అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్! | Real estate consultant to make business more and more | Sakshi
Sakshi News home page

అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్!

Published Sun, Aug 31 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్!

అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్!

సొంత ఇంటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. జీవితకాల ఆశయం. ఇందుకోసం కష్టపడి పైసాపైసా కూడబెడుతుంటారు. కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు సైతం తీసుకుంటారు. ఆధునిక కాలంలో మనుషుల జీవితాలు బిజీబిజీగా మారిపోయాయి. ఇంటి కోసం రోజుల తరబడి తిరిగే ఓపిక, తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చే నిపుణులే.. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు. స్థిరాస్తి రంగం నానాటికీ అభివృద్ధి చెందుతుండడంతో కన్సల్టెంట్లకు చేతినిండా పని, జేబునిండా ఆదాయం లభిస్తున్నాయి. అవకాశాలకు కొదవ లేకపోవడంతో ఈ రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య భారీగా పెరుగుతోంది.
 
 బహుళ సేవలు అందించాలి
 దేశంలో జనాభా పోటెత్తుతుండడంతో నివాస గృహాల అవసరం అంతకంతకూ పెరిగిపోతోంది. నగరాలు, పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటోంది. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు స్థిరాస్తి సంస్థల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఇల్లు, స్థలాలు కొనడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కన్సల్టెంట్లు సహకరిస్తారు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సలహాలు సూచనలు ఇస్తారు. అంతేకాకుండా సైట్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ట్రాన్సాక్షన్ మేనేజ్‌మెంట్ వంటి బహుళ సేవలను అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో కన్సల్టెంట్లకు సంతృప్తికరమైన వేతనాలు లభిస్తున్నాయి. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధిక ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ఇళ్ల కొరత ఉన్నంతకాలం అవకాశాలకు కొదవ ఉండదు.
 
 కావాల్సిన లక్షణాలు
 రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలిగే నేర్పు అవసరం. ఏ ప్రాంతంలో రియల్ భూమ్ రానుందో ఊహించగలగాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ప్రారంభంలో కష్టపడి పనిచేస్తే తక్కువ కాలంలోనే ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌గా వృత్తిలో స్థిరపడొచ్చు.
 
 అర్హతలు: భారత్‌లో రియల్ ఎస్టేట్‌పై గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు దూర విద్య, ఆన్‌లైన్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు.
 
 వేతనాలు: రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభిస్తే ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. నెలకు రూ.లక్షకు పైగానే ఆర్జించే కన్సల్టెంట్లు ఉన్నారు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు

 ఏ ఆర్‌ఐసీఎస్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్-అమిటీ యూనివర్సిటీ; వెబ్‌సైట్: www.ricssbe.org
 ఏ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్
 వెబ్‌సైట్: www.iire.co.in
 ఏ ఎన్‌ఐఆర్‌ఈఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్
 వెబ్‌సైట్: www.nirem.org
 ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ; వెబ్‌సైట్: ఠీఠీఠీ.జీటఛ.్ఛఛీఠ
 ఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్
 వెబ్‌సైట్: http://iref.co.in/
 
 మంచి భవిష్యత్తు ఉన్న కెరీర్
 శ్రీముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీని యువత తమ కెరీర్‌గా ఎంపిక చేసుకుంటోంది. కన్సల్టెంట్లపై భరోసాతో రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. గ్రాడ్యుయేషన్‌తోపాటు మార్కెటింగ్‌పై అనుభవం ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్థిరాస్తి రంగంలో భవిష్యత్తులో యువతకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. మార్కెట్‌ను అంచనా వేయగల సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ సొసైటీలో మారుతున్న ట్రెండ్స్, ప్రజల అభిరుచిని గమనించగల నైపుణ్యాలు ఉంటే కన్సల్టెంట్‌గా రాణించొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకుపైగా వేతనం, ఒక్కో ప్రాజెక్ట్‌లో 2-3 శాతం చొప్పున కమీషన్ పొందొచ్చ్ణు
 -ఇంద్రసేనారెడ్డి,
 ఎండీ, గిరిధారి హోమ్స్

 
 ఎడ్యూ న్యూస్:
  ‘ఐడియా’ ఇవ్వండి... రూ.లక్షలు గెలుచుకోండి!

 మీరు మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటున్నారా? ఉత్పత్తులు మొదలుకొని సర్వీసుల వరకూ...వ్యాపారంలోని ఏ విభాగంలోనైనా రాణించగలిగే సత్తా మీకుందని భావిస్తున్నారా? అయితే మీ లాంటి వారికోసమే ఐఐటీ-ఖరగ్‌పూర్ ఏటా ‘ఎంప్రిసేరియో’(Empresario) పేరుతో ఎందరో ఔత్సాహికులను వెలుగులోకి తెస్తోంది. మంచి వ్యాపార ఆలోచన(బిజినెస్ ఐడియా)ను ఇచ్చి, సుమారు రూ. 15 లక్షలకు పైగా విలువైన బహుమతులను గెలుచుకొనే సువర్ణావకాశం కూడా కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మోడల్ కాంపిటీషన్(ఐబీఎంసీ) సహకారంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ ‘ఎంప్రిసేరియో’ను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనాలనుకునేవారు తమ వద్దనున్న ఐడియాతో  http://www.ecell-iitkgp.org/empresario/వెబ్‌సైట్‌లో అక్టోబర్ 20లోగా నమోదు చేసుకోవాలి. కార్యక్రమానికి ఎంపికైనవారికి  మెంటార్‌షిప్ లభిస్తుంది. విజేతలు నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్‌వర్క్ లాంటి ప్రముఖ సంస్థల ఎదుట ‘ఐడియా’ను వివరించే అవకాశం ఉంటుంది.  
 
 ఐఐటీ-బాంబేలో ‘ఇ-యంత్ర’

 ఐఐటీ-బాంబే ప్రాజెక్ట్ ఇ-యంత్ర పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్‌లో ప్రతిభావంతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 1, 2014న ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 800 టీమ్‌లు (3200 వందల మంది విద్యార్థులు) నమోదు చేసుకున్నాయి. ఆన్‌లైన్ టెస్టు ద్వారా ఎంపికైన ఒక్కో టీమ్‌కు సమస్యతో కూడిన  థీమ్‌ను ఇస్తారు. రోబోటిక్ కిట్‌ను కూడా ఉచితంగా అందజేస్తారు. దీని సహాయంతో కేటాయించిన థీమ్‌ను పూర్తి చేయాలి. ఇందుకోసం ఔత్సాహికులు ఎలాంటి ఫిజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘ఇ-యంత్ర’ ప్రాజెక్టులో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: http://portal.e-yantra.org/eyrc
 
 ‘నాక్’లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా
 తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(నాక్)లో రెగ్యులర్ పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్  కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనే జ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాతపరీక్ష, ఇంటర్య్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బీఈ/బీటెక్ -సివిల్, మెకానికల్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. సెప్టెంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న ఉదయం రాతపరీక్ష, సాయంత్రం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000, ట్యూషన్ ఫీజు రూ.లక్ష(సర్వీస్ ట్యాక్స్ అదనం).
 వెబ్‌సైట్: www.nac.edu.in
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 కేంద్రీయ విద్యాలయ సంఘటన్
 కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ఆఫీసర్స్ క్యాడర్, నాన్ టీచింగ్  తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టుల వివరాలు:
 ఊ ప్రిన్సిపాల్ ; ఊ టెక్నికల్ ఆఫీసర్ ; ఊ అసిస్టెంట్ ; ఊ అప్పర్ డివిజనల్ క్లర్క్
 ఊ లోయర్ డివిజనల్ క్లర్క్ ; ఊ హిందీ ట్రాన్స్‌లేటర్ ; ఊ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 2
 అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15
 వెబ్‌సైట్: www.kvsangathan.nic.in
 
 కోల్ ఇండియాలో మేనేజ్‌మెంట్ ట్రైనీస్
 కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  మేనేజ్‌మెంట్ ట్రైనీస్
 విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్
 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణత.
 ఎంపిక: గేట్ - 2015 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా
 గేట్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1, 2014 నుంచి  అక్టోబరు 1, 2014
 దరఖాస్తు: గేట్ - 2015 స్కోరు వచ్చిన తర్వాత www.coalindia.in
 వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
 గేట్ వెబ్‌సైట్: http://gate.iitk.ac.in/
 
 ఎస్‌బీఐ అసోసియేట్స్ బ్యాంకుల్లో  2986 పీవోలు
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అసోసియేట్స్ బ్యాంక్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  ప్రొబేషనరీ ఆఫీసర్; పోస్టుల సంఖ్య: 2986
 బ్యాంకుల వారీగా పోస్టులు:
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 350,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 900, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 500, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 100, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ 1136
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1 నుంచి 18 వరకు
 వెబ్‌సైట్: www.sbi.co.in
 
 పీజీ డిప్లొమా
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
 కోర్సుల వివరాలు:
 ఏ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్
 ఏ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్
 అర్హత: బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి; దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
 చివరి తేది: సెప్టెంబర్ 10; వెబ్‌సైట్: http://calicut.nielit.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement