సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
న్యాయశాస్త్రం పీహెచ్‌డీ ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్‌డీ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్‌డీ కోర్సుల పార్టువన్ (కోర్సు వర్క్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.
ఓయూ ఎల్‌ఎల్‌బీ రీవాల్యుయేషన్ ఫలితాలు
ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ ఆనర్స్, బీకాం ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్‌సైట్లో చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment