాలెంజ్. ఇదంతా మౌలిక వసతుల కల్పన పేరుతోనే జరుగుతుంది. ఇందులో ఉన్న మతలబుని, దోపిడీ రహస్యాన్ని కోర్టు పసికట్టింది కాబట్టే, సింగపూర్ కన్సార్టియంకు చేసిన ప్రతిపాదనలలోని ఆదాయ రహస్యాలను వెల్లడించాలని ఆదేశిం చవలసి వచ్చింది. ఎందుకు? ఆ రహస్యాల ఖరీదు రూ. 50 వేల కోట్లు అని చెబుతారు. రాజధాని నిర్మాణం కోసమంటూ వేల ఎకరాల భూసమీకరణ, వేలాదిమంది రైతుల పంట భూములలోని పండ్ల తోటలను అర్ధరాత్రి తగల పెట్టించడం ప్రజలు కూడా గమనించారు. సింగపూర్ సంస్థ కన్సార్టియంతో పాలకులు కుదుర్చుకున్న అవగాహన పత్రం ప్రకారం ఆ సంస్థలకు కేటా యించిన 250 ఎకరాలలో తీసే ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇచ్చేదిలేదు పొమ్మని కన్సార్టియం తేల్చి చెప్పినందుకే స్విస్ చాలెంజ్ పద్ధతి ప్రశ్నార్థక మైంది. అందుకే పారదర్శకత లేని లోపాయికారీ పద్ధతి వేలంలో పోటీదారు లైన ఇతర బిడ్డర్లకు నష్టదాయకమని వినాయక్ చటర్జీ ‘బిజినెస్ స్టాండర్డ్’లో పేర్కొనవలసి వచ్చింది. అంటే ఈ లోపాయికారీ పద్ధతివల్ల ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పారదర్శకమైన సేకరణను నియంత్రించే శక్తిగా ప్రైవేట్ సింగపూర్ కంపెనీల కన్సార్టియం అవతరిస్తుంది. మరోమాటలో చెప్పా లంటే- కీలకమైన నిర్మాణ రంగంలో కేవలం ప్రైవేట్ రంగానికి లాభించే పద్ధతిలో మాత్రమే వేలం పద్ధతిని పూర్తిగా నియంత్రించే సరికొత్త వేలం (బిడ్డింగ్) పద్ధతే ‘స్విస్ చాలెంజ్’ విధానమని మరచిపోరాదు. విదేశాల అనుభవం ఈ పద్ధతిలో ఎదురు చాలెంజ్ విసిరే ఇతర కీలకమైన కంపెనీలు తమ పోటీ ప్రతిపాదనలతో ముందుకు రావడానికి, 60 రోజుల లోపుగానే ప్రత్యా మ్నాయ ప్రతిపాదనలు సమర్పించాలని ‘స్విస్’ పద్ధతి విధించే షరతులు అధిగమించలేని, మింగలేని ‘పచ్చి వెలక్కాయ’. ఈ స్విస్ చాలెంజ్ విధానం వల్ల చిలీ, దక్షిణాఫ్రికా, కొరియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలు ప్రయోజనం పొందింది లేదు. ఈ ‘స్విస్’ విధానాన్ని తలకెత్తుకుని తెచ్చుకున్న తల నొప్పివల్ల స్విస్ పద్ధతికి, నిర్మాణ రంగంలో అత్యంత శక్తివంతమైన దేశీయ నిపుణులు, నైపుణ్యం మూర్తీభవించిన కంపెనీలు సహితం పోటీ ప్రతిపాద నలతో ముందుకు రావడానికి నిర్మాణ అంచనాల రూపకల్పనకు ‘60 రోజుల వ్యవధి’ చాలదన్నందుకు బిడ్డింగ్ నుంచి తప్పించేశారు. మనీలా (ఫిలిప్పైన్స్ రాజధాని)లోని ‘‘నీనాయ్ ఏక్వినో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’’ నిర్మాణ బాగోతమే ఇందుకు నిదర్శనం. అది అనేక వివాదాలకు దారితీసిన సంగతిని మరచిపోరాదు. అంతేకాదు, ఈ ‘స్విస్ చాలెంజ్’ నర్మగర్భ నిర్మాణ పద్ధతు లకు, ప్రైవేట్ కంపెనీలు, ప్రాజెక్టుల మౌలిక నిర్మాణ పద్ధతులకు ‘పిలవని పేరంటం’లాగా ఆయాచితంగానే పరిష్కార మార్గాలకు, ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లకు ప్రపంచ బ్యాంక్ ముఖద్వారంగా వ్యవహరిస్తోందని కూడా గుర్తించవలసిన అవసరం ఉందని మరవొద్దు. ‘పబ్లిక్-ప్రైవేట్ ప్రాజెక్టుల’ అవినీతికర వ్యవస్థను ‘స్విస్ చాలెంజ్’ పద్ధతిలో వత్తాసు ఇచ్చి ముందుకు నెట్టింది కూడా అమెరికా ఆధ్వర్యంలోని ఈ వరల్డ్ బ్యాంకేనని కూడా మరవరాదు. ఎంతోమంది దేశీయ నిపుణుల్ని, నిర్మాణ రంగాల్లో కాల నియమం తప్పకుండా ప్రాజెక్టులను పూర్తిగావించిన దేశ, విదేశాల్లో పేరు గడించిన మహా ఇంజనీర్లు, దక్షతగల దేశీయ నిపు ణులూ, అపారమైన కార్మిక శక్తీ ఉందని ఇప్పటికైనా మన పాలకులు, దీనిని స్వాగతించదలచినవారు గుర్తించాలి. కేల్కర్ కమిటీ ఏం చెప్పింది? నిర్మాణ రంగంలో పనులకు అవసరమైన సంబారాలను సమకూర్చడంలో స్విస్ పద్ధతివల్ల పారదర్శకత కుదరదని ఆచరణలో ఈ పద్ధతిని అనుసరిం చిన కొన్ని దేశాల అనుభవం. పైగా తగాదాలు వస్తే ఏ లండన్ కోర్టుకో వచ్చి పరిష్కరించుకోవలసిందిగా మనకు ఎదురు సవాలు విసిరేదే ‘స్విస్ చాలెంజ్’ అనీ మరవరాదు. బహుశా అందుకే, నిర్మాణ రంగాల ‘అభివృద్ధి’ పేరిట నిర్మించే ప్రాజెక్టులకు నిధులు సేకరించేందుకు అనుసరించే స్విస్ చాలెంజ్ పద్ధతుల్ని పరిశీలించిన పిమ్మటనే కేంద్ర ప్రభుత్వం కేల్కర్ నాయకత్వాన ఏర్పరచిన నిపుణుల కమిటీ ఈ చాలెంజ్‌కి వ్యతిరేకంగా తీర్పు వెలువ రించింది. వరల్డ్ బ్యాంక్ సంస్కరణలలో భాగమే ‘మొత్తాలు చూసి పేటలు’ పరిచే కొత్తరకం కాంట్రాక్టుల వ్యవస్థకు తెరలేపింది ఈ ‘చాలెంజ్’. మన దేశంలోకి ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా దిగుమతి అయిన ఈ ‘చాలెంజ్’ పద్ధతినే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా తదితర రంగాలలో కేంద్రమూ అనుసరించి చేతులు కాల్చుకుంటున్నాయి. ఈ పద్ధతి ద్వారా ప్రభుత్వాలు కొన్ని దేశ సహజ వనరులను ప్రైవేట్- ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ) పేరిట కొల్లగొడుతున్నాయి. అనేక సంద ర్భాల్లో కల్పించే విపరీత రాయితీల పర్యవసానంగా అనేక రకాల రాజకీయ, లీగల్ వివాదాలూ తలెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణలు-కామన్వెల్త్ క్రీడలు, రేడియో తరంగాలపై కంపెనీల గుత్తాధిపత్యం, కృష్ణా-గోదావరి బేసిన్ వనరుల దోపిడీ విషయంలో బొగ్గు తవ్వకాల విషయంలో బయ ల్పడిన అనేక కుంభకోణాలు, చివరికి కేంద్ర నిఘా కమిషన్ విజయ్ కేల్కర్ కమిటీలు సహితం ‘‘స్విస్ చాలెంజ్’’ విధానం బిడ్డింగ్ నడిపే పద్ధతులు పారదర్శకంగా లేవని ఇంతకుముందే హెచ్చరించాయని గుర్తు పెట్టుకోవాలి. ప్రజా వ్యతిరేక సంస్కరణలంటే పాలకులు ఆరాటపడుతూండటం ఈ రక మైన లావాదేవీల కోసమే. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆదాయ వివరాలు ప్రభుత్వానికే తెలియవా?
- రాజధాని అభివృద్ధిలో అలా ఎలా ముందుకెళుతున్నారు? - రాష్ట్ర సర్కారు తీరుపై హైకోర్టు విస్మయం - ఆదాయ వివరాలు రహస్యంగా ఉంచాలని ఎందుకు భావిస్తున్నారని నిలదీత - చట్టంలో ఏమైనా నిషేధం ఉందా? అంటూ ప్రశ్న - సింగపూర్ కన్సార్టియం చెప్పొద్దని కోరిందన్న అటార్నీ జనరల్ - ఈ ప్రాజెక్టుతో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందన్న ధర్మాసనం - తదుపరి విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి వ్యవహారంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికే తెలియకపోవడంపై హైకోర్టు ధర్మాసనం సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సింగిల్ జడ్జి ‘స్విస్ చాలెంజ్’పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధర్మాసనం కూడా ఆదాయ వివరాలు తెలుసుకోకుండానే ముందుకెలా వెళుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం సంతృప్తికరంగా లేకపోతే ఎలా? అని నిలదీసింది. ‘అయినా ఆదాయ వివరాల్లో అంత రహస్యం ఏముంది? ఎందుకు రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారు..’ అని అడిగింది. దీనికి అటార్నీ జనరల్ సమాధానమిస్తూ.. ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ అన్నారు. ఆదాయ వివరాలను అందరికీ బహిర్గతం చేయవద్దని, టెక్నికల్ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన వారికే చెప్పాలని సింగపూర్ కన్సార్టియం కోరిందని తెలిపారు. ఆ మేరకే తాము ఆదాయ వివరాలను అందరికీ వెల్లడించడం లేదని చెప్పారు. ఇప్పటివరకు సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ఒక్క బిడ్ కూడా రాలేదని ఏజీ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు అంశాలపై ఏజీ నుంచి స్పష్టత తీసుకునే ప్రయత్నం చేసింది. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ సీఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లపై సింగిల్ జడ్జి ఈ నెల 12న స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగిల్ జడ్జి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని, వాస్తవానికి అది విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు అని చెప్పారు. ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే వెల్లడించాలన్న సింగిల్ జడ్జి ఏపీఐడీఈ చట్టం సెక్షన్ 2(ఎస్ఎస్)కు తనదైన శైలిలో భాష్యం చెప్పారన్నారు. ఆదాయ వివరాలు తప్ప అన్ని వివరాలను ప్రాథమిక స్థాయిలో చెప్పామని వివరించారు. ఆ ప్రతిపాదనలు లాభదాయకం కాకపోతే ఏంచేస్తారు? స్థూల అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి ఇంత మొత్తాన్ని ఆదాయంగా ఇవ్వాలని సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిందని, ఇందుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో ఉంచి, టెక్నికల్ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన వారికే బహిర్గతం చేయాలని కోరిందని ఏజీ వెల్లడించారు. మీకైనా ఆదాయ వివరాలు తెలిసి ఉండాలి కదా? తెలుసా? లేదా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. సీల్డ్ కవర్లోనే ఆ వివరాలున్నాయని, ప్రభుత్వానికి కూడా తెలియవని ఏజీ చెప్పారు. దీంతో ‘ప్రభుత్వానికే తెలియవా..?’ అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. కన్సార్టియం ప్రతిపాదనలు ప్రభుత్వానికి లాభదాయకంగా లేకపోతే అప్పుడేం చేస్తారు?’ అని ప్రశ్నించింది. ఆ ప్రతిపాదనలను రద్దు చేస్తామని శ్రీనివాస్ చెప్పారు. వివరాలు చెప్పకూడదని నిషేధం ఏమైనా ఉందా? ‘అలా అయితే అప్పటివరకు చేసిన కసరత్తు మొత్తం వృథా అయినట్లే కదా! ప్రాథమిక స్థాయిలోనే ఆదాయ వివరాలు వెల్లడిస్తే స్పష్టత ఏర్పడటంతో పాటు సమయం, తదిరాలు ఆదా అవుతాయి కదా.. అయినా ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం (ఏపీఐడీఈ) 2001లో ఏమైనా నిషేధం ఉందా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. నిషేధం ఏమీ లేదని, అలాగే ప్రాథమిక స్థాయిలో వెల్లడించడం తప్పనిసరి కూడా కాదని ఏజీ చెప్పారు. సింగిల్ జడ్జి తన మధ్యంతర ఉత్తర్వులను ఐక్యాచ్ కమ్యూనికేషన్స్ వర్సెస్ ప్రకాశ్ ఆర్ట్స్ కేసులో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఆధారపడి ఇచ్చారని, వాస్తవానికి హైకోర్టు ధర్మాససం తన తీర్పులో సెక్షన్ 2(ఎస్ఎస్) అంశం గురించి ఎటువంటి చర్చా చేయలేదని చెప్పారు. సాంకేతిక బిడ్ల సమర్పణకు ఈ నెల 13 చివర తేదీ అని, అయితే 12వ తేదీన సింగిల్ జడ్జి మొత్తం ప్రక్రియను నిలిపేశారని వివరించారు. ఆ తర్వాత ధర్మాసనం.. రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో పలు ప్రాథమిక, సూక్ష్మమైన అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసింది. భూముల అభివృద్ధి, ప్లాట్లు వేసే అంశానికి సంబంధించినంత వరకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు, ఈ ప్రాజెక్టుకు పెద్ద తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ‘ఒకవేళ మేము సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తే.. ఇప్పటివరకు బిడ్లు దాఖలు కాలేదు కాబట్టి మీరు నేరుగా సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకోవచ్చు కదా? అడ్డంకులు ఏమీ ఉండవు కదా?’ అని ప్రశ్నించింది. ఉపాధిపై నిర్దిష్టంగా చెప్పలేం: ఏజీ అలా చేయడం పారదర్శకత కిందకు రాదని, మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని ఏజీ అన్నారు. సాంకేతిక బిడ్ల దాఖలు గడువు ఇప్పటికే ముగిసినందున మరోసారి ఆ గడువును పొడిగించాల్సి ఉంటుందని చెప్పారు. స్విస్ చాలెంజ్ పద్దతిలో భూములు అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కాదని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? అని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్దిష్టంగా చెప్పలేమని ఏజీ చెప్పారు. ఇంతలో కోర్టు పనివేళలు ముగియడంతో విచారణ వాయిదా పడింది. -
స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు సునిశిత వ్యాఖ్యలు
-
స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు సునిశిత వ్యాఖ్యలు
హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఏపీ అడ్వకేట్ జనరల్ ఇవాళ కూడా తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు సునిశిత వ్యాఖ్యలు చేసింది. స్విస్ చాలెంజ్ విధానం రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియం చేసిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ అయిన నోటిపికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ నిన్న ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
స్విస్‌చాలెంజ్ కేసు సోమవారానికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి టెండర్ల ప్రక్రియపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ప్రభుత్వం, సీఆర్డీఏ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. వాస్తవానికి ఈ అప్పీలుపై శుక్రవారం వాదనలు కొనసాగాల్సి ఉండగా... ధర్మాసనం మల్లన్నసాగర్ కేసు విచారణ చేపట్టడంతో ఈ అప్పీలు విచారణకు నోచుకోలేదు. దీంతో ఈ కేసు విచారణను సోమవారం మధ్యాహ్నం పరిస్థితిని బట్టి చేపడతామని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. -
స్విస్ ఛాలెంజ్‌పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విధానంపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కాగా రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియం చేసిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ అయిన నోటిపికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రామచంద్రరావు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్ నిన్న ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనల అనంతరం విచారణను రేపటికి వాయిదా పడింది. -
ఆ రహస్యం ఖరీదు 52 వేల కోట్లు
-
స్విస్ చాలెంజ్ కాదు.. మ్యాచ్ ఫిక్సింగ్
పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజం సాక్షి,హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్ విధానం వెనుక పెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని, అందుకే కోర్టు కూడా దీన్ని వ్యతిరేకించిందని చెప్పారు. సీఆర్డీఏ, మున్సిపల్ అభివృద్ధి శాఖ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని కోర్టు అక్షింతలు వేసిందన్నారు. అర్హత నిబంధనలు సరిగ్గా లేవని కోర్టు చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి సింగపూర్ వాళ్లే ముందుకొచ్చి అన్నీ ఉచితంగా చేశారని ప్రచారం చేశారన్నారు. నిజం చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందు వల్లే ఇక్కడకు వస్తున్నారని వివరించారు. రాజధాని విషయంలో తరతరాలు నష్టపోయేలా చంద్రబాబు చేస్తున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. సింగపూర్ తరఫున తొలుత సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థ వచ్చిందని, వారు అమరావతి రాజధాని ప్రణాళిక రూపొందించమని టెమాసిక్ హోల్డింగ్స్‌కు సబ్బిడరీ కంపెనీ అయిన సుర్బానా అండ్ జురాంగ్‌కు అప్పగించారని చెప్పారు. సుర్బానా జురాంగ్ ప్లాన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం పథకం ప్రకారం కథ నడిపించిందన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో రాజధాని ఏర్పాటుపై ఏప్రిల్ 22న ప్రకటన వచ్చిందన్నారు. రాజధాని నిర్మిస్తామని ఏప్రిల్ 30న సింగపూర్ ఎంటర్‌ప్రైజెస్‌కు అసెండాస్ సెమ్‌బ్రిడ్జ్ కంపెనీలు లేఖ రాశాయన్నారు.పేరెంట్కంపెనీ టెమాసిక్ హోల్డింగ్స్ ప్రతిపాదనలు పంపకుండా వేరొకరు ఎలా రంగప్రవేశం చేస్తారని ప్రశ్నించారు. స్విస్ చాలెంజ్ ప్రతిపాదనల్ని ఎక్కడ పాటించారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 2014 డిసెంబర్ నుంచి 2015 ఏప్రిల్ వరకు టెమాసిక్ హోల్డింగ్స్ చెందిన సుర్బానా జురాంగ్ ప్లాన్స్ ఇచ్చాయని, ఏప్రిల్ 30 నుంచి అసెండాస్ సెమ్‌బ్రిడ్జ్ కూడా అదే కంపెనీకి సబ్బిడరీ అని తెలిపారు. రాష్ట్రం బాగుకోరే ప్రతి ఒక్కరూ స్విస్ చాలెంజ్ విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలు ఉండవని అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు. -
ఆ రహస్యం ఖరీదు 52 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. కానీ.. ఆచరణలో జరుగుతున్నది వేరే. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడడం ద్వారా అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి ఇప్పటికే రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ఇపుడు రాజధాని నిర్మాణం ముసుగులో మొదటి విడతలోనే మరో రూ.52,493.6 కోట్లు కొల్లగొట్టడానికి పథకం వేశారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలకన్నా మెరుగైన ప్రతిపాదనలు ఉంటే దాఖలు చేసుకోవచ్చునంటూ జూలై 18న స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతో సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తాయన్నది గోప్యంగా ఉంచారు. ఈ గోప్యత వెనుకే చంద్రబాబు అండ్ కో రూ.52,493.6 కోట్ల దోపిడీ ఎత్తుగడ దాగి ఉంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఇదీ.. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పేరుతో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంది. ఇందులో 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో 371 ఎకరాల్లో రహదారులు, పార్కులు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కేటాయించారు. తొలి విడతగా 50 ఎకరాలు.. రెండో దశలో 200 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ఉచితంగా ప్రభుత్వం అప్పగిస్తుంది. ఇవన్నీ పోను మిగతా 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ చేపడుతుంది. అయితే ప్లాట్లను విక్రయించే పనిని చూసేందుకు ఓ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యమూ ఉండదు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులు, చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారు. ప్లాట్లను ఎవరికి, ఎంతకు విక్రయించాలనేది ఈ మేనేజ్మెంట్ కంపెనీయే చూస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లు. మిగతా రూ.2,618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణాలు సేకరించడం ద్వారా, ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇందులో 1,255.40 కోట్లను ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, మేనేజ్మెంట్ ఫీజు, వేతనాల రూపంలో.. మేనేజ్మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు, సింగపూర్ సంస్థల కన్సార్టియం కొట్టేయనున్నాయి. రూ.52వేల కోట్లు కొట్టేసేదిలా... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగిస్తుంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతిపాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్మెంట్ కంపెనీ సీఎం చంద్రబాబునాయుడు బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటూ.. ప్లాట్లను విక్రయిస్తుంది. ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్మెంట్ కంపెనీకి చెల్లించాలి. అదే ఎక్కువకు అమ్మితే ప్రభుత్వ జోక్యం ఉండదు. మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని ప్లాట్లను భారీ రేట్లకు విక్రయించడం ద్వారా వేలకోట్లను కొట్టేసేందుకు చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. కుంభకోణంలో కీలకమైన అంకం ఇదే. ప్రస్తుతం విజయవాడలో ప్రధానమైన ప్రాంతాలలో చదరపు గజం రూ. లక్ష పలుకుతోందని చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన కోర్ కేపిటల్‌కు సమీపాన ఉండే స్టార్టప్ ఏరియా ప్రాంతంలో అదే ధర పలుకుతుందని లెక్క వేసుకున్నా ఎకరం రూ. 40 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన 1,070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థల కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.10,000 కోట్లు ఆ సంస్థలు సొమ్ముచేసుకోనున్నాయి. 1,070 ఎకరాలకు వచ్చే రూ.42,800 కోట్లు, 250 ఎకరాలకు వచ్చే 10,000 కోట్లు కలిపితే సింగపూర్ సంస్థలకు వచ్చే ఆదాయం రూ. 52,800 కోట్లు అన్నమాట. ఇంతకీ వాటి పెట్టుబడి ఎంతంటే రూ.306.4 కోట్లు మాత్రమే. దీనిని బట్టి చూస్తే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు రూ.52,493.6 కోట్లను కాజేయనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దోపిడీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు.. ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పని చేపట్టినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిటింగ్ చేస్తాయి. అక్రమాలపై ఎవరైనా పోలీసులను, కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఆడిటింగ్‌కు దక్కకుండా.. సీఆర్పీసీ, ఐపీసీ చట్టాలకు చిక్కకుండా దోపిడీ చేసేందుకే ‘మేనేజ్మెంట్ కంపెనీ’ అనే బినామీ ప్రైవేటు సంస్థను చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం తెరపైకి తెచ్చాయి. ఈ సంస్థ ఎకరం రూ.40 కోట్లుకు విక్రయించి.. 4 కోట్లకే అమ్మినట్లు లెక్కలు చూపినా ప్రశ్నించే అధికారం రాష్ట్ర ఆడిటింగ్ అధికారులకుగానీ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కుగానీ ఉండదు. ఈ అక్రమాల పర్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమూ ఉండదు. భారతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం లేనే లేదు. ఒకవేళ ఏవైనా వివాదం ఉంటే.. ఇంగ్లాండ్‌లోని లండన్ కోర్టును ఆశ్రయించాల్సిందే! స్టార్టప్ ప్రాజెక్టులో సర్కారుకు అంతా నష్టమే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఎకరం కనీసధర రూ.4 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. (అంతకు మించి అమ్మితే ప్రభుత్వ ప్రమేయం ఉండదు.) రూ. 4 కోట్ల లెక్కన 1,691 ఎకరాల విలువ రూ.10,764 కోట్లు చేస్తుంది. ఈ భూమికి రహదారులు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5,500 కోట్లను ఖర్చు చేయడానికి సర్కారు అంగీకరించింది. అంతే కాదు.. ఏడీపీలో సీసీడీఎంసీ వాటా రూపంలో రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వెరసి రూ.16,485 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందన్న మాట. అయితే సర్కారుకు వచ్చేది మాత్రం శూన్యం. రూ. 5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించి, ప్లాట్లు అభివృద్ధి చేయడానికి రూ. 3,137 కోట్లను తనే బ్యాంకు గ్యారెంటీ ఇప్పిస్తుంది. ఈ వ్యయాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తంలో 58శాతం, 42 శాతం నిష్పత్తిలో సీసీడీఎంసీ, సింగపూర్ కన్సార్టియం పంచుకుంటాయి. అంటే ఈ లెక్కన ప్రభుత్వానికి పెట్టిన ఖర్చు కూడా వచ్చే అవకాశాలు లేవు. అయితే సింగపూర్ కంపెనీలు నయాపైసా పెట్టుబడి పెట్టబోవడం లేదు. రాజధానిలో ఒక్క భవనాన్నీ నిర్మించవు. కేవలం 1,070 ఎకరాలలో ప్లాట్లు వేసి అమ్ముకుంటారు. కానీ ప్రభుత్వం తమకు ఉచితంగా కట్టబెట్టిన 50ఎకరాలలో 8 లక్షల చదరపు అడుగుల మేర భవనాలను నిర్మించి వాటిని కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే.. ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియంది 58 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ వ్యయం ఎంతకైనా పెరగవచ్చు. ఆ మేరకు నిబంధనలు కూడా చేర్చారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా 1,070 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన బేసిక్ ధరకు మించి సింగపూర్ మేనేజ్మెంట్ కంపెనీ ఎన్ని కోట్లకు విక్రయించినా దానిపై ప్రభుత్వానికి అధికారం ఉండదు.) విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. అంటే.. ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్లో పది శాతం వాటా ఇస్తే ఏడీపీకి రూ.3,852 కోట్లు. ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లను కలిపితే రూ.4,852 కోట్లు వస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు రాష్ర్టప్రభుత్వం పరిహారం చెల్లించాలి. స్విస్ చాలెంజ్.. ఓ మహా కుంభకోణం స్విస్ చాలెంజ్ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించినా.. వచ్చే ఆదాయంలో రహస్యం ఏమిటని అక్షింతలు వేసినా రాష్ర్టప్రభుత్వం చలించలేదు. చివరకు స్టే ఇచ్చినా అందులోని దేవరహస్యాన్ని మాత్రం బైటపెట్ట లేదు. పైగా స్టేని ఎత్తేయించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఆ రహస్యం ఖరీదెంతనుకున్నారు? అక్షరాలా రూ.52,493.6 కోట్లు. నయా పైసా పెట్టుబడి పెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీల గుప్పిట్లోని మేనేజ్మెంట్ కంపెనీ, సింగపూర్ సంస్థల కన్సార్టియంలు కొట్టేయనున్న మొత్తమిది. చరిత్రలో మునుపెన్నడూ కనీవిని ఎరుగని కుంభకోణమిది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనేరూ.52,493.6 కోట్లు కొట్టేస్తుంటే ఇక 54 వేల ఎకరాల (రైతుల నుంచి సమీకరించిన 34వేల ఎకరాలు, ప్రభుత్వ అధీనంలో ఉన్న 20వేల ఎకరాలు కలిపి) రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కొట్టేస్తారో ఊహకు కూడా అందని విషయం. భూతల స్వర్గాన్ని తలపించే రీతిలో అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబు 3డీ సినిమా చూపించడంతో సామాన్యుల మొదలు సంపన్నుల వరకు ఇటుకలు, విరాళాలు ఇచ్చి ఎదురుచూస్తున్నారు. కానీ బాబు ఆయన బినామీల సమాహారమైన సింగపూర్ కన్సార్టియం మాత్రం కనీసం ఒక్క భవనం కూడా కట్టకుండా రియల్ ఎస్టేట్ దందా చేసి స్టార్టప్ ప్రాజెక్టులోనే రూ.52,493.6 కోట్లు కొల్లగొట్టేయనున్నారు. ఆ రహస్య పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఇది చదవండి.... -
స్విస్ ఛాలెంజ్‌పై లంచ్ మోషన్ తిరస్కరణ
-
లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్: 'స్విస్ చాలెంజ్' విధానంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని రేపు (గురువారం) పరిశీలిస్తామని తెలిపింది. ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. దీంతో ఈ ప్రక్రియను సీఆర్డీఏ పక్కన పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న తిరిగి 'స్విస్ చాలెంజ్'పై హైకోర్టు విచారించనుంది.