హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఏపీ అడ్వకేట్ జనరల్ సోమవారం న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. గత కొద్దిరోజులుగా హైకోర్టులో స్విస్ చాలెంజ్ విధానంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాగా స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత నిర్మాణాన్ని చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసిన విషయం విదితమే.