సింగపూర్‌ కంపెనీలపై ప్రేమతో.. | Love on the Singapore Company | Sakshi

Dec 18 2016 7:38 AM | Updated on Mar 21 2024 8:47 PM

సింగపూర్‌ కంపెనీలే తనకు ముఖ్యమనేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకెళుతున్నారు. ఆరునూరైనా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆ కంపెనీలతోనే చేయాలని నిర్ణయించారు. సింగపూర్‌ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించారు. గతంలో స్విస్‌ చాలెంజ్‌పై హైకోర్టు వేసిన బ్రేకులను ఆర్డినెన్స్‌ ద్వారా తొలగించేశారు. తాను అనుకున్నట్లు చేయడానికి ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీకి అధికారాలు లేకుండా కోరలు పీకేసింది. అంతేగాక సింగపూర్‌ కంపెనీలకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదనే నిబంధన ఉండటం విశేషం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement