నిర్దేశించేవి.. నైపుణ్యాలే | Bank Recruitment Interview | Sakshi
Sakshi News home page

నిర్దేశించేవి.. నైపుణ్యాలే

Published Thu, Jan 8 2015 4:12 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నిర్దేశించేవి.. నైపుణ్యాలే - Sakshi

నిర్దేశించేవి.. నైపుణ్యాలే

బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సక్సెస్ సాధించటం కష్టమా? ఇటువంటి సందేహాలు సాధారణంగా ఆశావహుల్లో మెదులుతుంటాయి. ఇతర రంగాల్లోని ఇంటర్వ్యూ ప్రక్రియనే ఇక్కడ అనుసరిస్తారు. కాకపోతే అడిగిన ప్రశ్నలకు సూటిగా, సరళంగా, స్పష్టంగా ఏ విధంగా సమాధానం ఇస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు.  అంతేకాకుండా అభ్యర్థిలోని నిర్వహణ సామర్థ్యాన్ని కూడా అంచనా వేస్తారు. మరో విధంగా చెప్పాలంటే వ్యక్తిగత నైపుణ్యాలు అంటే.. కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, ఆహార్యం, ఆత్మవిశ్వాసం వంటివే విజయాన్ని నిర్దేశిస్తాయని చెప్పొచ్చు.
 
 రెజ్యూమె ఆధారంగా
 సాధారణంగా ఇంటర్వ్యూ బోర్డులో నలుగురు/ఐదుగురు సభ్యులు ఉంటారు. 15-25 నిమిషాలపాటు ఈ దశ ఉంటుంది. అభ్యర్థి ఇచ్చిన రెజ్యూమె ఆధారంగా ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతారు. అంటే వ్యక్తిగత నేపథ్యం, చదువు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, భవిష్యత్ లక్ష్యాలు, ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలతోపాటు సమకాలీన అంశాలు, బ్యాంకింగ్, ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురవుతాయి. ఇంటర్వ్యూ పూర్తిగా ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. సమాధానాన్ని ఎంత స్పష్టంగా, సూటిగా, ఆత్మవిశ్వాసంతో ఇస్తున్నారనే అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వ్యాకరణ దోషాలను పట్టించుకోకుండా సమాధానాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
 
 ముందుగా
 ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లేముందు ఒకసారి తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడిగి వారి అనుమతితో లోపలికి వెళ్లాలి. లోపలికి వెళ్లిన తర్వాత బోర్డు సభ్యులకు నమస్కారం చేసి, వారు కూర్చోమనేవరకు ఎదురుచూసి, తర్వాత నిర్దేశించిన స్థానంలో కూర్చోవాలి. అలా కూర్చునేటప్పుడు మరీ బిగదీసుకుని కాకుండా ప్రశాంతంగా కనిపిస్తూ కూర్చోవాలి.
 
 ఆహార్యమే కీలకం
 ఇంటర్వ్యూలో విజయం సాధించడమనేది 55 శాతం ఆహార్యం (అఞఞ్ఛ్చట్చఛ్ఛి), 38 శాతం స్వర స్థాయి (్కజ్టీఛిజి ౌజ ఞ్ఛ్ఛఛిజి), 7 శాతం ఉపయోగించే పదాల మీద (ఈ్ఛఞ్ఛఛీట  ౌ ్టజ్ఛి  గిౌటఛీట  ్టజ్చ్టి డౌఠ ఠీజీ ఛ్ఛ ఠటజీజ ) ఆధారపడి ఉంటుంది. కాబట్టి చక్కని పదాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. అభ్యర్థి తనను తాను ప్రెజెంట్ చేసుకునే క్రమంలో దుస్తుల దగ్గర్నుండి పాదరక్షల వరకు పలు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాషనబుల్ కాకుండా హుందాగా ఉండేలా ఫార్మల్ దుస్తులను ధరించాలి. టై తప్పనిసరి.  పురుష అభ్యర్థులైతే విధిగా ఇన్‌షర్ట్ చేయడంతోపాటు ఫార్మల్ షూస్ వేసుకోవాలి. మహిళా అభ్యర్థులైతే సల్వార్ కమీజ్ లేదా చీరను ధరించాలి. సమాధానం ఇచ్చేటప్పుడు పదేపదే వాచ్ వైపు చూసుకోవడం, టేబుల్‌పై చేతులు పెట్టడం, శరీరాన్ని కదిలించడం, బిగ్గరగా నవ్వడం వంటి చేయకూడదు. అంతేకాకుండా మరో కీలక విషయం..వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పడం మంచిది కాదు.
 
 ఆత్మవిశ్వాసంతో
  సమాధానం ఇచ్చేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. తెలిసిన విషయాన్ని సూటిగా, సరళంగా, స్పష్టంగా వివరించాలి. ముఖం నుంచి చిరునవ్వు తొలగి పోకుండా చూసుకోవాలి. ప్రశ్న అడిగిన వ్యక్తిని చూస్తూ సమాధానం ఇవ్వాలి. ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుడదు. ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లిదండ్రులు, గురువులు, సమాజం నుంచి మనం ఏయే విషయాలు నేర్చుకున్నామో.. వాటిని పరీక్షించే ఒక వేదిక వంటిది ఇంటర్వ్యూ ప్రక్రియ. సమాధానం ఇచ్చేటప్పుడు సమన్వయంతో ఉండాలి. ఏదైనా అంశం విషయంలో బోర్డు సభ్యులు కంటే ఎక్కువ తెలుసు అనే ధోరణిని ప్రదర్శించకూడదు. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే.. తెలియదు, రాదు, గుర్తులేదు తరహాలో కాకుండా.. నేర్చుకుంటాను/తెలుసుకుంటాను వంటి వినయపూర్వకమైన పదాలు ఉపయోగించాలి.  
 
 సహనానికి పరీక్ష
 కొన్ని సార్లు బోర్డు సభ్యులు మీ సహనాన్ని కూడా పరీక్షించే విధంగా ప్రశ్నిస్తుంటారు. ఇటువంటి సమయంలో చికాకు ప్రదర్శించకుండా ఓర్పుతో వ్యవహరించాలి. ఎందుకంటే పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగ నిర్వహణ బాధ్యతల్లో భాగంగా ఖతాదారులు/వినియోగదారులతో ఏవిధంగా వ్యవహరిస్తారనే అంశాన్ని పరిశీలించడానికి కూడా ఇలా పరీక్షిస్తారు. కాబట్టి అనవసరంగా వాదానికి దిగకుండా సమాధానం ఇవ్వడంపైనే దృష్టిని కేంద్రీకరించడం ప్రయోజనకరం. ఇంటర్వ్యూలో కీలకమైన అంశం వినడం. ఎదుటి వారు చెప్పుతున్న దాన్ని ఎంత స్పష్టంగా వింటే..అంతే స్పష్టంగా సమాధానం ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక వేళ అడిగిన ప్రశ్న అర్థం కాకపోతే.. తిరిగి అడగడానికి సందేహించవద్దు. కాకపోతే ఈ ప్రక్రియ వినయంగా ఉండాలి.
 
 పరిమితం కాదు
 ఇంటర్వ్యూ అనేది కేవలం ప్రశ్నలు-సమాధానాలకే పరిమితమైన ప్రక్రియ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సదరు ఉద్యోగానికి కావల్సిన నైపుణ్యం, సామర్థ్యం వంటి అంశాలను రాత పరీక్ష ద్వారా పరీక్షించి ఉంటారు. పరీక్షతో అంచనా వేయలేని వ్యక్తిగత నైపుణ్యాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని తెలుసుకోవడానికి దీన్ని వేదికగా వినియోగించుకుంటారనే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి..
 
 కరెంట్ అఫైర్స్‌లో తడబాటు
 ఇంటర్వ్యూల్లో అధిక శాతం  మంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ విషయంలోనే వెనుకబడతున్నారు. కాబట్టి ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇందుకోసం ప్రతి రోజూ దినపత్రికలు, వార పత్రికలు, న్యూస్ వెబ్‌సైట్లు, టీవీ చానెళ్ల వార్తలను అనుసరిస్తూ ఉండాలి. ఇంటర్వ్యూ రోజు..ఆ రోజు దిన పత్రికలలో వచ్చిన వార్తల నుంచి కచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సంబంధిత రంగంపై అవగాహనను కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ టెర్మినాలజీ, బ్యాంకింగ్ రేట్లు.. రెపో రేట్లు, ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్ తదితరాలు, బ్యాంకింగ్ ఆపరేషన్స్, ప్రస్తుతం ఈ రంగంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలు, ఉన్నతాధికారులు వివరాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. మరో విషయం బ్యాంకులు ఎలా పని చేస్తాయి? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిలో ఎటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు? అనే అంశంపై కనీస అవగాహన ఉండాలి.
 
 మాక్ ఇంటర్వ్యూలు
  మరో కీలాకంశం.. మాక్ ఇంటర్వ్యూలు. వీటికి హాజరవ్వడం ద్వారా అత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. వాటిని సరి చేసుకోవడం ద్వారా మరింత ప్రభావవంతంగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వీలుకాని పక్షంలో ఇంట్లో అద్దం ముందు కూర్చోని సమాధానాలను ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. కుటుంబ సభ్యులు/స్నేహితుల సహకారంతో మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించుకోవడం మంచిది. అంతేకాకుండా గత విజేతల సూచనలను పాటించడం ఎంతో మేలు చేస్తుంది.
 
 చివర్లో
 ఇంటర్వ్యూ చివర్లో సాధారణంగా అభ్యర్థిని మీరు ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? అని బోర్డు సభ్యులు ప్రశ్నిస్తుంటారు. అటువంటి సందర్భంలో కేవలం అడగాలనే ఉద్దేశంతో కాకుండా.. జెన్యూన్ ప్రశ్న అయితేనే అడగటం మంచిది. అడిగే ప్రశ్న కూడా సంబంధిత రంగానికి చెందినదై ఉండాలి. ఇంటర్వ్యూ ముగిశాక బయటకు వచ్చే ముందు మరొక సారి బోర్డుకి కృతజ్ఞతలు చెప్పి బయటకు రావాలి.
 
 బ్యాంకింగ్‌కు సంబంధించి
 గుర్తుంచుకోవాల్సిన అంశాలు
 ఆర్‌బీఐ-పని చేసే విధానం, మానిటరీ పాలసీ, సెబీ (డీమ్యాట్, సీడీఎస్‌ఎల్, ఎఫ్‌పీఓ, ఆన్‌లైన్ ట్రేడింగ్, సెన్సెక్స్, నిఫ్టి తదితరాలు), ఐఆర్‌డీఏ, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు (ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్, పెరుగుతున్న పోటీ, కేవైసీ, ఏఎంఎల్ తదితరాలు), జన్-ధన్ యోజన, ఫోరెక్స్, లాకర్స్, చెక్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, రుణాలు తదితరాలు.
 
 సాధారణంగా
 ఎదురయ్యే ప్రశ్నలు కొన్ని
     Tell me something about yourself.
     Tell me about one moment you are proud of in your life.
     Tell me about your extra-curricular achievements.
     What do you know about our company?
     What were the five most significant accomplishments in                your last assignment or career?
     Why do you think you are suited to this job?
     Why should I hire you?
     What do you know about our organization?
     What skills and qualifications are essential for success in the required position?
     How does this assignment fit in to your overall career plan?
     Are you flexible? Are you mobile?
     Are you a hard worker?
     Are you persistent and persevering?
     What can you do for us that someone else cannot?
     What do you look for in a job?
     How do you differentiate yourself from others?
     Narrate an incident where you have shown positive attitude.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement