Singapore Company
-
భారత్‌లో రూ.46000 కోట్ల పెట్టుబడి: సింగపూర్ కంపెనీ
ముంబై: అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ మేనేజర్, సింగపూర్‌కు చెందిన ‘క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (సీఎల్ఐ).. భారత్‌లో తన నిర్వహణలోని ఫండ్ (ఎఫ్‌యూఎం) విలువను 2028 నాటికి రెట్టింపు చేసుకోన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎఫ్‌యూఎం 7.4 బిలియన్ సింగపూర్ డాలర్లు (రూ.46,000 కోట్లు)గా ఉంది. 30 ఏళ్ల క్రితం ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం గమనార్హం. అప్పటి నుంచి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకుంది.హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో 40 ఐటీ, బిజినెస్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు, డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఐటీ పార్క్‌లు, లాజిస్టిక్స్ పార్క్‌ల వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు.. పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో అవకాశాలనూ పరిశీలిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘భారత్ మాకు వ్యూహాత్మక మార్కెట్. మా మొత్తం వ్యాపారంలో కీలక వాటాను ఆక్రమిస్తోంది.అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో గడిచిన ఏడేళ్లలో మా పెట్టుబడులు మూడింతలయ్యాయి. 2024లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని, వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న అంచనాలున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ సంస్థలు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లను భారత్‌లో నాణ్యమైన రియల్ అసెట్స్ ఆకర్షిస్తున్నాయి’’అని సీఎల్ఐ గ్రూప్ సీఈవో లీచీ కూన్ తెలిపారు. భారత మార్కెట్లో తమకు ఎంతో అనుభవం కలిగి ఉండడంతో ఈ అవకాశాలను సొంతం చేసుకోగలమని.. తమ నిర్వహణలోని నిధిని 2028 నాటికి 7.4 బిలియన్ డాలర్లకు పెంచుకుంటామని చెప్పారు. -
‘మూసీ’పై సీఎంతో సింగపూర్ సంస్థ భేటీ
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వహణపై సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రాజెక్టును చేపట్టేందుకు తమ ఆసక్తిని తెలిపారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతోపాటు హైదరాబాద్‌లో మూసీ డెవలప్మెంట్ నమూనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని.. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ నమూనాలు రూపొందించాలని కోరారు. ఇటీవల లండన్, దుబాయ్‌లలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించడం, పలు విదేశీ కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతోనూ చర్చించడం తెలిసిందే. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మెయిన్‌హార్ట్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తదితరులు ఉన్నారు. ఈ భేటీలో సీఎస్ శాంతికుమారి, పురపాలన, పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. -
పెట్టుబడులకు టెమాసెక్ ఆసక్తి
ముంబై: గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం టెమాసెక్.. దేశీయంగా పెట్టుబడులపై మరోసారి దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా సింగపూర్ సంస్థ బోర్డు డైరెక్టర్లు దేశీయంగా పర్యటనకు వచి్చనట్లు తెలుస్తోంది. ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను తాకడం, మరోపక్క రాజకీయ స్థిరత్వ పరిస్థితులు ఇందుకు కారణమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత్ వెలుగుతున్న నేపథ్యంలో 11మంది సభ్యులుగల టెమాసెక్ బోర్డు దేశీయంగా పెట్టుబడులపై అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్ల కాలంలో 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో టెమాసెక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ, ముంబైలలో పారిశ్రామికవేత్తలు, కార్పొరేషన్లు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. సగటున 1.5 బిలియన్ డాలర్లు దాదాపు గత రెండు దశాబ్దాలలో టెమాసెక్ సగటున ఏడాదికి 1–1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం పెట్టుబడులను మూడు రెట్లు పెంచే యోచనలో ఉంది. ఇటీవల విదేశీ ఇన్వెస్టర్లు దేశీయంగా పెట్టుబడులకు తరలి వస్తున్న నేపథ్యంలో టెమాసెక్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలలో అధికార బీజేపీ విజయం సాధించడంతో పాలసీలు కొనసాగనున్నట్లు విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ(జీడీపీ) పటిష్ట వృద్ధిని సాధించడం జత కలుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెల్త్‌కేర్ రంగంలోని మణిపాల్ హాస్పిటల్స్‌లో 2 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి టెమాసెక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. ఇది భారీ డీల్‌కాగా.. ఇప్పటికే ఓలా, జొమాటో, డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, క్యూర్‌ఫిట్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
మణిపాల్ చేతికి ఆమ్రి హాస్పిటల్స్
కోల్‌కతా/న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్‌లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్‌కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ. 2,300 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆమ్రి హాస్పిటల్స్‌లో 15% వాటాతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ గ్రూప్ ఇన్వెస్టర్‌గా కొనసాగనుంది. తాజా కొనుగోలుతో మణిపాల్ హాస్పిటల్స్ దేశ తూర్పు ప్రాంతంలో కార్యకలా పాలు విస్తరించనుంది. సంయుక్త సంస్థ దేశవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాలలో 9,500 పడకలతో 33 ఆసుపత్రులను నిర్వహించనుంది. వెరసి దేశీయంగా రెండో పెద్ద హెల్త్‌కేర్ సేవల సంస్థగా ఆవి ర్భవించనుంది. సంబంధిత వర్గాల సమా చారం ప్రకారం ఆమ్రి రుణ భారం రూ.1,600 కోట్లు కాగా.. రూ.2,400 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ జరిగినట్లు తెలుస్తోంది. క్లినికల్ నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలుగల ఆమ్రి హాస్పిటల్స్‌ను జత కలుపుకోవడం ద్వారా భారీ నెట్‌వర్క్‌కు తెరలేవనున్నట్లు మణిపాల్ పేర్కొంది. తద్వారా దేశ తూర్పుప్రాంతంలో అత్యంత నాణ్యమైన ఆరోగ్యపరిరక్షణ సేవలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన సేవలు అందించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. అయితే మణిపాల్ 2021లో కోల్‌కతాలోని కొలంబియా ఏషియా హాస్పిటల్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా తూర్పు భారతంలో కార్యకలాపాలు ప్రారంభించింది. కాగా.. హెల్త్‌కేర్ రంగ మరో దిగ్గజం అపోలో హాస్పిటల్స్ 10,000 పడకల సామర్థ్యంతో 64 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. -
ఎయిర్ కూలర్ కమ్ హీటర్: చల్లగా.. వెచ్చగా.. ఎలా కావాలంటే అలా..
ఎండాకాలంలో ఎయిర్ కూలర్, చలికాలంలో రూమ్ హీటర్ వాడుకోవడం మామూలే! ఎండాకాలంలో రూమ్ హీటర్‌ను, చలికాలంలో ఎయిర్ కూలర్‌ను వాడుకోలేం. ఇకపై బయట వేడిగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి, చలి వణికిస్తున్నప్పుడు గదిని వెచ్చబరచడానికి వేర్వేరు పరికరాలు వాడుకోనక్కర్లేదు. రెండు సౌకర్యాలూ ఇమిడి ఉన్న పరికరం అందుబాటులోకి వచ్చింది. సింగపూర్ కంపెనీ ‘ఎయిర్లియో’ ఈ డ్యుయో ఎకో మొబైల్ ఎయిర్ కూలర్ కమ్ హీటర్‌ను రూపొందించింది. ఇది ‘లో టెంపరేచర్ ఎవల్యూషనరీ ఓజోన్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఇది గది వాతావరణాన్ని 18 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా, 28 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గకుండా ఉంచుతుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,604) మాత్రమే! -
సెంబ్‌కార్ప్ చేతికి వెక్టార్ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ కంపెనీ సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,780 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. దీనితో సెంబ్‌కార్ప్ భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ విభాగంలో తమ సామర్థ్యాలను 3 గిగావాట్లకు (జీడబ్ల్యూ) పెంచుకోనుంది. భారత్‌లో రెన్యువబుల్స్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ వాంగ్ కిమ్ ఇన్ తెలిపారు. తమ భారత విభాగంలో పవన విద్యుదుత్పత్తికి అనుబంధంగా సౌర విద్యుదుత్పత్తి వాటాను గణనీయంగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని సంస్థ సీఈవో (దక్షిణాసియా) విపుల్ తులి తెలిపారు. వెక్టార్ గ్రీన్‌తో కలిపితే స్థూలంగా సెంబ్‌కార్ప్ రెన్యువబుల్స్ పోర్ట్‌ఫోలియోలో 1 గిగావాట్ సోలార్ అసెట్లు, 2 గిగావాట్ల పవన విద్యుత్ అసెట్లు (ఇప్పటికే ఇన్స్టాల్ అయినవి, అభివృద్ధి చేస్తున వాటితో కలిపి) ఉంటాయని ఆయన వివరించారు. 2023 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. గ్రూప్ స్థాయిలో సెంబ్‌కార్ప్ స్థూల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం 8.5 గిగావాట్లకు చేరనుంది. 2025 నాటికల్లా దీన్ని 10 గిగావాట్లకు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. 13 రాష్ట్రాల్లో వెక్టార్ గ్రీన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఇండియా నిర్వహణలోని ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2 ఆధ్వర్యంలో వెక్టార్ గ్రీన్ ఎనర్జీ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో 519 మెగావాట్ల సామర్థ్యంతో కార్యకలాపాలు ఉన్నాయి. 64 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అలాగే మరో 1 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి పెట్టుబడులతో సిద్ధంగా ఉంది. టోరెంట్ పవర్ కూడా వెక్టార్ గ్రీన్ ఎనర్జీ కోసం పోటీపడినప్పటికీ అంతిమంగా సెంబ్‌కార్ప్ దక్కించుకుంది. -
రైతుల త్యాగంతో సర్కారు వ్యాపారం
సాక్షి, అమరావతి: బహుళ పంటలు పండే, కోట్ల విలువ చేసే తమ పంట పొలాల్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసమని ఆ ప్రాంత రైతులు త్యాగం చేశారు. కన్నతల్లిలాంటి భూమిని త్యాగం చేసి నాలుగేళ్లయినా ఇప్పటివరకు వారికిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ చంద్రబాబు సర్కారు అమలు చేయలేదు. కానీ రైతుల త్యాగాన్ని వెక్కిరిస్తూ వారిచ్చిన భూముల్లోనే రియల్ ఎసేŠట్ట్, వాణిజ్య వ్యాపారం చేస్తోంది. కావాల్సిన కార్పొరేట్ కంపెనీలు, అస్మదీయులకు కారుచౌకగా ఆ భూముల్నే పప్పుబెల్లాల్లా పంచేస్తోంది. ఇప్పటికే సింగపూర్ కంపెనీలకిచ్చిన 1,691 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు రైతులిచ్చిన భూముల్లో 8,274 ఎకరాల్ని అమ్మేయాలని నిర్ణయించింది. ఇందులో వాణిజ్య వ్యాపారానికి 5,020 ఎకరాల్ని వినియోగించాలని, మరో 3,254 ఎకరాల్ని ఎకనమిక్ డెవలప్మెంట్కు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు సంస్థలకు కేటాయించిన 1,477 ఎకరాలకు ఇది అదనం. వచ్చే సంవత్సరాల్లో దశలవారీగా ఈ 8,274 ఎకరాల్ని విక్రయించనుంది. రైతుల భూములతో పక్కా వ్యాపారం.. రాజధాని పేరుతో మూడు పంటలు పండే బంగారంలాంటి భూముల్ని ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి చంద్రబాబు తీసుకున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా భూములిస్తే.. మరికొంత మందిని వ్యవసాయం ఎలా చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడటమేగాక పొలాల్లోని పంటల్ని తగులపెట్టే దాష్టీకాలకు సర్కారే స్వయంగా పాల్పడడం ద్వారా వారి భూముల్ని లాగేసుకుంది. ఇలా మొత్తం 33 వేల ఎకరాలకుపైగా లాగేసుకున్న సర్కారు ఇప్పుడా భూములతోనే వ్యాపారం మొదలుపెట్టింది. ఒకవైపు సింగపూర్ కంపెనీలతో 1,691 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఇప్పుడు వాణిజ్య వ్యాపారం, ఎకనమిక్ డెవలప్‌మెంట్‌కోసం వినియోగం కింద పెద్ద ఎత్తున భూములను విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకు సంబంధించి గత నెల ఐదవ తేదీన ‘రాజధాని బిజినెస్ ప్రణాళిక’ పేరుతో జీవో సైతం జారీ చేసింది. ఇతర అవసరాలన్నీ పోగా సీఆర్డీఏ దగ్గర 8,274 ఎకరాలుంటాయని, ఇందులో 3,254 ఎకరాల్ని ఎకనమిక్ డెవలప్‌మెంట్‌కోసం రిజర్వ్ చేయగా మిగతా 5,020 ఎకరాలను వాణిజ్య వ్యాపారానికి కేటాయిస్తున్నట్లు ఈ జీవోలో స్పష్టం చేశారు. ఇందులో తొలిదశలో 3,709 ఎకరాల్ని, రెండోదశలో 1,311 ఎకరాల్ని వినియోగిస్తామని, తద్వారా భారీ ఎత్తున ఆదాయం ఆర్జిస్తామని, దాంతో రాజధాని నిర్మాణాలను చేపడతామని జీవోలో పేర్కొనడం గమనార్హం. ఇందుకోసం రాజధాని భూముల కేటాయింపు విధానంలోనూ సవరణలు చేశారు. బాబు మాటల్లో నిజం లేదు.. రాజధాని నిర్మాణం కోసమే సింగపూర్ కంపెనీలు వచ్చాయని, అవన్నీ తనను చూసి వచ్చాయంటూ ఇన్ని రోజులుగా సీఎం చంద్రబాబు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. సీఆర్డీఏ, సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ) పూర్తిగా రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తుందని ఆ కంపెనీ వెబ్సైట్లో స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. రాజధానిలో భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం విక్రయం ద్వారా లేదా లీజు ద్వారా చేయనున్నట్లు ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. అపార్ట్మెంట్ల నిర్మాణంతోపాటు గృహేతర భవనాలు, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నట్టు అందులో స్పష్టం చేశారు. -
సమాచార హక్కు చట్టం వీటికి వర్తించదు
-
సింగపూర్‌తో ఒప్పందాలు చాలా రహస్యం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి సంబంధించి సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రహస్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని గోప్యంగా ఉంచాలన్న సింగపూర్ ప్రైవేట్ కంపెనీల సూచనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సింగపూర్ కంపెనీలతో సీఆర్డీఏ కుదుర్చుకున్న షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ వివరాలను అందచేయాలంటూ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గత ఏడాది సెప్టెంబర్ 28, అక్టోబర్ 4వ తేదీన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వచ్చాయి. దీనిపై అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమెటెడ్ (ఏడీపీపీఎల్) బోర్డు సమావేశంలో ఇటీవల చర్చించారు. ఏడీపీపీఎల్ చైర్మన్‌గా ఉన్న సింగపూర్‌కు చెందిన తీన్ చుయ్ చింగ్ నినా అధ్యక్షతన సమావేశమై ఈ ఒప్పందాలకు సమాచార హక్కు చట్టం వర్తించదని తేల్చారు. బోర్డు తీర్మానానికి సర్కారు సరే.. రాజధానిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు 1,691 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానంలో అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో అభివృద్ధి చేసిన ప్లాట్లను సింగపూర్ సంస్థలు మూడో పార్టీకి విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇందుకోసం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. దీనికి సింగపూర్‌కు చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్ష్మీపార్ధసారధి డైరెక్టర్‌గా ఉన్నారు. షేర్ హోల్డర్ల అగ్రిమెంట్‌ను రహస్యంగా ఉంచాలని, సమాచార హక్కు చట్టం కింద దీన్ని వెల్లడించరాదని ఇటీవల బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తలూపింది. గోల్మాల్ జరిగినందునే గుట్టుగా.. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు, సీఆర్డీఏ మధ్య జరిగిన షేర్ హోల్డర్ల అగ్రిమెంట్‌ను గోప్యంగా ఉంచాలని నిర్ణయించడాన్ని బట్టి ఇందులో గోల్మాల్ జరిగిందనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏకంగా సమాచార హక్కు చట్టం కింద కూడా వివరాలు ఇవ్వడానికి వీల్లేదని నిర్ణయం తీసుకోవడం అంటే సింగపూర్ కంపెనీలకు చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వమే వంత పాడుతున్నట్లుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నట్లు తేటతెల్లమవుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆర్థికశాఖకూ వివరాలు తెలియవు.. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన 1,691 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించాలనే షరతుకు సర్కారు అంగీకరించడం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిదశలో రూ.350 కోట్లను విడుదల చేయాలని సీఆర్డీఏ ఇటీవల ఆర్థిక శాఖను కోరింది. దీనిపై ఆర్థికశాఖ స్పందిస్తూ సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అందచేయాలని కోరింది. సీఆర్డీఏ ఇప్పటి వరకు ఒప్పందాలను కనీసం ఆర్థికశాఖకు కూడా వెల్లడించలేదంటే కచ్చితంగా ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నారు. పారదర్శకంగా అంటూ అన్నీ ఉన్నత స్థాయిలోనే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామంటూ నిత్యం చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విషయంలో మాత్రం అంతా గోప్యత పాటిస్తున్నారని, కనీసం సీఆర్డీఏ అథారిటీ సమావేశాల తీర్మానాలు కూడా అందుబాటులో లేకుండా రహస్యంగా ఉంచుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధానికి సంబంధించి ఏ విషయంలోనూ బిజినెస్ నిబంధనల మేరకు ఫైళ్లను పంపకుండా పైస్థాయిలోనే అన్నీ చక్కబెడుతున్నారని తెలిపాయి. సీఎం అధ్యక్షత వహించే సీఆర్డీఏ సమావేశాల్లో ఆయన నిర్ణయాలు తీసేసుకున్న తరువాత ఫైళ్లు పంపిస్తే ఆర్థిక శాఖ ఏం చేస్తుందని ఓ ఉన్నతాధికారి ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయ పనుల్లోనూ ఇదే తీరు తాత్కాలిక సచివాలయ నిర్మాణం టెండర్లను భారీ ఎక్సెస్‌కు కట్టబెట్టారని, రాజధానిలో చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా తొలుతే పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసి టెండర్లను ఆహ్వానిస్తున్నారని, రహదారుల విషయంలోనూ ఇదే జరిగిందని, బిల్లుల చెల్లింపుల్లో కూడా నిబంధనలను పాటించడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాజధాని స్టార్టప్ ప్రాజెక్టుపై సింగపూర్ సంస్థతో చేసుకున్న ఒప్పందాల్లో భారీ అవతవకలు ఉన్నట్లు తేలడం వల్లే ఆర్థికశాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర తాను ఏడీపీపీఎల్లో సభ్యుడిగా ఉండలేనని తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
గండం గడిచింది!
⇒సింగపూర్ కంపెనీతో ఒప్పందంపై రైతుల వ్యతిరేకత ⇒ లింగాయపాలెంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ⇒మూడు గ్రామాల్లో కట్టుదిట్టమైన నిఘా ⇒ స్టార్టప్ ఏరియా శంకుస్థానకు సామాన్య రైతులు దూరం ⇒ హాజరైన వారంతా టీడీపీ కార్యకర్తలు, అనుకూలురే.. ⇒ టెన్షన్ టెన్షన్‌గా అధికార యంత్రాంగం ⇒వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలకు పలుమార్లు ఫోన్లు అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్ : ‘అమరావతి నగరాన్ని అద్భుతంగా నిర్మించాలని నన్ను దేవుడు ఆదేశించాడు...’ అని ఓ వైపు సీఎం చంద్రబాబు సభా వేదికపై చెబుతుండగానే... మరోవైపు పోలీసు అధికారులు మాత్రం ఎటువైపు నుంచి ఎవరు వచ్చి ఆందోళనలు చేస్తారోనని మండుటెండలో వణికిపోయారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమం వద్ద ఏ చిన్న గొడవ జరిగినా సింగపూర్ పెద్దల ముందు సిగ్గుపోతుందని భయపడిన ప్రభుత్వ పెద్దలు... చివరకు ‘హమ్మయ్యా... గండం గడిచింది.. గట్టెక్కాం..’ అని ఊపిరి పీల్చుకున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం పరిధిలో 1,691 ఎకరాల విస్తీర్ణాన్ని ప్రభుత్వం స్టార్టప్ ఏరియాగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో 396 ఎకరాలను రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఈ భూములను కూడా ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధమైంది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తాళ్లాయపాలెం సమీపంలో భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను సింగపూర్ కంపెనీకి అప్పగిస్తూ నిర్వహించే కార్యక్రమాన్ని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అందులో భాగంగా ఉదయం లింగాయపాలెంలో నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. కొందరు రైతులు ఏకమై నేరుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం షాక్‌కు గురైంది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులను గ్రామాల్లోకి పంపారు. రైతుల నివాసాల చుట్టూ పోలీసులు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన మంత్రి, మరికొందరు ప్రతినిధుల బృందం వస్తున్నందున రైతులు నిరసనలు వ్యక్తం చేస్తే ఇన్నాళ్లు తాము చేసిన ప్రయత్నాలకు ప్రయోజనం ఉండదని టీడీపీ పెద్దలు భావించారు. రాజధాని ప్రకటించిన మొదలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు... ఆందోళన చేసిన వారిని గుర్తించి నిఘా పెట్టారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి అనుమానం ఉన్న వారికి ఫోన్లు చేయడం, వారి నివాసాలకు వెళ్లి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తల నివాసాల వద్ద నిఘా పెట్టారు. తాళ్లాయపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన శంకుస్థాన కార్యక్రమం వద్ద కూడా భారీ ఎత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పోలీసులు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా నిరసన తెలియజేస్తే వారిని తరలించేందుకు ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. సామాన్య రైతులు దూరం... స్టార్టప్ ఏరియా అభివృద్ధి శంకుస్థాపనకు కేవలం రాజధాని రైతులతో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వ యంత్రాంగం భావించింది. అయితే ఈ కార్యక్రమానికి సామాన్య రైతులు రావడానికి ఇష్టపడలేదు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. కేవలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించారు. అందుకు ప్రత్యేకంగా పాసులు ముద్రించారు. ఆ పాసులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు సభా ప్రాంగంణంలోకి అనుమతించడం కనిపించింది. స్థానిక రైతులు పెద్దగా రాకపోవడంతో తాడికొండ, అవనిగడ్డ నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను బస్సుల్లో తరలించారు. ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కార్యక్రమం ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకోవడం గమనార్హం. సన్మానానికి సైతం రైతులు దూరం స్టార్టప్ ఏరియాకు భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు సింగపూర్ కంపెనీ ప్రతినిధులను సన్మానిస్తామని ప్రకటించారు. అయితే చివరికి వారు కూడా రాకపోవడంతో టీడీపీ నాయకులను రైతులుగా చూపించి సింగపూర్ కంపెనీ ప్రతినిధులను సన్మానింపజేశారు. వారిలో టీడీపీ తుళ్లూరు మండల అధ్యక్షుడు, తాడికొండ మార్కెట్ కమిటీ చైర్మన్, లింగాయపాలెం సర్పంచ్, టీడీపీ రైతు విభాగం నాయకులు ఉన్నారు. -
బాబుగారు.. సింగపూర్ ప్రేమ గాథ
-
ఇదో అమరప్రేమ గాథ
♦ హైకోర్టు అక్షింతలతో టెండర్ నోటిఫికేషన్ రద్దయినా మళ్లీ అవే నిబంధనలు ♦ సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా ఏపీఐఈడీఏ–2001 చట్ట సవరణ ♦ రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో పాత ప్రతిపాదనలకే మళ్లీ ఆమోదం ♦ మాస్టర్ డెవలపర్ ఎంపికకు స్విస్ చాలెంజ్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్ ♦ అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీకి అప్పగించడమే లక్ష్యం సాక్షి, అమరావతి ప్రభుత్వం తప్పు చేసింది... హైకోర్టు మొట్టికాయలు వేసింది... తప్పును దిద్దుకోవాల్సిన ప్రభుత్వం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది. అమరావతి నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు సూచనలను సైతం తోసిరాజంటున్నారు. ఎవరెన్ని చెప్పినా సింగపూర్ కంపెనీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియం (అసెండాస్–సిన్‌బ్రిడ్జి–సెమ్బ్‌కార్ప్)కు అప్పగించడానికి ఈనెల 3న జారీ చేసిన స్విస్ చాలెంజ్ టెండర్ నోటిఫికేషనే అందుకు తార్కాణం. రాజధాని ఏర్పాటు ప్రకటన వెలువడక ముందే ‘ఇన్సైడర్ ట్రేడింగ్’కు పాల్పడి తక్కువ ధరలకే భూములు కొట్టేసి రూ.లక్ష కోట్లు కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు అండ్ కో.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ అదే తరహాలో కాజేసేందుకు వ్యూహం పన్నింది. ఆదాయ వివరాలు రహస్యంగా ఉంచుతూ సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసి.. జూలై 17న స్విస్ ఛాలెంజ్ విధానంలో తొలుత టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ విధానంలో లొసుగులపై సెప్టెంబరు 12న ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. దాంతో టెండర్ నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. తప్పులను దిద్దుకోవాల్సింది పోయి మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తోంది. సింగపూర్ కన్సార్టియంకు అనుకూలంగా నిబంధనలు రూపొందించేందుకు తొలుత ఏపీఐఈడీఏ(ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబ్లింగ్ యాక్ట్)–2001ను వక్రీకరించిన ప్రభుత్వం.. తాజాగా ఆ చట్టాన్నే సవరించింది. హైకోర్టు ఎత్తిచూపిన తప్పులను దిద్దుకోకుండా సింగపూర్ సంస్థలు తొలుత అందించిన ప్రతిపాదనల ఆధారంగానే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్ ఎంపిక కోసం ఈనెల 3న స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండా స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడాన్ని గతేడాది సెప్టెంబరు 12న హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. టెండర్ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఇంతలోనే తేరుకున్న ప్రభుత్వం.. టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు విన్నవించింది. స్విస్ ఛాలెంజ్ టెండర్ ప్రక్రియను నిలుపుదల చేస్తూ సెప్టెంబరు 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు లేవనెత్తిన అభ్యంతరాలు.. సర్కార్ బుట్టదాఖలు చేసిన తీరు. ఇదీ.. హైకోర్టు అభ్యంతరం–1: ఒకరు చేసిన సవాలుపై మరొకరు స్పందించేందుకు వీలు కల్పించడంవల్లే దీన్ని ‘ఛాలెంజ్’ అన్నారు. సింగపూర్ సంస్థల కన్సార్టియం ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయకపోతే.. ఆ ప్రతిపాదనలను ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఎలా ‘ఛాలెంజ్’ చేయగలుగుతారు? ప్రతిపాదనలు బహిర్గతం కానపుడు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరైనా ఎందుకు ఉత్సాహం చూపుతారు? ఉల్లంఘన: ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో వెల్లడించలేమన్న ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండో దశ(వాణిజ్య బిడ్)కు అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఆదాయ వివరాలను వెల్లడిస్తామంటూ సింగపూర్ కన్సార్టియం మళ్లీ పాత పాటే పాడింది. హైకోర్టు అభ్యంతరం–2: సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికిగానీ.. సీఆర్డీఏ అధికారులకుగానీ తెలియనప్పుడు.. ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా వచ్చారు? వాణిజ్య బిడ్ నిబంధనలు తెలియకుంటే రూ.3137.30 కోట్ల భారీ ప్రాజెక్టుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధం. ఉల్లంఘన: సింగపూర్ కన్సార్టియం సీఆర్డీఏకు అందించిన ప్రతిపాదనల్లో కనీసం అధికారులకుగానీ.. ప్రభుత్వానికిగానీ ఆదాయ వివరాలను వెల్లడించలేదు. కానీ.. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. హైకోర్టు అభ్యంతరం–3: ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీ వంటి సంస్థలు అందుకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తాయి? ఉల్లంఘన: ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్ఫ్రా అథారిటీ, మంత్రి వర్గ ఉప సంఘం, సీఆర్డీఏతో సంబంధం లేకుండా గతేడాది జూలై 7న సింగపూర్ కన్సార్టియం, ఆ దేశ మంత్రి ఈశ్వరన్‌లతో చర్చించి.. ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేశారు. అవే ప్రతిపాదనల ఆధారంగా మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు అభ్యంతరం–4: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్ ఎంపిక వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ ఒక్క అధికారి కూడా సహేతుకంగా, నిష్పక్షపాతంగా, చట్ట నిబంధనలకు లోబడి వ్యహరించలేదు. ఉల్లంఘన: ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆమోదం తప్పనిసరి. కానీ.. ఇటీవల ఏపీఐఈడీఏ–2001ను సవరించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని తప్పించి సీఆర్డీఏ, ప్రభుత్వం ఆమోదం పొందేలా సవరణ చేశారు. తద్వారా హైకోర్టు అభ్యంతరాలను దొడ్డిదారిన అధిగమించారు. హైకోర్టు అభ్యంతరం–5: ఛాలెంజ్ నోటిఫికేషన్లో నిర్దేశించిన అనర్హతల విషయానికి వస్తే ‘భారతదేశం వెలుపల’ అనే నిబంధన పక్షపాతంతో కూడుకున్నది. ఉల్లంఘన: ఏపీఐఈడీఏ–2001 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన న్యాయ, ఆర్థిక, బ్యాంకు రంగాల్లో నిపుణులైన ఇద్దరు సభ్యులుగా ఏర్పాటు చేసే వివావాద పరిష్కార మండలి అర్హతలు, అనర్హతలు వంటి వివాదాలను పరిష్కరించాలి. కానీ.. ఏపీఐఈడీఏ చట్టంలోని 32 నుంచి 53 సెక్షన్ల వరకూ ఈ ప్రాజెక్టుకు వర్తించవని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆ స్థానంలో లండన్ కేంద్రంగా అంతర్జాతీయ వివావాద పరిష్కార మండలిని ఏర్పాటు చేసి.. అక్కడే వివాదాలు పరిష్కరించుకోవాలని సింగపూర్ కన్సార్టియం మెలిక పెట్టింది. ఈ మండలిలో సింగపూర్ కన్సార్టియం నుంచి ఒకరు, సీసీడీఎంసీఎల్ నుంచి ఒకరు, రెండు సంస్థలు అంగీకారం మేరకు భారతదేశం, సింగపూర్ దేశాలకు చెందని వ్యక్తి మరొకరు సభ్యులుగా ఉంటారు. ఇతర దేశాలకు చెందిన వ్యక్తే మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఛైర్మన్ కచ్చితంగా సింగపూర్ కన్సార్టియం చెప్పినట్టాల్లా తలాడించడం ఖాయం. దీనివల్ల రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియలో ఎవరు దరఖాస్తులు చేసినా.. వారిపై అనర్హత వేటు వేయడం ఖాయమనే భావన బలంగా వ్యక్తమవుతోంది. హైకోర్టు ఇదే అంశాన్ని తేల్చిచెప్పినా.. సర్కార్‌కు కనువిప్పు కలగకపోవడం గమనార్హం. ఆ మర్మం ఏ ‘బాబు’కెరుక? సింగపూర్ కన్సార్టియంకు రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కట్టబెట్టేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా సీఎం చంద్రబాబునాయుడు ఉత్సాహం చూపుతుండటంలో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. బినామీలతో కలిసి దొరికినంత దోచుకోవడానికి సీఎం చంద్రబాబు మళ్లీ బరి తెగించారు. ఈనెల 3న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. శుక్రవారం సింగపూర్ సంస్థలు బహిర్గతం చేసిన ప్రతిపాదనలే అందుకు తార్కాణం. ఆ ప్రతిపాదనలు ఇవీ.. ► రాజధానిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును 6.84 చదరపు కిలోమీటర్ల(1691 ఎకరాలు)లో చేపడతామని సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించింది. ► స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఏడీపీలో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతం. ► రూ.3137.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్టియం రూ.306.4 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. సీసీడీఎంసీఎల్ రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మిగతా నిధులను స్టార్టప్ ఏరియాలో ప్లాట్లను అభివృద్ధి చేసి.. విక్రయించడం ద్వారా, భూములకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా సమకూర్చుకుంటారు. ఈ ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లతో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. ► ఏడీపీ బోర్డులో ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు. ఇందులో సింగపూర్ కన్సార్టియం నుంచి నలుగురు.. సీసీడీఎంసీఎల్ నుంచి ఇద్దరు ఉంటారు. బోర్డు ఛైర్మన్‌గా సింగపూర్ కన్సార్టియం డైరెక్టరే వ్యవహరిస్తారు. ఏటా కనీసం మూడు సార్లు బోర్డు సమావేశమవుతుంది. సింగపూర్ కన్సార్టియం డైరెక్టర్లు కనీసం ఇద్దరు ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ► స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమల్లోకి వచ్చాక ఏవైనా వివాదాలు ఉత్పన్నమైతే.. లండన్‌లోని అంతర్జాతీయ వివాదా పరిష్కార మండలి(ఎల్ఐసీఏ)లో మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. ఈ మండలిలో ముగ్గురు సభ్యులు ఉంటారు. సింగపూర్ కన్సార్టియం నుంచి ఒకరు, సీసీడీఎంసీఎల్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు. రెండు సంస్థలు అంగీకారం మేరకు భారతదేశం, సింగపూర్‌లకు చెందని వ్యక్తిని మూడో సభ్యునిగా నియమిస్తారు. ఆ సభ్యుడే మండలికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ► వీటిని పరిశీలిస్తే సింగపూర్ సంస్థలు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నది స్పష్టమవుతోంది. సింగపూర్ కన్సార్టియం అడుగులకు ప్రభుత్వం మడుగులొత్తినా రాజధాని స్టార్టప్ ఏరియా ఆదాయ వివరాలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయమని.. వాణిజ్య బిడ్‌కు అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే వెల్లడిస్తామని ఆ కన్సార్టియం మెలిక పెట్టడం గమనార్హం. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంకు వంత పాడటంలో మర్మమేమిటన్నది బహిరంగ రహస్యమే. ప్రార్థనా మందిరాలు, శ్మశానాల తొలగింపు... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపడుతోన్న 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనామందిరాలు, శ్మశానాలు, చెట్లు వంటివన్నీ తొలగించాలంటూ సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అంటే.. ఆ ప్రాంతంలోని ప్రార్థనామందిరాలు, శ్మశనాలను తొలగించడం ఖాయం. చెట్లను నరికివేయడం అంతే ఖాయం. ప్రజల మనోభావాలతో చెలగాటమాడేందుకు సింగపూర్ కన్సార్టియం సిద్ధమైనా ప్రభుత్వం వంతపాడటం గమనార్హం. రూ.306కోట్ల పెట్టుబడితో రూ.52,493.6 కోట్లు దోపిడీకి ఎత్తులు... రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్ కన్సార్టియం పెట్టే పెట్టుబడి రూ.306.4 కోట్లు మాత్రమే. అదే రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే.. ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58%.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. ► ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 50%, తమ వాటా 50% ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. కన్సార్టియంగా ఏర్పడిన సింగపూర్ సంస్థల్లో తన బినామీలు ఉండటంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. జూలై 7, 2016న సింగపూర్ సంస్థలతో చర్చించిన సీఎం.. ఏడీపీలో ఆ సంస్థల వాటాను 58 శాతానికి పెంచాలని, సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గించాలని స్వయంగా సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు. కానీ.. ప్రభుత్వ వాటాను సీఎం చంద్రబాబు తగ్గించమనడాన్ని బట్టి చూస్తే బినామీలతో కలిసి అడ్డగోలుగా దోచుకోవడానికి ఏ స్థాయిలో బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియం నియమించే మేనేజ్మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగిస్తుంది. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతిపాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్మెంట్ కంపెనీ సీఎం చంద్రబాబు బినామీలది కావడంవల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్లను విక్రయిస్తుంది. ► ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్మెంట్ కంపెనీకి చెల్లించాలి. ఒకవేళ మేనేజ్మెంట్ కంపెనీ ఎకరం భూమిని రూ.నాలుగు కోట్లకన్నా ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అంటే నష్టమొస్తే ప్రభుత్వం భరించాలి, లాభమొస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఇలా మేనేజ్మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.4 కోట్లకు ఎకరం చొప్పున భూమిని కొట్టేసేందుకు చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. ► విజయవాడలో బందరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో గజం భూమి కనిష్టంగా రూ.లక్ష పలుకుతోంది. రాజధానిలో అత్యంత ప్రధానమైన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనూ భూమి విలువ ఇదే రీతిలో పలుకుతుంది. అంటే ఎకరం భూమి రూ.40 కోట్లు పలుకుతుంది. ► రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులు పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు పోను మిగిలిన 1070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.పది వేల కోట్లు సింగపూర్ కన్సార్టియంకు దక్కనున్నాయి. మొత్తమ్మీద రూ.52,800 కోట్లను సింగపూర్ కన్సార్టియం సొమ్ముచేసుకోనుంది. అంటే.. సింగపూర్ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి రూ.52,800 కోట్లు దక్కించుకోనున్నాయన్న మాట. వీటిని పరిగణనలోకి తీసుకుంటే సింగపూర్ కన్సార్టియం ముసుగులో చంద్రబాబు అండ్ కో రూ.52,493.6 కోట్లను కొల్లగొట్టనున్నాయన్నది స్పష్టమవుతోంది. ఇంత ఆదాయం వచ్చే ప్రాజెక్టులో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ కన్సార్టియం వెల్లడించకపోవడం గమనార్హం. 1691 ఎకరాల్లో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే రూ.52,493.6 కోట్లు కొల్లగొడితే.. 53 వేల ఎకరాల్లో చేపట్టే రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటారో అర్థం చేసుకోవచ్చు. -
సింగపూర్ కంపెనీలపై ప్రేమతో..
-
సింగపూర్ కంపెనీలపై ప్రేమతో..
- స్విస్ చాలెంజ్‌పై ఆ కంపెనీల పాత ప్రతిపాదనతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్ - ఏపీఐడీఈ చట్టంలో సవరణలతో కొత్త నోటిఫికేషన్ జారీ.. - రెవెన్యూలో ప్రభుత్వ వాటా ఎంతో చెప్పాల్సిన పనిలేదు - ఆసక్తి గల బిడ్డర్ అంటే.. అర్హత గల బిడ్డరే - ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కోరలు పీకేసిన సర్కారు - పలు సెక్షన్లలో అథారిటీ పేరు తొలగింపు - పారదర్శకతకు పాతర.. ఆడిట్ సెక్షన్ లేదు సాక్షి, అమరావతి : సింగపూర్ కంపెనీలే తనకు ముఖ్యమనేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకెళుతున్నారు. ఆరునూరైనా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ కంపెనీలతోనే చేయాలని నిర్ణయించారు. సింగపూర్ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. గతంలో స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు వేసిన బ్రేకులను ఆర్డినెన్స్ ద్వారా తొలగించేశారు. తాను అనుకున్నట్లు చేయడానికి ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి అధికారాలు లేకుండా కోరలు పీకేసింది. అంతేగాక సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదనే నిబంధన ఉండటం విశేషం. గతంలో హైకోర్టు బ్రేక్ సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా భూములు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు ఇటీవల హైకోర్టు బ్రేక్ వేసింది. స్విస్ చాలెంజ్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా జడ్జీలు చేసిన వ్యాఖ్యలను గమనించిన ముఖ్యమంత్రి.. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసుకుంటామన్నారు. కొత్త నోటిఫికేషన్ పిలవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. అయితే హైకోర్టు తప్పు పట్టిన అంశాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలిగించే చట్టంలో సవరణ ద్వారా తొలగించి.. ఆ తరువాత ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా సింగపూర్ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సింగపూర్ కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనలను ఎవరైనా చాలెంజ్ చేయవచ్చుననే నిబంధనతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే రాజధాని ప్రాంతంలో సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదని చట్టంలో సవరణలు చేశారు. కేవలం ప్రతిపాదకుని వ్యవహార ప్రణాళిక, సాంకేతిక సమాచారం, డిజైనులు మాత్రమే వెల్లడిస్తారని, ప్రతిపాదకుడు ఇవ్వచూపిన ఆదాయ వాటా వెల్లడించరని ఆర్డినెన్స్‌లో స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు చెప్పినట్టే చట్టసవరణ హైకోర్టు విచారణలో రెవెన్యూ వాటా వెల్లడే కీలకంగా మారిన విషయం తెలిసిందే. సింగపూర్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఎంత? అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారో చెప్పకుండా ఎలా చాలెంజ్ చేస్తారనేది హైకోర్టు విచారణలో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ వాటా ఎంత అనేది సింగపూర్ కంపెనీలు వెల్లడించవద్దు అన్నాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆ రెవెన్యూ వాటా చెప్పకుండా ఉండేందుకు ఏకంగా చట్టంలోనే సవరణలు చేశారు. అలాగే ఆసక్తి గల బిడ్డర్లు అంటే అర్హత గల బిడ్డర్లేనని చట్టంలో సవరణలు చేశారు. స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టులపై సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విశేష అధికారాలు ఉండేవి. అయితే ఆ అథారిటీకి అధికారాలు లేకుండా చేస్తూ ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల అభివృద్ధి చట్టంలో 20 సెక్షన్లను చంద్రబాబు సర్కారు తొలగించేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదానికి బదులు ప్రభుత్వం అనే పదాన్ని ఉంచాలని కొన్ని సెక్షన్లలో సవరణలు తీసుకువచ్చింది. స్విస్ చాలెంజ్‌లో చేపట్టే ప్రాజెక్టులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ నోటిఫై చేయాల్సిన పనిలేదని, ఇకపై స్విస్ చాలెంజ్‌లో ప్రాజెక్టులను ఆ అథారిటీకి పంపించాల్సిన అవసరం లేదని చట్టంలో మార్పులు చేశారు. పారదర్శకతకు పాతర ఏపీఐడీఈ చట్టం 2001 ప్రకారం స్విస్ చాలెంజ్ ప్రాజెక్టుల నిధుల వ్యవహారాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పర్యవేక్షించాలి. ఏటా వాటి ఆర్థిక లావాదేవీలను కాగ్ ఆడిట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఆ సెక్షన్‌ను పూర్తిగా తొలగించేశారు. అంటే పారదర్శకతకు, ఆడిట్‌కు అవకాశం లేకుండా సవరణలు తీసుకువచ్చారు. స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలను స్థానిక ఏజెన్సీ గానీ ప్రభుత్వశాఖ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపాలి. ఇప్పుడు సవరణల ద్వారా ఆయా ఏజెన్సీలు, శాఖలే ఆ ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదించవచ్చు. స్విస్ చాలెంజ్‌లో పాల్గొనే సంస్థలకు పెట్టుబడి నిమిత్తం ఏ బ్యాంకులు ఎంత నిధులు సమకూరుస్తున్నాయి.. ప్రభుత్వ రాయితీలు ఏమిటనే వివరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి సమర్పించాల్సి ఉండేది. దీన్ని తొలగించేశారు. సింగపూర్ కంపెనీలతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, వీలుగా నోటిఫికేషన్ జారీకే ప్రభుత్వం మార్పులు చేసిందనే విమర్శలున్నాయి. -
ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే!
-
ఏం చేసినా ‘సింగపూర్’ కోసమే!
- కొత్త నోటిఫికేషన్ ప్రతిపాదన కూడా ఓ డ్రామా.. - ఆది నుంచీ ఆ దిశగానే ముఖ్యమంత్రి చర్యలు - ముందుగా కుదిరిన ఒప్పందాల మేరకే నిర్ణయాలు - అందుకు అనుగుణంగానే చట్ట సవరణలు, ఆర్డినెన్స్ సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ విషయంలో రాష్ర్టప్రభుత్వం వెనక్కి తగ్గిందా? న్యాయస్థానం పలుమార్లు అక్షింతలు వేయడం, అనేక తప్పులు ఎత్తి చూపడం వల్ల రాష్ర్టప్రభుత్వం మనసు మార్చుకుందని భావించవచ్చా? గత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పినంత మాత్రాన స్విస్ చాలెంజ్ ప్రమాదం తొలగిపోయినట్లేనా? ఎంతమాత్రమూ లేదని అధికార వర్గాలంటున్నాయి. మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు నివేదించడం కూడా ఓ డ్రామాయేనని, స్విస్చాలెంజ్ను కానీ, సింగపూర్ కంపెనీల కన్సార్టియంను కానీ వదులుకునే ఆలోచనే ప్రభుత్వానికి లేదని అధికారులు అంటున్నారు. కొత్త రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. అందుకే ఒకవైపు న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే హడావిడిగా స్విస్ చా లెంజ్ అమలు కోసం ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. కొత్త నోటిఫికేషన్ ఓ డ్రామా.. స్విస్ చాలెంజ్ విషయంలో విచారణ సందర్భంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని ్టప్రభుత్వం చెప్పడం ఓ పెద్ద నాటకమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ అంటే కేవలం సింగపూర్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను కొనసాగింపునకే తప్ప మరొకటి కాదని, ఈ కారణంగా సింగపూర్ కంపెనీలతో దాపరికం, రహస్య అవగాహనలన్నీ అలాగే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. స్విస్ చాలెంజ్ మౌలిక సూత్రాలను, నిబంధనలను కూడా తుంగలో తొక్కి సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో నేరుగా సీఎంతో పాటు మంత్రుల కమిటీ సంప్రదింపులు జరిపారు. వాటిలో నీకెంత నాకెంతనే రహస్య అవగాహన కుదిరిందని, అందుకే ఆ కంపెనీలను సీఎం వెనకేసుకు వస్తున్నారని అధికార వర్గాలు కోడై కూస్తున్నాయి. మౌలికసూత్రాలకు విరుద్ధం స్విస్ చాలెంజ్ మౌలిక సూత్రాల ప్రకారం.. చేపట్టే ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేని, ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వని... ప్రాజెక్టుకు సంబంధించి ఏ సంస్థ అయినా తమంతట తాము ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంది.వీటిరి సీఆర్డీఏ పరిశీలించిన తరువాత, గత చట్టం ప్రకారం సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి వెళ్లాలి. అందుకు పూర్తి విరుద్ధంగా సీఆర్డీఏ పరిశీలించిన తరువాత పలు సార్లు సింగపూర్ కంపెనీలతో సీఎం సంప్రదింపులు జరిపిన తరువాత మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన తరువాత ఆ ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులను సూచిస్తూ ఏకంగా సీఎం ఆమోదంతరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి పంపించారు. పూర్తి రివర్స్‌లో సాగిన దీన్ని చూసి సీఎస్ నేతృత్వంలోని అధారిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీఎం ఆమోదించాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి ఎలా పంపుతారంది. అయినా కేబినెట్లో సింగపూర్ ప్రతిపాదనలు ఆమోదించారు. ముందుగానే ఒప్పందాలు... సింగపూర్ కంపెనీలతో ముందుగానే ముఖ్యమంత్రి సంప్రదింపులు జరిపి అన్ని ‘అవగాహనలు’ కుదిరిన తరువాత ఇక స్విస్ చాలెంజ్ ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు స్విస్ చాలెంజ్ అనేదానికే అర్ధం ఉండదనేది అధికారుల అభిప్రాయం. సింగపూర్ ప్రభుత్వంతో జీ టు జీకి మాత్రమే కేంద్రం అనుమతించింది. కేంద్రానికి టోకరా వేస్తూ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో బాబు ఒప్పందాలు చేసుకున్నారు. పైగా కొలిక్కి రాని అనేక ఆర్థిక పరమైన అంశాలను చంద్రబాబు ఈ ఏడాది జూన్ 7వ తేదీన స్వయంగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్, సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి పరిష్కరించారని స్పష్టంగా మంత్రుల కమిటీ మినిట్స్‌లో పేర్కొన్నారు.. ‘‘అసలు కొలిక్కి రాని ఆర్థిక పరమైన అంశాలపై బాబు ఏమి మాట్లాడారు? సింగపూర్ కంపెనీల ప్రతినిధులు ఏమి చెప్పారు? ఇరువురు మధ్య ఏ ఒప్పందం జరిగింది?’’ వంటి విషయాలన్నీ చాలెంజ్ చేసే ఇతర సంస్థలకు కూడా తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘స్విస్ చాలెంజ్’ కేసును 26న విచారిస్తాం
- తమ అప్పీళ్ల గురించి ప్రస్తావించిన ఏజీకి హైకోర్టు స్పష్టీకరణ - బెంచ్‌లు మారిన నేపథ్యంలో విచారణకు నోచుకోని అప్పీళ్లు సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ కేసుపై ఈ నెల 26న విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో బెంచ్‌లు మారిన నేపథ్యంలో స్విస్ కేసు విచారణకు నోచుకోని నేపథ్యంలో దీనిగురించి అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై తాము దాఖలు చేసిన అప్పీళ్లను విచారించాలని సీఆర్డీఏ, పురపాలకశాఖల తరఫున ఏజీ కోరారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ నెల 26న విచారణ చేపడతామంది. దీనికి పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన వేదుల వెంకటరమణ సైతం తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడి హోదాలో రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటికి పోటీ ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్, తరువాత ఇచ్చిన సవరణ నోటిఫికేషన్లను సవాలుచేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య, చెన్నైకు చెందిన ఎన్వియన్ కన్స్ట్రక్షన్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ నోటిఫికేషన్ అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాలుచేస్తూ సీఆర్డీఏ, పురపాలకశాఖలు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై పలు దఫాలుగా ధర్మాసనం విచారణ చేపట్టింది. -
చట్టంతో చెలగాటం!
-
చట్టంతో చెలగాటం!
♦ ‘స్విస్ చాలెంజ్’ కోసం ఏపీఐడీఈకి తూట్లు ♦ సింగపూర్ కంపెనీల కోసం అనేక నిబంధనల తొలగింపు ♦ ఆసక్తి స్థానంలో ‘అర్హత’ కండిషన్ ♦ పారదర్శకత ఉండాలన్న నిబంధన హుష్‌కాకి ♦ ప్రభుత్వానిదే తుదినిర్ణయం అన్న కండిషన్కూ చెల్లుచీటి ♦ మన కోర్టుల్లో విచారణ జరిపే అవకాశం లేదు ♦ స్విస్ చాలెంజ్ టెండర్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ♦ కొత్త తప్పులు.. 31న హైకోర్టు విచారణ నాటికి కొత్త చట్టానికి రూపు? కె.జి.రాఘవేంద్రరెడ్డి, సాక్షి, కర్నూలు: అంతర్జాతీయ రాజధానిని నిర్మించే పేరుతో అంతర్జాతీయ కుంభకోణానికి తెరతీసిన సీఎం చంద్రబాబు అందుకోసం అడ్డువచ్చిన చట్టాలనూ మార్చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ విధానంపైనా, సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టే తీరుపైనా హైకోర్టు అనేకమార్లు మొట్టికాయలు వేయడంతో ఆ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నారు. స్విస్చాలెంజ్కు అడ్డువస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. వాస్తవానికి ఈ చట్టంలో అతి ముఖ్యమైన అనేక నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. పారదర్శకత పాటించాలన్న నిబంధనను తొలగించడం చూస్తే ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలనుకుంటున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఏ అంశంలోనైనా పభుత్వానిదే తుదినిర్ణయం అన్న నిబంధనను తొలగించేయడాన్ని బట్టి సింగపూర్ సంస్థలకు ఏ రీతిలో సాగిలపడిపోతోందో తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న బిడ్డర్లు స్థానంలో అర్హత ఉన్న బిడ్డర్లు అని చేర్చడం గమనిస్తే తాము అనుకున్న సింగపూర్ కంపెనీలకే బిడ్ దక్కేలా చేయడం కోసం ఎలా దిగజారుతున్నారో ఊహించవచ్చు. ఏపీఐడీఈ చట్టానికి చేస్తున్న మార్పులు చేర్పులలో ఇలాంటి వెన్నో కనిపిస్తాయి... ‘అర్హత’ పదం చేర్చడం వెనుక... వాస్తవానికి 2001నాటి చట్టం సెక్షన్ 2 (ఎస్ఎస్)లో ప్రధాన బిడ్డర్ తన ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత.... ‘ఆసక్తి’ ఉన్న కంపెనీలు ‘ఏవైనా’ తమ ప్రతిపాదనలు సమర్పించవచ్చునని స్పష్టం చేస్తోంది. కొత్తగా తలపెట్టిన ముసాయిదా చట్టంలోని సెక్షన్ 2(ఎస్ఎస్)లో ఆసక్తికి బదులుగా ‘అర్హత’ అనే పదాన్ని ప్రభుత్వం చేర్చింది. ఇక్కడ ‘అర్హత’ అంటే గతంలో ఇతర రాష్ట్రాలలో రాజధానులు నిర్మించిన సంస్థలు కాబోలనుకుంటే పొరబడినట్లే. అర్హత అంటే విదేశాల్లో కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం అని సీఆర్డీఏ జారీచేసిన బిడ్డింగ్ ప్రకటనలో పేర్కొంది. అంటే మన దేశంలో ఎంత ఘనమైన కాంట్రాక్టులు చేసిన సంస్థలైనా విదేశాలలో పనులు చేసిన అనుభవం లేకపోతే వాటికి పోటీలో పాల్గొనే అర్హత ఉండదన్నమాట. తాము ఎంపిక చేసిన సింగపూర్ సంస్థలనే ఆమోదించేందుకు అవసరమైన నిబంధనలను ఓ పథకం ప్రకారం చేర్చుతున్నారన్నమాట. తద్వారా హైకోర్టులో స్విస్ చాలెంజ్ అమలుపై పిటిషన్ వేసిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలను అర్హత లేదనే సాకుతో ప్రభుత్వం తప్పించనుందని తెలుస్తోంది. పాత ప్రాజెక్టులకూ కొత్త చట్టం వర్తింపు రాజధాని నిర్మాణానికి చేపట్టిన స్విస్‌చాలెంజ్ విధానంపై ఎదురవుతున్న విమర్శలను తప్పించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనేక తప్పులు చేస్తోంది. ఇందుకోసం చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం... ఈ చట్టాన్ని పాత ప్రాజెక్టులకూ వర్తింప చేయాలని నిర్ణయించింది. పాత చట్టంలో మార్పులు చేస్తూ తెస్తున్న ముసాయిదా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్‌లో (ఏపీఐడీఈ)-2016లోని సెక్షన్ 18లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. వాస్తవానికి ఏదైనా కొత్త చట్టం తెస్తే అప్పటికే ఉన్న వాటికి వర్తింపచేయడం చాలా అరుదు. అయితే, ఇందుకు భిన్నంగా... అదీ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న స్విస్ చాలెంజ్ విధానం విషయంలో పాత టెండర్లకు కొత్త చట్టం వర్తింపచేయడం ఇంకా అనుమానాలు రేకెత్తిస్తోంది. ముసాయిదా ఏపీఐడీఈ-2016లోని సెక్షన్ 18 ఏం చెబుతుందంటే...‘‘ఈ చట్టం అమలులోకి వచ్చే సమయానికి ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇన్ఫ్రా అథారిటీ వద్ద పెండింగ్‌లో ఉంటే...ఆ ప్రాజెక్టులకు కూడా ఈ చట్టమే వర్తిస్తుంది’’.....అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్విస్ చాలెంజ్ ప్రాజెక్టుకు కూడా కొత్త చట్టమే వర్తిస్తుందన్నమాట. తద్వారా హైకోర్టులో కూడా ఆ ప్రకారం తాము చేసిన మొత్తం ప్రాసెస్ అంతా సరైనదేనని నమ్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. స్విస్ చాలెంజ్ నిర్వచనానికే తూట్లు... స్విస్‌చాలెంజ్ అంటే ఏపీఐడీఈ-2001 చట్టంలో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ చట్టం సెక్షన్ 2(ఎస్ఎస్) ప్రకారం....సుమోటోగా ఏదైనా సంస్థ ఒక ప్రాజెక్టుకు సంబంధించి తన ప్రతిపాదనలను సమర్పిస్తుంది. వాటిని అందరికీ అందుబాటులో ఉంచి... అంతకంటే మెరుగైనవి ఆసక్తి ఉన్న కంపెనీలు సమర్పించాలి.వీటిని బేరీజు వేసుకున్న తర్వాత.... తర్వాత మెరుగైన ప్రతిపాదనలను తాము కూడా చేసేందుకు మొదటగా ప్రతిపాదనలు సమర్పించిన సంస్థ అంగీకరిస్తే ప్రాజెక్టును ఆ సంస్థకు అప్పగించే విధానమే స్విస్ చాలెంజ్‌గా పేర్కొంది. ప్రభుత్వం మాత్రం స్విస్‌చాలెంజ్‌పై ఏపీఐడీఈ-2001 చట్టం నిర్వచనానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. మొదట బిడ్డర్ సమర్పించిన ప్రతిపాదనలను యాజమాన్య హక్కుల పేరిట ఆదాయ వివరాలను బహిర్గతపరచలేదు. తద్వారా అంతకంటే మెరుగైన ప్రతిపాదనలు రాకుండా చేసింది. అంతేకాకుండా అసలు స్విస్ చాలెంజ్ నిర్వచనానికే ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఇక నేరుగా రంగంలోకి ప్రభుత్వం... ఇప్పటివరకు రాజధాని నిర్మాణం విషయంలో సీఆర్డీఏను, ఇన్ఫ్రా అథారిటీని ప్రభుత్వం నామమాత్రంగా ముందు ఉంచింది. వాస్తవానికి సెక్షన్ 19(2) ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదక సంస్థ తన ప్రతిపాదనలను స్థానిక సంస్థకు (అంటే ఇక్కడ సీఆర్డీఏకు) సమర్పించాలి.సీఆర్డీఏ పరిశీలించి....తర్వాత ఇన్ఫ్రా అథారిటీకి పంపించాలి. ఆ తర్వాత కానీ ప్రభుత్వం ముందుకు ప్రతిపాదనలు రావు. రాజధాని నిర్మాణ వ్యవహారంలో ప్రతిపాదనలు నేరుగా ప్రభుత్వానికి వెళ్లాయి. అక్కడి నుంచి ఇన్ఫ్రా అథారిటీకి.... అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి చేరాయి. దీనిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 19 (2)ను తొలగించి ఆ స్థానంలో సంబంధిత అథారిటీ అనుమతి అంటూ చేర్చారు. అయితే, ఇక్కడ అథారిటీ అంటే ప్రభుత్వమేనని కొత్త చట్టంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే నేరుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరడం సరైందేనని ప్రభుత్వం తేల్చిచెప్పనుందన్నమాట. తప్పులను ఒప్పు చేసుకునేందుకే... వాస్తవానికి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం అవలంభించిన స్విస్‌చాలెంజ్ మొత్తం ప్రక్రియను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇందుకోసం మొత్తం ప్రక్రియలో ఇప్పటివరకు ప్రభుత్వం అనుసరించిన తీరు ఏ విధంగా తప్పో పేర్కొంటూ అనేక అంశాలలో ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని ఉదహరిస్తూనే హైకోర్టు అనేక అంక్షితలు వేసింది. ఏపీఐడీఈ చట్టానికి భిన్నంగా మొత్తం స్విస్ చాలెంజ్ విధానం నడిచిందని మండిపడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసలు చట్టాన్నే మార్చేందుకు సిద్ధపడింది. న్యాయశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా చట్టాన్ని తెచ్చి మందబలంతో ఆమోదముద్రను వేయించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అక్టోబరు 31వ తేదీన మరోసారి హైకోర్టు దీనిపై విచారణ చేపట్టనున్నందున... ఈ లోగానే కొత్త చట్టాన్ని తీసుకరావాలనేది ఆలోచనగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. అన్నీ తొలగింపులే... ఏపీఐడీఈ 2001 చట్టంలో ఏయే క్లాజులను తొలగిస్తారో తెలిపే భాగాలు ప్రభుత్వం తలపెట్టిన కొత్త చట్టంలో పాత చట్టంలోని అనేక ముఖ్యమైన క్లాజులను తొలగించింది. తద్వారా అనేక అంశాల్లో తనకు అనుకూలమైన సింగపూర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. వాటిలో మచ్చుకు కొన్ని.... క్లాజ్ 9(1) తొలగింపు- ఈ క్లాజు ప్రకారం నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు నిపుణులైన వ్యక్తులతో ప్రాజెక్టును మానిటరింగ్ చేసే అవకాశం ఇన్ఫ్రా అథారిటీకి ఉంది. దీని తొలగింపుతో నిర్మాణ పనులను పర్యవేక్షణను తొలగించినట్లు అయ్యింది. హా క్లాజ్ 11 తొలగింపు- ప్రస్తుత చట్టంలో ఈ క్లాజు కింద ఇన్ఫ్రా అథారిటీ అధికారాలను పేర్కొన్నారు. ఈ క్లాజును తొలగించడంతో దానికి ఎలాంటి అధికారాలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. హా క్లాజ్ 15 తొలగింపు- పాత చట్టంలో క్లాజు 15 ప్రకారం డిమాండ్-సప్లై ప్రాతిపదికన వివిధ ప్రాజెక్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఇన్ఫ్రా అథారిటీ నిర్ణయిస్తుంది. ఈ క్లాజును తొలగించడంతో రాష్ట్ర ప్రజల కు అవసరమైన ప్రాజెక్టులు ఏవి అనేది ఇన్ఫ్రా అథారిటీ నిర్ణయించే వెసులుబాటు లేదు. తద్వారా రాజధాని నిర్మాణంలో కంపెనీకి ఏది లబ్ధి చేకూరుతుందో వాటిని మొదటగా నిర్మాణం చేపట్టే అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఉదాహరణకు ప్రభుత్వశాఖల కార్యాలయాల కంటే ముందుగానే వాణిజ్య భవనాలను నిర్మించవచ్చునన్నమాట. హా క్లాజు 60 తొలగింపు - పాత చట్టంలోని క్లాజు 60 ప్రకారం వర్కింగ్ కేపిటల్‌పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆడిట్ జరగాలి. ఆ నిబంధనను తొలగించారు. హా క్లాజు 62 తొలగింపు - అత్యంత కీలకమైన నిబంధన ఇది. ఇన్ఫ్రా అథారిటీ పారదర్శకత పాటించాలన్న నిబంధన ఇది. దీనికి మంగళం పలికారు. హా క్లాజు 65 - దీన్ని పూర్తిగా తొలగించారు. ఇందులోని సబ్ సెక్షన్ 2 ప్రకారం ఏ విషయంలోనైనా తుది నిర్ణయాధికారం ప్రభుత్వానిదే. దీన్ని తొలగించడమంటే ప్రభుత్వం ఏ మేరకు సింగపూర్ కంపెనీలకు సాగిలపడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. హా క్లాజు 78 తొలగింపు- ప్రస్తుత చట్టంలోని ఈ క్లాజు ప్రకారం.... ఇన్ఫ్రా అథారిటీ కానీ స్థానిక సంస్థ (అంటే ఇక్కడ సీఆర్డీఏ)కానీ కొన్ని రెగ్యులేషన్స్‌ను రూపొందించే అవకాశం ఉంది. దీనిని కొత్తగా తెస్తున్న చట్టంలో తొలగించడంతో సీఆర్డీఏ, ఇన్ఫ్రా అథారిటీకి ఎటువంటి అధికారాలు లేకుండా పోనున్నాయి. -
మూలధన వివరాలూ రహస్యమేనా?
* మిగిలిన విషయాలను ఎందుకు దాస్తున్నారు? * బహిర్గతం చేయకపోవడంలో హేతుబద్ధత ఏమిటి? * సర్కార్‌ను మరోసారి నిలదీసిన హైకోర్టు ధర్మాసనం * ఆదాయం తక్కువగా ఉన్నా ముందుకే: అడ్వొకేట్ జనరల్ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో సింగపూర్ కంపెనీల కన్సార్టియం మూలధన పెట్టుబడులకు సంబంధించిన వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య సమాచారం (ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్)గా పేర్కొనడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మూలధనం, ఆదాయ వివరాలు కూడా యాజమాన్య సమాచారమంటే ఎలా? అసలు ఈ వివరాలను బహిర్గతం చేయకపోవడంలో హేతుబద్ధత ఏమిటి? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విషయాన్ని కోర్టుకు నివేదించింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కన్సార్టియం చేసిన ప్రతిపాదనల్లో తమకు వచ్చే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఆర్డీఏలు సంయుక్తంగా అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ సోమవారం నాటి తన వాదనలను కొనసాగించారు. 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది... ఈ స్టార్టప్ ఏరియా అభివృద్ధి ద్వారా ఎంత మందికి ఉపాధి లభిస్తుందని సోమవారం నాడు ప్రశ్నించారని.. 1.25 లక్షల కుటుంబాల్లో 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కన్సార్టియం ప్రతిపాదనల్లోనే ఉందని శ్రీనివాస్ వివరించారు. ఈ స్టార్టప్ ఏరియా చుట్టపక్కల ప్రాంత అభివృద్ధికి ఓ ఉత్ప్రేరకంగా ఉంటుందని తెలిపారు. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)లో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ సీసీడీఎంసీ ఈ స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలు తీసుకుంటుందని, ఇందుకు ప్రభుత్వ నిధులనే వెచ్చిస్తుందని చెప్పారు. స్టార్టప్ ఏరియాలోని భూములను అభివృద్ధి చేయడం, మార్కెట్ చేయడానికి సంబంధించిన హక్కులనే ఎస్పీవీకి ఇస్తామే తప్ప, ఆ భూములపై యాజమాన్యపు హక్కులు సీఆర్డీఏకే ఉంటాయని, అంతిమంగా కొనుగోలుదారులకు సీఆర్డీఏనే రిజిష్టర్ చేస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వానికి ఈ ఎస్పీవీ ఆదాయంలో వాటా ఇస్తుందని తెలిపారు. స్థూల అమ్మకాల ఆధారంగా ఆదాయ వాటా ఉంటుందని వివరించారు. ప్రభుత్వానికి ఇక్కడ లాభం కంటే, విదేశీ పెట్టుబడులు, ఉపాధి కల్పనే ముఖ్యమని శ్రీనివాస్ స్పష్టం చేశారు. లాభాలను ఆశించడం లేదు.. రియల్ ప్రాజెక్టు కాదు.. ‘మీ ఉద్దేశాలను ఓసారి పక్కన పెట్టండి. పిటిషనర్లు కూడా మీ ఉద్దేశాలను ప్రశ్నించడం లేదు. మీరు చేపడుతున్నది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని వారు చెబుతున్నారు. పట్టణ మౌలిక సదుపాయాలు, రోడ్లు తదితరాలన్నీ ఏర్పాటు చేస్తున్నప్పుడు దానిని ఎందుకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా పిలవకూడదు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. పట్టణ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నంత మాత్రాన అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కాదని ఏజీ బదులిచ్చారు. ప్రభుత్వం లాభాన్ని ఆశించడం లేదని, విదేశీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలనే చూస్తోందని వివరించారు. సింగిల్ జడ్జి తన తీర్పులో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారని... వాస్తవానికి ప్రభుత్వ విధానంలో ఎటువంటి లోపం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీఐడీఈ చట్టంలోని సెక్షన్-19 గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ఈ సమయంలో కోర్టు పనివేళలు ముగియడంతో విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. బహిర్గతం చేస్తేనే కదా.. చాలెంజ్‌కు అవకాశం.. ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో సింగపూర్ కన్సార్టియం మూలధనమెంత? అంటూ ధర్మాసనం ప్రశ్నిం చింది. మూలధన పెట్టుబడులు ఒక్కసారిగా పెట్టరని, దశల వారీగా పెట్టుబడులు ఉంటాయని ఏజీ వివరిం చారు. ఈ మూలధన పెట్టుబడుల వివరాలన్నీ యాజ మాన్య సమాచారమన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంత రం చెబుతూ.. ‘వ్యాపార ప్రణాళికలను రహస్యంగా ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు. కాని మూలధనంతో పాటు మిగిలిన వివరాలను ఎందుకు దాచిపెడుతున్నట్లు? ఇలా ముఖ్యమైన వివరాలను యాజమాన్య సమాచారంటూ బహిర్గతం చేయకపోవడంలో హేతుబద్ధత ఏమిటి? మీరు ఆ వివరాలు ముఖ్యంగా ఆదాయ వివరాలను బహిర్గతం చేస్తేనే కదా.. కన్సార్టియం ప్రతిపాదనలను మిగిలిన వారు చాలెంజ్ చేయగలుగుతారు?’ అని ప్రశ్నించింది. ఆదాయ వివరాలు బహిర్గతం చేయబోమని చెప్పడం లేదని, సాంకేతిక బిడ్‌లో అర్హత సాధించిన తరువాత సీల్డ్ కవర్లోని వివరాలను అందరికీ చెబుతామని ఏజీ చెప్పారు. కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం మొత్తం సంతృప్తికరంగా లేకపోతే ప్రతిపాదనలను రద్దు చేస్తామన్నారు. సింగిల్ జడ్జి ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా భావించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని.. ఈ మొత్తం వ్యవహారంలో ఆదాయమన్నది చిన్న విషయమని, ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయం తక్కువ అయినప్పటికీ ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళతామని ఆయన తేల్చి చెప్పారు. -
సింగపూర్ కన్సార్టియంపై ముందే నిర్ణయం
హైకోర్టుకు నివేదించిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుందని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ హైకోర్టుకు నివేదించారు. సింగపూర్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన తరువాతే పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. స్విస్ చాలెంజ్ కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సుమోటో (తనంతట తాను)గా స్పందించి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సమర్పించిందంటూ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘భారతదేశం వెలుపల’ అన్న షరతు విధించి, దేశీయ కంపెనీలేవీ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తోందని వివరించారు. తద్వారా ముందస్తుగా అనుకున్న సింగపూర్ కంపెనీల కన్సార్టియంకే పనులు అప్పగించేందుకు మార్గం సుగమం చేసుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ప్రతి దశలోనూ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ ఇటీవల జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ లిమిటెడ్ కూడా టెండర్ నోటిఫికేషన్‌ను, ఆ తరువాత జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం విచారణ జరిపారు. ఆదిత్య హౌసింగ్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఎన్వీయన్ ఇంజనీర్స్ తరఫున వేదుల వెంకటరమణ తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
స్విస్ చాలెంజ్ లో అసలు రహస్యం !
-
ఇదీ దాపరికం
≈ ఎకరం బేసిక్ ధర రూ. 4 కోట్లకు అదనం ఎంత? ≈ సింగపూర్ కంపెనీలిచ్చిన సీల్డ్ కవర్లోని అంకె ఏమిటి? ≈ అది తెలియకుండా బిడ్డింగ్ ఏమిటి? ≈ ఎవరూ పోటీపడకుండా ఉండడం కోసమేనా ఈ గోప్యత.. ≈ సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ.306 కోట్లు ≈ ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్లు ≈ అంటే వాటి ఖర్చు రూ.6 కోట్లేనన్నమాట ≈ రైతుల భూముల్లో, సర్కారు సొమ్ముతో ‘రియల్’ వ్యాపారం ≈ ప్లాట్లు పొందే థర్డ్‌పార్టీ కంపెనీలేవో ఎవరికీ తెలియదు.. సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ అంటేనే రహస్యం.. అది ఓ బ్రహ్మపదార్ధం... అంతా గోప్యం... లొసుగుల మయం... తప్పు చేయాలనుకునేవారికి ఇది అయాచిత వరం లాంటిది. ఈ విధానంలో పారదర్శకత లేదని అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది అందుకే... అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్విస్ చాలెంజ్’ విధానానికి ‘పచ్చ’జెండా ఊపింది. సింగపూర్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచింది. రైతుల భూములతో, సర్కారు సొమ్ములతో సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టి ప్రభుత్వపెద్దలు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి డెరైక్టుగా వేల కోట్లు వెనకేసుకోవడాన్నే చూశాం. ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు. రూ.306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్ కంపెనీలకు వేల కోట్లు దోచిపెట్టడమే కాకుండా... ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన వెంచర్‌ను మార్కెటింగ్ చేసేందుకు ఓ కంపెనీని ఏర్పాటు చేయడం.. ఆ కంపెనీలో సింగపూర్ సంస్థకు మాత్రమే పూర్తి స్థాయి అజమాయిషీని కట్టబెట్టడం... రాష్ర్టప్రభుత్వం పాత్రేమీ లేకుండా నామమాత్రంగా విదిలించే వాటాకు పరిమితం కావడం వంటివి చూస్తే మనకు దిమ్మతిరగడం ఖాయం. సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియంలో రాష్ర్ట ముఖ్యనేతదే కీలకపాత్ర కావడం వల్లనే ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. భూమి రైతులది... దాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టే ఖర్చు ప్రజలది... లాభాలు మాత్రం సింగపూర్ కంపెనీలవి... రాష్ర్టప్రభుత్వానికి వచ్చే అరకొరవాటా కూడా మార్కెటింగ్ పేరుతో మరో కంపెనీకి కట్టబెట్టడం అన్నిటిలోకెల్లా విచిత్రం... ఈ మార్కెటింగ్ కంపెనీ కూడా కొత్తది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ముఖ్యనేతకు వాటాలున్న సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసేదే ఇది. ‘స్విస్ చాలెంజ్’ విధానం కింద సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియం, కేపిటల్‌సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)గా ఏర్పడిన సంగతి తెల్సిందే. అయితే అభివృద్ధి చేసిన లేఅవుట్లకు పబ్లిసిటీ కల్పించడానికి, వాటిని మార్కెట్ చేయడానికి గాను ఓ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఏడీపీ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు గాను ఈ కంపెనీ బ్రోకరేజీ సహా అనేకరకాల ఫీజులు వసూలు చేస్తుంది. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్నే సింగపూర్ కంపెనీలు 58శాతం, రాష్ర్టప్రభుత్వం 42శాతం పంచుకుంటాయి. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇంకా ఇలాంటి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. సీల్డ్ కవర్లోని మొత్తం ఎంత? అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు తొలిదశలో ఇస్తున్న 1,691 ఎకరాలలో ఎకరానికి రూ. 4 కోట్లను బేసిక్ ధరగా రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీపడేది? ఉదాహరణకు సింగపూర్ కంపెనీలు రూ. 4.1 కోట్లను కోట్ చేశాయనుకోండి. అపుడు మిగిలిన కంపెనీలకు ఒక స్పష్టత వస్తుంది. అవి రూ.4.2 కోట్లనో అంతకన్నా ఎక్కువో కోట్ చేయడానికి వీలుంటుంది. కానీ ఇలా రహస్యంగా సీల్డ్ కవర్లో ఉంచడానికి సింగపూర్ కంపెనీలను ఎందుకు అనుమతించారో రాష్ర్టప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్లాట్లు పొందేది ఎవరు? సింగపూర్ కంపెనీలు ఎకరానికి రూ. 4 కోట్లకన్నా ఎంత అదనంగా కోట్ చేశాయో ఆ మొత్తాన్ని ఇప్పటికిప్పుడు రాష్ర్టప్రభుత్వానికి చెల్లించబోవడం లేదు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ తర్వాత వచ్చే లాభాలలో ఆ మొత్తాన్ని కట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,691 ఎకరాలను అభివృద్ధి చేసి ప్లాట్ల రూపంలో లే అవుట్లు వేస్తుంది. ఈ లే అవుట్లకు మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ. 5,500 కోట్లను కేటాయిస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత ఆ ప్లాట్లకు మార్కెటింగ్ కంపెనీ దేశ విదేశాల్లో మార్కెటింగ్ నిర్వహిస్తాయి. ఒక విధంగా సింగపూర్ కంపెనీలు బ్రోకర్‌గా వ్యవహరిస్తాయి. ఆ ప్లాట్లను సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసే మార్కెటింగ్ కంపెనీయే థర్డ్‌పార్టీకి విక్రయిస్తుంది. వాటిని ఎవరికైనా, ఎంతకైనా విక్రయించవచ్చు. ఉదాహరణకి ఎకరం విస్తీర్ణంలో పాట్లను మార్కెటింగ్ కంపెనీ పది కోట్ల రూపాయలకు విక్రయించిందనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి నాలుగు కోట్ల రూపాయల బేసిక్ ధరను చెల్లిస్తాయి. అలాగే తాము అదనంగా ఇస్తామన్న పది లక్షల రూపాయలను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. మిగతా 5.90 కోట్ల రూపాయల్లో మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ మినహాయించుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన సొమ్ములో ఒప్పందం ప్రకారం సీసీడీఎంసీకి 42 శాతం ఇచ్చి 58 శాతం తాము తీసుకుంటాయి. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే ఈ రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి లాభం పొందబోతున్నాయన్నమాట. రైతుల భూముల్లో, ప్రభుత్వ సొమ్ముతో (ప్రజాధనంతో) మౌలిక వసతులు కల్పించిన ప్లాట్లను తాము నచ్చినవారికి, నచ్చిన మొత్తానికి విక్రయించే ‘రియల్’ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించబోతున్నాయి. ప్లాట్లను పొందేది ఎవరనేది కూడా స్విస్ చాలెంజ్ డాక్యుమెంట్లో పేర్కొనలేదు. ప్లాట్లను వేలం వేస్తామని గానీ, ఎక్కువ మొత్తం ఇచ్చే వారికే విక్రయిస్తామని గానీ డాక్యుమెంట్లో ఎక్కడా వివరించలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మార్కెటింగ్ కంపెనీకి ఇష్టమైన వారికే (కంపెనీలకే) ఈ ప్లాట్లు దక్కబోతున్నాయనేది స్పష్టమౌతోంది. సింగపూర్ కంపెనీల పెట్టుబడి ఎంత? ఏడీపీలో సింగపూర్ సంస్థలు ఈక్విటీ కింద పెడుతున్న పెట్టుబడి కేవలం రూ.306 కోట్లు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్ల రూపాయలుంటుంది. అంటే సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి కేవలం 6 కోట్ల రూపాయలన్నమాట. ఈ 50 ఎకరాల్లో సింగపూర్ సంస్థలే ఐకానిక్ నిర్మాణాలను చేసి విక్రయించుకుంటాయి. ఇందులో ప్రభుతానికి గానీ, ఏడీపీకిగానీ ఎలాంటి భాగస్వామ్యమూ ఉండదు. ఇది కాక మిగతా రెండు దశల్లో సింగపూర్ కంపెనీలకు 200 ఎకరాలను బేసిక్ ధరకు కేటాయిస్తారు. ఆ 200 ఎకరాలపైన కూడా సింగపూర్ సంస్థలకే హక్కు ఉంటుంది. సింగపూర్ సంస్థల ప్రాజెక్టు వ్యయం 3,137 కోట్ల రూపాయలుగా పేర్కొన్నా అందులో మార్కెటింగ్, ప్రచారం, కన్సల్టెంట్ల ఫీజులు, ఐకానిక్ టవర్ వ్యయం కలగలసి ఉన్నాయి. ఈ వ్యయాన్ని కూడా సింగపూర్ కంపెనీలు, సీఆర్డీఏలు ఈక్విటీల ద్వారా, అలాగే తొలి దశ లాభాలు, భూముల విక్ర యం ద్వారా రాబట్టనున్నారు. అంటే పైసా పెట్టుబడి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేత మౌలిక వసతుల కల్పనకు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి కోట్ల రూపాయల లాభాలను సింగపూర్ సంస్థలు ఆర్జించనున్నాయన్నమాట. ఈ విధమైన మార్కెటింగ్, లే- అవుట్లు చేసి విక్రయించడానికి సింగపూర్ కంపెనీలు ఎందుకో సర్కారు పెద్దలకే తెలియాలి. సింగపూర్ సంస్థలు కేవలం లే అవుట్లను ప్లాట్లగా థర్డ్‌పార్టీలకు విక్రయించే బ్రోకరేజీ పని చేయనున్నాయి. భవనాలు నిర్మాణం, ప్లాట్ల అభివృద్ధి థర్డ్‌పార్టీ కంపెనీలే చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను గానీ, రహదారుల నిర్మాణాల నిర్మాణాలను గానీ సింగపూర్ సంస్థలు చేయవు. వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సి ఉంది. మార్కెటింగ్ కోసం మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ కంపెనీల మరో మాయాజాలం అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)లో సింగపూర్ కన్సార్షియం, కేపిటల్‌సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి ఉన్నా అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతోంది. సింగపూర్ కన్సార్షియంకు 58శాతం వాటా, సీసీడీఎంసీకి 42శాతం వాటా.. చూస్తేనే ఈ విషయం అర్ధమౌతోంది. అయితే స్విస్ చాలెంజ్ విధానంలో దశలవారిగా జరిగే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో కార్యకలాపాల నిర్వహణ బాధ్యత అంతా చూడడం కోసం ఓ మేనేజ్మెంట్ కంపెనీని నియమించనున్నారు. మేనేజ్మెంట్, డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణ వంటి వ్యవహరాలన్నీ ఈ కంపెనీయే చూస్తుంది. లేఅవుట్లు, ప్లాట్ల గురించిన ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఒక్కో దశలో ఐదేళ్లపాటు ఈ వ్యవహారాలన్నీ ఈ కంపెనీ నెరవేరుస్తుందని స్విస్‌చాలెంజ్ ప్రతిపాదనలలో పేర్కొన్నారు. అందుకయ్యే ఖర్చులన్నిటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏఏ ఖర్చులుంటాయో వాటికి ఎంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనలలో ప్రస్తావించారు. వాటి వివరాలివీ.. 1. డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి.. - ప్రాజెక్టు వ్యయంలో 5.5శాతం 2. మార్కెటింగ్ సర్వీసులకు... - మొత్తం అమ్మకాలలో 2శాతం లేదా థర్డ్‌పార్టీకి చెల్లించే ఫీజు + 0.75శాతం మార్జిన్లలో ఏది ఎక్కువైతే అది 3. థర్డ్‌పార్టీ ఏజెంట్లను లేదా బ్రోకర్లను నియోగిస్తే... - బ్రోకరేజీకి అయ్యే వాస్తవ ఖర్చులు + 20శాతం 4. లీజ్మేనేజ్మెంట్ సర్వీసులు.. - మొత్తం ఆదాయంలో 1శాతం 5. ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసులు - మొత్తం ఆదాయంలో 2శాతం ఇవి కాక అద్దెకు తీసుకునే ఆస్తులకు సంబంధించిన మార్కెటింగ్ సర్వీసులకు కూడా ఫీజులు వసూలు చేయనున్నారు. ఏడీపీ పేరుతో అభివృద్ధి చేసే ప్లాట్లను థర్డ్‌పార్టీకి విక్రయించడం కోసం ప్రచారం, మార్కెటింగ్ నిర్వహించే ఈ మేనేజ్మెంట్ కంపెనీ అందుకోసం రకరకాల ఫీజుల పేరుతో భారీమొత్తంలో వసూలు చేస్తుంది. అవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58శాతం, సీసీడీఎంసీ 42శాతం తీసుకుంటాయి. -
స్విస్ ఛాలెంజ్ ఓ దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రయోజనాలకు హానికరమైన స్విస్ ఛాలెంజ్ విధానాన్ని రద్దు చేసి రాజధాని పనుల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగపూర్ సంస్థలతో చేసుకుంటున్న ఈ ఒడంబడికలో పారదర్శకత లేదని, అది పూర్తిగా చీకటి ఒప్పందమని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థం, దోపిడీ చేసే దురాలోచనతోనే ఈ విధానాన్ని సీఎం అమలు చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తున్నామని, ఇది కాదని ఎవరైనా ముందుకు వస్తే కూడా పరిశీలిస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన తరువాత మరే సంస్థలైనా ముందుకు వస్తాయా? అని బొత్స సూటిగా ప్రశ్నించారు. స్విస్ విధానం ఎంత మాత్రం సరైనది కాదని పారదర్శకత ఉండదని, అమలు చేస్తే ప్రమాదమని 2015 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పేర్కొందన్నారు. అలాగే ఏపీ మౌలిక సదుపాయాల శాక ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్ ఈ పద్ధతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ వాటిని ఉల్లంఘించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సాక్షాత్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన అన్నారు. కేంద్రం సహా అంతా వ్యతిరేకిస్తున్న ఆ లోపభూయిష్టమైన విధానాన్నే అమలు చేయాలని ఎందుకు బరితెగిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. దేశంలో రాజధాని నిర్మించేంతటి కంపెనీలున్నాయా అని సీఎం మాట్లాడ్డం అందరినీ అవమానించడమేనన్నారు. రేపు ఎన్నికల అనంతరం మరో ప్రభుత్వం అధికారంలోకి వ చ్చి ఈ చీకటి ఒప్పందాలను రద్దు చేస్తే భారీగా పరిహారం చెల్లించాలని సింగపూర్ సంస్థలు కోరిన కోర్కెను మంత్రివర్గం ఆమోదించారన్నారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇలాంటి ఒప్పందాలను వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే భారీ పరిహారం చెల్లించాలా? ఏం విడ్డూరం ఇది! రాష్ట్ర ప్రజలారా గమనించండి దీని వెనుక ఎంత దోపిడీ దాగి ఉందో... అని బొత్స అన్నారు. ప్రభుత్వం మారితే అన్న అనుమానం మంత్రివర్గ సభ్యులకు రావడం చూస్తే ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం ఉండదని వారే అంగీకరించిట్లని ఆయన అన్నారు. రాజధానిని అడ్డుకుంటున్నామని తమపై చేస్తున్న విమర్శల్లో నిజంలేదని, తాము అడ్డుకుంటున్నది రాజదాని నిర్మాణంలో సాగుతున్న అవినీతి, దోపిడీలనేనని బొత్స స్పష్టం చేశారు. -
అవకాశమిస్తే మురికివాడ కడతారు
దేశీయ కంపెనీలపై సీఎం సంచలన వ్యాఖ్యలు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని కంపెనీలను గడ్డిపోచలా తీసిపారేశారు. ఒక్క సిటీ కట్టిన అనుభవమైనా వారికుందా? అని ఎద్దేవా చేశారు. అవకాశమిస్తే మరో మురికివాడను కడతారని ఎగతాళి చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో... దేశంలో ప్రఖ్యాత కంపెనీలుండగా రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు ఎందుకిస్తున్నారని అడిగిన విలేకరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశంలో ఏ కంపెనీకైనా ఒక సిటీ నిర్మించిన అనుభవం ఉందా? నీకు ఏం అనుభవం ఉంది? నీకు అవకాశమిస్తే నువ్వు కడతావా? ఓ స్లమ్ నిర్మిస్తావు’ అంటూ రుసరుసలాడారు. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ఇవ్వకపోతే రాజధానికి ఇంత విలువ వచ్చేదా? అని ఎదురు ప్రశ్నించారు. దేశంలో పెద్ద కంపెనీలైన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు సచివాలయం కడుతుంటే కుంగిపోయిందని రాస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. పరిపాలనా యంత్రాంగాన్ని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా చేస్తున్నారని... దీన్నెలా ఆపాలో, కొన్ని పత్రికలను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. తాము పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తుంటే... లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇష్టానుసారం రాస్తున్నారని, ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తునిలో రైలు తగులబెట్టిన వారిని అరెస్టుచేస్తే అడ్డుకుంటున్నారని, నాయకులందరూ వాళ్లకి మద్దతిస్తున్నారని విమర్శించారు. -
సింగపూర్ గుప్పెట్లో రాజధాని
- స్విస్ చాలెంజ్ విధానంలో మెజారిటీ వాటా ఆ దేశ కంపెనీలకే - రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలకే పెద్దపీట వేస్తూ రూపొందించిన స్విస్ చాలెంజ్ విధానానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. భూముల బదలాయింపు, వాటాలతోపాటు ఆ దేశ కంపెనీలు విధించిన షరతులన్నింటికీ దాదాపు అంగీకరించింది. తొలి విడతగా సీడ్ రాజధానిలో ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు 50 ఎకరాలు, మొత్తంగా 1,691 ఎకరాలు సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాజెక్టులో మెజారిటీ వాటా, భూములివ్వడంతోపాటు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన సౌకర్యాలు ప్రభుత్వ శాఖలే సమకూర్చనున్నాయి. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం రాజధాని భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మంత్రులు యనమల, నారాయణ, పల్లె రఘునాథ్‌రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఆమోదించిన స్విస్ చాలెంజ్‌ని సింగపూర్ కన్సార్టియం స్థాయిలో ఉన్న ఏ కంపెనీలైనా చాలెంజ్ చేసి తమ ప్రతిపాదనలు ఇవ్వొచ్చని, అంతే తప్ప రోడ్డుపైన పోయే కంపెనీలకు అవకాశం ఉండదన్నారు. 45 రోజుల గడువులోపు ఎవరూ చాలెంజ్ చేయకపోతే మళ్లీ వచ్చే మంత్రివర్గ భేటీలో సింగపూర్ కన్సార్టియంకే ప్రాజెక్టు అప్పగించి పనులు మొదలుపెట్టిస్తామన్నారు. స్విస్ చాలెంజ్‌లో సింగపూర్‌కు... రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్-సిన్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ కంపెనీల కన్సార్టియం 2015 అక్టోబర్‌లో ప్రతిపాదనలు ఇచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిపై చర్చించేందుకు హైపవర్ కమిటీని నియమించామని, పలు దఫాలు చర్చించాక స్విస్ చాలెంజ్ విధానం కింద వారి ప్రతిపాదనలను ఆమోదించామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ముందుకు రావాలని జపాన్, బ్రిటన్ దేశాలను కోరినా వారు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నారని తెలిపారు. దీంతో సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనలపై ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కన్సార్టియంగా ఏర్పడిన కంపెనీల్లో సింగపూర్ ప్రభుత్వానికి 74.5 శాతం వాటా ఉందని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం తరఫున ఈ కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమరావతి డెవలప్మెంట్ కంపెనీ (ఏడీసీ) (మొన్నటివరకూ సీసీడీఎంసీ)లు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఏడీసీకి 42 శాతం వాటా, సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం ఉంటుందని తెలిపారు. సీడ్ రాజధానిలో 1,691 ఎకరాలను ప్రభుత్వం ఏడీసీకి ఇస్తుందని, కంపెనీ తన భాగస్వామిగా ఉన్న సింగపూర్ కన్సార్టియంతో కలిసి దాన్ని అభివృద్ధి చేస్తుందని వివరించారు. తొలి విడతగా 50 ఎకరాలను ఉచితంగా లేదా నామమాత్రపు ధరకు ఇస్తామని, రెండో విడతలో ఎకరం నాలుగు కోట్లు చొప్పున 200 ఎకరాలను ఇస్తామన్నారు. ఆ తర్వాత మార్కెట్ విలువను మూడో విడత మిగిలిన భూమిని వారికి అప్పగిస్తామన్నారు. వ్యతిరేకంగా వార్తలు రాసినా, చూపినా కేసులు పెట్టండి సాక్షి, హైదరాబాద్: తమకు వ్యతిరేకంగా పత్రికలు వార్తలు రాసినా, టీవీచానళ్లలో కథనాలు ప్రసారం చేసినా వారిని భయభ్రాంతులకు గురిచేసే రీతిలో కేసులు పెట్టాలనే ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్టు, మంత్రులెవ్వరూ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కోరినట్టు తెలిసింది. ఇప్పటినుంచే భయపెట్టకపోతే ప్రతి విషయాన్నీ కొన్నిపత్రికలు, టీవీ చానళ్లు భూతద్దంలో చూపుతాయని, చిన్న తప్పుల్నీ ఎత్తిచూపే అవకాశముందని, ప్రజలకు అన్ని విషయాలు తెలిస్తే భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికే ప్రమాదకరంగా పరిణమించే వీలుందని కేబినెట్ భేటీలో సీఎం అన్నట్టు సమాచారం. ఉల్లంఘన జరగలేదు... రాజధాని నిర్మాణం ఒప్పందంలో ఎక్కడా చిన్న ఉల్లంఘన కూడా జరగలేదని సీఎం స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో సీఎస్ సంతకం పెట్టలేదని కొందరు ఆరోపణలు చేస్తున్నారని... సీఆర్డీఏ చైర్మన్ హోదాలో మొదట ఈ ప్రతిపాదనలను తాను పరిశీలించానని, ఆ తర్వాత సీఎస్ నేతృత్వంలోని మౌలిక వసతుల కమిటీకి ఫైల్ పంపామని.. అక్కడి నుంచి సంబంధిత శాఖలకు వెళ్లి తిరిగి కేబినెట్లో మళ్లీ తన వద్దకొచ్చిందన్నారు. న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని నిబంధనల ప్రకారమే చేశామని చెప్పారు. ప్రభుత్వం ఆమోదించిన స్విస్ చాలెంజ్‌ని సింగపూర్ కన్సార్టియం స్థాయిలో ఉన్న ఏ కంపెనీలైనా చాలెంజ్ చేసి తమ ప్రతిపాదనలు ఇవ్వొచ్చని, అంతే తప్ప రోడ్డుపైన పోయే కంపెనీలకు అవకాశం ఉండదన్నారు. ఈ ప్రక్రియకు 45 రోజుల సమయం ఉంటుందని.. అప్పటికి ఎవరూ చాలెంజ్ చేయకపోతే మళ్లీ వచ్చే మంత్రివర్గ సమావేశంలో సింగపూర్ కన్సార్టియంకే ప్రాజెక్టు అప్పగించి పనులు మొదలుపెట్టిస్తామని తెలిపారు. సింగపూర్ కన్సార్టియం తరఫున మేనేజింగ్ కంపెనీని ఏర్పాటుచేసుకుంటారని, రాబోయే రోజుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏర్పాటుచేసినా ఏడీసీ కిందే ఉంటాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రెవెన్యూ శాఖ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తుందని తెలిపారు. ఇరిగేషన్ పరిధిలోని కృష్ణానది కరకట్ట పునర్నిర్మాణం బాధ్యత కూడా సింగపూర్ వాళ్లదేనన్నారు. మైనింగ్ శాఖ క్యూబిక్ మీటరు రూ.500 చొప్పున ఈ ప్రాజెక్టుకి ఇసుక సరఫరా చేస్తుందని, రవాణా శాఖ అవసరమైన రహదారుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని, విద్యుత్ శాఖ విద్యుత్‌ను సరఫరా చేస్తుందని, ప్రజారోగ్యం, పారిశుధ్యం, భద్రత చర్యలతోపాటు ఇతర సౌకర్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖలే చూస్తాయని ఆయన చెప్పారు. -
‘ముఖ్య’తంత్రం!
రాజధాని పనుల్లో సింగపూర్ వ్యవహారాలన్నీ సీఎం కనుసన్నల్లోనే... ఆర్థిక అంశాలన్నీ ఆయనే మాట్లాడుతున్నారు.. సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏదో జరగరానిది జరుగుతోంది... గూడుపుఠాణి నడుస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీల వెంటబడడం వెనక ఏదో ఉంది. అధికారులు, మంత్రులకు ఎలాంటి ప్రమేయం లేకుండా అన్నీ తానే అయి నడిపిస్తుండడం అనుమానాస్పదంగా ఉంది.. తరచూ వినిపిస్తున్న మాటలివి. చాలాకాలంగా ఇవి అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ పక్షాలలోనూ తీవ్ర చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటి వరకు సందేహాలే... మంత్రుల కమిటీ సిఫార్సులను చూస్తే ముఖ్యమంత్రి గారి అదనపు ‘చొరవ’ స్పష్టంగా బైటపడిపోయింది. అంతేకాదు మంత్రుల కమిటీ సిఫార్సులకు ముఖ్యమంత్రి ముందే ఆమోదముద్ర వేసేయడం, ఆ తర్వాత ఫైలు అధికారుల వద్దకు వెళ్లడం, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేయడం చూస్తే ఈ వ్యవహారంలో ఏదో తప్పు జరుగుతోందని అర్ధమౌతోంది.. అవును.. అన్నీ ఆయనే చూస్తున్నారు... సింగపూర్ కంపెనీలతో ముఖ్యమంత్రే నేరుగా ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆర్థిక అంశాలన్నీ ఆయనే చూస్తున్నారని మంత్రుల కమిటీ సిఫార్సులలో స్పష్టంగా ఉంది. వాటితో పాటు పరిష్కారం కాని ఇతర అంశాలపై చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు మంత్రుల కమిటీ సిఫార్సులలో పేర్కొన్నారు. ఆ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి సంతకం కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆమోదించిన.. స్వయంగా సంతకం చేసిన మంత్రుల కమిటీ సిఫార్సులను యథాతథంగా ఆమోదించడానికి మౌలిక వసతుల అథారిటీ సమావేశం అంగీకరించలేదు. శుక్రవారం సచివాలయంలో ఈ అథారిటీ సమావేశం జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. ఇదేం తీరు... మండిపడ్డ సీఎస్ మంత్రుల కమిటీ సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించిన తరువాత అధికారులతో కూడిన అథారిటీ సమావేశానికి పంపించడమేమిటని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ మండిపడ్డారు. మంత్రుల సిఫార్సులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత అధికారులతో కూడిన అధారిటీ ఏ విధంగా ఆమోదం తెలుపుతుందో చెప్పాలని సీఆర్డీఏ అధికారులను సీఎస్ నిలదీశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం సీఆర్డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉన్నందున ఆయన ఆమోదించిన అంశాలను అధారిటీ ముందుకు ఎలా తీసుకువస్తారని సీఎస్ ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు అధారిటీ ముందుకు తీసుకువచ్చి కేబినెట్‌కు వెళ్లాలి, ఆమోదించాలని పీకలమీద కూర్చుంటే కుదరదని సీఎస్ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకు వెళ్లాలంటే సీఎస్‌తో సంబంధం లేకుండా నేరుగా సీఆర్డీఏనే కేబినెట్ ముందుకు తీసుకువెళితే మంచిదని సీఎస్ చురక అంటించారు. సంబంధిత శాఖల అభిప్రాయాలను తీసుకోకుండా అధారిటీ సమావేశం ముందుకు ఎలా తెస్తారని సీఎస్ ప్రశ్నించారు. సీఎం ఆమోదించిన అంశాలపై అభిప్రాయసేకరణా? సీఎస్ సీరియస్ అవడంతో ఏం చేయాలో సీఆర్డీఏ అధికారులకు తోచలేదు. చివరకు సంబంధిత శాఖలకు ఫైలు సర్క్యులేట్ చేసి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని సమాచారం. దీనిపై సీఎస్ స్పందిస్తూ సంబంధిత శాఖలు ఫైలుపై ముఖ్యమంత్రి ఆమోదించిన అంశాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఏమి చేస్తారంటూ సీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. మంత్రుల కమిటీ, సీఆర్డీఏ సమావేశంలో పాల్గొని ఆ నిర్ణయాలకు అనుగుణంగా సంతకాలు చేసి ఇప్పుడు ఫైలు సర్క్యులేట్ చేస్తే గతంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తారా అని సీఎస్ ప్రశ్నించారు. సీఎస్ ప్రస్తావించిన అంశాలపై సీఆర్డీఏ అధికారులు నీళ్లునమిలారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి-2001 చట్టం ఏమి చెబుతోంది.. అందుకు అనుగుణంగా నిబంధనలు పాటించారా? లేదా? అనే అంశాలను పరిశీలించాల్సి ఉందని, అంతే కాకుండా న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం... సీఎం ఆమోదించిన మంత్రుల కమిటీ సిఫార్సులతో పాటు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన రాయితీ, అభివృద్ధి అగ్రిమెంట్ ముసాయిదాపై సీఎస్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఆ సందేహాలను నివృత్తి చేసే బాధ్యతలను కొంత మంది అధికారులకు సీఎస్ అప్పగించారు. అంతే కాకుండా న్యాయ శాఖ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సీఎస్ కోరారు. దీనిపై న్యాయ శాఖ స్పందిస్తూ తొలుత అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని, అనంతరం న్యాయ శాఖ అభిప్రాయాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇష్టానుసారం వ్యవహారాలకు ఆమోదం తెలపడానికి సిద్ధంగా లేనని సీఎస్ స్పష్టం చేశారు. -
బాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట!
కలర్ కలల చంద్రబాబుకు సింగపూర్ కంపెనీ సినిమా చూపించిందట. ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ఉచితంగా అందిస్తుందని చంద్రబాబు బీరాలు పలికారు. తనకు సింగపూర్‌తో ఉన్న అనుబంధంతోనే మాస్టర్ ప్లాన్ అందించేందుకు ముందుకొచ్చిందని చెవులు హోరెత్తేలా చెప్పారు. ‘‘చెప్పేవారు చంద్రబాబు అయితే వినేవారు అదేదో.. అయినట్లు..’’ చివరకు సింగపూర్ చేతల్లో మాత్రం బాబుకు చుక్కలు చూపిస్తోందట. సింగపూర్ కంపెనీ సుర్బానా అందించిన మాస్టర్ ప్లాన్‌ను మార్పులు, చేర్పులు అనంతరం ఇప్పుడు ఏకంగా సింగపూర్ సంస్థ రూ.20 కోట్లకు టెండర్ పెట్టిందట. మాస్టర్ ప్లాన్‌కు సింగపూర్ కంపెనీ పంపిన రూ.20 కోట్ల బిల్లును చూసి బాబు గారికి కళ్లు బైర్లు కమ్మాయట. బాబుకు ఆ విధంగా మైండ్ బ్లాక్ అయితే, సింగపూర్ దెబ్బకు మున్సిపల్ మంత్రి నారాయణ ‘అబ్బా..’ అంటున్నారట. ఏది ఏమైనా నారా వారి మాటలకు అర్ధాలే వేరులే... -
ఆగ్రా-జైపూర్ రోడ్డు ప్రాజెక్ట్ విక్రయించిన మధుకాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కం పెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ ఒక రోడ్డు ప్రాజెక్టును సింగపూర్ కంపెనీకి విక్రయించింది. ఆగ్రా-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను రూ. 248 కోట్లకు సింగపూర్‌కు చెందిన క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ సింగపూర్‌కు విక్రయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని కి సంబంధించి ఈ నెల 21న ఒప్పందం కుదిరినట్లు మధుకాన్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. 63 కి.మీ పొడవైన ఈ రహదారిని బీవోటీ విధానంలో అభివృద్ధి చేసి నిర్వహించుకోవడానికి 2006లో కాం ట్రాక్టు దక్కించుకుంది. 2009 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాజెక్టును 25 ఏళ్లపాటు టోలు ఫీజులు వసూలు చేసుకోవచ్చు. ఈ విక్రయ ఒప్పందానికితుది అనుమతులు లభించాల్సి ఉంది. -
చతుర్ముఖ వ్యూహం
రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణానికి చతుర్ముఖ వ్యూహంతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. 1. ప్రధాన పరిపాలన కేంద్రం 2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం) 3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం) 4. అమరావతి వాటర్ ఫ్రంట్(అమరావతి నదీ ముఖం)గా రాజధాని కేంద్ర ప్రాంతాన్ని విభజించారు. 1. అమరావతి ప్రధాన పరిపాలన కేంద్రం (అమరావతి గవర్నమెంట్ కోర్) ఇది అమరావతి రాజధాని నగరంలో అత్యంత కీలకమైనది. ప్రధాన పరిపాలన కేంద్రాన్ని లింగాయపాలెం సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించారు. శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ గృహాలు, ప్రాంతీయ వైద్య శాలలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, నగర గ్యాలరీలను ఈ కేంద్రంలో నిర్మిస్తారు. కార్యాలయాలకు ఉద్యోగులు సులభంగా వెళ్లడానికి వీలుగా ప్రత్యేక నడక, సైకిల్ మార్గాలు, 100 మీటర్ల వెడల్పుతో కూడిన సువిశాలమైన రహదారులు, మెట్రో రైలు మార్గాలు నిర్మిస్తారు. 2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం) రాజధాని నగరంలో ప్రధానమైన వాణిజ్య కేంద్రం ఇది. ఉద్దండరాయనిపాలెం సమీపంలో ప్రధాన వాణిజ్య కేంద్రాన్ని నిర్మిస్తారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం భారీ భవంతులను నిర్మిస్తారు. వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లను ఏర్పాటుచేస్తారు. 3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం) రాజధాని అమరావతికి ఇది ముఖద్వారం. తాళ్లాయపాలెం అమరావతికి ముఖద్వారం కానుంది. కృష్ణా నదిపై తాళ్లాయపాలెం సమీపంలో అత్యాధునిక హంగులతో వారధిని నిర్మిస్తారు. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ నుంచి 30 నిమిషాల్లోగా రాజధాని ప్రధాన కేంద్రానికి చేరుకునేలా ఈ వారధి మీదుగా రహదారిని నిర్మిస్తారు. తాళ్లాయపాలెం వద్ద రాజధాని ప్రత్యేకతను చాటిచెప్పేలా ఐకానిక్ టవర్లను నిర్మిస్తారు. ముఖద్వారాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, వినోదం కోసం చిత్తడి నేలలతో కూడిన ఉద్యానవనం(వెట్‌ల్యాండ్ పార్క్)ను ఏర్పాటు చేయనున్నారు. 4. అమరావతి వాటర్‌ఫ్రంట్ (అమరావతి నది ముఖం) రాజధాని ప్రజల వాణిజ్య, వినోద కార్యకలాపాల కోసం అమరావతి నది ముఖంను నిర్మించనున్నారు. ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో వాటర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రజలకు వినోదం పంచేలా నది ముఖాన్ని తీర్చిదిద్దనున్నారు. కన్వెన్షన్ సెంటర్, ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్, అమరావతి ప్లాజా, సాంస్కృతిక, కళా కేంద్రాలు నె లకొల్పనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఇలా.. * అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా అమరావతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. * తాగునీరు:ప్రజల అవసరాలకు రోజుకు 95.7 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం అవుతాయని అంచనా. అందుకు పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగుపై రిజర్వాయర్లు నిర్మించనున్నారు. 24 గంటల విద్యుత్: సీడ్ కేపిటల్‌కు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి 398.5 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ విద్యుత్‌ను సీడ్ కేపిటల్‌కు సరఫరా చేయడానికి వివిధ కెపాసిటీల్లో సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. సరఫరాకుభూమిలో(అండర్‌గ్రౌండ్) కేబుల్ వేస్తారు. రవాణా సదుపాయం: సీడ్ కేపిటల్లో 88 కిమీల పొడవున రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. -
దందాయే ‘రియల్’ ప్లాన్
రాజధాని నిర్మాణంలో లక్ష కోట్ల వ్యాపారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి సప్తవర్ణాల ఆకాశ హర్మ్యాలతో సింగపూర్ గీసిన చిత్రాల వెనుక.. రైతుల భూములు పెట్టుబడిగా పెట్టి లక్ష కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్న ప్రణాళిక విస్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిగా నామకరణం చేసిన కొత్త రాజధాని నిర్మాణం.. మాస్టర్ ప్లాన్, మాస్టర్ డెవలపర్ దశలను దాటి ఇప్పుడు మాస్టర్ మైండ్ దశకు చేరుకుంది. రాజధానిలో ప్రభుత్వ భవనాలకు కేవలం 2,000 ఎకరాలు చాలని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. మరైతే.. ఆ ప్రాంతంలోని అమాయక రైతుల నుంచి సమీకరించిన, ప్రభుత్వ అధీనంలో ఉన్న, స్వాధీనం చేసుకోబోతున్న 57,000 ఎకరాల భూములతో ఏం చేయనున్నారు? * మాస్టర్ ప్లాన్ - మాస్టర్ డెవలపర్ వెనుక మాస్టర్ మైండ్ ఇదే * భూములు సింగపూర్ రియల్ సంస్థలకు ధారాదత్తం * రాజధానికి 2,000 ఎకరాలు సరిపోతాయన్న సీఎం * 50 వేల ఎకరాల సమీకరణ, సేకరణ ఎందుకు? * అన్నీ పోగా సర్కారు చేతిలో 25 వేల ఎకరాలు * ప్రస్తుతం ఎకరం రూ. 2 కోట్లు చొప్పున 50 వేల కోట్లు * పభుత్వం చెబుతున్నట్లుగా త్వరలో రెండు రెట్లు పెరిగినా మొత్తం లక్ష కోట్లు * ‘అభివృద్ధి’కి కట్టబెట్టి.. అత్యధిక వాటా ఇవ్వనున్న సర్కారు సర్కారు చేతిలో 25 వేల ఎకరాలు... రాజధానికి ఎంపిక చేసిన 29 గ్రామాల్లో మొత్తం 57,000 ఎకరాలకు పైగా భూములు ఉంటే.. రైతుల నుంచి 33,400 ఎకరాల పట్టా భూములు సమీకరించినట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక అటవీ, డొంక, పోరంబోకు, దేవాదాయ, అసైన్డ్ తదితర భూములన్నీ కలిపి మరో 18,116 ఎకరాలు సర్కారు అధీనంలోనే ఉన్నాయి. మొత్తం కలిపితే ప్రభుత్వ స్వాధీనంలో 51,516 ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కతేలుతోంది. ఇందులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం 9,144 ఎకరాలను (అభివృద్ధి చేసిన తర్వాత) తిరిగి రైతులకు ఇస్తారు. మిగిలిన 42,372 ఎకరాల్లో 40 శాతం(16,950 ఎకరాలు) మౌలిక సదుపాయాల కల్పన పేరుతో తీసివేసినా ఇంకా 25,423 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇక రైతుల చేతుల్లోనే ఉన్న మరో 5,000 ఎకరాలను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది. రాష్ట్ర రాజధానికి భూమి పూజ చేసిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామన్న తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయనీ, కోట్లల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్న ధర ఎకరా కోటి నుంచి రెండు కోట్లకు పై మాటగా ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడున్న ధర ప్రకారం 25 వేల ఎకరాలంటే 50 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు సర్కారు చేతిలోకొచ్చినట్టు. ఇంకో ఏడాది ఆగితే ధర రెండు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారు లెక్కలేశారు. ఆ లెక్కన వేసుకున్నా ప్రభుత్వం చేతిలో ఉన్న భూముల ధర ఒక లక్ష కోట్ల రూపాయలు దాటిపోతోందన్నది నిజం. మరి ఆ భూములను ఏం చేస్తారంటే.. ‘అభివృద్ధి’ ముసుగులో విదేశీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాదత్తం చేయబోతున్నారు. ఇక పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో కృష్ణా నదికి ఎగువ భాగాన మరో 10,000 ఎకరాలను సమీకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించటం వేరే విషయం. ‘స్విస్ చాలెంజ్’లో వేరే సంస్థలు రాగలవా? రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ విధానంలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందు ఒక ప్రణాళికను రూపొందిస్తారు. దానిమేరకు మాస్టర్ డెవలపర్లను ఆహ్వానిస్తారు. కానీ.. పెద్దపెద్ద ప్రాజెక్టులు, సెజ్‌లు లేదా ఇలాంటి రాజధాని నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో.. మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంస్థలే ఆ ప్రాజెక్టును ఏ మేరకు చేపట్టవచ్చన్న అవగాహన కలిగి ఉంటాయి. ఇప్పుడు సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఏ జర్మనీ లేదా ఆస్ట్రేలియా కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా రావడానికి ఇష్టపడవు. సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి బయటి సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచవు. సింగపూర్ కంపెనీల కన్షార్షియం... అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఇన్కార్ప్) సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ-సింగపూర్)తో గత డిసెంబర్ 8వ తేదీన ఒప్పందం జరిగింది. ఆ సంస్థ.. మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ హోల్డింగ్స్ (సుర్బానా), జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (జురాంగ్) సంస్థలకు అప్పగించింది. ఆ సంస్థలేమో.. రాజధాని ప్రాంత ప్రణాళిక (కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్), రాజధాని నగర ప్రణాళిక (కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్), సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్ పేరుతో మూడు ప్రణాళికలుగా విడదీసి అందించాయి. ఇప్పుడిక ఆయా మాస్టర్ ప్లాన్లలో చూపించిన చోట ఆయా నిర్మాణాలు చేపట్టడానికి, వాటికి అవసరమైన సంస్థలను ఆహ్వానించడానికి వ్యవహార కర్తగా ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ వ్యవహార కర్తే ‘మాస్టర్ డెవలపర్’. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికే ఏడు మాసాలు కసరత్తు చేసిన సింగపూర్ కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రమే ఇందులోని లోగుట్టు అర్థమవుతుంది. రాజధాని ప్రాంతంలోని నేల పరిస్థితుల నుంచి నదీ ప్రవాహం, భూముల సమీకరణ, నిర్మాణాల వంటి అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు సమగ్రమైన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు అందించింది. ఇప్పుడు రాజధాని లోగుట్టు ఆ సంస్థలకే తెలుసు కనుక మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానానికి అవే ముందుకొస్తాయి. సుర్బానా, జురాంగ్‌లు పరస్పర సహకారంతో మాస్టర్ ప్లాన్లు రూపొందించగా.. మాస్టర్ డెవలపర్‌గా రంగంలోకి దిగేందుకు రెండు సంస్థలు ఒక్కటయ్యాయి. అలాగే.. సింగపూర్‌లో మరో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థ అసెండాస్ మాస్టర్ డెవలపర్‌గా కూడా ఆసక్తి చూపింది. ఆ దేశానికే చెందిన మరో సంస్థ సింగ్‌బ్రిడ్జి గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే అసెండాస్‌లో విలీనమైంది. అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ ప్రతినిధి ఏపీ రాజధాని నిర్మాణానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని గత వారం సింగపూర్‌లో ప్రకటించారు. సింగపూర్ కంపెనీలకు భారీ వాటాలు... హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ సంస్థలు కార్యాలయాల కోసం చంద్రబాబు అప్పట్లో ఒక హైటెక్ సిటీ పేరుతో మాదాపూర్‌లో ఒక భవనం నిర్మించారు. ఆ భవన నిర్మాణ పనిని.. టీడీపీ ప్రధాన కార్యాలయం నడుస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని నిర్మించి ఇచ్చిన ఎల్ అండ్ టీ కంపెనీకి అప్పగించారు. ఏపీఐఐసీ కేటాయించిన స్థలంలో హైటెక్ సిటీ నిర్మించారు. నిర్మించినందుకు ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం అందులో 89 శాతం వాటా ఇచ్చింది. ఉచితంగా నీరు, విద్యుత్ సమకూర్చడమే కాకుండా అనేక రాయితీలు ఇచ్చింది. భూమి ఇచ్చిన ఏపీఐఐసీకి అందు లో వాటా 11 శాతమే. ఆ భవనంపై సర్వహక్కులూ ఎల్ అండ్ టీ సంస్థవే. సరిగ్గా ఇప్పుడు ఇదే పద్ధతిలో అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతోంది. రైతుల నుంచి ఉచితంగా భూములు తీసుకుని ఆ భూములను పూర్తిగా మాస్టర్ డెవలపర్‌కు అప్పగిస్తారు. ఆ మాస్టర్ డెవలపర్ తాను పిలుచుకున్న సంస్థకు ఒక్కో ప్రాజెక్టును కట్టబెడతారు. ఇప్పుడు ప్రభుత్వం గంపగుత్తగా మాస్టర్ డెవలపర్‌కు వాటా ఇస్తుందా? లేదా ఒక్కో కంపెనీకి ఒక్కో ప్రాజెక్టుపై వాటా(భూములు) ఇస్తుందా? తేలాల్సి ఉంది. రైతుల భూములే పెట్టుబడిగా... రాజధాని కోసం నిధులు లేవని పదే పదే చెప్తున్న చంద్రబాబు.. అక్కడ నిర్మించే ప్రభుత్వ భవనాల కోసం మొత్తం రూ. 12,356 కోట్లు వ్యయం అంచనా వేసి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. అందులో కేంద్రం ఇప్పటికే రూ. 1,500 కోట్లు విడుదల చేసిందని కూడా ఆయన ప్రకటించారు. నిర్మాణ క్రమంలో ఒత్తిడి చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది. కానీ.. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి డబ్బులు లేవన్న కారణం చెప్తూ.. ఆయా కంపెనీలకు భూములు ఇచ్చి నిర్మాణం చేయించే ప్రణాళిక పేరుతో ఈ రియల్ దందా మొదలుకాబోతోంది. సాధారణంగా.. నగరంలో ఒక వ్యక్తికి 500 గజాల స్థలం ఉంటే దాంట్లో అపార్ట్మెంట్ నిర్మిస్తామని ఎవరైనా బిల్డర్ ముందుకొస్తే (హైదరాబాద్ లాంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో) నిర్మించిన దానిలో 50 శాతం బిల్డర్‌కు మరో 50 శాతం స్థలం యజమానికి చెందేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఆయా నగరాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి ఈ ఒప్పందాల్లో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. కానీ.. రాజధానిలోని ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి కట్టబెడితే అందులో హైటెక్ సిటీ తరహాలో నామమాత్రం వాటా ప్రభుత్వం ఉంచుకుని మిగిలిన భూమిని కంపెనీకి ధారాదత్తం చేయనున్నారు. అయితే 30:70 (ప్రభుత్వం 30 శాతం, కంపెనీ 70 శాతం) నిష్పత్తిలో వాటా నిర్ణయిస్తారా? లేక 20:80 నిష్పత్తిలో ఇవ్వాలా? అన్నది ప్రభుత్వం త్వరలోనే తేల్చబోతోంది. పెపైచ్చు నిర్మించిన భవనంలోని స్థలాన్ని (స్పేస్)ను 99 ఏళ్ల పాటు ఇతరులకు లీజుకు ఇచ్చుకునే అధికారాన్ని కూడా ఆయా కంపెనీలకే కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. - (ఆంధ్రప్రదేశ్ బ్యూరో) -
నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని నాగార్జున ఆయిల్ కార్పొరేషన్‌కు (ఎన్‌వోసీఎల్) చెందిన ఆయిల్ రిఫైనరీ యూనిట్‌లోని 46.78 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సింగపూర్ కంపెనీ ముందుకొచ్చింది. నాగార్జున ఆయిల్ రిఫైనరీ పేరుతో రూ. 25,000 కోట్లతో కడలూరులో ఎన్‌వోసీఎల్ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులోని పూర్తి వాటాను సింగపూర్‌కు చెందిన నెట్‌ఆయిల్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎన్‌వోసీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. కంపెనీ విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ కొనుగోలు పూర్తయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్‌వోసీఎల్‌కి పెద్ద ఊరట లభించినట్లే. -
జూలై 16కు ముందే సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్
సింగపూర్ ప్రతినిధుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 16వ తేదీకి ముందే సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను సమర్పిస్తామని సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రప్రభుత్వానికి తెలిపారు. ఇప్పటికే కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్రణాళికను, కేపిటల్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సీడ్ కేపిటల్ ప్లాన్‌పై సింగపూర్ కంపెనీ ప్రతినిధులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. ప్రధానంగా మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానెతో పాటు ఇతర అధికారులను సీడ్ కేపిటల్ ప్రణాళికలో ఏఏ అంశాలు ఉండాలని సింగపూర్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. సీడ్ కేపిటల్లో సచివాలయం, రాజ్‌భవన్, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాసగృహాలు తదితర భవనాలపై చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరించిన మేరకు సీడ్ కేపిటల్ ప్రణాళికను రూపొందించి వచ్చే నెల 16వ తేదీకి ముందుగానే ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులకు సింగపూర్ ప్రతినిధులు వివరించారు. దీని తర్వాత ప్రారంభోత్సవ తేదీలు నిర్ణయం, ప్రధాని, రాష్ట్రపతి వంటి వారిని ఆహ్వానించడం చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
విదేశీ సంస్థలకు భవానీ ద్వీపం
అమితాసక్తి చూపుతున్న సింగపూర్ * కట్టబెట్టే యోచనలో ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పర్యాటకానికి మణిదీపంలాంటి భవానీ ద్వీపాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. సింగపూర్ కంపెనీలకు దీంతోపాటు పక్కనే ఉన్న మరికొన్ని ద్వీపాలను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సింగపూర్ కంపెనీలు చర్చలు జరిపాయి. రాజధాని మాస్టర్‌ప్లాన్ హడావుడి పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ లీజుపై దృష్టి పెట్టనుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో 7 వేల ఎకరాల్లో పలు ద్వీపాలున్నాయి. ఇందులో 133 ఎకరాల భవానీద్వీపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందే దీన్ని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీనిపై తనకు చాలా ప్లానింగ్ ఉందని పాత ప్రణాళికలను పక్కన పెట్టాలని స్వయంగా చంద్రబాబు పర్యాటక శాఖకు సూచించారు. సింగపూర్‌లోని సెంటోసా ద్వీపం తరహాలో దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన పలుమార్లు చెప్పారు. మాస్టర్‌ప్లాన్ తయారుచేసిన సింగపూర్ కంపెనీల్లో ఒకదానికి వాటిని అభివృద్ధి చేసి 33 ఏళ్లపాటు నిర్వహించుకునే అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. గతంలో ఆందోళనలు నిర్వహించిన టీడీపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భవానీ ద్వీపాన్ని ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రయత్నాన్ని టీడీపీ అడ్డుకుంది. ఆ ప్రయత్నం విరమించుకునే వరకూ అప్పటి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళనలు నిర్వహిం చారు. ఇప్పుడు ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం. -
మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్!
సింగపూర్ సంస్థ ఎంపికకు సర్కారు కసరత్తు * స్విస్ చాలెంజ్ విధానంపై అసెండాస్ ఆసక్తి * రాజధాని భూముల లీజుపై వచ్చే డబ్బుతోనే మౌలిక వసతులు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. స్విస్ చాలెంజ్ విధానంలో పాల్గొనేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తూ అసెండాస్ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళిక వచ్చిన తర్వాత రాజధానిలో మౌలిక వసతుల కల్పన పనులు ఎంతకు చేయనున్నదనే సవివరమైన నివేదికను అసెండాస్ సంస్థ ప్రభుత్వానికి సమర్పించనుంది. స్విస్ చాలెంజ్ విధానంలో.. అసెండాస్ సంస్థ ఉదాహరణకు రూ.100 కోట్లకు పనులు చేపడతామని, ప్రభుత్వానికి ఇంత రెవెన్యూ చేకూర్చుతామని స్పష్టం చేసిన పక్షంలో అసెండాస్ కన్నా తక్కువ మొత్తానికి పనులు చేపట్టే సంస్థలు ఏమైనా ఉంటే రావచ్చునంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అసెండాస్ కన్నా రూ.10 కోట్లు తక్కువకు చేస్తానంటూ మరో సంస్థ ముందుకు వస్తే అప్పుడు ప్రభుత్వం.. ఆ మరో సంస్థ చేస్తానన్న ధరకు చేస్తారా? అని తిరిగి అసెండాస్ను అడుగుతుంది. అందుకు అసెండాస్ అంగీకరించిన పక్షంలో ఆ సంస్థకే మాస్టర్ డెవలపర్ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నూతన రాజధానిలో రహదారులు, నీళ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన పనులన్నింటికీ అయ్యే వ్యయాన్ని పూర్తిగా మాస్టర్ డెవలపర్‌గా ఎంపికయ్యే సంస్థనే తొలుత భరిస్తుంది. నూతన రాజధానిలో భూములను పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నారు. ఆ భూముల లీజు ద్వారా వచ్చిన డబ్బులను, అలాగే సీఆర్డీఏ నిధికి జమయ్యే మొత్తాల నుంచి మాస్టర్ డెవలపర్‌కు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. నూతన రాజధానిలో విద్యుత్ లైన్లు, సరఫరాను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుంది. రాజధాని మాస్టర్ ప్రణాళికను గత నెలలో సింగపూర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. అప్పుడు కేవలం మ్యాప్‌లను మాత్రమే సమర్పించారు. ఆ మాస్టర్ ప్రణాళికకు సంబంధించిన పూర్తి వివరాలను సింగపూర్ కంపెనీలు ఇంకా సమర్పించాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 22, 23వ తేదీల్లో సింగపూర్ కంపెనీల ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు రానుంది. సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను ఈ నెలాఖరుకు నాటికి సింగపూర్ కంపెనీలు సమర్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీకల్లా సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను సమర్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కొన్ని చేర్పులు, మార్పులను సూచించినందున సీడ్ కేపిటల్ మాస్టర్ ప్రణాళిక సమర్పణకు జాప్యం జరుగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. -
నారాయణ మంత్రం!
⇒ సీఎం బాబు, మంత్రి నారాయణ కనుసన్నల్లో రాజధానిప్లాన్ ⇒ బాబు సూచన మేరకు తుది దశ మాస్టర్‌ప్లాన్‌లో మార్పుచేర్పులు! ⇒ వీటిని నారాయణ ద్వారా ఎప్పటికప్పుడు సింగపూర్ కంపెనీలకు చేరవేత సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ కనుసన్నల్లో సాగుతోంది. సీఎం చంద్రబాబు ఏం చెబితే దానినే సింగపూర్ చేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు సూచించిన మేరకు తదుపరి దశ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని మంత్రి నారాయణ ద్వారా ఎప్పటికప్పుడు సింగపూర్ సంస్థలకు చేరుస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన కార్పొరేట్ సంస్థలు జురాంగ్, సుర్భానాలు ఉమ్మడిగా తయారుచేస్తుండడం తెలిసిందే. తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను అందించిన ఈ సంస్థలు ప్రస్తుతం మరో రెండు దశల తుది విడత ప్రణాళికల తయారీలో నిమగ్నమయ్యాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ ప్రణాళికలే కీలకం. గ త మార్చి 30న సింగపూర్‌లో తొలిదశ మాస్టర్‌ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేసినప్పుడు.. కీలకమైన మిగిలిన రెండు దశల ప్రణాళికలను జూన్‌నాటికి అందజేస్తామని సింగపూర్ వాణిజ్యమంత్రి ఎస్.ఈశ్వరన్ ప్రకటించడం విదితమే. అంతా నారాయణ ద్వారానే.. రాజధాని ప్రాంతంలో కీలక నిర్మాణాలు ఎక్కడెక్కడ రావాలన్న అంశంపై ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మార్పుచేర్పులపై ఎప్పటికప్పుడు సింగపూర్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం నుంచి సమాచారాన్ని చేరుస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మార్పుచేర్పులపై ఆయా సంస్థలతో మంత్రే సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి నారాయణ, ఆయన శాఖకు చెందిన ఉన్నతాధికారులు మినహా మార్పుచేర్పుల విషయాలను మరే ఇతర అధికారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. నూతన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి రంగానికి చెందిన పరిశ్రమలను ప్రతిపాదించాలి? ఎక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టాలి? వంటి విషయాలను సింగపూర్ కంపెనీలకు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మున్సిపల్‌శాఖ సింగపూర్ కంపెనీలకు అందజేస్తోంది. అలాగే నూతన రాజధానిలో ఆయా నిర్మాణాలకయ్యే ఖర్చు అంచనాలను కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలే సింగపూర్ కంపెనీలకు తెలియజేసి ఆ మేరకు మార్చాలని కోరుతున్నారు. అందుకనుగుణంగా సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నాయి. వారానికోసారి సింగపూర్‌కు.. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన తుది దశకు చేరుతున్నందున తాము చేసిన మార్పుచేర్పులను మరోసారి పరిశీలించడానికి మంత్రి నారాయణతో ఆయన ఎంచుకున్న అధికారులు సింగపూర్ వెళ్లాలని నిర్ణయించారు. సీఎం సూచనల మేరకు.. తుది విడత మాస్టర్ ప్రణాళిక రూపకల్పనను పర్యవేక్షించడంతోపాటు అది తుదిరూపు సంతరించుకునేదాకా నాలుగు వారాలపాటు వారానికోరోజు చొప్పున మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులు సింగపూర్ వెళ్లనున్నారు. వీరి పర్యటనలకు సంబంధించిన ప్రతిపాదనలను మున్సిపల్ శాఖ మంగళవారం సాధారణ పరిపాలన శాఖకు పంపించింది. కాగా సింగపూర్ కంపెనీ ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే సింగపూర్ కంపెనీలు ఉచితంగా మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయట్లేదని, అందుకు ప్రతిఫలంగా నూతన రాజధానిలో భూములను కేటాయించేందుకు అంతర్గతంగా ఒప్పందం కుదిరినట్టు గతంలోనే వార్తలు రావడం తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్రప్రభుత్వం నూతన రాజధాని నగర అభివృద్ధి పేరుతోఅంతర్గత ప్రతిపాదనలను రూపొందించింది. సింగపూర్ మంత్రి హోటల్ బిల్లు రూ.4.03 లక్షలు ⇒ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదారాబాద్: సింగపూర్ వాణిజ్య మంత్రి ఎస్.ఈశ్వరన్‌తోపాటు ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందం గత జనవరిలో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఓ హోటల్లో బసచేసినందుకైన బిల్లు రూ.4.03 లక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది జనవరి 11 నుంచి 13వ తేదీ వరకూ మూడు రోజులపాటు సింగపూర్ బృందం ఇక్కడి స్టార్ హోటర్‌లో బస చేసింది. కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వచ్చినందున ఆ బిల్లును ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బిల్లును సంబంధిత హోటల్‌కు చెల్లించాలని సీఆర్డీఏను ఆదేశించారు. వాస్తవానికి ఈ బిల్లును మున్సిపల్ అధికారులు చెల్లించాలని ఫైలు వచ్చింది. అయితే ఈ ఫైలును మున్సిపల్‌శాఖ తిరస్కరించింది. వచ్చిన ఫైలును వెంటనే జీఏడీ పొలిటికల్ విభాగానికి తిప్పిపంపించింది. అయితే ప్రభుత్వమే బిల్లు చెల్లించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ భారాన్ని ఇప్పుడు సీఆర్డీఏపై వేసింది. విధిలేని పరిస్థితుల్లో సీఆర్డీఏ నుంచి ఈశ్వరన్ హోటల్ బిల్లు రూ.4.03 లక్షలను చెల్లిస్తున్నారు. కాగా సింగపూర్‌కు చెందిన సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్(ఎస్సీఈ), సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్సీ) సంస్థలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమానికి అందించిన కన్సల్టెన్సీ సేవలకుగాను లక్షా యాభైవేల అమెరికన్ డాలర్లతో పాటు పన్నులను అదనంగా కలిపి(దాదాపు కోటీ ఐదు లక్షల రూపాయలు) ప్రభుత్వమే చెల్లించింది. డీపీఆర్‌కు రూ.500 కోట్లు మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి 2014 డిసెంబర్ 8న సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్(ఐఈ-సింగపూర్)తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఐఈ మాత్రం మాస్టర్‌ప్లాన్ తయారీ బాధ్యతను కార్పొరేట్ సంస్థలు సుర్భానా, జురాంగ్లకు అప్పగించింది. అయితే ఒప్పందం కుదుర్చుకున్న తొలిదశలో ఉచితంగా మాస్టర్‌ప్లాన్ అందిస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతర్గతంగా ప్రభుత్వం ప్రతిపాదించింది భిన్నంగా ఉంది. ‘కన్సల్టెన్సీ చార్జెస్ ఫర్ మాస్టర్‌ప్లానింగ్ అండ్ డీపీఆర్ ప్రిపరేషన్’ కోసం ఏకంగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దీనిపై సింగపూర్ కంపెనీలతో అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఈ ప్రణాళికలన్నింటినీ అందజేయగానే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాల్సిఉంది. ఆ మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ సంస్థలను ఎంపిక చేయడానికి వీలుగా స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని ఇటీవల మంత్రిమండలి తీర్మానించడం తెలిసిందే. -
100 ఎకరాలు నజరానా!
-
100 ఎకరాలు నజరానా!
సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్ ఒప్పందం వెనుక భారీ డీల్ సాక్షి, హైదరాబాద్: రాజధాని మాస్టర్ ప్లాన్ వెనుక భారీ డీల్ ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చసాగుతోంది. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఉచితంగానే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇస్తోందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అసలు దీని వెనుక ఏముందా అనే అంశంపై ఆరా తీయగా కళ్లు చెదిరే విషయాలు బయటపడ్డాయి. రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న భూమిలో 2,000 ఎకరాల వరకు భూమిని రాజధాని నగరం కోసం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందని.. అయితే వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించే భూమి మొత్తాన్ని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సింగపూర్ కంపెనీ చేతిలో పెట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా ఆ భూమిని అభివృద్ధి చేసే బాధ్యతలను పూర్తి స్థాయిలో సింగపూర్ కంపెనీకి అప్పగించనున్నారు. అంతేకాకుండా వాణిజ్య భూమిలో ఏకంగా 100 ఎకరాలను సింగపూర్ కంపెనీకి మాస్టర్ ప్లాన్ తయారు చేసినందుకు నజరానాగా ఇవ్వనున్నట్లు తేలింది. ఇటీవల సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన కొంత మంది ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి తెలియజేశారు. దీంతో అధికార యంత్రాంగం విస్తుపోయింది. ఇప్పుడు రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఎకరం పది కోట్ల రూపాయల ఖరీదు పలుకుతోందని, వాణిజ్య అవసరాలకు తగినట్లు అభివృద్ధి చేస్తే ఎకరం 15 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంటే 1,000 కోట్ల రూపాయల నుంచి 1,500 కోట్ల రూపాయల విలువగల 100 ఎకరాలను సింగపూర్ కంపెనీకి కేటాయించనున్నట్లు తేలింది. ఈ విధంగా కేటాయింపులు చేయడం ద్వారా కొంత మంది పెద్దలకు తెరవెనుక భారీ ఎత్తున ప్రయోజనాలు కలగనున్నట్లు అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ సింగపూర్ కంపెనీ రూపొందించినందున ఆ భూమి అభివృద్ధిని కూడా ఆ కంపెనీయే చేపడితే వ్యత్యాసాలు లేకుండా ఉంటుందనే సాకుతో ఆ కంపెనీకి అప్పగించడానికి ప్రభుత్వం ఎత్తు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ సమీకరణ కూడా అభివృద్ధి చేసే కంపెనీ చేపడుతుందని కూడా రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలకు లెసైన్స్‌లను కూడా మంజూరు చేసే అవకాశాన్ని చట్టంలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీలకు భూ సమీకరణతో పాటు ఆ భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే పనులను అప్పగించనున్నట్లు స్పష్టం అవుతోంది.