చతుర్ముఖ వ్యూహం
రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణానికి చతుర్ముఖ వ్యూహంతో
కూడిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు.
1. ప్రధాన పరిపాలన కేంద్రం
2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం)
3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం)
4. అమరావతి వాటర్ ఫ్రంట్(అమరావతి నదీ ముఖం)గా
రాజధాని కేంద్ర ప్రాంతాన్ని విభజించారు.
1. అమరావతి ప్రధాన పరిపాలన కేంద్రం (అమరావతి గవర్నమెంట్ కోర్)
ఇది అమరావతి రాజధాని నగరంలో అత్యంత కీలకమైనది. ప్రధాన పరిపాలన కేంద్రాన్ని లింగాయపాలెం సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించారు. శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ గృహాలు, ప్రాంతీయ వైద్య శాలలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, నగర గ్యాలరీలను ఈ కేంద్రంలో నిర్మిస్తారు. కార్యాలయాలకు ఉద్యోగులు సులభంగా వెళ్లడానికి వీలుగా ప్రత్యేక నడక, సైకిల్ మార్గాలు, 100 మీటర్ల వెడల్పుతో కూడిన సువిశాలమైన రహదారులు, మెట్రో రైలు మార్గాలు నిర్మిస్తారు.
2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం)
రాజధాని నగరంలో ప్రధానమైన వాణిజ్య కేంద్రం ఇది. ఉద్దండరాయనిపాలెం సమీపంలో ప్రధాన వాణిజ్య కేంద్రాన్ని నిర్మిస్తారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం భారీ భవంతులను నిర్మిస్తారు. వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లను ఏర్పాటుచేస్తారు.
3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం)
రాజధాని అమరావతికి ఇది ముఖద్వారం. తాళ్లాయపాలెం అమరావతికి ముఖద్వారం కానుంది. కృష్ణా నదిపై తాళ్లాయపాలెం సమీపంలో అత్యాధునిక హంగులతో వారధిని నిర్మిస్తారు. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ నుంచి 30 నిమిషాల్లోగా రాజధాని ప్రధాన కేంద్రానికి చేరుకునేలా ఈ వారధి మీదుగా రహదారిని నిర్మిస్తారు. తాళ్లాయపాలెం వద్ద రాజధాని ప్రత్యేకతను చాటిచెప్పేలా ఐకానిక్ టవర్లను నిర్మిస్తారు. ముఖద్వారాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, వినోదం కోసం చిత్తడి నేలలతో కూడిన ఉద్యానవనం(వెట్‌ల్యాండ్ పార్క్)ను ఏర్పాటు చేయనున్నారు.
4. అమరావతి వాటర్‌ఫ్రంట్ (అమరావతి నది ముఖం)
రాజధాని ప్రజల వాణిజ్య, వినోద కార్యకలాపాల కోసం అమరావతి నది ముఖంను నిర్మించనున్నారు. ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో వాటర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రజలకు వినోదం పంచేలా నది ముఖాన్ని తీర్చిదిద్దనున్నారు. కన్వెన్షన్ సెంటర్, ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్, అమరావతి ప్లాజా, సాంస్కృతిక, కళా కేంద్రాలు నె లకొల్పనున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన ఇలా..
* అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా అమరావతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు.
* తాగునీరు:ప్రజల అవసరాలకు రోజుకు 95.7 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం అవుతాయని అంచనా. అందుకు పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగుపై రిజర్వాయర్లు నిర్మించనున్నారు.
24 గంటల విద్యుత్: సీడ్ కేపిటల్‌కు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి 398.5 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ విద్యుత్‌ను సీడ్ కేపిటల్‌కు సరఫరా చేయడానికి వివిధ కెపాసిటీల్లో సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. సరఫరాకుభూమిలో(అండర్‌గ్రౌండ్) కేబుల్ వేస్తారు.
రవాణా సదుపాయం: సీడ్ కేపిటల్‌లో 88 కిమీల పొడవున రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు.