సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ | Kiran Prabha Kanti and Kiran interview in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ

Published Fri, Dec 20 2024 10:27 AM | Last Updated on Fri, Dec 20 2024 10:34 AM

Kiran Prabha Kanti and Kiran interview in Singapore

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు ఆద్వర్యంలో "కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో" ఇష్టాగోష్టి కార్యక్రమం ఉత్సాహంగా  సాగింది. 18  డిసెంబర్, బుధవారం మధ్యాహ్నం  నిర్వహించిన ఆ ముఖాముఖీలో కౌముది మాసపత్రిక సంపాదకులు, కిరణ్ ప్రభ ప్రసంగించారు.  

అలాగే కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి అయిందని, ఏ నెలా ఆలస్యం కాకుండా 1వ తేదీనే విడుదల అవ్వడం వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అది మనకు పని పట్ల ఉన్న నిభద్దతగా  భావించి విడుదలలో జాప్యం రానివ్వమని అన్నారు. అలాగే దాదాపు 1300 టాక్ షోలను కూడా నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని  రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని అంతే కాకుండా ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అబిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. అదే విధంగా వారి టాక్ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు, అదే విధంగా కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయసహకారాలు ఎలా ఉంటాయో వివరించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ కౌముది పత్రిక ప్రారంభించినప్పుడు ఇంతమంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.

సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికలు ద్వారా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ వారిని పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్ష్యులు తోటకూర ప్రసాద్ కి ధన్యవాదములు తెలియచేసారు. అలాగే సింగపూర్ లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజుకి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేస్తూ, వర్కింగ్ డే అయినా కానీ 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనటం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి  రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30  మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న  అతిధులందరికి  విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేసారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement