దర్శకుడిగా మళ్ళీ చిన్నా | Press Meet Director Chinna | Sakshi
Sakshi News home page

దర్శకుడిగా మళ్ళీ చిన్నా

Published Sun, Dec 13 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

దర్శకుడిగా మళ్ళీ చిన్నా

దర్శకుడిగా మళ్ళీ చిన్నా

‘‘ఆరేళ్ల క్రితం ‘ఆ ఇంట్లో’ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యా. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని పాత్రలు చేస్తూ వచ్చా. మంచి కథ కుదిరితేనే మళ్లీ డెరైక్షన్ చేయాలనుకున్నా. వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న రవికుమార్ ‘ఆ ఇంట్లో’ సినిమా చూసి, నాతో సినిమా చేయాలనుకున్నారు.
 
 మూడు నెలల క్రితం ఆయన కలిశారు. ఆ తర్వాత ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం’’ అని నటుడు, దర్శకుడు చిన్నా చెప్పారు. విహారిక సమర్పణలో వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా చిన్నా దర్శకత్వంలో ఆదరి రవికుమార్ ఓ చిత్రం నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో అతిథిగా పాల్గొన్న హీరో శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ బ్రోచర్‌నూ, నటుడు శివారెడ్డి సినిమా పోస్టర్‌నూ ఆవిష్కరించారు.
 
  ‘‘ఇది హారర్ మూవీ కాదు. ఫక్తు కామెడీ సినిమా’’ అని చిన్నా తెలిపారు. ‘‘మంచి కథతో ఈ చిత్రం చేస్తున్నాం’’ అని నిర్మాత అన్నారు. ‘మధురా నగరిలో’తో చిన్నా, తానూ కెరీర్ ఆరంభించామనీ, చిన్నాకి మంచి ప్లానింగ్ ఉందని శ్రీకాంత్ చెప్పారు. మంచి పాయింట్‌తో సినిమాతో తీయబోతున్నారని శివారెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బీవీ నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement