న్యూఢిల్లీ: దేశంలో కార్యాలయాల వసతి (ఆఫీసు స్పేస్) వృద్ధి అవకాశాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు టాటా రియల్టీ ప్రకటించింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్, కంపెనీల నియామకాలు డిమాండ్‌ను నిర్ణయిస్తాయని పేర్కొంది.
ఏడు ప్రధాన పట్టణాల్లో ఆఫీసు స్పేస్ లీజింగ్ 2022లో 30 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తరిస్తుందని అంచనా వేసింది. 2021లో లీజు పరిమాణం 26 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. చాలా రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల నియామకాలు తిరిగి మొదలయ్యాయని టాటా రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ తెలిపారు.
‘‘కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో వాణిజ్య కార్యకలాపాలు ఇప్పటికే జోరందుకున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడం కూడా పెరగనుంది. ముందస్తు సంకేతాలను గమనిస్తే 2022లో కార్యాలయల వసతి లీజు గతేడాది సంఖ్యను అధిగమిస్తుందని తెలుస్తోంది’’అని దత్ వివరించారు.
చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే!
Comments
Please login to add a commentAdd a comment