Javaharnagar
-
7వ తరగతిలో మార్కులు తక్కువ వచ్చాయనే ..
జవహర్‌నగర్: మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ తండ్రి కుమారున్ని చెరువులో పడేసి తనువు చాలించిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలోని చెన్నాపురంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు, స్ధానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లా, కుందారం గ్రామానికి చెందిన దారం సుధీర్(42), రజిని దంపతులు నగరానికి వలస వచ్చి జవహర్‌నగర్, శ్రీరాంనగర్‌కాలనీలో ఉంటూ బాలాజీనగర్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కార్తీక్(10), తేజ (12). పెద్దకుమారుడు తేజకు 7వ తరగతిలో తక్కువ మార్కులు రావడంతో గత కొన్ని రోజులుగా సుధీర్ బాధపడుతున్నాడు. అదేవిధంగా దీనికితోడు సుధీర్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటంతో తండ్రి మందలించాడు. ఈ క్రమంలోనే కుమారుడికి తక్కువ మార్కులు రావడంతో మనస్ధాపానికి గురైన సుధీర్ మూడు రోజుల క్రితం కుమారుడితో సహా ఇంటి నుంచి బైక్ తీసుకుని బయటికి వెళ్లాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన సుధీర్ సోదరుడు అనిల్‌కుమార్ ఫోన్‌ద్వారా అతను ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజులుగా లేక్ పోలీసుల సహాయంతో గాలిస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సుధీర్ తన ఫోన్ నుంచి మరో 15 నిమిషాల్లో వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ చేసినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున చెన్నాపురం చెరువులో రెండు మృతదేహాలను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమీపంలో ఉన్న బైక్ ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న వారు మృతదేహాలను సుధీర్, తేజలుగా గుర్తించారు. జవహర్‌నగర్‌లో విషాదచాయలు ... జవహర్‌నగర్‌లో మెడికల్‌షాపు నిర్వహిస్తూ అందరికీ పరిచయస్తుడైన సుధీర్ కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని కంటతడిపెట్టారు. -
జవహర్‌నగర్ సీఐపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళపట్ల అమర్యాదగా ప్రవర్తించిన జవహర్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీఎస్ ఉమామహేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదివారం ఆదేశించారు. హత్య కేసులో బాధితురాలి ఇంట్లో సీఐ ఉమామహేశ్వర్ అనుచితంగా వ్యవహరించారు. కేసు విచారణ కోసం వెళ్లిన ఆయన అమర్యాదగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఉమామహేశ్వరరావు స్థానంలో జవహార్‌నగర్ ఇన్స్పెక్టర్గా చలపతికి పోస్టింగ్ ఇచ్చారు. చలపతి ప్రస్తుతం వనస్థలిపురం డీఐగా పనిచేస్తున్నారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
జవహర్‌నగర్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో వెలసిన అక్రమ నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లను, నిర్మాణాలను సోమవారం సాయంత్రం శామీర్‌పేట్ తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా దేవుజా మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో చాలా మంది తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, గ్రామంలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రత్నిస్తున్నారన్నారు. 30 ఏళ్ల క్రితం పట్టాలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ లేఅవుట్ తయారు చేస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో చాలా మంది నకిలీ డాక్యుమెంట్లతో పేదప్రజలను మోసం చేస్తున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్ఐ రాజు తదితరులు ఉన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
జవహర్‌నగర్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన పబ్బోజు హరి(40), పద్మ(34) దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చారు. వీరి కుమార్తెలు శ్రావ్య(13) సోనీ(11) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. కార్పెంటర్ పనిచేసే హరి నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడుతున్నాడు. కుటుంబ పోషణకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. దీంతో పద్మ స్థానికంగా ఓ లేడిస్ టైలర్స్‌లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మద్యం మానేయాలని పలుమార్లు పద్మ భర్తకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఇటీవల వీరికి ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో భార్యభర్త తిరిగి తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల బాధ తాళలేక బయటకు పరుగులు తీసింది. భార్య ఆత్మహత్యాయత్నం చేయడంతో హరి కూడా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చిన్న కూతురు సోనీ విషయం గమనించి ఓ బకెట్ సాయంతో తల్లిదండ్రులపై నీళ్లు పోసింది. స్థానికులు మంటలు ఆర్పి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన దంపతులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన హరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక్కడ ‘సర్వే’ సవాలే!
మేడ్చల్: ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ ఇంట్లో ఉండి సహకరించాలని సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ 19న జరిగే సర్వే అధికారులకు సవాల్‌గా మారింది. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇది హైదరాబాద్ శివారులో ఉండడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతం కబ్జాదారులకు నిలయంగా మారింది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో నేతలుగా చలామణి అవుతూ భూకబ్జాలు చేశారు. ఒక్కొక్కరు సుమారు 10 నుంచి 20 ఇళ్లను బినామీ పేర్లతో నిర్మించడమే కాకుండా ప్లాట్లను కబ్జా చేశారు. తాజాగా ప్రభుత్వం ఇంటింటికీ సమగ్ర సర్వే కార్యక్రమం చేపట్టడంతో తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోననే ఆందోళన అక్రమార్కుల్లో మొదలైంది. సర్వేలో తమ బాగో తం బయట పడకుం డా 10 రోజుల ముం దు నుంచే తమ ప్ర ణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇం దులో భాగంగా కబ్జాల్లోని ఇళ్లను, భూములను కాపాడుకోవడానికి తమ బంధుమిత్రులనో, కుటుంబ యజమానులు కానివారినో ఎంత కొంత డబ్బు ఇచ్చి జవహర్‌నగర్‌కు రప్పించే యత్నాలు చేస్తున్నారు. వారికి ముందుగానే అన్ని విషయాలు చెప్పి సర్వే రోజు అధికారులకు ఎలా సమాధానాలు ఇవ్వాలి అనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. తమ కబ్జాలోని ఇళ్లు, స్థలాలు, బినామీ పేర్లను తమ బంధుమిత్రులకు ముందుగానే తెలియజేసి వాటికి సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జవహర్‌నగర్ పరిధిలో ఇళ్ల రెగ్యులరైజేషన్ను గత ప్రభుత్వాలు చేయకపోవడంతో పేరుకు లక్ష జనాభా, 20 వేల కుటుంబాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా ఏ ఇల్లు ఎవరిదో.. ఏ స్థలం ఎవరిదో.. అర్థం కాని విచిత్ర పరిస్థతి నెలకొంది. దీంతో జవహర్‌నగర్‌లో కుటుంబ సమగ్ర సర్వే అధికారులకు సవాల్‌గా మారింది.