ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష ఆంగ్లమే
135 దేశాల్లో దీనికే మొదటి స్థానం.. రెండు, మూడో స్థానాల్లో స్పానిష్, ఫ్రెంచ్
పదో స్థానంలో హిందీ ఇంగ్లిష్‌తోనే మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు
డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024 వెల్లడి
‘ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతర్జాతీయంగా ఎక్కువ మందితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఇంగ్లిష్‌కే మా ప్రాధాన్యం’ అంటోంది వర్తమాన ప్రపంచం. ఏకంగా 135 దేశాల్లోని వారంతా ఇంగ్లిష్ భాషకే అగ్రస్థానం ఇస్తున్నారని ‘డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024’ వెల్లడించింది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో ఇంగ్లిష్ మొదటి స్థానంలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్‌గా గుర్తింపు పొందిన డ్యూలింగో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల అభ్యాసనంపై తాజా నివేదిక విడుదల చేసింది. రెండో స్థానంలో స్పానిష్ , మూడో స్థానంలో ఫ్రెంచ్ ఉన్నాయని తెలిపింది. డ్యూలింగో లాంగ్వేజ్
నివేదిక–2024లోని ప్రధానాంశాలివీ.. – సాక్షి, అమరావతి
ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష
⇒ ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లిష్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 2023 కంటే 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌కు మొదటి స్థానం ఇచి్చన దేశాలు 10 శాతం పెరిగాయి. 2024లో 135 దేశాలు ఇంగ్లిష్‌కు మొదటి ప్రాధాన్యమిచ్చాయి.
⇒ మలేíÙయా, అల్బేనియా, మోనాకో, ఇరాన్, మంగోలియా, ఎరిత్రియా, రువాండా దేశాల్లో గత ఏడాది
రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. శ్రీలంక, మయన్మార్, క్రొయేషియా, ఇథియోపియా, కిరిబతి, మలావి దేశాల్లో గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజలు తమ మాతృభాషతోపాటు ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటున్నారు.
⇒ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ఇంగ్లిష్ సరి్టఫికేషన్ కోర్సు చేస్తున్న వారి సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చైనా, కెనడా, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి.
⇒ అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో హిందీ పదో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment