communication skills
-
బీటెక్ జోరు.. ఎంటెక్ బేజారు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీటెక్‌కు ఆదరణ పెరుగుతుంటే, మరోవైపు ఎంటెక్‌లో మాత్రం ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సత్వర ఉపాధి, వీలైతే అమెరికా లాంటి దేశాల్లో ఎమ్మెస్ లక్ష్యంతో బీటెక్‌లో చేరుతున్న విద్యార్థులు.. పై చదువు విషయంలో నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ధోరణితో పాటు, పలు మాస్టర్ డిగ్రీ కాలేజీల్లో అవసరమైన మౌలిక వసతులు, సరైన బోధన సిబ్బంది ఉండక పోవడం కూడా ఇందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేయాలన్నా ఎంటెక్‌తో పనిలేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థుల్లో అదనంగా ఉండే నైపుణ్యం కూడా అంతగా ఏమీ ఉండదని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక విద్యలో గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఉపాధి వైపు మళ్లిపోతున్నారు. అనేకమంది ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్ చేసిన వారిలో కనీసం 10 శాతం కూడా ఎంటెక్ వైపు వెళ్లడం లేదని ఏఐసీటీఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏదీ కుదరని పక్షంలో ఎంటెక్‌లో చేరే విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తగ్గిన సీట్లు.. ప్రవేశాలుఅఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎంటెక్ ప్రవేశాలపై ఇటీవల పూర్తిస్థాయి సమాచారం వెల్లడించింది. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఏడేళ్ల కనిష్టానికి పతనమైనట్టు పేర్కొంది. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఎంటెక్ కోర్సుల్లో 68,677 మంది చేరితే, గత మూడు విద్యా సంవత్సరాల్లోనూ ఈ సంఖ్య దాదాపుగా 45 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు అందుబాటులో ఉన్న ఎంటెక్ సీట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2017–18లో దేశవ్యాప్తంగా 1.85 లక్షల సీట్లు ఉంటే, 2024–25 నాటికి 1.24 లక్షలకు తగ్గాయి. ఇక రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో 12,892 మంది ఎంటెక్‌లో చేరితే 2023–24 నాటికి ఆ సంఖ్య ఏకంగా 5,271కి దిగజారిపోవడం గమనార్హం.బీటెక్‌లో భిన్న పరిస్థితి బీటెక్ విషయంలో దేశవ్యాప్తంగా ఎంటెక్కు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. 2017–18లో 14.75 లక్షల సీట్లుంటే, 7.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. 2023–24లో సీట్ల సంఖ్య 13.49 లక్షలకు తగ్గినా..విద్యార్థుల చేరిక మాత్రం గణనీయంగా పెరిగి 11.21 లక్షలకు చేరింది. దాదాపు 58% విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సత్వర ఉపాధి, విదేశాల్లో ఎమ్మెస్ తదితర కారణాలతోనే బీటెక్‌లో ప్రవేశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఎంటెక్తోనూ మంచి భవిష్యత్తు వాస్తవానికి ఎంటెక్‌లో కొన్ని బ్రాంచీలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, సంబంధిత కొత్త బ్రాంచీల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధించే అర్హత లభిస్తుంది. బీటెక్‌లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్న విషయం విదితమే కాగా అందుకు అనుగుణంగా అధ్యాపకుల అవసరం కూడా ఏర్పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 1.35 లక్షల బీటెక్ సీట్లున్నాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ, సంబంధిత సీట్లే 68 వేల వరకు ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధిత పాఠ్యాంశాలను బోధించే అధ్యాపకులకు డిమాండ్ పెరుగుతోంది. ఎంటెక్ సీఎస్ఈ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ లాంటి స్పెషలైజేషన్ ఉంటే మంచి వేతనాలు లభించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐసీటీఈ లెక్కల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అవసరం. దీన్నిబట్టి కీలకమైన బ్రాంచీలను పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణలోని 68 వేల సీట్లకు గాను 3,400 మంది అధ్యాపకుల అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు.అదనంగా వచ్చేదేమీ ఉండటం లేదు సీఎస్సీ బీటెక్ తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఐటీ రంగంలో చేరిన తర్వాత స్వతహాగా పరిజ్ఞానం ఉంటేనే పురోగతి సాధ్యం. ఒకవేళ రెండేళ్ల పాటు ఎంటెక్ చేసి వచ్చినా ప్యాకేజీలో పెద్దగా మార్పు ఉండదు. బీటెక్ ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనమే అప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంటెక్ వల్ల ప్రయోజనం ఏమిటి? – నీలేశ్ పుల్లెల ఐటీ ఉద్యోగిఅర్హత కాదు.. నైపుణ్యమే ముఖ్యంఐటీ రంగంలో ఉన్నతమైన అర్హత కన్నా అభ్యర్థి నైపుణ్యానికి పెద్దపీట ఉంటుంది. బీటెక్ తర్వాత పలు రౌండ్ల ఇంటర్వ్యూల్లో కంపెనీలు విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తాయి. నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలిస్తాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది బీటెక్ తర్వాత ఐటీ రంగంలోకి వస్తున్నారు. – రాహుల్ సౌరభ్ ఐటీ కంపెనీ హెచ్ఆర్ విభాగం ఉద్యోగి -
Rameshwar Goud: గురుబోధకుడు
తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్‌లో మెరికలు కావాలంటే... వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్ టీచర్. ‘మంచి ఇంగ్లిష్ రావాలంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్ గౌడ్. ‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్ గౌడ్ టీచర్స్ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ. శ్రద్ధగా నటించాను! రామేశ్వర్ గౌడ్ సొంతూరు షాద్‌నగర్ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండేవి. ఐల్ట్స్ (ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను. లెక్చరర్లు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్‌పోర్టును డ్రాప్ బాక్స్‌లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్ సర్ సురేందర్ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు. ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్స్టిట్యూట్ ‘విల్ టూ కెన్, ద స్ట్రైడ్’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్‌స్టిట్యూట్‌ని అమీర్‌పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను. వాళ్లకు ఇంగ్లిష్ వచ్చు... కానీ! నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్‌లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే. ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ‘రియల్ లైఫ్ ఇంగ్లిష్, స్పోకెన్ ఇంగ్లిష్’ అని రెండు పుస్తకాలు రాశాను. గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు! ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్‌కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్ గౌడ్. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి. మా వాళ్లది ధర్మాగ్రహమే! ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్లు, డిఫెన్స్ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం... అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు. నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్ ‘వీడు లైఫ్‌ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్‌గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. – ఎ. రామేశ్వర్ గౌడ్, ఫౌండర్, విల్ టూ కెన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఓయూలో 14 నుంచి సెల్ట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం పీహెచ్డీ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్డీ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్డీ కోర్సుల పార్టువన్ (కోర్సు వర్క్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఓయూ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. -
కథలకు ఓ బ్యాంకు.. ‘కథా పచ్చీస్– స్టోరీ బ్యాంక్’
మనుషుల్ని ఆకట్టుకోవాలంటే వారికో కథ చెప్పు అంటుంది మోనికా టాండన్. ఢిల్లీలో ఆమె ఒక బ్యాంకు తెరిచింది. దాని పేరు ‘కథా పచ్చీస్– స్టోరీ బ్యాంక్’. ఆ బ్యాంకులో కథలు ఉంటాయి. తల్లిదండ్రులు, టీచర్లు, ఎంట్రప్రెన్యూర్లు, నాయకులు... అందరూ సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకోవాలంటే వారికి కథలు చెప్పడం రావాలి అంటుంది మోనికా. కథలు చెప్తూ పోతే విజయం దానంతట అదే వస్తుందని ఆమె సూత్రం. తనను తాను ‘కార్పొరేట్ స్టోరీ టెల్లర్’ అని చెప్పుకుంటుంది. ఊళ్లో అవ్వలు కథలు చెప్తారు. ఎవరూ డబ్బు ఇవ్వరు. మోనికా అలా కాదు. కథలతో కరెన్సీ సంపాదించవచ్చని నిరూపిస్తోంది. ఒక సంస్థలోని ఉద్యోగులతో మోనికా టాండన్ ‘స్టోరీ టెల్లింగ్’ సెషన్ పెట్టి ఈ కథ చెబుతుంది. ‘ఇది ఒక పీత కథ. దానిని హెర్మిట్ పీత అంటారు. హెర్మిట్ జాతి పీతలు తమ సైజు పెరిగే కొద్దీ ఒక పని చేస్తాయి. ఏమిటో తెలుసా? తమను కప్పి ఉన్న పెంకును వదిలి కొత్త పెంకును వెతుక్కుంటాయి. అవి పాత పెంకును నాశనం చేయవు. అలాగే పాత పెంకే నాకు కావాలి అనుకోవు. దానిని మరొక పీత కోసం వదిలిపెట్టి తమ సైజుకు తగ్గ కొత్త పెంకులోకి మారి తమని తాము కాపాడుకుంటాయి. మళ్లీ సైజు పెరిగాయనుకో. మరో కొత్త పెంకును వెతుక్కుని వెళ్లిపోతాయి. ఇలా హెర్మిట్ జాతి పీతలు జీవితాంతం చేస్తూనే ఉంటాయి. ఆలోచించండి. మనం అలా చేస్తున్నామా? ఒక పెంకును వదిలి దానితో డిటాచ్మెంట్ పాటిస్తూ కొత్త పెంకులోకి వెళుతున్నామా? ఇవాళ కోవిడ్ రోజులు. ఉద్యోగంలో మార్పు ముఖ్యం. మారాల్సి వస్తే ధైర్యంగా మారాలి. కాదు... సేఫ్ జోన్లో ఉండిపోదామని అనుకుంటే ఎదుగుతామా? ఒక పీతకే అంత ధైర్యం ఉంటే మనిషికి ఎంత ధైర్యం ఉండాలి. మారడానికి సిద్ధంగా ఉండండి. కొత్తది వెతకండి. కొత్తది చేయడమే ఎదుగుదల’... ఈ కథ చెప్పాక ఉద్యోగులలో ఒక ధైర్యం వచ్చే అవకాశం ఉంది. ‘పరిస్థితిని బట్టి మీ కుటుంబ సభ్యులను, ఆఫీస్ బాస్‌ను, కలీగ్స్‌ను ఒప్పించడానికి సరైన కథ చెప్పండి. లేదా మీకు మీరే ఒక కథ చెప్పుకుని సందర్భాలకు సిద్ధం కండి’ అంటుంది మోనికా టాండన్. ఢిల్లీ సమీపంలో ఉన్న గుర్గావ్లో ఆమె సంస్థ ఉంది. దాని పేరు ‘కథా పచ్చీస్’. అది ఒక స్టోరీ బ్యాంక్. జీవితంలో సరైన పదాలతో సరైన కమ్యూనికేషన్ చేస్తే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చని ఈ సంస్థ నమ్ముతుంది. టీచర్లు, బిజినెస్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, యువ నాయకులు, తల్లిదండ్రులు.. అందరూ సరిగ్గా ఒక కథ చెప్పడం నేర్చుకుంటే సరిగ్గా తాము చెప్పాలనుకున్నది ఎదుటివారికి చెప్పగలరని అంటుంది మోనికా టాండన్. హెచ్ఆర్ రంగంలో 15 ఏళ్ల పాటు పని చేసిన టాండన్ ఆ ఉద్యోగంలో ఎక్సయిట్ చేసేది ఏమీ లేదని అర్థమయ్యి ఆ ‘పాత పెంకును’ వదిలి స్టోరీటెల్లర్‌గా కొత్త పెంకులోకి వచ్చింది. ‘కథ చెప్పడం ఆదిమ కళ. ఒక కథ చెప్పనా అనగానే ఎదుటి మనిషి ఎలాంటివాడైనా ఊ కొట్టడానికి రెడీ అయిపోతాడు. గొప్ప గొప్ప నాయకులు ప్రజలకు తమ ప్రసంగాల్లో కథలూ కాకరకాయలు చెబుతారు. కార్పొరేట్ అధిపతులు తమ ఉద్యోగులను మోటివేట్ చేయడానికి కథలు చెబుతారు. బో«ధకులు కూడా విద్యార్థులను ఆకర్షించడానికి కథలు చెబుతారు. అంతెందుకు? రాత్రిపూట రకరకాల కథలు చెప్పే తల్లిదండ్రులను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. కథను ఎలా వదలుకుంటాం. ఇది సావధాన కొరత ఉన్న ప్రపంచం. అంటే మనం చెప్పేదానికి ఎవరూ అటెన్షన్ ఇవ్వడం లేదు. ఏ ఫోన్లోనో తల దూర్చి ఉంటారు. వారిని దారిలోకి తెచ్చుకోవాలంటే కథ చెప్పడమే మార్గం’ అంటుంది మోనికా టాండన్. సేల్స్‌లో లక్ష్యాలు ఉన్న ఉద్యోగులు ఆ లక్ష్యాలు సాధించగలమా లేదా అనుకుంటూ ఉంటే మోనికా వారికి దశరథ్ మాంజీ కథ చెబుతుంది. ‘బిహార్‌లోని గయాలో కొండను పిండి కొట్టి ఆ నిరుపేద గ్రామీణుడు దారి వేశాడు. 22 ఏళ్ల పాటు ఉత్త చేతులతో అతడా పని చేశాడు. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు... ఈ కథను పదే పదే తలుచుకుంటే’ అంటుందామె. ‘ఒక కాలు కోల్పోయిన అరుణిమ సిన్హా నిరాశలో కూరుకుపోలేదు. ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కింది. ఎవరెస్ట్ ఎక్కిన తొలి దివ్యాంగ మహిళగా రికార్డు స్థాపించింది. మనకు ఆమె స్ఫూర్తి’ అంటుంది. చిన్నప్పుడు అవ్వ చెప్పే కథల్లో ‘ఏ దిక్కైనా వెళ్లు... ఉత్తరం దిక్కు తప్ప’ అని పూటకూళ్లామె అంటే రాకుమారుడు ఉత్తరం దిక్కుకే వెళతాడు. ఆ దారిలో ప్రమాదాలు ఉన్నా వాటిని దాటి ఊహించని లాభాలు పొందుతాడు. ఇంట్లో పిల్లలు అలా కథలతో ధైర్యం తెచ్చుకునేవారు. కథలతో, ఘటనలతో నూరి పోసే విషయాలు జ్ఞాపకం ఉంటాయి అంటుంది టాండన్. అందుకే కథల బ్యాంకు తెరిచి ప్రతి కథను విలువైన మణిగా ఆమె భావిస్తుంది. తల్లి చెప్పిన కథలు విని శివాజీ వీరుడయ్యాడు. జీవితంలో కష్టాలపై విజయం సాధించే వీరులం కావాలంటే... ఉపాధిలో సవాళ్లను ఎదిరించే వీరులం కావాలంటే కథ డాలుగా... ఖడ్గంగా ఉపయోగపడుతుంది. ఫోన్ పక్కన పెట్టండి. ఏదైనా కథ వినండి. -
మలుపులే జీవితం
ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు అవకాశం వచ్చింది. అదే సమయంలో బీఎడ్‌లో సీటు పరీక్ష పెట్టింది. పాఠాలు చెప్పడంలో ఉన్న ఇష్టం.. పర్వతారోహణను పక్కన పెట్టించింది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్‌గా ఆమె దిశ మారింది. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పెళ్లితో ఆడవాళ్లకు కెరీర్ ఆగిపోకూడదని, భర్త బదిలీలతో పాటుగా కెరీర్‌ను మలుచుకోవాలన్నారామె. ఆ మలుపులే తనను మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా మార్చాయన్నారు. తను సమాజానికి ఎలా ఉపయోగపడాలని భగవంతుడు నిర్ణయించి ఉంటే... తన పయనం ఆ దిశగా సాగుతుందని నమ్ముతున్నారు రేఖారావు. బచేంద్రిపాల్ నేర్పించిన జీవిత జ్ఞానమే తనకు ఇప్పటికీ మార్గదర్శనం చేస్తోందని చెప్తున్నారు రేఖారావు. రేఖారావుది హైదరాబాద్, కూకట్పల్లి. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడం తో బాల్యం, చదువు జమ్షెడ్పూర్ లో సాగాయి. బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నది కూడా జమ్‌షెడ్‌పూర్‌లోనే. జేఆర్‌డి టాటా కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’లో శిక్షణ తరగతులు నిర్వహించేవారు బచేంద్రిపాల్. టీనేజ్‌లో మెదడు మైనపుముద్దలా ఉంటుంది. అప్పుడు పడిన ముద్ర జీవితాన్ని నడిపిస్తుంది. బచేంద్రిపాల్ దగ్గర నేర్చుకున్నది పర్వతారోహణ మాత్రమే కాదు, సామాజిక జీవి అయిన మనిషి ఇతరులతో ఎంత స్నేహపూర్వకంగా మెలగాలనే జ్ఞానాన్ని కూడా. ఆ శిక్షణతోపాటు ఆర్మీ నేపథ్యం కూడా తన మానసిక వికాసంలో కీలకమేనంటారు రేఖ. ‘‘పర్వతారోహణ శిక్షణలో ఉన్నప్పుడు నాకు భారతీయత అర్థమైంది. మేము గురువు పాదాలకు నమస్కారం చేస్తాం. సాహసమే జీవితంగా భావిస్తాం. ఆడపిల్లలకు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకనే మాట వినిపించేది కాదు. దేహం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మానసికంగా ఆలోచనలు కూడా ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటాయని చెప్పి ప్రోత్సహించేవారు. సాహసోపేతమైన క్రీడలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోగలిగిన మంచి లక్షణం కూడా అబ్బుతుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు ఏవీ బాధించనంత గా పరిణతి వచ్చేస్తుంది. అలాగని వైరాగ్య జీవనమూ కాదు. జీవితం విలువ తెలుస్తుంది. బతికున్న ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడపడం అలవడుతుంది. అందుకే పిల్లలకు ఆటలు లేని విద్యాభ్యాసాన్ని అంగీకరించలేను. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర టీచర్ దే. ప్రభుత్వ పాఠశాలను దత్తత ఇస్తే అద్భుతాలు చేయవచ్చని కూడా అనిపిస్తుంటుంది. నన్ను ఆహ్వానించిన స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఇస్తున్నాను’’ అని చెప్పారు రేఖ. ఉత్తర శిఖరం.. దక్షిణాపథం కశ్మీర్‌లోని లేహ్, లధాక్, శ్రీనగర్, అమృత్సర్ నుంచి చంఢీఘర్, భటిండా, అస్సాం, నాసిక్, బెంగుళూరు కన్యాకుమారి వరకు అనేక ప్రదేశాల్లో నివసించాను. మనదేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యతతోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని దగ్గరగా చూడగలిగాను. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేయగలగడానికి అప్పటి సామాజిక అధ్యయనం చాలా దోహదం చేసింది. ప్రాంతం, భాష ఏదైనా సరే... ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఒకటే. మంచి పరిపాలన. ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న ఫలాల పట్ల నిశితమైన గమనింపు ఉంటుంది. చదువు రాని వాళ్లలో రాజకీయ చైతన్యం ఉండదని మేధావులు భావిస్తుంటారు. కానీ తమ ప్రయోజనాల గురించిన చైతన్యాన్ని కలిగి ఉంటారు. కరెంటు, టీవీ, రేడియో లేని కుగ్రామాలు మినహా మిగిలిన అన్ని చోట్ల తమకు అవసరమైన మేరకు తెలుసుకుంటూనే ఉంటారు. కాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం మాత్రం తీవ్రంగా ఉంది. గ్రామాలనే కాదు, మహానగరాల్లోని బస్తీల్లో కూడా సమతులాహారం తినడం తెలియదు. ఎక్కువమంది ఒబేసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. బస్తీల్లో ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను. కరోనా సమయంలో ఇంటికి పరిమితం కాకుండా ఎక్కడ సహాయం అవసరమైతే రాచకొండ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తూ ఒక వారధి గా పని చేశాను. బస్తీల్లో పదోతరగతి ఫెయిలయ్యి చదువు మానేసిన పిల్లలు ఎక్కువగా కనిపిస్తారు. ఆ పిల్లలు అసాంఘిక శక్తులుగా పరిణమించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత చదువుకున్న మనందరి మీదా ఉంది. చదువు మీద ఆసక్తి లేకపోతే బలవంతం వద్దు, నీకు ఏ పని చేయడం ఇష్టమో చెప్పు, నేర్పిస్తానని అడిగితే పిల్లలు చక్కగా ఓపెన్ అవుతారు. టైలర్ కావాలని ఉంటే అదే పని చేయాలి. వంట చేయడం ఇష్టమైతే అదే చేయాలి. ఏది చేసినా అందులో నువ్వే బెస్ట్ అనిపించుకునేటట్లు నైపుణ్యాన్ని సాధించాలి... అని చెప్పినప్పుడు పిల్లలతోపాటు ఆ తల్లిదండ్రులు కూడా ఒక దారి కనిపించినట్లు సంతోషపడతారు. ఇలా భగవంతుడు నాకిచ్చిన నైపుణ్యం ద్వారా పదిమందికి ఉపయోగపడుతున్నాను’’ అన్నారు రేఖారావు. పర్వతారోహణ శిక్షణ అనంతరం బచేంద్రీపాల్ నుంచి సర్టిఫికేట్ అందుకుంటున్న రేఖ మైక్ పట్టుకుని కామెంటరీ ఇవ్వడం అంటే నాకు చెప్పలేనంత. ఎంతగా అంటే... పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్లో కామెంటరీ అవకాశం కోసం ఐదేళ్ల పాటు ప్రయత్నించి సఫలమయ్యాను. అలాగే హైకోర్టు వందేళ్ల వేడుకల్లోనూ కామెంటరీ ఇవ్వగలిగాను. ‘నాట్ పాజిబుల్’ అన్నవాళ్లే ఇప్పుడు ‘పలానా రోజు ప్రోగ్రామ్. కామెంటరీ ఇవ్వడానికి మీకు వీలవుతుందా’ అని అడిగినప్పుడు ఎవరెస్టును అధిరోహించినంతగా సంతోషపడ్డాను. అలాగే 150 దేశాల ప్రతినిధులు హాజరైన సభలో అన్నా హజారే, బబితా పోగట్ల ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో అనువదించడం కూడా నన్ను నేను గర్వంగా తలుచుకోగలిగిన క్షణాలు. – రేఖారావు స్కిల్ ట్రైనర్ – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
ఉద్యోగాలూ.. ‘సోషల్’ ఎఫెక్ట్‌తోనే!
సాక్షి, అమరావతి : ‘వాట్ ఈజ్ హీ?’ ప్రాజెక్ట్ మేనేజర్ అడిగేలోపే బ్యాక్‌గ్రౌండ్ టీం లీడర్ సోషల్ మీడియాలో సేకరించిన సమాచారం మొత్తం ఆయన ముందుంచాడు. ‘ఫేస్బుక్ ప్రొఫైల్... గుడ్. పోస్టింగ్స్... ఇంట్రస్టింగ్. లింక్డ్ ఫ్రెండ్స్.. ఓకే. ట్విట్టర్ రెస్పాన్సింగ్ రేట్.. ఎక్సలెంట్. సోషల్ మీడియా ఇంట్రాక్షన్..యావరేజ్. సో! కమ్యూనికేషన్ స్కిల్స్ మైనస్ పాయింట్ అన్న మాట’ అభ్యర్థిని ఎంపిక చెయ్యాలా? వద్దా? అనే విషయంలో ప్రాజెక్ట్ మేనేజర్ ఓ నిర్ధారణకొచ్చాడు.. ఇదీ..ప్రస్తుతం పేరున్న కంపెనీలన్నీ తమ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేసే సమయంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అవలంబిస్తున్న విధానం. నిత్య జీవితంలో సోషల్ మీడియా భాగమైపోయిన ప్రస్తుత తరుణంలో.. స్నేహితుల అకౌంట్‌ను యాడ్ చేసేప్పుడు, పోస్టింగ్స్, ఫొటోలు అప్లోడ్ చేసేప్పుడు ఇతర విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మౌస్క్లిక్లోనే అంతా.. స్నేహితులు, సన్నిహితులను పలకరించడానికే కాదు..ఉద్యోగ నియామకాల్లోనూ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, గూగుల్ ప్లస్ వంటి నెట్వర్కింగ్ సైట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పేరున్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలూ ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. రెజ్యూమ్ అందగానే ముందుగా ఫీడ్‌బ్యాక్ చూస్తున్నాయి. ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ టీంలకు రెజ్యూమ్‌ను ఫార్వర్డ్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థి నడవడికను బ్యాక్‌గ్రౌండ్ టీం క్షుణ్ణంగా పరిశీలించి సంస్థకు స్పష్టమైన నివేదిక ఇస్తోంది. ఇక్కడొచ్చే మార్కులే అభ్యర్థి భవిష్యత్‌ను నిర్ణయిస్తున్నాయి. పోస్టింగ్స్... ఫాలోఅప్స్ కీలకం.. సోషల్ మీడియా సర్వేల ప్రకారం గడచిన ఐదేళ్లుగా 65 శాతం ప్రైవేటు కంపెనీల నియామకాలన్నీ సామాజిక మాధ్యమం ఆధారంగా జరుగుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ టీంలో సంస్థ సిబ్బందితో ఏమాత్రం సంబంధం లేని వారే ఉంటున్నారు. వీరు ఏదో రకంగా సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతారు. సెర్చ్ ఇంజిన్లోకెళ్లి ఈ–మెయిల్ సాయంతో వివరాలన్నీ తీసుకుంటారు. ♦ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే చిత్రాలను బట్టి వ్యక్తి అభిరుచి అంచనా వేయడం సాధ్యమని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన బ్యాక్ గ్రౌండ్ టీంలో పనిచేస్తున్న నితీష్ తెలిపారు. ఆ వ్యక్తి ప్రొఫైల్‌ను చూస్తే భావాలను అంచనా వేసే వీలుందని, లైక్ చేసే ఫొటోలను పరిశీలిస్తే స్వభావాన్ని గుర్తించవచ్చని వివరించాడు. వ్యక్తిత్వాన్ని అంచనా వేసేది ఇలానే... ♦ టెక్ట్స్ మెసేజ్‌లను కొన్నింటిని పరిశీలిస్తారు. ట్విట్టర్లో ఆయన స్పందించే తీరును బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు. వ్యతిరేక అభిప్రాయం వెలిబుచ్చేప్పుడు కూడా సున్నితంగా స్పందించే తత్వానికి సంస్థలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని సోషల్ డిటెక్టివ్ సంస్థలో పనిచేస్తున్న కొండూరి ఆదిత్య తెలిపాడు. ♦ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఎలాంటి వాళ్లున్నారు? అనేది అతని సామాజిక స్టేటస్‌ను తెలుపుతుందని, అకౌంట్‌కు యాడయ్యే వాళ్లతో జరిగే సంభాషణలు అభ్యర్థి నడవడికను నిర్ధారిస్తుందని సాఫ్ట్వేర్ డెవలపర్ దత్తప్రసాద్ తెలిపారు. ♦ వ్యక్తిలోని నాయకత్వ లక్షణాలను పరిశీలించేందుకు సోషల్ మీడియాలో ఫాలోఅప్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ♦ అభ్యర్థిలోని భాషా పరిజ్ఞానం, ఇంగ్లిష్‌పై పట్టును సామాజిక మాధ్యమాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఆంగ్లంలో వచ్చే కామెంట్స్, పోస్టింగ్‌లను అతను ఎలా అర్థం చేసుకుంటాడు. దానికి ఆంగ్లభాషలో ఎలా స్పందిస్తాడనేది నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంటుందని బ్యాక్‌గ్రౌండ్ టీంలో అనలైజర్‌గా పనిచేస్తున్న శ్రీవాణి తెలిపింది. బీ కేర్‌ఫుల్...! సోషల్ మీడియాలో స్నేహితుల అకౌంట్‌ను యాడ్ చేసేప్పుడు, పోస్టింగ్స్, ఫొటోలు అప్లోడ్ చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేకాదు.. రెస్యూమ్‌లో అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తప్పుగా ఉన్నా... సోషల్ మీడియా సెర్చ్‌లో ఇట్టే దొరికిపోతారు. కాబట్టి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి –కె. కిరణ్‌కుమార్, ఐబీఎం ఉద్యోగి, అమెరికా అప్డేట్ అవుతుండాల్సిందే ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు ప్రధానంగా అభ్యర్థి వేగాన్ని పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వాళ్లకే ఇది సాధ్యం. భావ వ్యక్తీకరణ, సామాజిక అంశాలపై తరచూ స్పందించే అలవాటు ఉండాలి. అంతేకాకుండా, ఎంచుకున్న రంగానికి సంబంధించిన పోస్టింగ్స్ కూడా కెరీర్లో అతనికున్న ఆసక్తిని చూపిస్తాయి. కాబట్టి సబ్జెక్ట్ పరంగానూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. – దీప, సాఫ్ట్వేర్ ఉద్యోగి -
రీ ‘ఇంజనీరింగ్’!
- ఇంజనీరింగ్ కోర్సుల కరిక్యులమ్‌లో సమూల మార్పులు... - అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయం - మోడల్ కరిక్యులమ్ సిద్ధం చేస్తున్న ఏఐసీటీఈ - ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం.. విద్యార్థులపై తగ్గనున్న ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) నిర్ణయించింది. ఇందులో భాగంగా మోడల్ కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేయనుంది. ప్రాజెక్టు కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా సిలబస్‌లో సమూల మార్పులు తీసుకురాబోతోంది. థియరీ విభాగాన్ని తగ్గించి ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులపైనా ఒత్తిడిని తగ్గించవచ్చని యోచిస్తోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 15 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం 40 శాతానికి మించడం లేదు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్టు పరమైన జ్ఞానం పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణంగా ఏఐసీటీఈ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త సిలబస్‌ను తీసుకువచ్చేందకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇండక్షన్ ట్రైనింగ్‌ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులను పక్కాగా అమలు చేసేందుకు ఏఐసీటీఈ కసరత్తు చేస్తోంది. థియరీ పరీక్షల్లోనూ క్రెడిట్స్‌ను (మార్కులకు పాయింట్లు) తగ్గించి, ప్రాజెక్టులకే క్రెడిట్స్‌ను పెంచేలా కొత్త కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ట్రైనింగ్ ఓరియెంటెడ్‌గా, డిజైన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ మేరకు సమగ్ర వివరాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏఐసీటీఈ ఏర్పాట్లు చేస్తోంది. విశ్లేషణ సామర్థ్యాలు పెంపు, ల్యాబ్‌లలో శిక్షణ, ప్రాక్టికల్స్, డిజైన్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రధానంగా కొత్త కరిక్యులమ్‌ను ప్రస్తుతం వివిధ సబ్జెక్టుల్లో 12 కమిటీలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రాలకు 20% వెసులుబాటు జాతీయ స్థాయిలో ఒకేలా సిలబస్ ఉండేలా ఏఐసీటీఈ చర్యలు చేపట్టినా, రాష్ట్రాలకు 20 శాతం వెసులుబాటు కల్పించేందుకు ఆలోచనలు చేస్తోంది. రాష్ట్రాల్లో పరిస్థితులు, స్థానిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేసుకునే వీలు కల్పించేలా చర్యలు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చర్‌కు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యం ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇంకొన్ని రాష్ట్రాల్లో టెక్స్టైల్ టెక్నాలజీకి ప్రా«ధాన్యం ఉంది. ఆయా రాష్ట్రాలు ఆయా రంగాలకు సంబంధించిన సిలబస్‌లో 20 శాతం వరకు మార్పులు చేసుకునే వీలు కల్పించాలని నిర్ణయించింది. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ!
స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై తరగతులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అఖిల భారత సాంకే తిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పారిశ్రామికావసరాలకు అనుగుణంగా శిక్షణ, అధ్యాపకులకు సాంకే తిక పరిజ్ఞానంపై శిక్షణ తరగతులను నిర్వ హించేందుకు చర్యలు ప్రారంభిం చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పలు సంస్కర ణలను అమలు చేయాలని నిర్ణయించిన ఏఐసీటీఈ.. కొత్తగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు తరగతుల కంటే ముందుగా స్పోకెన్ ఇంగ్లిషు, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇంజనీరింగ్ మౌలిక అం శాలపై నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ ఐఐటీ, బెనారస్ హిందూ వర్సిటీ– ఐఐటీలో విజయవంతమైన ఈ శిక్షణ కార్య క్రమాన్ని ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీ టీఈ చైర్మన్ అనీల్ డి. సహస్రబుద్ధే ఇటీవల వెల్లడించారు. మొదట 500 కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో తప్పనిసరి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్న విద్యా ర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి నైపు ణ్యాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగు ణంగా సిద్ధంగా లేకపోవడంతో ఉపాధి లభించక నిరుద్యోగులుగా మిగిలిపోతు న్నారు. ఈ నేపథ్యంలో వారికి 8 వారాల పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇంజనీరింగ్ మూడు, నాలుగో సంవత్సరాల్లో శిక్షణను అమలు చేయనుంది. అలాగే సబ్జెక్టు వారీగా ఇండస్ట్రీ కన్సల్టేషన్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని వర్సిటీలకు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని వర్సిటీలు ఫస్టియర్‌లో డిటెన్షన్ అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. -
ఉజ్వల భవితకు..భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు..
మానవ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా జీవితంలో విజయం సాధించేందుకు భావ ప్రకటనా నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్) ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా ఉద్యోగావకాశాలు పొందడానికి ఇవి తప్పనిసరిగా మారాయి. దీర్ఘకాలం కొలువులోకొనసాగాలంటే ఈ స్కిల్స్‌ను సమర్థంగా ప్రదర్శించాల్సి ఉంది.అయితే ఈ నైపుణ్యాలు అందరిలోనూ సమాన స్థాయిలో ఉండవు.అందువల్ల వాటిని పెంపొందించుకునేందుకు నిరంతరం సాధన చేయాలి. భావ వ్యక్తీకరణలో విచక్షణను ప్రదర్శించడం, భావావేశాలపై నియంత్రణ సాధించడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఉద్యోగ జీవితంలోని దశలు: ప్రతి వ్యక్తి ఉద్యోగ జీవితంలో మూడు దశలు ఉంటాయి. ఒకటి.. ప్రవేశం. రెండు.. స్థిరపడటం. మూడు.. అంచెలంచెలుగా ఎదగడం. ఈ మూడు దశల్లో సఫలీకృతమవడానికి దృఢమైన వ్యక్తిత్వం ఎంత అవసరమో ఆ వ్యక్తిత్వ వికాసాన్ని స్పష్టంగా వ్యక్తం చేయడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగం సాధించాలంటే దానికి కావాల్సిన అర్హతలు, నైపుణ్యాలు, సంబంధిత సంస్థ వివరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా లక్షణాలు పెంపొందించుకొని వాటిని వ్యక్తం చేసే నైపుణ్యాలు సాధించాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజేతగా నిలవాలంటే అందరి కంటే మనలో ఉత్తమ వ్యక్తిత్వం, మెరుగైన నైపుణ్యాలు ఉన్నట్లు ఒప్పించగల నేర్పు అవసరం. భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు-ముఖ్యాంశాలు: భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చదువుకు తగ్గ ఉద్యోగం సాధించడానికి, ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందడానికి ఈ నాలుగు నైపుణ్యాలు అవసరం. 1. శ్రవణ నైపుణ్యం: మనకు ఇష్టమున్నా, లేకున్నా మన చుట్టూ ఏర్పడే ప్రతి శబ్దాన్ని మనం వినగలం. అయితే గ్రహించడం అనేది సంకల్పిత చర్య. అంటే మన ప్రమేయంతో జరిగే చర్య. మెదడు, కళ్లు, చెవులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రహించగలం. అందువల్ల ఉద్యోగ విజయానికి, ఉత్తమ మానవ సంబంధాలకు శ్రవణ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయి? అనే అవగాహన అవసరం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన చదువుకు, చేసే పనికి సంబంధం ఉండదు. కాబట్టి పై అధికారులు, సీనియర్ల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు శ్రవణ నైపుణ్యాలు తప్పనిసరి. సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన ఉంటేనే ఉద్యోగంలో రాణించగలం. అయితే శ్రవణ నైపుణ్యాలు లేకుండా సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహన రావడం అసాధ్యం. సందర్భోచిత హావభావాలు కూడా ఉత్తమ శ్రవణ నైపుణ్యాల్లో ముఖ్యాంశమే. 2. వాక్పటిమ: భావాలను ఇతరులకు చెప్పడానికి, ప్రతిభను నిరూపించుకునేందుకు, మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి వాక్పటిమ ఎంతో అవసరం. పదాల వాడకం, ఉచ్చారణ, వాక్య నిర్మాణం, శైలి, వేగం, హావభావాలు భావ వ్యక్తీకరణను ప్రభావితం చేస్తాయి. ఇతరుల భావాలకు అనుగుణంగానే కాకుండా వారి ఉద్దేశాన్ని బట్టి కూడా మాట్లాడటమే నిజమైన నైపుణ్యం. 3. పఠనా నైపుణ్యం: చదవడం ఒక కళ. దీని ద్వారా విషయ పరిజ్ఞానం పెరగడమే కాక విశ్లేషణాశక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రతిఒక్కరూ చదవడాన్ని శాస్త్రీయంగా సాధన చేసి పఠనా నైపుణ్యాన్ని పొందాలి. వాక్పటిమను పెంచుకోవడానికి పఠనా నైపుణ్యం ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ చదవడానికి, సారాంశాన్ని గ్రహించడానికి పఠనా నైపుణ్యం అవసరం. దీంతో ఉద్యోగంలో విజయంతోపాటు సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. 4. రచనా నైపుణ్యం: రచన అనేది రాస్తూ ఉంటేనే రాటుదేలుతుంది. ఇది పఠనాసక్తిపై ఆధారపడి ఉంటుంది. స్పష్టత, సమగ్రత, సృజనాత్మకత రచనా నైపుణ్యానికి కొలమానాలు. నిర్దిష్ట పద ప్రయోగం, సహజ శైలి, సరళమైన భావ వ్యక్తీకరణ... రచనా నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడతాయి. ఎన్.వి.పార్థసారధి డిగ్రీ కాలేజీ లెక్చరర్ (రిటైర్డ్), హైదరాబాద్. -
ఎలా మాట్లాడుతున్నారు..?
కమ్యూనికేషన్ చాలా వరకు ప్రతీ ఒక్కరూ పనిచేసే చోట అతి తక్కువ మందితో కనెక్ట్ అయి ఉంటారు. అలా కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ, తమని తాము కరెక్ట్ చేసుకుంటే.. కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. పరిచయం చేసుకునే పద్ధతిలో తేడాలు ఉద్యోగంలో చేరినప్పుడు... మొదటి పరిచయంలోనే మీపై ఎదుటివారికి మంచి అభిప్రాయం ఏర్పడాలి. అందుకే చాలా సందర్భాలలో ‘మొదటి పరిచయమే అత్యంత మేలైనద’ని చెబుతుంటారు. ఉదాహరణకు:‘హలో, నేను... నా పేరు ఆనంద్, నేను ...’ ఇలా మొదలుపెట్టేస్తే అవతలి వారు విసుక్కుంటారు. అలా కాకుండా ‘హలో! నా పేరు ఆనంద్..’ అని ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని కొంత విరామమిస్తే అవతలి వారు తమపట్ల ఆసక్తి చూపుతారు. మాటల్లో అతి వేగం అనర్ధమే! అవతలివారితో ముందు మీరు మాట్లాడాలనుకుంటే మీరేం అనుకుంటున్నారో క్లుప్తంగా చెప్పండి. అయితే, ఆ వెంటనే అవతలి వారికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీ మాటల్లో స్పష్టతా లోపం లేకుండా చూసుకోండి. తరచూ అంతరాయాలు ఎదుటివారు మనల్ని పలకరించడం లేదు అని వదిలేయడం ఎంత మాత్రమూ మంచిది కాదు. అవతలివారితో పరిచయం ఒక అవసరం కావచ్చు. అలాంటప్పుడు ముందు మీరే వెళ్లి ‘ఎక్స్‌క్యూజ్‌మి’.. అని మర్యాదగా పరిచయం చేసుకోవచ్చు. అవతలి వారి పలకరింపు, సమయాన్ని బట్టి సంభాషణను తగ్గించడం, పొడిగించడం చేయవచ్చు. అర్థంలేని పదాలు చెప్పే విషయం సరళంగా, సందేశం సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు అర్థం కాని పదాలను ఉపయోగించడం వల్ల అవతలి వారికి అవి తప్పుడు సంకేతాలను ఇవ్వచ్చు. అలాంటి పదాలు మీ నోటి వెంట ఎంత ఎక్కువ వస్తుంటే మీ మధ్య సంబంధం అంతగా తగ్గిపోతుంటుందని గ్రహించాలి. ప్రతికూల పదజాలం మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి చేరుతుంది. అందుకే, అన్ని వేళలా మీ మాటల్లో, మీ భాషలో సానుకూల ధోరణియే కనిపించాలి. అదే అదనపు బలంగా మిమ్మల్ని చేరుతుంది. అనుకూల భాష, మాట ఎప్పుడూ మీకు సాయపడుతుంది. మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. పని చేసే చోట అపసవ్యత పని చేసే చోట వాతావరణం బాగుండాలనే ఆలోచన అందరిలోనూ ఉంటుంది. అదే రక్షణగా, సురక్షితంగా అంతా భావిస్తారు. వివక్ష ఉన్నట్టు మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనల ద్వారా తెలుస్తుంది. అవి జాతి, కులం, రంగు, లైంగిక సంబంధాలు... మొదలైనవి. ఇవి చాలా సున్నితమైన అంశాలు. వాటికి సంబంధించిన విషయాలను ఇతరుల దగ్గర తప్పుగా మాట్లాడకూడదు. అనువుగాని పరిస్థితిల్లో భీతిల్లడం ఉద్యోగభద్రతకు సంబంధించి మీ చుట్టూ ఉన్నవారు రకరకాల ప్రశ్నలు వేయొచ్చు మీ దగ్గర నుంచి సమాధానం రాబట్టడానికి. మీకు సరైన విషయం తెలిస్తే చెప్పండి. లేదంటే అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. -
రాజేష్‌ఖన్నా తొలి గురువు ఎవరంటే..
ప్రేమ- ద్వేషం రాజేష్‌ఖన్నా సూపర్‌స్టార్ కావచ్చు... అతడి కోసం వేలాదిమంది అమ్మాయిలు వెర్రెక్కిపోతుండవచ్చు... కాని ఒకరు మాత్రం అతణ్ణి లెక్క చేసేవారు కాదు. అసలు పట్టించుకునేవారు కూడా కాదు. అతడు మాత్రం ఆమె కోసం వెంపర్లాడేవాడు. ఆమె పేరే అంజు మహేంద్రు. ముంబైలో ఆ రోజుల్లో ఫ్యాషన్ ఐకాన్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నటిగా పేరు పొందిన అంజు మహేంద్రు సినిమా రంగంలో రాజేష్ ఖన్నా పైకి రావడానికి అవసరమైన వేషభాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిన తొలి గురువు. ఆమె అతణ్ణి ఇష్టపడింది. అతడు ఆమెను ప్రేమించడమే కాక చాలా కృతజ్ఞతతో ఉండేవాడు. వాళ్లిద్దరూ దాదాపు ఏడేళ్లు కలిసి ఆ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉండేవారు. అయితే ఆ జోడి విడిపోయింది. దానికి కారణం రాజేష్‌ఖన్నా పొజెసివ్‌నెస్ కావచ్చు. అంజు మహేంద్రు విస్తృతమైన ఎక్స్పోజర్ కావచ్చు. ఆమె ఎప్పుడూ అతడికి దొరికేది కాదు. పార్టీలు స్నేహాలతో బిజీగా ఉండేది. అంతేకాక బయట జనం అంతా పొగుడుతుంటే ఈమె మాత్రం ఏడ్చినట్టు చేశావ్... అక్కడ ఆ బట్టలు సరి కాదు... ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ సరికాదు అని విమర్శించేది. దాంతో రాజేష్‌ఖన్నా ఇగో బాగా హర్ట్ అయ్యింది. ఎంతగా అంటే అప్పటికి ‘బాబీ’ సినిమా రిలీజ్ కాకపోయినా తన కంటే వయసులో చాలా చిన్నదే అయినా డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకునేంత వరకూ (1973) ఒంటి కాలి మీద ఉన్నాడు. అంజు మీద అతడికి ఎంత కచ్చ పెరిగిందంటే పెళ్లి బారాత్ ఆమె ఇంటి మీదుగా వెళ్లాలని పట్టుబట్టి ఆమె ఇంటి ముందు చాలా హంగామా చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత డింపుల్ ఇంటికి పరిమితమైంది. అంజు మహేంద్రు, రాజేష్ ఖన్నా దాదాపు 17 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు కూడా. అంజు మీద కోపంతో, అప్పటికే తనకు అందివచ్చిన స్టార్డమ్తో రాజేష్ ఖన్నా ఆమె కెరీర్ మీద ఒత్తిడి తెచ్చాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆమెకు నటిగా వేషాలు రాకుండా చేయడం, ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుపడటం, వాటిని తనే కొనేసి మూల పడేయడం... జువెల్ థీఫ్ (1967), హస్తే జఖ్మ్ (1973) వంటి సినిమాలలో నటించినా హీరోయిన్గా పతాక స్థాయికి వెళ్లలేకపోవడానికి రాజేష్‌ఖన్నా ఒక కారణం అని చెబుతారు. అయితే ఆ తర్వాత వాళ్లు మళ్లీ స్నేహితులయ్యారు. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో వాళ్లిద్దరూ తరచూ కలిసేవారు. రాజేష్ ఖన్నా జీవితంలో ఆ తర్వాత కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు. అతడితో 11 సినిమాలు చేసిన టీనా మునిమ్ (ఇప్పుడు టీనా అంబాని) అతణ్ణి దాదాపు పెళ్లి చేసుకోబోయిందని అంటారు. కాని డింపుల్‌తో చట్టపరంగా విడాకులు కాకపోవడం వల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉండటం వల్ల వాళ్ల మీద ఎటువంటి ప్రభావం పడుతుందోనని రాజేష్‌ఖన్నా ఆమె కోరికను తిరస్కరించారని అంటారు. రాజేష్ ఖన్నా జీవితంలో ఏమి జరిగినా ఆయన ఎప్పుడూ కాంట్రవర్శీలకు దూరంగా ఉన్నాడు. ఎప్పుడూ ఏ గొడవలో దూరకుండా తన పనేదో తాను చేసుకుంటూ బతికాడు. ఇప్పటి స్టార్లను చూస్తే ఆ సూపర్‌స్టార్ వ్యక్తిత్వం ముందు కొంచెం చిన్నగానే కనిపిస్తారు. -
నిర్దేశించేవి.. నైపుణ్యాలే
బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సక్సెస్ సాధించటం కష్టమా? ఇటువంటి సందేహాలు సాధారణంగా ఆశావహుల్లో మెదులుతుంటాయి. ఇతర రంగాల్లోని ఇంటర్వ్యూ ప్రక్రియనే ఇక్కడ అనుసరిస్తారు. కాకపోతే అడిగిన ప్రశ్నలకు సూటిగా, సరళంగా, స్పష్టంగా ఏ విధంగా సమాధానం ఇస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. అంతేకాకుండా అభ్యర్థిలోని నిర్వహణ సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తారు. మరో విధంగా చెప్పాలంటే వ్యక్తిగత నైపుణ్యాలు అంటే.. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, ఆహార్యం, ఆత్మవిశ్వాసం వంటివే విజయాన్ని నిర్దేశిస్తాయని చెప్పొచ్చు. రెజ్యూమె ఆధారంగా సాధారణంగా ఇంటర్వ్యూ బోర్డులో నలుగురు/ఐదుగురు సభ్యులు ఉంటారు. 15-25 నిమిషాలపాటు ఈ దశ ఉంటుంది. అభ్యర్థి ఇచ్చిన రెజ్యూమె ఆధారంగా ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతారు. అంటే వ్యక్తిగత నేపథ్యం, చదువు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, భవిష్యత్ లక్ష్యాలు, ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలతోపాటు సమకాలీన అంశాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. ఇంటర్వ్యూ పూర్తిగా ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. సమాధానాన్ని ఎంత స్పష్టంగా, సూటిగా, ఆత్మవిశ్వాసంతో ఇస్తున్నారనే అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వ్యాకరణ దోషాలను పట్టించుకోకుండా సమాధానాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. ముందుగా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లేముందు ఒకసారి తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడిగి వారి అనుమతితో లోపలికి వెళ్లాలి. లోపలికి వెళ్లిన తర్వాత బోర్డు సభ్యులకు నమస్కారం చేసి, వారు కూర్చోమనేవరకు ఎదురుచూసి, తర్వాత నిర్దేశించిన స్థానంలో కూర్చోవాలి. అలా కూర్చునేటప్పుడు మరీ బిగదీసుకుని కాకుండా ప్రశాంతంగా కనిపిస్తూ కూర్చోవాలి. ఆహార్యమే కీలకం ఇంటర్వ్యూలో విజయం సాధించడమనేది 55 శాతం ఆహార్యం (అఞఞ్ఛ్చట్చఛ్ఛి), 38 శాతం స్వర స్థాయి (్కజ్టీఛిజి ౌజ ఞ్ఛ్ఛఛిజి), 7 శాతం ఉపయోగించే పదాల మీద (ఈ్ఛఞ్ఛఛీట ౌ ్టజ్ఛి గిౌటఛీట ్టజ్చ్టి డౌఠ ఠీజీ ఛ్ఛ ఠటజీజ ) ఆధారపడి ఉంటుంది. కాబట్టి చక్కని పదాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థి తనను తాను ప్రెజెంట్ చేసుకునే క్రమంలో దుస్తుల దగ్గర్నుండి పాదరక్షల వరకు పలు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాషనబుల్ కాకుండా హుందాగా ఉండేలా ఫార్మల్ దుస్తులను ధరించాలి. టై తప్పనిసరి. పురుష అభ్యర్థులైతే విధిగా ఇన్‌షర్ట్ చేయడంతోపాటు ఫార్మల్ షూస్ వేసుకోవాలి. మహిళా అభ్యర్థులైతే సల్వార్ కమీజ్ లేదా చీరను ధరించాలి. సమాధానం ఇచ్చేటప్పుడు పదేపదే వాచ్ వైపు చూసుకోవడం, టేబుల్‌పై చేతులు పెట్టడం, శరీరాన్ని కదిలించడం, బిగ్గరగా నవ్వడం వంటి చేయకూడదు. అంతేకాకుండా మరో కీలక విషయం..వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పడం మంచిది కాదు. ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. తెలిసిన విషయాన్ని సూటిగా, సరళంగా, స్పష్టంగా వివరించాలి. ముఖం నుంచి చిరునవ్వు తొలగి పోకుండా చూసుకోవాలి. ప్రశ్న అడిగిన వ్యక్తిని చూస్తూ సమాధానం ఇవ్వాలి. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుడదు. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం నుంచి మనం ఏయే విషయాలు నేర్చుకున్నామో.. వాటిని పరీక్షించే ఒక వేదిక వంటిది ఇంటర్వ్యూ ప్రక్రియ. సమాధానం ఇచ్చేటప్పుడు సమన్వయంతో ఉండాలి. ఏదైనా అంశం విషయంలో బోర్డు సభ్యులు కంటే ఎక్కువ తెలుసు అనే ధోరణిని ప్రదర్శించకూడదు. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. తెలియదు, రాదు, గుర్తులేదు తరహాలో కాకుండా.. నేర్చుకుంటాను/తెలుసుకుంటాను వంటి వినయపూర్వకమైన పదాలు ఉపయోగించాలి. సహనానికి పరీక్ష కొన్ని సార్లు బోర్డు సభ్యులు మీ సహనాన్ని కూడా పరీక్షించే విధంగా ప్రశ్నిస్తుంటారు. ఇటువంటి సమయంలో చికాకు ప్రదర్శించకుండా ఓర్పుతో వ్యవహరించాలి. ఎందుకంటే పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా ఖతాదారులు/వినియోగదారులతో ఏవిధంగా వ్యవహరిస్తారనే అంశాన్ని పరిశీలించడానికి కూడా ఇలా పరీక్షిస్తారు. కాబట్టి అనవసరంగా వాదానికి దిగకుండా సమాధానం ఇవ్వడంపైనే దృష్టిని కేంద్రీకరించడం ప్రయోజనకరం. ఇంటర్వ్యూలో కీలకమైన అంశం వినడం. ఎదుటి వారు చెప్పుతున్న దాన్ని ఎంత స్పష్టంగా వింటే..అంతే స్పష్టంగా సమాధానం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక వేళ అడిగిన ప్రశ్న అర్థం కాకపోతే.. తిరిగి అడగడానికి సందేహించవద్దు. కాకపోతే ఈ ప్రక్రియ వినయంగా ఉండాలి. పరిమితం కాదు ఇంటర్వ్యూ అనేది కేవలం ప్రశ్నలు-సమాధానాలకే పరిమితమైన ప్రక్రియ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సదరు ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యం, సామర్థ్యం వంటి అంశాలను రాత పరీక్ష ద్వారా పరీక్షించి ఉంటారు. పరీక్షతో అంచనా వేయలేని వ్యక్తిగత నైపుణ్యాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని తెలుసుకోవడానికి దీన్ని వేదికగా వినియోగించుకుంటారనే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి.. కరెంట్ అఫైర్స్‌లో తడబాటు ఇంటర్వ్యూల్లో అధిక శాతం మంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ విషయంలోనే వెనుకబడతున్నారు. కాబట్టి ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రతి రోజూ దినపత్రికలు, వార పత్రికలు, న్యూస్ వెబ్సైట్లు, టీవీ చానెళ్ల వార్తలను అనుసరిస్తూ ఉండాలి. ఇంటర్వ్యూ రోజు..ఆ రోజు దిన పత్రికలలో వచ్చిన వార్తల నుంచి కచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత రంగంపై అవగాహనను కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ టెర్మినాలజీ, బ్యాంకింగ్ రేట్లు.. రెపో రేట్లు, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ తదితరాలు, బ్యాంకింగ్ ఆపరేషన్స్, ప్రస్తుతం ఈ రంగంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలు, ఉన్నతాధికారులు వివరాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. మరో విషయం బ్యాంకులు ఎలా పని చేస్తాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిలో ఎటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు? అనే అంశంపై కనీస అవగాహన ఉండాలి. మాక్ ఇంటర్వ్యూలు మరో కీలాకంశం.. మాక్ ఇంటర్వ్యూలు. వీటికి హాజరవ్వడం ద్వారా అత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. వాటిని సరి చేసుకోవడం ద్వారా మరింత ప్రభావవంతంగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వీలుకాని పక్షంలో ఇంట్లో అద్దం ముందు కూర్చోని సమాధానాలను ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. కుటుంబ సభ్యులు/స్నేహితుల సహకారంతో మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించుకోవడం మంచిది. అంతేకాకుండా గత విజేతల సూచనలను పాటించడం ఎంతో మేలు చేస్తుంది. చివర్లో ఇంటర్వ్యూ చివర్లో సాధారణంగా అభ్యర్థిని మీరు ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అని బోర్డు సభ్యులు ప్రశ్నిస్తుంటారు. అటువంటి సందర్భంలో కేవలం అడగాలనే ఉద్దేశంతో కాకుండా.. జెన్యూన్ ప్రశ్న అయితేనే అడగటం మంచిది. అడిగే ప్రశ్న కూడా సంబంధిత రంగానికి చెందినదై ఉండాలి. ఇంటర్వ్యూ ముగిశాక బయటకు వచ్చే ముందు మరొక సారి బోర్డుకి కృతజ్ఞతలు చెప్పి బయటకు రావాలి. బ్యాంకింగ్‌కు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఆర్బీఐ-పని చేసే విధానం, మానిటరీ పాలసీ, సెబీ (డీమ్యాట్, సీడీఎస్ఎల్, ఎఫ్‌పీఓ, ఆన్లైన్ ట్రేడింగ్, సెన్సెక్స్, నిఫ్టి తదితరాలు), ఐఆర్డీఏ, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు (ఎన్పీఏ మేనేజ్మెంట్, పెరుగుతున్న పోటీ, కేవైసీ, ఏఎంఎల్ తదితరాలు), జన్-ధన్ యోజన, ఫోరెక్స్, లాకర్స్, చెక్స్, వెల్త్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, రుణాలు తదితరాలు. సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు కొన్ని Tell me something about yourself. Tell me about one moment you are proud of in your life. Tell me about your extra-curricular achievements. What do you know about our company? What were the five most significant accomplishments in your last assignment or career? Why do you think you are suited to this job? Why should I hire you? What do you know about our organization? What skills and qualifications are essential for success in the required position? How does this assignment fit in to your overall career plan? Are you flexible? Are you mobile? Are you a hard worker? Are you persistent and persevering? What can you do for us that someone else cannot? What do you look for in a job? How do you differentiate yourself from others? Narrate an incident where you have shown positive attitude. -
‘ఈజీఎంఎం’లో సమూల మార్పులు
అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ‘ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం)’లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఈజీఎంఎం శిక్షణ కార్యక్రమాల రూపకల్పనపై శనివారం ఆయన ఆ విభాగం ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈజీఎంఎం శిక్షణ కేంద్రాల పనితీరును మెరుగు పర్చేందుకు వివిధ రంగాల్లో పేరుపొందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశిం చారు. నిరుద్యోగ యువతకు అందించే శిక్షణలో, వృత్తి నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కు అధిక ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ఈజీఎంఎంను ఉపాధి, వృత్తినైపుణ్య వనరుల సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించిందని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుసంధానం: ఈజీఎంఎం శిక్షణ కేంద్రాలను పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేసి, శిక్షణ పొందే యువత కు ఉద్యోగావకాశాలు మెరుగయ్యేలా ప్రణాళికలు రూపొందిం చాలన్నారు. శిక్షణ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పేరున్న సంస్థలకే అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈజీఎంఎం కార్యక్రమాల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. కాంట్రాక్టు ఉద్యోగులు కొనసాగింపు.. ఎం ప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఆయా ఉద్యోగాల్లో మరో ఏడాదిపాటు కొనసాగించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతను గుర్తించి వారి వివరాలను ఈజీఎంఎంకు అందించే జాబ్ రిసోర్స్ పర్సన్ల(జెఆర్పీ)ను కూడా కొనసాగిస్తామన్నారు. ఉద్యోగ భద్రత గురించి ఉద్యోగులెవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఈజీఎంఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి మురళీధర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు..
నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టా చేతపట్టుకొని బయటకు వస్తూనే నచ్చిన కంపెనీలో, మెచ్చిన ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా సబ్జెక్టులో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంతో పోల్చితే ప్రస్తుతం కంపెనీల అవసరాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకనుగుణంగా మల్చుకుంటూ పోటీ వాతావరణంలో సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టే నైపుణ్యం గల మానవ వనరులను నియమించుకోవడానికి అవి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే ఉద్యోగార్థులకు సరైన నైపుణ్యాల సాధన తప్పనిసరి అయింది. ప్రాక్టికల్ పరిజ్ఞానం ముఖ్యం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ కళాశాలల్లో లేబొరేటరీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు వీటిలో ప్రాక్టికల్స్ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల సబ్జెక్టుల భావనలపై సులువుగా పట్టు సాధించవచ్చు. ఓ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వివిధ రకాలుగా అనువర్తింపజేసే నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ల్యాబ్ సెషన్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్: ‘‘నాకు సబ్జెక్టుపై బాగా పట్టు ఉంది. నా దగ్గర సందేహాలు నివృత్తి చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలు వచ్చాయి. నాకు మాత్రం ప్రతిసారీ నిరాశ ఎదురవుతోంది. నా పరిజ్ఞానాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతుండటమే దీనికి ప్రధాన కారణం’’- చాలా మంది విద్యార్థుల నోటి నుంచి వస్తున్న మాటలివి. ఎంత సబ్జెక్టు ఉన్నా సరిగా బహిర్గతం చేయలేకపోతే ఉద్యోగం దొరకడం ఎండమావే. అందుకే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. అందుకే కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్లను చదవడం, బీబీసీ వంటి చానల్స్ చూడటం ద్వారా ఆ భాషపై పట్టు సాధించవచ్చు. ఇతర నైపుణ్యాలు: కళాశాలలో వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించేందుకు వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీడీలపై దృష్టిసారించాలి. ఇప్పుడు బహుళ జాతి సంస్థల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికీ ఇవి ఉపయోగపడతాయి. కంప్యూటర్‌కు సంబంధించి సీ లాంగ్వేజ్‌ను కాలేజీలో ఎలాగూ నేర్పుతారు కాబట్టి దీనికి అదనంగా బయట మార్కెట్లో జావాను కూడా నేర్చుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం తీరిది.. నైపుణ్యాలతో నిండుకుండలా ఉండే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర బ్రాంచ్‌ల ఇంజనీర్లను పరిశ్రమలు వివిధ విభాగాల్లో, వివిధ హోదాలతో నియమించుకుంటాయి. పరిశోధన-అభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్ ఎక్స్‌లెన్స్, స్ట్రక్చరల్ ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో బాధ్యతలను అప్పగిస్తాయి. సాధారణంగా సంస్థల ప్రతినిధులు ఉద్యోగుల ఎంపిక సందర్భంగా నిర్వహించే ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల అకడమిక్ రికార్డు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాయి. సృజనాత్మకత, పనిలో వేగం-కచ్చితత్వం, తక్కువ ఖర్చుతో విలువైన ఫలితాలను రాబట్టే నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి. వేతనాలు: జూనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఇంజనీర్లకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వేతనం ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, సీనియర్ ఇంజనీర్లకైతే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందుతుంది. ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ అనుభవం ఓ విద్యార్థి తాను చేస్తున్న కోర్సుకు సంబంధించి కాలేజీలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా అన్వయించడానికి ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. మంచి కొలువులకు మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండు, మూడు నెలల పాటు ఓ కంపెనీలో ఉంటూ సొంతం చేసుకున్న పని అనుభవం పటిష్టమైన కెరీర్‌కు పునాది వేస్తుంది. అందువల్ల విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉత్సాహం చూపాలి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మూడో సంవత్సరం ప్రారంభంలో టెక్నికల్ ఫెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో మెరుగైన ప్రతిభను ప్రదర్శించిన వారికి తమ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. ఇంటర్న్‌షిప్ సాధారణంగా వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు ఉంటుంది. టాప్ స్టోరీ ‘‘దాదాపు 30 శాతం మంది ఐటీ/కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉపయోగించే ప్రాథమిక ైభావనలపై అవగాహన లేదు’’ - యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనంలో తేలిన విషయమిది! ‘‘భారత దేశంలో కళాశాలల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 27 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపు ణ్యాలు ఉన్నాయి’’ - నాస్కామ్ స్కిల్ సర్వే వెల్లడించిన అంశమిది! ప్రస్తుతం అంతా కార్పొరేట్ మయం.. నేటి పోటీ ప్రపంచంలో కంపెనీని ప్రగతి పథంలో పయనింపజేసే నిపుణులకే ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. ఏటా దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వస్తున్న లక్షల మందిలో కొంత మందికే ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారి సంగతేమిటి? ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యకు హబ్‌గా ఉన్న హైదరాబాద్ విద్యార్థులు ఉజ్వల కెరీర్‌ను చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఏ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి? తదితరాలపై ఫోకస్... కాలేజీ వైపు నుంచి విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా కళాశాలలు తమ వంతు కృషి చేయాలి. కళాశాలకు పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించి, వారి అవసరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా కరిక్యులంను మార్చాలి. కేవలం విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి చేరువ చేయాలి. వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలి. ఇంటర్న్షిప్స్, అప్రెంటీస్‌షిప్ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి. అవసరమైన సహాయం అందించాలి. -
నైపుణ్యాల వృద్ధికి.. ఉపకరించే సాధనాలు
స్కిల్ గ్యాప్.. అంటే పరిశ్రమలు అభ్యర్థుల్లో కోరుకుంటున్న నైపుణ్యాలకు.. విద్యార్థుల్లో ఉంటున్న సాధారణ నైపుణ్యాలకు మధ్య అంతరం. నేడు ఏ కోర్సులు చదివిన విద్యార్థులకైనా జాబ్ మార్కెట్లో ఎన్నో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అభ్యర్థులు నైపుణ్యాల లేమితో ఉద్యోగాలను దక్కించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆశిస్తున్న స్కిల్స్.. టెక్నికల్, మేనేజీరియల్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. వీటన్నింటినీ సొంతం చేసుకుంటేనే ఆకర్షణీయమైన కెరీర్ సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో అందరికంటే ముందు నిలవడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై విశ్లేషణ.. ఇంటర్న్షిప్స్ అకడమిక్స్ స్థాయిలోనే పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలను ప్రత్యక్షంగా పొందగలిగే మార్గం ఇంటర్న్షిప్స్. అంటే.. ఒక విద్యార్థి తాను చదువుతున్న కోర్సుకు సంబంధించిన పరిశ్రమలో కొద్ది నెలలపాటు పని చేయడం ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవడం. దీంతో పాటు వాస్తవ పరిస్థితులపై అవగాహన పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఇంటర్న్షిప్స్ అనే ప్రక్రియ కరిక్యులంలో భాగంగా లేనప్పటికీ.. కొన్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలు సొంతంగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేస్తున్నాయి. బీటెక్‌లో మూడో ఏడాది ముగిసిన తర్వాత సెలవుల సమయంలో, ఎంబీఏలో మొదటి సంవత్సరం తర్వాత సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ప్రక్రియ ఉంటోంది. వీటినే సమ్మర్ ఇంటర్న్‌గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులు తమ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం ఉన్న పరిశ్రమల్లో రెండు లేదా మూడు నెలల నిర్దేశిత వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందే వీలుంటుంది. స్కిల్ గ్యాప్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న పరిశ్రమ వర్గాలు, సంబంధిత సంస్థలు కూడా ఇంటర్న్‌షిప్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేసే సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఉత్పత్తి రంగంలో ఈ ధోరణి కొంత తక్కువైనప్పటికీ.. ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు ఇంటర్న్‌షిప్ ట్రైనీ అవకాశాలు బాగా కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సాఫ్ట్వేర్ సంస్థలు ఇంటర్న్ ట్రైనీలను నియమించుకోవడంలో ముందుంటున్నాయి. వీటిల్లో శిక్షణ పొందడంతోపాటు ఆయా సంస్థల విధానాల ప్రకారం ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సమయంలో చొరవ, తమకు కేటాయించిన విభాగంలో ప్రతిభ ద్వారా ఆయా సంస్థల గుర్తింపు పొందితే.. ఇంటర్నషిప్ పూర్తయ్యాక ఉద్యోగాన్ని కూడా దక్కించుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థుల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలను పెంపొందించే క్రమంలో మరో ముఖ్య సాధనం ప్రాజెక్ట్ వర్క్స్. ప్రస్తుత కరిక్యులం ప్రకారం ప్రతి ప్రొఫెషనల్ కోర్సులోనూ ఇది తప్పనిసరి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్లో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితంగా విద్యార్థులకు సదరు సంస్థ, విభాగాలపై నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థులు తాము ఎంచుకున్న అంశానికి సంబంధించి.. ఏదైనా ఒక సంస్థలో ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో తాము ఎంచుకున్న అంశంలో సమస్య ఎదురైతే.. దాని పరిష్కార మార్గాలు తెలుసుకుని పరిష్కరించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ విధానం కూడా విద్యార్థులకు భవిష్యత్తు ఉద్యోగాలను ఖాయం చేసే మార్గంగా పేర్కొనొచ్చు. ప్రాజెక్ట్ వర్క్ వ్యవధిలో సదరు సంస్థలో చక్కటి పనితీరు కనబరిచి ఉన్నతాధికారుల గుర్తింపు పొందితే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలెన్నో. ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించి మరో ప్రత్యామ్నాయం ఇండివిడ్యువల్/గ్రూప్ ప్రాజెక్ట్స్. సంస్థల్లో ప్రాజెక్ట్ వర్క్ అవకాశం పొందని విద్యార్థులు సొంతంగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా ప్రాజెక్ట్ చేయడం. ఈ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ ద్వారా సమస్య-పరిష్కారాలను సంస్థల దృష్టికి తీసుకెళ్లొచ్చు. మీరు చెప్పిన పరిష్కార మార్గాలు నచ్చితే మీకు ఉద్యోగం దక్కినట్లే. ఇలా తమ ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్‌ను సంస్థల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా రంగాలకు సంబంధించి నిర్వహించే సెమినార్లు, కాలేజ్ సావనీర్లు, క్యాంపస్ రిక్రూట్మెంట్ సెషన్స్‌ను వేదికలుగా ఉపయోగించుకోవాలి. కానీ.. ఇటీవల చాలా మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మార్కుల సాధన, సర్టిఫికెట్లో పర్సంటేజీ సంఖ్య పెంపుదల సాధనంగానే భావిస్తున్నారు. ఇది సరికాదు. ప్రాజెక్ట్ వర్క్ అంటే తాము అప్పటి వరకు పొందిన థియరీ నాలెడ్జ్‌ను క్షేత్ర స్థాయిలో అన్వయించడంతోపాటు.. వాస్తవ పరిస్థితులపై సంపూర్ణ అవగాహన పొందేందుకు చక్కటి సాధనంగా వినియోగించుకోవాలి అంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి. ఉమామహేశ్వరరావు. అప్రెంటీస్షిప్స్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్.. విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన కోర్సుకు సంబంధించిన సంస్థలో నిర్దిష్ట కాలంలో పూర్తి స్థాయిలో పని చేయడం. ముఖ్యంగా వృత్తి విద్య కోర్సుల్లో అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఎంతో కీలకమైన అంశం. అంతేకాకుండా స్కిల్ గ్యాప్‌నకు చక్కటి పరిష్కార మార్గం కూడా. నిర్ణీత వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్షిప్లో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించడం ద్వారా క్షేత్ర స్థాయి అవసరాలపై అవగాహన పొందొచ్చు. అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1961లోనే అప్రెంటీస్ యాక్ట్ పేరిట చట్టాన్ని కూడా రూపొందించింది. దీని ప్రకారం సంస్థలు మొత్తం శ్రామిక శక్తిలో పది శాతం మేర అప్రెంటీస్ ట్రైనీలను నియమించుకోవాలి. అంతేకాకుండా శిక్షణలో స్టైఫండ్ చెల్లించాలని కూడా నిర్దేశించింది. ఇప్పటికే బీహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్, గెయిల్ వంటి మహారత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలు; ప్రైవేటు రంగంలో వేల సంఖ్యలో.. ట్రేడ్ అప్రెంటీసెస్; గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీసెస్; టెక్నీషియన్ అప్రెంటీసెస్ వంటి హోదాల్లో ఐటీఐ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాల వరకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, సెంట్రల్ అప్రెంటీస్ కౌన్సిల్లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ట్రేడ్ సర్టిఫికెట్లు పొందొచ్చు. కానీ.. ఇప్పటికీ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అంటే విద్యార్థుల్లో అంతగా అవగాహన ఉండట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా అప్రెంటీస్‌షిప్ సదుపాయం సంఖ్య 4.8 లక్షలు ఉంటే కేవలం 2.8 లక్షల మంది మాత్రమే దీన్ని వినియోగించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అప్రెంటీస్ చట్టానికి మార్పులు తీసుకొచ్చింది. ఈ క్రమంలో స్టైఫండ్ శాతాన్ని కూడా 40 శాతం మేర పెంచింది. టెక్నికల్ కోర్సులకే పరిమితమైన ట్రైనింగ్‌ను బీఏ, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ స్కిల్ గ్యాప్‌నకు సంబంధించి ఇటు విద్యార్థులు, అటు పరిశ్రమ వర్గాలకు చక్కటి వారధిగా నిలుస్తున్న అంశం ఆన్ జాబ్ ట్రైనింగ్. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ద్వారా తాజా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్న సంస్థలు.. వారికి తమ అవసరాలకు అనుగుణంగా సంబంధిత అంశాల్లో క్షేత్ర స్థాయి నైపుణ్యాలు అందించేందుకు చేపడుతున్న శిక్షణ కార్యక్రమమే ఆన్ జాబ్ ట్రైనింగ్. ముఖ్యంగా బీటెక్‌లో బ్రాంచ్‌తో సంబంధం లేకుండా అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులను నియమిస్తున్న ఐటీ సంస్థలు ఆన్ జాబ్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల పాటు ఉండే ఆన్ జాబ్ ట్రైనింగ్‌లో అభ్యర్థులకు.. వారు నియమితులైన విభాగాలకు సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతోపాటు సంస్థలో ఇతర విభాగాలు, వాటి విధి విధానాలు, పనితీరు వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ సదుపాయం కేవలం ఎంట్రీ లెవల్ ఉద్యోగులకే కాకుండా.. సంస్థలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలోనూ అమలు చేస్తున్నాయి. మిడ్ లెవల్ కెరీర్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించి.. ఆయా ఉద్యోగులు పని చేస్తున్న విభాగాలు, రంగాల్లోని తాజా పరిణామాలు, అప్డేటెడ్ నైపుణ్యాలు అందించే విధంగా ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటున్నాయి. ఫలితంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, పోటీదారులకంటే ఒకడుగు ముందుండొచ్చనేది సంస్థల అభిప్రాయం. అభ్యర్థులు కూడా ట్రైనింగ్‌లో నేర్చుకున్న అంశాల ద్వారా మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. సర్టిఫికేషన్లు ఎన్నెన్నో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఇప్పుడు ఎన్నో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నికల్ కోర్సుల్లో సెంట్రల్ ఒకేషనల్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్, కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో.. విద్యార్థుల డొమైన్ అర్హతలకు ఆధారంగా పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఆయా రంగాలకు సంబంధించి- పరిశ్రమ వర్గాలతో ఒప్పందం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాటిని పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. వీటితోపాటు ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందాలు చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, సర్టిఫికెట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ సంస్థలు అందిస్తున్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ వివరాలు.. ఇన్ఫోసిస్: ఈ సంస్థ ఐటీ స్కిల్ డెవలప్మెంట్ కోసం సొంతంగా గ్లోబల్ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఐటీసీ: రిటైల్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీసీ సంస్థ- ఎన్ఐఎస్-స్పార్తా సంయుక్తంగా రిటైల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని బ్యాంకులు పలు ఇన్స్టిట్యూట్లతో కలిసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లు స్టాక్ మార్కెట్ నిర్వహణ సంబంధిత పలు షార్ట్ టర్మ్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. డొమైన్తోపాటు మరెన్నో స్కిల్స్ ఇటీవల కాలంలో సంస్థలు అభ్యర్థుల్లోని డొమైన్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా ఇతర అంశాలు వాటిలోని నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. దృక్పథం, నైతికత వంటి వాటికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇటీవల తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయా సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్ శాతాల గణాంకాలు.. ఇంటెగ్రిటీ అండ్ వ్యాల్యూస్: 30 శాతం రిజల్ట్ ఓరియెంటేషన్:21 శాతం బెటర్ ఆప్టిట్యూడ్: 12 శాతం కోర్ డొమైన్: 14 శాతం పీపుల్ స్కిల్స్ (కల్చరల్ డైవర్సిటీ, టీమ్ వర్క్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్): 23 శాతం ఇంటర్న్షిప్స్.. వే టు ఎంప్లాయ్మెంట్ కోర్సు వ్యవధిలో విద్యార్థులు చేసే ఇంటర్న్షిప్స్ వారి భవిష్యత్తు ఉపాధికి మార్గం నిలుస్తాయి. కానీ ఇప్పటికీ ఈ విషయంలో విద్యార్థుల్లో ఆశించిన అవగాహన ఉండట్లేదు. ఇన్స్టిట్యూట్ల స్థాయిలోనే వీటి ప్రాముఖ్యాన్ని తెలియజేసి ప్లేస్మెంట్ సెల్స్, ఇతర మాధ్యమాల ద్వారా అధ్యాపకులు, మేనేజ్మెంట్ వర్గాలు తమ విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను అందించాలి. ఇక విద్యార్థులు కూడా తమకున్న పరిచయాల ద్వారా ఇంటర్న్షిప్స్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితులపై అవగాహన కలుగుతుంది. కరిక్యులంలో భాగంగా లేని ఇంటర్న్‌షిప్ అనే పదం విద్యార్థుల రెజ్యుమేలో కనిపిస్తే కచ్చితంగా ఎంప్లాయర్స్ను ఆకర్షిస్తుంది. సదరు విద్యార్థికి ఇతరులకంటే ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. - బి. అశోక్ రెడ్డి, ప్రెసిడెంట్- కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సయంట్ అప్రెంటీస్‌షిప్‌తో ప్రయోజనాలెన్నో టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. పూర్తిస్థాయి ఉద్యోగుల మాదిరిగా విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సమయంలో సదరు విభాగాలపై పూర్తి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్, అది పూర్తయ్యాక నిర్వహించే ట్రేడ్ టెస్ట్ ప్రాధాన్యంపై అవగాహన ఉండట్లేదు. దీంతో మంచి అవకాశాలు చేజార్చుకుంటున్నారు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, ఎన్ఎస్డీసీ, ఏటీఐ వెబ్సైట్లను వీక్షిస్తే అందుబాటులో ఉన్న అప్రెంటీస్‌షిప్ సదుపాయాలు, ప్రయోజనాలు, దరఖాస్తు విధానాల వివరాలు తెలుస్తాయి. - కె.ఎస్.ఆర్. ప్రదీప్, డిప్యూటీ డెరైక్టర్, ఆర్డీఏటీ, హైదరాబాద్. స్కిల్స్‌తోపాటు పెరిగే అవకాశాలు విద్యార్థులు ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తే.. అంతే స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ప్రాక్టికల్స్, ప్రాక్టికాలిటీ అనే పదాలు కేవలం ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులకే పరిమితం కాదు. అన్ని కోర్సులు, రంగాల్లోనూ ఇప్పుడు ఎన్నో స్కిల్స్ అవసరమవుతున్నాయి. వీటిని గుర్తించి అకడమిక్ స్థాయి నుంచే సొంతం చేసుకునేలా వ్యవహరించాలి. మేనేజ్మెంట్కు సంబంధించి పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. - వి. పాండురంగారావు, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ -హైదరాబాద్ ఎడ్యు న్యూస్ ఇన్స్పైర్ స్కాలర్షిప్ - 2014 ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బీఎస్సీ (హానర్స్), నాలుగేళ్ల బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు అందించే ‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్హెచ్ఈ)’కు ప్రకటన వెలువడింది. వీటిని కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) అందిస్తోంది. ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ (ఇన్స్పైర్)’ పేరుతో ఈ స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. మొత్తం స్కాలర్షిప్స్: 10,000 స్కాలర్షిప్: ఏడాదికి రూ.60,000తోపాటు సమ్మర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం రూ.20,000 అందిస్తారు. ఇలా ఐదేళ్లపాటు స్కాలర్షిప్ ఇస్తారు. అర్హత: వివిధ రాష్ట్ర బోర్డులు, సెంట్రల్ బోర్డ్ 2014లో నిర్వహించిన ఇంటర్మీడియెట్/10+2 పరీక్షల్లో ఆయా రాష్ట్రాల్లో టాప్ వన్ పర్సంట్ జాబితాలో నిలవాలి. లేదా జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్/ఏఐపీఎంటీలో టాప్ 10,000 ర్యాంకుల్లో చోటు దక్కించుకుని ఉండాలి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ స్కాలర్షిప్, జగదీశ్ చంద్ర బోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ విజేతలు, ఇంటర్నేషనల్ ఒలంపియాడ్లో పతకాలు గెలుచుకున్నవారు కూడా స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జాతీయస్థాయి ప్రవేశపరీక్షల్లో విజయం సాధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైసర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ - సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్‌లో విద్యనభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. ప్రస్తుతం గుర్తింపు పొందిన యూనివర్సిటీ/కళాశాల/ఇన్స్టిట్యూట్లో నేచురల్/బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ/ బీఎస్సీ (హానర్స్)/నాలుగేళ్ల బీఎస్/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్/ఎంఎస్సీ కోర్సులు చదువుతుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014 వెబ్సైట్:www.inspire-dst.gov.in/ ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్ జర్మనీలో నిర్దేశిత యూనివర్సిటీల్లో ఎల్ఎల్ఎం (యూరోపియన్ లా) చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు అందించే జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ - ఏంజెలా మెర్కెల్ స్కాలర్షిప్కు ప్రకటన వెలువడింది. స్కాలర్‌షిప్‌తో లభించేవి: సుమారు ఏడాది వ్యవధి ఉండే కోర్సులో భాగంగా నెలకు 750 యూరోల స్టైఫండ్, రానుపోను విమాన ఖర్చులకు ట్రావెల్ అలవెన్స్, స్టడీ అండ్ రీసెర్చ్ సబ్సిడీ కింద 460 యూరోలు, ఆరోగ్య, ప్రమాద బీమా. వీటితోపాటు రెండు నెలల జర్మన్ లాంగ్వేజ్ కోర్సులో భాగంగా ఉచిత నివాసం, ఫీజు మినహాయింపు, అలవెన్స్‌లు లభిస్తాయి. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: జనవరి/ఫిబ్రవరి-2015లో న్యూఢిల్లీలో నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 1, 2014 వెబ్సైట్: www.daaddelhi.org/en/ మైకాలో పీజీడీఎం - కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌లోని ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (మైకా).. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్స్ (పీజీడీఎం-సి) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: క్యాట్-2014/ఎక్స్‌ఏటీ-2014, 2015/మ్యాట్-2014 /సీమ్యాట్- 2014/ఏటీఎంఏ-2014 వంటి పరీక్షల స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులకు గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.. దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15, 2015 వెబ్సైట్: www.mica.ac.in -
అధిక ఆదాయానికి... రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్!
సొంత ఇంటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. జీవితకాల ఆశయం. ఇందుకోసం కష్టపడి పైసాపైసా కూడబెడుతుంటారు. కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు సైతం తీసుకుంటారు. ఆధునిక కాలంలో మనుషుల జీవితాలు బిజీబిజీగా మారిపోయాయి. ఇంటి కోసం రోజుల తరబడి తిరిగే ఓపిక, తీరిక ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చే నిపుణులే.. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు. స్థిరాస్తి రంగం నానాటికీ అభివృద్ధి చెందుతుండడంతో కన్సల్టెంట్లకు చేతినిండా పని, జేబునిండా ఆదాయం లభిస్తున్నాయి. అవకాశాలకు కొదవ లేకపోవడంతో ఈ రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య భారీగా పెరుగుతోంది. బహుళ సేవలు అందించాలి దేశంలో జనాభా పోటెత్తుతుండడంతో నివాస గృహాల అవసరం అంతకంతకూ పెరిగిపోతోంది. నగరాలు, పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటోంది. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు స్థిరాస్తి సంస్థల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఇల్లు, స్థలాలు కొనడంతోపాటు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కన్సల్టెంట్లు సహకరిస్తారు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ సలహాలు సూచనలు ఇస్తారు. అంతేకాకుండా సైట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ వంటి బహుళ సేవలను అందించాల్సి ఉంటుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో కన్సల్టెంట్లకు సంతృప్తికరమైన వేతనాలు లభిస్తున్నాయి. సొంతంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధిక ఆదాయం ఆర్జించొచ్చు. దేశంలో ఇళ్ల కొరత ఉన్నంతకాలం అవకాశాలకు కొదవ ఉండదు. కావాల్సిన లక్షణాలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లకు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. భవిష్యత్తు అవసరాలను అంచనా వేయగలిగే నేర్పు అవసరం. ఏ ప్రాంతంలో రియల్ భూమ్ రానుందో ఊహించగలగాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ప్రారంభంలో కష్టపడి పనిచేస్తే తక్కువ కాలంలోనే ప్రొఫెషనల్ కన్సల్టెంట్‌గా వృత్తిలో స్థిరపడొచ్చు. అర్హతలు: భారత్‌లో రియల్ ఎస్టేట్‌పై గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టోరల్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు దూర విద్య, ఆన్లైన్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు గ్రాడ్యుయేషన్‌లో చేరొచ్చు. వేతనాలు: రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభిస్తే ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం అందుతుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. నెలకు రూ.లక్షకు పైగానే ఆర్జించే కన్సల్టెంట్లు ఉన్నారు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఏ ఆర్ఐసీఎస్ స్కూల్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్-అమిటీ యూనివర్సిటీ; వెబ్సైట్: www.ricssbe.org ఏ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్: www.iire.co.in ఏ ఎన్ఐఆర్ఈఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.nirem.org ఏ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ; వెబ్సైట్: ఠీఠీఠీ.జీటఛ.్ఛఛీఠ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ వెబ్సైట్: http://iref.co.in/ మంచి భవిష్యత్తు ఉన్న కెరీర్ శ్రీముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీని యువత తమ కెరీర్‌గా ఎంపిక చేసుకుంటోంది. కన్సల్టెంట్లపై భరోసాతో రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ మొదలైంది. గ్రాడ్యుయేషన్‌తోపాటు మార్కెటింగ్‌పై అనుభవం ఉన్నవారు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్థిరాస్తి రంగంలో భవిష్యత్తులో యువతకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. మార్కెట్‌ను అంచనా వేయగల సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ సొసైటీలో మారుతున్న ట్రెండ్స్, ప్రజల అభిరుచిని గమనించగల నైపుణ్యాలు ఉంటే కన్సల్టెంట్‌గా రాణించొచ్చు. ప్రారంభంలో నెలకు రూ.10 వేలకుపైగా వేతనం, ఒక్కో ప్రాజెక్ట్‌లో 2-3 శాతం చొప్పున కమీషన్ పొందొచ్చ్ణు -ఇంద్రసేనారెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్ ఎడ్యూ న్యూస్: ‘ఐడియా’ ఇవ్వండి... రూ.లక్షలు గెలుచుకోండి! మీరు మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటున్నారా? ఉత్పత్తులు మొదలుకొని సర్వీసుల వరకూ...వ్యాపారంలోని ఏ విభాగంలోనైనా రాణించగలిగే సత్తా మీకుందని భావిస్తున్నారా? అయితే మీ లాంటి వారికోసమే ఐఐటీ-ఖరగ్‌పూర్ ఏటా ‘ఎంప్రిసేరియో’(Empresario) పేరుతో ఎందరో ఔత్సాహికులను వెలుగులోకి తెస్తోంది. మంచి వ్యాపార ఆలోచన(బిజినెస్ ఐడియా)ను ఇచ్చి, సుమారు రూ. 15 లక్షలకు పైగా విలువైన బహుమతులను గెలుచుకొనే సువర్ణావకాశం కూడా కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మోడల్ కాంపిటీషన్(ఐబీఎంసీ) సహకారంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ ‘ఎంప్రిసేరియో’ను నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనాలనుకునేవారు తమ వద్దనున్న ఐడియాతో http://www.ecell-iitkgp.org/empresario/వెబ్సైట్లో అక్టోబర్ 20లోగా నమోదు చేసుకోవాలి. కార్యక్రమానికి ఎంపికైనవారికి మెంటార్షిప్ లభిస్తుంది. విజేతలు నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ లాంటి ప్రముఖ సంస్థల ఎదుట ‘ఐడియా’ను వివరించే అవకాశం ఉంటుంది. ఐఐటీ-బాంబేలో ‘ఇ-యంత్ర’ ఐఐటీ-బాంబే ప్రాజెక్ట్ ఇ-యంత్ర పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్‌లో ప్రతిభావంతులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 1, 2014న ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 800 టీమ్‌లు (3200 వందల మంది విద్యార్థులు) నమోదు చేసుకున్నాయి. ఆన్లైన్ టెస్టు ద్వారా ఎంపికైన ఒక్కో టీమ్‌కు సమస్యతో కూడిన థీమ్‌ను ఇస్తారు. రోబోటిక్ కిట్‌ను కూడా ఉచితంగా అందజేస్తారు. దీని సహాయంతో కేటాయించిన థీమ్‌ను పూర్తి చేయాలి. ఇందుకోసం ఔత్సాహికులు ఎలాంటి ఫిజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘ఇ-యంత్ర’ ప్రాజెక్టులో పాల్గొనాలనుకునే వారు ఆగస్టు 31లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్: http://portal.e-yantra.org/eyrc ‘నాక్’లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)లో రెగ్యులర్ పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మేనే జ్మెంట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాతపరీక్ష, ఇంటర్య్వూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బీఈ/బీటెక్ -సివిల్, మెకానికల్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. సెప్టెంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11న ఉదయం రాతపరీక్ష, సాయంత్రం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000, ట్యూషన్ ఫీజు రూ.లక్ష(సర్వీస్ ట్యాక్స్ అదనం). వెబ్సైట్: www.nac.edu.in జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ఆఫీసర్స్ క్యాడర్, నాన్ టీచింగ్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: ఊ ప్రిన్సిపాల్ ; ఊ టెక్నికల్ ఆఫీసర్ ; ఊ అసిస్టెంట్ ; ఊ అప్పర్ డివిజనల్ క్లర్క్ ఊ లోయర్ డివిజనల్ క్లర్క్ ; ఊ హిందీ ట్రాన్స్‌లేటర్ ; ఊ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - 2 అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్: www.kvsangathan.nic.in కోల్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీస్ కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజ్మెంట్ ట్రైనీస్ విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, మైనింగ్ అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణత. ఎంపిక: గేట్ - 2015 స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా గేట్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1, 2014 నుంచి అక్టోబరు 1, 2014 దరఖాస్తు: గేట్ - 2015 స్కోరు వచ్చిన తర్వాత www.coalindia.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గేట్ వెబ్సైట్: http://gate.iitk.ac.in/ ఎస్బీఐ అసోసియేట్స్ బ్యాంకుల్లో 2986 పీవోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అసోసియేట్స్ బ్యాంక్స్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రొబేషనరీ ఆఫీసర్; పోస్టుల సంఖ్య: 2986 బ్యాంకుల వారీగా పోస్టులు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 350, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 900, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 500, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా 100, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ 1136 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబరు 1 నుంచి 18 వరకు వెబ్సైట్: www.sbi.co.in పీజీ డిప్లొమా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. కోర్సుల వివరాలు: ఏ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ ఏ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అర్హత: బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి; దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా చివరి తేది: సెప్టెంబర్ 10; వెబ్సైట్: http://calicut.nielit.in/ -
కాలేజీ కుర్రకారుకు ‘ఆప్స్’ మిత్రులు!
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే రకరకాల ‘సెట్’లలో మంచి ర్యాంకు సాధించి, కోరుకున్న కాలేజీలో అడుగుపెడుతుంటారు విద్యార్థులు. చేరిన కోర్సు ఏదైనా, క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు మరెన్నో నైపుణ్యాలను అలవరచుకోవాలి. వీటితో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ, రోజువారీ ఖర్చులపై నియంత్రణ వంటివీ అవసరమే! ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే వారు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రకరకాల మొబైల్ అప్లికేషన్స్ (ఆప్స్) చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ఆప్తమిత్రులుగా మారుతున్నాయి.. ఒకప్పుడు మొబైల్ అంటే మాట ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది ‘స్మార్ట్ ఫోన్’గా ముస్తాబై భిన్న అవసరాలను తీరుస్తూ యువత మనసులో చోటుసంపాదిస్తోంది. మొబైల్ ఫోన్లతో మైత్రీ బంధం పెంచుకొని, కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే రకరకాల మొబైల్ ఆప్స్ అందుబాటులోకి వస్తున్నాయి.. మన పీఏ.. మన చేతిలో.. రోజులో ఏ సమయానికి ఏది చదవాలి? తరగతిలో ఏ రోజు ఏం చెప్పారు? ఏ రోజు ఎక్కడికెళ్లాలి? రికార్డు రూపకల్పనకు అవసరమైన సరంజామా ఏమిటి? అవి ఎక్కడ దొరుకుతాయి? ఇలా రకరకాల పనుల్లో సహకరించి, విద్యార్థి జీవితం సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఆప్స్ మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇవి విద్యార్థికి వ్యక్తిగత సహాయకులుగా సేవలందిస్తున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు, అవసరమైన సేవలు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. మచ్చుకు కొన్ని ఆప్స్: Everynote, Colornote, Fancy Hands, Springpad. నైపుణ్యాలు పెంచుకో! కాలేజీ నుంచి బయటికొచ్చిన తర్వాత కెరీర్లో సుస్థిర స్థానం సంపాదించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అకడమిక్ స్కిల్స్ బాగున్నా.. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే కెరీర్లో వెనక వరుసలో ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం కమ్యూనికేషన్లో ఆంగ్ల భాష కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కొత్త ఆంగ్ల పదాలను నేర్చుకుంటూ, పద సంపదపై పట్టు సాధించేందుకు ఉపయోగపడే అనేక ఆప్స్ అందుబాటులో వచ్చాయి. వీటితో పాటు ఉద్యోగ నియామకాల పరీక్షల్లో కీలక విభాగమైన రీజనింగ్‌ను ఒంటబట్టించుకునేందుకు ఉపయోగపడే ఆప్స్ కూడా ఉన్నాయి. Ex: Vocab Pro, Logical Test, Easy Vocab, Reasoning Refresher. ఖర్చులకు కళ్లెం! పైసా సంపాదించడం కంటే దాన్ని ఎలా వినియోగిం చారన్న దానిపైనే ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ సక్రమంగా లేకుంటే జీవితంలో పైకి ఎదగలేం! సంపాదన ఎంత? ఖర్చు చేస్తున్నది ఎంత? వీటి మధ్య సమన్వయం చాలా ముఖ్యం. సంపాదనకు, ఖర్చులకు పొంతన కుదిరేలా సరైన ప్రణాళికను రూపొందించుకునేందుకు ఉపయోగపడే ఆప్స్ చాలానే ఉన్నాయి. ఇవి అందుబాటులో ఉన్న డబ్బు; బట్టలు, ఆహారం, ప్రయాణం.. ఇలా రోజువారీ అవసరాలకు ఖర్చయ్యే మొత్తం, మిగి లిన మొత్తం.. తదితర వివరాలను సంగ్రహ పరి చేందుకు ఉపకరిస్తాయి. గ్రాఫ్స్ రూపంలో తేలి గ్గా అర్థమయ్యేలా చూపించి బడ్జెట్‌ను రూపొందించుకునేందుకు ఉపయోగపడతాయి. Ex: Track My Budget, My Budget Book, Pocket Budget సామాజిక అనుసంధానత విద్యార్థులకు ఉపయోగపడే సామాజిక అనుసంధాన అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇవి బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటానికి ఉపయో గపడతాయి. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో పాటు టెక్ట్స్ మెసేజ్‌లు, ఫొటోలు పంపించేందుకు ఉపయోగపడతాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉన్న ఓ ఐటీ విద్యార్థి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సందే హం తలెత్తితే ఢిల్లీలోని తన స్నేహితుడితో చాటింగ్ చేస్తూ నివృత్తి చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఉపయోగాలుంటాయి. Ex: Viber, Whatsapp, Hike, Skype, Wechat ఆరోగ్యమే మహా భాగ్యం పుస్తకాల ముందు కూర్చొని, గంటల తరబడి పూర్తిగా వాటికే అతుక్కుపోవడం వల్ల లాభం లేదు. రాత్రీపగలూ కష్టపడి చదివిన ఓ విద్యార్థి తీరా పరీక్షల సమయానికి అనారోగ్యానికి గురైతే పరిస్థితి? అందుకే విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి సహకరించే ఆప్స్ చాలానే ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించేది పౌష్టికాహారం. తీసుకునే ఆహారంలో కేలరీలు, వ్యాయామం చేసిన సమయం, ఖర్చయిన కేలరీలు, నడిచిన దూరం.. ఇలాంటి విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని, విశ్లేషించి చూపే ఆప్స్ ఉన్నాయి. Ex: Map My Fitness, Calorie Counter, Cardio Trainer, Slice it. మొబైలే.. విద్యార్థులకు హ్యాండ్‌బుక్! శ్రీప్రపంచీకరణ నేపథ్యంలో సెల్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించడం కష్టమే. గతంలో సంభాషణకు మాత్రమే వినియోగించే మొబైల్ ఇప్పుడు స్టూడెంట్ కరదీపికగా మారుతోంది. పాటలు, ఆటలతో ఆగిపోకుండా విద్యార్థులకూ హ్యాండ్‌బుక్‌గా పనిచేస్తోంది. ఎన్నో ఎడ్యుకేషన్ అప్లికేషన్లు నిక్షిప్తం చేసుకుని విద్యార్థి లోకానికి విశేష సేవలందిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఆప్‌స్టోర్ తదితర ఆన్లైన్ స్టోర్లలో వివిధ రకాల ఆప్స్ కొలువుదీరాయి. క్విజ్ లు, మాక్‌టెస్ట్‌లు, డిక్షనరీలు, స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్ లెర్నింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌తోపాటు సాధారణ పోటీ పరీక్షల మెటీరియల్ నుంచి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ వరకు స్టడీ మెటీరియల్స్ పొందుపర్చిన అప్లికేషన్ల్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సీ, సీ++, జావా తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లెర్నింగ్‌కు కూడా ప్రత్యేక ఆప్‌లు వెలిశాయి. స్టడీ మెటీరియల్‌కు సంబంధించి ప్రధానంగా మూడు రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. అవి... టెక్ట్స్‌వల్, ఆడియో, వీడియో కంటెంట్. టెక్ట్స్‌వల్ మెటీరియల్ పొందుపర్చిన అప్లికేషన్ల ద్వారా పుస్తకాల్లో చూసినట్లుగా చదువుకోవచ్చు. ప్రొఫెసర్లు బోధించే పాఠాలను రికార్డ్ చేసి వాటిని ఆడియో రూపంలో అందించే ఆప్స్ కూడా ఉన్నాయి. అలాగే రికార్డెడ్ వీడియో లెక్చర్స్, ఆన్లైన్ లెక్చర్స్‌ను కూడా కొన్ని ఆప్స్ అందిస్తున్నాయి. ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లకు కూడా ప్రత్యేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. నిర్దిష్ట ప్రశ్నలతో పరీక్షలు రాస్తూ తప్పుగా సమాధానాలు రాసిన ప్రశ్నలకు అక్కడికక్కడే వివరణలు పొందొచ్చు. కొన్ని సంస్థలు మొబైల్ విధానంలోనూ ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నాయ్ణి - బి.వంశీకృష్ణారెడ్డి, సీఈఓ, బ్రేవ్మౌంట్ ఐటీ సొల్యూషన్స్, హైదరాబాద్ -
పనిచేసేచోట కమ్యూనికేషన్ ఇలా..
కార్యాలయంలో ఉత్పత్తి పెరగాలంటే, పై అధికారులతో, సహచరులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలి. దీనికోసం ఉద్యోగులు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకోవడం మేలు. ఇందుకోసం ఏం చేయాలంటే.. ఇతరులను పరిశీలించండి ఆఫీస్‌లో సహచరులను మెప్పించేలా మాట్లాడాలంటే.. మొదట వారు ఎలా మాట్లాడుతున్నారో పరిశీలించి, అర్థం చేసుకోవాలి. వారి కమ్యూనికేషన్ విధానాన్ని తెలుసుకోవాలి. తదనుగుణంగా సంభాషించాలి. ఉదాహరణకు ఒకరు నేరుగా విషయంలోకి రావడాన్ని ఇష్టపడతారు. మరొకరు మొదట ఏదైనా మాట్లాడిన తర్వాతే అసలు విషయంలోకి దిగుతారు. వ్యక్తుల కమ్యూనికేషన్ స్టైల్‌ను తెలుసుకొని, వారితో అలాగే మాట్లాడితే సంభాషణ విజయవంతమవుతుంది. స్పష్టత, కచ్చితత్వం, సంపూర్ణం మన మాట అవతలివారికి సరిగ్గా అర్థం కాకపోతే అనర్థాలు తలెత్తుతాయి. కాబట్టి చెప్పే విషయంలో స్పష్టత, కచ్చితత్వం ఉండాలి. అసంపూర్తిగా కాకుండా సంపూర్ణంగా చెప్పేయాలి. ఆఫీస్‌లో సంభాషణల ప్రధాన ఉద్దేశం.. పని సక్రమంగా జరగడం, తద్వారా ఉత్పత్తి పెరగడం. కమ్యూనికేషన్ అనేది రాతపూర్వకంగా లేదా మాటల ద్వారా.. ఎలాగైనా కావొచ్చు. కానీ, చెప్పే విషయంలో స్పష్టత తప్పనిసరి. మీరిచ్చే సమాచారం లేనిపోని గందరగోళానికి దారితీసేలా అస్పష్టంగా ఉండకూడదు. సందర్భానికి తగిన మాధ్యమం.. : కమ్యూనికేషన్లో సందర్భానికి తగిన మాధ్యమాన్ని ఎంచుకోవాలి. సందేశం క్లుప్తంగా ఉండి, అవతలివారికి త్వరగా చేరవేయాలనుకుంటే ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. ఎక్కువ సేపు విపులంగా చర్చించాలనుకుంటే వ్యక్తిగతంగా సమావేశమవ్వాలి లేదా ఫోన్లో మాట్లాడాలి. కాంట్రాక్ట్‌లు, ఒప్పందాలు వంటి కీలకమైన విషయాలు రాతపూర్వకంగా సాగాలి. శరీరమూ మాట్లాడాలి మన భావాన్ని మాటలతోనే కాదు శరీర కదలికలతోనూ చెప్పొచ్చు. దీన్నే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ శరీర భంగిమలను పరిశీలించుకోండి. మిమ్మల్ని చూస్తే వారికి ప్రతికూల భావం కలగకుండా ప్రొఫెషనల్‌గా వ్యవహరించండి. వారిని ఆకర్షించే చక్కటి బాడీ లాంగ్వేజ్‌ను ప్రదర్శించండి. ఒక సమయంలో ఒకేపని ఈ-మెయిల్ చూస్తూ ఫోన్లో మాట్లాడటం వంటి ఏకకాలంలో బహుళ కార్యాలకు స్వస్తి చెప్పండి. లేకుంటే దేనికీ సరైన న్యాయం చేయలేరు. వినే అలవాటు ఉందా? ఇరువురి మధ్య భావ ప్రసారానికి ప్రధానంగా కావాల్సింది.. ఓపిగ్గా వినే అలవాటు. ఇతరులు చెప్పేది పూర్తిగా వినే లక్షణం చాలా ముఖ్యం. ఎడ్యూ న్యూస్: సీఎఫ్ఆర్డీ.. ఓయూ క్యాంపస్ సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని సెంట్రల్ ఫెసిలిటీస్ ఫర్ రీసెర్చ అండ్ డెవలప్మెంట్(సీఎఫ్ఆర్డీ) విభాగంలో గురువారం ‘‘ లేటెస్ట్ సైంటిఫిక్ ప్రొడక్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎగ్జిబిషన్-2014’ నిర్వహించారు. యూనివర్సిటీలో తొలిసారి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయాలజీ తదితర అంశాల్లో పరిశోధన చేస్తున్న వారికి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్న పలు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. సీఎఫ్ఆర్డీలోని పరిశోధనశాలలోకి కేవలం ఓయూ విద్యార్థులే కాకుండా బయటి కళాశాలల యువ పరిశోధకులు, పరిశ్రమ వర్గాలకు కూడా ప్రవేశం ఉన్నట్లు సంస్థ డెరైక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని పలుకళాశాలలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వివరాలకు cfrd.osmania.ac.in సంప్రదించవచ్చు. -
సిటీ స్టూడెంట్స్.. కోరికల చిట్టా!
నగరంలోని ప్రముఖ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సంప్రదాయ కోర్సుల్లో చదివేవారు కొందరైతే.. విభిన్న కోర్సులను ఎంపిక చేసుకొని వైవిధ్యమైన కెరీర్లో అడుగుపెట్టేవారు మరికొందరు. తమ అభిరుచులకు, ఆసక్తులకు పెద్దపీట వేస్తూ వినూత్న పంథాలో దూసుకెళ్తున్న సిటీ స్టూడెంట్స్.. విద్యావిధానంలో తామేం కోరుకుంటున్నారో కుండబద్ధలు కొడుతున్నారు. కొత్త విద్యాసంవత్సరంలో సిటీ విద్యార్థుల ఆలోచనలేంటో చూద్దాం.. ప్రవేశ పరీక్షల సంఖ్య తగ్గాలి! ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో చేరాలంటే.. ఆయా బోర్డులు, విద్యాసంస్థలు నిర్వహించే అనేక ప్రవేశ పరీక్షలను రాయాల్సిందే. పలు పరీక్షల సిలబస్‌లో వ్యత్యాసాలు, పరీక్ష విధానాల్లో తేడా ఉండడంతో విద్యార్థి దేనిపైనా సరిగ్గా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. అందుకే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకే నగర విద్యార్థి మొగ్గు చూపుతున్నాడు. ‘ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఎంసెట్, జేఈఈ-మెయిన్, బిట్‌శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాశాను. వివిధ రకాల ఎంట్రెన్స్‌లు, వాటి విభిన్న సిలబస్‌లను ఒకే సమయంలో సన్నద్ధమవడం కష్టమైంది. పరీక్ష తేదీలు కూడా వారం రోజుల వ్యవధిలోనే ఉండడం వల్ల ఆందోళన చెందాను. ఫలితంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాను. ఎంసెట్ ప్రిపరేషన్కైనా ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుండేదనిపించింది’ అని ఇంజనీరింగ్‌లో చేరాలనుకుంటున్న కీర్తిరెడ్డి చెప్పాడు. ఉమ్మడి ఎంట్రెన్స్తోపాటు కామన్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రవేశ పెట్టాలని సిటీ విద్యార్థులు కోరుకుంటున్నారు. ఆన్లైన్ రిసోర్సెస్: క్లాస్ రూమ్ పాఠాలకు ఆన్లైన్ గెడైన్స్ కూడా తోడైతే అకడమిక్‌గా మంచి ఫలితాలను సాధించొచ్చు. యూనివర్సిటీలు, కళాశాలలు సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్ని, ప్రిపరేషన్ మెళకువలను కూడా ఆన్లైన్లో పొందుపరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం విద్యార్థి లోకంలో వ్యక్తమవుతోంది. ‘ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, గెడైన్స్, మాక్, ఆన్లైన్ పరీక్షలు చాలా వెబ్సైట్లలో లభిస్తున్నాయి. అలాగే ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన మెటీరియల్, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గెడైన్స్, మాదిరి ప్రశ్నలు, సంబంధిత మెటీరియల్‌ను అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’ అని ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతున్న వై.హర్షిత్ తెలిపాడు. ప్రమాణాలు పాటించాలి: రాష్ట్రంలో కళాశాలల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. నాణ్యమైన విద్యనందించే విద్యాసంస్థల కొరత మాత్రం అలాగే ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, ప్రముఖ విద్యాసంస్థలు మినహా చాలా కాలేజీలు కనీస ప్రమాణాలను కూడా పాటించడంలో విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల నుంచి ఆదరణ లేక సీట్ల భర్తీకి కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నాయి. ‘ఎంసెట్ ర్యాంకులు పొందిన తర్వాత రోజు నుంచే కన్సల్టెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నారు. తాము సూచించిన కాలేజీలో చేరాలని కోరుతున్నారు. కన్వీనర్ కోటా కంటే తక్కువ ఫీజులకే అడ్మిషన్ ఇప్పిస్తామని, ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు’ అని ఇంజనీరింగ్ ఔత్సాహిక విద్యార్థి జె.శ్రీధర్ తెలిపాడు. తగిన మౌలిక సదుపాయాలను కల్పించి, బోధన, ప్రయోగశాలల్లో నాణ్యతను పాటిస్తే.. విద్యార్థులే కళాశాలను వెతుక్కుంటూ వెళ్తారని స్టూడెంట్స్ పేర్కొంటున్నారు. అన్ని సదుపాయాలుంటేనే కొత్త కళాశాలలు, కోర్సులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీ రిలవెంట్ సిలబస్: యూనివర్సిటీలు మారుతున్న జాబ్‌మార్కెట్‌కు అనుగుణంగా కరిక్యులంలో మార్పులు తీసుకురావాలి. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలో దాన్ని రూపొందించాలి. బోధన కూడా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఉండాలి. కరిక్యులాన్ని పక్కాగా ప్రిపేర్ అయితే జాబ్ సొంతమవుతుందనే నమ్మకం ఉండాలి అని పలువురు అభిప్రాయ పడ్డారు. ‘కోర్సులో భాగంగా అభ్యసించే సబ్జెక్టులకు, ఆ తర్వాత చేసే కొలువుకు సంబంధం ఉండదని అంటున్నారు. ఎలాంటి ఉద్యోగానికైనా ఉపయుక్తంగా ఉండేలా కరిక్యులంను రూపొందిస్తే ఆ సమస్య ఉండదు కదా!’ అంటున్నాడు బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న కిశోర్. అదేవిధంగా కాలేజ్-ఇండస్ట్రీ సంయుక్తంగా కోర్సులను ఆఫర్ చేస్తే మరింత మేలు జరుగుతుందని ఎక్కువ మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్న్షిప్స్: ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తే మంచి అవకాశాలుంటాయి.. భవిష్యత్తు లో చేరబోయే కంపెనీలో పని వాతావరణాన్ని ముందే తెలుసుకోవచ్చు.. ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది. లోటుపాట్లను సవరిం చుకుని అకడమిక్‌గా మరింత రాణించొచ్చు- అనేది విద్యార్థులకు నిపుణులు తరచూ ఇచ్చే సలహా. ‘ఇంటర్న్‌షిప్ విషయంలో విద్యార్థులకు సరైన సమాచారం అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయంలో కళాశాలలు, కంపెనీలు విద్యార్థులకు తగిన తోడ్పాటునందించాలి. విద్యార్థుల అవసరాల రీత్యా ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేయడానికి కంపెనీలు ముందుకు రావాలి’ అని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రెహానా పేర్కొన్నారు. దరఖాస్తులు-ఫీజులు: మంచి కళాశాలలో చేరాలంటే.. మధ్యతరగతి విద్యార్థికి తలకు మించిన భార మవుతోంది. రకరకాల ఎంట్రెన్స్‌లు, దరఖాస్తు రుసుముల దగ్గర్నుంచి అడ్మిషన్ ఫీజులు, కోర్సు ఫీజులు, ఆ తర్వాత పరీక్ష ఫీజుల వర కూ.. విద్యార్థులు పలు రకాల ఫీజులను చెల్లించాల్సి వస్తోంది. ఇక ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, ఫ్యాషన్ తదితర కోర్సుల ఫీజుల గురించి తెలిసిందే. కాబట్టి విద్యార్థులపై భారం తగ్గించాలని, తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్య లభించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి! సిటీ స్టూడెంట్స్‌లో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే. వారు ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. నగరంలో అందుబాటులో ఉన్న అవకాశాల సమాచారాన్ని తెలుసుకోవాలి. తక్కువ ఫీజులకే కోర్సులను ఆఫర్ చేస్తున్న రామకృష్ణ మఠ్ వంటి వాటిలో చేరి నైపుణ్యాలను పెంచుకోవచ్చు. అలాగే నగరంలో అందుబాటులో ఉన్న గ్రంథాలయాలు, కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థలపై అవగాహన పెంచుకోవాలి. చదువుతోపాటే ఇతర స్కిల్స్‌నూ వృద్ధి చేసుకోవాలి. - జి. సుధాకర్ సైకాలజీ విద్యార్థి, నిజాం కళాశాల విద్యార్థినులకు భద్రత కావాలి! సిటీలో విద్యార్థినులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. వారి భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మహిళలకు కేటాయించిన ఆర్టీసీ బస్సుల సంఖ్యను కళాశాలల సమయా ల్లో పెంచాలి. కోర్సులు, ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేలా కళాశాలలు చర్యలు తీసుకోవాలి. - సయేదా హఫ్సా ఫాతిమా, బీకామ్ హానర్స్ ఫైనల్ ఇయర్, కోఠి ఉమెన్స్ కళాశాల -
లక్ష్య సాధనకు తపనే ఊపిరి!
ఇష్టమైన కొలువును సాధించాలంటే కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. రెజ్యుమె ఘనంగా ఉంటే ఉద్యోగం ఖాయమనుకోవడం పొరపాటే. మార్కుల కంటే ముఖ్యమైన లక్షణాలు విద్యార్థుల్లో ఉండాలి. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో వీటికే పెద్దపీట వేస్తున్నాయి. మౌఖిక పరీక్షల్లో.. అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తారు. కాబట్టి అలాంటి లక్షణాలను తప్పనిసరిగా పెంపొందించుకోవాలి. అందుకు తగిన కృషి నిరంతరం చేయాలి. మనిషిలో నిజంగా తపన ఉంటే కోరుకున్నది సాధించడం కష్టమేమీ కాదు. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్: సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై పట్టు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి వాటితో కార్పొరేట్ సంస్థల్లో అప్పగించిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూలో టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు వారి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేశారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్ని ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు సమయానికి ఇచ్చిన ప్రాముఖ్యతను ప్రాధాన్యతా క్రమంలో వివరించాలి. ఇలా చెప్పినప్పుడు అభ్యర్థికి సమయపాలనపై అవగాహన ఉందని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు తెలుస్తుంది. తోటి విద్యార్థులతో కలిసి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినప్పుడు మీరు అనుసరించిన ప్రణాళికను వివరించవచ్చు. కాలపరిమితిపై విద్యార్థులు చక్కని అవగాహ నతో ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌కు సాఫ్ట్ స్కిల్స్‌తో దగ్గరి సంబంధం ఉంది. కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా అభ్యర్థుల వ్యక్తిత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, సానుకూలంగా మాట్లాడటం, ఆశావహ దృక్పథం, నమ్మకం, ఎదుటివారి కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడటం, బృందంలో మాట్లాడటం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం వంటి నైపుణ్యాలను ఇంటర్వ్యూల్లో పరిశీలిస్తారు. ఒక విద్యార్థిలో చక్కటి వ్యక్తిత్వం ఉంటేనే తదుపరి ప్రశ్నలు వేయడానికి సుముఖత చూపుతారు. వ్యక్తిత్వంలో భాగంగా అంకితభావం ప్రదర్శించడం, మృదు స్వభావం, చిరునవ్వు, అర్థం చేసుకుంటూ వినడం, చక్కని శరీర భాష, సమయస్ఫూర్తిని ప్రదర్శించడం వంటి లక్షణాల ద్వారా ఎదుటివారు ఆకర్షితులవుతారు. వ్యక్తిత్వం అనేది అభ్యర్థిలో రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు. కాబట్టి మంచి లక్షణాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలి. ఇందుకోసం తగిన కృషి అవసరం. నిత్య విద్యార్థిగా మారాలి: నేర్చుకోవాలన్న తపన మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ‘నేను నిత్య విద్యార్థిగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ అంటూ స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్యార్థి దశలో కొత్త విషయాలను నేర్చుకొనేందుకు ప్రయత్నించాలి. బలమైన తపన ఉన్నప్పుడే లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. తపనను లక్ష్యానికి ఊపిరిగా పేర్కొనవచ్చు. తాము ఎంపిక చేసుకొనే అభ్యర్థిలో కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? లేదా? అనే విషయాన్ని కార్పొరేట్ సంస్థలు చూస్తాయి. మీ లక్ష్యం ఏమిటి? నాలుగైదేళ్లలో ఏ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నారు? వంటి ప్రశ్నలను ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరిచ్చే సమాధానాల ద్వారా.. మీకున్న అంకితభావం, తపన ఇట్టే తెలిసిపోతాయి. నమ్మకాన్ని నమ్ముకోవాలి: నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమవుతుందంటారు. నమ్మకం రెండు రకాలు. తమపై తమకు నమ్మకం, ఎదుటి వ్యక్తులపై నమ్మకం. నమ్మకానికి వ్యక్తి ఆలోచనే పునాదిగా చెప్పుకోవచ్చు. తనలోని ఆలోచనలపై పట్టు కొనసాగిస్తూ, ఎదుటివారికీ అంతే పట్టుతో సమాధానం చెప్పగలగాలి. అంతేకాదు ఇతరులను నమ్మడం ద్వారా బృందంలో పనిచేసేటప్పుడు లక్ష్య సాధనకు మార్గం సుగమమవుతుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అభ్యర్థుల్లో నమ్మకాన్ని పరీక్షిస్తారు. కొన్ని సమయాల్లో చెబుతున్న సమాధానాలు తప్పే అని తెలిసినప్పటికీ మీరు ఎంత నమ్మకంగా చెబుతున్నారు అనేది పరీక్షిస్తారు. అంతేకాదు అభ్యర్థులు తమ తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసేవారు ప్రశంసిస్తారు. కలివిడితనంతో కలుగును మేలు: ప్రాజెక్ట్‌ల్లో పనిచేసేటప్పుడు కొన్నిసార్లు ఒక్కరే కాకుండా ఇతరులతో కలిసి బృందంగానూ పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాన్ని విద్యార్థులు కళాశాలలో ఉన్నప్పుడే అలవర్చుకోవాలి. ప్రాజెక్ట్‌ల్లో భాగంగా రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. బృందంలోని ఇతర సభ్యులతో స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా వ్యవహరిస్తే త్వరగా నిలదొక్కుకుంటారు. ఒక బృందంలో పని చేసినప్పుడు ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం, ప్రతిస్పందించడం వంటి లక్షణాలతో వారిని ఇట్టే ఆకట్టుకోవచ్చు. ఎదుటివారు చెప్పిన విషయాలకు సానుకూలంగా ప్రతిస్పందించడం వల్ల మీపై వారికి గౌరవం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని సంస్థ యాజ మాన్యానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. బృందంలో పని చేసేటప్పుడు కాలానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకు, మీ సంస్థకు చెడ్డపేరు రావొచ్చు. కాబట్టి బృందంలో పని చేసిన అనుభవాన్ని ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. ఇందుకోసం విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. వీటిలో మీ పాత్ర ప్రశంసనీయంగా ఉండాలి. మీరు తోటి విద్యార్థులతో కలిసి ఎంత విలక్షణంగా, సృజనాత్మకంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు అనేది ఉదాహరణలతో సహా వివరించాలి. బృందంలో పనిచేసినప్పుడు మీరు ఆచరించిన ప్రణాళిక, ఎదుర్కొన్న ఇబ్బందులు, సమయానికి ఇచ్చిన ప్రాధాన్యత వంటి వాటిని ప్రస్తావించాలి. సమూహాల్లో పనిచేసే తత్వానికి ప్రాంగణ నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇతర సభ్యులతో కలిసి పని చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయి. నాయకత్వ లక్షణాలకు మూలం సవాళ్లను ఎదు ర్కొనే ధైర్యం ఉండడం. ఒక విద్యార్థి ఏ సమయంలోనైనా సవాళ్లను ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటేనే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలు గుతాడు. -
విజయం.. ఒక నిరంతర ప్రయాణం..
లక్ష్యాలు, విజయాలకు వారధి.. క్రమశిక్షణ మనం ఏర్పరచుకునే లక్ష్యాలు అస్పష్టంగా కాక, స్పష్టంగా కొలవగలిగేలా (న్యూమరికల్ వాల్యూస్) ఉండాలి. క్షణక్షణం విజయాన్ని శ్వాసించండి.. విజయం అనేది ఒక గమ్యం కాదు.. విజయం ఒక నిరంతర ప్రయాణం. జీవితంలో మీరేం కావాలనుకుంటున్నారు? ఇదే ప్రశ్నను మరోలా అడుగుతాను.. దానివల్ల లక్ష్య నిర్దేశానికి (గోల్ సెట్టింగ్) అవసరమైన సంపూర్ణమైన, స్పష్టమైన దృశ్యం మీ కళ్లముందు కనిపిస్తుంది! ఆ ప్రశ్న ఏంటంటే.. ‘మిమ్మల్ని అందరూ ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?’ The 7 Habits of Highly Effective people (అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఏడు అలవాట్లు).. పుస్తక రచయిత స్టీఫెన్ ఆర్.కవీ ఏమంటారంటే.. ‘థింక్ ది ఎండ్ ఇన్‌ది బిగినింగ్ (అంతం మీద ధ్యాసతో ఆరంభం)’ . దీన్ని మీ కెరీర్‌కు అన్వయించుదాం..! ఈ రోజు మీరు ఇంజనీరింగ్ కోర్సులో చేరారు.. మీరిప్పుడు ఇలా ఆలోచించాలి.. ‘ఈ కోర్సు పూర్తయి, నేను క్యాంపస్‌ను వదిలి వెళ్లిన తర్వాత నన్ను అందరూ ఎలా గుర్తుంచుకోవాలి?’. ఇదే ‘థింక్ ది ఎండ్ ఇన్‌ది బిగినింగ్’. ఒకవేళ మీరు ఉద్యోగంలో చేరినా,వివాహం చేసుకోబోతు న్నా ఇదే విధంగా ఆలోచించి, ప్రయాణం ప్రారంభించండి. జీవితాశయం: ప్రపంచం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? సచిన్ టెండూల్కర్లాగానా, ఏపీజే అబ్దుల్ కలాంగానా, మరెవరిమాదిరిగానైనా? ఈ ప్రశ్నకు మీరిచ్చే సమాధానాన్ని మీ జీవితాశయంగా చెప్పుకోవచ్చు. ఏ రంగంలోనైనా విజయ శిఖరాలను అందుకున్న వారు రెండు రకాలైన వ్యాఖ్యలు చేస్తుంటారు. మొదటి రకం: ‘‘మొదట్నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేదిశగానే ప్రతి అడుగూ వేస్తూ వచ్చాను. నా మాటలు, నా చేతలు అన్నీ ఆ దిశగానే సాగాయి’’. ఉదా: సచిన్ టెండూల్కర్, ఏఆర్ రహ్మాన్. సహజంగానే వీరి మాటలు విడ్డూరమనిపించవు. రెండో రకం: ‘‘ఎప్పటికప్పుడు చేతికందుతున్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాను. కచ్చితంగా దాన్నే సాధించాలని ఎప్పుడూ కలలు కనలేదు’’. ఉదా: ఏపీజే అబ్దుల్ కలాం (రాష్ట్రపతి కావాలనే లక్ష్యంతో జీవితాన్ని ప్రారంభించలేదు). ప్రస్తుత టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీ. (ఒక సాధారణ ఉద్యోగిగా ప్రయాణం ప్రారంభించారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్ అవుతానని ఎప్పుడూ కలలు కనలేదు). అయితే రెండో రకం వ్యక్తులకు లక్ష్య నిర్దేశం, జీవితాశయాలు లేవని కాదు.. వీరిలా కష్టపడి పనిచేస్తే అవకాశాలు వాటంతటవే తలుపుతడతాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే మరిన్ని విజయాలు చేతికి అందుతాయి. ఇప్పుడు మనం లక్ష్య నిర్దేశాని (గోల్ సెట్టింగ్)కి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాన్ని స్పృశించబోతున్నాం.. మనం పైన చెప్పుకున్న మొదటి రకం వ్యక్తులకైనా, రెండో రకం వ్యక్తులకైనా అత్యంత కీలకమైన అంశం.. ‘ఖీజ్ఛి ౌ్కఠ్ఛీట ౌజ ూౌఠీ’. అంటే వర్తమానంలో సంపూర్ణంగా జీవించటం. ‘ఈ క్షణంలో ఏం చేయాలి?’ అనే విషయంలో స్పష్టత ఉండటం. దీనివల్ల నిరంతరం తక్షణ లక్ష్యాలను సాధిస్తూ ముందుకెళ్తుంటారు. వీరికి విజయం ఒక ప్రయాణమే తప్ప.. గమ్యం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోతారు. మనం ఏర్పరచుకునే లక్ష్యాలు అస్పష్టంగా కాక, స్పష్టంగా కొలవగలిగేలా ఉండాలి. ఉదా: నేను బాగా చదువుకోవాలి అని కాకుండా.. నేను కనీసం పది పేజీలు చదవాలి. నేను కనీసం ఈ రోజు 5 గంటలు చదవాలి. నేను కనీసం మూడు మాక్ టెస్ట్‌లు రాయాలి. ఇలా ప్రతి లక్ష్యాన్నీ కొలవగలిగిన ప్రమాణాలతో (న్యూమరికల్ వాల్యూస్) ఏర్పరచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన లక్ష్యం ఎప్పుడూ స్మార్ట్ (MART)గానే ఉండాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది. S Specific (కచ్చితమైన) M Measurable (కొలవదగిన) AAchievable (అందుకోదగ్గదై) R Realistic (వాస్తవమైన) T Time bound (కాలపరిమితి కలిగిన) ఇదే స్మార్ట్ గోల్! కీడెంచి మేలెంచే ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్/బ్యాక్అప్ ప్లాన్): ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మనం అనుకున్నట్లే అన్నీ జరగకపోవచ్చు. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఎవరూ ఊహించని విధంగా దివాలా దిశలో ఉన్నట్లు ప్రకటించి, చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో మీ హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌ను సానబెట్టుకుంటూ, ఒక స్పష్టమైన జీవితాశయంతో ముందుకెళ్లడం ఎంత అవసరమో, ఒక బ్యాక్అప్ ప్లాన్‌ను సిద్ధంగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. అంటే నా జీవితాశయం ఫలానా కంపెనీలో చేరడం అని పట్టుదలకు పోకుండా, రెండు, మూడు కంపెనీలను కూడా దృష్టిలో ఉంచుకొని, వాటి నియామక విధానాలకు అనుగుణంగా సిద్ధమవటం మంచిది. Vivekanand Rayapeddi Director, Royal Spoken English -
ఆట అన్నీ నేర్పిస్తుంది వీవీఎస్ లక్ష్మణ్
ఆటలాడే ప్రతి పిల్లాడూ ప్రొఫెషనల్ కావాలనేం లేదు. వాస్తవానికి అత్యున్నత స్థాయికి ఎదిగేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ ఒక పిల్లాడు జీవితంలో ఎదిగే క్రమంలో క్రీడలు అన్నీ నేర్పిస్తాయి. ధైర్యంగా వ్యవహరించడం, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌గా కలిసి పని చేయడం, ఇంకా చెప్పాలంటే గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించడం తెలుస్తుంది. ఈ అలవాట్లు ఒక పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడతాయనేది నా నమ్మకం. వీటన్నింటికీ స్పోర్ట్స్‌ను ప్లాట్‌ఫామ్‌గా చెప్పవచ్చు. చిన్నారులు తాను ఏదైనా ఆట ఆడతానని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అతని కోరికను మొగ్గలోనే తుంచేయవద్దు. ముఖ్యంగా రెండు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అబ్బాయితో, అతని స్కూల్లో, కోచ్‌తో మాట్లాడి అసలు ఒక ఆటగాడిగా మారేందుకు ఇతనిలో ఏ మాత్రం లక్షణాలు ఉన్నాయో గుర్తించి నిర్ణయం తీసుకోవాలి. అన్నింటికీ మించి అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అతను ఆశించిన క్రీడను ఒక స్థాయి వరకు ఆడనిచ్చి ఒక వేళ వైఫల్యం ఎదురైతే... అప్పుడు తాను అనుకున్న విధంగా మరో రంగంలో మళ్లించే విధంగా ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఒకప్పటిలా పుస్తకాల పురుగులే జీవితంలో విజయం సాధిస్తారనే రోజులు పోయాయి. అండగా నిలిస్తే ఆటల్లోనూ అద్భుతాలు సాధించవచ్చు. ఒక క్రీడాకారుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం ఎంతో గర్వకారణం. ఆ స్థాయికి చేరాలంటే ఎంతో ప్రోత్సాహం అవసరం. చాలా మంది క్రికెట్లో ఉన్న డబ్బు, పేరును చూసి ఇదే ఆడతామని చెబుతారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు బ్యాడ్మింటన్, టెన్నిస్, షూటింగ్, ఆర్చరీ... ఇలా అన్ని ఆటల్లో అవకాశాలు ఉన్నాయి. మంచి విజయాలు సాధిస్తే వాటిలోనూ పేరుప్రఖ్యాతులు దక్కుతాయి. ఈ ఆటగాళ్లకు కూడా మంచి ఫాలోయింగ్ లభించడం నేను చూస్తున్నాను. కాబట్టి ఆట ఏదైనా పిల్లలను ప్రోత్సహించడం ముఖ్యం.