చంద్రబాబు గజదొంగ.. రేవంత్ దొరికిన దొంగ | mla solipeta ramalinga reddy fired on chandra babu and revanth reddy | Sakshi

చంద్రబాబు గజదొంగ.. రేవంత్ దొరికిన దొంగ

Published Wed, Jun 1 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

చంద్రబాబు గజదొంగ.. రేవంత్ దొరికిన దొంగ

చంద్రబాబు గజదొంగ.. రేవంత్ దొరికిన దొంగ

ఎమ్మెల్యే సోలిపేట ఫైర్

సిద్దిపేట: అమరావతి నగరంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్న చంద్రబాబు నాయుడు అసలైన బందిపోటు.. ఆయన దగ్గరి బంట్రోతు, నోటుకు ఓటు కేసులో దొరికిన రేవంత్‌రెడ్డి పెద్ద దొంగ అని శాసనసభ అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు  అమరావతిలో రైతుల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని, భూముల ఇవ్వని రైతుల పండ్ల తోటలు నరికించి, పంట పొలాల నుంచి రైతులను  పశువుల కంటే హీనంగా లాగేస్తున్నారని రేవంత్‌రెడ్డికి చీము నెత్తురు, సిగ్గుశరం ఉంటే వెంటనే అమరావతికి వెళ్లి అక్కడి రైతులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ కోసం కోసం రైతులను గాయపరిచి భూములు లాక్కున్న రక్తచరిత్ర తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. ఏళ్లకేళ్లుగా గొంతెండిపోతున్న పాలమూరు ప్రజల దూపను తీర్చే పాలమూరు ప్రాజెక్టుపై చంద్రబాబు సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే ఈ దద్దమ్మకు దానికి వత్తాసు పలుకుతున్నాడన్నారు. పాలమూరు బిడ్డగా పుట్టి కన్నతల్లి రొమ్ముగుద్దాలని చూస్తున్న ఈ ద్రోహిని తెలంగాణ జనం రాళ్లతో కొడతారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement