రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ చాలెంజ్ విధానానికి సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్ చాలెంజ్ విధానానికి సవరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 6.84 చదరపు కిలోమీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికింది. హైకోర్టు తీర్పు మేరకు గతంలోని ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా సవరణలు చేసింది. ఈ సవరణ ఉత్తర్వులతో మాస్టర్ డెవలపర్ ఎంపికకు సీఆర్‌డీఏ మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
కాగా సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా భూములు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు ఇటీవల హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తప్పు పట్టిన అంశాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలిగించే చట్టంలో సవరణ ద్వారా తొలగించి.. ఆ తరువాత ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేసింది.