Real estate business
-
నమ్మించాడు.. నట్టేట ముంచాడు
రాయవరం: రియల్ ఎస్టేట్ వ్యాపారినంటూ ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు.3 నెలలుగా డబ్బులు అడుగుతుంటే సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో బాధితులు పదే పదే అడగడం ప్రారంభించారు. చివరకు ఇల్లు విడిచి పరారవ్వడంతో బాధితులంతా రోడ్డున పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామం పల్లపువీధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రి వెంకటరెడ్డి(దొరబాబు) గ్రామంలోని పల్లపు వీధిలో నివాసం ఉంటున్నాడు. స్థిరాస్థిని కలిగి ఉండడం.. మోతుబరి కుటుంబాలతో ఇరువురు కుమార్తెలకు వియ్యం అందడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పడంతో పలువురు అతని వద్ద డబ్బులు మదుపు చేశారు. పలువురు రూ.లక్షలను దొరబాబు వద్ద ఉంచారు. మాచవరం, సోమేశ్వరం గ్రామాలతో పాటుగా, అనపర్తి మండలం పులుగుర్త, రామకోట తదితర గ్రామాలకు చెందిన 45 మంది దొరబాబు వద్ద పొదుపు చేసిన సొమ్మును మదుపు చేశారు. ఈ విధంగా సుమారు రూ.4.5 కోట్ల వరకు మదుపు చేసినట్లు బాధితులు తెలిపారు. 3 నెలలుగా దాచుకున్న డబ్బులను తమ అవసరార్థం తిరిగి ఇవ్వాలని దొరబాబును కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు విషయాన్ని స్థానిక గ్రామ పెద్దల వద్దకు తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడం.. దొరబాబు ఇంటి వద్ద లేక పోవడంతో బాధితులంతా దొరబాబు ఇంటి ముందు ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. తాము దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోరారు. -
ఫార్మా సిటీ భూములతో రియల్ దందా చేస్తావా..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మాసిటీ కోసం హైదరాబాద్‌కు సమీపంలో సేకరించిన 15 వేల ఎకరాల భూములతో సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని, ఇందులో పది వేల ఎకరాలు తన అనుయాయులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మాజీమంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి.. నువ్వు సీఎంవా, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా అంటూ హరీశ్ నిలదీశారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఇప్పుడు ఫార్మా విలేజ్ పేరుతో డప్పూరుపై ఈ రాయి పడిందన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూరులో ఫార్మా విలేజ్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మద్దతు గా జరిగిన రచ్చబండకు హరీశ్‌రావు హాజర య్యారు. ప్రభుత్వం సేకరిస్తున్న పంట పొలా లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ పచ్చని పల్లెల్లో ఫార్మా విలేజీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్వాసితుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమా వేశాల్లో దీనిపై మాట్లాడతామని, మూడు పంటలు పండుతున్న ఈ భూముల్లో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని, బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నిస్తే బాధి తుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. మూసీ ని శుద్ధి చేస్తానని చెప్పి అక్కడి పేదల ఇళ్లు కూల్చి వేస్తున్న రేవంత్‌రెడ్డి.. డప్పూరు పచ్చని పంట పొలాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసి ఇక్కడి చెరువులు, కుంటలు, పక్కనే ఉన్న మంజీర నదిని విషంతో నింపుతావా అని హరీశ్‌రావు నిలదీశారు. రాహుల్.. రేవంత్‌కు బుద్ధి చెప్పు..‘మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టుడు.. వారి భూములు కొల్ల గొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా ’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ గరీబీ హఠావో అంటే.. రేవంత్‌రెడ్డి గరీబోంకో హఠావో చేస్తున్నారని మండిపడ్డారు. పేదల భూములు లాక్కోవొద్దని రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ వెంట ఆ పార్టీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూరం శివకుమార్ తదితరులు ఉన్నారు. -
ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త అరాచకాలు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త గళ్లా రామచంద్రరావు అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ రైతును బెదిరించడమేకాకుండా, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు కూడా గళ్లా రామచంద్రరావుకే మద్దతు పలుకుతుండటంతో బాధితుడు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. పెదకూరపాడు నియోజకవర్గం పీసపాడు గ్రామానికి చెందిన కమ్మ వెంకటరావు గుంటూరు విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి పిడుగురాళ్లలో సుమారు 8 ఎకరాల పొలం ఉంది. గళ్లా రామచంద్రరావుకు చెందిన భ్రమర రియల్ ఎస్టేట్‌కు గతంలో వెంకటరావు ఎకరం రూ. 48 లక్షలు చొప్పున 4.90 ఎకరాలు అమ్మాడు. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ నాలుగున అగ్రిమెంట్ చేసుకుని మూడు చెక్కులు రామచంద్రరావు ఇచ్చాడు. ఆ చెక్కుల్లో రెండు బౌన్స్ అయ్యాయి. ఇది కాకుండా తాను అమ్మకుండా ఉన్న మిగిలిన భూమిలో భ్రమర వారు మట్టి తోలుతున్నారని తెలిసి వెంకటరావు వెళ్లి అడిగితే.. కాళ్లు విరగ్గొడతానని రామచంద్రరావు బెదిరించాడు. దీంతో వెంకటరావు గురజాల కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తాము అగ్రిమెంట్ చేయించుకున్న 4.90 ఎకరాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజి్రస్టేషన్ కోసం భమ్రర వారు ప్రయతి్నంచగా.. 1బీ అడంగల్‌లో 3.90 ఎకరాలు మాత్రమే కనపడుతుండటంతో అంతవరకే రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి వెంకటరావుకు డబ్బులు చెల్లించి బౌన్స్ అయిన చెక్కులు వెనక్కి తీసేసుకున్నారు. ఎన్నికలు అవ్వగానే వేధింపులు ఎన్నికలు ముగిసి రామచంద్రరావు భార్య మాధవి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెంకటరావుకు వేధింపులు మొదలయ్యాయి. రిజి్రస్టేషన్ చేయకుండా మిగిలిన ఎకరాతో పాటు వెంకటరావు అమ్మకుండా ఉన్న 3 ఎకరాల 7 సెంట్ల భూమి రూ. 30 లక్షలు ఇస్తామని, రామచంద్రరావుకు పుట్టిన రోజు గిఫ్టుగా ఆ భూమి అంతా రిజి్రస్టేషన్ చేయాలంటూ రామచంద్రరావు అనుచరులు ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపుతాం అంటూ బెదిరించారు. ఈ క్రమంలో గడిచిన శనివారం వెంకటరావు, అతని కుమారుడు హరికృష్ణ బయటకు వచ్చి తిరిగి వెళ్తుంటే వారి బండిని ఢీకొట్టి దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత పట్టాభిపురం పోలీసులు వెంకటరావు, అతని కుమారుడికి వేరేవారితో ఫోన్ చేయించి మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యిందని, ఎమ్మెల్యే కాళ్ల మీద పడి మాట్లాడుకోండి అని చెప్పించారు. దీంతో పోలీసుల వద్దకు వెళ్తే తమకు న్యాయం దక్కదని భావించిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. గుంటూరుకు రామచంద్రరావే సీఎం లాంటివాడని, అతనిని కాదంటే బతకలేరంటూ తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి ఇటీవలే ఇంటికి వచి్చన తనపై కూడా తప్పుడు కేసు నమోదు చేశారని, తమ ప్రాణాలకు ఏమైనా జరిగితే రామచంద్రరావే బాధ్యత వహించాలని హరికృష్ణ ఆవేదన వెలిబుచ్చాడు. -
కన్న కొడుకును కడతేర్చిన తండ్రి
మన్సూరాబాద్/హయత్‌నగర్: మద్యం తాగి కుటుంబ పరువు తీస్తున్నాడని కలత చెందాడో..ఆస్తి తగాదాలు ఉన్నాయో తెలియలేదు కానీ..ఓ తండ్రి కన్న కొడుకును కడతేర్చాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామానికి చెందిన కలగోని శ్రీనివాస్‌గౌడ్ గత కొంత కాలంగా మునగనూరులోని రామాంజనేయకాలనీ రోడ్‌నెంబర్–7 స్వంత ఇంటిలో నివాసం ఉంటూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వినయ్ (28) ఐదు సంవత్సరాల క్రితం ప్రవల్లికను ప్రేమించి పెళ్లి చేసుకుని సమీపంలోని ఓ ఇంట్లో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి రెండేళ్ల పాప రక్షిత ఉంది. ఇటీవల కొద్ది కాలంగా వినయ్ తరచుగా మద్యం తాగి తండ్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసానికి వచ్చి వ్యాపారం చేసుకుంటా డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడ్డాడు. వ్యాపారం చేసుకుంటా..ఆస్తిలో తన భాగం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అలాగే మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. చేసేది లేక శ్రీనివాస్‌గౌడ్ రూ.500 మద్యానికి ఇచ్చాడు. అనంతరం వినయ్ మద్యం తెచ్చుకుని తాగి మరింతగా ఇంట్లో గొడవకు దిగాడు. దీంతో ఆవేశానికి లోనైన శ్రీనివాస్‌గౌడ్ అక్కడే ఉన్న ఇనుప పారతో వినయ్ తలపై గట్టిగా బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై వినయ్ కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు ఆస్తి తగాదాలే కారణమని కూడా తెలుస్తోంది. హయత్‌నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ నేపథ్యంలో... ‘రియల్’ జోష్!
నిన్నటివరకు స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కదలిక వచ్చింది. సీఎం కేసీఆర్ కామారెడ్డినుంచి పోటీ చేస్తారన్న ప్రకటన వ్యాపారుల్లో ఒక్కసారిగా జోష్ తెచ్చింది. సీఎం పోటీచేస్తే అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు వస్తాయని ఆశిస్తున్న జనం.. భూముల ధరలకూ రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో రియల్ దందాకు తిరుగుండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, కామారెడ్డి: ఊపుమీదున్న రియల్ దందా ను కరోనా దెబ్బకొట్టింది. భూముల క్రయ, విక్రయాలు గణనీయంగా తగ్గాయి. వైరస్ ప్రభావం దాదాపు రెండేళ్ల పాటు ఉండింది. రియల్ దందాలో పెట్టుబడులు పెట్టిన వారు చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులపాలయ్యారు. కరోనా మూలంగా ప్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నించినా కొనేవారు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్న ధరకన్నా తక్కువకు అమ్ముకుంటే నష్టపోతామన్న భావనతో కొందరు వ్యాపారులు వడ్డీలకు వడ్డీలు కట్టి నష్టపోయారు. ఇప్పుడిప్పుడే దందా కోలుకుంటున్నా.. మునుపటి జోష్‌లేదు. వెంచర్లు చేసి వాయిదాల పద్ధతిన ప్లాట్లు విక్రయించే ప్రయత్నాలు చేసినా జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. ధరలు అడ్డగోలుగా పెరగడంతో ప్లాట్లు కొనేవారు తగ్గిపోయారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ధరలు కామారెడ్డిలో ఉండడంతో డబ్బులున్నవారు అక్కడే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. మధ్య తరగతి అందుకోలేనంతగా భూముల ధరలు పెరిగిపోయాయి. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది. కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడే నాటికే ఇక్కడ భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. జిల్లా అయిన తర్వాత మరింతగా పెరిగి సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోనూ పెద్ద ఎత్తున ప్లాట్ల దందాతో రూ. కోట్లల్లో వ్యాపారం నడిచింది. ఊహిచనంతగా సాగిన రియల్ దందాతో కొందరు ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇక్కడ డబ్బులు సంపాదించిన వారు 44వ నంబరు జాతీయ రహదారిపై రామాయంపేట, చేగుంట, తూప్రాన్, మేడ్చల్ దాకా భూములు కొనుగోలు చేశారు. ఎక్కడ వెంచర్లు చేసినా అందులో కామారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యాపారుల భాగస్వామ్యం ఉండింది. ప్లాట్ల దందాతో పాటు నిర్మాణ రంగంలోనూ వ్యాపారులు ఆరితేరారు. హైదరాబాద్‌లోనూ భారీ అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మించి విక్రయించే స్థాయికి ఎదిగారు. అందనంత స్థాయిలో... కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం సామాన్యుడికి భారంగానే మారింది. పట్టణంలో ఇళ్ల మధ్య ప్లాటు తక్కువలో తక్కువ గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఇల్లు నిర్మించుకునేందుకు ప్లాటు కొనుగోలు చేయాలంటే వంద గజాలకు రూ.20 లక్షలు వెచ్చించాల్సిందే. మధ్య తరగతి ప్రజలకు ఇది భారమే.. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సరిపోని సంపాదనతో ఇప్పటికే ప్లాట్లు కొనే పరిస్థితి లేకుండాపోయింది. ప్లాట్ల ధరలు ఇంకా పెరిగితే సామాన్యుడు ఆశలు వదులుకోవాల్సిందేనన్న భావన వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్ వర్గాల్లో నూతనోత్సాహం కొంతకాలంగా వ్యాపారం దెబ్బతిని ఇబ్బందు ల్లో ఉన్న రియల్ వ్యాపారులు, ఏజెంట్లలో సీఎం కేసీఆర్ కామారెడ్డినుంచి పోటీ చేస్తారన్న ప్రకటన ఉత్సాహాన్నిచ్చింది. సీఎం పోటీ చేస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో భూముల క్రయవిక్రయా లు పెరుగుతాయని, రియల్ బూం వస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశిస్తున్నారు. ఎవరి ని కదిలించినా కామారెడ్డిలో రియల్ దందా పరుగులు తీస్తుందని చెబుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన దేవునిపల్లి, టేక్రియాల్, లింగాపూర్, ఇల్చిపూర్, అడ్లూర్, రామే శ్వర్పల్లి, నర్సన్నపల్లి, సరంపల్లి, పాతరాజంపే ట, పొందుర్తి తదితర గ్రామాలతోపాటు తాడ్వాయి, పాల్వంచ, దోమకొండ, భిక్కనూరు, రాజంపేటల పరిధిలోని భూములు, ప్లాట్ల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. -
ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల సెటైర్
సాక్షి, హైదరాబాద్: ‘బీ ది ఛేంజ్ యు వాంట్ టూ సీ’అంటూ 33% మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సలహా ఇచ్చారు. నిజంగా కవితకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే..రానున్న ఎన్నికల్లో 33% అమలు చేయించాలని మంగళశారం ఆమె ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవిత తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలన్నారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇస్తే చిత్తశుద్ధి ఉన్నట్టా అని నిలదీశారు. తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా కేబినెట్లోనూ ప్రాధాన్యత దక్కలేదన్నారు. లిక్కర్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి.. కేబినెట్లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలంటూ సెటైర్ వేశారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి అని మండిపడ్డారు. -
బోయిన్‌పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని బోయిన్‌పల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తిని ఫయాజుద్దీన్ హత్య చేశాడు. సిద్ధిఖీని దారుణంగా నరికి చంపేశాడు.రియల్ ఎస్టేట్ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఫయాజుద్దీన్‌తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రూ.4 కోట్లతో రియల్టర్ పరారీ పట్టిస్తే రూ.3 లక్షలిస్తాం
జగిత్యాల క్రైం: దొంగల్ని పట్టిస్తే నగదు బహుమానం ఇస్తాం.. అంటూ పోలీసులు ప్రకటించడం చూసే ఉంటారు. కానీ జగిత్యాలలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పులు చేసి పారిపోవడంతో.. అతన్ని పట్టిస్తే రూ.3 లక్షల నజరానా.. అంటూ బాధితులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. జగిత్యాల జిల్లా గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న కుటుంబంతో సహా 15 రోజులుగా కనిపించడం లేదు. వెంకన్న చాలాకాలంగా చిట్టీలు నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. నమ్మకంగా ఉండటంతో చాలామంది నమ్మి అతనికి సుమారు రూ.4 కోట్ల వరకు అప్పు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. వెంకన్న పదిహేను రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో ‘గాండ్ల వెంకన్న కనిపించడం లేదు.. ఆయనను పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తాం’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. -
వంశీరామ్ బిల్డర్స్: కొనసాగుతున్న ఐటీ సోదాలు.. హవాలా రూపంలో నగదు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్పై ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంతోపాటు కార్యాలయాల్లో మంగళవారం రాత్రి పొద్దుపోయే దాకా సోదాలు జరిపిన అధికారులు బుధవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, సోదాల్లో భాగంగా వంశీరామ్ బిల్డర్స్ ఉద్యోగుల ఖాతాల్లో భారీగా లావాదేశీలు గుర్తించారు. 15 బృందాలతో 19 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణాలు సాగిస్తోంది. కాగా, మొదటి రోజు సోదాల్లో భాగంగా వంశీరామ్ బిల్డర్స్ పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు తమ సోదాల్లో గుర్తించినట్లు సమాచారం. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు.. ఆ ఖాతాలన్నీ సంస్థ బినామీ ఖాతాలుగా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ సంస్థ లావాదేవీల్లో మనీల్యాండరింగ్ కోణం కూడా అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఈ సంస్థ తన వినియోగదారులకు విక్రయించిన నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన లావాదేవీల్లో సగం మొత్తాన్ని వైట్‌గా, మరో సగం బ్లాక్‌గా వసూలుచేసినట్లు సమాచారం. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటి నుంచి నిధులు మళ్లించారని చెబుతున్నారు. దాడుల్లో పలు కీలక పత్రాలు, పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా సంస్థ పెద్దఎత్తున ఇతరులతో ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. అధికారులు మంగళవారం ఉదయం నుంచి మొత్తం 36 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. వినియోగదారుల నుంచి నగదు రూపంలో తీసుకున్న మొత్తాన్ని యాజమాన్యం హవాలా ద్వారా తరలించినట్లు చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వంశీరామ్ సంస్థ నగరంలోనూ, ఇతర ప్రాంతాల్లో పెద్దఎత్తున వెంచర్లను వేసింది. నివాస ప్రాంతాల కంటే అధికంగా వాణిజ్య భవనాలను విలువైన ప్రాంతాల్లో నిర్మించింది. -
రియల్ ఎస్టేట్ గొడవలకు కుటుంబం బలి
ఖలీల్‌వాడి (నిజామాబాద్‌అర్బన్)/ఆదిలాబాద్ టౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాముల వేధింపుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొత్తకొండ సూర్యప్రకాశ్ కుటుంబం ఏడెనిమిదేళ్లనుంచి నుంచి హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. సూర్యప్రకాశ్ కొంతమంది పార్ట్‌నర్స్‌తో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వెంచర్ నిర్వహణలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. వ్యాపార నిర్వహణకు ఇంకా పెట్టుబడి పెట్టాలని భాగస్వాములు అతనిపై ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో సూర్యప్రకాశ్ నివాసానికి పార్ట్నర్స్ వెళ్లి గొడవపడినట్లు తెలిసింది. సూర్యప్రకాశ్‌ను అతని భార్య, కూతురు, కుమారుడిని కొట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. వీరి వేధింపులు తాళలేక సూర్యప్రకాశ్ కుటుంబం ఈ నెల 4న నిజామాబాద్‌లోని ఓ హోటల్లో దిగింది. అప్పటినుంచి హోటల్లోని రూం నంబర్ 101 లోనే ఉంటున్నారు. కాగా, ఆదివారం ఉదయం హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి తలుపు తట్టగా ఎంత సేపటికీ తెరుచుకోకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగో టౌన్ పోలీసులు గదిని తెరిచారు. లోపల కొత్తకొండ సూర్య ప్రకా శ్ (37) ఉరి వేసుకుని చనిపోగా భార్య అక్షయ (36), కూతురు ప్ర త్యూష (13) కొడుకు అద్వైత్ (10) విష ప్రభావంతో మృతి చెందారు. కేక్‌లో విషం కలిపి ముందుగా భార్య, కూతురు, కుమారుడికి తినిపించి వారు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత సూర్యప్రకాశ్ చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావి స్తున్నారు. హోటల్ గదిలో సూర్యప్రకాశ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సూసైడ్ నోట్లో కొందరు రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ వేధిస్తున్నట్లు పేర్కొంటూ, వారి పేర్లు రాశారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌కు వలస వెళ్లి సూర్యప్రకాశ్ తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ అనుసూయ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబం నలభై ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వలస వెళ్లింది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌లో హార్డ్‌వేర్ షాప్ ఏర్పాటు చేశారు. చిన్న కుమారుడైన సూర్యప్రకాశ్ ఆది లాబాద్లోనే పుట్టి పెరిగారు. వీరి కుటుంబం హార్డ్‌వేర్ షాప్ తో పాటు పట్టణంలో పెట్రోల్‌బంక్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వృద్ధి చెందడంతో సూర్యప్రకాశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారంకోసం ఏడెనిమిదేళ్ల క్రితం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు మకాం మా ర్చారు. సూర్యప్రకాశ్ భార్య అక్షయది ఆదిలాబాద్ జిల్లా జైన థ్ మండలం దీపాయిగూడ గ్రామం. కాగా హైదరాబాద్‌లో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. లాక్డౌన్ సమ యంలో శంకరంపేట సమీపంలో భాగస్వాములతో కలసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వ్యాపా రంలో నష్టం రావడంతో అప్పుల కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. దానికితోడు బిజినెస్ పార్ట్నర్లు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈనెల 4న హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు వచ్చి ఓ హోటల్లో దిగారు. రెండు, మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లోని వారి బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతంలో సైతం కుటుంబ సమేతంగా పాల్గొన్నారని తెలిసింది. -
హైదరాబాద్‌లో చెలరేగిపోతున్న రియల్టీ,గృహ విక్రయాల్లో సరికొత్త రికార్డ్‌లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోతుంది. గృహ విక్రయాలు, లాంచింగ్‌లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి – జూన్ (హెచ్1)లో ఇళ్ల అమ్మకాలు 11ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. కరోనా కారణంగా పెరిగిన ఐటీ నియామకాలు, ఉద్యోగులలో ఆదాయ వృద్ధితో గృహ విక్రయాలు ఊపందుకున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది. 2022 హెచ్1లో నగరంలో 14,693 గృహాలు అమ్ముడుపోగా.. 21,356 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ♦ నగర సిరాస్తి మార్కెట్‌కు ఆయువు పట్టు ఐటీ రంగమే. గృహాలు, ఆఫీస్ స్పేస్ ఏదైనా ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకొనే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతుంటాయి. వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే ఇళ్ల విక్రయాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. కరోనా కారణంగా ఐటీ కంపెనీలకు విపరీతమైన ప్రాజెక్ట్‌లు వచ్చాయి. దీంతో కొత్త ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున జరగడంతో వారందరూ వారి వారి బడ్జెట్లో ఇళ్లను కొనుగోలు చేశారని నైట్‌ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. పశ్చిమానిదే హవా.. 2021 హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది హెచ్1లో గృహ విక్రయాలలో 23 శాతం, లాంచింగ్స్‌లో 28 శాతం వృద్ధి నమోదయింది. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో 9,112 యూనిట్లు అమ్ముడుపోగా.. నార్త్‌లో 2,615, సెంట్రల్లో 835, ఈస్ట్‌లో 1,363, దక్షిణంలో 768 గృహాలు విక్రయమయ్యాయి. 4.2 శాతం పెరిగిన ధరలు.. ఏడాది కాలంలో నగరంలో ప్రాపర్టీ ధరలలో 4.2 శాతం వృద్ధి నమోదయింది. ప్రస్తుతం ధర చ.అ. సగటు రూ.4,918గా ఉంది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్1లో 11918 యూనిట్లుగా ఉండగా.. 2022 హెచ్1 నాటికి 25262లకు పెరిగాయి. వీటి విక్రయానికి 4.60 త్రైమాసికాల సమయం పడుతుంది. కోలుకుంటున్న ఆఫీస్ స్పేస్ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కరోనా కంటే ముందు స్థాయికి చేరుకుంటుంది. 2019 హెచ్1లో నగరంలో 38 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 32 లక్షల చ.అ.లకు చేరింది. అయితే గతేడాది హెచ్1లో జరిగిన 16 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 101 శాతం ఎక్కువ. 2015 నుంచి ఇప్పటివరకు నగరంలో అత్యధిక ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగిన అర్ధ సంవత్సరం 2019 హెచ్2నే. ఆ సమయంలో రికార్డ్ స్థాయిలో 89 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు పూర్తయ్యాయి. 2022 హెచ్1లో జరిగిన ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే పైచేయి. 2021 హెచ్1లో ఈ రంగం వాటా 12 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 22 శాతానికి పెరిగింది. మిగిలిన రంగాల వాటా చూస్తే ఐటీ 39 శాతం, కో–వర్కింగ్ స్పేస్ 6 శాతం, తయారీ రంగం 3 శాతం, ఇతర సేవల రంగాల వాటా 30 శాతంగా ఉన్నాయి. ♦ అదే సమయంలో కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణాలలో కూడా వృద్ధి నమోదయింది. గతేడాది హెచ్1లో కేవలం 80 వేల చ.అ. ఆఫీస్ స్పే స్ అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది హె చ్1 నాటికి 53 లక్షల చ.అ. స్థలం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నగరంలో చ.మీ. ఆఫీస్ స్పేస్ అద్దె రూ.63.7గా ఉంది. -
రియాల్టీ రంగంలో ఈ విభాగానికి భారీ డిమాండ్!
న్యూఢిల్లీ: దేశంలో కార్యాలయాల వసతి (ఆఫీసు స్పేస్) వృద్ధి అవకాశాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు టాటా రియల్టీ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కంపెనీల నియామకాలు డిమాండ్‌ను నిర్ణయిస్తాయని పేర్కొంది. ఏడు ప్రధాన పట్టణాల్లో ఆఫీసు స్పేస్ లీజింగ్ 2022లో 30 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. 2021లో లీజు పరిమాణం 26 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. చాలా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకాలు తిరిగి మొదలయ్యాయని టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ తెలిపారు. ‘‘కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో వాణిజ్య కార్యకలాపాలు ఇప్పటికే జోరందుకున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడం కూడా పెరగనుంది. ముందస్తు సంకేతాలను గమనిస్తే 2022లో కార్యాలయల వసతి లీజు గతేడాది సంఖ్యను అధిగమిస్తుందని తెలుస్తోంది’’అని దత్ వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
టాప్‌గేర్‌లో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టాప్‌గేర్‌లో పడింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 308 శాతం వృద్ధి నమోదయింది. 2021 క్యూ3లో 6,735 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది క్యూ2లో ఇది 3,240 యూనిట్లుగా ఉన్నాయి. త్రైమాసికంతో పోలిస్తే 108 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో నగరంలో 1,650 గృహ విక్రయాలు జరిగాయి. కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. 2021 క్యూ3లో 14,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో 8,850 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. త్రైమాసికంతో పోలిస్తే 66 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో 4,900 గృహాలు ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంతో పోలిస్తే 67 శాతం వృద్ధి రేటు. ► కరోనా మహమ్మారి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా తేరుకుంటోంది. ఉద్యోగ భద్రత పెరగడం, వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలవుతుండటంతో, ఐటీ/ఐటీఈఎస్ రంగాలలో నియామకాలు జోరందుకోవటం, గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, డెవలపర్ల ఆకర్షణీయమైన పథకాలు.. కారణాలేవైనా నగర రియల్టీ రంగంలో జోష్ నెలకొంది. నిర్మాణ కారి్మకులలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్పై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇన్వెంటరీ, నిర్మాణంలో ఉన్న గృహాలను విక్రయిం చడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. దీంతో గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో 67 శాతం వృద్ధి నమోదయితే, విక్రయాల్లో మాత్రం 308 శాతం పెరుగుదల కనిపించింది. కొనుగోలుదారులు పెద్ద సైజు గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దేశవ్యాప్తంగా 62,800 ఇళ్ల విక్రయం.. హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది క్యూ3లో 62,800 ఇళ్లు అమ్ముడుపోయాయి. క్యూ2లో 24,560 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే క్యూ2తో పోలిస్తే 156 శాతం వృద్ధి. ఇక గతేడాది క్యూ3లో చూస్తే 29,520 ఇళ్లు విక్రయమయ్యాయి. అంటే 113 శాతం పెరుగుదల. ► ఇక కొత్త గృహాల ప్రారంభాలు చూస్తే.. ఈ ఏడాది క్యూ3లో మొత్తం 64,560 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో 36,260 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే గత త్రైమాసికంతో పోలిస్తే 78 శాతం పెరుగుదల. గతేడాది క్యూ3లో 32,530 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంటే ఏడాదితో పోలిస్తే 98 శాతం వృద్ధి రేటు. ఈ ఏడాది క్యూ3లోని లాంచింగ్స్లలో రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్యస్థాయి ఇళ్ల వాటా 41 శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ప్రీమియం గృహాల వాటా 25 శాతం, రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ వాటా 24 శాతంగా ఉన్నాయి. ► నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో 2021 క్యూ3లో ధరలు 3 శాతం మేర పెరిగాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో చ.అ. ధర సగటున రూ.5,760గా ఉంది. గతేడాది క్యూ3లో చ.అ. సగటు ధర రూ.5,600గా ఉండేది. ► ప్రాపరీ్టలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుతం నిలబడగలుగుతారు. ఒక్క మన నగరంలోనే.. ఈ ఏడాది క్యూ3లో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ 130 శాతం వృద్ధి రేటు నమోదు కాలేదు. గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ ఏడాది క్యూ3లో నగరంలో ఇళ్ల అమ్మకాలలో 308 శాతం పెరుగుదల కనిపించగా.. ముంబైలో 128 శాతం, చెన్నైలో 113 శాతం, పుణేలో 100 శాతం, కోల్‌కతాలో 99 శాతం, ఎన్సీఆర్లో 97 శాతం, బెంగళూరులో 58 శాతం వృద్ధి రేటు నమోదయింది. -
ఇలాంటి పాడి ఆవు అక్కడ వద్దా?
భూమి హైదరాబాద్‌కు నలువైపులా ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లా చంద్రబాబు మార్చకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేది! అందుకే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖలో అసమానాభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ప్రభుత్వానికి పాడి ఆవులా ఉందని అనుకోవాలి. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ఒక్క హైదరాబాద్ నగరం ద్వారానే వచ్చే కొద్ది నెలల్లో ప్రభుత్వానికి సుమారు 20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని పత్రికలు ఈ మొత్తం 30 వేల కోట్లకుపైగానే ఉంటుందని కథనాలు ఇస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలలో కచ్చితంగా ఇంత మొత్తం వస్తుందని చెప్పలేకపోయినా, భారీగానే ప్రభుత్వానికి ఆర్జన రానుందని అర్థం అవుతుంది. ప్రధానంగా అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ బాగా ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25.5 లక్షల దరఖాస్తులు ఎల్.ఆర్.ఎస్.కోసం వచ్చాయి. వీటిలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలలో లక్షకు పైగా ఒక్కోచోట నుంచి వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. ప్రభుత్వం తొలుత పదివేల కోట్ల రూపాయల ఆదాయం దీనిద్వారా వస్తుందని అనుకుంటే, అంతా సజావుగా జరిగితే ఈ పద్దులో ఇరవైవేల కోట్ల రూపాయల పైగానే రావచ్చని చెబుతున్నారు. ఇక ఖాళీ స్థలాలపై పన్ను, రిజిస్ట్రేషన్ విలువల పెంపు వంటివి స్థూలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం రింగ్ రోడ్లకు అత్యంత సమీపాన కోకాపేట వంటి ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ఇప్పటికే 2,700 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ భూముల అమ్మకంపై ప్రతిపక్షం విమర్శలు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైనా పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వాటిని ఖండించింది. అది వేరే కథ. హైదరాబాద్ వంటి రాజధాని తెలంగాణకు ఖజానా వంటిదని చెప్పాలి. ఎందుకంటే వాణిజ్య పన్నుల రూపేణా, మద్యం షాపుల ఎక్సైజ్ ఆదాయం ద్వారా, తాజాగా భూముల రెగ్యులరైజేషన్ , రిజిస్ట్రేషన్ వంటి వాటిని ప్రభుత్వం చేపట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పడూ చెబుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయినట్లో కాదో కాని, హైదరాబాద్ వరకు తీసుకుంటే ఆయన చెప్పింది చాలావరకు కరెక్టు అని అంగీకరించాలి. ఉమ్మడి ఏపీకి రాజధానిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఏపీ, తెలంగాణలోని హైదరాబాదేతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. అనేక మంది రకరకాల వ్యాపారాలు చేపట్టారు. దానికి తోడు ఐటీ పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమి హైదరాబాద్‌కు నలువైపులా ఉండడం కలిసి వచ్చింది. దేశంలో ఇలా నాలుగువైపులా విస్తరించే నగరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కోకాపేట వంటి చోట్ల ఎకరం అరవైకోట్ల వరకు వెళ్లిందని అనుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ భూములు ఇలా అమ్మేస్తే భావితరాలకు, వారి అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నను విపక్షాలు సంధిస్తున్నాయి. భూముల అమ్మకం కేసీఆర్‌తోనే మొదలు కాలేదు. హైకోర్టు కూడా ఈ భూముల అమ్మకాన్ని ఆపలేదు. ఆక్రమణలకు గురయ్యేకన్నా అమ్మడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వ ఆలోచనలు వాస్తవరూపం దాల్చి ఒక్కసారిగా ముప్పైవేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరితే ప్రభుత్వం పంట పండినట్లే అనుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో పడిపోయిన ఆదాయాన్ని ఈ రకంగా సమకూర్చుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అదృష్టంగా అనుకోవచ్చు. ఇది హైదరాబాద్ కథ అయితే ఏపీలో అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల డబ్బు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అప్పట్లో సంకల్పించారు. వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లా మార్చారు. దానివల్ల ప్రభుత్వంకన్నా ప్రైవేటు వ్యక్తులకే అధికంగా మేలు కలిగింది. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఒక మాట చెప్పేవారు. రైతుల నుంచి సమీకరించిన భూములలో ప్లాట్లు వేసి, మౌలిక వసతులు సమకూర్చి, ప్రభుత్వ అవసరాలకు వాడుకోగా ప్రభుత్వం అమ్ముకోవడానికి మిగిలేది పెద్దగా ఉండదని అనేవారు. పైగా అటవీభూములతో సహా సుమారు ఏభైవేల ఎకరాల మేర విస్తీర్ణం అభివృద్ధి కావాలంటే పాతిక, ముప్పై ఏళ్లు పట్టవచ్చన్నది ఒక అభిప్రాయం. చంద్రబాబు ఈ రియల్ ఎస్టేట్ మోడల్లో కాకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసి అమ్మే విధంగా ఏర్పాటు చేసుకుని ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేదేమో! చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అన్నిటినీ పరిశీలించి, ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేస్తే, మిగిలిన రాష్ట్రం అంతా అన్యాయం అవుతుందని భావించి మూడు రాజధానులను ప్రతిపాదించింది. వీటిలో తెలివైనది విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసుకోవడం. కోర్టుల ద్వారా ఇతరత్రా అడ్డంకులు రాకపోతే, విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అటు విజయనగరం శ్రీకాకుళం వైపు, ఇటు అనకాపల్లి, తుని వైపు బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ భూములు కూడా గణనీయంగానే ఉన్నాయి. ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు. అక్కడకు ఇప్పటికే ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలో అక్కడకు తరలిస్తే, హైదరాబాద్ మాదిరే అది కూడా ఏపీకి మంచి ఆదాయ వనరు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే పలు పరిశ్రమలు ఉన్నాయి. ఐటీతో సహా వివిధ రంగాల పరిశ్రమలు అక్కడకు వస్తే నగరం ఊపు అందుకుంటుంది. అయితే హైదరాబాద్‌లో అంతా కేంద్రీకరణ అవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఒక వైపు కోకాపేటలో భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగిందని సంతోషించే పరిస్థితి అయితే, మరో వైపు కాస్త భారీ వర్షాలు వస్తే వందల కాలనీలు వరదనీటిలో నానే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ధనిక ప్రాంతాలు పెరుగుతున్నాయని అనుకునే లోపే పేదవాడలు కూడా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో కోకాపేట తదితర ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. విశాఖలో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం ఏపీకి పెద్ద లోటే కావచ్చు కానీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ–గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు వంటి నగరాలు ఉండటం కూడా ఉపయుక్తమే. కాకపోతే వాటిని సరైన దిశలో అభివృద్ధి చేసుకోగలిగితే ఏపీ కూడా హైదరాబాద్‌లాగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అప్పట్లో అంతా ఒకేచోట కేంద్రీకరించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు, ఇతరులు పదేపదే అడ్డుపడుతున్నారు. ఏపీలో ఉన్న నగరాలకు కొన్ని బలాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే తమిళనాడులో మాదిరి ఆయా నగరాలకు గుర్తింపు వస్తుంది. ఉదాహరణకు చెన్నై రాజధాని అయినా, కోయంబత్తూరు, సేలం, మదురై తదితర నగరాలు బాగా వృద్ధి చెందాయి. ఒక్కో నగరం ఒక్కో రంగంలో విశిష్టత పొందింది. ఈ అనుభవాలను అధ్యయనం చేసి ఏపీలోని నగరాలను కూడా తీర్చిదిద్దాలి. కాని విశాఖ అభివృద్ధికే ప్రతిపక్షం అడ్డుపడుతోంది. న్యాయ వ్యవస్థ ద్వారానో, మరో రకంగానో ప్రతి విషయంలో ఆటంకాలను సృష్టిస్తోంది. వీటన్నిటిని అధిగమించి జగన్ ప్రభుత్వం ముందుకు సాగాల్సి ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
సాక్షి, ముంబై: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల చిన్నా చితకా వ్యాపారులతో పాటు బడా వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోయారు. అయితే, కరోనా గడ్డు కాలంలో సైతం రియల్ ఇస్టేట్ రంగం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలో గడచిన ఆరు నెలల కాలంలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయం గణనీయంగా పెరిగింది. నగరంలో రూ. 15 నుంచి రూ. 100 కోట్లు విలువ చేసే లగ్జరీ ఫాట్ల విక్రయం వల్ల ఏకంగా రూ. 4 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదికలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఎన్ని లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయనే దానిపై అధ్యయనం చేసి ఆ వివరాలను పొందుపరిచారు. కరోనా కాలంలో స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మళ్లీ ఊపందుకునేలా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్టాంప్ డ్యూటీలో రాయితీ ప్రకటించింది. మార్చి 31 వరకు కొనుగోలుదారులు కేవలం రెండు శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీన్ని అదనుగా చేసుకున్న అనేక మంది లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తం 60 శాతం ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు మార్చి 31కి ముందే జరిగాయి. ముఖ్యంగా సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే లగ్జరీ ఫ్లాట్లకే ఎక్కువ ఆసక్తి కనబర్చినట్లు రిజిస్ట్రేషన్ల సరళిని బట్టి తెలిసింది. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అత్యధిక శాతం లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం లావాదేవీల్లో 60 శాతం లోయర్ పరేల్‌లోనే జరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదికలో పేర్కొంది. -
రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ఉపాధి కల్పనలో 11 శాతం వాటాతో ఎకానమీలో రియల్ ఎస్టేట్ కీలకమైన రంగంగా ఉంటోందని ఆయన వివరించారు. ‘2019–20లో జీడీపీలో రియల్టీ రంగం వాటా దాదాపు 7 శాతం. సుమారు 200 బిలియన్ డాలర్ల మేర వృద్ధికి దోహదపడింది. 2030 నాటికి ఎకానమీ 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో సుమారు 10 శాతం వాటా రియల్ ఎస్టేట్ నుంచి రానుంది. అంటే.. 2030 నాటికి ఈ రంగం 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని దాటేయవచ్చని అంచనాలు ఉన్నాయి‘ అని మిశ్రా వివరించారు. ఉపాధి కల్పన విషయంలోనూ రియల్టీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. 50 కోట్ల ఉద్యోగాల్లో దాదాపు 5.5 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్‌కామ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), పరిశ్రమ సమాఖ్య నారెడ్కో కలిసి రూపొందించిన ఇళ్ల ధరల సూచీని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మిశ్రా ఈ విషయాలు వివరించారు. గత ఏడేళ్లుగా రియల్టీ రంగం గణనీయ మార్పులకు లోనైందని రెరా చట్టం ఇందులో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, నాగాలాండ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమలవుతోందన్నారు. హైదరాబాద్ సహా 8 నగరాల్లో.. హౌసింగ్‌డాట్‌కామ్, ఐఎస్బీలోని శ్రీని రాజు సెంటర్ ఫర్ ఐటీ అండ్ నెట్వర్క్డ్ ఎకానమీ (ఎస్ఆర్ఐటీఎన్ఈ) రూపొందించిన సూచీ (హెచ్పీఐ).. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడగలదని మిశ్రా తెలిపారు. దీన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ తరుణంలో కొనుక్కోవచ్చన్న విషయంలో కొనుగోలుదారులు, ఎప్పుడు విక్రయించుకుంటే శ్రేయస్కరమో అటు విక్రేతలు తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. ఆయా నగరాల్లో అమ్ముడైన యూనిట్లు, ధరలకు సంబంధించిన నెలవారీ నివేదికలు ఇందులో ఉంటాయి. రియల్టీ రంగంలో ధోరణులను విధానకర్తలు, ఆర్థికవేత్తలు తెలుసుకునేందుకు కూడా ఈ సూచీ ఉపయోగపడనుంది. హౌసింగ్‌డాట్‌కామ్ అనుబంధ సంస్థ ప్రాప్‌టైగర్ ఇప్పటికే డిమాండ్,సరఫరా, ధరలు, అమ్ముడు కాకుండా ఉన్న ఇళ్ల డేటాను మూణ్నెల్లకోసారి అందిస్తోంది. -
లగ్జరీ గృహాలకు తగ్గిన డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో నెలన్నర కాలంగా దేశంలో లగ్జరీ గృహాలకు డిమాండ్ తగ్గింది. గతేడాది లాగా పరిస్థితులు కొంత వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత విక్రయాలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత సప్లయి కారణంగా కొన్ని ప్రాంతాలలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు కొంత పెరుగుతాయని, మిగిలిన ప్రాంతాలలో స్థిరంగా ఉంటాయని తెలిపారు. ‘ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)లో మా నివాస ప్రాజెక్ట్‌లన్నీ వేగంగా, మంచి ధరల పనితీరును కనబరిచాయని’ హైన్స్ ఇండియా ఎండీ అండ్ కంట్రీ హెడ్ అమిత్ దివాన్ తెలిపారు. గృహ కొనుగోలుదారులు పేరున్న డెవలపర్ల నుంచి నాణ్యమైన గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 తొలి దశ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లగ్జరీ, విశాలమైన గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ సీఈఓ అమిత్ గోయల్ చెప్పారు. గతేడాది పెట్టుబడి విభాగంగా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని, లగ్జరీ హౌసింగ్‌లో భారతీయులతో పాటు ప్రవాసులు కూడా విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారని ఎంబసీ గ్రూప్ రెసిడెన్షియల్ బిజినెస్ ప్రెసిడెంట్ రీజా సెబాస్టియన్ తెలిపారు. దేశంలో గత రెండేళ్లుగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే లగ్జరీ ప్రాపర్టీల ప్రారంభాలు లేవని.. నిరంతర డిమాండ్‌తో ధరల స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. లగ్జరీ గృహ కస్టమర్లు బ్రాండెడ్ డెవలపర్లు, రెడీ–టు–మూవ్ ప్రాజెక్ట్‌లకు, నాణ్యమైన గృహాలకు మాత్రమే ఇష్టపడతారని తెలిపారు. లగ్జరీ గృహాల కోసం హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు ఆసక్తిని కనబరస్తుండటంతో ఈ తరహా ప్రాజెక్ట్‌లకు నిరంతరం వృద్ధి నమోదవుతుందని చెప్పారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రవర్తన, త్వరితగతిన ప్రజలకు టీకాలు అనే అంశాల మీద ఆధారపడి రియల్టీ రంగం ఉంటుందని ప్రాప్‌టైగర్.కామ్ సీఓఓ మణి రంగరాజన్ అభిప్రాయపడ్డారు. అయితే ఆయా అంశాల మీద భయాలు ఉన్నప్పటికీ.. గత ఏడాది మాదిరిగా మార్కెట్ ప్రతికూలంలో ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలలో కోవిడ్ నియంత్రణలోకి వస్తే గనక డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. -
సానుకూలంగా రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్–డిసెంబర్ నాల్గో త్రైమాసికం (క్యూ4)లో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ సానుకూలంగా మారింది. దీంతో వచ్చే ఆరు నెలల కాలంలో నివాస, కార్యాలయాల విభాగంలో డిమాండ్ పుంజుకుంటుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా–ఫిక్కీ–నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన ‘27వ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్–క్యూ4, 2020’ సర్వే వెల్లడించింది. తొలిసారిగా 2020 క్యూ4లో కరెంట్ సెంటిమెంట్ స్కోర్ 54 పాయింట్స్‌తో ఆశావాద జోన్ (ఆప్టిమిస్టిక్)లోకి చేరిందని సర్వే తెలిపింది. క్యూ3తో పోలిస్తే 14 పాయింట్లు పెరిగింది. ఇక క్యూ4లో ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 65 పాయింట్లకు ఎగబాకింది. క్యూ3లో ఇది 52 పాయింట్లుగా ఉంది. స్కోర్ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఆశావాద జోన్, 50 పాయింట్లుగా ఉంటే న్యూట్రల్, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద (పెసిమిజం) జోన్‌గా పరిగణిస్తుంటారు. సానుకూల దృక్పథంతో మొదలైన కొత్త ఏడాదితో రాబోయే ఆరు నెలల్లో గృహాల అమ్మకాలు 77 శాతం మేర పెరుగుతాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. క్యూ3లో ఇది 66 శాతంగా ఉంది. క్యూ3లో 47 శాతంగా ఉన్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు క్యూ4 నాటికి 60 శాతానికి పెరిగాయి. చదవండి: రియల్ ఎస్టేట్ మళ్లీ జోరందుకుంది పెరిగిన హౌసింగ్ సేల్స్.. కారణాలు ఇవే! -
గృహ అమ్మకాలపై కరోనా దెబ్బ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం దేశీయ నివాస విభాగం మీద గట్టిగానే పడింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 47 శాతం క్షీణించి 1.38 లక్షలకు చేరాయి. అలాగే కొత్త గృహాల ప్రారంభాలు 46 శాతం క్షీణించి 1.28 లక్షలకు చేరాయి. 2019లో అమ్మకాలు 2.61 లక్షల యూనిట్లు కాగా.. ప్రారంభాలు 2.37 లక్షలుగా ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 2019లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6,48,400 కాగా.. 2020 నాటికి 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరాయి. కోవిడ్–19 వైరస్ ఊహిం చని విపత్కర సంవత్సరంగా నిలిచిందని అనరాక్ చైర్మన్ అనూజ్ పురీ చెప్పారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, గృహరుణ వడ్డీ రేట్ల తగ్గింపు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటివి గృహాల అమ్మకాల్లో కాసింత సానుకూలత నెలకొందని.. గత రెండు త్రైమాసికాల్లో పరిస్థితుల్లో కాసింత సానుకూల వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో... హైదరాబాద్‌లో గతేడాది 16,590 గృహాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 48 శాతం క్షీణించి 8,560 గృహాలకు పడిపోయాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలన్నీ కొత్త గృహాల ప్రారంభంలో క్షీణత నమోదైతే ఒక్క హైదరాబాద్‌లోనే వృద్ధి నమోదయింది. గతేడాది నగరంలో కొత్తగా 14,840 ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 42 శాతం వృద్ధితో 21,110 యూనిట్లకు పెరిగాయి. నగరాల వారీగా అమ్మకాలు... ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అత్యధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇక్కడ 44,320 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఎంఎంఆర్‌లో 80,870 యూనిట్లు (45 శాతం క్షీణత) అమ్ముడుపోయాయి. బెంగళూరులో గతేడాది 50,450 గృహాలు కాగా.. ఇప్పుడవి 51 శాతం తగ్గి 24,910 యూనిట్లకు చేరాయి. పుణేలో 40,790 నుంచి 23,460 (51 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్లో 46,920 నుంచి 23,210 (42 శాతం), చెన్నైలో 11,820 నుంచి 6,740 (43 శాతం), కోల్‌కతాలో 13,930 నుంచి 7,150 (49 శాతం) తగ్గాయి. ఇతర నగరాల్లో లాంచింగ్స్.. గతేడాది ఢిల్లీ–ఎన్సీఆర్లో కొత్తగా 35,280 గృహాలు ప్రారంభం కాగా.. 2020 నాటికి 47 శాతం క్షీణించి 18,530లకు చేరాయి. ఎంఎంఆర్‌లో 77,990ల నుంచి 30,290లకు (61 శాతం), బెంగళూరులో 39,930 నుంచి 21,420లకు (46 శాతం), పుణేలో 46,110 నుంచి 23,920లకు (48 శాతం), చెన్నైలో 13,000 నుంచి 9,170లకు (29 శాతం), కోల్‌కతాలో 9,420 నుంచి 63 శాతం తగ్గి 3,530లకు తగ్గాయి. స్టాంప్ డ్యూటీ తగ్గిస్తేనే... న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో తగ్గిన గృహాల అమ్మకాలు తిరిగి పుంజుకోవాలంటే స్టాంప్ డ్యూటీ తగ్గించడమే ప్రత్యామ్నాయమని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిర్‌నందానీ సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కోవిడ్ సమయంలోనూ రికార్డ్ స్థాయిలో విక్రయాలు జరిగాయని ఉదహరించారు. ఇతర రాష్ట్రాలు కూడా స్టాంప్ డ్యూటీని తగ్గించాలని.. ఆయా రాష్ట్ర నరెడ్కో చాప్టర్లు ఈ అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం అద్దె గృహాలను ప్రోత్సహించాలని, గృహ రుణ వడ్డీని తగ్గించడంతో పాటు ఇన్వెంటరీ గృహాల మీద పన్నును మినహాయించాలని కోరారు. అఫర్డబుల్ అండ్ మిడ్–సైజ్ హౌసింగ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) కోసం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు. ఇలాంటి ఫండ్సే సుమారు నాలుగైదు కావాలని.. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలతో కలిసి ప్రభుత్వం రూ.1,25,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. -
రికవరీ ఆశలు- రియల్టీ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: ఒడిదొడుకుల మార్కెట్లోనూ రయల్టీ రంగ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. దీంతో తొలుత ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3 శాతం ఎగసింది. పలు కౌంటర్లకు డిమాండ్ ఏర్పడటంతో లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం.. షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 285 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 289 వరకూ ఎగసింది. ఈ బాటలో గోద్రెజ్ ప్రాపర్టీస్ దాదాపు 4 శాతం పెరిగి రూ. 1,105 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,122 వరకూ లాభపడింది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ సైతం 3 శాతం వృద్ధితో రూ. 196 వద్ద కదులుతోంది. తొలుత రూ. 201 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇతర కౌంటర్లలో ఇండియాబుల్స్ రియల్టీ 2.7 శాతం బలపడి రూ. 63 వద్ద ట్రేడవుతోంది. శోభా లిమిటెడ్ 1.25 శాతం పుంజుకుని రూ. 318 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 323 వరకూ పురోగమించింది. ఇదే విధంగా ఒబెరాయ్, సన్‌టెక్, బ్రిగేట్ సైతం 0.5 శాతం స్థాయిలో బలపడి ట్రేడవుతున్నాయి. కారణాలివీ.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో రియల్టీ రంగ కంపెనీలు సగటున ప్రోత్సాహకర ఫలితాలు సాధించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్)లో రెసిడెన్షియల్ విభాగం పటిష్ట పనితీరును చూపినట్లు తెలియజేశారు. తద్వారా నిర్వహణ లాభాలను సాధించినట్లు వివరించారు. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక రికవరీ రియల్టీకి డిమాండ్‌ను పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్, ఆతిథ్య రంగం నుంచి డిమాండ్ పెరిగే వీలున్నట్లు పేర్కొన్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెసిడెన్షియల్ విభాగానికి పన్నుసంబంధ మినహాయింపులను ప్రకటించడంతో సెంటిమెంటు బలపడినట్లు తెలియజేశాయి. అంతేకాకుండా పీఎంఏవై పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు కేటాయించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు విశ్లేషించాయి. -
అన్న హత్యకు పథకం.. తమ్ముడే హతం
యాచారం: అన్నను చంపించేందుకు అతడు పథకం వేశాడు. తన వ్యాపార భాగస్వామికి సుపారీగా కొంత డబ్బు కూడా చెల్లించాడు. సదరు భాగస్వామి వ్యాపారంలో డబ్బులు మిగులుతాయని భావించి చివరికి తమ్ముడినే చంపేశాడు. చౌదర్పల్లిలో దారుణహత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో పోలీసులు ముగ్గురి నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన అమీర్‌పేట సత్తయ్యకు తన అన్న బీరప్పకు మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో సత్తయ్య ఎలాగైన తన అన్నను హత్య చేయాలని పథకం వేశాడు. ఈమేరకు తన రియల్ ఎస్టేట్ భాగస్వామి అయిన కందుకూరుకు చెందిన ఎగ్గిడి రమేష్ సహకారం కోరాడు. సుపారీగా రూ.4 లక్షలు మాట్లాడుకుని అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చాడు. తన అన్నను తొందరగా హత్య చేయాలని ఎగ్గిడి రమేష్‌పై సత్తయ్య ఒత్తిడి తీసుకొచ్చాడు. భూములు, ప్లాట్ల కొనుగోళ్లలో భాగంగా సత్తయ్య వద్ద ఎగ్గిడి రమేష్ పెద్దమొత్తంలో డబ్బును అప్పుగా తీసుకున్నాడు. తాజాగా ఓ డీల్‌లో పెద్దమొత్తంలో వీరి చేతికి డబ్బు అందాల్సి ఉంది. ఈ సమయంలో ఎగ్గిడి రమేష్ పథకం వేశాడు. తన భాగస్వామి సత్తయ్యనే హత్య చేస్తే సుపారీగా తీసుకున్న రూ. 50 వేలు, వ్యాపారం కోసం అప్పుగా తీసుకున్న డబ్బులు, చేతికి అందాల్సిన నగదు అంతా తనకే దక్కుతుందని ప్లాన్ వేశాడు. చంపేసి.. ప్రమాదంగా చిత్రీకరించి.. ఈక్రమంలో ఈ నెల 18న సాయంత్రం సత్తయ్య.. తన అన్న బీరప్ప పొలం వద్ద ఒంటరిగా ఉన్నాడని, వెంటనే నీ అనుచరులతో వచ్చి అతడిని చంపేయాలని సత్తయ్య రమేష్‌కు ఫోన్ చేశాడు. రమేష్ ముందస్తు పథకం ప్రకారం.. అమీర్‌పేట సత్తయ్యను హత్య చేయడానికి.. నీవు వెంటనే గునుగల్ అటవీ ప్రాంతంలోకి వస్తే మాట్లాడుకుందామని పిలిచాడు. సత్తయ్య వచ్చాక ‘నీవు ముందు బైకుపై వెళ్లు.. మేము వెనుకాలే వస్తామ’ని నమ్మించాడు. ఆ తర్వాత ఎగ్గిడి రమేష్ తన అనుచరులైన కందుకూరు మండలం నేదునూర్‌కు చెందిన బాత్క శ్రీశైలం, కందుకూరు నివాసి పిల్లి శేషగిరితో కలిసి కారులో వెళ్లారు. గునుగల్– పెద్దతుల్ల మధ్య అటవీ ప్రాంతంలోని రోడ్డుపై సత్తయ్యను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన సత్తయ్యను కర్రలు, ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అదేరోజు రాత్రి 10:30 గంటలకు సమాచారం అందడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి,యాచారం సీఐ లింగయ్య తదితరులు వివరాలు సేకరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగి.. సత్తయ్యను ఎగ్గిడి రమేష్, అతడి అనుచరులే చంపేసినట్లు గుర్తించారు. ఈమేరకు ముగ్గురు నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. -
దమరి పేరుతో నమ్మినవారికి ‘దరువు’!
పంజగుట్ట: అనుమతి లేని లేఔట్లను చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో డబ్బు వసూలు చేసి మోసం చేసిన కేసులో ‘దమరి ఎస్టేట్స్’ యజమానికి చెరువుపల్లి సుమన్‌బాబును పంజగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా, రాయదుర్గం గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు. గతంలో ఇతడి వ్యవహారాలపై ఆరా తీయడానికి ప్రయత్నించిన పోలీసులనే బెదిరించిన ఉదంతాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సుమన్ బీఏ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్‌కు వలసవచ్చి కళ్యాణినగర్‌లో స్థిరపడ్డాడు. తొలుత ‘సిరి మీడియా’ పేరుతో ఓ యాడ్ ఏజెన్సీ నిర్వహించిన ఇతను ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ద్వారకపురి కాలనీలో ‘దమరి ఎస్టేట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆపై దీనిని అమీర్‌పేటకు మార్చాడు. భూ యజమానులకు డబ్బు చెల్లించకుండా, అవసరమైన అనుమతులు లేకుండా దందా నిర్వహించేవాడు. తొలుత ఆయా వెంచర్స్ పేరుతో ఆకర్షణీయమైన కరపత్రాలు రూపొందించడమేగాక, మీడియాలో ప్రకటనలు గుప్పించి పలువురిని ఆకర్షిస్తాడు. షాదనగర్ సమీపంలోని ఫారూఖ్ నగర్లో విల్లాలు నిర్మించి ఇస్తామని, తక్కువ ధరకు ప్లాట్లు అంటూ పలువురిని ఆకర్షించాడు. వారి మాటలు నమ్మి అనిత రెండు విల్లాలు బుక్ చేసుకుంది. ఒక్కో విల్లాకు రూ.29 లక్షల చొప్పున ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.14 లక్షలు బ్యాంకు అకౌంట్ ద్వారా సుమన్‌కు బదిలీ చేశారు. 10 రోజుల్లోనే విల్లా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిన ఇతను అలా చేయకపోవడంతో అనుమానం వచ్చిన అనిత నిలదీసింది. దీంతో కొన్నాళ్లుగా ఆమెకు మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ద్వారకా పురిలోని దమరి కార్యాలయానికి వెళ్లగా... అమీర్‌పేటలోని సిరి ఎస్టేట్స్ మార్చినట్లు తెలిసింది. సుమన్ బాబు ఇదే తరహాలో అనేక మందిని మోసం చేసినట్లు గుర్తించిన ఆమె పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుమన్ బాబు గ్రీన్‌ల్యాండ్స్–2, శివపార్వతి డైమండ్ స్పేస్ పేరుతో వెంచర్స్ అంటూ ప్రచారం చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం సుమన్ బాబును అరెస్టు చేశారు. అతడి చేతిలో లేదా ఈ సంస్థ ద్వారా మోసపోయిన వారు తమను ఆశ్రయించాలని పంజగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి కోరారు. బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘రియల్’ వ్యాపారం దెబ్బతిందనే టీడీపీ బాధ
పలమనేరు : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అండ్ కో అమరావతిలో చేపట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మునిగిపోయిందనే ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని, నిజంగా వారికి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టే లేదని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ విమర్శించారు. పలమనేరులోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఎలాంటి ప్రత్యేక ఉద్యమాలకు తావు లేకుండా సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీన్ని రాష్ట్రంలోని ప్రజలు, మేధావులు స్వాగతిస్తుంటే టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదన్నారు. రాజధాని నిర్మాణంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. తాత్కాలిక భవనాలు కట్టి రూ.5వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్నారని, వారికి వెంటనే వెనక్కు ఇచ్చేస్తామని చెప్పడంతో చంద్రబాబుకు దిక్కుతోడం లేదని అన్నారు. రాజమౌళి గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టి చేసిన రాజకీయం బెడిసికొట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధి సాధిస్తాయని ఇప్పటికే మేధావులు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ పలమనేరు పట్టణ, గంగవరం కన్వీనర్లు మండీసుధా, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రియల్.. ధర వింటే దడేల్!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో ‘రియల్’ బూమ్ మళ్లీ జోరందుకుంది.. పల్లె, పట్టణం తేడా లేకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా భూముల ధరలు రూ.కోట్లకు చేరాయి. ప్రధానంగా రహదారుల వెంట ఉన్న భూముల రేట్లు మూడు, నాలుగింతలు పెరిగాయి. కొన్నిచోట్ల గజం జాగా ధర రూ.లక్ష వరకు పలుకుతోంది. డబ్బు ఉన్నోళ్లంతా భూముల వెంట పడ్డారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుందామంటే రకరకాల సమస్యలు తలెత్తుతుండడం, ఫైనాన్సుల్లో పెట్టుబడులు పెడితే నమ్మకం లేకుండా పోవడంతో చాలా మంది భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులంతా రియల్ దందా మీదనే దృష్టి సారించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చా యి. ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారే క్రమంలో ధర రెండింతలవుతోంది. గతంలో పట్టణ ప్రాంతాల్లోనే కనిపించిన రియల్ దందా ఇప్పుడు మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. దీంతో అంతటా ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఇక రాష్ట్రీయ, జాతీయ రహదారుల వెంట అయితే స్థలాల ధరలు రూ.కోట్లకు చేరాయి. జిల్లా మీదుగా వెళ్తున్న బెంగుళూరు–నాగ్‌పూర్ హైవేతో పాటు సంగారెడ్డి–నాందేడ్–అకోలా జాతీయ రహదారి, అలాగే కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, మెదక్–ఎల్లారెడ్డి–బాన్సువాడ–బోధన్ రహదారులపై భూముల ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరాయి. 44వ జాతీయ రహదారిపై భిక్కనూరు మం డలం బస్వాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, పొం దుర్తి, కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి, క్యాసంపల్లి, రామేశ్వర్‌పల్లి, ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్, సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్, అడ్లూర్ఎల్లారెడ్డి, పద్మాజీవాడి చౌరస్తా, పద్మాజివాడి, మర్కల్, కల్వరాల్, దగ్గి వరకు ఎకరా రూ.50 లక్షలకు పైనే ధర పలుకుతోంది. భిక్కనూరు, కామారెడ్డి మండలాల పరిధిలోనైతే రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు నడుస్తోంది. 161వ నంబరు జాతీయ రహదారి అయిన సంగారెడ్డి–నాందేడ్–అకోలా రహదారి వెంట కూడా భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఈ రహదారిపై నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాలు ఉన్నా యి. పిట్లం మండల పరిధిలో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నడుస్తుండగా, పెద్ద కొడప్గల్లో మాత్రం రూ.కోటి నుంచి రూ.కోటి 20 లక్షలు అమ్ముడు పోతోంది. మద్నూర్‌లో రూ.60 లక్షలు నడుస్తోంది. జాతీయ రహదారికి లోపల ఉన్న బిచ్కుంద మండల కేంద్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు నడుస్తోంది. జాతీయ రహదారులుగా గుర్తించిన మెదక్–ఎల్లారెడ్డి– బాన్సువాడ రోడ్డుతో పాటు కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం రహదారుల పక్కన గల భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎకరాకు రూ.80 లక్షల వరకు నడుస్తోంది. ఇటీవల బంజెరతండా వద్ద రూ.50 లక్షలకు ఎకరం కొనుగోలు చేశారు. మండల కేంద్రంలో గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల రూ.అర కోటి నుంచి రూ.కోటి వరకు నడుస్తోంది. నిజాంసాగర్ మండలంలో మాత్రం రూ.30 లక్షలు పలుకుతోంది. బాన్సువాడ పట్టణ శివార్లలో ఎకరానికి రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నడుస్తుండగా, దూరాన ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి ఇరువైపులా రూ.50 లక్షల వరకు ధర పలుకుతోంది. కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి రహదారిపై జిల్లా ప్రవేశ ప్రాంతమైన మాచారెడ్డి మండలంలో ఎకరాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఈ రహదారి వెంట మాచారెడ్డి మండలంలోని గన్పూర్(ఎం), మాచారెడ్డి, మాచారెడ్డి చౌరస్తా, చుక్కాపూర్, లక్ష్మిరావులపల్లి, పాల్వంచమర్రి, పాల్వంచ, భవానీపేట, కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామాల పరిసరాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల భూములు రియల్టరులు కొనుగోలు చేసి ప్లాట్లుగా అమ్ముకున్నారు. ఇదే రహదారిపై ఉన్న తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లోనూ ధర అడ్డగోలుగా నడుస్తోంది. ► గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూముల ధరలు దడ పుట్టిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇక్క డి స్థలాలు ధర పలుకుతున్నాయి. ఇక్కడ గజం జాగా ధర అక్షరాల రూ.లక్ష. దీంతో భూమిని గజాలతోపాటు ఇంచులలో కూడా లెక్కించే పరిస్థితి ఉంది. ఇక గాంధారి గ్రామం లో పలు ప్రాంతాలలో ఎకరాకు రూ.కోటి నుంచి రూ.కోటి 20 లక్షల వరకు ధర పలుకుతోంది. ►జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఎకరం భూమి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. జిల్లా ఏర్పాటైన తరువాత ఇక్కడ భూముల ధరలు మరింతగా పెరిగాయి. పట్టణంలో ప్లాట్ల ధరలు గజానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు, పట్టణ శివార్లలో రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తున్నారు. ► జిల్లాకు ముఖ ద్వారమై న భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరాకు రూ.కోటి వరకు ధర పలుకుతోంది. భిక్కనూరు మండల కేంద్రానికి ఇరువైపులా రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఎకరం అమ్ముతున్నారు. రియల్టర్లు కొనుగోలు చేసి, ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ► జిల్లా కేంద్రానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో, మారుమూలన ఉన్న పెద్దకొడప్గల్ మండల కేంద్రం వ్యాపార కేంద్రం కూడా కాదు. కానీ అక్కడ భూమి ధర అడ్డగోలుగా పెరిగిపోయింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూమి ఇటీవల ఎకరాకు రూ. 1.20 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ భూమిని రియల్టర్లు ప్లాట్లుగా చేసి విక్రయానికి పెట్టగా, చాలా వరకు అమ్ముడు పోయాయి. భారీ ఎత్తున క్రయ, విక్రయాలు.. పారిశ్రామిక వేత్తలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు భూముల కొనుగోళ్లపై దృష్టిని పెట్టారు. దీంతో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో టోకున వంద, వంద యాభై ఎకరాల చొప్పున క్రయ విక్రయాలు సాగుతున్నాయి. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న కామారెడ్డి, తాడ్వాయి, భిక్కనూరు, దోమకొండ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, గాంధారి తదితర మండలాల్లో వేలాది ఎకరాల భూములు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. భూములు కొనుగోలు చేయడం, చుట్టూ ఫెన్సింగ్ చుట్టడం, వాల్స్ కట్టడం ద్వారా భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసుకుంటున్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులే మధ్యవర్తులు.. భూముల క్రయ,విక్రయాల్లో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. మధ్యవర్తిత్వం ద్వారా అడ్డగోలు కమీషన్లు లభిస్తుండడంతో చాలా మంది రాజకీయ నేతలు రియల్ వ్యాపారంలోకి దిగి దూసుకు పోతున్నారు. గతంలో ద్విచక్ర వాహనాలపై తిరిగిన నేతలు ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో సంచరిస్తున్నారంటే భూముల దందాలో వచ్చిన అడ్డగోలు లాభాలేనన్న విషయం బహిరంగ రహస్యం. పలుకుబడి ఉన్న కొందరు నాయకులు వివాదాలున్న భూములను ఎంతకో కొంతకు కొనుగోలు చేయడం, ఆ తర్వాత వివాదాలను ఎలాగోలా సెటిల్ చేసుకుని రెట్టింపు ధరకు అమ్ముకోవడం ద్వారా విపరీతంగా ఆర్జిస్తున్నారు. మొత్తంగా రియల్ భూమ్ ఫలితంగా సామాన్యుడు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. -
‘రియల్’కు ‘రైతుబంధు’!
సాక్షి, మిర్యాలగూడ (నల్గగొండ): మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన ప్లాట్లుగా మార్చిన వెంచర్లకు కూడా రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందుతోంది. వెంచర్లకు రైతుబంధు ఏమిటి అనుకుంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. కొందరు రియల్ వ్యాపారులు వ్యవసాయ భూములను కొని వెంచర్లుగా ఏర్పాటు చేసినప్పటికీ నాలాపన్ను చెల్లించకపోవడంతో రికార్డుల ప్రకారం ఆ వెంచర్లు వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఏంచక్కా వాటికి రైతుబంధు వర్తింపజేసినట్టు సమచారం. దీంతో రియల్ వెంచర్లకు రైతుబంధు అందుతుందన్న సంగతి హాట్‌టాపిక్‌గా మారింది. మిర్యాలగూడ డివిజన్లో కొత్త దందా ఇది.. రైతుల పేరుమీద ఉన్నప్పటికీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వాటికి కూడా రైతుబంధు అందుతుండడం గమనార్హం. ఇక్కడ రియల్‌వ్యాపారులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ నాలా పన్ను చెల్లించకపోవడం.. రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండడంతో వారికి రైతుబంధు నగదు సాయం అందుతోంది. మిర్యాలగూడ పట్టణ సమీపంతో పాటు మండలంలోని చింతపల్లి, హైదలాపురం, గూడూరు, శ్రీనివాస్‌నగర్, బాదలాపురం, ఆలగడప గ్రామాలలో పలు రియల్ ఎస్టేట్ భూముల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇటీవల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ హైదలాపురం సమీపంలో చూసిన సర్వే నంబర్ 4, 218లలో కూడా కనీసం నాలా కూడా చెల్లించలేదని తేలింది. ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసినా రైతులు రామ్మూర్తి పేరున 7.04 ఎకరాలు, విజయలక్ష్మి పేరున 1.30 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేలింది. దాంతో వ్యవసాయ భూమిగా ఉన్న ఈ భూమికి కూడా ఇటీవల రైతుబంధు పథకాన్ని అధికారులు వర్తింపజేసినట్లు సమాచారం. పరిశీలన బృందం ఏర్పాటుకే పరిమితం.. అనధికారిక లేఅవుట్లను మిర్యాలగూడ పట్టణం, మండలంలోని గుర్తించడానికి గాను ఆర్డీఓ జగన్నాథరావు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో మున్సిపల్, పంచాయతీరాజ్, సర్వేయర్ ఉన్నారు. మున్సిపాలిటీ, మండలంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను పరిశీలించి నాలా పన్ను చెల్లించారా? లేదా? అనే విషయంతో పాటు లేఅవుట్‌కు అనుమతి ఉందా? లేదా? పరిశీలించాలి. అనుమతి లేని లేఅవుట్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కోవడంతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అనధికారిక లేఅవుట్లను పరిశీలించే బృందం కేవలం ఏర్పాటుకే పరిమితం కాగా లేఅవుట్లను పరిశీలించడం లేదు. ఇప్పటికైనా అనుమతి లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ.. అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. అనుమతి లేఅవుట్లపై చర్యలేవీ? మిర్యాలగూడ మున్సిపాలిటీ, సమీప గ్రామంలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అటు గ్రామపంచాయతీ, ఇటు మున్సిపల్‌శాఖ అనుమతులు లేకుండా వెలుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనధికారిక లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలు జారీ చేయగా ఆర్డీఓ జగన్నాథరావు, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, ఎంపీడీఓ దేవిక పరిశీలించారు. కానీ ఒక్కరోజు పరిశీలనలోనే పది ఎకరాల భూమి నాలా పన్ను కూడా చెల్లించలేదని తేలినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు కేవలం లేఅవుట్‌ను పరిశీలించి వదిలేశారు. -
రియల్ భూమ్
రియల్ భూమ్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్ధంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. రిజిస్ట్రేషన్ల శాఖకు రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంచింది. ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు చోట్లు తప్పితే అన్నిచోట్ల దస్తావేజులు (డాక్యుమెంట్ల) సంఖ్య, రెవెన్యూ ఆదాయం గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖకు తొలిసారిగా ఆదాయం పెరగడం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: రెవెన్యూ ఆదాయం, దస్తావేజుల సంఖ్య పరంగా పరిశీలిస్తే మంచిర్యాలలో రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట్, ఖానాపూర్ వరుసగా నిలిచాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత క్రమంగా ఊపందుకుంటున్న రియల్ మార్కెట్ 2018–19లో గణనీయంగా పెరిగింది. పట్టణ ప్రాంతం విస్తరించడం, పట్టణ శివారు గ్రామాల్లో రియల్ వెంచర్లు జోరుగా వెలుస్తుండడంతోపాటు క్రయ, విక్రయాలు పెరగడంతో మార్కెట్ ఊపందుకుంది. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడం వంటి ఆదాయ అభివృద్ధికి కారణం అయ్యాయి. నిర్మల్‌లో గతేడాది కంటే ఈసారి ఆదాయం తగ్గడం, అదే సమయంలో దస్తావేజుల సంఖ్య కూడా తగ్గింది. ప్రధానంగా గతంలో కుంటాల, లోకేశ్వరం, తానూర్‌కు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు నిర్మల్‌లో జరిగేవి. అయితే వాటిని భైంసాకు తరలించడంతో దస్తావేజుల సంఖ్య తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కుమురంభీం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఆసిఫాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ దస్తావేజుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ 2017–18 సంవత్సరంలో 3,237 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, 2018–19 సంవత్సరంలో 3,995కు పెరిగింది. మార్కెట్ విలువతో రిజిస్ట్రేషన్లు.. ఆదిలాబాద్, మంచిర్యాలలో ఓపెన్ ప్లాట్లను బహిరంగ మార్కెట్లో ఉన్న విలువతో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఫీజుల రూపంలో అధిక ఆదాయం లభిస్తుంది. ప్లాట్లకు ప్రభుత్వ ధరతో నిర్ణయించిన శాతం ధరతో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. అయితే బ్యాంక్ లోన్ కోసం బహిరంగ మార్కెట్లో ఆ ప్లాట్ పలుకుతున్న ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు భూయజమాని ఆసక్తి కనబర్చుతున్నారు. దీంతోనే ఆదాయం పెరిగిందని రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ శివారులో మావల, దస్నాపూర్, బట్టిసావర్గాం ప్రాంతాల్లో రియల్ వెంచర్లు జోరుగా వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇదివరకే వెలిసిన ఎన్ఓసీ ఉన్న రియల్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను గత ఆరు నెలలుగా నిలిపివేశారు. అయినా ఇక్కడ ఆదాయం పెరగడం గమనార్హం. ఒకవేళ ఎన్ఓసీ వెంచర్లలో కూడా రిజిస్ట్రేషన్ల ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పక్షంలో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఉద్యోగులకు రూ.10లక్షల వడ్డీ రాయితీ రుణం ఇస్తుండడంతో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దస్తావేజుల సంఖ్య మంచిర్యాలలో భారీగా పెరిగింది. నస్పూర్, క్యాతన్‌పెల్లి, తిమ్మాపూర్ ప్రాంతాల్లో రియల్ వెంచర్లలో క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వారు చెన్నూర్, కోటపల్లి ప్రాంతాల్లో సారవంతమైన వ్యవసాయ భూములు కొనుగోలు చేయడం కూడా ఇవి పెరగడానికి కారణమైనట్లు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మంచిర్యాల–మహారాష్ట్రలోని సిరొంచ వరకు ప్రాణహితపై బ్రిడ్జి కావడంతో ఛత్తీస్‌ఘడ్ వరకు రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూ క్రయ, విక్రయాలు జోరందుకోవడానికి ఇది కూడా ఓ కారణమని పేర్కొంటున్నారు. భైంసాలో భూ క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు అధికంగా ఉండడంతో పట్టణ పరిసరాలు వృద్ధి చెందడంతో పాటు వ్యవసాయ భూములు పెద్ద మొత్తంలో ఒకేచోట దొరికే పరిస్థితి ఉండటం కూడా రియల్ వృద్ధికి కారణమవుతోంది. 10, 20, 30, 40 ఎకరాలు ఒకేచోట లభ్యమయ్యే పరిస్థితి ఉండడం, కెనాల్ సదుపాయంతో నీరు సమృద్ధిగా ఉండడంతో పలువురు బల్క్‌గా వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల రూపంలో పలువురు వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తుండటంతో ఇక్కడ దస్తావేజుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. భైంసా, బాసర, మాటెగాంలలో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయం అధికంగా ఉండటం, బాసర అమ్మవారి ఆలయం, ట్రిపుల్ఐటీ కారణంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. భైంసా పట్టణంలో రాహుల్‌నగర్, నిర్మల్రోడ్, బస్టాండ్ ఏరియాల్లో ఓపెన్ ప్లాట్ల క్రయ, విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. దస్తావేజులు, ఆదాయం పెరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. గతేడాది కంటే ఈసారి రూ.15కోట్లు అధిక ఆదాయం వచ్చింది. మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసాలో రెవెన్యూ ఆదాయం అధికంగా ఉంది. మిగతా చోట్ల కూడా దస్తావేజుల సంఖ్య పర్వాలేదు. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ శిక్షణా సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంకుల ద్వారా 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయం గడించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్న విధంగానే, జైళ్ల శాఖ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సరసమైన ధరలకే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మధ్య తరగతికి ఇళ్లు కట్టి ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విడుదలైన ఖైదీలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. జైళ్ల శాఖ ఏ వ్యాపారం చేపట్టినా విజయవంతమైందని, ఈ ప్రాజెక్టు కూడా విజయం సాధిస్తుందన్నారు. మరో 3 నెలల వ్యవధిలో 20 నూతన పెట్రోల్ బంకులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రైవేటు భూముల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని, వాటి నిర్వహణను ప్రభుత్వం జైళ్ల శాఖకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. మరో 6 నెలల్లో 400 మంది విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నేరాల అదుపు వల్ల 49 జైళ్లలో 17 మూసివేశామన్నారు. ఆ జైళ్లలో ఆశ్రమాలను నెలకొల్పేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. హౌసింగ్ సొసైటీ ద్వారా వరంగల్, హైదరాబాద్ జైళ్ల సిబ్బందికి సొంత ఇళ్లు అందించనున్నట్లు తెలిపారు. -
డాక్టర్‌కు ఆక్రమణ రోగం
సాక్షి, కడప/చింతకొమ్మదిన్నె : కడప రింగురోడ్డుకు దక్షిణం, పడమర వైపు చింతకొమ్మదిన్నె మండలం విస్తరించి ఉంది. రింగురోడ్డు చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తారంగా జరుగుతోంది. ఈక్రమంలో చింతకొమ్మదిన్నె భూములకు భారీగా విలువ పలుకుతోంది. కడప–చిత్తూరు జాతీయ రహదారిలో రైల్వే ఫై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావస్తోంది. ఈదశలో భూముల ధరలకు మరింతగా రెక్కలొస్తున్నాయి. ఈనేపథ్యలో ఇక్కడి డీకేటీ భూములను రియల్ ఎస్టేట్ రంగంలోకి మార్చి లబ్ధిపొందాలని నగరంలోని ప్రముఖ వైద్యుడు యోచించారు. తనసొంత మండలమైన చింతకొమ్మదిన్నెలో ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజస్కందాలపై వేసుకుంటానని.. ల్యాండ్ కన్వర్షన్ పని చేయిం చాలని అక్కడి టీడీపీ అభ్యర్థితో ఆ డాక్టరు ఒప్పందం కుదుర్చుకున్నారు. టీడీపీ అభ్యర్థి ఈ షరతుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ల్యాండ్ కన్వర్షన్‌కు అయ్యే ఖర్చు కూడా భరిస్తానని ఆ అభ్యర్థి హామీ ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా డాక్టరు చింతకొమ్మదిన్నె టీడీపీ ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. మూలవంక భూములపై కన్ను.... కడప–చిత్తూరు జాతీయ రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పూర్తవుతోంది. ఇక్కడ భూముల రేట్లు పెరిగిపోయాయి. ఇదే అదునుగా భావించిన ఒక వైద్యుడు టీడీపీ నేతలతో ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల్లో అనుకూలంగా పనిచేస్తా, భూ బదలాయింపు చేయించాలని షరతు పెట్టి సఫలమయ్యారు. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు గ్రామ పొలంలో సర్వే నంబర్ 716లో 3.22 సెంట్లు, 718–1లో 2.73 సెంట్లు, 718–2లో 1.95 సెంట్లు, 719లో 5.04 సెంట్లు, 720–1లో 1.41 సెంట్లు, 720–2లో 4.95 ఎకరాల డీకేటీ భూమిని గుర్తించారు. 2003లో ప్రభుత్వం ఈ భూమిని విద్యాసంస్థల కోసం దరఖాస్తు చేసుకున్న బుఖారియా ఎడ్యుకేషనల్ సొసైటీకి కేటాయించింది. సదరు సొసైటీ అందులో విద్యాసంస్థలు ఏర్పాటు చేయలేదు. అసైన్మెంటు ద్వారా సంక్రమించిన భూములను విద్యాసంస్థల అధినేతలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడీ భూములపై నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడి కన్ను పడింది. మూలవంక సమీపంలో ఉన్న భూములను కూడా కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని ఆయన పథకం వేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే ఎత్తుగడ వేశారు. ఎప్పటికైనా సమస్యగా తలెత్తే అవకాశముందని పనిలో పనిగా ల్యాండ్ కన్వర్షన్ చేయించాలని యోచించారు. ఇందుకోసం ఇక్కడి టీడీపీ అభ్యర్ధితో అవగాహనకు వచ్చారు. తనకు పట్టున్న సొంత మండలంలో ప్రచార బాధ్యతల్ని నిర్వర్తించినందుకు గాను ఆ భూములకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ పని చేయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే కిందిస్థాయి రెవెన్యూ అధికారులతో ఆయన మంతనాలు సాగించారు. ఫైలు కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. స్థలంలో ముందుగా దేవాలయం నిర్మించాలని అడుగులు వేసినట్లు తెలుస్తోంది. స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా విరమించినట్లు సమాచారం. టీడీపీ ముమ్మర ప్రచారంలో వైద్యుడు... కడప నగరంలో ప్రముఖ వైద్యుడుగా గుర్తింపు ఉన్న చింతకొమ్మదిన్నె మండలవాసీ టీడీపీ ముమ్మర ప్రచారంలో పాల్గొంటున్న తీరు చర్చనీయాంశమైంది. మండలంలో అధికార పక్షానికి అన్నీ తానై ఆయన వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థికి మండలంలో మెజార్టీ తెప్పించే బాధ్యత తనదేనని బాహాటంగా చెబుతున్నట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయడం, వైఎస్సార్సీపీలోకి మారేవారిపై ఒత్తిడి తేవడం లాంటి చర్యలకు ఆయన పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి కంటే ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్న డాక్టరు తీరు అక్కడివారికి విస్మయం కలిగిస్తోంది. దీని వెనుక డీకేటీ భూముల బదలాయింపు ఒప్పందమే కారణమని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. -
క్షేత్రం పేరుతో జోరుగా రియల్ వ్యాపారం
ద్వారకాతిరుమల: ‘శ్రీవారి క్షేత్రానికి కూతవేటు దూరంలోనే.. నాలుగడుగులేస్తే స్వామి సన్నిధికి చేరుకోవచ్చు.. అతి తక్కువ ధరకు ప్లాటును పొందండి.. త్వరపడండి..’ అంటూ కొందరు రియల్ వ్యాపారులు ద్వారకాతిరుమల క్షేత్రంలో జోరుగా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. క్షేత్రానికి సమీపంలో ఉన్న గ్రామాల్లోని కొండ గుట్టలను సైతం కొందరు వ్యాపారులు వెంచర్లుగా మార్చేస్తున్నారు. కనీసం అక్కడ మంచినీరు కూడా దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సంపాదనే ధ్యేయంగా పలువురు వ్యాపారులు మాయ మాటలు చెబుతూ, అమాయకులకు ఆ ప్లాట్లను అంటగడుతున్నారు. కొనుగోలు చేసిన తరువాత అవి ఎందుకూ పనికిరాక అనేకమంది లబోదిబోమంటున్నారు. దేవుడి సన్నిధికి దగ్గర్లో ఉండొచ్చన్న ఆశతో రూ. లక్షలు కుమ్మరించి కొనుగోలు చేసిన ప్లాట్లు, అక్కరకు రాకపోయే సరికి, తిరిగి వాటిని వదిలించుకునేందుకు కొనుగోలుదారులు నానా తంటాలు పడుతున్నారు. చినవెంకన్న సాక్షిగా భక్తులను టార్గెట్ చేస్తూ సాగుతున్న వ్యాపారమిదీ.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ద్వారకాతిరుమల ఒకటి. ఇక్కడ సెంటు భూమి ఉంటే చాలనుకునేవారు కోకొల్లలు. ఎందుకంటే పుణ్యక్షేత్రంలో శేషజీవితాన్ని గడిపితే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నది కొందరి భక్తుల భావన. ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చేవారిలో అధికశాతం మంది ఆలోచన కూడా అదే. అందుకే ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.కోటి పైమాటే పలుకుతోంది. ఇక ఆలయానికి సమీపంలో అయితే చెప్పనక్కరలేదు. ధరలు వింటే గుండెగుబేల్మంటుంది. క్షేత్రంలో గజం భూమి రూ.25 వేలకు పైగా పలుకుతుంటే, కుంకుళ్లమ్మ ఆలయ సమీప ప్రాంతాల్లో గజం భూమి రూ.15 వేల వరకు ఉంది. అయినా కొనుగోలు చేసేందుకు చాలా మంది వెనకాడటం లేదు. కొండల్లో రియల్ వెంచర్లు: ద్వారకాతిరుమల పరిసర గ్రామాల్లోని కొండప్రాంతాల్లో సైతం రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. చుక్కనీరు కూడా దొరకని ప్రదేశాల్లో వెంచర్లు వేసి జోరుగా విక్రయిస్తున్నారు. వ్యాపారులు చేసే ప్రచార ఆర్భాటాలను చూసి అనేక మంది, భవిష్యత్తులో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఆశతో ప్లాట్లను రూ. లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలా కొనుగోలు చేసిన వారు చాలా మంది, తిరిగి వాటిని అమ్ముకునే వీలు లేక నానా అవస్థలు పడుతున్నారు. రాళ్లకుంట, సత్తెన్నగూడెం, తిమ్మాపురం తదితర గ్రామాల్లోని రహదార్ల పక్కనున్న వెంచర్లు ఇందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. భూములకే రెక్కలొచ్చాయి: క్షేత్రంలో ఏకంగా భూములకే రెక్కలొచ్చాయి. ఇక్కడ స్థలాల విలువ రూ.కోట్లు పలుకుతుండటం వల్ల కొందరు దళారులు స్థానిక వసంత్‌నగర్ కాలనీ వద్ద ఉన్న ఆర్ఎస్ నంబర్ 11, 1/2 లోని ఎంతో విలువైన కొండ పోరంబోకు భూమిని ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా సొంత భూముల్లా దర్జాగా అమ్ముకుని, లక్షలు మూటగట్టుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికెళ్లినా ఇప్పటి వరకు ఫలితం లేదు. క్షేత్ర పరిసరాల్లో భూముల ధరలు ఏవిధంగా పెరుగుతున్నాయో.. అదేవిధంగా అన్యాక్రాంతమవుతున్నాయి. ఒక పక్క రియల్ వ్యాపారులు.. మరో పక్క దళారులు తమ దందాను దర్జాగా సాగిస్తున్నారనడానికి ఈ భూబాగోతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. -
ప్లాట్ కొంటే..ఉద్యోగమట
సత్తుపల్లి : ‘ సింగరేణి ఓపెన్ కాస్ట్లో భూమి పోతే, దానికి బదులు పరిహారంతో పాటు ఉద్యోగం వస్తుంది. కేవలం రూ.3 లక్షలు చెల్లించి ప్లాట్ తీసుకోండి..ఆ తర్వాత మిగతా రూ.3 లక్షలు చెల్లించండి. ఎంచక్కా జాబ్, ఇళ్లప్లాట్ సొంతం చేసుకోండి..’అంటూ ఖమ్మంకేంద్రంగా ముగ్గురితో కూడిన ఓ రియల్ వ్యాపార ముఠా ఏకంగా 68 మందికి 200 గజాల చొప్పున ప్లాట్లు విక్రయించి రూ.2.04 కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఇలా దర్జాగా సాగుతున్న రియల్ వెంచర్ లీలలు..అక్రమ రిజిస్ట్రేషన్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ లోపాలను ఎత్తిచూపుతూ మార్చి 14న ‘సాక్షి’లో ‘రియల్ టోకరా!’ పేరుతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. సత్తుపల్లి మండలం కిష్టారం ఓపెన్‌కాస్టులో చెరుకుపల్లి పంచాయతీ జగన్నాథపురం రెవెన్యూలో ఈ తతంగం జరిగినట్లు అప్పట్లో జరిగిన అవార్డు ఎంక్వైరీలో వెలుగుచూసింది. ఆ రియల్టర్ మాత్రం ఖమ్మం, కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, హైదరాబాద్‌లలో రియల్ వెంచర్లు వేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నాడని, అధికార పార్టీ లో పెద్దల అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, పెద్దస్థాయి నేతల ఫొటోలు చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ముందుచూపుతో పక్కాస్కెచ్.. ఎంత పక్కాగా స్కేచ్ వేశారంటే..ప్లాట్లు అమ్మేటప్పుడే రూ.3లక్షలు ముందుగా చెల్లించిన తర్వాత మిగతా రూ.3లక్షలు ఉద్యోగం, పరిహారం వచ్చిన తర్వాత చెల్లించాలనేది వీరు పెట్టుకున్న షరతు. ఆ డబ్బులు అప్పుడిస్తారో లేదోనని ముందుచూపుతో ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు కూడా తీసుకుని..మరింత నమ్మించి మోసం చేశారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 200 గజాలకే జాబ్ ఎలా వస్తుందని ప్రశ్నిస్తే.. ఇన్ని అనుమానాలు అవసరం లేదు.. ఇప్పటికే చాలా మందికి అమ్మేశాం.. ఇష్టమైతే తీసుకోండి.. కావాలంటే కొనుగోలు చేసిన వాళ్ల అడ్రస్‌లు ఇస్తాం వెళ్లి మాట్లాడుకోండి..అంటూ నమ్మకంగా చెప్పేవారని తెలిసింది. కుమారుడి జీవితం బాగుపడుతుందనే ఆశతో తమలాంటి ఎంతోమంది రియల్టర్ మాటలు నమ్మి.. చైన్ సిస్టమ్‌లో చాలామంది మోసపోయామని లబోదిబోమంటున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు ఎన్నిసార్లు మొత్తుకున్నా.. ఇస్తామంటూ.. మభ్యపెడుతున్నారని వాపోతున్నారు. ఆన్లైన్లో అక్రమ రిజిస్ట్రేషన్.. చెరువుకు ఆనుకొని ఉన్న జామాయిల్ తోటను వాణిజ్య భూమిగా బదలాయించకుండా ఎలాంటి అధికారిక లేఅవుట్ లేకుండా అంతా కాగితాలపైనే ప్లాట్లు చేసి ఖమ్మం కేంద్రంగా ఆన్లైన్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి అమ్మేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పట్టింపు లేకనే ఇలా సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్నాథపురం రెవెన్యూలో సర్వే నంబర్ 65లో 3.15 ఎకరాల భూమిని రూ.37.50 లక్షలకు 2015 సెప్టెంబర్‌లో అదే గ్రామానికి చెందిన చిలుకూరి జగన్మోహన్రెడ్డి నుంచి ఖమ్మంకు చెందిన ఎస్కె.నాగుల్‌మీరా 1.27 ఎకరాలు, అలవాల నాగబ్రహ్మాచారి 35 కుంటలు, అబ్దుల్ మజీద్ 35 కుంటల చొప్పున కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీటిలో 200గజాల చొప్పున 68ప్లాట్లు చేసి ఒక్కో ప్లాట్ రూ.6లక్షల చొప్పున మొత్తం 68 ప్లాట్లు రూ.4.08 కోట్లకు క్రయవిక్రయాలు జరిపినట్లు తెలిసింది. పరిహారం సొమ్ము కూడా.. కిష్టారం ఓపెన్‌కాస్టులో భూమి కోల్పోతున్న రైతులకు పట్టాభూమి రికార్డును అనుసరించి పరిహారం అందిస్తారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పరిహారం కూడా అక్రమార్కులకే వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎకరాకు ప్రభుత్వం రూ.12 లక్షలు నుంచి రూ.15 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. 200 గజాలకు పరిహారం కేవలం రూ.50వేల నుంచి రూ.62వేల వరకే వచ్చే అవకాశముంది. రూ.3 లక్షల చొప్పున కొనుగోలు చేసిన బాధితులకు రూ.2.38 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు నష్టపోనున్నారు. పరిహారం సొమ్ము నిలిపివేస్తాం.. జగన్నాథపురం సర్వే నంబర్ 65లో 3.17 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవు. ఇద్దరు బాధితులు మాత్రమే ఫిర్యాదు చేశారు. పరిహారాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తాం. విచారణ చేసిన తర్వాతనే పరిహారం ఎవరికి అందించాలో నిర్ణయిస్తాం. – దొడ్డా పుల్లయ్య, తహసీల్దార్, సత్తుపల్లి -
7వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయనే ..
జవహర్‌నగర్: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ తండ్రి కుమారున్ని చెరువులో పడేసి తనువు చాలించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని చెన్నాపురంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు, స్ధానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లా, కుందారం గ్రామానికి చెందిన దారం సుధీర్(42), రజిని దంపతులు నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్, శ్రీరాంనగర్‌కాలనీలో ఉంటూ బాలాజీనగర్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్(10), తేజ (12). పెద్దకుమారుడు తేజకు 7వ తరగతిలో తక్కువ మార్కులు రావడంతో గత కొన్ని రోజులుగా సుధీర్ బాధపడుతున్నాడు. అదేవిధంగా దీనికితోడు సుధీర్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో తండ్రి మందలించాడు. ఈ క్రమంలోనే కుమారుడికి తక్కువ మార్కులు రావడంతో మనస్ధాపానికి గురైన సుధీర్ మూడు రోజుల క్రితం కుమారుడితో సహా ఇంటి నుంచి బైక్ తీసుకుని బయటికి వెళ్లాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన సుధీర్ సోదరుడు అనిల్‌కుమార్ ఫోన్‌ద్వారా అతను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజులుగా లేక్ పోలీసుల సహాయంతో గాలిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుధీర్ తన ఫోన్ నుంచి మరో 15 నిమిషాల్లో వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున చెన్నాపురం చెరువులో రెండు మృతదేహాలను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలో ఉన్న బైక్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న వారు మృతదేహాలను సుధీర్, తేజలుగా గుర్తించారు. జవహర్‌నగర్‌లో విషాదచాయలు ... జవహర్‌నగర్‌లో మెడికల్‌షాపు నిర్వహిస్తూ అందరికీ పరిచయస్తుడైన సుధీర్ కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని కంటతడిపెట్టారు. -
మాజీ కానిస్టేబుల్ అరెస్ట్
విజయనగరం టౌన్: రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేసిన మాజీ కానిస్టేబుల్‌ను టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ బీవీజే రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రమేష్పాత్రో కానిస్టేబుల్ వృత్తిలో ఉంటూ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో రియల్ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి ఉద్యోగాన్ని వదిలేశాడు. ఈ నేపథ్యంలో పలు మోసాలకు పాల్పడి రెండు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. కానుకుర్తివారి వీధిలో పీఆర్ ఎన్‌క్లేవ్‌లో 14 ఇళ్లను ఒకరికి తెలియకుండా ఒకరికి అమ్మేసి ప్రజలను మోసం చేశాడు. దీనిపై పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో గతేడాది డిసెంబర్ 20న కేసు నమోదు చేసి మాజీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. బెయిల్‌పై వచ్చి మరలా తన రియల్ మోసాలను యథేచ్ఛగా కొనసాగించడంతో, బాధితులు మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వనస్థలిపురంలో రెండుచోట్ల చోరీలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల చోరీలు జరిగాయి. సహారా కాలనీ, వనస్థలి హిల్స్ కాలనీలలో దొంగతనాలు జరిగాయి. ఓ ఫోటో స్టూడియో, మరో రియల్ ఎస్టేట్ కార్యాలయంలో రూ.2 లక్షల విలువైన కెమెరాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు దొంగలు తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. -
హౌసింగ్ స్కీం రియల్ ఎస్టేట్
ప్రభుత్వం చేపట్టే ఇళ్ల నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపిస్తోంది. కనీస మౌలిక వసతులకూ ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో మొదటి విడత హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం కింద 2017–18కి కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2వేలు చొప్పున ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కడప కార్పొరేషన్లో 4వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించగా కడపలో 1982 మంది, ప్రొద్దుటూరులో 900 మంది అంగీకారపత్రాలను ఇచ్చారు. వీరిలో కడప కార్పొరేషన్లో 800 మంది తమకు నచ్చిన కేటగిరీ ఇళ్లకు తమ వాటాగా డీడీలు తీయగా, ప్రొద్దుటూరులో ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. 2018–19 ఏడాదికి సంబంధించి రెండో విడతలో కడప కార్పొరేషన్ పరిధిలో 2281, మున్సిపాలిటీల్లోని ప్రొద్దుటూరులో 2150, రాజంపేటలో 1279, జమ్మలమడుగులో 1415, ఎర్రగుంట్ల 2046, పులివెందులలో 2143, బద్వేలులో 888, రాయచోటిలో 1011 ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్ విధించింది. ప్రభుత్వమే డబ్బు, స్థలం ఇచ్చి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు ప్రభుత్వం రెండు సెంట్ల స్థలంతోపాటు ఒక్కో ఇంటికి రూ.80వేలు ఇచ్చి ఉచితంగా ఇళ్లను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడు రకాల ఇళ్లను నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తోంది. కేటగిరీ ఒకటిలో ఉన్న వాటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తుండగా లబ్దిదారుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ రూ.3లక్షలు పోను, బ్యాంకు రుణం రూ.2.65లక్షలకు 30 ఏళ్లకు వడ్డీతో సహా రూ.11లక్షల 95వేల 300 చెల్లించాల్సి ఉంటుంది. రెండో కేటగిరిలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.3.65 లక్షలకు వడ్డీతో రూ.14లక్షల 48వేల 200, మూడో కేటగిరి కింద 430 చదరపు అడుగుల ఇంటికి సబ్సిడీ పోను బ్యాంకు రుణం రూ.4.65లక్షలకు లబ్ధిదారుడు రూ.17లక్షల 54వేలు 400 వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణం వల్ల అయినా లబ్ధిదారుడు బ్యాంకులకు కంతులు చెల్లించకపోతే బ్యాంకులు ఇళ్లు జప్తు చేసే పరిస్థితి ఉంది. ఈ ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు ప్రభుత్వం రూ.2,100 ముక్కుపిండి ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఇందులోనే మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. స్థల అన్వేషణ మొదటి విడత గృహాల నిర్మాణం 2018 సంక్రాంతి పండుగ తర్వాతనే టిడ్కో సంస్థ ప్రారంభించే అవకాశం ఉంది. అంగీకార పత్రాలు ఇచ్చిన ప్రజలు డీడీలు తీస్తేనే పూర్తి అర్హత జాబితా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు జిల్లా కమిటీ పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టలేదు. జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా టిడ్కో సంస్థనే టెండర్లు వేయడంతో అక్కడ ఇళ్ల నిర్మాణాలను సంక్రాంతి లోగా పూర్తి చేయాలని ఒత్తిడి ఉండటంతో పనులు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మించే ఇళ్లపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో 35 ఎకరాలను సేకరించారు. ఈ స్థలానికి ఆనుకుని వంక ఉండటంతో టిడ్కో ఈఈ లీలా ప్రసాద్ ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న దృష్టికి తీసుకొచ్చారు. రెండు ఎకరాల స్థలం ఇప్పటికే ఆక్రమణకు గురైంది. ఎలా జీవించాలి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లు ప్రజలకు ఏ మాత్రం అనుకూలం కాదు. అందులోనూ ముక్కాలు సెంటులో అపార్టుమెంట్ల పద్ధతిలో నిర్మించే ఇంటిని 30 ఏళ్లు బ్యాంకుకు తనఖా పెట్టడం దారుణం. – మచ్చా ఉమాదేవి, ప్రొద్దుటూరు. పేదోడికి భారం పేదోళ్లకి ప్రభుత్వం నిర్మించి ఇస్తామంటున్న ఇళ్లు భారంగా మారనున్నాయి.. నెల నెల బ్యాంకుకు అసలూ, వడ్డీతో కలిపి కట్టే డబ్బుకు పట్టణ ప్రాంతంలోనే బాడుగకు ఇల్లు వస్తుంది. చేనేతలకు పైభాగంలో ఇల్లు ఇస్టే మగ్గం ఎక్కడ పెట్టుకుంటారు. – జి.జయమ్మ, ప్రొద్దుటూరు. -
అడవిలో పోరాడి.. జీవితంలో ఓడి..!
మావోయిస్టు మాజీ నేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్ గోపన్న(51) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మావోయిస్టు ఉద్యమంలో ఆంధ్రా, ఒడిషా (ఏఓబీ) రాష్ట్రనేతగా పనిచేసి కొన్నేళ్ల క్రితం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన మోసాలతో ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాక్షి, భీమారం/కాజీపేట: మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన ఏఓబీలో రాష్ట్ర నేతగా పని చేసి, అడవిలో అనేక దాడులకు నేతృత్వం వహించి పోలీసులకు లొంగిపోయిన మావో యిస్టు మాజీ అగ్రనేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్ గోపన్న(51).. తర్వాతి జీవితంలో మాత్రం ఓడిపోయాడు. రియల్ ఎస్టేట్‌లో జరిగి న మోసం.. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య ఉనికిచర్ల గేట్ వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోపన్న హన్మకొండ గోపాలపురంలోని వివేక్‌నగర్‌లో భార్య మంజుల అలియాస్ భారతి, కూతురు సుమశ్రీతో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఆయనఇంటి నుంచి కారులో బయటికి వచ్చాడు. అంతకు ముందు ఇంటి కి సమీపంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్లి కొద్దిసేపు ఉన్నాడు. తర్వాత కారులో వడ్డేపల్లి చర్చి క్రాస్ వద్దకు చేరుకుని అక్కడ కొద్దిసేపు తిరిగాడు. కారు డ్రైవర్‌ను ఇంటికి వెళ్లమని చెప్పి తాను రైల్వేట్రాక్ బాటపట్టాడు. దీం తో డ్రైవర్ కొంతదూరం వచ్చి.. గోపన్న మిత్రుడు చందర్‌కు ఫోన్ చేసి.. సమాచారమిచ్చాడు. చందర్ వెంటనే బైక్‌పై అటువైపు వెళ్లగా అప్పటికే గోపన్న రైల్వే ట్రాక్‌పైకి చేరుకొని 12.20 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి దానాపూర్(పాట్నా) వెళ్లే ధానా పూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేశారు. రాజమండ్రి భూవివాదంతోనే ఆర్థిక ఇబ్బందుల్లోకి.. ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని ఓ జమీందార్కు చెందిన సుమారు 135 ఎకరాల భూమి ని తాను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నానని హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్ గోపన్నను నమ్మించాడు. అసలు భూయజమానితో తాను ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని గోపన్న దగ్గర కొంత నగదు తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత అదే భూమి ని గోపన్న రాజమండ్రికి చెందిన బిల్డర్ సుబ్బారెడ్డికి అమ్మేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ భూమిపై వివాదం ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ తనను మో సం చేసినట్లు గోపన్న ఆలస్యంగా గుర్తించాడు. అదే సమయంలో అగ్రిమెంట్ చేసుకున్న సుబ్బారెడ్డి మాత్రం భూమి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి పెంచాడు. రెండుసార్లు గోపన్న రిజిస్ట్రేషన్‌కు సమయం ఇచ్చి రాలేదని సుబ్బారెడ్డి తెలిపాడు. సుబ్బారెడ్డి ఒత్తిడి పెంచడంతో అదే భూమిని గోపన్న డబ్బుల కోసం మరో రియల్టర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. అగ్రిమెంట్లో గోపన్నకు మోసం.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ అగ్రిమెంట్లో మోసం చేసినట్లు గోపన్న గుర్తించారు. అగ్రిమెంట్ ఇచ్చిన వారు హైదరాబాద్‌కు చెందిన ఓ బలమైన రాజకీయ వర్గానికి చెందిన వారని తెలిసింది. గోపన్న ఏదైతే భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడో దానిని అమ్మకానికి ఎవరితోనూ తాను ఒప్పందం చేసుకోలేదని భూమి యజ మానురాలు వెల్లడించడంతో అసలు విషయం బహిర్గతమైనట్లు తెలిసింది. గతేడాది గోపన్న కిడ్నాప్.. దాడి.. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ చేయడానికి గోపన్న గతేడాది రాజమండ్రికి వెళ్లారు. అక్కడ గోపన్న కిడ్నాప్‌నకు గురయ్యారు. మూడు రోజులపాటు గోపన్ననను అపహరించి, కిడ్నాపర్లు ఆయనను తీవ్రంగా గాయపరిచారు. చావు బతుకుల మధ్య గోపన్న ఇంటికి చేరుకున్నాడు. డబ్బుల కోసం ఒత్తిడి.. గోపన్నకు డబ్బులు ఇచ్చిన రియల్టర్ సుబ్బారెడ్డి డబ్బులు ఇవ్వమని గోపన్నపై ఒత్తిడి పెం చాడు. దీంతో గోపన్న సదరు వ్యక్తికి 15న డబ్బులు ఇస్తానని మెస్సేజ్ పంపారు. మెస్సెజ్ ప్ర కారం రియల్టర్ తన డబ్బులు తీసుకునేందుకు హన్మకొండకు వచ్చాడు. అయితే డబ్బులు సమకూరకపోవడంతో ఆయన ఆందోళనకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. కేటీఆర్ ముందు మొర.. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్ రియల్టర్ తనకు చేసిన మోసాన్ని మంత్రి కేటీఆర్ ముందు గోపన్న మొరపెట్టుకున్నట్లు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఓ ఎమ్మెల్యే ఫోన్లో బెదిరింపులకు గురిచేస్తున్న విషయాన్ని కూడా గోపన్న ఆయనకు వివరించారని సమీప బంధువులు పేర్కొన్నారు. అడవిలో ఉన్నప్పుడు బతికితివి కాదే అన్న అడవిలో ఉన్నప్పుడే బతికితివి కాదే అన్న.. నిన్ను ఎలా చూడాలే అన్న.. అడివిలో కాపాడిన దేవుడు.. ఇప్పుడు ఏటూ పోయిండే అన్న.. నీ బిడ్డకు దిక్కేవరే అన్న.. అంటూ గోపన్న మృతదేహంపై ఆయన సోదరి పద్మ విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. కూతురంటే మహాప్రాణం.. గోపన్న, మంజుల పెంపుడు కూతురు సుమశ్రీ అంటే గోపన్నకు ఎంతో ప్రేమ. నిత్యం సుమ.. సుమ అని పిలిచేవాడు. సుమశ్రీ ఎస్ఆర్ స్పా ర్కిల్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గోపన్న తండ్రి ధర్మారావు మూడేళ్ల క్రితం, తల్లి సావిత్రి ఐదేళ్ల కిత్రం చనిపోయారు. సంఘటన స్థలానికి ఎర్రబెల్లి, జంగా సమాచారం అందుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి చేరుకొని పట్టాలపై చెల్లాచెదురైన శరీరవయవాలను పరిశీలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్.. మిత్రులారా దయచేసి క్షమించండి.. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి.. నా కూతురు, భార్య గురించి ఆలోచించండి. కుటుంబ సభ్యులారా తప్పు చేశాను. నమ్మి మోసపోయాను. నా కుటుంబాన్ని దిక్కులేకుండా చేసి పోతున్నాను. తల్లీ క్షమించు బిడ్డా.. అమ్మను బాధపెట్టకు. అమ్మ అమాయకురాలు.. న్యక్షా లవ్ యూ, మిస్ యూ.. నిన్ను కష్టపెట్టి ఉంటే క్షమించు. ఒక మనిషి ఎంత ఎదగగలడో.. ఎంత దిగజారగలడో నా జీవితం ఉదాహరణ. ఒక్క నిమిషం వీడక బతకాలనుకున్నాను. కానీ ఈ సాయంత్రం నేను ఇంకా మాటలు పడుతాను. ఆర్థికంగా నష్టపోయాను’ అని నోట్లో పేర్కొన్నాడు. నేడు శివముక్తిధామంలో అంత్యక్రియలు వరంగల్ క్రైం: మావోయిస్టు మాజీ అగ్రనేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్ గోపన్న ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. హన్మకొండ పద్మక్షి కాలనీలోని శివముక్తిధామంలో శనివారం ఉదయం 10 గంటలకు గోపన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. -
‘రియల్’ వ్యాపారి ఆత్మహత్య
సాక్షి, మహబూబాబాద్/నెల్లికుదురు: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లికుదురుకు చెందిన నల్లబెల్లి తిరుమల్(45) ఓ ప్రైవేట్ స్కూల్‌ను నిర్వహించేవాడు. అతడి సమీప బంధువైన సీఐ ఎర్ర మోహన్, ఏఎస్సై నిమ్మల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తొర్రూర్, నర్సింహులపేటలో వెంచర్లు చేశాడు. నర్సింహుల పేటలో ప్లాట్లను అమ్మగా వచ్చిన రూ.3.50 లక్షలు సీఐ మోహన్‌కు ఇచ్చాడు. అంతలోనే సీఐ మోహన్, ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి మధ్య మనస్పర్ధలు వచ్చా యి. ఈ క్రమంలో ప్లాట్లను ఏఎస్సై తన కుమారుడి పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయంలో పలుమార్లు పంచాయితీ జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. వెంచర్లో నష్టం వచ్చినందున మీరే భరించాలని, లేకపోతే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయనని ఏఎస్సై అసభ్యకరంగా మాట్లాడుతుండేవాడు. ప్లాట్లను కొనుగోలు చేసిన నర్సింహులపేట మండలం కొమ్ములవంచ తండాకు చెందిన సంతోశ్, మంగ్యా, రంగమ్మ, శిరీష శుక్రవారం ఉదయం తిరుమల్ ఇంటికి వచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని గొడవ చేశారు. మనస్తాపానికి గురైన తిరుమల్ తన చావుకు సీఐ మోహన్, ఏఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి కారణమని సూసైడ్ నోట్ రాసి శుక్రవారం ఉరేసుకొన్నాడు. తిరుమల్ తన పాఠశాలను టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం విక్రయించి కార్యాలయ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. అందులోనే ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు సీఐ, ఏఎస్సై, మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సదరు సీఐ మోహన్ ఇటీవలే డీఎస్పీ పదోన్నతి పొంది, హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నట్టు సమాచారం. -
గురునానక్ కళాశాలపై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాలపై బుధవారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఇవాళ దాడులు చేశారు. గురునానక్ కళాశాలతో పాటు వాటి అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.7కోట్ల 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రఘురామ్, నమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలపైనా దాడులు చేసి, సోదాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రియల్ ఎస్టేట్ గొడవలల్లో ఎస్ఐ ఓవరాక్షన్
-
మహిళ ఆత్మహత్య
శంకర్పల్లి: వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లకొండ కొండ గ్రామానికి చెందిన నవీన(32) శ్రీధర్‌రెడ్డి దంపతులు శంకర్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీధర్‌రెడ్డి భార్యను వేధిస్తుండడంతో భరించలేక ఆమె బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నోట్ల రద్దుతో నెల్లూరులో ’రియల్ ’ఢమాల్
-
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల అవస్థలు
-
పెద్ద నోట్ల రద్దుతో ‘రియల్’ చిత్రాలు
పెద్ద నోట్లకే పొలం, స్థలం అమ్ముతామంటున్న బ్రోకర్లు భూముల ధరల నిలుపుదలకు వ్యూహం సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు చిత్ర విచిత్ర విన్యాసాలకు దారితీస్తోంది. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దుతో కోట్లు పెట్టి పొలాలు, స్థలాలు కొనే పరిస్థితికి చెక్ పడింది. దీంతో గడిచిన నాలుగు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతం కుప్పకూలింది. సరిగ్గా ఇదే అవకాశాన్ని మధ్యవర్తులు(బ్రోకర్లు) సానుకూలంగా మలుచుకునే యత్నం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాలు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరుల్లోనూ కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. అటు పొలాలు, స్థలాలు ధరలు పడిపోకుండా, నల్ల డబ్బు చెల్లుబాటు అయ్యేలా ఉభయ తారకమైన ఫార్మూలను తెరమీదకు తెచ్చారు. పాత నోట్లకే పొలాలు అమ్ముతామంటూ డబ్బున్న ఆసాములకు ఫోన్ లు చేసి దారిలో పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయిన తరుణంలో కొనుక్కుంటే లాభదాయకంగా ఉంటుందని నచ్చజెపుతున్నారు. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకుని వాళ్లు ఏదోలా వాటిని మార్చుకుంటారని ధీమాగా చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ఒకాయనకు ఫోన్ చేసి ఎకరంన్నర పొలం రెడీగా ఉంది.. భవిష్యత్‌లో లేఅవుట్ వేసుకోవడానికి బాగుంటుంది.. పాత నోట్లు ఉంటే సిద్ధం చేసుకోమని చెప్పడం గమనార్హం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జువ్వలపాలెం రోడ్డు శివారున ఒక స్థలాన్ని కూడా ఇలాగే పాత కరెన్సీకే విక్రయిస్తామని మధ్యవర్తులు బేరసారాలు జరుపుతున్నారు. అదే ప్రాంతంలోని ఒక గ్రామంలో మొన్నటి వరకు సెంటు భూమి రూ. 6.50 లక్షలకు బేరం జరిగిందని, నోట్ల రద్దు వల్ల రూ.5 లక్షలకే ఇస్తానని ఆ స్థలం యజమాని చెప్పడం విశేషం. అది కూడా పాత నోట్లు ఇస్తే తీసుకుంటామని, మార్చుకోవడానికి తనకు ఆదాయ పన్ను వెసులుబాటు ఉందని చెప్పడం గమనార్హం. పాత నోట్ల పేచీ.. కొన్ని చోట్ల మాత్రం పాత నోట్ల పేచీలు ఎక్కువయ్యాయి. నోట్ల రద్దు నిర్ణయానికి ముందే పొలాలు, స్థలాల కొనుగోళ్ల ఒప్పందాలు జరిగిన ప్రాంతాల్లో వివాదాలు చెలరేగుతున్నాయి. పెద్ద నోట్లు రద్దుకాక ముందే కొనుగోలు చేశాం కాబట్టి పాత నోట్లే ఇస్తామని కొనుగోలుదారులు.. రద్దు అయ్యాక ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి కొత్త నోట్లే కావాలని అమ్మకందారులు పంతాలకు పోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో ఇలాంటి వివాదానికి దిగిన క్రయవిక్రయదారులు పాత అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన అడ్వాన్సును కొనుగోలుదారుడు వదులుకోవాల్సిందేనని మధ్యవర్తులు తీర్పు చెప్పడం గమనార్హం. మరికొన్ని చోట్ల పాత నోట్లు చెల్లుబాటుకాక, అంత పెద్ద మొత్తాలు కొత్త నోట్లు ఇవ్వలేక కొందరు గతంలో అగ్రిమెంట్లు చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు కొంతకాలం వాయిదా వేసుకుంటున్నారు. -
CRDA రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త మలుపు
-
పడిలేచిన రియల్ భూం
పుంజుకుంటున్న వ్యాపారం కలెక్టరేట్ పైనే రియల్టర్ల నజర్ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు సాక్షి, సిరిసిల్ల : కొత్తజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. రెండు నెలలుగా నెలకొన్న సందిగ్ధంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆటుపోట్లకు గురైంది. ఆద్యంతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిలేచింది. సిరిసిల్లను జిల్లా చేయనున్నారనే ప్రభుత్వ ప్రకటనతో రెండు నెలలక్రితం ఒక్కసారిగా ఈ వ్యాపారం జోరందుకుంది. చాలా మంది రియల్టర్లు వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. మరికొందరు కొత్తగా రియల్టర్‌గా అవతారమెత్తారు. దీంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా భూ యజమానులు భారీగా ధరలు పెంచారు. అయినా వ్యాపారులు భూములు విపరీతంగా కొనుగోలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగింది. ఇదే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మలివిడత నోటిఫికేషన్లో సిరిసిల్ల జిల్లా ప్రస్తావన లేకపోవడం, మంత్రి కేటీఆర్ కూడా అదే అంశాన్ని స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రియల్ భూమ్ కుప్పకూలింది. అప్పటివరకు రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు.. రియల్ వ్యాపారంలో తమకు నష్టం తప్పదని నీరసించారు. అడ్వాన్స్ ఇవ్వడంతో మిగతా సొమ్ము చెల్లించి తమ భూములు కొనుగోలు చేయాల్సిందేనని భూయజమానులు పట్టుబట్టారు. తాము వాటిని కొనలేమని, ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని రియల్టర్లు ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. దీనిపై కొందరు పోలీసుస్టేçÙన్ల తలుపు తట్టారు. ఆ పంచాయితీలు ఇప్పటికీ ఎటూ తేలడంలేదు. ఇదిలా ఉండగానే, ప్రభుత్వం జారీ చేసిన చివరి నోటిఫికేషన్లో రాజన్న సిరిసిల్ల జిల్లాను చేయడం, మంత్రి కేటీఆర్ నూతన జిల్లాను ప్రారంభించడంతో రియల్ భూమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అప్పటిదాకా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మళ్లీ కదలికొచ్చింది. ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, సమీప ప్రాంతాల్లో రియల్టర్లు పాగా వేస్తున్నారు. కలెక్టరేట్ ‘చుట్టూ’ రియల్ నజర్ ప్రస్తుతానికి రియల్ఎస్టేట్ రంగం స్థిరంగా ఉంది. నూతనంగా చేపట్టబోయే కలెక్టరేట్ భవన నిర్మాణం చుట్టూ రియల్ భూమ్ ఆధారపడి ఉంది. సిరిసిల్ల, వేములవాడ నడుమ, సిద్దిపేట రహదారి వైపు తంగళ్లపల్లి సమీపంలో కలెక్టరేట్ భవనం నిర్మిస్తారనే ప్రచారం ఉంది. ఇందుకోసం అనువైన స్థలం ఎంపిక పూర్తి కాగానే, ఆ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం రెట్టింతయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. జంటనగరాల తరహాలో.. హైదరాబాద్, సికిందరాబాద్ తరహాలో సిరిసిల్ల, వేములవాడ భవిష్యత్‌లో జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు పట్టణాల నడుమ రియల్ ఎస్టేట్ వ్యాపారం శరవేగంగా పుంజుకుంటోంది. సిరిసిల్ల పట్టణం, శివారు, వేములవాడ పట్టణం, శివారు ప్రాంతాలపై రియల్ వ్యాపారులు దృష్టి సారించారు. జిల్లా ఏర్పాటుతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.50లక్షల– రూ.60 లక్షలు ఉండగా, ఇప్పుడు ఎకరాకు రూ.కోటికి పైమాటే అంటున్నారు రియల్టర్లు. సిరిసిల్ల జిల్లా తెరపైకి రానపుడు, జగిత్యాల జిల్లా అవుతుండడంతో, వేములవాడ, జగిత్యాల నడుమ కొండగట్టు ప్రాంతంలో రియల్ వ్యాపారం కొనసాగింది. సిరిసిల్లను జిల్లా చేయడంతో ఆ వ్యాపారమంతా ఇటువైపు మళ్లింది. దీంతోపాటు సిరిసిల్లలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, 17 పోలీస్ బెటాలియన్ తదితర ప్రభుత్వ విభాగాలు ఏర్పాటయ్యే ప్రాంతాలపై రియల్టర్లు కన్నేసి ఉంచారు. ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడం ద్వారా భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే.. కొత్త జిల్లా.. సరికొత్త వ్యాపారం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో కొనుగోలుదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా లేఅవుట్ లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములు కొనుగోలు చేయకపోవడమే మంచిదంటున్నారు. -
బెంగళూరులో పట్టపగలే దారుణం!
బెంగళూరు (బనశంకరి): నగరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. శివాజీనగరలోని కమర్షియల్‌స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు... శివాజీ నగరలోని మిల్క్‌మన్‌వీధిలో నివాసముంటున్న రుద్రేశ్ (35) ఆర్ఎస్ఎస్ కార్యకర్త, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే రుద్రేశ్ ఆదివారం ఉదయం ఇక్కడి ఆర్‌బీఏఎన్‌ఎంఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్వయంసేవక్ సంఘ్ కవాతులో పాల్గొని మధ్యాహ్నం 1 గంటల సమయంలో బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో కామరాజ రోడ్డులో వస్తుండగా బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు రుద్రేశ్ వాహనాన్ని అడ్డుకుని మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షల నేపథ్యంలో రుద్రేశ్ హత్యకు గురై ఉండొచ్చనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రుద్రేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తె లిపారు. మృతుడు రియల్ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు కామరాజ రోడ్డులో దారుణహత్యకు గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేశ్ ఘటనా స్థలాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్, ఎంపీలు పీసీ.మోహన్, ప్రతాప్‌సింహా తదితరులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆర్.అశోక్ మాట్లాడుతూ... ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. మృతుడు శివాజీనగర నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఇతను ఫైనాన్స్, రియల్ఎస్టేట్, పాలవ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. రుద్రేశ్‌కు ఎవరితోను గొడవలు లేవని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అనే కారణంతోనే హత్యకు పాల్పడ్డారని అశోక్ ఆరోపించారు. రుద్రేశ్ శివాజీనగర నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు శివాజీనగరలోని కామరాజరోడ్డు శివాజీ సర్కిల్లో గణేష ఉత్సవాలు జరగలేదు. అయితే ఈ ఏడాది వినాయక ప్రతిష్ట నిర్వహించి భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశాడు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ధర్నా.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్యకు కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ కార్యదర్శి శ్రీధర్, మైసూరు ఎంపీ ప్రతాప్సింహ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ కఠినచర్యలు తీసుకోవాలంటూ సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రుద్రేశ్ మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద గట్టి పోలీస్ భద్రత కల్పించారు. ఆసుపత్రి వద్ద పశ్చిమవిభాగ అదనపు పోలీస్‌కమిషనర్ చరణ్‌రెడ్డి, ఆగ్నేయవిభాగం డీసీపీ హరిశేఖరన్ తదితరులు సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. సోమవారం రుద్రేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మృతుడి కుటుంబవర్గాలు తెలిపాయి. -
సాదా బైనామా పేదలకు మాత్రమే..
* రియల్ఎస్టేట్ వ్యాపారానికి కాదు * జేసీ దివ్య అశ్వారావుపేట: ప్రభుత్వం సాదా బైనామా అవకాశం కేవలం పేదవారికి మాత్రమే కల్పించిందని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాదని జేసీ దివ్య స్పష్టం చేశారు. సాదా బైనామాపై సోమవారం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టా భూములను సాగుచేసుకుంటున్న నిరుపేదలకు భూమి హక్కు కల్పించేందుకే సాదా బైనామా కార్యక్రమం అని వివరించారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా దరఖాస్తు ఆన్లైన్లో ఉండటంతోపాటు తహసీల్దార్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు పరిశీలించేందుకు వీలుంటుందన్నారు. మీసేవ సర్వర్ వేగంగా లేదన్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. కానీ ఆపరేటర్లు చిన్న తప్పు కూడా లేకుండా జాగ్రత్తగా డేటా ఎంట్రీ చేయాలని, రైతులు తమ దరఖాస్తులను పరిశీలించుకోవలన్నారు. వారసత్వ పట్టాల్లో ఇంటి పెద్ద పేరుతో గతంలో భూమి పత్రాలుండేవని.. అలాంటి వాటిని కూడా హ క్కుదారులంతా వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. ఎక్కడయినా ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటే తిరిగి తీసుకుంటామన్నారు. పేరాయిగూడెంలో 1228 సర్వే నంబరులో 2,600 ఎకరాల భూమి ఉందని.. డీజీపీఎస్ సర్వే ద్వారా హద్దులను నిర్ణయించి వివాదాలు లేకుండా చూస్తామన్నారు. ఎలాంటి వివాదాలు, కోర్టు కేసులు లేని భూముల లావాదేవీలకు మాత్రామే సాదాబైనామా ద్వారా హక్కు కల్పిస్తామన్నారు. వివాదాలుంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 2014కు ముందు భూమి సాగులో ఉండాలని.. కనీసం తెల్లకాగితంపైనైనా రాసుకున్న ఒప్పంద పత్రం ఉండాలన్నారు. దీనికోసం నోటరీ, స్టాంప్ పేపర్లకు నగదు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. అన్నింటికంటే ముందు భూమిలో సాగు చేస్తూ ఉండటం ముఖ్యమైన అంశమన్నారు. దళారులు, ఇతరుల మాటలు నమ్మి సొమ్ము వృథా చేసుకోవద్దన్నారు. మండల కేంద్రంలోని దొంతికుంట చెరువు ఆక్రమణ విషయం ఆమె దృష్టికి తీసుకువెళ్లగా ఐబీ అధికారులతో సంప్రదించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. మండలంలోని వెంకమ్మ చెరువులో చేపల చెరువు వ్యర్థాలను కలుపుతున్న విషమాన్ని ప్రస్థావించగా సీఆర్పీసీ 133 సెక్షన్‌ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు. -
గుడివాడలో రియల్ ఢమాల్..
ఘోల్లుమంటున్న అపార్టుమెంట్ల బిల్డర్లు కొనేందుకు ముందుకు రాని తీరు 1400 ప్లాట్లకు అనుమతులు ఖాళీగా ఉన్న ప్లాట్లు గుడివాడలో రియల్ వ్యాపారం ఢమాల్ మంది. అపార్టుమెంట్లపై ఉద్యోగ, వ్యాపారులు మక్కువ చూపడం లేదు. నిర్మించినవన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ప్లాట్లు అమ్ముడుపోక బిల్డర్లు బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతం కట్టినవి, కట్టేందుకు అనుమతి ఉన్నవి పట్టణంలో దాదాపు 1400 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో కేవలం 200 కూడా అమ్ముడు పోలేదని సమాచారం. కొత్తగా నిర్మాణం చేపట్టాలని ముందుకొస్తున్న బిల్డర్లు కట్టాలా? వద్దా? అని మీమాంసలో పడ్డారు. గుడివాడ: పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చతికిలపడింది. అపార్టుమెంట్లు కట్టిన వారు అమ్ముడు పోక బిల్డర్లు ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని నగరానికి అతి దగ్గరలో గుడివాడలో వ్యాపారం బాగుంటుందని ఆశపడ్డారు. పూర్తయిన ప్లాట్లు అమ్ముడుపోక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే ఆర్థిక స్తోమత గలవారు అపార్టమెంట్లు, స్థలాలు కొనుగోలు చేయటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. పట్టణ పరిసర ప్రాంతాల్లో... గుడివాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లో 1400 ప్లాట్లుకు అనుమతులు వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఒక్క విజయవాడ రోడ్డులోనే 300 ప్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తి అయినవి ఉన్నాయి. గుడివాడ వలివర్తిపాడు బైపాస్ రోడ్డులో 600 ప్లాట్లుతో అపార్టుమెంట్లు ఉన్నట్లు సమాచారం. ఇవిగాక గుడివాడ పట్టణం లోపల, ఏలూరు రోడ్డు, పామర్రు రోడ్డులలో అనేక అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. అపార్టుమెంట్లు ద్వారా భారీ ఎత్తున సొమ్ముచేసుకుందామనుకున్న బిల్డర్లు వ్యాపారాలు లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. గుడివాడ బైపాస్‌రోడ్డులో కట్టిన ఓ అపార్టుమెంటులో 165 ప్లాట్లుకు గాను ఇప్పటి వరకు 30 ప్లాట్లు అమ్మినట్లు వినికిడి. విజయవాడ రోడ్డులో ఓ బిల్డరు విస్తృతమైన ప్రచారం చేసినా సగం కూడా అమ్ముడవలేదు. అనేక చోట్ల ఇదే పరిస్థితితో బిల్డర్లు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చి భవనాలు నిర్మిస్తే అమ్ముడు పోకపోవటంపై అయోమయం నెలకొంది. మేకపోతు గాంభీర్యం.. ఎవరైనా కొనుగోలుదారుడు వెళితే ప్లాట్లు అన్నీ అమ్మేశామని ఒకటి, రెండు మాత్రమే ఉన్నాయని బిల్డర్లు బిల్డప్ ఇవ్వటం సర్వసాధారణంగా మారింది. ఏ అపార్టుమెంటులోనూ కనీసం 20 శాతం కూడా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. అపార్టుమెంట్లు కొనుగోలుకు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు, ధనవంతులు ఇష్టపడుతుంటారు. కొంత మంది బ్యాంకు రుణాలతో కొనుగోలు చేస్తారు. గుడివాడ పెద్దగా ఉద్యోగ వర్గాలు లేని ప్రాంతం. కొత్తగా కొనుగోలు చేసేవారు తగ్గారని చెబుతున్నారు. ఏదేమైనా ఇదే పరిస్థితి కొనసాగితే బిల్డర్లకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. -
చంద్రబాబు గజదొంగ.. రేవంత్ దొరికిన దొంగ
ఎమ్మెల్యే సోలిపేట ఫైర్ సిద్దిపేట: అమరావతి నగరంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్న చంద్రబాబు నాయుడు అసలైన బందిపోటు.. ఆయన దగ్గరి బంట్రోతు, నోటుకు ఓటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి పెద్ద దొంగ అని శాసనసభ అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అమరావతిలో రైతుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని, భూముల ఇవ్వని రైతుల పండ్ల తోటలు నరికించి, పంట పొలాల నుంచి రైతులను పశువుల కంటే హీనంగా లాగేస్తున్నారని రేవంత్‌రెడ్డికి చీము నెత్తురు, సిగ్గుశరం ఉంటే వెంటనే అమరావతికి వెళ్లి అక్కడి రైతులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ కోసం కోసం రైతులను గాయపరిచి భూములు లాక్కున్న రక్తచరిత్ర తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. ఏళ్లకేళ్లుగా గొంతెండిపోతున్న పాలమూరు ప్రజల దూపను తీర్చే పాలమూరు ప్రాజెక్టుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే ఈ దద్దమ్మకు దానికి వత్తాసు పలుకుతున్నాడన్నారు. పాలమూరు బిడ్డగా పుట్టి కన్నతల్లి రొమ్ముగుద్దాలని చూస్తున్న ఈ ద్రోహిని తెలంగాణ జనం రాళ్లతో కొడతారని హెచ్చరించారు. -
బినామీల కోసమే భూసేకరణ
► రైతుల భూములతో ప్రభుత్వం రియల్ వ్యాపారం ►చందనాడ బహిరంగ సభలో అఖిలపక్ష నాయకులు ►ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు ► రైతులకు అండగా నిలుస్తాం నక్కపల్లి: రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూ ములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేస్తోంద ని, తమ పార్టీకి చెందిన వారితో బినామీ కంపెనీలు ఏర్పాటు చేయించి కారు చౌకగా కట్టబెడుతోందని అఖిల పక్ష నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుని తీరుతామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. విశాఖ చెన్నై మధ్య ఏర్పాటు చే స్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఏకపక్షంగా నక్కపల్లి మండలంలో 6వేల ఎకరాలను సేకరించడానికి పూనుకుంది. భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకిస్తూ కో ర్టును ఆశ్రయించారు. అయినా ప్రభుత్వం మొండిగా ముందు జిరాయితీ భూములను సర్వే చేయడంతోపాటు, ఆరేళ్లుగా పోరాటం చేస్తున్న రైతుల్లో చీలిక తెచ్చి టీడీపీ అనుకూలంగా ఉన్న రైతుల నుంచి భూములు ఇవ్వడానికి ఒప్పించింది. దీన్ని నిరసిస్తూ అఖిలపక్షరైతులు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన జిల్లా నాయకులతో గురువారం చందనాడలో బారీ బహిరంగ సభ నిర్వహించారు. రాజయ్యపేట, చం దనాడ, అమలాపురం, వేంపాడు, డి.ఎల్.పురం గ్రామా ల నుంచి వందలాది మంది రైతులు హాజరయ్యారు. మాటతప్పడం చంద్రబాబుకు అలవాటే... మాజీ మంత్రి బాలరాజు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ ప్రతిపక్షంలో మరోలాగ మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. భూసేకరణవిషయంలో చంద్రబాబుతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా నిలదీయాలన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు తీరు సిగ్గుచేటు: మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇక్కడి భూముల ను అధికారంలో ఉన్న పెద్దలకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం భూసేకరణ మంత్రం ఉపయోగిస్తోందన్నారు. ప్ర తిపక్షంలో ఉన్నప్పుడు భూసేకరణను వ్యతిరేకించిన చం ద్రబాబు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించడం సిగ్గుచేటన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయడం వైఎస్సార్సీపీ లక్ష్యమన్నారు. చంద్రబాబు బినామీలే భూములు కొంటున్నారు సీపీఐ కార్యదర్సి జె.వి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ భూసేకరణ చట్టానిక తూట్లు పొడుస్తూ సీఎం చంద్రబాబు బినామీలే భూములు కొంటున్నారని ఆరోపించారు. శాంతియుతంగా కాదని ఉద్యమాల ద్వారానే హక్కులు, భూములు కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. విదేశాల్లో రద్దు చేసిన పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తారా? సీపీఎం నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ విదేశాల్లో రద్దుచేసిన పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. భూసేకరణలో భాగంగా ఎకరాకు మొదట్లో ఆరు లక్షలు, పోరాటం చేస్తే రూ.10లక్షలు, కోర్టుకు వెళ్లగా రూ.18లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. రైతుల్లో చీలిక తెచ్చి తన చేతకాని తనాన్ని నిరూపించుకుందని విమర్శించారు. పార్టీ ఒత్తిడికి తలొగ్గి భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతులనూ నిల దీయాలన్నారు. అన్ని పార్టీలూ ఎదురు తిరగడంవల్లే నరేంద్రమోదీ సైతం భూసేకరణ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు ఎ. మణిరాజు, సీపీఐ జిల్లా కార్యదర్సి స్టాలిన్, వ్యవసాయ కార్మిక సంఘనాయకులు బాలకృష్ణ, రావు జగ్గారావు, మహిళా విభాగం నాయకురాలు ఎ.విమల, డీహెచ్‌పీఎస్ నాయకులు జె.వి.ప్రభాకర్, రైతు నాయకులు లొడగల చంద్రరావు, పి. పాపారావు, శివాజీ రాజు, ఎం. అప్పలరాజు, సర్పంచ్‌లు జి. బాబూరావు, తిరుపతిరావు, గోవిందు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
► జనం చూస్తుండగానే వేట కొడవళ్లతో దాడి ► ప్రాణం తీసిన ‘రియల్’ గొడవలు ► కొత్త ఎస్పీ బాధ్యతలు చేపట్టినరోజే జిల్లాకేంద్రంలో సంచలనం సమయం సాయంత్రం 7:30 గంటలు.. జిల్లాకేంద్రం నడిబొడ్డున.. రద్దీగా ఉండే జిల్లా ఆస్పత్రి ప్రాంతం.. ఆస్పత్రికి వచ్చిన వారు ఇళ్లకు వెళ్తున్నారు. ఎప్పటిలాగే ఆటోలు, ఇతర వాహనాల రద్దీ ఉంది. ముసుగులు ధరించిన కొందరు ఓ యువకుడిని అనుసరిస్తున్నారు. ఇంతలో రోడ్డుపై ఆగిన అతడిపై వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. ప్రతిఘటించే క్రమంలో ప్రాణాలువిడిచాడు. జనం ఈ తంతును చూస్తూ హతాశులయ్యారు. ఫ్యాక్షన్ సినిమా సీన్‌ను తలపించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కొత్త ఎస్పీ బాధ్యతలు చేపట్టిన రోజునే జరిగిన ఈ ఘటన పోలీసులకు సవాల్ విసిరింది..! - మహబూబ్ నగర్ క్రైం జిల్లాకేంద్రంలో ఓ యువకుడిని కొందరు దుండగులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోయిల్‌కొండ మండల కేశావపూర్ పంచాయతీ రాజునాయక్ తండాకు చెందిన బిస్లావత్ విజయ్(35) కొద్దిరోజులుగా జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటూ పట్టణంలోనే ఫైనాన్స్, చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు. ఇదిలాఉండగా, సోమవారం సాయంత్రం స్నేహితుడితో కలిసి బైక్‌పై బజారుకు వచ్చాడు. స్నేహితుడిని న్యూటౌన్‌లో దించేసి అతడు స్థానిక జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డుపై నిల్చున్నాడు. ముందే మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేయడంతో విజయ్ అక్కడిక్కడే రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలొదిలాడు.. ఆ ప్రాంతమంతా రక్తపుమడుగులా మారింది. సమీపంలోనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సంఘటన పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండుగులు పరారయ్యారు. మృతుడి భార్య, అన్న, తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులకు సవాల్‌గా.. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి ఎదుట యువకుడు దారుణహత్యకు గురికావడం సంచలనంగా మారింది. కొత్త ఎస్పీగా రెమా రాజేశ్వరి బాధ్యతలు చేపట్టినరోజునే ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. హత్యస్థలిలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. వాహనాలను పోలీసులు దారిమళ్లించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐ సోమ్‌నారాయణ సింగ్ సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఇదిలాఉండగా, మృతుడు విజయ్ ఫైనాన్స్, రియల్ఎస్టేట్ వ్యాపారంలో భాగస్తుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్దూర్ మండల కేంద్రంలో చేసిన రియల్ వెంచర్ల వద్ద గొడవ తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
నాడు వీఆర్వో.. నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారి!
ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ వీఆర్వో బెహరా సీతారామయ్య ఇంటిపై గురువారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 22 లక్షల రూపాయల నగదు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ ఎత్తున బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీఆవ్వోగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీతారామయ్య ప్రస్తుతం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇబ్రహీంపట్నంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీసీపీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. -
లక్షలిస్తే సరి..!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాలంటే.. అనువైన భూమి చూసుకోవాలి. వ్యవసాయ భూమి అయితే భూ మార్పిడి చేసుకోవాలి. లే-అవుట్ చేయించి కార్పొరేషన్ పరిధిలో అయితే నగర పాలకసంస్థకు పన్ను చెల్లించాలి. గ్రామాల్లో లే-అవుట్ వేస్తే ఆయా పంచాయతీలకు పన్ను చెల్లించాలి. ఇదంతా ఎక్కడైనా జరిగేదే కానీ.. ఏలూరు పరిసర ప్రాంతాల్లో మాత్రం లే-అవుట్ వేయాలంటే మాత్రం ముందుగా ఓ టీడీపీ నాయకుడి వద్దకు వెళ్లాలి. అతని అనుమతి తీసుకోవాలి. అక్కడ సరిపడా ముడుపులు చెల్లించి తర్వాతే లే-అవుట్ పనులు మొదలుపెట్టాలి. లేదంటే కొర్రీలు పడిపోతాయి. ని‘బంధనాలు’ అడ్డొచ్చేస్తాయి. ఎక్కడా లేనివిధంగా ఒక్క ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే సాగుతున్న ఆ నేత భూ దందాతో రియల్టర్లు అల్లాడిపోతున్నారట. ‘హై’టెన్షన్ సదరు నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారి ఉండటంతో పెద్దసంఖ్యలో రియల్టర్లు వెంచర్లు వేసేందుకు ముందుకొస్తున్నారు. హైవే పక్క భూముల్లో వెంచర్లు వేసినా, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసినా లాభాలు దండిగా ఉంటాయని లెక్కలు వేస్తున్నారు. అయితే సదరు నేత ఇండెంట్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయాలన్నా, పారిశ్రామిక వాడ నెలకొల్పాలన్నా తనను కలవాల్సిందేనని ఆ నేత తన అనుయాయులతో చెప్పిస్తున్నారు. తనను కలవని పక్షంలో అదేపనిగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇటీవల వంగూరు ప్రాంతంలో ఓ వ్యక్తి ఐదు ఎకరాల భూమిలో లే-అవుట్ వేశారు. భూమి చదును చేసి పక్కనే ఉన్న పంటకాలువలో పూడిక తీయించారు. వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్లాట్లను అందంగా తీర్చిదిద్దారు. ఓ రోజు ఈ రోడ్డు వెంట వెళుతూ ఆ లే-అవుట్‌ను చూసిన సదరు నేత వెంటనే రెవెన్యూ అధికారులను తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆ ప్రాంతంలో పంటకాలువ ఆక్రమణకు గురైందని, తక్షణం సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఆగమేఘాల మీద వెళ్లిన అధికారులు రియల్ ఎస్టేట్ యజమాని సమక్షంలో సర్వే చేశారు. ఆ తర్వాత నాయకుడి వద్దకు వెళ్లి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు. ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ‘కాలువ ఆక్రమణకు గురైందని నేను చెబితే లేదంటావా. మరోసారి వెళ్లి చూసి రా’ అంటూ గదమాయించారు. ‘పరిస్థితి’ని అర్థం చేసుకున్న భూ యజమాని ఆ నేత వద్దకు స్వయంగా వెళ్లి రూ.10 లక్షలు సమర్పించుకున్నారని తెలిసింది. పుంతరోడ్డును అడ్డం పెట్టుకుని భారీ ఇండెంట్ దొండపాడులో రూ.కోట్లు పలుకుతున్న భూములపై కన్నేసిన సదరు నేత వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ఏడాది క్రితం ఈ ప్రాంతంలోని ఓ పుంత రోడ్డును అభివృద్ధి చేసి పేదలకు పంపిణీ చేస్తామని ప్రకటి ంచారు. ఆ మేరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ముళ్లపొదలు తొలగించి రోడ్డు వేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల భూమి యజమానులు సదరు నేతను కలుసుకున్నారు. ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే రియల్ఎస్టేట్ బూమ్ తగ్గిపోతుందని, భూముల రేట్లు పడిపోతాయని విన్నవించుకున్నారు. తన పాచిక పారిందని భావించిన ఆ నాయకుడు గట్టిగా ఇండెంట్ వేశారట. ఆయన అడిగినంత భారీమొత్తం ఇవ్వలేమని, కాస్త తగ్గించుకోవాలని వ్యాపారులు బేరసారాలు ఆడారట. ఇంకా బేరం తెగని ఈ వ్యవహారంతో పేదలు మాత్రం తమ చేతికి వచ్చాయనుకున్న భూములు దక్కకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారట. -
ఔను.. ‘రియల్’ వెంచరే!
సీఆర్డీఏ ‘భూముల కేటాయింపు విధానం’తో బట్టబయలు * సర్కారు ఆధీనంలోనే 10,000 ఎకరాల భూమి * రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం.. * భూముల ధర నిర్ధారణకు * సీఆర్డీఏ అదనపు కమిషనర్ అధ్యక్షతన కమిటీ సాక్షి, హైదరాబాద్: ఊహించిందే నిజమయ్యింది. రాజధాని పేరిట రైతుల నుంచి వేలాది ఎకరాలు సమీకరిస్తున్న ప్రభుత్వం... ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనుందని ‘సాక్షి’ తొలినుంచీ చెబుతూనే ఉంది. ఇప్పుడదే నిజమైంది. సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) రూపొందించిన ‘భూముల కేటాయింపు విధానం’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాజధాని రైతుల నుంచి సమీకరించిన భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనుంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల పేరిట ఏకంగా 10,000 ఎకరాలను తన ఆధీనంలో ఉంచుకోవాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూమిని జోన్లు, ప్రాంతాల వారీగా గుర్తించి వచ్చే పది సంవత్సరాల్లో వివిధ రంగాలకు విక్రయించనున్నారు. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పర్యాటక, క్రీడల రంగాలకు ఈ భూములను సీఆర్డీఏ కేటాయిస్తుందని భూ కేటాయింపుల విధానంలో పేర్కొన్నారు. భూ కేటాయింపులను మూడు కేటగిరీలుగా సీఆర్డీఏ వర్గీకరించింది. ఫ్రీ హోల్డింగ్ (సర్వహక్కులు కల్పించడం) లేదా 66 ఏళ్లు లేదా 99 ఏళ్ల లీజుపై భూముల కేటాయించనున్నారు. అధిక ఆదాయం పేరుతో ‘రియల్’ వ్యాపారం తొలి కేటగిరీలో భూములను రియల్ ఎస్టేట్‌కు, గృహాలకు, వాణిజ్య అవసరాలకు వేలం పాటలతో విక్రయించడం ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం పొందాలని నిర్దేశించుకున్నారు. అంటే ఇది తమకు నచ్చిన వారికి, నచ్చిన విధంగా కేటాయించే ఎత్తుగడ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కొన్న రాష్ర్టప్రభుత్వం ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనున్నట్లు బహిరంగంగానే ప్రకటించినట్లయింది. ఇక రెండో కేటగిరీలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ఆధారంగా భూములు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈ కేటాయింపులు ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఉంటాయని అంటున్నారు. ఈ కేటాయింపుల ద్వారా ఆయా భూముల చుట్టుపక్కల ఉన్న సీఆర్డీఏ భూముల ధరలకు ఎక్కువ ధర వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు, బీమా కంపెనీలకు, స్టాక్ ఎక్స్చేంజీలకు, ఆర్థిక సంస్థలకు, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలకు ఈ కేటగిరీలో భూ కేటాయింపులు చేస్తారు. అలాగే పరిశోధన సంస్థలు, ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలు, కాలేజీలు, డీమ్డ్ యూనివర్శిటీలకు, లాభదాయకమైన వైద్య సదుపాయాలకు, లాభదాయకమైన మెడికల్ కాలేజీలకు, అలాగే పర్యాటక రంగంలో లేజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, మెడికల్ టూరిజం, హెరిటేజ్ సంబంధిత రంగాలకు, క్రీడలకు భూ కేటాయింపులు చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్, టెక్స్టైల్స్, బిల్డింగ్ మెటీరియల్, లాజిస్టిక్స్, మీడియా సంస్థలకు, క్రీడల శిక్షణ అకాడమీలకు, న్యాయ రంగానికి, లా యూనివర్శిటీకి, ప్రభుత్వ రంగ సంస్థలకు భూములను కేటాయిస్తారు. వాణిజ్యపరమైన హోటల్స్, రిటైల్, లాభదాయకమైన స్కూల్స్, ఇంధన స్టేషన్లకు భూములను పెట్టుబడి, ఉద్యోగాల కల్పన ఆధారంగా కేటాయిస్తారు. విద్య, వైద్య రంగాలకు రాయితీలు మూడో కేటగిరిలో సేవల సంబంధిత వైద్య, విద్య, క్రీడా రంగాలతో పాటు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు రాయితీలపై భూములను కేటాయిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన రంగాలకు కేంద్ర ప్రభుత్వ ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద భూమిని రాయితీపై కేటాయిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు, శానససభ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సహకార గృహ నిర్మాణ సొసైటీలకు కూడా రాయితీలిస్తారు. ఇలావుండగా భూముల ధరను నిర్ధారించేందుకు సీఆర్డీఏ అదనపు కమిషనర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. భూమి ధర నిర్ధారణలో సహకరించేందుకు ధరల నిర్ధారణ కమిటీ అవసరమైన నిపుణులను, కన్సల్టెంట్లను నియమించుకుంటుంది. కమిటీ నిర్ధారించిన ధరలకు సీఆర్డీఏ ఆమోదం తెలుపుతుంది. సీఆర్డీఏ ఆధీనంలో ఉంచే భూమి ధరను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి మార్చి-సెప్టెంబర్ మధ్య సవరిస్తారు. -
ప్లాట్ల వ్యాపారం ఫ్లాప్!
ఆకివీడు: రాష్ట్ర విభజనతో భూములు విలువ భారీగా పెరుగుతుందని భావించారంతా. దీంతో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, మదుపరులు ఇలా డబ్బున్న ఆసాములంతా భూములపై పెట్టబడులు పెట్టారు. పంట భూములు, ఖాళీ స్థలాలు, ఇతరత్రా భూముల్లో లే అవుట్లు వేశారు. జిల్లాలో 4 వేల ఎకరాలకు పైగా భూములు లేఅవుట్లుగా మారాయి. మున్సిపాల్టీ, కార్పొరేషన్ ప్రాంతాల్లో 200 నుంచి 500 ఎకరాల భూములు, మండల కేంద్రాల్లో 50 నుంచి 200 ఎకరాలు, గ్రామ స్థాయిలో 5 నుంచి 20 ఎకరాల భూముల్ని లేఅవుట్లుగా మార్చేశారు. భూముల విలువకు రెక్కలొస్తున్నాయని బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రూ.5 లక్షలున్న ఎకరం భూమి విలువను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పెంచి, ప్లాట్లుగా విభజించి బేరం పెట్టారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు ఈ భూములు కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గతేడాది చివరి నాటికి భూముల కొనుగోళ్లు ఒక్కసారిగా పడి పోయాయి. అమరావతి శంకుస్థాపన, ఆ ప్రాంతంలో భూముల కొనుగోళ్ల వ్యవహారం తదితర అంశాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఆర్థిక మాంద్యమూ కారణమే! ఏడాది నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు సరిగా సాగక వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రైతుల దుస్థితి చెప్పనక్కరలేదు. ఇవన్నీ పరోక్షంగా భూముల కొనుగోళ్లు స్తంభించటానికి కారణమయ్యాయి. మున్సిపాల్టీల సరిహద్దు గ్రామాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూముల విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటి ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశాలూ కన్పించడంలేదు. వ్యాపారం పడిపోయింది ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ప్రజల వద్ద డబ్బులేకపోవడం ఒక కారణమైతే, ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపన, విద్యా సంస్థల స్థాపన, ఇతరత్రా అభివృద్ధి ఏమీ జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కొనేవారు లేకపోయినా లేఅవుట్లు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. - అంబటి రమేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి తగ్గిన రిజిస్ట్రేషన్లు, పెరిగిన దస్తావేజులు భూముల అమ్మకాల శాతం తగ్గినా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు. భీమవరం జిల్లా రిజిస్టార్ పరిధిలో క్రియ దస్తావేజులు రిజిస్ట్రేషన్లు 1.52 శాతం పడిపోయింది. కొనుగోలు శాతం తగ్గడంతో క్రియ దస్తావేజులు చేయించుకునేవారి శాతం తగ్గింది. గతేడాది 27,541 దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఈ ఏడాది 27,197 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇతర దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. భీమవరం పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. - మహ్మద్ సిరాజుల్లా, జిల్లా రిజిస్ట్రార్, భీమవరం -
భూముల ధరలకు రెక్కలు!
► జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారి గుర్తింపుతో పెరిగిన ధరలు ► పాలమూరు ఎత్తిపోతలా కారణమే ► రూ.కోటిదాటిన ఎకరా ధర ► ఊపందుకున్న రియల్ఎస్టేట్ వ్యాపారం జడ్చర్ల: జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది.. జడ్చర్ల -కోదాడ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించడం, రోడ్డువిస్తరణ కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఈ ప్రాంతభూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంతగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రక్రియ కూడా ఊపందుకోవడంతో కొన్నిరోజులుగా జడ్చర్ల కేంద్రంగా రియల్‌వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పొలాలు, ప్లాట్లధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అటు రాష్ట్ర రాజధాని హైదారాబాద్‌కు, ఇటు ఏపీకి దగ్గరగా ఉండడంతో పాటు 44వ నం. జాతీయ రహదారికి కొత్తగా ఆవిర్భావించే జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారి తోడవడంతో ఈ ప్రాంతభూముల ధరలకు డిమాండ్ పెరిగింది. అలాగే పోలేపల్లి సెజ్, తదితర పరిశ్రమలు నెలకొల్పుతుండడంతో ఈ ప్రాంతం పారిశ్రామికరంగంలోనూ దూసుకెళ్తోంది. భూముల ధరలు రెట్టింపు! జడ్చర్ల నియోజవకర్గంలో ఎక్కడ చూసినా భూముల ధరలు రెట్టింపుఅయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఎకరాకు కనీసంగా రూ.ఆరులక్షలు పలుకుతోంది. కొత్తగా ఏర్పడిన జాతీయ రహదారిని అనుసరించి రూ.60లక్షలు నుంచి కోటికి పైగా ఎకరాధర పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ రహదారిని అనుసరించి ఉన్న జడ్చర్ల -కల్వకుర్తి మార్గంలో భూముల ధరలు మరింత పెరిగాయి. మిడ్జిల్ వద్ద ఎకరా రూ.60లక్షలు పెట్టి రియల్ వ్యాపారులు కొనుగోలుచేసి ప్లాట్లుగా మార్చి మార్కెట్లో పెట్టారు. అదేవిధంగా జడ్చర్ల వద్ద రూ.1.30కోట్లుగా ఎకరా కొనుగోలుచేశారు. మండలంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం కాల్వలతో పాటు ఉదండాపూర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తుండడంతో పంటపొలాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎకరాకు రూ.ఆరు నుంచి రూ.12లక్షల వరకు ధరలు పెరిగాయి. రైతులకు భారమైన ధరలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములు కొనుగోలుచేయడం భారంగా మారింది. ప్రభుత్వం రైతుల నుంచి ఎకరా భూమిని రూ.3.50 నుంచి రూ.5.50లక్షల వరకు మాత్రమే కొనుగోలు చేస్తుండడం.. బయట అదేధరలకు భూములు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇంటిస్థలం ఖరీదు కూడా పెరగడంతో భూములు అమ్మిన సొమ్ముకు ప్లాటు రావడం లేదు. ఇప్పటికే జడ్చర్ల మండలంలోని ఆలూరు, బూర్గుపల్లి గ్రామాల శివారులో సుమారు 1400ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలో దాదాపు 1500ఎకరాలకు పైగానే సేకరించనుంది. -
రక్షణ కల్పించండి మహిళా ఎంపీ భర్త ఆవేదన
టీనగర్: తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ తిరుపూరు అన్నాడీఎంకే మహిళా ఎంపీ భర్త ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపూరు నియోజకవర్గం అన్నాడీఎంకే ఎంపీ సత్యభామ (46). ఈమె సొంతవూరు ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం (గోబి) సమీపంలోగల సిరువలూరు. ఆమె భర్త వాసు (48). ఈయన వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సత్యభామ, వాసులు మూడేళ్లుగా విడిపోయి జీవిస్తున్నారు. వీరి ఒకే కుమారుడు సత్యవసంత్. సత్యభామతో నివసిస్తున్నారు. దంపతుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఈ మధ్య వాట్సాప్‌లో విడుదలై సంచలనం కలిగించింది. ఈ క్రమంలో గోబి సమీపంలోగల సిరువలూరు ఎలందైకాడు గ్రామంలో బుధవారం ఉదయం వాసు విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తన భార్యకు గోబి నగర కార్యదర్శి సయ్యద్ బుడాన్షా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీంతో తనను ఎంపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. 2014 పార్లమెంటు ఎన్నికలకు ఆరునెలల క్రితమే తనను కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలో గల ఒక ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో తన భార్యకు తిరుపూరు నియోజకవర్గం సీటు లభించిందన్నారు. తనను హత్య చేసేందుకు సత్యభామ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రస్తుతం తనకు ఆశ్రయం కల్పిస్తున్న అక్కను కూడా బెదిరిస్తున్నారని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. తన ప్రాణానికి, ఆస్తులకు ముఖ్యమంత్రి జయలలిత రక్షణ కల్పించాలని కోరారు. -
సర్వేయర్లకు కాసుల పంట.!
స్పష్టత లేని జీవోపై రైతుల ఆవేదన చేతిచమురు వదులుతోందని గగ్గోలు ఒక పక్క జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెరిగిన భూమి విలువతో పుట్టుకొస్తున్న వివాదాలు... ఈ రెండింటికి ఒకటే పరిష్కార మార్గం.. భూమి సర్వే చేసి హద్దులు నిర్థారిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.... దీనికి అనువుగా ప్రభుత్వం ప్రత్యేక సర్వేయర్లను నియమించినా, వారికి చెల్లించే రుసుంపై స్పష్టత లేకపోవడంతో చేతిచమురు వదులుతోందని రైతులు వాపోతున్నారు. నర్సీపట్నం : స్పష్టతలేని ప్రభుత్వ విధానాలు రైతులను అవస్థలపాల్జేస్తున్నాయి. సర్వేయర్ల విషయంలో ఇదే సమస్యను రైతులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది వరకు మండలానికి ఒక ప్రభుత్వ సర్వేయర్ ఉండేవారు. రైతులు నేరుగా మీ సేవలో రూ. 250 చెల్లిస్తే రెవెన్యూ అధికారుల ఆదేశంతో వారు సంబంధిత రైతుల భూములను కొలిచి హద్దులు నిర్ణయించేవారు. గత పదేళ్ల నుంచి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకు న్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా సర్వే పనులు సైతం పెరుగుతూ వచ్చాయి. దీంతో ఎక్కువ శాతంలో ధరఖాస్తులు రావడం, వాటి పరిష్కారానికి అవసరమైన సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో పెండింగ్ జాబితా చాంతాడంత పెరుగుతూ వచ్చింది. పేరుకుపోయిన సర్వే దరఖాస్తులు నర్సీపట్నం డివిజన్లో ఒక్క ఎస్ రాయవరం మండలంలోనే 495 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం రెవెన్యూ సర్వేయర్లతో పాటు అదనంగా మరికొంతమందిని నియమించింది. అర్హత ఉన్న వారిని గుర్తించి వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్వేకు వినియోగించుకోవాలని ఆదేశించింది. ఈ విధంగా డివిజన్లో ప్రభుత్వ సర్వేయర్లు పది మందితో పాటు ఒక్కో మండలానికి ఐదుగురు లెసైన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విధంగా ప్రభుత్వం అదనపు సిబ్బందిని నియమించినా సమస్య పరిష్కారానికి గతంలో మాదిరిగానే ఈ సేవ లో చెల్లించే రుసుంలో ఎటువంటి మార్పులు చేయలేదు. తప్పని మామూళ్ల బెడద రైతులు తమ భూమికి సంబంధించి హద్దులు నిర్ణయించేందుకు వచ్చిన దరఖాస్తులను గుర్తించిన తహశీల్దార్లు పరిష్కార బాధ్యతను సర్వేయర్లకు ఇంతవరకు బాగానే ఉన్నా తహశీల్దారు ఆదేశాలతో హద్దులు నిర్ణయించే లెసైన్స్డ్ సర్వేయర్లు ఎకరానికి కొంత మొత్తం చెల్లించాలంటూ రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఎకరానికి రూ. రెండు వేల వరకు గుంజుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకున్నా నేరుగా క్షేత్రస్థాయిలో ఈ వసూళ్లకు పాల్పడుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిషత్తులో భూమి సర్వే చేయించాలంటేనే రైతులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని పలువురు ఆవేదన చెందుతున్నారు. రూ.500 మాత్రమే రైతు చెల్లించాలి ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఎక్కువగా ఉంది. దీనివల్ల సర్వేకు అందిన దరఖాస్తుల పరిష్కారానికి జాప్యం ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం మండలానికి ఐదుగురు లెసైన్డ్ సర్వేయర్లను తీసుకుంది. సర్వే జరిపించేకునే రైతు సర్వే రుసుం ప్రభుత్వానికి మీసేవ ద్వారా చెల్లించాలి. సర్వే జరిపినందుకు లెసైన్‌సడ్ సర్వేయర్‌కు రూ.500 రైతే చెల్లించుకోవాలి. - ఎంఆర్పీ బాబు, డివిజనల్ సర్వేయర్, నర్సీపట్నం -
విశాఖ ఐటీ సెజ్‌పై రియల్ కన్ను
నాన్ ఎస్‌ఈజెడ్‌గా మార్చేందుకు పన్నాగం ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం కేంద్రం కాదన్నా త్వరలో జీవో జారీ! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐటీ రంగానికి ప్రోత్సాహం ముసుగుతో ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీవోల జారీకి రంగం సిద్ధం చేశారు. విశాఖపట్నం మధురవాడలోని ఐటీ హిల్-2 ప్రభుత్వ పెద్దల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. గతంలో ప్రభుత్వం నుంచి ఎకరా రూ. 10 లక్షల రేటుకు పొందిన భూములను రూ. 5 కోట్ల చొప్పున విక్రయానికి మార్గం సుగమం చేస్తున్నారు. చట్టం ప్రకారం విక్రయానికి వీల్లేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖ మధురవాడలోని హిల్-1, హిల్-2, హిల్-3లను ఐటీ హిల్స్‌గా ప్రకటించారు. ప్రభుత్వం కేటాయించే భూములు దుర్వినియోగం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎస్ఈజెడ్ల చట్టాన్ని అనుసరించి విశాలమైన హిల్-2ను ఓ జీవో ద్వారా ప్రత్యేక ఆర్థికమండలి(ఎస్ఈజెడ్)గా ప్రకటించారు. ఆ చట్టం నిబంధనలను ఉల్లంఘించడానికి అవకాశం లేదు. భూములు పొందిన సంస్థ కంపెనీని ఏర్పాటు చేసి నిర్వహించాలి. ఆ స్థలాలను ఇతరులకు లీజుకు ఇవ్వడంగానీ విక్రయించడంగానీ చేయకూడదు. అప్పట్లో ఎకరా మార్కెట్ విలువ రూ. 2 కోట్లు ఉండగా ఐటీ కంపెనీలకు అండగా ఉండాలని రూ. 10 లక్షలకు వైఎస్ ప్రభుత్వం 13 సంస్థలకు స్థలాలు కేటాయించింది. అయితే ఇక్కడస్థలాలు పొందిన కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించలేదు. మరికొన్ని సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేసినప్పటికీ నత్తనడకన కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హిల్-2పై ‘రియల్’ చూపు! ప్రస్తుత ప్రభుత్వ పెద్దల చూపు మధురవాడ హిల్-2పై పడింది. అతి తక్కువ ధరకు పొందిన ఆ స్థలాలను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని కొందరు భావించారు. ఇక్కడ ప్రస్తుతం ఎకరా మార్కెట్ ధర రూ. 5 కోట్లుపైగా పలుకుతోంది. దాంతో తాము పొందిన భూములను విక్రయమో, లీజుపేరుతోనో వేరేవారికి బదలాయించాలని భావించారు. హిల్-2పై స్థలాలు కలిగిన సంస్థల యాజమానుల్లో.. ఓ ప్రజాప్రతినిధితోపాటు 2014 ఎన్నికల్లో టీడీపీకి నిధులు సమకూర్చినవారు ఉన్నారు. కానీ రియల్ వ్యాపారానికి వారికి ఎస్ఈజెడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. దాంతో వారు ప్రభుత్వ పెద్దతో ‘మాట్లాడి’ హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించమని కోరగా ఆయన సరేనన్నారు. మరో జీవో తెద్దాం.. ఈ నేపథ్యంలో హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించిన ఏ ప్రాంతాన్నీ నాన్ ఎస్‌ఈజెడ్‌గా మార్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయినా ప్రభుత్వ పెద్ద కేంద్ర ప్రభుత్వాన్ని మాయ చేసి హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా మార్పించేందుకు పన్నాగం పన్నారు. ‘అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా హిల్-2ను ఎస్‌ఈజెడ్‌గా ప్రకటించింది. కాబట్టి మనం ఆ జీవోను రద్దు చేస్తూ మరో జీవో ద్వారా నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటిస్తే సరిపోతుంది’ అని ప్రభుత్వ పెద్ద ఐటీ శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల సీఐఐ సదస్సు సందర్భంగా సూచించా రు. ముఖ్యనేత ఆదేశాలతో ఐటీ అధికారులు ఆ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తద్వారా ఐటీ అభివృద్ధికి కేటాయించిన భూములను ప్రభుత్వ పెద్ద అనుయాయులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధమైపోయింది. త్వరలో హిల్-2ను నాన్ ఎస్‌ఈజెడ్‌గా ప్రకటిస్తూ జీవో జారీ కానుంది. -
దర్శకుడిగా మళ్ళీ చిన్నా
‘‘ఆరేళ్ల క్రితం ‘ఆ ఇంట్లో’ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యా. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని పాత్రలు చేస్తూ వచ్చా. మంచి కథ కుదిరితేనే మళ్లీ డెరైక్షన్ చేయాలనుకున్నా. వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న రవికుమార్ ‘ఆ ఇంట్లో’ సినిమా చూసి, నాతో సినిమా చేయాలనుకున్నారు. మూడు నెలల క్రితం ఆయన కలిశారు. ఆ తర్వాత ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం’’ అని నటుడు, దర్శకుడు చిన్నా చెప్పారు. విహారిక సమర్పణలో వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా చిన్నా దర్శకత్వంలో ఆదరి రవికుమార్ ఓ చిత్రం నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో అతిథిగా పాల్గొన్న హీరో శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌నూ, నటుడు శివారెడ్డి సినిమా పోస్టర్‌నూ ఆవిష్కరించారు. ‘‘ఇది హారర్ మూవీ కాదు. ఫక్తు కామెడీ సినిమా’’ అని చిన్నా తెలిపారు. ‘‘మంచి కథతో ఈ చిత్రం చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘మధురా నగరిలో’తో చిన్నా, తానూ కెరీర్ ఆరంభించామనీ, చిన్నాకి మంచి ప్లానింగ్ ఉందని శ్రీకాంత్ చెప్పారు. మంచి పాయింట్‌తో సినిమాతో తీయబోతున్నారని శివారెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బీవీ నాయుడు. -
పాత ఇంటినీ మెరిపిస్తారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి. స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం... కొత్త ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ చేయడం మామూలే. కానీ, పాత ఇంటికి.. అదీ 40 ఏళ్లకు పైబడిన ఇంటికంటేనే కాసింత కష్టం. అచ్చం ఇదే పరిస్థితి ఎదురైంది చందు నైర్, మినీ నైర్ దంపతులకు. మరి వీళ్లేం చేశారో తెలుసా..! సొంతగానే తమ సొంతింటికి రీ-మోడలింగ్ చేసేశారు. అదీ తక్కువ ఖర్చుతో.. నాలుగు నెలల్లోనే! అది చాలామందికి సూపర్‌గా నచ్చేసింది. ఇంకేముంది!! దీన్నే వ్యాపారంగా ప్రారంభించేశారు కూడా!! అలా 2007లో నిచే హ్యబిటైట్స్ సంస్థకు శ్రీకారం చుట్టారు. దీనిపై వారేమంటారంటే... ‘‘ఏ ఇద్దరి వేలి ముద్రలూ ఒకలా ఉండవన్నది ఎంత నిజమో ఏ రెండు ఇళ్లూ ఒకలా ఉండవన్నదీ అంతే నిజం. ఎక్కడో ఓ చోట కాసింత తేడా ఉంటుంది. అదే ఇంటీరియర్ డిజైన్ మహత్యం. అందుకే ఇంటీరియర్ పరిశ్రమ ఆసక్తికరంగా ఉంటుంది. పాత ఇల్లయినా, కొత్తదైనా ముందుగా కస్టమర్లు తమ అభిరుచులను, అభిప్రాయాలను చెబుతారు. వారి బడ్జెట్‌కు సరిపడే ఇంటీరియర్ డిజైన్స్‌ను చూపిస్తాం. ముందుగానే తమ ఇల్లు ఏవిధంగా ఉండబోతుందో రంగులతో సహా త్రీడీ రూపంలో చూపిస్తాం. ఆ తర్వాతే పని మొదలుపెడతాం. నివాస సముదాయాలే కాదు.. వాణిజ్య, ఆతిథ్య భవనాలను సైతం రీ-మోడలింగ్ చేస్తాం. ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో 70కి పైగా ప్రాజెక్ట్‌లు చేశాం. ఇందులో నివాస సముదాయాల వాటాయే ఎక్కువ. ప్రారంభ ధర చ.అ.కు రూ.1,100 ఉంటుంది. ఇంటీరియర్‌కు అవసరమైన వస్తువులను స్థానిక డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తాం. రెండున్నర నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ఏడాదికి రూ.2 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం. గత రెండేళ్ల నుంచి స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఇంటీరియర్ పరిశ్రమ కూడా ఒడిదుడుకుల్లోనే ఉంది. ప్రస్తుతం బండ్లగూడ, మాదాపూర్, మారేడ్‌పల్లిలో పలు నివాస, వాణిజ్య సముదాయాల్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాం..’’ అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
యాదాద్రిలో అసలేముంది!?
‘యాదాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం. 2,000 ఎకరాల్లో యాదాద్రిని విస్తరించి.. ఏటా రూ.100 కోట్ల పెట్టుబడులతో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం’ - ఇదీ ప్రభుత్వ ప్రణాళిక ‘అనుమతి కోసం డీటీసీపీ/హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటే.. రెండేళ్లయినా ఫైల్ ముందుకు కదలట్లేదు. ఈలోపు బూమ్ తగ్గి ధరలెలా ఉంటాయో చెప్పలేం. అందుకే అనుమతులు రాకపోయినా లే-అవుట్లను వేసేశాం - ఇదీ రియల్టర్ల మాట ‘కూతురి పెళ్లి కోసమో.. కొడుకు పైచదువుల కోసమో దాచిన సొమ్ముతో స్థిరాస్తిని కొంటే.. అది కాస్త అక్రమ లే-అవుట్ అని తెలిసింది. ఇప్పుడేం చేయాలో తెలియని పరిస్థితి’ - ఇదీ సామాన్యుడి ఆవేదన ..ఇదీ క్లుప్తంగా యాదాద్రిలో జరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం!! యాదాద్రిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే.. దాని పేరు చెప్పి 30 కి.మీ వరకూ లే-అవుట్లు, వెంచర్లు వేసి రాత్రికి రాత్రే ధరలు పెంచేశారు రియల్టర్లు. అసలు యాదాద్రి గోపురానికి, రియల్ వ్యాపారానికి మధ్య ఉన్న పీటముడిని విప్పేందుకు ‘సాక్షి రియల్టీ’ స్థిరాస్తి నిపుణులతో చర్చించింది. వారేమన్నారంటే.. సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. 2,000 ఎకరాల్లో విస్తరించనున్న యాదాద్రి అభివృద్ధికి మూడేళ్ల పాటు ఏటా రూ.100 కోట్లు కేటాయించారు కూడా. ఫిబ్రవరిలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)ను ఏర్పాటు చేసి పనులను ప్రారంభించారు. చీకట్లోని యాదాద్రి వెలుగులోకి.. యాదాద్రిలో రియల్ వృద్ధికి అవకాశమే లేదని కొట్టిపారేయలేమని కొందరు నిపుణులంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రారంభిస్తే ముందుగా పెరిగేది స్థిరాస్తి ధరలే. పెపైచ్చు యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికనూ రూపొందించింది. అంటే టెంపుల్ సిటీ ప్లాన్ అనేది గుడి, గర్భగుడికే పరిమితం కాదు.. అక్కడి ప్రాంతం భవిష్యత్తు అభివృద్ధి, ప్రజల మౌలిక వసతులకు అనుగుణంగా ఉంటుంది. అంటే రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, మంచినీరు, విద్యుత్, పరిశ్రమలు, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఇలా ప్రతి ఒక్కదానికీ అవకాశముంటుందన్నమాట. * యాదాద్రి- వరంగల్ మార్గం 163వ నంబరు జాతీయ రహదారిలో ఉంది. ఇది సుమారు 99 కి.మీ. వరకుంటుంది. వాస్తవానికి 163వ జాతీయ రహదారి పరిధి హైదరాబాద్ నుంచి భూపాలపట్నం దాకా 306 కి.మీ. వరకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు.. నాలుగు వరుసల రహదారి కొంత దూరం మాత్రమే ఉంది. దీన్ని సుమారు రూ.2,000 కోట్ల అంచనా వ్యయంతో పూర్తి స్థాయిలో చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు యాదాద్రి అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడంతో ఈ జాతీయ రహదారికి ఇరువైపులున్న గ్రామాలకు మహర్దశ పట్టింది. భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులనూ తగ్గించేందుకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఇంటర్ చేంజ్ ఫ్లై ఓవర్లనూ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ట్రాఫిక్ చిక్కులుండవు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేరవేయవచ్చు. ఇక్కడ హోటళ్లు, రిసార్టులు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటివి ఏర్పాటయ్యే అవకాశముంది. * పోచారంలో ఐటీఐఆర్ రీజియన్ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం కానుండటం, బీబీనగర్‌లో గల నిమ్స్‌కు ఎయిమ్స్ హోదా దక్కనుండటం, ఇన్ఫోసిస్, రహేజాలు ఆరంభం కావటం, ఉప్పల్ ప్రాంతంలో మెట్రో ప్రారంభం కానుండటం.. మెట్రోను యాదాద్రి వరకూ విస్తరించటం వంటి అనేక సానుకూల అంశాలు యాదాద్రిలో స్థిరాస్తికి మరింత జోష్‌ను తీసుకొస్తుందనేది నిపుణుల అభిప్రాయం యాదాద్రిలో అన్నీ ఓపెన్ ప్లాట్లే.. హైదరాబాద్ నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న యాదాద్రి చుట్టూ 30 కి.మీ. పరిధిలో ఓపెన్ ప్లాట్లే ఉంటాయి. ఒక్క నిర్మాణమూ కనిపించదు. పోనీ ప్లాట్లలోనే ఇళ్లు కట్టుకుందామంటే నీళ్లు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలూ లేవు. ఈమధ్య కాలంలో కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే.. ఖాళీ స్థలాల్లో టేకు, గంధం, మలబారు, పండ్ల మొక్కలను పెంచి 15 ఏళ్ల తర్వాత వాటిని అమ్మి పదింతల లాభాన్ని పొందవచ్చని కళ్లబొల్లి మాటలు చెబుతూ సామాన్యులను మోసం చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాస్తవానికి ఇలాంటి ఫాం ప్రాజెక్టులు గతంలో చాలానే వచ్చాయి. ఒక్కటీ సక్సెస్ అయిన దాఖలాల్లేవు. ప్రభుత్వానిదీ తప్పే.. యాదాద్రిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గమనిస్తే అక్కడ రియల్ అవకాశాలు, వృద్ధి 5 కి.మీ. పరిధి వరకే విస్తరిస్తుందే తప్ప రియల్టర్లు చెబుతున్నట్టు యాదాద్రి నుంచి 30-40 కి.మీ. వర కూ ఉండదు. ఎందుకంటే యాదాద్రి అనేది తెలంగాణలోని అన్ని జిల్లాలకూ దూరమేమీ కాదు. దీంతో ఇతర జిల్లాల నుంచి భకు ్తలు ఒక్కరోజులో వచ్చివెళతారే తప్ప.. అక్కడే ఉండేంత అవసరం లేదు. * స్థిరాస్తుల్లో జరుగుతున్న మోసాల్లో కేవలం బిల్డర్లనే తప్పుపట్టలేం. ఎందుకంటే అనుమతుల జారీలో తీవ్రమైన జాప్యం చేస్తు న్న ప్రభుత్వానిదీ తప్పే. అందుకే త్వరితగతిన అనుమతుల జారీతో పాటు అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. * భవిష్యత్తు అభివృద్ధిని ఇప్పుడే ఊహించుకొని స్థిరాస్తులను కొనుగోలు చేయొద్దు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేముందు అది దీర్ఘకాలికమా.. తక్షణ అవసరమా అనేది నిర్ణయించుకోవాలి. బడ్జెట్, లొకేషన్, ప్రస్తుతం అక్కడున్న సౌకర్యాలు, మౌలిక వసతులను క్షుణ్నంగా ఆరా తీయాలి. ఆధ్యాత్మిక రాజధాని.. ‘తిరుపతి’ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు స్థిరాస్తి రంగంలో తిరుపతి అభివృద్ధి అవకాశాలను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ తర్వాత చెప్పుకోవాల్సిన నగరం చిత్తూరు నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న తిరుపతి. 20 కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న తిరుపతిలో రియల్ వృద్ధికి ప్రధాన కారణం ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయలే. నగరం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న రేణుగుంట విమానాశ్రయంతో ఇక్కడ రియల్ వ్యాపారం జోరుగానే సాగుతోంది. త్వరలోనే ఇది అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కూడా. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దు తిరుపతి. నిత్యం ఆయా రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బెంగళూరు, చెన్నై వాహనాలు తిరుపతి మార్గంగానే వెళ్లాలి. దీంతో రోడ్డుకిరువైపులా స్థిరాస్తి వ్యాపారం జోరుగా ఉంటుంది. దీనికి తోడు దక్షిణాదిలోనే ఒకే ప్రాంతంలో ఆరు విశ్వ విద్యాలయాలున్నాయిక్కడే. ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ వ్యవసాయ, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ మహిళా, ఎస్వీ వేద, ఎస్వీ మెడికల్ సైన్ వర్శిటీలతో పాటుగా పాతికకు పైగానే ఇంజినీరింగ్ కళాశాలతో తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. తిరుపతి దేవస్థానానికి ప్రతి రోజు వచ్చి పోయే భక్తుల జనాభా 60 వేలకు పైమాటే. హుండీ ఆదాయం ఏటా రూ.2,000 కోట్లు. సంయుక్త రాష్ట్రంతో పోల్చుకుంటే తిరుపతిలో స్థిరాస్తి ధరలు 20 శాతం పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. మంగళ్‌రోడ్, తిరుచానూర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2-3 వేలు, సిటీలో అయితే రూ.4-9లుగా ఉన్నాయి. * ఇంటి గోడలకు వేసే రంగుల్లో ప్రధానంగా కూల్, వామ్ కలర్స్ అని రెండు రకాలుగా ఉంటాయి. వామ్ కలర్స్‌లోని ఎరుపు, ఆరెంజ్, పసు పు, ఆకుపచ్చలోని పలు రకాలు ప్ర దానంగా నాడీ వ్యవస్థ, బీపీ, హార్ట్బీట్పై ప్రభావాన్ని చూపిస్తాయి. * ఎరుపు రంగు మనిషిని ఉత్తేజితుల్ని చేస్తుంది. ఈ రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మంచిది కాదు. నీలం రంగు శరీరంలో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. అయితే కొన్ని ముదురునీలం రంగులు జాగ్రత్తను సూచిస్తాయి. కళ్లముందే కాదనలేని నిజాలు.. విమానాశ్రయం వస్తుందనో.. మెట్రో రైలు రానుందనో.. సాఫ్ట్వేర్ సంస్థలొస్తున్నాయనో రాత్రికి రాత్రే ధరలను పెంచేసి సామాన్యుని సొంతింటి కలను దూరం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. కొనుగోలుదారులిక్కడ గుర్తించాల్సిన అంశం ఏంటంటే.. ‘‘మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది.. నివాసయోగ్యమైన ప్రాంతాల్లోనే స్థలాల ధరలు పెరుగుతాయి. అది కూడా ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొస్తేనే!! అంతే తప్ప భవిష్యత్తులో చోటు చేసుకునే అభివృద్ధిని ఇప్పుడే ఊహించి ఐదేళ్ల తర్వాత పెరగాల్సిన స్థలాల ధరలు అలా అమాంతం పెరగకూడదు. నగరం అభివృద్ధి దిశలో స్థిరంగా పయనించడానికిది సరైన సంకేతం కాదని రామ్ డెవలపర్స్ ఎండీ రామ్ చెప్పారు. నగరంలో కొనుగోలుదారులకు ఎదురైన చేదు అనుభవాల్లో కొన్ని.. * ఏడాదిన్నర క్రితం మియాపూర్‌లో ప్రతిపాదిత మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలం ధర గజానికి రూ.13,000 అటుఇటుగా ఉండేది. ఈరేటును మధ్యవర్తులు రూ.30 వేలు దాటించేశారు. పోనీ ఇక్కడ అనూహ్య రీతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయా అంటే అదీ లేదు. ప్రధాన రహదారిలో రోడ్డు వెడల్పు చేశారే తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మంచినీటి సరఫరా పెరగలేదు. కాలనీల్లో అంతర్గత రోడ్లూ వేయలేదు. మరీ ఎందుకు హఠాత్తుగా రేటు పెరిగిందంటే.. ‘మెట్రో స్టేషన్ వస్తోంది సార్.. అందుకే రేట్లు పెరిగాయి’ అని రియల్టర్లు జవాబిస్తున్నారు. మెట్రో పనులు జరిగినంత మాత్రానా ఇక్కడ నివసించే ప్రజల జీవితాల్లో సమూల మార్పులేమైనా జరిగాయా? ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలేమైనా పుట్టుకొచ్చాయా అంటే అదీ లేదు. * బూమ్ సమయంలో మహేశ్వరంలో ఫ్యాబ్ సిటీ వస్తోందంటూ.. విమానాశ్రయానికి దగ్గరంటూ అరచేతిలో అద్భుతాలను చూపించారు రియల్టర్లు. దీంతో గజం ధర రూ.10 వేలు పెట్టి కొన్నవారూ ఉన్నారు. కానీ, నే డక్కడ ఇంత ధర పెట్టేందుకు ఎవరూ ముందుకురావట్లేదు. దీంతో స్థలాలు కొన్నవారి పరిస్థితి అటు అమ్ముకోలేక.. ఇటు స్థలాన్ని అట్టిపెట్టుకోనూ లేక తెగ ఇబ్బంది పడుతున్నారు. * భాగ్యనగరం సిటీ నుంచి ఔటర్ వైపు అభివృద్ధి చెందుతుందంటూ ఓఆర్ఆర్ చుట్టూ లే-అవుట్లు వేసి సామాన్యులకు అంటగట్టారు బిల్డర్లు. అయితే ప్రస్తుతం ఓఆర్ఆర్ 90 శాతం పూర్తయింది. కానీ, అక్కడ ఒక్క నివాస సముదాయం గానీ, పరిశ్రమలు గానీ వచ్చిన దాఖలాల్లేవు. * మాదాపూర్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటైన నాలుగైదేళ్ల తర్వాత కానీ అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాల ధరలు పెరగలేదు. 2003 వరకూ మాదాపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.5,000 లోపు ఉండేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. -
క్లబ్‌లు తెరుద్దాం
ప్రజాప్రతినిధులపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు పక్క జిల్లాలో లేని అభ్యంతరం ఇక్కడెందుకని ప్రశ్న వారి ఆవేదనను అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన రాజధాని నగరమంటే మంత్రులు, అధికారులు, కార్యాలయాలే ఉంటే ఎట్లా.. కాస్తంత రిక్రియేషన్, ఆపై సంపాదన కూడా ఉండాలనే ఆలోచన తెలుగు తమ్ముళ్లకు వచ్చింది. ఇంకేముంది తమకు అనుకూలురైన ప్రజాప్రతినిధుల ద్వారా పేకాట క్లబ్‌లు తెరిపిం చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. విజయవాడ సిటీ : రాజధాని ముఖద్వారం కృష్ణా జిల్లాలో పేకాటక్లబ్‌లు ఏర్పాటుచేయాలని తమ్ముళ్లు ఉబలాటపడుతున్నారు. వాటి ఆవశ్యకతను వివరించడంతో పాటు అందుకు సహకరిస్తే ఒనగూరే ఆర్థిక ప్రయోజనాల్ని ఎరగా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా ఊ..అనిపిస్తే చాలు, పోలీసుపరంగా తాము మేనేజ్ చేసుకుంటామనే భరోసా ఇస్తున్నారు. వీరి ప్రతిపాదనలపై కొందరు కేబినెట్ స్థాయి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వీరి ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే దసరా నాటికి జిల్లాలో ఐదారు పేకాటక్లబ్‌లు రావడం ఖాయమనిపిస్తోంది. ప్రయత్నాల్లో తెలుగు తమ్ముళ్లు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి కుమారుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మూతపడిన పేకాట క్లబ్‌ను నెల రోజుల కిందట తెరిపించి నిర్వహిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన కొందరు అధికార పార్టీ నాయకుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ క్లబ్లో పేకాడేందుకు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన జూదరులు ‘హ్యాపీ’గా వెళ్లొస్తున్నారు. ఇదే రీతిలో తాము కూడా ఏర్పాటు చేసుకుంటామంటూ పలువురు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. కంచికచర్ల మండలం, ఆగిరిపల్లి మండలంలో మూతపడిన క్లబ్‌లను తెరుస్తామంటూ ముందుకొస్తున్నారు. వీటిల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు భాగస్వాములుగా చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ నగరంలో ఓ సొసైటీ క్లబ్‌తోపాటు మరో కొత్త క్లబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవికాక నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లోని మామిడి తోటలు, నందిగామ, గుడివాడ, కైకలూరు పరిసర ప్రాంతాల్లోని పొలాల అతిథి గృహాల్లో తాత్కాలిక క్లబ్‌ల ఏర్పాటుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సొమ్ము చేసుకునేందుకే.. రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా పలువురు బలోపేతం అవుతున్నట్టు తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. భూములు అమ్మడం ద్వారా కొందరు ఆర్థిక స్థితిమంతులైతే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లాభాలు ఆర్జించేవారి సంఖ్య కూడా బాగానే ఉంది. దసరాకు రాజధానికి శంకుస్థాపన చేస్తే విజయవాడ పరిసర ప్రాంతాలు, కృష్ణాజిల్లాలో భూముల క్రయవిక్రయాలు పెరిగి ఆదాయ వనరులు మరింత పెరుగుతాయని వారి ఆశ. పైగా రాజధానికి చేరువ కావడంతో వ్యాపారాలన్నీ కూడా బాగానే పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇక్కడ క్లబ్‌లు లేకుంటే హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లి పేకాడతారని, ఇక్కడి సంపద పొరుగు ప్రాంతాలకు తరలివెళుతుందని చెబుతున్నారు. ఇక్కడే క్లబ్‌లను అనుమతించిన పక్షంలో అందరికీ ‘ప్రయోజనం’ ఉంటుందనే ఫార్ములాను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పేకాట క్లబ్‌ల్లో నిబంధనలు అతిక్రమించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామంటూ ప్రతిపాదిస్తున్నారు. వీటిని సంబంధిత పోలీసు స్టేషన్లకు అనుసంధానం చేస్తామని, ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలించుకోవచ్చంటున్నారు. పేకాట వ్యవహారాలు నిక్కచ్చిగా జరిగే విధంగా కొందరు పోలీసు సిబ్బందిని సీసీ కెమెరాల పర్యవేక్షణకు పెడితే బాగుంటుందని, అవసరమైతే వారికయ్యే జీతభత్యాలు కూడా తామే చెల్లిస్తామనే అభిప్రాయాన్ని కూడా వీరు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లుగా పార్టీని మోసిన తమకు ఈ మాత్రం మేలు చేయకుంటే ఎలాగంటూ ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లకు దిగుతున్నారు. ఇప్పటికే వీరిపై సానుకూలంగా ఉన్న గాడ్ఫాదర్లు ఓ మంచి ముహుర్తం చూసుకుని అధినేత నుంచి గ్రీన్‌సిగ్నల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
రాజధానా? వ్యాపారమా?
సాక్షి, గుంటూరు: పాలకులు రాజధాని కడుతున్నారా? లేక రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? అంటూ జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ఎదుట రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం, అధికారులు మారిపోతే తమకు ఇచ్చిన హామీలను ఎవరు నెరవేరుస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్ ఇవ్వడంతో పవన్‌కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాక గ్రామంలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి, నవులూరు, నిడమర్రు, కురగల్లు గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ కింద రాజధానికి భూములు ఇచ్చేందుకు మీకున్న అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు తీసుకున్నారని రైతులు చెప్పారు. ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఇవ్వలేదని తెలిపారు. 29 గ్రామాల్లో ఓపెన్‌బ్యాలెట్ పెడితే అసలు విషయం బయటపడుతుందన్నారు. పవన్‌కల్యాణ్ రాక కోసం ఉదయం నుంచి ఎదురుచూసిన అభిమానులు ఆయన మాట్లాడుతున్న సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఇదే సమయంలో విలేకరులపై రాళ్లు రువ్వారు. ఒక రాయి పవన్ పక్కనే పడింది. దీంతో పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీచార్జి చేశారు. -
అవని.. ఆకాశమే హద్దని
జిల్లాలో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సామాన్య, మధ్య తరగతి జనం సెంటు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తూ రియల్టర్లు భూముల ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. నరసాపురం అర్బన్ : జిల్లాలో భూముల ధరలకు భారీగా రెక్కలు వచ్చాయి. జిల్లాలో మారుమూల ఉన్న నరసాపురంలో మార్కెట్ ప్రాంతంలో గజం స్థలం రూ. 2 లక్షలు పైనే పలుకుతోంది. ఏలూరు నగరంతో పాటు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. ఈ పట్టణాల్లోని మారుమూల కూడా గజం రూ.15 వేలకు చేరింది. రాష్ట్ర విభజన నేపధ్యంలో పాలకులు అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తుండడం, ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భూమ్ తీసుకొచ్చి ధరలు పెంచేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజనకు ముందు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ మంది. ఒకానొక దశలో భూములను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, అనేక రకాల పరిశ్రమలు స్థాపిస్తామనే ప్రకటనలు గుప్పించడంతో అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రధాన పట్టణాల్లో భూముల ధరలు రివ్వున ఆకాశాన్ని తాకాయి. జిల్లాకు శివారున ఉండే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సైతం పంట భూములు ఎకరం రూ.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన అపార్ట్మెంట్ల సంస్కృతి పల్లెలకూ పాకుతోంది. ఏలూరు కార్పొరేషన్‌తో సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాలకు సంబంధించి 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల ధరలు చుక్కలనంటడంతో ప్రభుత్వం కూడా పేదలకు నివాస గృహాల నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. భూముల ధరల పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మారింది. -
చతుర్ముఖ వ్యూహం
రాజధాని కేంద్ర ప్రాంతం నిర్మాణానికి చతుర్ముఖ వ్యూహంతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. 1. ప్రధాన పరిపాలన కేంద్రం 2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం) 3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం) 4. అమరావతి వాటర్ ఫ్రంట్(అమరావతి నదీ ముఖం)గా రాజధాని కేంద్ర ప్రాంతాన్ని విభజించారు. 1. అమరావతి ప్రధాన పరిపాలన కేంద్రం (అమరావతి గవర్నమెంట్ కోర్) ఇది అమరావతి రాజధాని నగరంలో అత్యంత కీలకమైనది. ప్రధాన పరిపాలన కేంద్రాన్ని లింగాయపాలెం సమీపంలో నిర్మించాలని ప్రతిపాదించారు. శాసనసభ, శాసనమండలి, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ గృహాలు, ప్రాంతీయ వైద్య శాలలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, నగర గ్యాలరీలను ఈ కేంద్రంలో నిర్మిస్తారు. కార్యాలయాలకు ఉద్యోగులు సులభంగా వెళ్లడానికి వీలుగా ప్రత్యేక నడక, సైకిల్ మార్గాలు, 100 మీటర్ల వెడల్పుతో కూడిన సువిశాలమైన రహదారులు, మెట్రో రైలు మార్గాలు నిర్మిస్తారు. 2. అమరావతి డౌన్‌టౌన్ (ప్రధాన వాణిజ్య కేంద్రం) రాజధాని నగరంలో ప్రధానమైన వాణిజ్య కేంద్రం ఇది. ఉద్దండరాయనిపాలెం సమీపంలో ప్రధాన వాణిజ్య కేంద్రాన్ని నిర్మిస్తారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం భారీ భవంతులను నిర్మిస్తారు. వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లను ఏర్పాటుచేస్తారు. 3. అమరావతి గేట్‌వే (అమరావతి ముఖద్వారం) రాజధాని అమరావతికి ఇది ముఖద్వారం. తాళ్లాయపాలెం అమరావతికి ముఖద్వారం కానుంది. కృష్ణా నదిపై తాళ్లాయపాలెం సమీపంలో అత్యాధునిక హంగులతో వారధిని నిర్మిస్తారు. గన్నవరం విమానాశ్రయం, విజయవాడ నుంచి 30 నిమిషాల్లోగా రాజధాని ప్రధాన కేంద్రానికి చేరుకునేలా ఈ వారధి మీదుగా రహదారిని నిర్మిస్తారు. తాళ్లాయపాలెం వద్ద రాజధాని ప్రత్యేకతను చాటిచెప్పేలా ఐకానిక్ టవర్లను నిర్మిస్తారు. ముఖద్వారాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, వినోదం కోసం చిత్తడి నేలలతో కూడిన ఉద్యానవనం(వెట్‌ల్యాండ్ పార్క్)ను ఏర్పాటు చేయనున్నారు. 4. అమరావతి వాటర్‌ఫ్రంట్ (అమరావతి నది ముఖం) రాజధాని ప్రజల వాణిజ్య, వినోద కార్యకలాపాల కోసం అమరావతి నది ముఖంను నిర్మించనున్నారు. ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం మధ్యలో వాటర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రజలకు వినోదం పంచేలా నది ముఖాన్ని తీర్చిదిద్దనున్నారు. కన్వెన్షన్ సెంటర్, ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్, అమరావతి ప్లాజా, సాంస్కృతిక, కళా కేంద్రాలు నె లకొల్పనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ఇలా.. * అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేలా అమరావతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. * తాగునీరు:ప్రజల అవసరాలకు రోజుకు 95.7 మిలియన్ లీటర్ల నీళ్లు అవసరం అవుతాయని అంచనా. అందుకు పులిచింతల ప్రాజెక్టు, కొండవీటి వాగుపై రిజర్వాయర్లు నిర్మించనున్నారు. 24 గంటల విద్యుత్: సీడ్ కేపిటల్‌కు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి 398.5 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ విద్యుత్‌ను సీడ్ కేపిటల్‌కు సరఫరా చేయడానికి వివిధ కెపాసిటీల్లో సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. సరఫరాకుభూమిలో(అండర్‌గ్రౌండ్) కేబుల్ వేస్తారు. రవాణా సదుపాయం: సీడ్ కేపిటల్లో 88 కిమీల పొడవున రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. -
దందాయే ‘రియల్’ ప్లాన్
రాజధాని నిర్మాణంలో లక్ష కోట్ల వ్యాపారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి సప్తవర్ణాల ఆకాశ హర్మ్యాలతో సింగపూర్ గీసిన చిత్రాల వెనుక.. రైతుల భూములు పెట్టుబడిగా పెట్టి లక్ష కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్న ప్రణాళిక విస్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిగా నామకరణం చేసిన కొత్త రాజధాని నిర్మాణం.. మాస్టర్ ప్లాన్, మాస్టర్ డెవలపర్ దశలను దాటి ఇప్పుడు మాస్టర్ మైండ్ దశకు చేరుకుంది. రాజధానిలో ప్రభుత్వ భవనాలకు కేవలం 2,000 ఎకరాలు చాలని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. మరైతే.. ఆ ప్రాంతంలోని అమాయక రైతుల నుంచి సమీకరించిన, ప్రభుత్వ అధీనంలో ఉన్న, స్వాధీనం చేసుకోబోతున్న 57,000 ఎకరాల భూములతో ఏం చేయనున్నారు? * మాస్టర్ ప్లాన్ - మాస్టర్ డెవలపర్ వెనుక మాస్టర్ మైండ్ ఇదే * భూములు సింగపూర్ రియల్ సంస్థలకు ధారాదత్తం * రాజధానికి 2,000 ఎకరాలు సరిపోతాయన్న సీఎం * 50 వేల ఎకరాల సమీకరణ, సేకరణ ఎందుకు? * అన్నీ పోగా సర్కారు చేతిలో 25 వేల ఎకరాలు * ప్రస్తుతం ఎకరం రూ. 2 కోట్లు చొప్పున 50 వేల కోట్లు * పభుత్వం చెబుతున్నట్లుగా త్వరలో రెండు రెట్లు పెరిగినా మొత్తం లక్ష కోట్లు * ‘అభివృద్ధి’కి కట్టబెట్టి.. అత్యధిక వాటా ఇవ్వనున్న సర్కారు సర్కారు చేతిలో 25 వేల ఎకరాలు... రాజధానికి ఎంపిక చేసిన 29 గ్రామాల్లో మొత్తం 57,000 ఎకరాలకు పైగా భూములు ఉంటే.. రైతుల నుంచి 33,400 ఎకరాల పట్టా భూములు సమీకరించినట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక అటవీ, డొంక, పోరంబోకు, దేవాదాయ, అసైన్డ్ తదితర భూములన్నీ కలిపి మరో 18,116 ఎకరాలు సర్కారు అధీనంలోనే ఉన్నాయి. మొత్తం కలిపితే ప్రభుత్వ స్వాధీనంలో 51,516 ఎకరాల భూములు ఉన్నట్లు లెక్కతేలుతోంది. ఇందులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం 9,144 ఎకరాలను (అభివృద్ధి చేసిన తర్వాత) తిరిగి రైతులకు ఇస్తారు. మిగిలిన 42,372 ఎకరాల్లో 40 శాతం(16,950 ఎకరాలు) మౌలిక సదుపాయాల కల్పన పేరుతో తీసివేసినా ఇంకా 25,423 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇక రైతుల చేతుల్లోనే ఉన్న మరో 5,000 ఎకరాలను భూ సేకరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది. రాష్ట్ర రాజధానికి భూమి పూజ చేసిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామన్న తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయనీ, కోట్లల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్న ధర ఎకరా కోటి నుంచి రెండు కోట్లకు పై మాటగా ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడున్న ధర ప్రకారం 25 వేల ఎకరాలంటే 50 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు సర్కారు చేతిలోకొచ్చినట్టు. ఇంకో ఏడాది ఆగితే ధర రెండు రెట్లు పెరుగుతుందని ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న వారు లెక్కలేశారు. ఆ లెక్కన వేసుకున్నా ప్రభుత్వం చేతిలో ఉన్న భూముల ధర ఒక లక్ష కోట్ల రూపాయలు దాటిపోతోందన్నది నిజం. మరి ఆ భూములను ఏం చేస్తారంటే.. ‘అభివృద్ధి’ ముసుగులో విదేశీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ధారాదత్తం చేయబోతున్నారు. ఇక పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో కృష్ణా నదికి ఎగువ భాగాన మరో 10,000 ఎకరాలను సమీకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించటం వేరే విషయం. ‘స్విస్ చాలెంజ్’లో వేరే సంస్థలు రాగలవా? రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ విధానంలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ముందు ఒక ప్రణాళికను రూపొందిస్తారు. దానిమేరకు మాస్టర్ డెవలపర్లను ఆహ్వానిస్తారు. కానీ.. పెద్దపెద్ద ప్రాజెక్టులు, సెజ్‌లు లేదా ఇలాంటి రాజధాని నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో.. మాస్టర్ ప్లాన్ రూపొందించిన సంస్థలే ఆ ప్రాజెక్టును ఏ మేరకు చేపట్టవచ్చన్న అవగాహన కలిగి ఉంటాయి. ఇప్పుడు సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఏ జర్మనీ లేదా ఆస్ట్రేలియా కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా రావడానికి ఇష్టపడవు. సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది కాబట్టి బయటి సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచవు. సింగపూర్ కంపెనీల కన్షార్షియం... అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఇన్కార్ప్) సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ-సింగపూర్)తో గత డిసెంబర్ 8వ తేదీన ఒప్పందం జరిగింది. ఆ సంస్థ.. మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను ఆ దేశంలోని కార్పొరేట్ సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ హోల్డింగ్స్ (సుర్బానా), జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (జురాంగ్) సంస్థలకు అప్పగించింది. ఆ సంస్థలేమో.. రాజధాని ప్రాంత ప్రణాళిక (కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్), రాజధాని నగర ప్రణాళిక (కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్), సీడ్ కేపిటల్ డెవలప్మెంట్ ప్లాన్ పేరుతో మూడు ప్రణాళికలుగా విడదీసి అందించాయి. ఇప్పుడిక ఆయా మాస్టర్ ప్లాన్లలో చూపించిన చోట ఆయా నిర్మాణాలు చేపట్టడానికి, వాటికి అవసరమైన సంస్థలను ఆహ్వానించడానికి వ్యవహార కర్తగా ఒకరిని ఎంపిక చేస్తారు. ఆ వ్యవహార కర్తే ‘మాస్టర్ డెవలపర్’. మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికే ఏడు మాసాలు కసరత్తు చేసిన సింగపూర్ కార్పొరేట్ దిగ్గజాలకు మాత్రమే ఇందులోని లోగుట్టు అర్థమవుతుంది. రాజధాని ప్రాంతంలోని నేల పరిస్థితుల నుంచి నదీ ప్రవాహం, భూముల సమీకరణ, నిర్మాణాల వంటి అనేక విషయాల్లో ఎప్పటికప్పుడు సమగ్రమైన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు అందించింది. ఇప్పుడు రాజధాని లోగుట్టు ఆ సంస్థలకే తెలుసు కనుక మాస్టర్ డెవలపర్‌గా స్విస్ చాలెంజ్ విధానానికి అవే ముందుకొస్తాయి. సుర్బానా, జురాంగ్‌లు పరస్పర సహకారంతో మాస్టర్ ప్లాన్లు రూపొందించగా.. మాస్టర్ డెవలపర్‌గా రంగంలోకి దిగేందుకు రెండు సంస్థలు ఒక్కటయ్యాయి. అలాగే.. సింగపూర్‌లో మరో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థ అసెండాస్ మాస్టర్ డెవలపర్‌గా కూడా ఆసక్తి చూపింది. ఆ దేశానికే చెందిన మరో సంస్థ సింగ్‌బ్రిడ్జి గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే అసెండాస్‌లో విలీనమైంది. అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్ ప్రతినిధి ఏపీ రాజధాని నిర్మాణానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని గత వారం సింగపూర్‌లో ప్రకటించారు. సింగపూర్ కంపెనీలకు భారీ వాటాలు... హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ సంస్థలు కార్యాలయాల కోసం చంద్రబాబు అప్పట్లో ఒక హైటెక్ సిటీ పేరుతో మాదాపూర్‌లో ఒక భవనం నిర్మించారు. ఆ భవన నిర్మాణ పనిని.. టీడీపీ ప్రధాన కార్యాలయం నడుస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని నిర్మించి ఇచ్చిన ఎల్ అండ్ టీ కంపెనీకి అప్పగించారు. ఏపీఐఐసీ కేటాయించిన స్థలంలో హైటెక్ సిటీ నిర్మించారు. నిర్మించినందుకు ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం అందులో 89 శాతం వాటా ఇచ్చింది. ఉచితంగా నీరు, విద్యుత్ సమకూర్చడమే కాకుండా అనేక రాయితీలు ఇచ్చింది. భూమి ఇచ్చిన ఏపీఐఐసీకి అందు లో వాటా 11 శాతమే. ఆ భవనంపై సర్వహక్కులూ ఎల్ అండ్ టీ సంస్థవే. సరిగ్గా ఇప్పుడు ఇదే పద్ధతిలో అమరావతి రాజధాని నిర్మాణం జరగబోతోంది. రైతుల నుంచి ఉచితంగా భూములు తీసుకుని ఆ భూములను పూర్తిగా మాస్టర్ డెవలపర్‌కు అప్పగిస్తారు. ఆ మాస్టర్ డెవలపర్ తాను పిలుచుకున్న సంస్థకు ఒక్కో ప్రాజెక్టును కట్టబెడతారు. ఇప్పుడు ప్రభుత్వం గంపగుత్తగా మాస్టర్ డెవలపర్‌కు వాటా ఇస్తుందా? లేదా ఒక్కో కంపెనీకి ఒక్కో ప్రాజెక్టుపై వాటా(భూములు) ఇస్తుందా? తేలాల్సి ఉంది. రైతుల భూములే పెట్టుబడిగా... రాజధాని కోసం నిధులు లేవని పదే పదే చెప్తున్న చంద్రబాబు.. అక్కడ నిర్మించే ప్రభుత్వ భవనాల కోసం మొత్తం రూ. 12,356 కోట్లు వ్యయం అంచనా వేసి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. అందులో కేంద్రం ఇప్పటికే రూ. 1,500 కోట్లు విడుదల చేసిందని కూడా ఆయన ప్రకటించారు. నిర్మాణ క్రమంలో ఒత్తిడి చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశముంది. కానీ.. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి డబ్బులు లేవన్న కారణం చెప్తూ.. ఆయా కంపెనీలకు భూములు ఇచ్చి నిర్మాణం చేయించే ప్రణాళిక పేరుతో ఈ రియల్ దందా మొదలుకాబోతోంది. సాధారణంగా.. నగరంలో ఒక వ్యక్తికి 500 గజాల స్థలం ఉంటే దాంట్లో అపార్ట్మెంట్ నిర్మిస్తామని ఎవరైనా బిల్డర్ ముందుకొస్తే (హైదరాబాద్ లాంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో) నిర్మించిన దానిలో 50 శాతం బిల్డర్‌కు మరో 50 శాతం స్థలం యజమానికి చెందేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఆయా నగరాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి ఈ ఒప్పందాల్లో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. కానీ.. రాజధానిలోని ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి కట్టబెడితే అందులో హైటెక్ సిటీ తరహాలో నామమాత్రం వాటా ప్రభుత్వం ఉంచుకుని మిగిలిన భూమిని కంపెనీకి ధారాదత్తం చేయనున్నారు. అయితే 30:70 (ప్రభుత్వం 30 శాతం, కంపెనీ 70 శాతం) నిష్పత్తిలో వాటా నిర్ణయిస్తారా? లేక 20:80 నిష్పత్తిలో ఇవ్వాలా? అన్నది ప్రభుత్వం త్వరలోనే తేల్చబోతోంది. పెపైచ్చు నిర్మించిన భవనంలోని స్థలాన్ని (స్పేస్)ను 99 ఏళ్ల పాటు ఇతరులకు లీజుకు ఇచ్చుకునే అధికారాన్ని కూడా ఆయా కంపెనీలకే కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. - (ఆంధ్రప్రదేశ్ బ్యూరో) -
రియల్టర్లకు కష్టం...
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీఆర్డీఏ పరిధిలోని రియల్టర్లకు కొత్త కష్టం వచ్చింది. గ్రామ కంఠానికి అర కిలోమీటరు దూరం దాటిన లేఅవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించింది. రూ.70 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు వ్యాపారం నిలిచిపోయింది. పది రోజుల క్రితం వచ్చిన ఈ ఆదేశాలు అమలులోకి రావడంతో వందకుపైగా లేఅవుట్ల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. దీంతో రియల్టర్లు సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఒత్తిడి తెస్తున్నారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాల్లోని నివేశన స్థలాల గుర్తింపు ప్రక్రియ రెండు నెలల నుంచి కొనసాగుతోంది. గ్రామకంఠం పరిధిలో నివాస గృహాలు, నివేశన స్థలాలు ఉంటే వాటిని వదిలివేస్తూ, ఆ పరిధి దాటిన వాటికి భూ సమీకరణ విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నారు. వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. మొత్తం 29 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాటిలో ఇంకా అనేక గ్రామాల్లోని గ్రామ కంఠాలను గుర్తించాల్సి ఉంది. రూ.80 లక్షల నుంచి రెండు కోట్లకు పెరిగిన ఎకరా ధర... ఈ నేపథ్యంలోనే కొందరు రియల్టర్లు గ్రామ కంఠంకు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూము లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రాజధాని గ్రామాలకు సమీపంలో సీఆర్డీఏ అనుమతితో వెంచర్ వేస్తే, ఆ స్థలాలకు మంచి ధర వస్తుందనే భావనతో ఈ భూములను కొనుగోలు చేశారు. ప్రారంభంలో ఎకరా రూ.80 లక్షలు ఉంటే రియల్టర్లు ప్రవేశించిన తరువాత వాటి ధర రూ. 2 కోట్ల వరకు పెరిగింది. గ్రామ కంఠానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో దాదాపు ఐదారు వందల ఎకరాల వ్యవసాయ భూములను రియల్టర్లు కొనుగోలు చేశారు. వారిలో కొంత మంది హడావుడిగా వెంచర్ వేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. భూముల ధరలు తగ్గుతాయని ఆందోళన.. వ్యవసాయ భూములను నివేశన స్థలాలుగా మార్పు చేయాలని కోరుతూ ‘నాలా’ చార్జీలను చెల్లించారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ నిబంధనపై రియల్టర్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. రోజుకో కొత్త నిబంధన, కొత్త ప్రకటన చేస్తూ తమ ప్రాణాలు తీస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి బాగుంటుం దని భావించామని, అయితే ఈ నిబంధన పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ రాజధాని పరిధిలోని స్థలాల రిజిస్ట్రేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా నిలిపివేసిందని, దీని వల్ల అనేక మంది రియల్టర్లు భారీగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. తాజా నిబంధన కారణంగా గ్రామ కంఠానికి అర కిలోమీటరుదూరంలోని స్థలాల లేఅవుట్లకు అనుమతి లేకపోతే ఆ భూముల ధరలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిక్కుల్లో ‘కామరాజ్’
సాక్షి, చెన్నై : తనను మోసం చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్ కామరాజ్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.విచారణకు కోర్టు ఆదేశించడంతో డీఎస్పీ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. తిరువారూర్ జిల్లా నీడామంగళం సమీపంలోని కీలై వలైకు చెందిన పీవీఎస్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. గతంలో చెన్నైలో ఆయన ఓ బంగ్లా కొనుగోలు చేశారు. అందులో అద్దెకు ఉన్న వాళ్లు ఖాళీ చేయక పోవడంతో అన్నాడీఎంకే నాయకుడు కామరాజ్ బంధువు రామకృష్ణన్‌ను ఆశ్రయించాడు. ఆయన ద్వారా కామరాజ్‌తో ఆ బంగ్లాలో ఉన్న వాళ్లను ఖాళీ చేయించాలని కోరుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను రూ. 30 లక్షలు చేతులు మారాయి. ఖాళీ చేసి బంగ్లా అప్పగిస్తానన్న కామరాజ్ అందుకు తగ్గ ప్రయత్నాలు చేయలేదు. అలాగే, ఎన్నికల్లో విజయంతో ఆయన మంత్రి అయ్యారు. తనకు ఆ బంగ్లా ఖాళీ చేయించి ఇవ్వాలని లేని పక్షంలో తీసుకున్న రూ. 30 లక్షలు వెనక్కు ఇవ్వాలని పదే పదే మంత్రి చుట్టు తిరిగినా ఫలితం శూన్యం. ఇక, కామరాజ్ మంత్రి కావడంతో ఆయన దర్శనం కోసం పడిగాపులు గాచినా, చి వరకు కుమార్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. తనను కామరాజ్ మోసం చేశారని మన్నార్ కుడి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం శూన్యం. వారు ఫిర్యాదు అందుకోకపోవడంతో మద్రాసు హైకోర్టును కుమార్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయ స్థాయం కుమార్‌కు భరోసా ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మన్నార్ కుడి డిఎస్పీని ఆదేశించింది. దీంతో విచారణకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం రంగంలోకి దిగింది. ఫిర్యాదు అందుకున్న ఈ బృందం కేసు నమోదు చేసే పనిలో పడింది. కుమార్‌తో విచారణ ముగియగానే, ఇక మంత్రి కామరాజ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. కాగా, మంత్రులపై ఏదేని అవినీతి ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు బయలు దేరినా, పోలీసు కేసులు ఎదురైనా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నెర్ర చేయడం సహజం. ఈ దృష్ట్యా, త్వరలో రాష్ట్ర క్యాబినెట్లో మార్పులు జరిగేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే అగ్రి కృష్ణమూర్తి రూపంలో ఇరకాటంలో పడ్డ సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వానికి, తాజాగా మరో మంత్రిపై ఆరోపణలు బయలు దేరి ఉండటం మరో శిరోభారమే. -
ఖాకీ వనంలో కాబూలీ వాలా
గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఖాకీ దుస్తులు వేసుకున్న నాలుగో తరగతి మునిసిపల్ ఉద్యోగుల్ని చూస్తేనే సామాన్యుడు పోలీసోళ్లేమోనని ఒకింత కంగారుపడుతుంటాడు. పోలీసులు మర్యాద రామన్నల్లా ఉన్నామని ఎంత చెప్పుకున్నా ఖాకీలను చూస్తే భయమనే ముద్ర సమాజంలో చెరిగిపోలేదనేది అందరూ అంగీకరించే వాస్తవం. అటువంటి పోలీసులనే హడలెత్తిస్తున్నాడు ఓ కాబూలీ వాలా. ఇక్కడ విషయమేమిటంటే సదరు వడ్డీ వ్యాపారి కూడా పోలీసేకావడం. వృత్తి పోలీసు ఉద్యోగమైనా వడ్డీ వ్యాపారాన్ని ప్రవృత్తిగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన ఈ ప్రబుద్ధుడు ఇప్పుడు పోలీస్ శాఖకు గుండెకాయ వంటి స్పెషల్ బ్రాంచ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నాడట. వడ్డీ వ్యాపారంతోపాటు ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు, మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్లు చేయడం, భార్య పేరిట భవన నిర్మాణాలు చేపట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లాంటి దందాలో నిత్యం మునిగితేలే ఇతను ఇప్పుడు కీలకమైన విభాగంలో పనిచేస్తూ పోలీసులనే ముప్పుతిప్పలు పెడుతున్నాడని అంటున్నారు. పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధంగా తన స్వదస్తూరితో రూ.లక్షలకు లక్షలు వడ్డీలకు ఇచ్చినట్టు నిర్భీతిగా ప్రాంసరీ నోట్లు రాయించుకుంటాడు. వడ్డీ కట్టడం ఆలస్యమైనా, చెల్లింపుల్లో రూపాయి తక్కువొచ్చినా.. ఖాళీ స్టాంపు పేపర్లు, నోట్లు, డాక్యుమెంట్లతో పలు ప్రాంతాల్లోని కోర్టులలో భార్య పేరిట దావాలు వేయడం ఇతనికి షరా మామూలే. ఇక డబ్బు కట్టలేని వాళ్ల ఆస్తులను నయానో భయానో స్వాధీనం చేసుకుంటాడు. ఇది బయట వ్యక్తుల వరకే కాదు.. పోలీసు శాఖలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడే కానిస్టేబుళ్లు, కుటుంబ అవసరాలతో సతమతమయ్యే పై ఉద్యోగులకు కూడా వడ్డీలకిచ్చి ఆస్తుల పత్రాలు దగ్గర పెట్టుకుని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. తనను ఎదిరించిన లేదా గట్టిగా అడిగిన కానిస్టేబుళ్లపైన, ఆపై ఉద్యోగులపైన ఉన్నతాధికారులకు పిటిషన్ల మీద పిటిషన్లు పంపిస్తాడు. ఆరోపణల్లో మచ్చుకు కొన్ని.. ఏలూరులోని రెండు అపార్ట్మెంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి తన భార్య పేరున రిజిస్టర్ చేయించాడు. వంద చదరపు గజాల స్థలంతోపాటు కార్పొరేషన్‌కు చెందిన రోడ్డును ఆక్రమించి అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టాడని కార్పొరేషన్ అధికారులు గగ్గోలు పెట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ బాధ్యుడిగా పనిచేస్తున్న కాలంలో బినామీల పేరిట లెక్కకు మించిన ప్లాట్లు సొంతం చేసుకున్నాడన్న ఆరోపణలు మూటకట్టుకున్నాడు. ఓ ఇంజినీర్‌కు రూ.6 లక్షల రుణమిచ్చి వడ్డీల మీద వడ్డీలు వేసి రూ.15 లక్షలు కట్టించుకుని ఇంకా డబ్బులు రావాలంటూ భార్య పేరిట ఏలూరు కోర్టులో దావా వేసి డిక్రీ పొందాడు. టి.నర్సాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన ఓ మహిళకు రూ.2 లక్షలు అప్పిచ్చి రూ. 6లక్షల 30వేలు కట్టించుకుని ఇంకా తన బాకీ తీరలేదని, ఏలూరు సివిల్ జడ్జి కోర్టులో డిక్రీ పొందాడు. విచారణల మీద విచారణలు ఇప్పటికే సదరు ఉద్యోగి అరాచకాల మీద శాఖాపరమైన విచారణలే కాదు ఏసీబీ, విజిలెన్స్, విచారణ, లోకాయుక్తా విచారణలు కొనసాగుతున్నాయి. పదిహేనేళ్ల కిందట తాడేపల్లిగూడెంలో కానిస్టేబుల్‌గా పనిచేసే రోజులలో హోంగార్డుల జీతాలు కాజేసి సస్పెండైన చరిత్ర ఉంది. విజయవాడ రైల్వే పోలీస్ విభాగంలో పనిచేసిన కాలంలో చోరీ సొత్తు మాయం చేసి దొంగలను వదిలేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గతంలో నిర్భయ కేసునూ ఎదుర్కొన్నాడు. ఇంతటి చరిత్ర ఉన్న అతన్ని కీలకమైన స్పెషల్ బ్రాంచ్‌కి ఎలా తీసుకువచ్చారు.. ఎవరి ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాడన్నది ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. రాజకీయాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా పనిచేస్తూ జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని తమదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు తమ పంచలోనే ఉన్న సదరు కాబూలీ వాలాపై ఓ కన్నేయాలన్నదే ఖాకీవనం నుంచి వచ్చిన విన్నపం. -
మళ్లీ అపార్ట్మెంట్ల జోరు
‘స్మార్ట్’గా పరుగులు బహుళ అంతస్తుల పై నగర ప్రజల మోజు స్మార్ట్ సిటీ ప్రకటన తో ఊపందుకున్న లావాదేవీలు విశాఖపట్నం : రాష్ట్ర విభజనతో విశాఖలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం స్మార్ట్‌సిటీ ప్రకటనతో మళ్లీ జోరందుకుంది. అమెరికా సాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ ప్రకటనతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కోరిక పెరిగింది. దీంతో అందరూ ఫ్లాట్లు కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వ్యక్తిగత ఇళ్లన్నీ అపార్ట్మెంట్ రూపంలోకి దూసుకుపోతున్నాయి. ఈ వరసలో నగర శివారు మధురవాడ, ఎండాడ, విశాలాక్షినగర్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాలు ముందున్నాయి. మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లకంటే అపార్ట్మెంట్ల నిర్మాణాలే అధికంగా కన్పిస్తున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్ సంస్కృతి కొంతకాలం నుంచి అనూహ్యరీతిలో అభివృద్ధి సాధిస్తోంది. పూర్వం మొత్తం వందలోపే అపార్ట్మెంట్లు ఉండేవి. ప్రస్తుతం నగరం విస్తరించడంతో ఆ సంఖ్య 20 వేలు దాటింది. మరో పది వేలకుపైగా నిర్మాణంలో ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా అతి సాధారణ స్థాయి నుంచి ఆధునిక సదుపాయాలతో కూడిన ఫ్లాట్లు నిర్మించి ఖాతాదారుల అభిరుచి మేరకు అందిస్తున్నారు. ఇదీ కారణం... నగరం ‘స్మార్ట్’గా పరుగులు పెడుతోంది. ఐటీ సిగ్నేచర్ టవర్లు, నిరంతర వైఫై సౌకర్యం.. ఇలా అత్యాధునికమైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం ఏమూల చూసినా చదరపు గజం రూ.25 వేలకు తక్కువ లేదు. వంద గజాలు కొని ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.40 లక్షల మంచి రూ.50 లక్షలకు తక్కువ ఖర్చుకావడం లేదు. అంతేకాకుండా కార్మికుల కొరత, భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్లాన్, మంచినీటి కనెక్షన్, విద్యుత్తు ఇలా అనేక సమస్యలతోపాటు సమయం కూడా ఆదా అవడంతో ప్రజలు ఫ్లాట్ల వైపు మక్కువ చూపుతున్నారు. మరో ముఖ్యమైన కారణమేమిటంటే భద్రత. పట్టపగలే నగరంలో చోరీలు అధికమవడం, నేరస్తులు ఎంతటి దారుణాలకైనా తెగబడడంతో ఫ్లాట్లు అన్ని విధాలా మేలనే భావన పెరగడంతో వీటికి డిమాండ్ అధికమైంది. దీంతోపాటు బిల్డర్లే బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుకు మరింత సౌలభ్యం ఏర్పడుతోంది. ఆధునిక వసతులు నిర్మాణ రంగంలో ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పడు కేవలం స్థానికంగా లభించే మెటీరియల్స్తోనే అపార్ట్మెంట్లు నిర్మించేవారు. ఇప్పుడు విదేశీ సామగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. అపార్ట్మెంట్ భద్రత కోసం విద్యుత్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, జిమ్, స్టీమ్ ఫంక్షన్ హాలు, వాకింగ్ ట్రాక్, మహిళలకు లేడీ క్లబ్‌లు... ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో ఫ్లాట్స్ అందుబాటులో లభిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో గ్రూప్ హౌసెస్, విల్లాలు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో కొందరు బిల్లర్లు ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఖాతాదారుడికి ఏం చెబుతారో అదే చేయుడంతో ఇటువంటి వారు కట్టే అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యాపారమంటేనే నమ్మకం, దాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికిరామనే నినాదంతో నడుస్తున్న బిల్లర్లను మనం చూడొచ్చు. కొనేటప్పుడు జాగ్రత్తలు... ఎంతో కష్టపడితేగాని చాలామంది జీవితకాలంలో సొంత గృహాన్ని సొంతం చేసుకోలేరు. మరి ఫ్లాట్ కొనేటపుపడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. స్థలం యజమానికి, బిల్డర్‌కు మధ్య ఒప్పంద పత్రాలను చూసుకోవాలి. ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ (ఈసీ) తీసుకోవాలి. క్లియర్ టైటిల్, దానికి సంబంధించిన లింక్ దస్తావేజులు చూసుకోవాలి. తెలీకపోతే న్యాయవాదిని, అనుభవజ్ఞుడైన దస్తావేజు లేఖరిని సంప్రదించాలి. మనం కొనే ఫ్లాట్ నిర్మాణంలో ఉంటే నెలకొకసారైనా వెళ్లి చూసుకోవాలి. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా.. అనేది పరిశీలించాలి. భూగర్భ నీటి నిల్వ పైపు కనెక్షన్, ఫైరింజన్, నియంత్రణ పరికరాలు, ఫైర్పంపులు, హోజ్రీలు, తదితర అంశాలు ఏర్పాటు చేశారా లేదా..? అనేది పర్యవేక్షించాలి. మరో ముఖ్యమైన విషయం... బిల్డర్ నుంచి ఏమి కోరుకుంటున్నామో అవి రాతపూర్వకంగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది. -
‘రియల్’ దందా కోసమే సచివాలయం తరలింపు'
హైదరాబాద్ సిటీ : రియల్ ఎస్టేట్ దందా కోసమే ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపు యోచన చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపును వ్యతిరేకిస్తూ గురువారం ఓ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... పది కమ్యూనిస్టు పార్టీలు సీఎంను కలవాలని అనుమతి కోరితే ఇంత వరకు కనికరించలేదన్నారు. వాస్తు ప్రకారంగా పాలించడం రాజ్యాంగ విరుద్ధమని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రజలు సహించరని ఆయన చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా రోజుకో హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. నిజాం కాలంలో స్థాపించిన ఆస్పత్రిని తరలించడం సబబుకాదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాతిపదిక రాజ్యాంగంలో ఉన్న విలువలని అన్నారు. నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెట్టుబడులను తీసుకొస్తూ ధ్వంసం చేస్తున్నారని అన్నారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజారెడ్డి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, ఎంసీపీఐయూ నాయకులు ఎం.డి.గౌస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, ఆర్ఎస్పీ నాయకులు జానకిరాము, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సురేందర్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, నాయకులు భూతం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘రియల్’ వ్యాపారంపై సమాధానం చెప్పండి
రాజధాని విషయంపై ప్రభుత్వానికి అంబటి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సమీకరిస్తున్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయతలపెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్న భూముల నుంచి 5 వేల ఎకరాలను బహిరంగంగా వేలం వేసి ఎకరం రూ. 10 కోట్ల నుంచి రూ.15 కోట్లకు అమ్మాలని, తద్వారా రూ. 75 వేల కోట్లను సంపాదించాలని ప్రభుత్వం పథకం వేసుకున్నట్లుగా ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయని అంబటి తెలిపారు. అసలు రాజధాని కోసమే ఈ భూముల సేకరణ చేస్తున్నారా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారా? అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి చాలా తక్కువ భూమి సరిపోతుందని ఇప్పటికే మేధావులతో సహా అందరూ చెబుతున్నారని, అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 50 వేలు, లక్ష ఎకరాలు సమీకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని తాపత్రయపడుతోందనే విషయం తేటతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలు రాజధాని ప్రాంతంలో భూములివ్వాలనుకుంటున్న రైతులను తీవ్రంగా భయపెడుతున్నాయని మండిపడ్డారు. రైతులతో బేరమా? ‘రైతుల నుంచి సమీకరిస్తున్న భూములను ఎకరా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లకు అమ్ముకుని.. పొలాలిస్తున్న వారికి మాత్రం 1200, వెయ్యి గజాలు ఇస్తామని బేరం పెడతారా?’ అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ వ్యవహారం వాస్తవమా? కాదా? అనేది తొలుత స్పష్టం చేయాలన్నారు. ఈ భూములను ప్రైవేటు సంస్థలకు అమ్మగా వస్తున్న రూ. 75 వేల కోట్లను రైతులకే చెందేలా చూడాలన్నారు. రైతుల నుంచి సమీకరిస్తున్న భూములపై రూ. కోట్లు ఆర్జించాలనే ఆలోచన రావడమే దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ వెల్లడించినప్పుడు కొత్త రాజధాని నిర్మాణానికి రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు కావాలంటూ అప్పట్లో విపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేశారని అంబటి గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు సీఎంగా.. తమ మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వమే కేంద్రంలో ఉండగా రూ. 4 లక్షల కోట్లు, రూ. 5 లక్షల కోట్లు కాదు కదా కనీసం రూ. లక్ష కోట్లయినా ఎందుకు తేలేక పోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన విధానంపై పునరాలోచించుకోవాలన్నారు. -
రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
హైదరాబాద్: రాజధాని రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేసే యత్నం చేసే యత్నమని ఆయన ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాజధానికి నిధులను కేంద్రాన్ని అడిగే ధైర్యంలేక రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరిట వేల ఎకరాల భూ సమీకరణ కేవలం రియల్ ఎస్టేట్ కోసమే అని ఆయన విమర్శించారు. ఈ అంశంపై తక్షణమే పునరాలోచించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాజధానికి భూములిచ్చేందుకు ముంఉదకొచ్చే రైతులకు కూడా ఇదేరీతిన కోట్లు చెల్లిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
రాజధాని పేరుతో ‘రియల్’ వ్యాపారం
ముఖ్యమంత్రి, మంత్రులదీ అదే దారి {పభుత్వం ప్రజల కష్టాలను గాలికి వదిలేసింది ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను నష్టాలు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కష్టాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు ‘సాక్షి’తో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు: ప్రజల కష్టాలను గాలికొదిలి ముఖ్యమంత్రి, మంత్రులు రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో వరద, హుదుహుద్ తుపాను బీభత్సానికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదన్నారు. రాయలసీమతోపాటు ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కరువు తాండవిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో సాగునీటి సంగతి దేవుడెగురు తాగునీటి కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్నారన్నారు. చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని విమర్శించారు. హంద్రీ నీవా పూర్తికాకుండా జిల్లా వాసులకు తాగునీరు అందే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలతో పాటు, బంగారం రుణాలను మాఫీ చేస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కి రైతులను, మహిళలను వంచించార ని పెద్దిరెడ్డి విమర్శించారు. లక్షా రెండువేల కోట్ల రుణాలుంటే బడ్జెట్లో కేటాయించింది రూ.5 వేల కోట్లు మాత్రమేనన్నారు. తొలి దఫాలో రూ.4 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆయన విమర్శిం చారు. ఈ మొత్తానికి 14 వేల కోట్లు వడ్డీ అవుతుందన్నారు. రెండవ విడత మాఫీ నాటికి వడ్డీ రూ.30 వేల కోట్లకు చేరుకుంటుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చేది వడ్డీలో 25 శా తం కూడా కాదని పెద్దిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన రైతులు, మహిళలపై ఎలాంటి దుష్పప్రభావం చూపిందో ఇప్పుడు అంతకుమించిన విధంగా ఉందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు రాజధాని పేరుతో సంవత్సరానికి ఐ దు పంటలు పండే భూములను దౌర్జన్యంగా లా క్కుంటున్నారని ఆయన విమర్శించారు. సింగపూర్, మలేషియా పేర్లు చెప్పి అధికార పార్టీ నేతలు రియల్ వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారన్నా రు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర దేశాలు పర్యటిస్తే ఇక్కడ రాజధాని ఏర్పడదన్నారు. అలాగే కరువు పోదన్నారు. మంచినీటి కష్టాలు తీరవన్నారు. తుపానులో దెబ్బతిన్న భూములు బాగుపడవన్నా రు. బాగుపడేదంతా రాజధాని పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న దేశం నేతలేనని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితే కొనసాగితే రెండు మూడు సంవత్సరాలకు మించి ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని తేల్చి చెప్పారు. -
ఖజానా ఖాళీ !
* ఆర్థిక సంక్షోభంలో హెచ్ఎండీఏ * ఈనెల జీతాలూ కష్టమే ? * ఆదాయపన్ను, అప్పులపై వడ్డీతో విలవిల * గండం గట్టెక్కాలంటే రూ.100కోట్లు తక్షణావసరం సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్ఎండీఏ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోవడంతో హెచ్ఎండీఏ ఖజానా ఖాళీ అయింది. దీంతో ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఎలా చెల్లించాలో అర్థంగాక అధికారులు తలలు పట్టుకొంటున్నారు. రియల్ బూమ్ తగ్గడంతో హెచ్ఎండీఏకు వివిధ అనుమతుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పటికే బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీ, అసలు వాయిదాలు, ఐటీ బకాయిలు సంస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నాటికి సర్వీసు ట్యాక్స్, ఐటీ బకాయీలు, హడ్కో, ఇండియన్ బ్యాంకులకు రుణం- వడ్డీలు కలిపి మొత్తం రూ.50 కోట్లు చెల్లించాల్సి రావడం అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వీటికితోడు ఉప్పల్ భగత్ లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టు బిల్లులతో పాటు హుస్సేన్‌సాగర్, ఇతర నిర్వహణ బిల్లులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. నిజానికి ఐటీ బకాయిల కింద రూ.11.5 కోట్లు నవంబర్లోనే చెల్లించాల్సి ఉన్నా డబ్బుల్లేకపోవడంతో ఆపేశారు. వాటిని ఈ నెలాఖరుకు చెల్లించాల్సి ఉంది. అలాగే హడ్కో నుంచి తీసుకొన్న రుణం తాలూకు వడ్డీ రూ.35 కోట్లు, ఇండియన్ బ్యాంకుకు రూ.2.5 కోట్లు, సర్వీసు ట్యాక్స్ కింద రూ.1.50 కోట్లతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల బిల్లులు మరో రూ.50 కోట్ల దాకా చెల్లించాల్సి ఉందని అధికారులు హడలిపోతున్నారు. ప్రభుత్వం నుంచి తక్షిణం రూ.100 కోట్లు ఆర్థిక సాయం అందితే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి కన్పించడం లేదు. నిజానికి గత నెలలోనే సంస్థ ఆర్థిక పరిస్థితి తిరగబడింది. దీంతో వెంటనే అధికారులు రూ.100 కోట్లు ప్రత్యేక గ్రాంట్ కింద ఇచ్చి హెచ్ఎండీఏను ఆదుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ఇంతవరకు సర్కార్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆగిన చెల్లింపులు హెచ్ఎండీఏ ఖజానా నిండుకోవడంతో చిన్నచిన్న బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితి బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటూ ఈ నెలాఖరు వరకు ఏ బిల్లును కూడా పంపవద్దంటూ అంతర్గతంగా అన్ని విభాగాలకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఉప్పల్ భగత్ లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టు తాలూకు గత నెల బిల్లు రూ.4 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు. అలాగే అర్భన్ ఫారెస్ట్రీకి నిర్వహణ బిల్లులు ఆపేశారు. సంస్థకు ఆర్థిక వనరుగా ఉన్న ప్లానింగ్ విభాగం నుంచి నెలకు రూ.20-22కోట్ల ఆదాయం వచ్చేది. అయితే, నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేకపోవడంతో అనుమతుల కోసం హెచ్ఎండీఏ వైపు కన్నెత్తి చూసే నాధుడే లేకుండా పోయాడు. గత నెలలో ఈరూపేణా రూ.6-7 కోట్లు కూడా ఆదాయం రాకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ కారణంగానే విధిలేని పరిస్థితుల్లో బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
రాజధానంటూ రియల్ దందా
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత గడికోట ధ్వజం లక్ష ఎకరాలు కావాలంటూ రూ.5 లక్షల కోట్ల స్కాంకు స్కెచ్ సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చటి పొలాలను రైతుల నుంచి లాక్కుని ఆయన తాబేదార్లకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీ శాసనసభాపక్షం కో ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన తుళ్లూరు మండలం చుట్టుపక్కల టీడీపీ నేతలు వేలాది ఎకరాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ధ్వజమెత్తారు. రాజధానికి లక్ష ఎకరాలు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో అక్కడి సీఎం దేవేంద్ర పడ్నవీస్ విమానంలో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తుంటే బాబు మాత్రం టీడీపీకి ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక విమానాల్లో వెళుతున్నారని విమర్శించారు. ఒక్క హామీనైనా నెరవేర్చారా? చంద్రబాబు తన ఆర్నెల్ల పాలనలో మీడియా మేనేజ్మెంట్ మినహా ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాటాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు 200 నుంచి 300 హామీలు ఇచ్చారని, సీఎం పదవి చేపట్టాక మరో 50, 60 వాగ్దానాలు చేసిన ఆయన ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. వాటిలో ప్రధానమైనవి వ్యవసాయ రుణాల మాఫీ, వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ ప్రధాన అంశాలన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను గడికోట విలేకరులకు చూపారు. వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టటం మినహా కొత్తగా చేసిందేమీ లేదన్నారు. 104, 108 పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. అక్టోబర్ 2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అందరికీ మంచినీరు అందిస్తానన్నా అమలు కాలేదన్నారు. రూ.పది వేల కోట్లతో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆచరణలో మాత్రం చేసిందేమీ లేదన్నారు. చేనేత కార్మికులను రోడ్డున పడేసిన ఘనత బాబుదేనన్నారు. వైఎస్ హయాంలో కార్మికులకు ఇచ్చిన రూ.7 వేల బీమా కార్డును కూడా రద్దు చేశారన్నారు. -
అక్రమార్కుల చెరలో సర్కార్ భూమి
పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం..హైదరాబాద్ మహానగారానికి అతిదగ్గర్లో ఉన్న ప్రాంతాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో గజం భూమి వేలల్లో పలుకుతున్న ప్రాంతాలు. అలాంటి ప్రాంతంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన 382 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు స్వాధీనం చేసుకుని ప్లాట్లుగా చేసి విక్రయించినా అధికారులు చూస్తూ ఊరుకున్నారు. చివరకు ఈ భూములను కొన్న కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగా..స్పందించిన హైకోర్టు సర్కార్ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ తీర్పు చెప్పింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు సర్కార్ మాత్రం కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఎక్కడ భూములు కేటాయించాలో తెలియక సతమతమవుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్చెరు ఇండస్ట్రీయల్ కో-ఆపరేటివ్ పరిధిలో సుమారు రూ.500 కోట్ల విలువైన 382 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనంలో ఉంది. వీటిని ప్లాట్లుగా చేసి విక్రయించినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పినా.. రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేట్టడం లేదు. సొసైటీ పేరుతో మోసం సిద్దిపేటకు చెందిన నారాయణరావు 1980లో పటాన్చెరు ఇండస్ట్రీయల్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని స్థాపించారు. పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో ప్రభుత్వ, పట్టా భూముల్లో వెంచర్లు చేసి సంఘం సభ్యులకు విక్రయించారు. పటాన్చెరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో పనిచేసే కార్మికుల నుంచి రూ.105 సభ్యత్వ రుసుం వసూలు చేసి సొసైటీలో సభ్యులుగా చేర్చుకున్నారు. 1980 నుంచి 1987 వరకు దాదాపుగా ఏడేళ్ల పాటు 382 ఎకరాల ప్రభుత్వ భూమి, 100 ఎకరాల పట్టా భూమిలో 150 గజాల నుంచి మొదలుపెట్టి 500 గజాల చొప్పున ప్లాట్లు చేసి సొసైటీ సభ్యులకు విక్రయించారు. సుమారు ఐదు వేలకుపైనే సొసైటీకి సభ్యులు ఉన్నట్లు జిల్లా సహకార సంఘం నివేదికలను బట్టి తెలుస్తోంది. ఒక్కొక్క ప్లాటుకు అప్పట్లో రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. పటాన్చెరు మండలం అమీన్పూర్, రామచంద్రాపురం మండలం కొల్లూరు, తెల్లాపూర్, జిన్నారం మండలం బొల్లారంలో సర్వే నంబర్ 323/14, 232/19లో 157.08 ఎకరాలు, 324/1 సర్వే నంబర్ కింద 12.14, 325/1లో 18.34 ఎకరాలు, 326/1 లో 20.30 ఎకరాలు, 328 సర్వే నంబర్ నుంచి 340 వరకు 173 ఎకరాల ప్రభుత్వ భూమిని నారాయణ ఆక్రమించారు. ప్రస్తుతం ఈ భూములకు జిల్లా పంచాయతీ అధికారి (డీఆర్ఓ) కస్టోడియన్‌గా ఉన్నారు. ఏం చేశాడంటే.. సొసైటీ కోసం ముందు కొంత పట్టా భూమిని కొనుగోలు చేసిన నారాయణరావు దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కూడా కలుపుకున్నాడు. పేద రైతుల కోసం అసైన్డ్ చేసిన భూములను తన ఖాతాలోనే వేసుకున్నాడు. అప్పట్లో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా సహకరించడంతో.. నారాయణరావుకు అడ్డూ అదుపు లేకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపించారు. ఒక్కొక్క ఫ్లాటును ఇద్దరు, ముగ్గురికి చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లెక్కన ప్లాట్లు కొన్న వాళ్లు 10 వేల మంది ఉన్నారు. ఆ త ర్వాత 1997లో నారాయణ రావు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న లొసుగుల ఆధారంగా వివిధ కారణాలు చూపిస్తూ దాదాపు 4 వేల మంది పైగా సంఘం సభ్యుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు నోటీసులు పంపించాడు. ఆ నోటీసులు అందుకున్న కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (సీపీఐ) అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో అప్పటి ప్రభుత్వం నారాయణరావు అక్రమ సొసైటీ మీద అప్పటి మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవిని అధ్యక్షతన హౌస్‌కమిటీ వేసింది. ఈ హౌస్ కమిటీ సొసైటీ అక్రమాలపై దాదాపు మూడేళ్ల పాటు అధ్యయనం చేసింది. నారాయణరావు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి ప్లాట్లుగా చేసి విక్రయించాడని కమిటీ నిర్ధారించింది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హౌస్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. హైకోర్టు ఏం చెప్పిందంటే.. ప్లాట్లు తీసుకున్న కొందరు సభ్యులు 2006లో హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్ వేశారు. ఎనిమిదేళ్ల పాటు సమగ్ర పరిశీలన చేసిన కోర్టు హౌస్ కమిటీ సిఫార్సునే సమర్థిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పట్టా భూముల్లో చేసిన ప్లాట్లను సంఘం సభ్యులకు అప్పగించాలని ఆ తీర్పులో పేర్కొంది. అయితే, తీర్పు వచ్చి దాదాపు 8 నెలలు దాటినా.. రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్వాధీన చర్యలు చేపట్టలేదు. పైగా సమస్యను ఇంకా జటిలం చేస్తూ రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీకి, ఇతర రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తరాలు రాస్తూ కాలం గడుపుతున్నారు. ఈ భూములపై ఇప్పటికే రియల్ ఎస్టేట్ గద్దల కన్ను పడింది. అర్ధబలం, అంగబలం ఉన్న వాళ్లు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని సెక్యూరిటీ గార్డుల పేరుతో రౌడీ మూకలను కాపలా పెట్టారు. మరికొంత మంది వ్యక్తులు తమ ఆధీనంలో ఉన్న పట్టా భూమిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఆయా పట్టాభూముల్లో పట్టాలున్న సొసైటీ సభ్యుల నుంచి గజానికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్ కాగితాయి తీసుకుంటున్నారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు స్పందిస్తే దాదాపు రూ. 500 కోట్ల విలువైన 382 ఎకరాల భూమి తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
ప్రాణాలు తీసిన పొగమంచు
విశాఖపట్నం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసులు నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఈ ఆరుగురూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి మండలం గొడిచర్ల వద్ద పొగ మంచు వల్ల దారి కనిపించక వీరి కారు ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతిచెందినవారిలో గరిమెళ్ల గోవర్ధనరావు (40), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) ఉన్నారు. * ఆగివున్న లారీని ఢీకొట్టిన ఇన్నోవా * విశాఖపట్నం జిల్లా గొడిచర్ల వద్ద ప్రమాదం * జిల్లా వాసులు నలుగురు మృతి * మరో ఇద్దరికి తీవ్ర గాయాలు నక్కపల్లి (విశాఖపట్నం జిల్లా) : పొగమంచు నలుగురి ప్రాణాలను బలిగొంది. మండలంలోని గొడిచర్ల జంక్షన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి విపరీతమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా వస్తున్న, ముందు వెళుతున్న వాహనాలు కనపడని పరిస్థితి. ఈ నేపథ్యంలో శనివారం వేకువవారుజామున జాతీయరహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో విజయవాడకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ పరిసరప్రాంతాలకు చెందిన ఆరుగురు సిండికేట్‌గా ఏర్పడి రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో విక్రయించిన భూమికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు ఇన్నోవా కారులో శుక్రవారం రాత్రి విశాఖపట్నం బయలుదేరారు. విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో గొడిచర్ల జంక్షన్ వద్ద శనివారం వేకువజామున మూడు గంట లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజ యవాడ పరిసర ప్రాంతాలకు చెందిన గరిమెళ్ల గోవర్ధనరావు (40, డ్రైవింగ్‌చేస్తున్న వ్యక్తి), కొండపల్లి శివరామకృష్ణశాస్త్రి (44), వంగా ప్రకాశరావు (55), నల్లమోతు రవి సుధాకర్ (47) దుర్మరణం పాలయ్యారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న పరశురాం, ఎండీ ఫారుఖ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై విజయ్‌కుమార్, హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బ్యాగులున్నప్పటికీ.. కారు అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకున్నప్పటికీ వాహనం వేగానికి, ఢీకొట్టిన తీవ్రతకు పేలిపోయాయే తప్ప ముందు సీట్లో కూర్చున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి. ఈ సమయంలో వాహనాన్ని విజయవాడ రామవరప్పాడుకు చెందిన గోవర్థన్‌రావు నడుపుతున్నాడు. కారుముందు భాగం నుజ్జవడంతో అతడు సీట్లోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచాడు. మిగతావారి తల, ఛాతిపైన బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావ మై మరణించారు. పోలీసులు కూడా దీనినే ధ్రువీకరించారు. వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీశారు. ఆరుగురూ రియల్ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములు. ఇటీవల విజయవాడలో స్థలం విక్రయించినట్లు సమాచారం. దానికి సంబంధించి అడ్వాన్సు తీసుకునేందుకు విశాఖ బయలు దేరినట్టు తెలిసింది. మృతుల్లో ఒకరైన సుధాకర్ ఏపీ న్యూస్ పేరుతో న్యూస్‌చానల్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. దీని ఏర్పాట్ల గురించి కూడా చర్చించేందుకు, అవసరమై స్థలాన్ని, వసతిని పరిశీలించేందుకు విశాఖ బయలుదేరినట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించిన గుర్తింపుకార్డు ఒకటి మృతుని వద్ద లభించింది. వారివద్ద ఉన్న ఆధారాల మేరకు కుటంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. లారీ కోసం గాలింపు... ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారు మరణించిన విషయాన్ని లారీ డ్రైవర్ గుర్తించాడు. వెంటనే లారీతో సహా వెళ్లిపోయాడని సమాచారం. లారీ ఆగిఉన్న సమయంలో వాహనం ఢీకొట్టిందా? లేక ప్రయాణిస్తూ సడన్ బ్రేక్‌వేయడం వల్ల ఢీకొట్టిందా? అన్నది నిర్ధారించుకోవడానికి పోలీసులు లారీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వేంపాడు టోల్గేట్లో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి లారీ ఆచూకీ కనుగొనేందుకు యత్నిస్తున్నారు. రవిసుధాకర్ కుటుంబంలో విషాదం ఇబ్రహీంపట్నం : విశాఖపట్నం వద్ద శని వారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇబ్రహీంపట్నం శక్తినగర్కి చెందిన నల్లమోతు రవిసుధాకర్(47) మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రవిసుధాకర్ గతంలో పలు దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన రంగమ్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె శ్రీజ బీఫార్మసీ చేస్తోంది. కుమారుడు రాజు రామ్ ఇంటర్ చదువుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో రవిశంకర్ మృతిచెందినట్లు తెలియగానే కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు విశాఖ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. గోవర్ధనరావు కుటుంబంలో.. రామవరప్పాడు : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గరిమెళ్ల గోవర్థనరావు ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం సమీప ప్రాంత వాసి. గోవర్థనరావు మరో ఐదుగురు రియల్ ఎస్టేట్ పనిమీద శుక్రవారం రాత్రి కారులో విశాఖపట్నం వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది గోవర్థన్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడి తల్లిదండ్రులు అడవినెక్కలంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలియగానే గోవర్థనరావు సమీప బంధువైన ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కోమ్మా కోటేశ్వరరావు తదితరులు హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఫారుక్ పరిస్థితి విషమం కారులో వీరితోపాటు ప్రయాణిస్తున్న యనమలకుదురు వాసి ఫారుక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఫారుక్ ఆటోనగర్‌లో బ్యాటరీల దుకాణం నిర్వహిస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు, బంధువులు విశాఖపట్నం బయలుదేరారు. -
రంగారెడ్డి జిల్లాలో రియల్ ఢాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థిరాస్తి రంగంలో కీలకమైన రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరే ఆదాయంలో ఏకంగా 49.55 శాతం జిల్లా నుంచే వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే అంచనాలను తలకిందులు చేస్తోంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాను ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది. ఇందులో రంగారెడ్డి డివిజన్ పరిధిలో చేవెళ్ల, వికారాబాద్, రాజేంద్రనగర్ రెవెన్యూ ప్రాంతాలుండగా.. రంగారెడ్డి తూర్పు విభాగాల్లో సరూర్‌నగర్, మల్కాజిగిరి రెవెన్యూ విభాగాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిల్లాకు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.2,361.69 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో గత నెలాఖరునాటికి రూ.1,346.16 కోట్ల లక్ష్యం ఉండగా.. కేవలం రూ.690.84 కోట్ల ఆదాయం సమకూరింది. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 51.75శాతం మాత్రమే పురోగతి నమోదైంది. విభజన ప్రభావంతో.. రాష్ట్రంలో భారీగా వృద్ధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండుమూడేళ్లుగా రియల్ రంగం ఒకింత ఇబ్బందికరంగా ఉంది. తాజాగా రాష్ట్ర విభజన అంశంతో ఈ వ్యాపారం ఇబ్బందుల్లో పడిపోయిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏపీ రాజధాని ఖరారు కావడంతో హైదరాబాద్‌కు వచ్చే పెట్టుబడులు అక్కడికి తరలిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పలు కారణాలుగా స్థిరాస్తి విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో రియల్ రంగం కష్టాల్ని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై స్పష్టత వస్తోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం పరిధిలో టీసీఎస్ ప్రాజెక్టు ప్రారంభం కావడం.. ఏరోస్పేస్ జోన్‌గా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రాబడి తగ్గినా.. స్థిరంగా ఆదాయం.. రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కారు ఖజానాకు వచ్చే ఆదాయంలో తగ్గుదల ఉండడం ఆందోళన కలిగించే అంశమే. కానీ గత ఏడు నెలల్లో వచ్చిన ఆదాయ గణాంకాల్ని పరిశీలిస్తే... రాబడిలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నెలవారీగా వచ్చిన ఆదాయ గణాంకాలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. ఈ గణాంకాలు స్థిరాస్తి వ్యాపారం పతనమైనట్లు కాదని నిపుణులు అభిప్రాయడపతున్నారు. హైదరాబాద్‌కున్న అనుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
హత్యా.. ఆత్మహత్యా.. ప్రమాదమా..?
భువనగిరి : రియల్టర్ సీస జయరాములు మృతిపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నివాసం ఉంటున్న జయరాములు ఆదివారం ఉదయం భువనగిరి మండలం వడాయిగూడెంలోని ఉన్న తన గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల విషయంలోనే హత్య జరిగి ఉంటుందని జయరాములు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆదివారం జయరాములు మృతదేహానికి భువనగిరి ఏరియా అస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ మృతిచెందిన విషయాలను స్పష్టం చేయలేకపోవడంతో కుటుంబ సభ్యులు రీపోస్టుమార్టం నిర్వహించాలని భువనగిరి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్‌పై ఒత్తిడితెచ్చారు. దీంతో మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో సోమవారం రెంవసారి పోస్టుమార్టం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో నివేదిక రానుంది. కాగా మృతిచెందిన జయరాములు మృతిపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. హత్య చేసి ఉంటారని ఒక వాదన బలంగా ఉండగా మరో వైపు ప్రమాదవశాత్తు బంగ్లాపై నుంచి పడి మృతి చెంది ఉంటాడా, లేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో ఆయనతో లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఒత్తిడి తెచ్చి ఉంటారని ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వాదన వినిపిస్తోంది. అయితే ఆయన సన్నిహితులు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాడని పేర్కొంటున్నారు. బంగ్లాపై నుంచి పడడం వెనక ఏదైన ప్రమాదం ఉందా, లేక తనకు తానేపడ్డాడా, ఎవరైనా తోసేసారా అని సందేహాలు వ్యవక్తమవుతున్నాయి. రియల్ ఎస్టెట్ వ్యాపారంలో ఉన్న డబ్బుల వివాదంలో కొందరు వారం పది రోజులుగా అయన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారని, వారితో వివాదం ఉండడం వల్లే హత్య జరిగిందా అని చర్చించుకుంటున్నారు. విచారణ జరుపుతున్న పోలీసులు సైతం హత్యా, ఆత్మహత్య, ప్రమాదమా, లేక ఆరోగ్య సంబంధ సమస్యలతో చనిపోయారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. కాగా సోమవారం భువనగిరి డీఎస్పీ ఎస్, శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ సతీష్‌రెడ్డి, రూరల్ ఎస్ఐ భిక్షపతిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!
సార్.. మా వెంచర్‌కు అన్ని రకాల పర్మిషన్లున్నాయి. మీరు ఒక్కసారి చూడండి.. అంటూ వెంచర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఏజెంట్. ఇది కార్నర్ ప్లాట్.. ఈస్ట్ప్లేస్. నిన్ననే ఇద్దరు, ముగ్గురు చూసి వెళ్లారు. మీరు సరే అంటే వెంటనే బుక్ చేస్తా. ఇలా ఆయన చెప్పే మాటలకు మనం వెంటనే ప్లాట్ అయిపోతాము. ఇంతకు ఈ భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించం. పంచాయతీ, మునిసిపల్ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేశారా లేదా అని చూడం. వెంటనే ఓకే అనేస్తాం. కొనేస్తాం. తర్వాత నానా ఇబ్బందులుపడతాం. ఎలాంటి భూములు కొనాలి, ఏ స్థలాలకు అమ్మే హక్కు ఉండదనే కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. * కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి * లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు కర్నూలు (జిల్లా పరిషత్): రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కురిపిస్తున్న హామీలతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఒకప్పుడు నంద్యాల రోడ్డులో సఫా ఇంజనీరింగ్ కళాశాల వరకు మాత్రమే రియల్ ఎస్టేట్ వెళ్లి ఆగిపోయింది. నాయకులు హామీల పుణ్యమా అని ఇప్పుడు విస్తరణ ఓర్వకల్లు మండలం హుసేనాపురం దాటిపోయింది. ఓర్వకల్లు సమీపంలో ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్పోర్ట్, ఐఐఐటీ అంటూ ప్రజలను నాయకులు ఊరిస్తున్నారు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో టెక్ట్స్‌టైల్స్ పార్కు వస్తుందని చెప్పడంతో కోడుమూరు రోడ్డులోనూ వెంచర్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌కు అతి దగ్గరల్లో ఉందంటూ పెంచికలపాడు, కొత్తూరు వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ భూములు కొని వెంచర్లు వేస్తున్నారు. ప్లాటు రూ.1.50లక్షల నుంచి రూ.2.50లక్షలేనని ఊరిస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ సైతం రూ.12లక్షల నుంచి రూ.20లక్షలలోపు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. వాటిని చూసి వెంటనే కొన్ని మోసపోకుండా కొన్ని విషయాలు గమనించి స్థలాలు కొనాలి. ఈ భూములు కొనకూడదు.. అమ్మకూడదు * ప్రభుత్వానికి సంబంధించిన భూములు, వక్ఫ్‌భూములు * భూదాన్ బోర్డు ఆధీనంలో స్థలాలు * వెనుకబడిన వర్గాలకు కేటాయించినవి * ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి ఇచ్చిన ఇళ్లు, పొలాలు * యూఎల్సీ పరిధిలోని భూములు * సైనికులకు, స్వాతంత్య్ర సమరయోదులకు కేటాయించిన భూములు, స్థలాలు * గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములు కొనబోయే భూమి సమాచారం ఎలా తెలుసుకోవాలి * భూమిని ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఆ ఏరియా పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. * భూమి ఉన్న సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, పట్టా లేక పాస్బుక్ల జిరాక్స్ వివరాలు అందిస్తే వారు మీకో మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు. * ఇందులో మీరు కొనాలనుకున్న భూమి విలువ, ఆ భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, భూమిని ఎవరికి కేటాయించారు తదితర వివరాలుంటాయి. * బ్యాంకులోను పొందడానికి సైతం ఈ మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * రియల్ ఎస్టేట్ వెంచర్ వేసే ముందు ఆయా భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు నాలా పన్ను 10 శాతం చెల్లించి భూమి మార్పిడి చట్టం ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. * లే అవుట్లు లేని నివేశన స్థలాలకు పంచాయతీలు/మునిసిపాలిటీలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరు. కొత్తగా రోడ్ల నిర్మాణం, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలూ కల్పించరు. * లే అవుట్ వేసిన మొత్తం భూమిలో 10 శాతం భూమిని సామాజిక అవసరాల కోసం (కమ్యూనిటి హాళ్లు, పాఠశాల నిర్మాణం, పార్కు) రిజర్వుడ్ సైట్‌గా వదలాల్సి ఉంటుంది. * ఈ స్థలాన్ని రియల్టర్ ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద గిఫ్ట్‌గా రాసి ఇవ్వాలి. * మునిసిపల్ నిబందనల ప్రకారం అంతర్గత రోడ్లు అయితే 40 అడుగులు, ప్రధాన రహదారి అయితే 60 అడుగుల వెడల్పు ఉండాలి. తారు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం రియల్టరే చేపట్టాలి. * మంచినీటి ట్యాంకు నిర్మించి ప్రతి ప్లాటుకు కనెక్షన్ ఇవ్వాలి. * త్రీ ఫేస్ కరెంటుతో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. లే అవుట్ల గురించి పూర్తిగా చెక్ చేసుకోవాలి కార్పొరేషన్ పరిధిలోని ప్రతి లే అవుట్‌కు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. 10 శాతం స్థలాన్ని కార్పొరేషన్‌కు గిఫ్ట్ కింద ఇవ్వాలి. కార్పొరేషనేతర ప్రాంతాల్లో వేసిన లే అవుట్లలో 33 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. ప్రతి ప్లాటు తప్పనిసరిగా 120 చదరపు మీటర్లు ఉండాలి. 2.5ఎకరాల వరకు కర్నూలులోనే అనుమతినిస్తాం. 2.5 ఎకరాలు దాటి 5 ఎకరాల వరకు అనంతపురంలోని రీజనల్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లే అవుట్ల గురించి మునిసిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీల్లో చెక్ చేసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండదు. -బి. ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ -
అంతుచిక్కని హత్యలు.. ఆత్మహత్యలు
రియల్ ఎస్టేట్ వ్యాపారం, వివాహేతర సంబంధాలు, ఆస్తి, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ తగాదాలు.. కారణాలు ఏవైతేనేం..! జిల్లాలోని హైదరాబాద్ శివారు మండలాల పరిధిలో లభిస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వీటిలో కొన్ని హత్యలు ఉండగా మరికొన్ని ఆత్మహత్యలు న్నాయి. హత్యకు పాల్పడిన వారు ఆనవాళ్లు కూడా దొరక్కుండా పెట్రోల్, యాసిడ్, కిరోసిన్ పోసి మృతదేహాలను కాల్చివేస్తున్నారు. కేసులు నమోదు చేసి శవాల గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదని తెలుస్తోంది. భువనగిరి హెచ్ఎండీఏ పరిధిలోని బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్ మండలాల్లో పలు చోట్ల గుర్తు తెలియ ని వ్యక్తుల మృతదేహాలు లభ్యమవుతుండటం ప్రజల ను భయబ్రాంతులకు గురి చేస్తోంది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పారిశ్రామిక వాడల్లో హత్యగావించబడి న వ్యక్తుల మృతదేహాలను ఇక్కడకు తెచ్చి పడేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆధారాలు దొ రక్కుండా మృతదేహాలను కాల్చేస్తున్నారు. హత్యకు గురవుతున్న వారిలో ఎక్కువగా యువత, మధ్య వయస్సున్న వారే కావడం గమనార్హం. పోలీస్ స్టేషన్లలోనూ ఇటువంటి సంఘటనలకు సంబంధించిన కేసుల సంఖ్య పెరిగిపోతోంది. పొరుగున ఉండటం వల్లేనా..! జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు మండలాలు హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్నాయి. దీనికి తోడు సికిం ద్రాబాద్, హైదరాబాద్ నగరాల నుంచి రహదారి, రైల్వే మార్గం ఉండడంతో నిందితులు చాకచక్యంగా తమ పని పూర్తిచేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ మార్గాల్లో ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ పోలీస్ చెక్‌పోస్ట్ లేకపోవడం కూడా నిందితులకు కలిసి వస్తోంది. మృతదేహాలను నిర్జన ప్రాంతాలు, గుట్టల్లో పడవేస్తుండడంతో రోజుల తరబడి గుర్తించడం కష్టతరమవుతోంది. 2014 సంవత్సరంలో... ఫిబ్రవరి 11న బీబీనగర్ మండలం వెంకిర్యాల సమీపంలో 25-23 ఏళ్ల వయస్సున యువకుడి శవం లభ్యం. మార్చి 26న పెచ్చికల్పహాడ్ శివారులో గుర్తు తెలియని వృద్ధుడి(80) మృతదేహం. మార్చి 29న బీబీనగర్ మండలం జైనపల్లి శివారులో 30-35 సంవత్సరాల వయస్సున్న యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. మే 20న బీబీనగర్ మండలం రాఘవాపురం వద్ద 60-65 సంవత్సరాల వృద్ధుడు మృతి. జూన్ 9న బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద 40-45 సంవత్సరాల వయస్సున్న మహిళ హత్య. ఆగస్టు 4న మాసాయికుంటవద్ద 55 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవం లభించింది. ఆగస్టు 18న భువనగిరి-బీబీనగర్ పాత రోడ్డు 25-32 ఏళ్ల వయస్సున్న యువకుడి హత్య. సెప్టెంబర్ 4న గుర్తు తెలియని మహిళ(60) శవం దొరికింది. 2012 సంవత్సరంలో... జూన్ 30న బట్టుగుడెంలో లభ్యమైన 53 ఏళ్ల వయస్సుగల గుర్తు తెలియని వ్యక్తి శవం. నవంబర్ 2న బీబీనగర్ వద్ద 60 వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని కనుగొన్నారు. నవంబర్ 8న మసాయికుంట వద్ద 40 నుంచి 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం లభించింది. మే 12న పడమటిసోమారం వద్ద 80 ఏళ్ల వయస్సు గల మహిళ, ఇదే నెల 26న గుడూరులో మరో వ్యక్తి మృతి. 2013 సంవత్సరంలో.. ఫిబ్రవరి రాఘవాపురం వద్ద 35-40 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి శవం. ఫిబ్రవరి 4న రాయిగిరి, హన్మాపురం గ్రామాల మధ్య 60 నుంచి 65 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి మృతదేహం లభ్యం. మార్చి 3న బీబీన గర్ వద్ద 35 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంను కనుగొన్నారు. మే 4న రాయిగిరి వద్ద గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. జున్ 5న రాయిగిరి సమీపంలో 50 ఏళ్ల వ్యక్తి హత్య. జూన్ 17న బీబీనగర్‌లో 20-25 మధ్య వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. జూన్ 18న 60-65 సంవత్సరాల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి శవం. ఆగస్టు 24న బీబీనగర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో 35-40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం. అగస్టు 30న కూనూరు వద్ద 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని శవం లభ్యం. సెప్టెంబర్ 28 న బీబీనగర్‌లో 72 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని శవం. అక్టోబర్ 26న రాయిగిరి వద్ద 40-45 మధ్య వయస్సున్న గుర్తు తెలియని శవం. డిసెంబర్ 5న బొమ్మలరామారం మండలం మర్యాలలో 20-30 ఏళ్ల వయస్సున్న యవకుడి హత్య. డిసెంబర్ 16 వడపర్తి వద్ద 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న గుర్తు తెలియని శవం. డిసెంబర్ 25న 21 - 25 సంవత్సరాల వయస్సున్న యువకుడి హత్య. టోల్‌గేట్‌కు అవతలివైపునే.. హత్యగావించిబడిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు ఎక్కువగా బీబీనగర్ మండలం గూడూరు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ అవతలే లభ్యమవుతున్నాయి. టోల్గేట్ వద్ద గల సీసీ కెమెరాల్లో వాహనాలకు సంబంధించిన సమాచారం నిక్షిప్తం అవుతుండటంతో దుండగులు మృతదేహాలను టోల్గేట్ అవతలి వైపునే వదిలి వెళ్తున్నారు. దీంతో హత్యలన్నీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బయటపడ్డ గర్తు తెలియని శవాలు ఎక్కువగా బీబీనగర్ మండలంలో లభించడం గమనార్హం. -
ఆశల ఎర వేసి.. అసలుకు ఎసరు
- బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా - అధిక వడ్డీల ప్రలోభంతో డిపాజిట్ల సేకరణ - పలు జిల్లాల్లో రూ.8 కోట్లకు ఎగనామం - ‘తూర్పు’లోనే రూ.రెండు కోట్లకు పైగా స్వాహా - పోలీసుల అదుపులో సంస్థ ఎండీ వేణు మెరుగు పేరుతో బంగారాన్ని కాజేసే మోసగాళ్లు, పోలీసులు తనిఖీ చేస్తున్నారని ఒంటి మీది నగలు తీయించి, పొట్లం కట్టించి మాయం చేసే నయవంచకుల ఉదంతాలు ఎన్ని వెలుగులోకి వచ్చినా.. కొత్త అమాయకులు అలాంటి వారి ఉచ్చులో పడుతూనే ఉంటారు. ‘మా సంస్థలో సొమ్ము మదుపు చేయండి. ఎవరూ ఇవ్వనంత వడ్డీ ఇస్తాం’ అని ఎర వేసి, తర్వాత అసలుకే ఎసరు పెట్టిన స్వాహాపర్వాలూ ఎన్నో జరిగాయి. అయినా.. అలాంటి ఆశే పెట్టుబడిగా టక్కరులు దగా చేస్తూనే ఉంటారు. ఆ కోవలోనే మరో సంస్థ బోర్డు తిప్పేసింది. కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టింది. అమలాపురం టౌన్ /రాజోలు/మలికిపురం : ‘మీ సొమ్ము ఇంతింతై వటుడింతై’ అన్నట్టు వృద్ధి చెందుతుంది’ అని ఊరించి, కష్టార్జితాన్ని కొల్లగొట్టే నయవంచకుల ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నా.. దగాలు ఆగడం లేదు. ఆ కోవలో తాజాగా సువర్ణ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్టు పబ్లిక్ లిమిటెడ్ అనే సంస్థ జిల్లా ప్రజలను సొమ్ములను కాజేసి బోర్డు తిప్పేసింది. ఆ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల పరిధిలో దాదాపు రూ.8 కోట్ల వరకూ డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉండగా ఒక్క మనజిల్లాలోనే ఈ మొత్తం రూ.రెండు కోట్లకు పైగా ఉంటుంది. అయితే బాధితులందరూ బయటకు వస్తే ఈ మొత్తం రూ.15 కోట్ల వరకూ చేరవచ్చని సంస్థ బ్రాంచి మేనేజర్లు, సేల్స్ మేనేజర్లు అంటున్నారు. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే దాదాపు రూ.5 కోట్ల మేర డిపాజిటర్లు మోసపోయినట్టు తెలుస్తోంది. సంస్థ కూడా ఈ రెండు జిల్లాలపైనే దృష్టి పెట్టి అధికంగా డిపాజిట్లు సేకరించింది.సువర్ణ ఇండియా అధిక వడ్డీల ఆశతో అటు డిపాజిటర్లను, కమీషన్ల ఎరతో ఇటు సంస్థలో పనిచేసే సిబ్బందిని మోసగించింది. ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాలన్నీ కోనసీమ నుంచే నడుపుతోంది. ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ బి.వెంకట నాగవేణు అమలాపురం వాసి. అతడిని రాజోలు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్న సమాచారంతో డిపాజిటర్లలో అలజడి మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో సంస్థను నమ్మి మోసపోయిన కొందరు అక్కడి జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీది తూర్పుగోదావరి కావటంతో శ్రీకాకుళం ఎస్పీ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఇదే సమయంలో సంస్థకు చెందిన కొందరు సేల్స్ మేనేజర్లు మనమంతా మోసపోయమాని డిపాజిటర్లకు చెప్పటంతో సంస్థ బోర్డు తిప్పేసిందన్న విషయం ఆదివారం ఒక్కసారిగా గుప్పుమంది. రాజోలు ప్రాంత సేల్స్ మేనేజర్ సీహెచ్ వెంకటేశ్వరరావు కూడా ఫిర్యాదు చేయటంతో ఎండీ వేణుపై రాజోలు ఎస్.ఐ. దుర్గాప్రసాద్ ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేశారు. రాజోలు మండలం శివకోడులో కొందరు బాధితులు ఆదివారం సమావేశమై ఆ ప్రాంత సంస్థ సేల్స్ మేనేజర్‌ను నిర్బంధించారని, సంస్థ మోసం చేసినా తాను మోసం చేయనని, తనకున్న ఆస్తులమ్మి అయినా డిపాజిట్లు చెల్లిస్తానని అతడు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో విడిచి పెట్టారని సమాచారం. అమలాపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లోని సువర్ణ ఇండియా బ్రాంచిలకు రోజూ వందల సంఖ్యలో బాధితులు వచ్చి, తాళాలు వేసి ఉండడంతో నిరాశగా తిరిగి వెళుతున్నారు. ఇప్పుడు ఎండీని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మోసపోయినట్లు నిర్ధారణకు వచ్చి దిగాలు పడుతున్నారు. కూలీలనూ వదలని వంచన సువర్ణ ఇండియా ప్రజల నుంచి డిపాజిట్లు రాబట్టేందుకు ఆకర్షణీయమైన ఎన్నో ఆఫర్లు ఇచ్చింది. రంగురంగుల బ్రోచర్లతో ఊరించింది. రోజు కూలీల్నీ వదలకుండా వారి ఆర్థిక స్థాయికి తగ్గట్టు నెలకు రూ.100, రూ.200 డిపాజిట్లు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీ ఇస్తామని వల వేసింది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.20 వేలు డిపాజిటర్‌కు, రూ.నాలుగు వేలు సేల్స్ మేనేజర్‌కు, ఇతర కేటగిరీల సిబ్బందికి కమీషన్ ఇస్తామని, ఇదే డిపాజిట్ ఐదేళ్లు ఉంచితే రెట్టింపు సొమ్ములు ఇస్తానని ప్రలోభపెట్టింది. డిపాజిట్ చేసిన సొమ్ములను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి ముందు ముందు ఇంకా ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తామని ఎర చూపింది. తొలి ఏడాది డిపాజిట్లు చేసిన వారికి వడ్డీలు చెల్లించింది. రికరింగ్ డిపాజిట్లపై 12 శాతం వడ్డీని ఆశ చూపింది. గత జనవరి నుంచి మెచ్యూర్ అవుతున్న డిపాజిట్లకు వడ్డీల జమలేదు. అసలుకు సమాధానమూ లేదు. అమలాపురం మెయిన్ రోడ్‌లోని సంస్థ హెడ్ ఆఫీసు గత పదిరోజులుగా మూతపడి ఉంది. రోజూ మహిళా బాధితులు అధికంగా వచ్చి వెళుతున్నారు. కాగా ఎండీని అదుపులోకి తీసుకోవడంతో సోమవారం నుంచి పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా కొందరు సేల్స్ మేనేజర్లు పరారీలో ఉన్నారు. ప్రచార హోరుతో ప్రలోభం సువర్ణ ఇండియా ఎండీ వేణు తమకు డిపాజిట్ల సేకరణే కాక రియల్ ఎస్టేట్, టూరిజం, ఐరన్ ఓర్, సిమెంట్, పెట్రోలు, పవర్ ప్రాజెక్టులు, పత్రికలు, టీవీ చానల్ ఇలా పలు వ్యాపారాలు ఉన్నాయని వెబ్సైట్లో ప్రచారం చేశారు. వాటికి సంబంధించిన బ్రోచర్లను, ఆఫర్లను ఎరగా వేశారు. అమలాపురం మండలం కామనగరువు గ్రామంలో వాము వాటర్ పేరిట మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉందని ప్రకటించారు. అయితే వాస్తవంలో అక్కడ అది లేనేలేదు. ఇలా అసత్య ప్రచారాలతో ఆకర్షించి, డిపాజిట్లను రాబట్టి, ఇప్పుడు పుట్టి ముంచింది. ఎండీతో పాటు సంస్థకు డెరైక్టర్లుగా ఉన్న వారంతా ఇప్పుడు పత్తా లేరు. కాగా తమ సంస్థ డిపాజిట్ల సొమ్ములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భూములు కొనుగోలు చేసిందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. హైదరాబాద్‌లో 140 ఎకరాలు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.20 కోట్ల విలువైన భూములు ఉన్నాయని, వాటిని అమ్మి అయినా డిపాజిట్లు చెల్లిస్తుందని నమ్మించజూస్తున్నారు. -
అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్!
సొంత ఇంటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. జీవితకాల ఆశయం. ఇందుకోసం కష్టపడి పైసాపైసా కూడబెడుతుంటారు. కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు సైతం తీసుకుంటారు. ఆధునిక కాలంలో మనుషుల జీవితాలు బిజీబిజీగా మారిపోయాయి. ఇంటి కోసం రోజుల తరబడి తిరిగే ఓపిక, తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చే నిపుణులే.. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు. స్థిరాస్తి రంగం నానాటికీ అభివృద్ధి చెందుతుండడంతో కన్సల్టెంట్లకు చేతినిండా పని, జేబునిండా ఆదాయం లభిస్తున్నాయి. అవకాశాలకు కొదవ లేకపోవడంతో ఈ రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య భారీగా పెరుగుతోంది. బహుళ సేవలు అందించాలి దేశంలో జనాభా పోటెత్తుతుండడంతో నివాస గృహాల అవసరం అంతకంతకూ పెరిగిపోతోంది. నగరాలు, పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటోంది. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు స్థిరాస్తి సంస్థల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఇల్లు, స్థలాలు కొనడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కన్సల్టెంట్లు సహకరిస్తారు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సలహాలు సూచనలు ఇస్తారు. అంతేకాకుండా సైట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ వంటి బహుళ సేవలను అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో కన్సల్టెంట్లకు సంతృప్తికరమైన వేతనాలు లభిస్తున్నాయి. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధిక ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ఇళ్ల కొరత ఉన్నంతకాలం అవకాశాలకు కొదవ ఉండదు. కావాల్సిన లక్షణాలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలిగే నేర్పు అవసరం. ఏ ప్రాంతంలో రియల్ భూమ్ రానుందో ఊహించగలగాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ప్రారంభంలో కష్టపడి పనిచేస్తే తక్కువ కాలంలోనే ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌గా వృత్తిలో స్థిరపడొచ్చు. అర్హతలు: భారత్‌లో రియల్ ఎస్టేట్‌పై గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు దూర విద్య, ఆన్లైన్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. వేతనాలు: రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభిస్తే ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. నెలకు రూ.లక్షకు పైగానే ఆర్జించే కన్సల్టెంట్లు ఉన్నారు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఏ ఆర్ఐసీఎస్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్-అమిటీ యూనివర్సిటీ; వెబ్సైట్: www.ricssbe.org ఏ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్: www.iire.co.in ఏ ఎన్ఐఆర్ఈఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.nirem.org ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ; వెబ్సైట్: ఠీఠీఠీ.జీటఛ.్ఛఛీఠ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ వెబ్సైట్: http://iref.co.in/ మంచి భవిష్యత్తు ఉన్న కెరీర్ శ్రీముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీని యువత తమ కెరీర్‌గా ఎంపిక చేసుకుంటోంది. కన్సల్టెంట్లపై భరోసాతో రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. గ్రాడ్యుయేషన్‌తోపాటు మార్కెటింగ్‌పై అనుభవం ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్థిరాస్తి రంగంలో భవిష్యత్తులో యువతకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. మార్కెట్‌ను అంచనా వేయగల సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ సొసైటీలో మారుతున్న ట్రెండ్స్, ప్రజల అభిరుచిని గమనించగల నైపుణ్యాలు ఉంటే కన్సల్టెంట్‌గా రాణించొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకుపైగా వేతనం, ఒక్కో ప్రాజెక్ట్‌లో 2-3 శాతం చొప్పున కమీషన్ పొందొచ్చ్ణు -ఇంద్రసేనారెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్ ఎడ్యూ న్యూస్: ‘ఐడియా’ ఇవ్వండి... రూ.లక్షలు గెలుచుకోండి! మీరు మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటున్నారా? ఉత్పత్తులు మొదలుకొని సర్వీసుల వరకూ...వ్యాపారంలోని ఏ విభాగంలోనైనా రాణించగలిగే సత్తా మీకుందని భావిస్తున్నారా? అయితే మీ లాంటి వారికోసమే ఐఐటీ-ఖరగ్‌పూర్ ఏటా ‘ఎంప్రిసేరియో’(Empresario) పేరుతో ఎందరో ఔత్సాహికులను వెలుగులోకి తెస్తోంది. మంచి వ్యాపార ఆలోచన(బిజినెస్ ఐడియా)ను ఇచ్చి, సుమారు రూ. 15 లక్షలకు పైగా విలువైన బహుమతులను గెలుచుకొనే సువర్ణావకాశం కూడా కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మోడల్ కాంపిటీషన్(ఐబీఎంసీ) సహకారంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ ‘ఎంప్రిసేరియో’ను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనాలనుకునేవారు తమ వద్దనున్న ఐడియాతో http://www.ecell-iitkgp.org/empresario/వెబ్సైట్లో అక్టోబర్ 20లోగా నమోదు చేసుకోవాలి. కార్యక్రమానికి ఎంపికైనవారికి మెంటార్షిప్ లభిస్తుంది. విజేతలు నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ లాంటి ప్రముఖ సంస్థల ఎదుట ‘ఐడియా’ను వివరించే అవకాశం ఉంటుంది. ఐఐటీ-బాంబేలో ‘ఇ-యంత్ర’ ఐఐటీ-బాంబే ప్రాజెక్ట్ ఇ-యంత్ర పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్‌లో ప్రతిభావంతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 1, 2014న ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 800 టీమ్‌లు (3200 వందల మంది విద్యార్థులు) నమోదు చేసుకున్నాయి. ఆన్లైన్ టెస్టు ద్వారా ఎంపికైన ఒక్కో టీమ్‌కు సమస్యతో కూడిన థీమ్‌ను ఇస్తారు. రోబోటిక్ కిట్‌ను కూడా ఉచితంగా అందజేస్తారు. దీని సహాయంతో కేటాయించిన థీమ్‌ను పూర్తి చేయాలి. ఇందుకోసం ఔత్సాహికులు ఎలాంటి ఫిజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘ఇ-యంత్ర’ ప్రాజెక్టులో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 31లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్: http://portal.e-yantra.org/eyrc ‘నాక్’లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)లో రెగ్యులర్ పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనే జ్మెంట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాతపరీక్ష, ఇంటర్య్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బీఈ/బీటెక్ -సివిల్, మెకానికల్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. సెప్టెంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న ఉదయం రాతపరీక్ష, సాయంత్రం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000, ట్యూషన్ ఫీజు రూ.లక్ష(సర్వీస్ ట్యాక్స్ అదనం). వెబ్సైట్: www.nac.edu.in జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ఆఫీసర్స్ క్యాడర్, నాన్ టీచింగ్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: ఊ ప్రిన్సిపాల్ ; ఊ టెక్నికల్ ఆఫీసర్ ; ఊ అసిస్టెంట్ ; ఊ అప్పర్ డివిజనల్ క్లర్క్ ఊ లోయర్ డివిజనల్ క్లర్క్ ; ఊ హిందీ ట్రాన్స్‌లేటర్ ; ఊ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 2 అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్: www.kvsangathan.nic.in కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీస్ కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజ్మెంట్ ట్రైనీస్ విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్ అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణత. ఎంపిక: గేట్ - 2015 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా గేట్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1, 2014 నుంచి అక్టోబరు 1, 2014 దరఖాస్తు: గేట్ - 2015 స్కోరు వచ్చిన తర్వాత www.coalindia.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గేట్ వెబ్సైట్: http://gate.iitk.ac.in/ ఎస్బీఐ అసోసియేట్స్ బ్యాంకుల్లో 2986 పీవోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అసోసియేట్స్ బ్యాంక్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రొబేషనరీ ఆఫీసర్; పోస్టుల సంఖ్య: 2986 బ్యాంకుల వారీగా పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 350, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 900, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 500, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 100, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ 1136 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1 నుంచి 18 వరకు వెబ్సైట్: www.sbi.co.in పీజీ డిప్లొమా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. కోర్సుల వివరాలు: ఏ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ ఏ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అర్హత: బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి; దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చివరి తేది: సెప్టెంబర్ 10; వెబ్సైట్: http://calicut.nielit.in/ -
‘స్వర్ణ’ స్థలంపై కబ్జాదారుల కన్ను!
టెక్కలి : ప్రాంతం ఏదైనా ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంటేచాలు దాన్ని సొం తం చేసుకోవడానికి చాలామంది పోటీపడుతుంటారు. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమేపీ గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో ఈ పరిస్థితి మరీ ఎక్కువైంది. చిన్న పట్టణాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సైతం బంగారం లాంటి పంట పొ లాలను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ భూములపై సైతం కన్నేసి రాజకీయ నాయకు ల అండదండలతో వాటిని కైంకర్యం చేసేం దుకు పావులు కదుపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుం డా వారికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా రు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు మౌనంగా ఉంటుం డడంతో కబ్జాదారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి రెవెన్యూ డివిజన్ కేంద్రమైన టెక్కలిలో ప్రస్తుతం కనిపిస్తోంది. పాత జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఆనుకుని స్వర్ణకారుల సంఘం పేరుతో ఇండస్ట్రియల్ శాఖ ఆధీనంలో ఉన్న స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. రాజకీయ నాయకుల అండతో విలువైన ఈ స్థలాన్ని ఎలాగైన సొంతం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలని కొంతమంది ప్రయత్నాలు ప్రారంభించారు. విలువైన ఈ స్థలం వివరాలను పరిశీలిస్తే.. 1966 సంవత్సరంలో టెక్కలిలో జగద్దాత్రి స్వర్ణకారుల సొసైటీ కోసం సర్వే నంబర్ 520/1లో 34 సెంట్ల స్థలం, 520/3లో 1.66 ఎకరాల భూమిను ఖాతా నంబర్ 101288 పేరుతో కొనుగోలు చేసుకున్నారు. అప్పట్లో 38 మంది సభ్యులకు మొత్తం 38 వేల రూపాయల రుణాలను మంజూరు చేస్తూ ఈ స్థలంలో సిమెంట్ పైపుల తయారీ పరిశ్రమలను నిర్వహించుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొంతకాలం తరువాత రుణా లు మాఫీ కావడంతో పైపుల తయారీ పరిశ్రమలు కూడా నిలిపివేశారు. ఆ తరువాత సొసైటీ తమ కార్యక్రమాల కు దూరమైంది. ఇదే స్థలంలో కొన్నేళ్లు ఇండస్ట్ట్రియల్ ఇన్స్పెక్టర్ కార్యాల యం, మత్స్యశాఖ కార్యాలయాలను నిర్వహించారు. ఆ తరువాత ఆ కార్యాలయాలను కూడా ఇతర ప్రాంతాలకు తరలించేశారు. దీంతో ఖాళీగా ఉన్న స్థలాన్ని కబ్జా చేయాలని అప్పట్లో కూడా చాలామంది ప్రయత్నించారు. స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చాలామంది పోటీ పడడంతో పాటు కొంతస్థలాన్ని ఆక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న స్వర్ణకారుల సంఘ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు 2005 సంవత్సరంలో స్థలాన్ని సర్వే చేయించారు. 520/1లో సుమారు 10 సెంట్లు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని అప్పటి కలెక్టర్ కోటేశ్వరరావుకు సర్వే సిబ్బంది నివేదించారు. దీంతో స్వర్ణకారుల సంఘ సభ్యులతో కలెక్టర్ మాట్లాడి సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అయితే సంఘ కార్యకలాపాలు ఇటీవల నిలిచిపోయాయి. దీన్ని అనుకూలంగా మలుచుకున్న కబ్జాదారులు ఈ స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే కొంత స్థలంలో ఓ వ్యక్తి దర్జాగా ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టి అద్దెలకు ఇచ్చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో మిగి లిన స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడానికి చాలామంది ప్రయత్నాలు ముమ్మ రం చేసినట్టు తెలిసింది. రాజకీయ అండతో పాగా వేసేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం టెక్కలిలో సెంటు స్థలం లక్షల రూపాయలు పలుకుతుం డడంతో కబ్జాదారుల మధ్య కూడా పోటీ పెరిగింది. ఇప్పటికైనా ఇండస్ట్రిరియల్, రెవెన్యూ అధికారులు స్పందించకపోతే కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలం ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్లడం ఖాయమని స్థానికు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే ప్రకటనలు: రాఘవులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై రోజుకో ప్రకటన వెలువడుతున్న తీరుపై సీపీఎం నేత రాఘవులు అసహనం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికే రాజధానిపై రోజుకో ప్రకటన చేస్తున్నారని రాఘవులు విమర్శించారు. అనంతపురం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ పూర్తిగా వెనకబడి ఉంది అని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి విద్య, వైద్య, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాఘవులు సూచించారు. -
ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయ్!
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో ప్రభుత్వ భూములు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ జరపడం, పేదలు, ఇతరులకు అసైన్మెంట్ రూపంలో ఇవ్వడంతోపాటు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రభుత్వ ఆధీనంలోని భూముల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. కొన్నేళ్ల క్రితం జిల్లాలో 4,08,361.4 ఎకరాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వీటి విస్తీర్ణం 3,18,865.70 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే వివిధ రూపాల్లో 89,579.99 ఎకరాల భూములు వేరే వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నమాట. వీటిలో ప్రజావసరాలకు ప్రభుత్వం సమకూర్చగా.. పెద్ద విస్తీర్ణంలోనే ఆక్రమణలకు గురయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోనూ వ్యవసాయ భూములే ఎక్కువగా ఆక్రమణలకు గురవుతుండటం విశేషం. ఈ పరిస్థితికి ఆధికారుల అలసత్వం, రాజకీయ ప్రాబల్యం, ఒత్తిళ్లు ప్రధాన కారణం. ఇటీవల కాలంతో భూముల ధరలు, డిమాండ్ పెరగడం, గృహ నిర్మాణాలు పెరగడంతో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురై.. ఇళ్ల స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీనికితోడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ భూములను కరిగించేస్తోంది. ఈ వ్యాపారులు తాము కొనుగోలు చేసే ప్రైవేట్ జిరాయితీ భూముల ముసుగులో వాటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి అక్రమాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించమో.. మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు పోవడం వల్లనో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. ప్రభుత్వ భూముల గణాంకాలు పరిశీలిస్తే.. జిల్లాలో కొన్నాళ్ల క్రితం మొత్తం 4,08,361.4 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ఇతర ప్రజావసరాలకు 79,785.24 ఎకరాలను అసైన్ చేశారు. మరో 2,212.83 ఎకరాలు ఎలియనేటెడ్ భూములుగా ఉన్నాయి. పేదల ఇళ్ల స్థలాలకు 3,730.72 ఎకరాలు కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం 85,728.79 ఎకరాలు. ఇకపోతే చెరువులు, మెట్ట భూములు, కాలువలు, గుట్టలు, కొండలు వంటి భూములు విరివిగా అక్రమణలకు గురవుతున్నాయి. వ్యవసాయ భూములు 3,651.44 ఎకరాలు, వ్యవసాయేతర భూములు 199.76 ఎకరాలు మొత్తం 3.851.20 ఎకరాలు అక్రమణలకు గురయ్యాయి. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజా, ప్రభుత్వ అవసరాలకు భూములు లేకుండాపోయే ప్రమాదముంది. -
‘రీట్స్’ సరికొత్త పెట్టుబడి సాధనం!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు.. రుణాల మంజూరులో కనికరించని బ్యాంకులు.. అయినా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం సా....గుతోంది. కాకపోతే కొనుగోలుదారులే మందగించారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగానికి కొత్త ఊపిరినందించింది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్. ఈ బడ్జెట్లో కొత్తగా రియల్ ఇన్వెస్టిమెంట్ ట్రస్ట్ (రీట్స్)ను ప్రతిపాదించారు. అసలు రీట్స్ అంటే ఏంటి? పెట్టుబడులు ఎలా పెడతారు? వంటి అనేక అంశాలను భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏమన్నారంటే.. ‘రీట్’ మనకు పెద్దగా పరిచయం లేని పెట్టుబడి సాధనం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రీట్స్‌తో మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే నిర్మాణ సముదాయాల్లోనూ పెట్టుబడులు పెట్టొచ్చన్నమాట. వాణిజ్య, నివాస సముదాయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు.. ఇలా అన్ని రకాల నిర్మాణాల్లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే వీలుంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కు ఓ ట్రస్టు, స్పాన్సర్, మేనేజర్ ఉన్నట్టే.. దీనికీ ఉంటారు. ఇందులోని ఫండ్ మేనేజర్లకు స్థిరాస్తులకు సంబంధించిన పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉండాలి. స్థానికులైనా, ప్రవాసులైనా కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. యూనిట్ సైజు రూ.లక్షగా నిర్ణయించారు. మార్కెట్ అభివృద్ధి చెందిన తర్వాత అందరికీ అవకాశం కల్పిస్తారు. బంగారంపై అధిక పెట్టుబడి పెట్టేవారికి ‘రీట్’ చక్కటి ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు. కొనాలంటే 110%.. అమ్మాలంటే 90% రీట్స్‌లో పెట్టుబడులను నిర్మాణం జరిగే వాటిలో పెట్టడానికి ఒప్పుకోరు. 90 శాతం సొమ్మును నిర్మాణం పూర్తయిన వాటిలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా సొమ్మునంతా తీసుకెళ్లి ఒకే దాంట్లో మదుపు చేస్తానంటే కుదరదు. ఇలాంటి నిబంధనల వల్ల పెట్టుబడిదారులకు ఆదాయం త్వరగానే అందుతుంది. ప్రతి ప్రాజెక్ట్ విలువను ఏడాదికోసారి లెక్కిస్తారు. ఆరు నెలలకోసారి ఎన్ఏవీ (నెట్ అసెట్ వ్యాల్యూ)ని ప్రకటిస్తారు. ఇక్కడ సెబీ ఒక నిబంధనను పొందుపర్చింది. ఒకవేళ కొనాల్సి వస్తే.. 110 శాతం కంటే ఎక్కువ సొమ్మును పెట్టకూడదు. అమ్మాల్సి వస్తే ఆస్తి విలువలో 90 శాతం కంటే తక్కువకు విక్రయించకూడదని తెలిపింది. డబ్బులే డబ్బులు.. మూడేళ్ల వరకూ పెట్టిన సొమ్మును కదపడానికి వీలుండని రీట్స్‌లో పెట్టుబడులు చేసేవారికి కార్పొరేట్ పన్ను వర్తించదు. క్రమం తప్పకుండా ఆదాయమూ లభిస్తుంది. కొన్ని రీట్లయితే నిర్మాణ సంస్థలకు నేరుగా నిధుల్ని కూడా సమకూర్చుతాయి. వీటన్నింటిని మించి నిర్మాణ రంగంలో పూర్తి స్థాయి పారదర్శకత నెలకొంటుంది. అస్తవ్యస్తంగా ఉన్న స్థిరాస్తి రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటివరకూ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య తేడా వల్ల కొంత సొమ్ము నల్లధనం రూపంలో నిర్మాణ సంస్థల ఖాతాలోకి వెళ్లేది. ఫలితంగా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడేది. రీట్ల రాకతో పెట్టుబడులు పెట్టే ముందు ఆస్తి విలువలు పక్కాగా తెలిసే వీలుంటుంది. లావాదేవీల్లో, సొమ్ము చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది. నిధుల కొరత పెద్దగా ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా చేపట్టే నిర్మాణాలు ఆలస్యమయ్యే ప్రమాదముండదు. డెవలపర్లకూ ప్రయోజనమే.. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించవు. కేవలం నివాస సముదాయాలకే ప్రాధాన్యమిస్తాయి. ఈ నేపథ్యంలో రీట్లకు ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. రీట్స్‌తో డెవలపర్లకూ ప్రయోజనమే. అభివృద్ధి చేసిన ఆస్తులను రీట్లుగా సులువుగా బదిలీ చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 6 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది. మరో ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. లీజులకు ఇవ్వాల్సిన ఆఫీసు స్థలాన్ని త్వరగా సొమ్ము చేసుకోవచ్చు. దీనిపై ఎంతలేదన్నా పది శాతం చొప్పున వడ్డీ గిట్టుబాటవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్ద కేవలం ఆరు నుంచి ఏడు శాతం వడ్డీ లభిస్తుందని భావించే నిపుణులూ లేకపోలేరు. ఏదేమైనా నగదు కొరతతో అల్లాడుతున్న డెవలపర్లకు ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశముంది. -
అమెరికాలో హైదరాబాద్ యువతి ఆత్మహత్య
సైబర్ క్రైమ్‌కు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్టు సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాడి వేధింపులతో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సూసైడ్ నోట్ ఆధారంగా ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైకు చెందిన రియల్టర్‌ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ పాలరాజు కథనం మేరకు.. చెన్నైలోని రాయపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పర్వేజ్ అలియాస్ సల్మాన్ (37)కు భార్య, ఇద్దరు పిల్లలు. యువతులను మోసగించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్న సల్మాన్... తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని, అమెరికాలో స్థిరపడ్డానని పేర్కొంటూ షాది.కామ్ వెబ్సైట్లో వధువు కావాలని ప్రకటన ఇచ్చాడు. ఈ క్రమంలో అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో పాటు మరో ఆరుగురు ఇతని వలలో పడ్డారు. అమెరికాలోని యువతితో సల్మాన్ తరచూ చాటింగ్ చేసేవాడు. ఈ చాటింగ్ శ్రుతిమించి చివరకు ఇద్దరి మధ్య నగ్న చిత్రాల వీడియో చాటింగ్‌కు దారి తీసింది. అయితే ఆమె క్లిప్పింగ్‌లను సేకరించిన సల్మాన్ యువతిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలని లేని పక్షంలో నగ్న చిత్రాలను ఫేస్బుక్ ద్వారా బంధువులు, స్నేహితులకు పంపుతానని బెదిరించాడు. సల్మాన్ బ్లాక్‌మెయిల్‌తో కుంగిపోయిన ఆ యువతి ఇటీవలే అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడింది. తనకు జరిగిన అన్యాయంతో పాటు మృతికి కార ణాలను సూసైడ్ నోట్ ద్వారా హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో యువతి తండ్రి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పర్వేజ్‌ను శనివారం అరెస్టు చేశారు. -
మాయలో పడొద్దు
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పేరుతో.. తెలంగాణలో అభివృద్ధి జోరంటూ స్థిరాస్తి వ్యాపారం గుడ్డిగా ముందుకెళ్తే బోల్తాపడ్డట్లే కొనుగోలుకు ముందే జాగ్రత్తలు అవసరం హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపారం ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారంతో, తెలంగాణలో విదేశీ సంస్థలొస్తున్నాయి, అభివృద్ధికి డోకాలేదంటూ అనధికారిక ప్రకటనలతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరం ధర రూ.వేలు, లక్షలు దాటి కోట్లకు చేరుకుంది. ధరల సంగతి ఎలాగున్నా భూమి స్థితిగతులను సరిగా అంచనా వేయలేక, వాస్తవాలు తెలియక, దళారుల మాటలను నమ్మి మోసపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే భూమిని, అపార్టుమెంట్లను కొనుగోలు చేసే వారు ఆనక ఇబ్బందులు పడరు. మోసపోయాక చేసేదేమీ ఉండదు. ఫ్లాట్ కొనేముందు.. లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొన్నాక హక్కుల్లో చిక్కులు వస్తే ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్మాణ పరమైన అనుమతులు, స్థిరాస్తి యాజమాన్య హక్కు పత్రాలు పక్కాగా ఉన్నాయా? న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా? అన్న విషయాలను చూసుకోవాలి. ఇటీవలికాలంలో కొంత మంది బిల్డర్లు ఓపెన్ స్పేస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఓపెన్ స్పేస్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. వాటికి అనుమతులు కూడా ఉండవు. కానీ కొంత మంది బిల్డర్లు అక్కడ కూడా నిర్మాణాలు చేసి తక్కువ ధరకే అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వీలైతే అనుభవమున్న న్యాయవాదిని సంప్రదించాలి. ప్లాన్‌ను పరిశీలించారా? కొనుగోలుదారులకు బిల్డర్లు అనేక రకాల వరాలు ఇస్తుంటారు. కలలో ఉన్న సౌధాన్ని మాటలతో కళ్ల ముందు చూపిస్తుంటారు. అపార్టుమెంట్లో పిల్లల పార్కు, ఈత కొలను, వ్యాయామశాల వంటి మరెన్నో సౌకర్యాలను చెబుతుంటారు. ఇవన్నీ అపార్టుమెంట్ ప్లాన్‌లో పొందుపరచబడి ఉంటాయి. అందువల్ల ప్లాన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంటీరియర్స్‌కు సంబంధించిన పనులు సాధారణంగా బిల్డర్ చేసివ్వరు. సర్వాంగసుందరంగా ఉండే నమూనా ఫ్లాట్ అన్నది నిర్మాణపరంగా మీ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కానీ మీ ఇల్లు ఆ విధంగా చేసిస్తారని పొరపాటుపడొద్దు. ఈతీరుగా మీ ఫ్లాట్ కావాలంటే అదనపు రుసుం కట్టక తప్పదు. నాణ్యతను గమనించారా? నిర్మాణ పనులు చివరి దశలోకి రాగానే ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా అనే తహతహ చాలా మందికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఫ్లాట్ నాణ్యతను పరిశీలించాలి. కొందరు బిల్డర్లు నమూనా ఫ్లాట్‌పై చూపెట్టిన శ్రద్ధ వాస్తవ ఫ్లాట్‌లో పాటించరు. ఇటువంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి. ఫ్లాట్ల నిర్మాణంలో నాణ్యత లేకపోతే రాజీపడకూడదు. ఒప్పందాన్ని మీరి నాణ్యత లోపాలు ఉంటే సవరించాకే ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ఏళ్ల నాటి కష్టం ఇంటిని చూస్తే మాయమవుతుంది. ప్లాట్ కొనేముందు.. 1. భూమి యాజమాన్య హక్కులు చూడాలి. అది పట్టా భూమా? ప్రైవేటుదా? ప్రభుత్వానిదా? తెలుసుకోవాలి. చెప్పిన సర్వే నంబరు క్షేత్రస్థాయిలో ఉందా? లేదా నిర్ధారించుకోవాలి. 2. పలు సందర్భాల్లో ఇరుగుపొరుగు సర్వే నంబర్లు రికార్డుల్లో చేర్పి ఫలానా సర్వే నంబరు అదేనంటూ బుకాయించే అవకాశాలు లేకపోలేదు. పేపర్లలోని సర్వే నంబర్లను నమ్మడం కంటే సంబంధిత సర్వే నంబరు ప్రభుత్వ సర్వేయరు ద్వారా నిర్ధారించుకోవటం మేలు. దీనికి ధ్రువీకరణ పత్రం కూడా ఇస్తారు. 3. {పభుత్వానిదంటే.. అసైన్డ్, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, స్మశానాలు, ఇనాం, బంజరు, పోరంబోకు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, క్రిస్టియన్ మైనార్టీ, నీటిపారుదల శాఖ ఇలా ఏ కేటగిరీకి చెందిన భూమో తెలుసుకోవాలి. 4. ఆక్రమించిన భూములా? లేదా నిర్ధారించుకోవాలి. నిషేధిత భూముల జాబితా (ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్- బదిలీ నిషేధిత భూమి)లో ఉందేమో పరిశీలించుకోవాలి. ఈ వివరాలు రె వెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద ఉంటాయి. ఆర్ఎస్ఆర్ (రీ సర్వే రిజిస్టర్)లో ఏ కేటగిరీ భూమో తెలుస్తుంది. 5. {పతి భూమికి సంబంధించి ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్), లింక్ డాక్యుమెంట్ తీసుకుని సరిచూసుకోవాలి. ఆయా భూముల ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తే వాస్తవ విషయాలు తెలుస్తాయి. తనఖా (మార్టగేజ్) పెట్టిన భూమిని, సామాజిక అవసరాల (పార్కులు, ఆటస్థలాలు, రోడ్లు, పారిశ్రామిక అవసరాలు)కు కేటాయించిన భూమిని విక్రయించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. -
నిండా మునిగారు!
కర్నూలు, న్యూస్‌లైన్: ఎన్నికల వేడి ముగిసింది. విజేతలు సంబరాల్లో మునిగితేలుతుండగా.. పరాజితుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక వీరినే నమ్ముకున్న పందెంరాయుళ్లు మాత్రం చేతులు కాల్చుకుని రోడ్డునపడ్డారు. పంతానికి పోయిన ఇలాంటి వారెందరికో బూడిదే మిగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున వారి అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు భారీ మొత్తంలో పందెం కాసి నిండా మునిగారు. పురపాలక ఓట్ల లెక్కింపులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఆ పార్టీ అభ్యర్థులపై పందెంరాయుళ్లు స్థోమతకు మించి పందెం పెట్టారు. ఇతర పార్టీల వర్గీయులను రెచ్చగొట్టి మరీ పందేలకు ఊసిగొలిపారు. జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆలూరు, శ్రీశైలం, డోన్, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులే లక్ష్యంగా బెట్టింగ్ సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించడంతో బెట్టింగ్ ‘కట్ట’లు తెంచుకుంది. ముఖ్యంగా భీమవరం, ప్రొద్దుటూరు, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన టీడీపీ ప్రముఖులు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో చెలరేగిపోయారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీజీ వెంకటేష్ గెలుస్తాడని ఆయన అనుచరులు భారీగా పందేలు కాశారు. పంతానికి పోయి గుడ్డిగా పందేలు కాసి భారీగా నష్టపోయి బావురుమంటున్నారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు అప్పగించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. గతంలో మెజార్టీపై పందేలు కాసిన నాయకులు ఈసారి గెలుపుపై బెట్టింగ్ పెట్టడం గమనార్హం. వైఎస్సార్సీపీ నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి విజయఢంకా మోగించడంతో పందెం డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు తేలుకుట్టిన దొంగల్లా తిరుగుతున్నారు. టీజీకి ముఖ్య అనుచరుడైన సీతారామనగర్ వాసి ఒకరు రూ.15 లక్షలు, పాతబస్తీకి చెందిన మాజీ కార్పొరేటర్ల బృందం రూ.5 లక్షలు, ఎన్ఆర్.పేటలో నివాసముంటున్న కేబుల్ నిర్వాహకుడు రూ.5 లక్షలు, అమృత అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు, ఆర్ఆర్ హాస్టల్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి రూ.12 లక్షలు, ఉస్మానియా కళాశాల సమీపంలోని మాజీ కార్పొరేటర్ ఒకరు రూ.5 లక్షలు బెట్టింగ్‌లో కోల్పోయినట్లు నగరంలో చర్చ జరుగుతోంది. కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బంగారు వ్యాపారస్తులతో సిండికేట్‌గా ఏర్పడి రూ.6 లక్షలు, వక్ఫ్‌బోర్డు నాయకుడు ఒకరు రూ.7 లక్షలు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న మాజీ కార్పొరేటర్లు రూ.15 లక్షలు పోగొట్టుకుని ముఖం బయటకు చూపలేకపోతున్నారు. హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు టీజీ తరఫున పందెం పెట్టి నష్టపోయాడు. అయితే కోడుమూరు నియోజకవర్గం నుంచి మణిగాంధీ, కర్నూలు పార్లమెంట్ నుంచి బుట్టా రేణుక గెలుపొందుతారని రూ.3 లక్షలు పందెం కాసి పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకున్నట్లు సమాచారం. అలాగే బళ్లారి చౌరస్తాలోని నిర్మల్ నగర్లో నివాసముంటున్న ప్లాట్ల వ్యాపారి కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ బార్లో పని చేసేవాడు. ఈయన కూడా టీజీ తరఫున రూ.3 లక్షలు కోల్పోయాడు. డోన్ నుంచి కేఈ ప్రతాప్ గెలుపొందుతాడని ఆ పార్టీ శ్రేణులు దాదాపు రూ.కోటి దాకా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నారు. కొండపేట నివాసి ఒకరు రూ.25 లక్షలు, 40 సెంట్ల స్థలం బెట్టింగ్‌లో కోల్పోయినట్లు సమాచారం. గోసానిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని రూ.20 లక్షలు పందెం కాసి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. ప్యాపిలి జెడ్పీటీసీ మాజీ సభ్యునితో పాటు ఆ పార్టీ శ్రేణులంతా సిండికేట్‌గా ఏర్పడి దాదాపు రూ.50 లక్షల దాకా బెట్టింగ్ కాసి చేతులు కాల్చుకున్నారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి గెలుపొందుతాడని ఆయన సమీప బంధువులతో పాటు టీడీపీ శ్రేణులు 50 మంది దాకా సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఇందులో మాజీ కౌన్సిలర్లు, వ్యాపారులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. వీరంతా దాదాపు రూ.5 కోట్ల దాకా బెట్టింగ్‌లో కోల్పోయినట్లు చర్చ జరుగుతోంది. -
మళ్లీ భూమ్
రాజధాని అంచనాతో స్థల క్రయ విక్రయాల జోరు గుంటూరు-విజయవాడ రోడ్డులోని స్థలాలకు డిమాండ్ మిగిలిన ప్రాంతాల్లోను కొనుగోళ్లు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. సీమాంధ్రలో రెండో అతి పెద్ద నగరంగా విజయవాడకు గుర్తింపు ఉండటం, రాజధాని ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉండటంతో రాజధాని అవకాశాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. దీనికి తోడు గత వారంలో శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ నగరంలో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసింది. దీంతో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే బలమైన వాదన వినిపిస్తుండటం రియల్ వ్యాపారానికి ఊతమిచ్చింది. సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొద్ది రోజుల్లో కొలువుతీరనుంది. రాజధాని ఏర్పాటుతో పాటు, అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే రాజకీయ వాదన బలంగా ఉంది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందే అవకాశమున్న నేపథ్యంలో గుంటూరు - విజయవాడ మధ్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతంలో డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని బలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రెండు జిల్లాల టీడీపీ ముఖ్యులతో దీనిపై చర్చించారు. రాజధాని ఏర్పాటుచేసే ప్రాంతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, డీజీపీ కార్యాలయం ఉంటాయి కాబట్టి రాజధాని ఏర్పాటు కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని వనరులూ పుష్కలంగా ఉన్న విజయవాడను రాజధానిగా ప్రకటించినా నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజధాని ఏర్పాటు రెండు జిల్లాల మధ్య జరిగినా రెండు జిల్లాల అభివృద్ధికీ దోహదపడుతుంది. ఇదే అంశాన్ని రియల్ వ్యాపారులు కారణంగా చూపుతూ వ్యాపారం సాగిస్తున్నారు. విస్తారంగా భూములు, స్థలాలు... ప్రధానంగా గంటూరు- విజయవాడ మధ్య సుమారు 250కి పైగా ప్రెవేట్ వెంచర్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. గత ఆరు నెలలుగా వ్యాపారం పెరగటంతో పాటు ధరలు కూడా రెట్టింపయ్యాయి. గుంటూరు విజయవాడ నగరాలతో పాటు ఏడు మున్సిపాలిటీల పరిధి విస్తరించి ఉన్న వీజీటీఎం పరిధిలో 1400 గ్రామాలను కలుపుకొని 7067 కిలోమీటర్ల పరిధి ఉంది. ఉడా పరిధిలో అధికార, అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్లు సుమారు ఆరువేలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో వెంచర్ల కింద సుమారు 10 వేల ఎకరాల భూమి ఉంది. దీనికితోడు రెండు జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అటీవీశాఖకు రెండు లక్షల ఎకరాల భూమి ఉంది. దీనిలో 1.25 లక్షల ఎకరాలు ఆక్రమణల చెరలో ఉండగా మిగిలిన 75 వేల ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయి. దేవాదాయ శాఖకు కూడా జిల్లాలో భూములు అధికంగానే ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో దేవాదాయ శాఖకు 36,377 ఎకరాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాజధాని నిర్మాణానికి అనువుగా ఇక్కడ భూములు ఉన్నాయని, అందుబాటులో గన్నవరం విమానాశ్రయం, జాతీయరహదారి, రైల్వే డివిజన్, నీటి సమస్యలు తీర్చే కృష్ణా నది ఇలా అన్ని వనరులు ఉన్నాయని కలెక్టర్ రఘునందన్‌రావు శివరామకృష్ణన్ కమిటీకి నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా జూన్ రెండో తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరగనుంది. జూన్ చివరినాటికి కల్లా రాజధానిని ఎంపిక చేసి తాత్కాలికంగానైనా సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. వేగంగా విక్రయాలు... రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఉంటుందని, నాగార్జున విశ్వవిద్యాలయంలో దాదాపు సీఎం కార్యాలయానికి అనువైన అన్ని సౌకర్యాలూ ఉన్నాయని ఇప్పటికే అక్కడి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని విజయవాడ-గుంటూరు రహదారి, విజయవాడ-మచిలీపట్నం రహదారి, విజయవాడ-నూజివీడు రహదారి, విజయవాడ-నందిగామ మధ్య ఉన్న ఖాళీ స్థలాలు, వెంచర్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం, పోలీసులు జిల్లాలో సుమారు 30 చెక్‌పోస్టులు ఏర్పాటుచేయటంతో నగదు లావాదేవీలకు అవకాశం లేకపోయింది. ప్రస్తుతం పరిస్థితి మారటంతో కొనుగోళ్లకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. -
‘రియల్’ దందా
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : రియల్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న ప్రజలకు ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్ నిర్మించి ప్లాట్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారి డబ్బులతోనే వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చినవారికి ప్లాట్ మాత్రం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఇగో.. అగో అని తప్పించుకుంటున్నారు. బలవంతులైన మోసగాళ్లను ఏమీ చేయలేని మధ్యతరగతి ప్రజలు.. తమ అదృష్టాన్ని నిందించుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు. తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు గడించవచ్చు అని భావిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగిడుతున్నారు. రాత్రికి రాత్రే బోర్డు పెట్టుకుని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో ఉండి నగరంలో స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయాలనుకునేవారి వివరాలు సేకరిస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకొని వల వేస్తున్నారు. తక్కువ ధరలకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. డబ్బులు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని చెప్పి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. తర్వాత ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో పలు జరిగాయి. మోసం చేస్తున్నారిలా.. నగరంలో ఓ వర్గానికి చెందిన కొందరు వివిధ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలుండడంతో వీరు నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్మూర్‌కు చెందిన ఓ పార్టీ నాయకుడు తన ఆస్తిని వీరికి రూ. 65 లక్షలకు విక్రయించాడు. ఆస్తిని కొనుగోలు చేసిన సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు చెల్లించలేదు. డబ్బులు తర్వాత ఇస్తామని, తాము చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే లాభాన్ని నెలనెలా చెల్లిస్తామని నమ్మించారు. నెలలు గడుస్తున్నా సదరు నాయకుడికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో తాను మోసపోయానని సదరు నాయకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాను మోసపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలిసింది. తన డబ్బులు రాబట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మందినే మోసం చేసినట్లు తెలుస్తోంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగరంలో మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామని చెప్పి పలువురి వద్దనుంచి డబ్బులు తీసుకున్నారు. మూడేళ్లవుతున్నా ఎలాంటి పురోగతిలేదు. దీంతో డబ్బులిచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యాపారులకు రాజకీయ నాయకుల అండదండలుండడంతో డబ్బులకోసం నిలదీయలేకపోతున్నారని సమాచారం. అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అపార్ట్మెంట్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
రియల్ ఢమాల్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. స్థిరాస్తి, భూ క్రయవిక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. దస్తావేజుల సంఖ్య తగ్గి ప్రభుత్వానికి రాబడి కూడా తగ్గింది. ఐదేళ్లలో ఎప్పుడు లేనంతగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో పురోగతి ఏడు శాతం లోపే ఉండటంతో రిజిస్ట్రేషన్ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్ష్యం సాధింపులో ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడు క్షీణత ఉందని రిజిస్ట్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంచిర్యాల మినహా జిల్లా అంతటా రియల్ వ్యాపారంలో నిస్తేజం కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో మంచిర్యాల జిల్లా అవుతుందని అక్కడ కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం. లక్ష్యంలో వెనుకంజ జిల్లాలో స్థిరాస్తి, భూ క్రయవిక్రయాలు మందకొడిగా సాగుతున్నాయనడానికి గణాంకాలే నిదర్శనం. జిల్లాకు 2013- 14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.78.50 కోట్ల లక్ష్యం విధించగా కేవలం రూ.66.97 కోట్లు సాధించి 85 శాతమే లక్ష్యాన్ని చేరుకుంది. పురోగతి రేటు కేవలం 6.63 శాతం నమోదైంది. ఐదేళ్ల పురోగతిని పరిశీలిస్తే ఇదే అతి తక్కువ. జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, బోథ్ పరిధిలో క్రయ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఆసిఫాబాద్, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటల్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క మంచిర్యాలలో అమ్మకాలు, కొనుగోళ్లు ఊపు మీద ఉన్నాయి. ఎందుకీ దుస్థితి.. జిల్లాలో రియల్ వ్యాపారం పడిపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ వర్గాలు, రియల్టర్లు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఊపు మీద ఉన్న రియల్ వ్యాపారం ఇప్పుడు తిరోగమనంలో ఉండటానికి ఆదిలాబాద్‌లో మనీ సర్క్యులేషన్ జరగకపోవటం ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఓ బడా పారిశ్రామికవేత్త వ్యాపారంలో దివాళా తీయడంతో కోర్టు ద్వారా ఇన్సాల్వెంట్ పిటిషన్(ఐపీ) పొంది వ్యాపారం బంద్ చేశారు. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో బ్రోకర్లు భూముల ధరలు ఇష్టారీతిన పెంచి అమ్మడం, కేవలం అవే భూములు ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులకు మారుతూ వచ్చి ప్రసుత్తం అమ్మకాలు నిలిచాయి. ఆదిలాబాద్ చుట్టూ పక్కల ప్రభుత్వ నోటిఫైడ్ భూములు ఉండటంతో రియల్ వ్యాపారానికి కొత్త భూములు దొరకని పరిస్థితి ఉంది. గతంలో రియల్టర్లు అధికారులను నయానో బయానో దారికి తెచ్చుకొని ప్రభుత్వ భూములు అమ్మేందుకు ఎన్వోసీని పొంది భూ క్రయవిక్రయాలు జరిపారు. రెండేళ్లుగా ఎన్వోసీ జారీని ప్రభుత్వం నిలిపివేసింది. అదేవిధంగా వెంచర్లు కొన్న తర్వాత వివాదాలు తలెత్తుతున్న సంఘటనల కారణంగా భూములు కొనాలనుకునే వారు ఆచి తూచి వ్యవహరించడం కూడా అమ్మకాలు తగ్గటానికి కారణం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? రాకముందు కొందామా? లేకపోతే వచ్చిన తర్వాత కొంటే బాగుంటుందా? అనే సంశయ ధోరణి కారణంగా చేతిలో డబ్బులున్నా పలువురు కొనుగోలుకు ముందుకు రాకపోవటం లేదు. రెండు నెలలుగా ఎన్నికల వేడి ఉండటంతో భూ కొనుగోలుదారులు వా యిదా వేస్తుండటం క్షీణతకు కారణంగా పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండి
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లుగా మార్చుతున్నారు. కొందరు రియల్టర్లు ఎటువంటి అనుమతులు లేకుండానే ప్లాట్లుగా విభజించి అమ్మకాలు సాగించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని 15 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు పెరగడంతో వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చుతున్నారు. వాస్తవానికి వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలంటే ముందుగా ఆర్డీఓ అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా పంచాయతీకి చలానా కట్టాలి. లేఅవుట్‌గా ఆమోదించిన పంచాయతీ తీర్మానం కాపీని ఉడా సాంకేతిక ఆమోదానికి పంపించాలి. దీంతోపాటు లేఅవుట్ స్థలంలో 10 శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. అయితే ఇవేమీ పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి కొన్న భూమిని వారి పేరు మీదునే ఉంచుతున్నారు. ప్లాట్లు విక్రయించిన వారికి భూములు కొన్న రైతులతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో పంచాయతీ ఆదాయం, కన్వర్షన్ ఫీజుకు గండిపడుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారానికి సర్పంచులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తునన్నాయి. మండలంలోని గొల్లలపేట, దుప్పాడ, చెల్లూరు, నారాయణపురం, బియ్యాలపేట, మలిచర్ల, సారిక, కోరుకొండ, జొన్నవలస, ద్వారపూడి, గుంకలాం, కొండకరకాం, మున్సిపాలిటీ విలీన పంచాయతీలు గాజులరేగ, కె.ఎల్.పురం, ధర్మపురి, జమ్ము, అయ్యన్నపేట గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇప్పటికైనా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు అక్రమ లేఅవుట్లపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
రియల్ ఎత్తు కాంగ్రెస్ నేతల భూమాయ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు సరికొత్త ఎత్తుగడ వేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట విలువైన స్థలాల ఆక్రమణకు టెండర్ పెట్టారు. ఇరిగేషన్ భూములకు నాయకుల ఒత్తిళ్లతో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిరభ్యంతర పత్రాలు ఇచ్చేస్తున్నారు. తాజాగా కర్నూలు మండలం మామిదలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలోని రూ.3 కోట్ల విలువ చేసే కేసీ కెనాల్ పొరంబోకు భూమిపై వీరి కన్ను పడింది. జిల్లాలో ఓ మంత్రికి ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతూ.. ఓ ఎమ్మెల్యే తనకు మిత్రుడని నమ్మబలుకుతూ ఓ మాజీ ఎంపీటీసీ తనకు అనుకులంగా ఉన్న వారి పేర్లతో 2011 మార్చి చివరి వారంలో ఓ జాబితా తయారు చేశారు. ఇందులో కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ వీఆర్వో, రేషన్ డీలర్ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చారు. ఈ వ్యవహారాన్ని ఓ ఎమ్మెల్యేను తెర ముందుండి నడిపించినట్లు సమాచారం. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారికి అనుకుని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ఉంది. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 128/5బి3ఏ కేసీ కెనాల్ పోరంబోకు స్థలం 1.40 ఎకరాలను అధికారికంగా కబ్జా చేసేందుకు నాయకులు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అధికారుల సహకారంతో పావులు కదిపారు. ఆ భూమి తమకు నిరుపయోగమని ఇరిగేషన్ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేయించారు. అనంతరం ఆ స్థలాన్ని దక్చించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు పక్కా ప్రణాళిక రూపొందించారు. మామిదలపాడుకి చెందిన 10 నుంచి 20 కుటుంబాలు కేసీ కెనాల్‌కు ఇరువైపుల గుడిసెలు వేసుకున్నారని.. వారికి ఇళ్ల పట్టాల పంపిణీని చేయిస్తామని ఆ భూమిని తెరపైకి తెచ్చారు. అనర్హులు.. అనుకూలురైన వారి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఓ మాజీ ఎంపీటీసి తన భార్య, అమ్మ, బంధువులు, మండలంలోని పంచాయతీ వీఆర్వో, రియల్టర్లు, డీలర్ల పేర్లను అందులో చేర్చారు. 59 మందికి 2 సెంట్ల చొప్పున పట్టాలు సిద్ధం చేసి పంపిణీ చేశారు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ భూమిని అనర్హులకు కట్టబెట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా నిబంధనలను తుంగలో తొక్కారు. జాబితాలో కొన్ని బోగస్ పేర్లను కూడా చేర్చి ఆ పట్టాలను అధిక మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అక్రమార్కులు ఇప్పటికే కర్నూలు నగర శివారులో తుంగభద్ర దిగువ కాలువకు చెందిన సర్వే నెంబర్ 291/1లో ఉన్న రూ.3కోట్ల విలువైన 72 సెంట్లు, ఆర్టీసీ బస్టాండ్ వెనుక భాగంలోని ఎల్ఎల్సీ కాలువ భూమి కబ్జా చేశారు. దీంతో పాటు కర్నూలు మండలం పూడురు గ్రామ సమీపంలో కేసీ కెనాల్ పొరంబోకు భూములు 40 ఎకరాలు బీనామీ పేర్లతో స్వాహ చేశారు. -
తూర్పు వెళితే చౌకే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలంటే ఎక్కడ చూసినా రూ.30 లక్షల పైనే పలుకుతోంది. మరి అంతకన్నా తక్కువకు... అందుబాటు ధరల్లో దొరుకుతున్నదెక్కడ? ఇది తెలుసుకోవటంలో భాగంగానే ‘సాక్షి రియల్టీ’ తూర్పు హైదరాబాద్‌పై దృష్టి పెట్టింది. ఉత్తర, పశ్చిమ, దక్షిణ హైదరాబాద్‌లతో పోలిస్తే ఇది మధ్య తరగతికి అనువైన ప్రాంతం. మిగతా ప్రాంతాల్లో నగరం నుంచి కనీసం 30 కి.మీ. వెళితే కానీ రూ.3 వేల నుంచి రూ.4 వేలకు గజం స్థలం దొరకటం లేదు. తూర్పు హైదరాబాద్‌లో మాత్రం... నగరం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే ఆ ధరకు ప్లాట్లు దొరుకుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి ఊపు తీసుకొస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు ఇక్కడినుంచే ప్రారంభమవుతోంది కూడా. దిల్సుఖ్నగర్ నుంచి హయత్ నగర్, నాగోల్ నుంచి నాదర్గుల్, స్నేహపురి నుంచి హస్తినాపురం, కొత్తపేట నుంచి కర్మన్‌ఘాట్, తుర్కయాంజాల్ నుంచి బాటసింగారం... ఇవీ తూర్పు హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలు. జాతీయ రహదారి, ఇన్నర్ రింగ్‌రోడ్డు, కామినేని అస్పత్రులతో తూర్పు హైదరాబాద్‌కు మంచి గిరాకీ ఉంది. దీనికి తోడు నాగోల్- ఎల్బీ నగర్లలో మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే పడింది. దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు ఇక్కడ భారీ ప్రాజెక్టులు, షాపింగ్ మాళ్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలు విద్య, వినోదం, వ్యాపారం... ఇలా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందాయి. నివాస, వాణిజ్య సముదాయాల గిరాకీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మూసారంబాగ్ చౌరస్తా నుంచి చైతన్యపురి దాకా రహదారికిరువైపులా ఎన్నో వాణిజ్య సముదాయాలు వెలిశాయి. చైతన్యపురిలో గజం రూ.30 వేల నుంచి రూ. 40 వేలుంది. రామకృష్ణాపురంలో అయితే రూ.25 నుంచి రూ. 28 వేలు. ఇంకా తక్కువ కావాలంటే స్నేహపురి, అల్కాపురిలో ప్రయత్నించొచ్చు. సొంతింటికి రహదారి.. విజయవాడ జాతీయ రహదారి నుంచి నాగార్జున సాగర్ వెళ్లే రహదారి వరకు ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రూ.20 నుంచి రూ.25 లక్షలకే ఫ్లాట్ లభిస్తోంది. తుర్కయాంజాల్, మన్నెగూడ, అల్మాస్గూడ, జిల్లెలగూడ, మీర్‌పేటలో ఇండిపెండెంట్ గృహాలు కూడా రూ.25 లక్షలకు వస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం, మన్సూరాబాద్‌లలో అయితే కాస్త ఖరీదెక్కువ. కాస్త ఖర్చెక్కువైనా పర్వాలేదు నగరంలో ఉండాలనుకునేవారికి కర్మన్‌ఘాట్, చంపాపేట అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ గజం ధర రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ చెబుతున్నారు. కుంట్లూరు, పసుమాముల, తట్టిఅన్నారం, తారామతిపేటల్లో కొత్తకాలనీలు వస్తున్నాయి. ప్రాంతాన్ని బట్టి చదరపు గజం ధర రూ.1,500-5,000 చెబుతున్నారు. కోహెడ, పెద్ద అంబర్‌పేటల్లో వెయ్యి నుంచి రెండు వేల వరకూ ఉంది. అభివృద్ధి చేసిన లేఅవుట్లు, జాతీయ రహదారికి అనుకుని ఉన్నవి అయితే రూ.5 వేల వరకూ చెబుతున్నారు. ఇటు మెట్రో.. అటు రేడియల్ కారిడార్-1లో భాగంగా మియాపూర్- ఎల్బీ నగర్ మధ్య 28.87 కి.మీలలో మెట్రో వస్తోంది. ఇప్పటికే నాగోల్ -ఎల్బీనగర్ మెట్రోరైల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎల్బీనగర్ నంచి మియాపూర్ వెళ్లే మెట్రోరైలు... విక్టోరియా మెమోరియల్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్ స్టేషన్లలో ఆగుతుంది. ఎల్బీనగర్ ఓపెన్స్టేడియంలో 1.5 ఎకరాల్లో 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో మెట్రో మాల్స్ ఏర్పాటుకు మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సన్నాహాలు చేస్తోంది. నాగోల్ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వంద ఎకరాల్లో రైల్వే డిపోను అభివృద్ధి చేయబోతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డును అనుసంధానిస్తూ నాగోలు-గౌరెల్లి రేడియల్ రోడ్డు కూడా ఏర్పాటు కానుంది. అందుబాటు ధరల్లో: టీఎన్ఆర్ ఆర్థిక మాంద్యం, స్థానిక రాజకీయాంశం వల్ల రియల్ వ్యాపారం జోరుతగ్గిన ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 5 లక్షల చ.అ. విస్తీర్ణంలో పలు ప్రాజెక్ట్‌లను నిర్మించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 లక్షల చ.అ. విస్తీర్ణంలో 4 భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని టీఎన్ఆర్ గ్రూప్ సీఎండీ టి. నరసింహారావు ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. హస్తినాపురంలో 6 ఎకరాల్లో ‘టీఎన్ఆర్ సులక్షణ’ పేరుతో మెగా టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలియజేశారు. దీన్లో మొత్తం ఫ్లాట్లు 490. తొలి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ లాలాపేట్‌లో 2 ఎకరాల్లో రామ్ థియేటర్ పేరుతో నివాస, వాణిజ్య సముదాయాన్ని, కర్మన్‌ఘాట్‌లో మూడున్నర ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంకా ఎల్బీనగర్ చౌరస్తాలో ‘వైష్ణవి శిఖర’ పేరుతో 14 అంతస్తుల లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 70 ఫ్లాట్లు. 1,800 చ.అ. నుంచి 2,300 చ.అ. మధ్య అన్నీ మూడు పడక గదుల ఫ్లాట్లే ఉంటాయి. అదే రోడ్డులో ఎకరంన్నర విస్తీర్ణంలో ‘వైష్ణవి’ పేరుతో మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నారు. ఇవి కూడా 70 ఫ్లాట్లు. 1,400 చ.అ. నుంచి 1,600 చ.అ. మధ్య అన్నీ మూడు పడకగదుల ఫ్లాట్లే. టీఎన్ఆర్ అన్ని ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ స్థాయిలో వసతులను కల్పిస్తున్నట్లు నరసింహారావు చెప్పారు. -
‘బీమా’ ఏజెంట్ల పేరిట రియల్ దందా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులుగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత్రధారులుగా రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డు భూములు అన్యాక్రాంతం అయ్యాయి. పట్టాభూములు కొనుగోలు చేసి పక్కనే ప్రభుత్వ, అసైన్డు, అటవీశాఖలకు చెందిన భూములు కలుపుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా జీవిత బీమాలో పనిచేసే ఏజెంట్ల పేరిట సొసైటీ ఏర్పాటు చేసి, సుమారు రూ.5 కోట్ల విలువ చేసే భూమికే ఎసరు పెట్టిన వైనం ఆల స్యంగా వెలుగు చూసింది. 130 మంది ఏజెంట్ల నుంచి 2008 నుంచి 2010 సంవత్సరాల్లో ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష వసూలు చేసిన సంఘం నేతలు కొందరు, ఆ పెట్టుబడితో అసైన్డు భూమిని కొనుగోలు చేసి, అందులో ఐదెకరాలు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చిన ఓ మాజీ ఆర్డీవో హస్తం కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. అయితే సొసైటీ కోసం 72/2 సర్వే నంబర్లో కేటాయించిన పదెకరాల నుంచి కేవలం 30 మంది సభ్యులకు ప్లాట్ల ను కేటాయించారు. తక్కిన భూమితో సంఘ నేతలు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం కావడంపై బాధితులు లోకాయుక్తను ఆశ్రయించేందుకు సిద్ధం కావడంతో ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. కథా కమామిషు ఇదీ.. జీవిత బీమా సంస్థలో పనిచేసే ఏజెంట్లు సొసైటీగా ఏర్పడి కాలనీ నిర్మించుకునేందుకు స్థలం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 2004లో ‘ఆదిలాబాద్ ఎల్ఐసీ ఏజెంట్ల మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్’గా 130 మంది ఏజెంట్లతో సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ పేరు మీదే బట్టిసావర్గాం పరిధిలోని న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో పదెకరాల ప్రభుత్వ స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ లోగా సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా నియమితులైన వొడ్నాల వెంకటేశం, చిల్కూరి దేవన్న సంఘ సభ్యులు ఒక్కొక్కరి నుంచి సొసైటీకి కేటాయించే అసైన్డు భూమికి ప్రభుత్వ ధర చెల్లించేం దుకు రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున జమ చేశారు. అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో మాదాసి నర్సింహులు జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీ(జీపీఏ)గా ఉన్న 72/2 సర్వే నంబర్లోని పదెకరాల స్థలానికి సొసైటీకి ఇచ్చేలా నిరభ్యంతర పత్రం జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కేవలం ఐదెకరాలు మాత్రమే సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి రెవెన్యూ అధికారులు, మరో ఐదెకరాలు ఆ సం ఘం అధ్యక్ష, కార్యదర్శులతోపాటు మరో ఐదుగురు, వారి కుటుంబసభ్యులపై రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. మాదాసి నర్సింహులు దగ్గర సొైసైటీ కోసం రూ.2.75 లక్షల చొప్పున కొనుగోలు చేసిన ఆ స్థలం విలువ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో ప్రస్తుతం ఎకరానికి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి పలుకుతుంది. మొత్తం పదెకరాల నుంచి సొసైటీ పేరిట ఉన్న ఐదెకరాల్లో ప్లాట్లు చేసిన సంఘ నాయకులు కేవలం 30 మందికి కేటాయించి 100 మందికి మొండిచేయి చూపారు. భూముల ధర అమాంతం పెరగడంతో తమ పేర్లపై సొసైటీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం కావడం వివాదాస్పదంగా మారింది. -
చీటర్ వంశీకృష్ణ అరెస్టు
సాక్షి, విజయవాడ : కోట్లాది రూపాయల మేర జనాన్ని మోసం చేసిన చీటర్ నార్ల వంశీకృష్ణ చివరికి కటకటాలపాలయ్యాడు. ఆయన్ని ఐదురోజులుగా తమ అదుపులో ఉంచుకుని విచారణ చేసిన విజయవాడ పోలీసులు శనివారం అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వంశీకృష్ణ చేసిన అక్రమాలను విజయవాడ డీసీపీ రవిప్రకాష్ విలేకరులకు వివరించారు. క్రైం విలేకరిగా జీవితం ప్రారంభం... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నార్ల వంశీకృష్ణ కుటుంబం విజయవాడకు వచ్చి స్థిరపడింది. ఇక్కడే చదివి ఎంబీయే పూర్తిచేసిన అతను 1995-2000 కాలంలో ఒక పత్రికలో క్రైమ్ విలేకరిగా పనిచేశాడు. దీంతో పోలీసులు, ఇతర అధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సందర్భంలో వీనస్ ఏజెన్సీ అనే పేరుతో బ్యాంక్ రుణాల రికవరీ సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా బ్యాంకులతో సంబంధాలు ఏర్పరచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. విజయవాడ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కొందరికి ఆశ చూపాడు. వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ మేరకు భూమి కొనుగోలు చేసి.. డెవలప్మెంటు పేరుతో ఇంకా కొందరిని భాగస్వాములను చేసుకున్నాడు. బ్యాంకులకు సంబంధిత భూమిని గ్యారెంటీగా చూపి రూ.1.5 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందుకోసం కొందరి సంతకాలను ఫోర్జరీ చేశాడు. విజయవాడలో రియల్టర్‌గా నిడుమానూరులో వీనస్ ఎన్క్లేవ్, భవానీపురంలో తులసీరాం ఎన్క్లేవ్, తాడేపల్లిలో వైశ్రాయ్ హైట్స్లను నిర్మించాడు. కొన్నిచోట్ల భూమి సొంతదారుడికి ఇవ్వాల్సిన ఫ్లాట్లను ఇతనే బుక్ చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఒకే అపార్టుమెంటును ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందికి రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశాడు. అపార్టుమెంటులో ఫ్లాట్ కోసం అడ్వాన్స్ ఇచ్చిన వారికి నిర్మించి అప్పగించకుండా ఆ డబ్బును సొంత అవసరాలకు, విలాసాలకు ఉపయోగించుకున్నాడు. బినామీ పేర్లతో ఆస్తులను బదిలీ చేశాడు. డబ్బు చెల్లించిన బాధితులు ఇతని మోసం తెలుసుకుని డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. చనిపోయినట్లు నాటకం... బాధితుల ఒత్తిడి భరించలేని వంశీకృష్ణ గట్టి ప్లాన్ వేశాడు. 2011 జనవరి 3న తన తల్లితో కలిసి విజయవాడ నుంచి తెనాలి వెళ్తుండగా తాను డ్రైవ్ చేస్తున్న కారు దుగ్గిరాల వద్ద ప్రమాదానికి గురైనట్లు నాటకం ఆడి ఆచూకీ లేకుండా పరారయ్యాడు. అదే నెల 11 తర్వాత చెన్నై, కోయంబత్తూరు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత బెంగళూరు వెళ్లి ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఉన్నాడు. తర్వాత వైజాగ్‌లో స్థిరపడ్డాడు. ఊరు, పేరు మార్చుకున్నాడు. అప్పటికే మొదటి భార్య ైశె లజకు విడాకులు ఇచ్చిన వంశీకృష్ణ తర్వాత డాక్టర్ పసుపులేటి ప్రవీణను ద్వారకాతిరుమలలో దండలు మార్చుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రవీణతో విశాఖలో టచ్ ఆస్పత్రిని ప్రారంభించి విలాసాల్లో మునిగిపోయాడు. ఇప్పటివరకు బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ.8 కోట్లు మోసం చేశాడు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్ కేసులో అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నట్లు డీసీపీ వెల్లడించారు. తల్లిని, రెండో భార్యనూ విచారిస్తాం... వంశీకృష్ణపై వేర్వేరు స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయని డీసీపీ వెల్లడించారు. వీటిపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. వంశీకృష్ణ తల్లి క్షేమంగానే ఉన్నారని, ఆమె పరారీలో ఉన్నారని తెలిపారు. ఆమెను, డాక్టర్ ప్రవీణను కూడా తీసుకొచ్చి విచారిస్తామన్నారు. అతని ఆస్తులకు సంబంధించి నలుగురైదుగురు బినామీలు ఉన్నారని చెప్పారు. వారి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. మొదటి భార్య శైలజతో మాట్లాడామని, అతని వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్నట్టు చెప్పారని వివరించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ నాగేశ్వరరావు, సీఐ టీఎస్ఆర్కే ప్రసాద్, ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు. చనిపోవాలనుకున్నా... : నార్ల వంశీకృష్ణ వంశీకృష్ణతో విలేకరులతో మాట్లాడుతూ చనిపోవాలని నిర్ణయించుకున్నాననీ... కానీ పథకం రచించలేదనీ... చివరకు మనసు మార్చుకున్నానని చెప్పాడు. మూడు, నాలుగు కోట్లకు మించి లావాదేవీలు జరగలేదన్నాడు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నాడు. తానే 95 శాతం నష్టపోయానన్నాడు. ఐదు శాతం బాధితులు నష్టపోయి ఉండొచ్చన్నాడు. తన వెనుక రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నాడు. వడ్డీల భారం ఎక్కువై ఆర్థిక భారం పెరిగి ఇలా అయిందన్నాడు. తనవల్లే అందరూ లాభపడ్డారన్నాడు. -
కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు తహశీల్దార్
ఆర్మూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూ స్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహశీ ల్దార్ వినోద్‌కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరించారు. ఆర్మూర్ మండలం పెర్కిట్, కోటార్మూర్ గ్రామాల పరిధిలోని 202, 206 సర్వే నెంబర్లలోగల ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టెట్ వ్యాపారులు రోడ్లు వేసి, ప్లాట్లుగా మార్చిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘సర్కారు జాగాలో పాగా’ శీర్షికతో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తహశీల్దార్ వినోద్‌కుమార్, ఆర్ఐ వినోద్‌కుమార్ శుక్రవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. గతంలో రెవెన్యూ అధికారులు వేసిన కంచెను తొలగించి న విషయాన్ని గుర్తించారు. ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మొరం తో నిర్మించిన రోడ్డును ట్రాక్టర్‌తో తొలగింపజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ పెర్కిట్, కోటార్మూర్‌లలో ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తమకు గతంలో దరఖాస్తులు అందాయన్నారు. అయితే ప్రతిపాదిత స్థలంలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనే విషయం తెల్చడానికి సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ఈలోగా రియల్ ఎస్టేట్ వ్యాపారి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మించడాన్ని ఆయన తప్పుబట్టారు. పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, ప్రభుత్వ భూమి కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు -
మంత్రి గారి బంధువుమాయ!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జనగామ పట్టణంలో ఆర్టీఏ యూనిట్ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో ఉంది. ఈ ఆఫీసుకు శాశ్వత భవనం కావాలనే ప్రతిపాదనలను ముందుకు కదపడంతోపాటు కొత్త భవన నిర్మాణానికి మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన వంతు ప్రయత్నాలు చేశారు. రూ. 60 లక్షల విలువైన భవన నిర్మాణానికి సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇప్పించారు. సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కావడంతో ప్రత్యేక చొరవ ప్రదర్శించినట్లు మంత్రికి గుర్తింపు వచ్చింది. భవనానికి అవసరమయ్యే స్థల సేకరణకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సిద్ధపడింది. ఈ లోగా మంత్రి బంధువు ఒకరు చక్రం తిప్పారు. తమ రియల్ ఎస్టేట్ స్థలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇదో అనువైన.. అనుకూలమైన అవకాశంగా మలుచుకున్నారు. అక్కడున్న ప్లాట్ల ధరలకు రెక్కలొచ్చేలా అమాంతం డిమాండ్ పెంచుకునేందుకు సరికొత్త ఎత్తుగడ వేశారు. చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయ భవనానికి విరాళంగా ఇస్తే... పక్కనే తమకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతుందని పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా తమకు అందుబాటులో ఉన్న దాదాపు 40 ఎకరాల్లో రెండెకరాల స్థలాన్ని ఆర్టీఏ కార్యాలయానికి విరాళంగా స్వాధీనం చేశారు. నిజానికి ఈ స్థలం జనగామ పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి గ్రామ పరిధిలో ఉంది. స్థానికులకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నప్పటికీ... మంత్రి గారి కనుసన్నల్లో విరాళంగా వచ్చిన భూములు కావడంతో రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు కిమ్మని కూడా అనలేదు. దీంతో చకచకా ఏర్పాట్లు జరిగాయి. గత ఏడాది డిసెంబరు 20వ తేదీన మంత్రి పొన్నాల ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనుకున్నట్లుగానే తెరచాటు పథకం ఫలించింది. కొత్తగా ఆర్టీఏ ఆఫీసు అక్కడ నిర్మిస్తున్నారనే ప్రచారంతో అక్కడున్న రియల్ వ్యాపారం అంచనాలు దాటింది. మంత్రి బంధువు పంట పండింది. సెవెన్ హిల్స్ పద్మావతి డెవెలపర్స్ పేరిట మూడు వెంచర్లుగా తీర్చిదిద్దిన ఈ రియల్ ఎస్టేట్‌లో స్వయానా మంత్రి బంధువు ఒకరు డెరైక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వెంచర్లో 150 గజాల ప్లాటును రూ. 2.36 లక్షలకు విక్రయిస్తున్నారు. నిజానికీ ఆర్టీఏ ఆఫీసు ఊసు లేకముందు... ఈ గ్రామ పరిధిలో మార్కెట్ రేటు గజానికి కేవలం రూ. 40. వ్యాపార రీత్యా ఐదు రెట్లు గరిష్ఠంగా లెక్కలేసిన 150 గజాల ప్లాటు విలువ రూ. 30 వేలు దాటే ప్రసక్తి లేదు. రియల్ వెంచర్.. డెవెలప్మెంట్ మాటలు చెప్పినా.. ఒక్కో ప్లాటు రూ. 50 వేలు పలుకుతుంది. కానీ.. ఏకంగా నాలుగింతలకు పైగా రేట్లు పెంచి.. కోట్లాది రూపాయల విలువైన భూ దందాకు ద్వారాలు తెరిచారు. ఇప్పటికీ అక్కడ ఆర్టీఏ ఆఫీసు నిర్మాణానికి సంబంధించి శిలాఫలకం తప్ప పునాదులు కూడా తవ్వలేదు. కానీ... మంత్రి బంధువుల రియల్ వ్యాపారం మాత్రం రోజురోజుకూ కోట్లకు పడగలెత్తుతోంది. భూరి విరాళమో... భూములను ఎరవేసి అడ్డగోలు సంపాదించడమెలాగో... జనగామ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద వెలిసిన ఈ రియల్ వెంచర్ అందరి కళ్లకు కట్టిస్తోంది.