జవహర్‌నగర్: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ తండ్రి కుమారున్ని చెరువులో పడేసి తనువు చాలించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని చెన్నాపురంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సైదులు, స్ధానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లా, కుందారం గ్రామానికి చెందిన దారం సుధీర్(42), రజిని దంపతులు నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్, శ్రీరాంనగర్‌కాలనీలో ఉంటూ బాలాజీనగర్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్(10), తేజ (12). పెద్దకుమారుడు తేజకు 7వ తరగతిలో తక్కువ మార్కులు రావడంతో గత కొన్ని రోజులుగా సుధీర్ బాధపడుతున్నాడు.
అదేవిధంగా దీనికితోడు సుధీర్ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో తండ్రి మందలించాడు. ఈ క్రమంలోనే కుమారుడికి తక్కువ మార్కులు రావడంతో మనస్ధాపానికి గురైన సుధీర్ మూడు రోజుల క్రితం కుమారుడితో సహా ఇంటి నుంచి బైక్ తీసుకుని బయటికి వెళ్లాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన సుధీర్ సోదరుడు అనిల్‌కుమార్ ఫోన్‌ద్వారా అతను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు.
రెండు రోజులుగా లేక్ పోలీసుల సహాయంతో గాలిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుధీర్ తన ఫోన్ నుంచి మరో 15 నిమిషాల్లో వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున చెన్నాపురం చెరువులో రెండు మృతదేహాలను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలో ఉన్న బైక్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న వారు మృతదేహాలను సుధీర్, తేజలుగా గుర్తించారు.
జవహర్‌నగర్‌లో విషాదచాయలు ...
జవహర్‌నగర్‌లో మెడికల్‌షాపు నిర్వహిస్తూ అందరికీ పరిచయస్తుడైన సుధీర్ కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని కంటతడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment