లక్ష్యాలు, విజయాలకు వారధి.. క్రమశిక్షణ
మనం ఏర్పరచుకునే లక్ష్యాలు అస్పష్టంగా కాక, స్పష్టంగా కొలవగలిగేలా
(న్యూమరికల్ వాల్యూస్) ఉండాలి.
క్షణక్షణం విజయాన్ని శ్వాసించండి..
విజయం అనేది ఒక గమ్యం కాదు..
విజయం ఒక నిరంతర ప్రయాణం.
జీవితంలో మీరేం కావాలనుకుంటున్నారు? ఇదే ప్రశ్నను మరోలా అడుగుతాను.. దానివల్ల లక్ష్య నిర్దేశానికి (గోల్ సెట్టింగ్) అవసరమైన సంపూర్ణమైన, స్పష్టమైన దృశ్యం మీ కళ్లముందు కనిపిస్తుంది!
ఆ ప్రశ్న ఏంటంటే.. ‘మిమ్మల్ని అందరూ ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?’
The 7 Habits of Highly Effective people (అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఏడు అలవాట్లు).. పుస్తక రచయిత స్టీఫెన్ ఆర్.కవీ ఏమంటారంటే.. ‘థింక్ ది ఎండ్ ఇన్‌ది బిగినింగ్ (అంతం మీద ధ్యాసతో ఆరంభం)’ . దీన్ని మీ కెరీర్‌కు అన్వయించుదాం..!
ఈ రోజు మీరు ఇంజనీరింగ్ కోర్సులో చేరారు.. మీరిప్పుడు ఇలా ఆలోచించాలి.. ‘ఈ కోర్సు పూర్తయి, నేను క్యాంపస్‌ను వదిలి వెళ్లిన తర్వాత నన్ను అందరూ ఎలా గుర్తుంచుకోవాలి?’. ఇదే ‘థింక్ ది ఎండ్ ఇన్‌ది బిగినింగ్’. ఒకవేళ మీరు ఉద్యోగంలో చేరినా,వివాహం చేసుకోబోతు న్నా ఇదే విధంగా ఆలోచించి, ప్రయాణం ప్రారంభించండి.
జీవితాశయం:
ప్రపంచం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? సచిన్ టెండూల్కర్‌లాగానా, ఏపీజే అబ్దుల్ కలాంగానా, మరెవరిమాదిరిగానైనా?
ఈ ప్రశ్నకు మీరిచ్చే సమాధానాన్ని మీ జీవితాశయంగా చెప్పుకోవచ్చు.
ఏ రంగంలోనైనా విజయ శిఖరాలను అందుకున్న వారు రెండు రకాలైన వ్యాఖ్యలు చేస్తుంటారు.
మొదటి రకం:
‘‘మొదట్నుంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాన్ని సాధించేదిశగానే ప్రతి అడుగూ వేస్తూ వచ్చాను. నా మాటలు, నా చేతలు అన్నీ ఆ దిశగానే సాగాయి’’.
ఉదా: సచిన్ టెండూల్కర్, ఏఆర్ రహ్మాన్.
సహజంగానే వీరి మాటలు విడ్డూరమనిపించవు.
రెండో రకం:
‘‘ఎప్పటికప్పుడు చేతికందుతున్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాను. కచ్చితంగా దాన్నే సాధించాలని ఎప్పుడూ కలలు కనలేదు’’.
ఉదా:
ఏపీజే అబ్దుల్ కలాం (రాష్ట్రపతి కావాలనే లక్ష్యంతో జీవితాన్ని ప్రారంభించలేదు).
ప్రస్తుత టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీ. (ఒక సాధారణ ఉద్యోగిగా ప్రయాణం ప్రారంభించారు. టాటా గ్రూప్‌నకు చైర్మన్ అవుతానని ఎప్పుడూ కలలు కనలేదు).
అయితే రెండో రకం వ్యక్తులకు లక్ష్య నిర్దేశం, జీవితాశయాలు లేవని కాదు.. వీరిలా కష్టపడి పనిచేస్తే అవకాశాలు వాటంతటవే తలుపుతడతాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తే మరిన్ని విజయాలు చేతికి అందుతాయి.
ఇప్పుడు మనం లక్ష్య నిర్దేశాని (గోల్ సెట్టింగ్)కి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాన్ని స్పృశించబోతున్నాం.. మనం పైన చెప్పుకున్న మొదటి రకం వ్యక్తులకైనా, రెండో రకం వ్యక్తులకైనా అత్యంత కీలకమైన అంశం.. ‘ఖీజ్ఛి ౌ్కఠ్ఛీట ౌజ ూౌఠీ’. అంటే వర్తమానంలో సంపూర్ణంగా జీవించటం. ‘ఈ క్షణంలో ఏం చేయాలి?’ అనే విషయంలో స్పష్టత ఉండటం. దీనివల్ల నిరంతరం తక్షణ లక్ష్యాలను సాధిస్తూ ముందుకెళ్తుంటారు. వీరికి విజయం ఒక ప్రయాణమే తప్ప.. గమ్యం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోతారు.
మనం ఏర్పరచుకునే లక్ష్యాలు అస్పష్టంగా కాక, స్పష్టంగా కొలవగలిగేలా ఉండాలి.
ఉదా:
నేను బాగా చదువుకోవాలి అని కాకుండా..
నేను కనీసం పది పేజీలు చదవాలి.
నేను కనీసం ఈ రోజు 5 గంటలు చదవాలి.
నేను కనీసం మూడు మాక్ టెస్ట్‌లు రాయాలి.
ఇలా ప్రతి లక్ష్యాన్నీ కొలవగలిగిన ప్రమాణాలతో (న్యూమరికల్ వాల్యూస్) ఏర్పరచుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన లక్ష్యం ఎప్పుడూ స్మార్ట్ (MART)గానే ఉండాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది.
S Specific (కచ్చితమైన)
M Measurable (కొలవదగిన)
AAchievable (అందుకోదగ్గదై)
R Realistic (వాస్తవమైన)
T Time bound (కాలపరిమితి కలిగిన)
ఇదే స్మార్ట్ గోల్!
కీడెంచి మేలెంచే ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్/బ్యాక్‌అప్ ప్లాన్):
ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మనం అనుకున్నట్లే అన్నీ జరగకపోవచ్చు. పెద్దపెద్ద కంపెనీలు సైతం ఎవరూ ఊహించని విధంగా దివాలా దిశలో ఉన్నట్లు ప్రకటించి, చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో మీ హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్‌ను సానబెట్టుకుంటూ, ఒక స్పష్టమైన జీవితాశయంతో ముందుకెళ్లడం ఎంత అవసరమో, ఒక బ్యాక్‌అప్ ప్లాన్‌ను సిద్ధంగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. అంటే నా జీవితాశయం ఫలానా కంపెనీలో చేరడం అని పట్టుదలకు పోకుండా, రెండు, మూడు కంపెనీలను కూడా దృష్టిలో ఉంచుకొని, వాటి నియామక విధానాలకు అనుగుణంగా సిద్ధమవటం మంచిది.
Vivekanand Rayapeddi
Director,
Royal Spoken English