
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళపట‍్ల అమర్యాదగా ప్రవర్తించిన జవహర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీఎస్ ఉమామహేశ‍్వరరావుపై బదిలీ వేటు పడింది. హైదరాబాద్ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదివారం ఆదేశించారు.
హత్య కేసులో బాధితురాలి ఇంట్లో సీఐ ఉమామహేశ్వర్ అనుచితంగా వ్యవహరించారు. కేసు విచారణ కోసం వెళ్లిన ఆయన అమర్యాదగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఉమామహేశ‍్వరరావు స్థానంలో జవహార్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌గా చలపతికి పోస్టింగ్ ఇచ్చారు. చలపతి ప్రస్తుతం వనస్థలిపురం డీఐగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment