ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ! | Training on skills for engineering students! | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ!

Published Thu, Jun 1 2017 4:12 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

Training on skills for engineering students!

స్పోకెన్‌ ఇంగ్లిష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై తరగతులు
 
సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అఖిల భారత సాంకే తిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పారిశ్రామికావసరాలకు అనుగుణంగా శిక్షణ, అధ్యాపకులకు  సాంకే తిక పరిజ్ఞానంపై శిక్షణ తరగతులను నిర్వ హించేందుకు చర్యలు ప్రారంభిం చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పలు సంస్కర ణలను అమలు చేయాలని నిర్ణయించిన ఏఐసీటీఈ.. కొత్తగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు తరగతుల కంటే ముందుగా స్పోకెన్‌ ఇంగ్లిషు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్, ఇంజనీరింగ్‌ మౌలిక అం శాలపై నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్‌ ఐఐటీ, బెనారస్‌ హిందూ  వర్సిటీ– ఐఐటీలో విజయవంతమైన ఈ శిక్షణ కార్య క్రమాన్ని ఇతర ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీ టీఈ చైర్మన్‌ అనీల్‌ డి. సహస్రబుద్ధే ఇటీవల వెల్లడించారు. మొదట 500 కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ కాలేజీలో తప్పనిసరి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
 
పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి
ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుంటున్న విద్యా ర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్, వృత్తి నైపు ణ్యాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగు ణంగా సిద్ధంగా లేకపోవడంతో ఉపాధి లభించక నిరుద్యోగులుగా మిగిలిపోతు న్నారు. ఈ నేపథ్యంలో వారికి 8 వారాల పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇంజనీరింగ్‌   మూడు, నాలుగో సంవత్సరాల్లో శిక్షణను అమలు చేయనుంది. అలాగే సబ్జెక్టు వారీగా ఇండస్ట్రీ కన్సల్టేషన్‌ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని వర్సిటీలకు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని వర్సిటీలు ఫస్టియర్‌లో డిటెన్షన్‌ అమలు చేసేలా కసరత్తు చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement